Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?
HDHarish Darla
Feb 23, 2026 12:26:10
Hyderabad, Telangana

Holi Holidays 2026: వసంతకాలం రాకతో వచ్చే రంగుల పండుగ 'హోలీ'కి రంగం సిద్ధమైంది. 2026లో హోలీ పండుగ సందర్భంగా వరుస సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ సమాచారం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. 

జ్యోతిష్య శాస్త్రం, క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి వారంలో పండుగ సంబరాలు జరగనున్నాయి. మార్చి 1 (ఆదివారం) వారాంతపు సాధారణ సెలవు ఉండగా.. మార్చి 2 (సోమవారం) హోలికా దహన్ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు.

అలాగే మార్చి 3 (మంగళవారం) ఇది సాధారణ వర్కింగ్ డే. అయితే, ఈ రోజును కూడా సెలవుగా ప్రకటించాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఒకవేళ స్థానిక ప్రభుత్వాలు దీనిని సెలవుగా ప్రకటిస్తే, విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తాయి. మార్చి 4వ తేదీన హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు..పలు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. 

దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా ఐదు రోజుల వారాన్ని పాటిస్తాయి. కాబట్టి, శనివారం (ఫిబ్రవరి 28) నుంచే వీరికి సెలవులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనం వంటి ప్రాంతాల్లో హోలీ ప్రాముఖ్యత దృష్ట్యా, యూపీ ప్రభుత్వం రెండు నుంచి మూడు రోజుల పాటు అధికారిక సెలవులను ఇచ్చే అవకాశం ఉంది.

గమనించాల్సిన ముఖ్య విషయాలు:
10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల షెడ్యూల్ ఉంటే, వారి సెలవుల జాబితాలో మార్పులు ఉండవచ్చు. ప్రైవేట్ పాఠశాలలు వారి సొంత సెలవుల జాబితాను కలిగి ఉంటాయి. కాబట్టి, తుది నిర్ణయం కోసం పాఠశాల డైరీ లేదా అధికారిక నోటీసులను గమనించాలి. 

స్థానిక పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు మార్చి 3న ప్రత్యేక సెలవు ప్రకటించే అధికారం కలిగి ఉంటారు. హోలీ సెలవులు కుటుంబంతో గడపడానికి మంచి సమయం. అయితే, పండుగ ఉత్సాహంతో పాటు పరీక్షల ప్రిపరేషన్‌ను కూడా బ్యాలెన్స్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also REad: Adilabad Open School: ఎగ్జామ్ హాల్‌లో విద్యార్థుల చేతుల్లో సెల్‌ఫోన్లు..ఆదిలాబాద్‌లో ఎగ్జామ్స్‌లో అసలు విషయం ఇదే!

Also REad: India Vs South Africa Match: టీమ్ఇండియాని దెబ్బేసిన జాన్సెన్, కేశవ్ మహారాజ్..సూపర్-8లో బోల్తా కొట్టిన సూర్యసేన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 23, 2026 13:44:29
Hyderabad, Telangana:

Zero Investment Business Ideas: నేటి డిజిటల్ యుగంలో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి లక్షల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉన్న నైపుణ్యం, స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ఉంటే చాలు.. ఇంటి నుంచే నెలకు వేలల్లో ఆదాయం సంపాదించవచ్చు. సున్నా పెట్టుబడితో యువత ప్రారంభించగలిగే టాప్-5 బిజినెస్ ఐడియాలు ఇలా ఉన్నాయి.

ఫ్రీలాన్సింగ్
మీకు రాయడం, డిజైనింగ్ లేదా ఎడిటింగ్ వంటి నైపుణ్యాలు ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీలో ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి. అప్‌వర్క్, ఫైవర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మీ సేవలను అందించవచ్చు.

సోషల్ మీడియా మేనేజ్‌మెంట్
ప్రస్తుతం ప్రతి చిన్న వ్యాపారానికి సోషల్ మీడియా ఉనికి చాలా ముఖ్యం. కంపెనీల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలను నిర్వహించడం, పోస్టులు క్రియేట్ చేయడం, కస్టమర్ల ప్రశ్నలకు స్పందించడం వంటి పనులను చేయాలి. క్లయింట్‌ను బట్టి నెలవారీ ఫిక్స్‌డ్ అమౌంట్ సంపాదించవచ్చు.

ఆన్‌లైన్ ట్యూషన్స్
మీకు ఏదైనా సబ్జెక్టుపై పట్టు ఉంటే, ఇంట్లో కూర్చునే విద్యార్థులకు బోధించవచ్చు. స్కూల్ పాఠాలతో పాటు మ్యూజిక్, యోగా, కోడింగ్ లేదా విదేశీ భాషలు నేర్పించవచ్చు. జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ద్వారా గ్లోబల్ లెవల్‌లో క్లాసులు చెప్పే అవకాశం ఉంది.

అఫిలియేట్ మార్కెటింగ్
ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలోని ఉత్పత్తులను ఇతరులకు రిఫర్ చేయడం ద్వారా కమిషన్ పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల అఫిలియేట్ లింక్‌లను మీ సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయాలి. మీ లింక్ ద్వారా ఎవరైనా వస్తువు కొంటే మీకు కమిషన్ వస్తుంది.

