King Cobra Catching Video: సాధారణంగా ప్రజలు పాములను చూసినప్పుడు భయపడి దూరంగా పారిపోతారు. అయితే ఓ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యంగా పాము పట్టి బయటకు లాగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసేప్పుడు మాత్రం మీ గుండె చప్పుడు కూడా మీకే వినిపించే అంత సస్పెన్స్ ఉంటుంది.
పాములు ఎంతో ప్రమాదకరమైనవని అందరికి తెలిసిన విషయమే. అయితే వాటిని చూడగానే అందరూ పారిపోవడమే మంచిదని అనుకుంటారు. కానీ, మనలో చాలా మంది ఎంతటి పామును అయినా ఇట్టే ఈజీగా పట్టే నైపుణ్యం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా వీడియోలో ఓ యువతి పెద్ద పామును పట్టుకొని ఆడిస్తుంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక చిన్న గదిలో కనిపించిన పామును పట్టుకోవడానికి ఓ అమ్మాయి ప్రయత్నిస్తుంది. ఆమె పామును ఎంతో తేలికగా పట్టుకున్న తీరును చూస్తే బహుశా..ఈమె పాములు పట్టడంలో ఎంతో ప్రొఫెషనల్ అని తెలుస్తోంది. అస్సలు భయమే లేకుండా ఆ యువతి తన చేతులతో పామును పట్టుకుంది.
हमारे मौहल्ले की लड़कियाँ छिपकली
दिखते ही डर के मारे छीप जाती है
और एक ये है जो
सांप से खेल रही है दाद देने पड़ेगी
इसकी हिम्मत को pic.twitter.com/UIYKT4ZCY2— S marwadi (@s___marwadi786) March 14, 2026
ఈ వీడియోను సోషల్ మీడియా @s___marwadi786 (ట్విట్టర్ ఖాతా) అనే యూజర్‌నేమ్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఆ యువతి ధైర్యానికి నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. చాలామందికి ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోయారు. పాములతో జాగ్రత్త అంటూ సలహాలు ఇస్తున్నారు.
(గమనిక: అయితే పాములు పట్టుకునేందుకు చాలామందికి శిక్షణ ఇస్తారు. వీడియోలో పాములు పట్టినంత మాత్రానా మీరు దాన్ని ఇంటి వద్ద ప్రయోగాలు చేయడం క్షేమం కాదు. సరైన శిక్షణ ఉన్నప్పడు మాత్రమే పాములను పట్టుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే ఒకవేళ మీ ఇంట్లో పాములు కనిపిస్తే వన్యప్రాణ సంరంక్షకులను సమాచారం ఇవ్వడం మంచిది.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Woman attacks on passengers in running train video: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్గా మారుతుంటాయి. ముఖ్యంగా నెటిజన్లు వైరల్ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకే ఎక్కడ ఎలాంటి ఫన్నీ ఘటనలు జరిగిన వెంటనే తమఫోన్ లలో రికార్డు చేసి చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో అవి కాస్త వైరల్గా మారతాయి. ఇటీవల రన్నింగ్ ట్రైన్ లలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది మహిళలు సీట్ల విషయంలో తోటి ప్రయాణికులతో గొడవలు పడుతున్నారు.జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఈ గొడవలు కాస్త పీక్స్ కు వెళ్లిపోతున్నాయి. మరికొంతమంది రైళ్లలో వాష్ రూమ్ లలో రొమాన్స్ లు చేసుకుంటున్నారు.
భారతీయ రైల్వేస్ కి
స్వాగతం సుస్వాగతం 🙏🙏ఇండియా పేరు ప్రతిష్టలను నాశనం చేయడానికి, శత్రువులు అక్కరలేదు, మన వాళ్ళే చాలు - ప్రపంచమంతా ఢంకా కొట్టి మరీ సర్వనాశనం చేస్తారు.
pic.twitter.com/p1tzsAEqno— Hyderabad Intellectuals Forum 🇮🇳 (@HydForum) March 15, 2026
మొత్తంగా రైల్వే వ్యవస్థను కొంతమంది తమఛెండాలమైన పనులకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. తాజాగా.. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తోటి ప్రయాణికులతో గొడవలకు దిగింది. మరీ ఆమె ఎందుకు గొడవలు పడిందో తెలీదు.
ఇద్దరుమహిళలపై విరుచుకుపడింది. అక్కడి వారు చెబుతున్న వెనక్కు తగ్గలేదు. కిందపడేసి మరీ దాడులు చేసింది.ఇంతలో ఒక యువకుడు కల్గచేసుకున్నారు. కొపంలో ఆమె అతడ్ని కూడా ట్రైన్ లో కిందపడేసి కొట్టింది.
ఆతర్వాత అందరు కలిసి ఆమెను కూల్ చేశారు. మొత్తంగా సీటు విషయంలో గొడవలు పడ్డారో లేదా ఏమైన తిట్టుకున్నారో కానీ వీరు జుట్టు పట్టుకుని గొడవలు పడటంకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.ఏంట్రా బాబోయ్ ఈ అరాచకం అంటూ బిత్తరపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Abrar Ahmed Kavya Maran Controversy: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెట్ లీగ్ 'ది హండ్రెడ్' కోసం పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆమెపై భారత్‌లో వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత కావ్య మారన్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ చేయడం సహా అనేక మంది అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ మొదలుపెట్టారు.
అంతేకాకుండా రాబోయే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇన్ని సంఘటనల నడుము కావ్య మారన్‌కు మరో షాక్ తగిలింది. అయితే వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేసిన పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్.. తాను ఆడేందుకు సిద్ధంగా లేనని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్.. ది హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అదే సమయంలో అబ్రార్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. అదే సమయంలో ఆ టోర్నీకి పాక్ జట్టులో అబ్రార్ ఎంపికైతే.. సన్ రైజర్స్ తరఫున మ్యాచ్‌లు ఆడడం దాదాపు కష్టమే. దీంతో అబ్రార్ దాదాపుగా ది హండ్రెడ్ టోర్నీలో ఆడేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది.
ది హండ్రెడ్ లీగ్ జరిగే సమయంలో పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అబ్రార్ అహ్మద్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. జూలై 15 నుండి ఆగస్టు 7 వరకు రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్ వెస్టిండీస్‌కు వెళుతుంది. ది హండ్రెడ్ జూలై 21న ప్రారంభమై ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది.
భారత్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా నిర్వహించే ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తానీ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడం పట్ల స్వదేశంలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా లండన్ వేదికగా జరిగిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు అబ్రార్‌ను రూ.2.34 కోట్లకు దక్కించుకుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వైరం నేపత్యంలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ లీగ్‌లోనూ పాక్ ఆటగాళ్లను భారత ఫ్రాంఛైజీలు వేలంలో కొనుగోలు చేయలేదు. అయితే కావ్య మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ జట్టు మాత్రం తప్పుడు మార్గంలో వెళ్లి పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Husband slits wife throat with blade in eluru: ఇటీవల కొంతమంది భార్యభర్తలు పెళ్లిళ్లు చేసుకుని మరీ గొడవలు పడుతున్నారు. ఒకర్నిమరోకరితో ఎలా గొడవలు పడాలి.. ఎలా చంపుకోవాలి అనే దానిపై రిసెర్చ్ లు చేస్తున్నారు.దీంతో ప్రతిరోజు భార్యభర్తల గొడవలకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఎన్నిసార్లు చెప్పిన వారి ప్రవర్తనమాత్రం మారడంలేదు. సుపారీలు ఇచ్చి చంపించడం కూడా చేస్తున్నారు. పెళ్లై, పిల్లలు ఉన్న కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.అడ్డుగా అన్పిస్తే పిల్లల్ని కూడా లేపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉండటంతో చాలా మంది అసలు పెళ్లంటేనే భయంతో పారిపోతున్నారు. తాజాగా.. ఏపీలోని ఏలూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏలూరు జిల్లలోని తణుకు ప్రాంతంలో సజ్జాపురంలో గోవిందు,దిల్లేశ్వరీ ఇద్దరు ఉండేవారు . వీరిరి 13 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. 6వ తరగతి చదువుతున్న బాలుడు ఉన్నాడు. భర్త మద్యానికి బానిసై తరచుగా భార్యను కొడుతుండేవాడు. దీంతో అతని బాధలు పడలేక ఇటీవల తణుకు పీస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా.. తన కొడుకుతో ఇంట్లోంచి వెళ్లిపోయి సపరేట్ గా ఉంటుంది. అయితే.. భార్యపై కోపం పెంచుకున్న గోవిందు ఇటీవల మద్యంతాగి స్కూల్ కు వెళ్లి పిల్లాల్ని తీసుకొని రావడానికి వెళ్తున్న భార్యతో గొడవకు దిగాడు. అప్పటికే రెడీగా పెట్టుకున్న బ్లేడ్ తో ఆమె గొంతుపై పలు మార్లు కోశాడు. దీంతో తీవ్ర రక్త స్రావం అయ్యింది. ఆమె అపస్మారకస్థితిలోకి పడిపోవడంతో వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.