యూట్యూబ్ / కంటెంట్ క్రియేషన్
మీరు ఏదైనా ఒక అంశంపై ఆసక్తికరమైన వీడియోలు చేయగలిగితే యూట్యూబ్ మంచి ఆదాయ వనరు. కుకింగ్, ట్రావెల్, టెక్నాలజీ రివ్యూలు లేదా ఎడ్యుకేషనల్ వీడియోలు మీ ఫోన్‌తోనే షూట్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. యాడ్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆదాయం వస్తుంది.

ముఖ్య సూచన: ఈ వ్యాపారాల్లో రాణించడానికి డబ్బు కంటే 'సమయం', 'ఓపిక' చాలా ముఖ్యం. ప్రారంభంలో ఆదాయం తక్కువగా ఉన్నా, క్రమంగా మీ నైపుణ్యం పెరిగే కొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది.

Also Read: Holi Lunar Eclipse: హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా మార్చి 4 ఎప్పుడు? గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది!

Also REad: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 12:57:45
Hyderabad, Telangana:

Holi Lunar Eclipse 2026: 2026లో హోలీ పండుగ తేదీల విషయంలో భక్తులలో కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది? అనే వివరాలను జ్యోతిష్య నిపుణులు, పంచాంగం ప్రకారం ఇప్పుడు వివరాలను తెలుసుకుందాం.

సాధారణంగా ఫాల్గుణ పూర్ణిమ రోజున హోలికా దహన్ నిర్వహిస్తారు. ద్రిక్ పంచాంగ్ ప్రకారం.. హోలికా దహన్ 2026, మార్చి 3 (మంగళవారం)న జరుపుకోవాలి. సాయంత్రం 06:22 గంటల నుండి రాత్రి 08:50 గంటల వరకు ఈ ముహూర్తం ఉంది. 

ముఖ్యమైన తిథి సమయాలు..
పూర్ణిమ తిథి ప్రారంభం: మార్చి 2, సాయంత్రం 05:55 గంటలకు.
పూర్ణిమ తిథి ముగింపు: మార్చి 3, సాయంత్రం 05:07 గంటలకు.

చంద్రగ్రహణ ప్రభావం?
మార్చి 3న చంద్రగ్రహణం సంభవిస్తుండటంతో సూతక కాలం, పూజల విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రహణం కారణంగా మార్చి 3న శుభకార్యాలు నిషిద్ధమని భావించే వారు, హోలికా దహన పూజను మార్చి 2 సాయంత్రం నిర్వహించాలని కొన్ని మీడియా నివేదికలు, పండితులు సూచిస్తున్నారు. అయితే స్థానిక పంచాంగాలు, మీ ప్రాంతంలోని పండితుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

హోలికా దహన్ విశిష్టత (పురాణ గాథ)
హోలికా దహన్ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. తండ్రి హెచ్చరించినా ప్రహ్లాదుడు తన భక్తిని వీడడు. ప్రహ్లాదుడిని అంతం చేయడానికి హిరణ్యకశిపుడు తన సోదరి హోలిక సహాయం కోరతాడు. అగ్ని తనను ఏమీ చేయలేదనే వరం (శాలువా) ఉన్న హోలిక, ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చితిపై కూర్చుంటుంది. విష్ణుమూర్తి కృపతో భక్త ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు, దుష్టబుద్ధి కలిగిన హోలిక అగ్నికి ఆహుతవుతుంది.

Also REad: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?

Also Read: Adilabad Open School: ఎగ్జామ్ హాల్‌లో విద్యార్థుల చేతుల్లో సెల్‌ఫోన్లు..ఆదిలాబాద్‌లో ఎగ్జామ్స్‌లో అసలు విషయం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 12:44:08
Velgapudi, Andhra Pradesh:

Adulterated Milk Death: రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృతిచెందిన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. కల్తీ పాలు తాగిన మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటిస్తూ మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో ఆకస్మిక వర్షం.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

ఘటన చాలా బాధాకరం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాజమండ్రి కల్తీ పాల ఘటనలో బాధితులు వాంతులు, కడుపునొప్పి, డయాలసిస్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయి పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో వరలక్ష్మీ మిల్క్ డెయిరీ 106 కుటుంబాలకు రోజూ పాల సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారని అధికారులు నిర్ధారించారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'కల్తీ పాల ఘటనలో నలుగురు చనిపోయారు. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు 70 ఏళ్లకు పైబడిన వారు, ఒకరు 58 ఏళ్ల వయసు వారు ఉన్నారు' అని సీఎం చంద్రబాబు వివరించారు.

Also Read: BRS Party: గజినీలా మారిన రేవంత్‌ రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటి: బీఆర్‌ఎస్‌ పార్టీ

'బాధితుల నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్‌కు పరీక్షల కోసం పంపించాం. డెయిరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని.. కాసులకు కక్కుర్తి పడి ఈ కల్తీ వ్యవహారానికి పాల్పడితే సీరియస్‌గా తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎవరైనా కల్తీకి పాల్పడినా, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు... అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

కల్తీపాల ఘటనపై సమీక్ష
రాజమహేంద్రవరంలో కల్తీ పాల వినియోగంతో స్థానికులు అస్వస్థతకు గురవడం, పలువురు మరణించారనే ఘటన తెలియగానే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యసాయంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని.. మిగిలిన వారందరి నుంచి కూడా నమూనాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమండ్రి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 12:16:03
Hyderabad, Telangana:

Sudden Heavy Rains: వేసవికాలం ఇంకా ఆరంభం కాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అకస్మాత్తుగా హైదరాబాద్‌లో వర్షం కురిసింది. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు చేసినట్టు హైదరాబాద్‌లో మధ్యాహ్నం పూట వర్షం కురిసింది. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. చిరుజల్లులతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షం కారణంగా వాహనదారులు కొంత ఇబ్బందులు పడ్డారు. రానున్న రెండు రోజుల్లో కూడా వర్షం పడతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Also Read: BRS Party: గజినీలా మారిన రేవంత్‌ రెడ్డి.. చెప్పేదొకటి చేసేదొకటి: బీఆర్‌ఎస్‌ పార్టీ

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్‌మెంట్, హయత్ నగర్ ప్రాంతాలలో మోస్తరు వర్షం కురిసింది. వేసవికాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నా నిన్నటి వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడి ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా మారింది. నల్లటి మబ్బులు కమ్ముకుని.. ఆహ్లాదంగా వాతావరణం ఉంది. ఇదే వాతావరణం మరో రెండు రోజులు కూడా ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షం పడుతోంది. మెదక్‌ జిల్లా దుబ్బాకలో కూడా వర్షం కురిసింది.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

రానున్న రెండు రోజుల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడకక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్తాపూర్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్ మీదుగా చెల్లాచెదురుగా తీవ్రమైన ఉరుములు మెరుపులు వచ్చాయ. చార్మినార్, బహదూర్‌పురా, బాలాపూర్, కిషన్‌బాగ్, చంద్రాయణగుట్ట, బార్కాస్‌ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుందని తెలుస్తోంది. పలు చోట్ల వడగళ్లు పడతాయని హెచ్చరించింది. రాబోయే రెండు గంటల్లో షేక్‌పేట, టోలిచౌకి, నాంపల్లిలో కూడా చెల్లాచెదురుగా వర్షాలు, ఉరుములు వీస్తాయి.

Also Read: Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 10:58:02
Hyderabad, Telangana:

Telangana Assembly Session: 'అతి తెలివితో రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తం ఒక డ్రామాలా నడిపించారు. రేవంత్ రెడ్డి ఏ ఒక్క రోజు మున్సిపాలిటీల అభివృద్ధి గురించి చెప్పలేదు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తిగా, ఒక డాక్టర్‌గా రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తిగా అన్ని వాస్తవాలు ముందు పెడుతున్నా' అని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ముందు మాజీ మంత్రి హరీశ్‌ రావుకు సిట్ పేరుతో నోటీసులు ఇచ్చి మొదటి డ్రామాకు తెరలేపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా ఉందా అంటే మన్ను లేదు మశానం లేదు. దావోస్ పేరుతో రేవంత్ రెడ్డి విహార యాత్రకు చేశాడు. మొత్తం 12 రోజుల పాటు వెళ్లి దావోసు నుంచి తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు గురించి చెప్పలేదు. ఇదే విషయం పెట్టుబడులపై శ్రీధర్ బాబు మాట్లాడుతాడో అనుకుంటే  ఆయన మాట్లాడలేదు. అందుకే రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటనను విహార యాత్ర అంటున్నా' అని ఎమ్మెల్యే సంజయ్‌ వెల్లడించారు.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చి రెండో డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టి మరల్చడంలో రేవంత్ రెడ్డి ఆయనకు ఆయనే సాటి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు మున్సిపాలిటీల్లో సభలు నిర్వహిస్తాడు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో సభలు. ఏదో ఒక రకంగా ప్రజలను రేవంత్ రెడ్డి మభ్య పెడుతున్నాడు' అని ఎమ్మెల్యే సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇతర పార్టీలతో అంటకాగేది రేవంత్ రెడ్డి. అలాంటిది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి లింక్ పెడుతు వీణావాణిల గురించి నీచంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడారు' అని మండిపడ్డారు.

Also Read: Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికి జాతిపిత కేసీఆరే అని ఎమ్మెల్యే సంజయ్‌ ప్రకటించారు. 'ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, తగిన సమయంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు కేసీఆర్ ను తిట్టడం తప్పా, అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు. తప్పులు చేస్తే చెప్పండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రోజు తప్పులు చేస్తూనే ఉన్నాడు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సమస్యల పైన మాట్లాడే అవకాశం ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో నిజాయితీగా ప్రజల సమస్యలపై చర్చ చేయాలని కోరారు.