Read more: Punganur Tragedy: రాత్రంతా ఆన్‌లో బైక్… పొగ పీల్చి నిద్రలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారుు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసుల తీరుపైమండిపడుతున్నారు. గతంలో భర్తపై ఫిర్యాదు ఇచ్చినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ దాడి జరిగేది కాదంటున్నారు . పొరపాటున ఆమె చనిపోతే ఆ బాలుడికి దిక్కెవరు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Stray Dogs Poisoned In Telangana: తెలంగాణలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కలకు విషం పెట్టి దాదాపుగా 100 శునకాలను చంపేశారు. చనిపోయిన శునకాల కళేబరాలను నది సమీపంలో పాతిపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలో గతేడాది డిసెంబరుతో పాటు ఈ ఏడాది జనవరిలో పలు గ్రామాల్లో ఇదే విధంగా జరిగినట్లు సమాచారం అందుతోంది.
జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దాదాపు 100 వీధి కుక్కలపై విషప్రయోగం జరిగినట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. వందల శునకాలను చంపారనే వార్త స్థానికులు, జంతు సంక్షేమ సంఘాల్లో ఆందోళన రేకెత్తించింది. ఎన్నో వందల శునకాలు నది వద్ద చనిపోయి కనిపించాయని, అయితే వీటికి ఎవరో ఉద్దేశపూర్వకంగా విషం పెట్టి చంపారని ఆరోపణలు వస్తున్నాయి.
జాతీయ మీడియా సంస్థ చెప్పిన కథనాల ప్రకారం.. స్థానిక జంతు సంక్షేమ కార్యకర్త గౌతమ్.. గత మార్చి 7, 8వ తేదీల్లో కిష్టాపూర్ గ్రామంలో దాదాపుగా 100 వీధి కుక్కలు చంపారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (NGO)లో క్రూయెల్టీ ప్రివెన్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారుడు.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఓ ఇద్దర్ని నియమించారని.. ఆ ఇద్దరు వీధి శునకాలు విషం ఇచ్చి చంపి, నది దగ్గర పాతిపెట్టారని ఫిర్యాదులో వెల్లడించాడు.
ఫిర్యాదు ఆధారంగా.. జన్నారం పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత, జంతు హింస నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద సర్పంచ్, గ్రామ పంచాయతీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘనటపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
అదే విధంగా గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరిలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వీధికుక్కలను చంపిన సంఘటనలు నమోదయ్యినట్లు సమాచారం. జనవరి ప్రారంభంలోనే దాదాపుగా 500 శునకాలను విషప్రయోగం చేసి చంపారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన దర్యాప్తును పోలీసులు చేపట్టారు. అలాగే కామారెడ్డిలో 200 శునకాలు.. భవానీ పేట్, పాల్వంచ, ఫరీద్‌పేట్, వాడి, బండరామేశ్వరపల్లి వంటి ప్రాంతాల్లో ఇవే ఘటనలను తాను కనుగొన్నట్లు ఫిర్యాదిదారుడు గౌతమ్ పోలీసులకు వెల్లడించాడు. అయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 1,300 శునకాలను ఉద్దేశపూర్వకంగా విషం పెట్టి చంపినట్లు ఆయన ఆరోపించాడు.
ఎన్నికల హామీలో భాగంగా..
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు వీధికుక్కల బెడదను పరిష్కరిస్తామని కొందరు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వారి హామీని నెరవేర్చే దిశగా వీధికుక్కల పోడును తగ్గించేందుకు వాటికి విషం పెట్టి చంపినట్లు తెలుస్తోంది. గెలిచిన ప్రజాప్రతినిధులే ఈ దుర్ఘటనలకు పాల్పడినట్లు పలువురు అనుమానిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు... రోహిత్ రెడ్డి బండారం బైటపెట్టిన తాండూరు ఎమ్మెల్యే.!.
Tandur mla manohar reddy reacts on pilot rohit reddy drugs case: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలంగా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన బీఎమ్‌ఆర్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. దీంతో ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిగాయి. ఈగల్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దీనిపై దాడులు చేశారు. ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారంలో శనివారం రాత్రి.. ఈగల్ టీమ్, ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో మొత్తం 11 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, రమేశ్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కాసిక్ రవి, అర్జున్ రెడ్డితో పాటు ఒక మహిళ ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా పోలీసులను చూసి భయంతో గాల్లొ కాల్పులు జరిపాడు.
వెంటనే పోలీసులు వారికి డ్రగ్స్ టెస్టులు చేయగా .. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డి, నమీద్ మిశ్రా, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్‌గా తేలింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిపై రాజకీయాలు హీటెక్కాయి. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణకు వీరి రక్త నమూనాలను సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) ల్యాబ్‌కు పంపినట్లు డీసీపీ తెలిపారు. సోదాల సమయంలో 2 గ్రాముల తెల్లటి పౌడర్‌ను, ఒక రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ప్రజలు బుద్ది చెప్పిన ఇంకా మారలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ప్రయత్నిస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం డ్రగ్స్ ను ప్రొత్సహిస్తుందన్నారు.
అంతే కాకుండా పైలట్ రోహిత్ రెడ్డి అక్రమాలకు,అసాంఘీక కార్యక్రమాలకు ఫామ్ హౌస్ అడ్డాగా మారిందన్నారు. వెంటనే దీనిలో ఇన్వాల్వ్ అయిన వారిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ తీసుకుంటే... ఇంకా ప్రజలకు ఏమని సంకేతాలు ఇస్తున్నట్లు అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Shukraditya And Malavya Rajayoga Effect On Zodiac: మార్చి మూడో వారంలో గ్రహాల స్థితిగతుల్లో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మార్చి 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్న ఈ వారంలో సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే మీనరాశిలో ఉన్న శుక్రుడు సూర్యుడి కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి తోడు శుక్రుడు బుచ్చరాశిలో ఉండడం వల్ల ఎంతో పవర్ఫుల్ అయిన మాళవ్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ రెండు రాజయోగాలు కొన్ని రాశుల వారికి వారం మొత్తం అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ క్రింది రాశుల వారికి కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనుకోకుండా ఈ సమయంలో అద్భుతమైన విజయాలు కూడా సాధించబోతున్నారు.
మేష రాశి
మేషరాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ రెండు శక్తివంతమైన రాజయోగాల ఏర్పాటు వల్ల కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఆనందమయం అవుతుంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వారికి కార్యాలయాల్లో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. పనికి తగ్గ అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగస్వామ్య జీవితంలో మనస్పార్ధాలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల స్వల్పంగా జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహరాశి
సింహ రాశి వారికి కూడా ఈ వారం ఆర్థికంగా చాలా కలిసి రాబోతోంది. వీరికి ఆకస్మిక ధన ధను లాభాలు కలగడమే కాకుండా కుటుంబంలో సుఖసంతోషాలు అద్భుతంగా పెరుగుతాయి. ఈ వారంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు అనుకోకుండా కఠినమైన పనుల్లో కూడా సక్సెస్ అవుతారు.