Also Read: Matrimonial Frauds: పెళ్లి పేరుతో పెట్రేగుతున్న మోసాలు.. అమ్మాయిలకు కీలక సూచన

'ఈ బడ్జెట్‌లో మహిళలు, రైతులకు, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన హామీలకు నిధులు కేటాయించకపోతే వారందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డికి ఫేవరేట్ సబ్జెక్ట్ అయిన రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుదాం. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో తెలుసుకుంటే బావుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామ రక్ష అని రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాల్సిందే' అని ఎమ్మెల్యే సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తెలిపారు.

'బడ్జెట్ సమావేశాల్లో మాకు మైక్ ఇవ్వమని చెప్పండి, జలాల పై చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గజిని లాంటి వాడు, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈసారి అసెంబ్లీని గౌరవించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌ను పార్టీ మారారని అనర్హత వేటు వేశారు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా స్పీకర్ వారిపై చర్యలు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా చర్యలు తీసుకోలేదు' అని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తెలిపారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 10:09:28
Adilabad, Telangana:

Adilabad Open School Cell Phone Exam: పరీక్షా హాల్ అంటే పుస్తకాలు, పెన్నులు, పేపర్లే కనిపిస్తాయి. కానీ, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం దృశ్యం విభిన్నంగా మారింది. విద్యార్థులంతా తమ మొబైల్ ఫోన్లలో మునిగిపోయారు. పక్కనే ఇన్విజిలేటర్ ఉన్నా ఎవరూ వారిని ఆపడం లేదు. ఎందుకంటే.. వాళ్లంతా ఫోన్లలో పరీక్షలు రాస్తున్నారు!

తొలిసారిగా మొబైల్ ద్వారా పరీక్ష
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) చరిత్రలో ఒక సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే బేస్‌లైన్ టెస్ట్‌ను ఈసారి సెల్‌ఫోన్ల ద్వారా నిర్వహించారు.

పరీక్షా విధానం ఇలా..
ఇన్విజిలేటర్లు ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను విద్యార్థులు తమ ఫోన్లలో స్కాన్ చేసి ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. విద్యార్థులు తమ ఫోన్ స్క్రీన్‌పైనే ఆప్షన్లను ఎంచుకుంటూ పరీక్ష రాశారు. ప్రత్యేకత ఏంటంటే, మొత్తం ఐదు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను విద్యార్థులు ఒకే రోజులో పూర్తి చేశారు.

పరీక్ష పూర్తయిన మరుక్షణమే ఫలితాలు కూడా ఫోన్ స్క్రీన్‌పైనే కనిపించాయి. దీనివల్ల రిజల్ట్స్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ డిజిటల్ పరీక్షను నిర్వహించారు. పదో తరగతి కోసం 418 మంది.. ఇంటర్మీడియట్ 245 మంది ఈ పరీక్షకు హజరయ్యారు.

సాధారణంగా పోటీ పరీక్షల్లో ఫోన్లను అనుమతించరు కానీ, ఓపెన్ స్కూల్ ప్రవేశాల కోసం ఈ వెసులుబాటు కల్పించడం విశేషం. రాబోయే రోజుల్లో అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు ఫోన్లే సాధనంగా మారే అవకాశం ఉందని ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ తెలిపారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు పరీక్షల భారాన్ని తగ్గించడంలో ఈ ప్రయోగం సక్సెస్ అయిందనే చెప్పాలి.

Also Read: India Vs South Africa Match: టీమ్ఇండియాని దెబ్బేసిన జాన్సెన్, కేశవ్ మహారాజ్..సూపర్-8లో బోల్తా కొట్టిన సూర్యసేన!

Also Read: Weight Loss Bullet Coffee: బుల్లెట్ కాఫీ గురించి విన్నారా? రోజుకు ఒకటి తాగినా శరీరంలో కొవ్వును కట్ చేసేస్తుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 09:20:47
Hyderabad, Telangana:

VC Sajjanar: వివాహం చేసుకునే అంశంపై జరుగుతున్న మోసాలపై పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్ల పేరిట జరుగుతున్న మోసాలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పెళ్లి చేసుకోబోయే యువతులకు సజ్జనార్‌ హెచ్చరికలు చేస్తూనే.. జాగ్రత్తలు చెప్పారు. పెళ్లి ఖరారు చేసుకున్న తర్వాత వ్యక్తిగత ఫొటోలు, న్యూడ్‌ వీడియోలు వంటివి తీసుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తారని వివరించారు. 'హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు అందరికీ తెలిసిందే. ప్రేమ పేరుతోనే కాదు, పెళ్లి కుదిరిన సంబంధాల మాటున కూడా కొందరు నమ్మించి యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఫిర్యాదులు ఎక్కువగా స్వీకరిస్తున్నారు' అని సజ్జనార్‌ తెలిపారు.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

మోసాలు ఇలా..
సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై నిశ్చితార్థం చేసుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే నమ్మకంతో యువతులు వారికి దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్లి కదా.. ఇప్పుడేంటి? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఒంటరిగా శారీరకంగా లోబరుచుకుంటున్నారు. కోరిక తీరాక వారి అసలు రంగు బయటపడుతుంది. పెళ్లి పీటలే ఎక్కలేమని.. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలని.. లేదంటే కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Also Read: Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వేధింపులు, బెదిరింపులతోపాటు పరువు ఎక్కడ పోతుందోనని భయంతో చాలామంది యువతులు అలాంటి దుర్మార్గుల ఆగడాలను భరించేందుకు వెనకడుగు వేస్తున్నారని వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఇదే అదనుగా భావించి కట్నంగా ఆభరణాలు, నగదు డబ్బు డిమాండ్లు చేస్తున్నారని వివరించారు. పరువు పోతుందని భయపడి మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. నిరంతరం అలా సరే పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రతిష్టగా ఉంటాయని తెలిపారు.

Also Read: Team India: బ్యాటర్లు ఘోర వైఫల్యం.. సూపర్ -8లో భారత్ ఓటమికి ఐదు కారణాలు

పెళ్లి కుదిరిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు అని వీసీ సజ్జనార్‌ సూచించారు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయాలని చెప్పారు. పెళ్లికి ముందు ఏకాంతంగా కలవడాన్ని, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలని.. ధైర్యంగా తిరస్కరించాలని తెలిపారు. డబ్బు డిమాండ్ చేసినా.. బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దని.. ఫిర్యాదు చేయాలని సజ్జనార్‌ సూచించారు. మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకురావాలి కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సూచించారు. ఫిర్యాదు చేసినవారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతారని.. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555కు, డయల్ 100కు ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ డీసీ సౌజన్య సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 09:09:21
Velgapudi, Andhra Pradesh:

Adulterated Milk Deaths: ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాలు సేవించిన ప్రజలు పెద్ద ఎత్తున తీవ్ర అస్వస్థతకు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే నలుగురు మృతి చెందడంతో తీవ్ర సంచలనం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో జరిగిన ఉదంతంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ వేదికగా కల్తీపాల సంఘటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. కల్తీ పాల ఘటనపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Also Read: Top Haleem Spots: హైదరాబాద్‌లో బెస్ట్‌ 10 హలీమ్‌ హోటళ్లు ఇవే.. ఎక్కడెక్కడంటే?

కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో వరలక్ష్మి డైరీ నుంచి పాల సరఫరా జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారని.. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు
పురుషులు ఉన్నారని వెల్లడించారు. 'హైదరాబాద్ ల్యాబ్స్‌కు పాల నమూనాలు పంపాం. 194 సెక్షన్ కింద కేస్ నమోదైంది. డైరీ నిర్వాహకులు పోలీసుల కంట్రోల్‌లో ఉన్నారు' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read: Harish Rao: మూసీ పునరుజ్జీవనం పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ: హరీశ్ రావు

సీఎం చంద్రబాబును కలిసిన మంత్రులు
కల్తీ పాల సంఘటనపై సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని మంత్రులు కలిశారు. తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్యమతస్తులకు డిక్లరేషన్ నిబంధన మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేక చట్టం ద్వారా తప్పుచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంది. ప్రత్యేక చట్టాన్ని టీటీడీకి కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది.

Also Read: Rs 151 Talambralu: రూ.151 చెల్లిస్తే భక్తుల ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

లడ్డూలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు 4 గంటలపాటు చర్చకు నిర్ణయం. రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌ రద్దు చేశారు. రేపు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే స్వల్ప అస్వస్థత కారణంగా పవన్‌కల్యాణ్‌ సభకు రాలేదు. రేపు సభకు వచ్చాక డిప్యూటీ సీఎం కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Feb 23, 2026 05:37:51
Secunderabad, Telangana:

Higher EPS Pension: ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది. దాదాపు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అధిక పెన్షన్ అంశంపై స్పష్టత ఇచ్చింది. గతంలో అందుబాటులో ఉన్న హయ్యర్ పెన్షన్ ఆప్షన్‌ను పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం ప్రతి పీఎఫ్ ఖాతాదారునికీ వర్తించదన్న విషయాన్ని గమనించాలి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో 2014 సెప్టెంబర్ 1 నుంచి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. అప్పటి వరకు ఉద్యోగులు తమ పూర్తి బేసిక్ వేతనం తోపాటు డీఏ ఆధారంగా పెన్షన్ కంట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ 2014 సవరణ తర్వాత పెన్షన్ లెక్కింపుకు గరిష్ఠ వేతన పరిమితిని నెలకు రూ.15,000గా నిర్ణయించారు.

దీంతో ఎంత ఎక్కువ జీతం వచ్చినా..  ఈపీఎస్ కంట్రిబ్యూషన్ మాత్రం రూ.15,000 పరిమితికే పరిమితమైంది. ఫలితంగా గరిష్ఠ పెన్షన్ సుమారు రూ.7,500 వరకే ఉండే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు.. లేదా 2014 తర్వాత జీతం రూ.15,000 దాటిన వారు పూర్తి వేతనంపై పెన్షన్ పొందే అవకాశాన్ని కోల్పోయారు. అయితే 2014కి ముందు కొందరు ఉద్యోగులు తమ పూర్తి బేసిక్ పే ఆధారంగా ఈపీఎస్‌లో అధిక మొత్తంలో కంట్రిబ్యూట్ చేసేవారు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేసే వారు ఈ ఆప్షన్‌ను ఎక్కువగా వినియోగించుకున్నారు. దీని వల్ల రిటైర్మెంట్ తర్వాత వారికి అధిక పెన్షన్ లభించింది.