కన్య రాశి
కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు మిత్రులుగా ఉన్న వారికి సహకారం లభిస్తుంది. దీని కారణంగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ వారం ఒత్తిడి నుంచి కూడా ఊహించని స్థాయిలో ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో జీవితంలో సానుకూలమైన మార్పులు లేని వ్యక్తులు.. ఈ సమయంలో మంచి మార్పులను కూడా చూడబోతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit 2026 Effect On Zodiac: గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్య భగవానుడు తన రాశిని అతి త్వరలోనే మార్చుకోబోతున్నాడు. అయితే, ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఆత్మవిశ్వాసంతో పాటు గౌరవం ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచార దశలో ఉన్నాడు.. మార్చి 15వ తేదీ ఆదివారం తెల్లవారి జామున మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే మీన రాశిలో శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం ఇతర కొన్ని గ్రహాలు ఉన్నాయి. అయితే సూర్యుడు కూడా ప్రవేశించడం వల్ల ఎంతో శక్తివంతమైన రెండు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇందులో ముఖ్యమైన త్రిగ్రహీ యోగం రాజయోగం ఏర్పడుతుంది. అయితే, ఇది ఏర్పడడం వల్ల మొత్తం 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడినప్పటికీ.. కొన్ని రాశుల వారికి ఈ సమయంలో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి లాభాలు:
వృషభ రాశి
ముఖ్యంగా వృషభరాశి వారికి 11వ స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులు శరవేగంగా పూర్తయి అవకాశాలు కనిపిస్తున్నాయి.. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు కూడా లభించబోతోంది.
మిథున రాశి
మిధున రాశి వారికి సూర్యుడి ప్రభావంతో ఆదివారం నుంచి ఎంతో అనుకూలమైన సమయం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా వీరికి కార్యాలయాల్లో మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఉన్నత అధికారుల నుంచి అద్భుతమైన సపోర్టు లభించబోతోంది. కొత్త వ్యాపారాలు చేస్తున్నవారు ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా సూర్యుడి సంచారం ఎన్నో రకాల అద్భుతమైన అవకాశాల అందించబోతోంది. ముఖ్యంగా విదేశీ యాన మార్గం ఎంతో సులభతరం అవుతుంది. విద్యార్థులకు ఉన్నత చదువు కోసం విదేశాలు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అదృష్టం సహకరించి తక్కువ శ్రమతోనే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఎప్పటినుంచో కష్టపడుతున్న వ్యక్తులకు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులు సూర్యుడి సంచారంతో శత్రువులపై అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. వీరికి సమాజంలో గుర్తింపు లభించడమే కాకుండా.. ఆరోగ్య సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం లభించబోతోంది. ఎన్నో రకాల తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మంచి పరిష్కారం లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Heart-Wrenching Video Watch Here: కుక్క కాటు ఎంత ప్రమాదకరమైందో మరోసారి ఈ హృదయ విదారక ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో వెలుగు చూసిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం ఒక ఒక చిన్న నిర్లక్ష్యంతో పాటు పేదరికం కలిసి ఒక 17 ఏళ్ల యువకుడి ప్రాణాపాయస్థితికి తీసుకువచ్చింది. నాలుగు నెలల క్రితం జరిగిన కుక్క కాటుకు సరైన సమయంలో చికిత్స అందించకపోవడంతో.. ప్రస్తుతం ఆ బాలుడు రేబిస్ వ్యాధితో మరణంతో పోరాడుతున్నాడు.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
మీర్జాపూర్ కు చెందిన 17 ఏళ్ల కరణ్‌ను సుమారు నాలుగు నెలల క్రితం ఒక వీధి కుక్క కరిచింది.. ఆ సమయంలో గాయం తీవ్రతను గుర్తించిన తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. వైద్యులు సూచించిన యాంటీ-రేబీస్ వ్యాక్సిన్ (ARV) కోర్సును పూర్తిగా పూర్తి చేయించలేకపోయారు.. ఒకటి రెండు డోసులతోనే చికిత్సను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, ఈ సమయంలోనే బాలుడు అప్పుడప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారని గమనించారు కుటుంబ సభ్యులు..