కానీ 2014 సవరణలతో ఈ ఆప్షన్ నిలిపివేసింది. దీంతో ఇప్పటికే హయ్యర్ కంట్రిబ్యూషన్ ఎంచుకున్న వారిలో గందరగోళం నెలకొంది. వారు భవిష్యత్తులో అదే విధంగా పెన్షన్ పొందగలరా లేదా అన్న అనిశ్చితి కొనసాగింది. అయితే తాజా నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం పాత హయ్యర్ పెన్షన్ ఆప్షన్‌ను మళ్లీ అనుమతించింది. ఇది కొత్త ప్రయోజనం కాదు. గతంలో అంగీకరించిన విధానాన్నే పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.

Also Read: Gold, silver Measure:  బంగారాన్ని క్యారెట్లలో.. వెండిని కిలోలలో ఎందుకు కొలుస్తారో తెలుసా? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!  

అయితే ఇది అందరికీ ఆటోమేటిక్‌గా వర్తించదు. 2014 సెప్టెంబర్ 1కు ముందు పూర్తి వేతనంపై కంట్రిబ్యూట్ చేయాలని ఎంపిక చేసుకున్న వారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అంటే అప్పటికే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారు.. మధ్యలో నిలిచిపోయిన వారు ఇప్పుడు మళ్లీ కొనసాగించుకునే అవకాశం పొందవచ్చు. ఇక ఉద్యోగి ఒక్కడే నిర్ణయం తీసుకోలేడు. సంస్థ యాజమాన్యం అంగీకారం కూడా అవసరం అవుతుంది. అధిక మొత్తంలో కంట్రిబ్యూట్ చేయడానికి ఉద్యోగి, యాజమాన్యం ఇద్దరూ సంయుక్తంగా అంగీకరించాలి.

కాగా ఈ నిర్ణయం ప్రధానంగా 2014కు ముందు హయ్యర్ కంట్రిబ్యూషన్ ఎంచుకున్న పరిమిత వర్గానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రైవేట్ రంగంలో చాలా మంది ఉద్యోగులు రూ.15,000 పరిమితి ప్రకారమే కంట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి ఇది నేరుగా వర్తించకపోవచ్చు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశంపై స్పష్టత రావడం మాత్రం సానుకూల పరిణామం అని చెప్పాలి. అర్హులైన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్ అందే మార్గం మళ్లీ తెరుచుకుంది. అయితే ఎవరు అర్హులు? తమ గత ఎంపికల వివరాలు ఏంటి? అనే విషయాల్లో స్పష్టత కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలి. 

Also Read:  Silver Rate: సిల్వర్ మార్కెట్‌లో బిగ్ బూస్ట్.. ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్.. భారీగా పెరిగిన వెండి ధర.. !!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 22, 2026 18:19:09
Ahmedabad, Gujarat:

IND vs SA Highlights: హ్యాట్రిక్‌ విజయాలతో అద్భుతంగా ఆడుతున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా ఝలక్‌ ఇచ్చింది. అజేయంగా ఆడుతూ సూపర్‌ 8కు దూసుకువచ్చిన టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. విజయోత్సాహంతో ఉన్న సూర్య సేను ఘోరంగా ఓడించింది. అయితే అన్నింటా విఫలమైన భారత్‌ ఈ ఓటమితో టీ20 ప్రపంచకప్‌ను పొందాలంటే జట్టును చక్కదిద్దుకునే సూచన చేసింది. అయితే ఈ మ్యాచ్‌ దారుణంగా ఓడిపోవడానికి గల ఐదు కారణాలు తెలుసుకుందాం.

Also Read: Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం.. ఇద్దరు మృతి?

అహ్మదాబాద్‌లోని స్టేడియంలో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైన వేళ వీరి మిడిలార్డర్‌ దూకుడుగా ఆడడంతో మోస్తరు స్కోరు నమోదైంది. భారత బౌలర్లు పటిష్టంగా బౌలింగ్‌ వేసినా పరుగులకు కళ్లెం వేయలేకపోయారు. ఛేదనకు దిగిన భారత జట్టు 18.5 ఓవర్లకు 111 పరుగులు చేసి చేతులెత్తేసింది. 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా భారీ విజయాన్ని నమోదు చేసింది.

Also Read: 14 KM Flyover: విజయవాడలో 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్‌? ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్టే!

బౌలింగపరంగా పర్వలేదనిపించినా భారత జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు మొదలుకుని మిడిలార్డర్‌ వరకు ఎవరూ జట్టును విజయ తీరాలకు చేరేందుకు కష్టపడలేదు. టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌తోనే భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. ఇక డకౌట్‌ వీరుడు అభిషేక్‌ శర్మపై ఏమాత్రం అంచనాలు లేకపోగా.. అదే పేలవ ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయమేమిటంటే డకౌట్‌ కాకపోవడం ఒకటి విశేషం.

Also Read: Boggula Srinivas: 'పవన్ కల్యాణ్ హఠావో' పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ

క్రీజులో ఏ ఒక్క బ్యాటర్‌ కూడా కొన్ని నిమిషాలు కూడా నిలువలేకపోయారు. ఒక్కరూ కూడా అర్ధ శతకం నమోదుచేయలేకపోయారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో శివమ్‌ దూబే ఒక్కడే కష్టపడ్డాడు. 37 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎక్కువ సేపు మైదానంలో ఉన్నా కూడా పరుగులు మాత్రం రాబట్టలేకపోయాడు. 22 బంతులు ఆడి సూర్య 18 పరుగులు చేయగా.. అభిషేక్‌ 15, హార్దిక్‌ పాండ్యా 18, వాషింగ్టన్‌ సుందర్‌ 11 చొప్పున అతి తక్కువ పరుగులు చేశారు. తిలక్‌ వర్మ ఒక్క పరుగు చేసి డకౌట్‌ నుంచి బయటపడ్డాడు. 

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో డకౌట్ల పరంపరం కొనసాగింది. అభిషేక్‌ శర్మ తప్పించుకోగా ఇషాన్‌ కిషన్‌ బలయ్యాడు. రింకూ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రాలు కూడా డకౌట్‌ అయ్యారు. టీ20 ప్రపంచకప్‌లో డకౌట్లు ప్రమాదకరంగా మారాయి.

దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌ భారత్‌ జట్టులోని లోపాలు ఎత్తిచూపాయి. ఓపెనర్లపైనే భారం వేయరాదని స్పష్టమైంది. మిడిలార్డర్‌ బలంగా ఉండాలని ఈ మ్యాచ్‌ చెబుతోంది. ప్రత్యర్థి జట్టుల్లో చివరి ఆటగాడు వరకు పోరాడుతాడు. కానీ భారత జట్టులో అలాంటి పోరాటం కనిపించదు.

సెమీ ఫైనల్‌కు వెళ్లాలంటే జట్టులో మార్పులు చేర్పులు జరగాల్సి ఉందనేది ఈ ఓటమితో భారత జట్టు గ్రహించాల్సి ఉంది. ముఖ్యంగా అభిషేక్‌ శర్మను పక్కనపెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారమంతా ఇషాన్‌ కిషన్‌పై పడకుండా మిగతా బ్యాటర్లు కూడా కొంచెం కష్టపడాలి. కెప్టెన్‌ సూర్య ఆడుతుండగా తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా బ్యాట్‌ ఝుళిపించాల్సిన అవసరం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 22, 2026 17:16:27
Hyderabad, Telangana:

India Vs South Africa Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సఫారీలు నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.

మ్యాచ్ హైలైట్స్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (15), తిలక్ వర్మ (1) నిరాశపరిచారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18), వాషింగ్టన్ సుందర్ (11) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు ఆగలేకపోయారు. 

కేశవ్ మహరాజ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి భారత వెన్ను విరిచారు. చివర్లో శివమ్ దూబె (36*) సిక్సర్లతో విరుచుకుపడినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 17వ ఓవర్ నుంచి సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ స్కోరు 111 వద్దే ఆగిపోయింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (63) అర్ధశతకంతో రాణించగా, డేవాల్డ్ బ్రెవిస్ (45), ట్రిస్టన్ స్టబ్స్ (44*) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో రాణించగా, అర్ష్‌దీప్ 2 వికెట్లు తీశారు. అయితే ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్య 20 పరుగులు సమర్పించుకోవడం సఫారీలకు భారీ స్కోరునందించింది. దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, మధ్య ఓవర్లలో రన్ రేట్ పెరిగిపోవడం భారత్ కొంపముంచింది. సఫారీ బౌలర్లు యాన్సన్, రబాడ, మహరాజ్ ప్రణాళికాబద్ధంగా బంతులేసి భారత్‌ను కట్టడి చేశారు.

Also Read: Lunar Eclipse Astrology: చంద్రగ్రహణం ఎఫెక్ట్..జాక్‌పాక్ కొట్టే రాశులు ఇవే..దోష నివారణలు ఎలా చేయాలి?

Also REad: Weight Loss Bullet Coffee: బుల్లెట్ కాఫీ గురించి విన్నారా? రోజుకు ఒకటి తాగినా శరీరంలో కొవ్వును కట్ చేసేస్తుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 22, 2026 15:32:52
Amaravathi, Andhra Pradesh:

Amaravati: దేశ అభివృద్ధికి కమ్యూనికేషన్, టెక్నాలజీ అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంటర్నెట్, డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చిందని.. కానీ అప్పట్లో భారత్ ఆ రంగంలో ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. వైద్య సేవల డేటా ప్రాసెసింగ్ వంటి పనులకే పరిమితమయ్యామని, ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 1995లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజులను ఒకసారి గుర్తు చేసుకున్నారు.