కొద్ది రోజుల క్రితం వరకు సాధారణంగానే ఉన్న కరణ్ ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతింది.. శరీరంలోని ప్రవేశించిన రేవిస్ వైరస్ మెదడుపై కూడా ఊహించని ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టేసింది.. దీంతో ఆ బాలుడు అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.. ముఖ్యంగా కుక్కలాగా అరవడమే కాకుండా.. నోటి నుంచి నురగ రావడంతో పాటు నీటిని చూసి తీవ్రంగా భయపడటం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు..
Also Read: Kodada Oil Mafia: అర్ధరాత్రి అక్రమ దందా.. కోదాడ కేంద్రంగా ఆయిల్ మాఫియా.
పరిస్థితి విషమించడంతోనే వెంటనే అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కరణ్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని.. రేబిస్ చివరి దశకు చేరుకోవడంతో బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే, రేబిస్ అనేది చికిత్స లేని వ్యాధి అని.. కేవలం వ్యాక్సిన్ ద్వారా మాత్రమే దీని నివారించగలమని వైద్యులు స్పష్టం చేశారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలని.. వైద్యులు సూచించిన అన్ని డోసుల వ్యాక్సిన్లు తప్పనిసరిగా తీసుకోవాలని.. వారి కోరారు.. వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత ప్రాణాలను కాపాడుకోవడం అసాధ్యమని వైద్యులు హెచ్చరించారు..
Also Read: Kodada Oil Mafia: అర్ధరాత్రి అక్రమ దందా.. కోదాడ కేంద్రంగా ఆయిల్ మాఫియా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran Missile Attack On Israel Telugu News: మధ్యప్రచుర్యంలో యుద్ధమేఘాలు ఉగ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఒక్కసారిగా ఇజ్రాయిల్ పై భీకర దాడులకు తెరబడింది.. శనివారం తెల్లవారుజామున నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఒక 1,430 క్షిపణులను ఇజ్రాయిల్ భూభాగంపై ప్రయోగించి ఇరాన్ రాక్షసంగా విరుచుకుపడింది.. ఈ ఆకస్మిక దాడులతో ఇజ్రాయిల్ లోని ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఒక్కసారిగా దద్దరిల్లిపోయేలా క్షిపణుల వర్షం కురిపించింది. దీని దాటికి పెద్ద పెద్ద భవనాలన్నీ నేలమట్టమైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
ఇరాన్ ప్రధానంగా దక్షిణ ఇజ్రాయిల్‌లోని పోర్ట్ సిటీ అయిన ఈలట్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే వందలాదిక్ క్షిపణులు నగరం పై పడటంతో భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణనాష్టం కూడా సంభవించిందని తెలుస్తోంది. క్షిపణుల ధాటికి పలు పెద్ద భవనాలు కూడా కుప్పకూలగా.. వాహనాలు అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. నగరమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అనేక క్షిపణులను అడ్డుకున్నప్పటికీ.. దాడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని క్షీపనలు జనాభాసాల్లో పడ్డాయి.
ఈ దాడుల్లో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయిల్ జాతీయ అత్యవసర వైద్య సేవ విభాగం అధికారికంగా ప్రకటించింది. దాడులు జరిగిన వెంటనే పారామెడికల్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయని.. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సలు కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. దీని కారణంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు.
ఇరాన్ చేసిన ఈ దుశ్చర్యానికి ఇజ్రాయిల్ తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.. ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయిల్ రక్షణ ధనం ఇప్పటికే హెచ్చరించింది.. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలందరినీ బాంబు షెల్టర్లలోని ఉండాలని ఆదేశించింది. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరగడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా సహా పలు దేశాలు ఈ దాడిని ఖండించక యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
Also Read: Kodada Oil Mafia: అర్ధరాత్రి అక్రమ దందా.. కోదాడ కేంద్రంగా ఆయిల్ మాఫియా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG Gas Cylinder: కొన్ని దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణంతో ముడి చమురు మార్కెట్‌పై తీవ్ర సంక్షోభం ఎదురైంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై నీలి మేఘాలు కమ్ముకోవడంతో పెట్రోలియంతోపాటు గ్యాస్ కొరత వేధిస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సంక్షోభం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో కూడా గ్యాస్ కొరత ప్రభావం ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి కొరత లేదని ప్రకటించింది. గ్యాస్ సరఫరాపై కొరత లేదని.. కావాల్సిన గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతపై సమీక్ష చేస్తున్నామని.. ఎలాంటి పుకార్లు నమ్మొద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.