Also Read: Boggula Srinivas: 'పవన్ కల్యాణ్ హఠావో' పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ

భారత్‌నెట్‌పై ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరగ్గా.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. 'అప్పట్లో కేవలం 2 ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చింది. అదే బ్యాండ్‌విడ్త్‌తో జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read: 14 KM Flyover: విజయవాడలో 14 కిలోమీటర్ల అతి పొడవైన ఫ్లైఓవర్‌? ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్టే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు సాధించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 4జీ, 5జీ విస్తరణతో కోట్లాది మంది డిజిటల్ సేవల లాభాలు పొందుతున్నారని.. ప్రపంచంతో పోలిస్తే భారత్ డేటా ఖర్చు కేవలం 5 శాతం మాత్రమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ స్తంభాలపై ఫైబర్ వేయడంతో తక్కువ ఖర్చుతో వేగంగా నెట్‌వర్క్ విస్తరణ సాధ్యమైందని వివరించారు. ఒకప్పుడు దాదాపు 9.78 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేశామని.. ఆ తర్వాత ప్రభుత్వ మార్పుతో ఆ సంఖ్య తగ్గినా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్లీ వేగం పుంజుకుంటోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Also Read: Harish Rao: మూసీ పునరుజ్జీవనం పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ: హరీశ్ రావు

డిజిటల్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ముందుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే 970 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని, భూ రికార్డులను బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీతో భద్రపరచేలా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్య, పాలన రంగాల్లో ఏఐ వినియోగం విస్తరించనుందని.. భవిష్యత్తులో ఏఐ డాక్టర్, ఏఐ ఎకనామిస్ట్ వంటి వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నారని, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లలో భారత్ కీలకంగా మారిందని చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా సముద్రపు కేబుల్ లింకులతో డేటా హబ్‌గా ఏపీ ఎదుగుతోందని పేర్కొన్నారు. గూగుల్‌ సంస్థ రాష్ట్రంలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమని ఉదాహరించారు.

భవిష్యత్తు రంగాలైన గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్లు, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, మెడ్‌టెక్‌లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. త్వరలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలోనే ప్రైవేట్ టెలికాం సంస్థలను మించి నంబర్ వన్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన నాయకత్వం, బాధ్యతాయుత పాలన ఉంటే అద్భుతాలు సాధ్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి భారత్ అడ్డుకోలేని ఆర్థిక శక్తిగా మారుతుందని.. దీనికి అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇది చారిత్రాత్మక దశ అని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తే దేశం ప్రపంచానికి దారి చూపుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 22, 2026 15:26:44
Hyderabad, Telangana:

Bullet Coffee For Weight Loss: ప్రస్తుతం సోషల్ మీడియాలో 'బుల్లెట్ కాఫీ' ట్రెండ్ నడుస్తోంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మ్యాజిక్ డ్రింక్ అని చాలామంది నమ్ముతున్నారు. ఇంతకీ బుల్లెట్ కాఫీ అంటే ఏంటి? ఇది నిజంగా బరువు తగ్గిస్తుందా? అసలు విషయమేంటో నిపుణుల సూచనలను తెలుసుకుందాం.

బుల్లెట్ కాఫీ అంటే ఏమిటి?
సాధారణంగా మనం తాగే కాఫీలో పాలు, చక్కెర ఉంటాయి. కానీ బుల్లెట్ కాఫీ తయారీ విధానం వేరు. నీటిలో కాఫీ పొడిని వేసి మరిగించి, అందులో 2 టీస్పూన్ల నెయ్యి లేదా వెన్న కలిపి దీనిని తయారు చేస్తారు. ఇందులో పాలు గానీ, చక్కెర గానీ అస్సలు ఉండవు.

కొందరు ఆరోగ్య నిపుణుల వివరణ ప్రకారం.. బుల్లెట్ కాఫీ తాగడం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే నెయ్యి లేదా వెన్న వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినాలనిపించదు. ఇది తాగిన తర్వాత చాలా మందికి మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. తద్వారా అల్పాహారం (ఇడ్లీ, దోశ వంటి కార్బోహైడ్రేట్లు) ద్వారా వచ్చే కేలరీలను తగ్గించుకోవచ్చు.

ఎవరు తాగకూడదు? (హెచ్చరిక)
బుల్లెట్ కాఫీ అందరికీ మంచిది కాదని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇందులోని కొవ్వు స్థాయిలు కొలెస్ట్రాల్‌ను మరింత పెంచే ప్రమాదం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది.

గుర్తుంచుకోవాల్సిన విషయం
కేవలం బుల్లెట్ కాఫీ తాగేసి, సాయంత్రం వేళల్లో సమోసాలు, బజ్జీలు తింటే బరువు తగ్గడం అసాధ్యం. "తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కేలరీలు, సరైన ప్రోటీన్లు, కూరగాయలు, వ్యాయామంతో కూడిన జీవనశైలిని పాటిస్తూ.. ఆకలిని నియంత్రించుకోవడానికి మాత్రమే బుల్లెట్ కాఫీని ఒక సాధనంగా వాడాలి" నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Lunar Eclipse Astrology: చంద్రగ్రహణం ఎఫెక్ట్..జాక్‌పాక్ కొట్టే రాశులు ఇవే..దోష నివారణలు ఎలా చేయాలి?

Also Read: New Constituencies In AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరగనున్న నియోజకవర్గాల పెంపు..ఈసారి ఎన్ని వస్తాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top