Also Read: Iftar Party: 'చోటా యోగి' రేవంత్ రెడ్డి.. తెలంగాణలో బుల్డోజర్ సర్కార్: హరీశ్ రావు
ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పరిస్థితి నియంత్రణలో ఉందని.. కొన్ని సోషల్ మీడియాల్లో వినియోగదారులను తప్పుదారి పట్టించేవారు/ నిరాధారమైన, తగినంత ఇంధనం లేదనే వదంతులు వాస్తవం కాదని ప్రభుత్వం ప్రకటించింది. సోషల్ మీడియా పుకార్లు కారణంగా దేశీయ రీఫిల్ బుకింగ్స్ 15 శాతం పెరిగిందని.. సరఫరా ఎఫ్‌ఐఎఫ్‌ఓ (FIFO) ఆధారంగా జరుగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. దుర్వినియోగం నిరోధించడానికి ఓటీపీ ఆధారిత డెలివరీ ప్రమాణీకరణ అమలు చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. పెండింగ్ బుకింగ్స్ పర్యవేక్షణ డిస్ట్రిబ్యూటర్-వారీగా, మార్కెట్ వారీగా, జిల్లా వారీగా, సేల్స్ ఏరియా వారీగా, ప్రాంతం-వారీగా ఉందని వెల్లడించింది. గృహ అవసరాలకు ప్రాధాన్యమివ్వడానికి పరిశ్రమలకు బల్క్ ఎల్‌పీజీ సరఫరా నిలిచిందని.. వాణిజ్య (కాని దేశీయ) సరఫరా పరిమితం చేసినట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈనెల 12వ తేదీ వరకు మొత్తం ఎల్‌పీజీ స్టాక్ లభ్యత 15,880 mt అంటే 3.92 రోజులు సరిపోతుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమైన విభాగాలు అంటే ఆసుపత్రులు, హాస్టల్స్, ప్రభుత్వ సేవలు వాణిజ్య సరఫరా కోసం ప్రాధాన్యమిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
Also Read: Snake Poison: పాము కాటేసినా విద్యార్థికి పునర్జన్మ.. నాగుపాము విషం మింగిన టీచర్
ఎల్పీజీ కనెక్షన్లు
ఏపీలో ఎల్పీజీ కనెక్షన్లు మొత్తం: 161.19 లక్షలు
ఇండియన్ గ్యాస్ (IOCL): 56.86 లక్షలు (20.79 లక్షల డబుల్ బాటిల్ + 36.07 లక్షల సింగిల్ బాటిల్)
హెచ్‌పీ గ్యాస్ (HPCL): 74.11 లక్షలు (28.75 లక్షల డబుల్ బాటిల్ + 45.36 లక్షల సింగిల్ బాటిల్)
భారత్ గ్యాస్ (BPCL): 30.22 లక్షలు (11.13 లక్షల డబుల్ బాటిల్ + 19.09 లక్షల సింగిల్ బాటిల్)
Also Read: Snake Frog Dance: అవ్వ నిద్రిస్తుండగా.. గేటు బయట కప్ప, పాము సయ్యాట
ఏపీ ప్రభుత్వం సమీక్ష
గ్యాస్ కొరత, సరఫరాపై ఏపీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. దీనికోసం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు, ఓంఎస్‌సీ ప్రతినిధుల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు, తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తోంది. సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి.. అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాస్తవాన్ని తెలియజేయడానికి ఎప్పటి కప్పుడు పత్రికా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పౌర సరఫరాలు, వ్యవసాయం, పరిశ్రమలు,మౌలిక సదుపాయాలు, ఆర్‌టీజీఎస్ కార్యదర్శులతో ఏర్పాటైన కమిటీ వంట గ్యాస్ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మంత్రుల బృందం తాజా పరిణామాలు పరిస్థితులపై సమీక్షించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తోంది. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్ తదితర విభాగాల అధికారులతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసి ఎల్పీజీ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేయిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి