Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500004
Indian Rupee Vs Pakistan Rupee: భారత్‌లో లక్ష రూపాయలు పాకిస్తాన్‌లో ఎంత? అంతటి డబ్బుతో ఏవేవి కొనవచ్చ...
HDHarish Darla
Mar 28, 2026 09:04:24
Hyderabad, Telangana

1 Lakh Rupees In Pakistani Currency: మరెన్నడూ లేనంతగా ఇప్పుడు రూపాయి విలువ దారుణంగా పతనమైంది. దీంతో పాటు పాకిస్తానీ రూపాయి కూడా దారుణంగా దిగజారిపోయింది. అయితే మునుపెన్నడూ లేనంతగా పాకిస్తానీ రూపాయి బలహీన పడడం వల్ల 1 అమెరికన్ డాలర్ విలువ ఇప్పుడు రూ. 94 (ఇండియన్ కరెన్సీ) ఉంటే పాకిస్తాన్‍లో రూ.280 సమానంగా ఉంది.

భారతదేశం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలను పోల్చి చూస్తే, వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2026 అంచనాల ప్రకారం.. భారతదేశ GDP 4.51 ట్రిలియన్ డాలర్లు కాగా, పాకిస్తాన్ GDP కేవలం 0.41 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే సుమారు 11 రెట్లు పెద్దది. అధిక ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, భారీ విదేశీ రుణం కారణంగా పాకిస్తానీ రూపాయి బలహీనపడింది.

పాకిస్తాన్‌లో ఒక లక్ష భారతీయ రూపాయలు 2,95,000 పాకిస్తానీ రూపాయలకు సమానం. నేటి కరెన్సీ మార్కెట్‌లో, ఒక భారతీయ రూపాయి సుమారుగా 2.95 పాకిస్తానీ రూపాయలకు సమానం. ప్రస్తుత మారకపు రేటు ప్రకారం, 100,000 భారతీయ రూపాయలను, పాకిస్తానీ కరెన్సీలోకి మార్చితే సరిగ్గా 295,000 పాకిస్తానీ రూపాయలు (PKR) అవుతుంది. మార్చి 28, 2026 నాటికి 1 ఇండియన్ రూపీ 1 INR = 2.9485 నుండి 2.95 పాకిస్తానీ రూపాయి-PKR వరకు హెచ్చుతగ్గులకు లోనవుతుంది.

పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుండి పలుమార్లు ఆర్థిక సహాయం పొందడం, దాని కరెన్సీలో నిరంతర క్షీణతకు దారితీసింది. భారతదేశంలో, స్థిరమైన వృద్ధి, విదేశీ పెట్టుబడులు, పటిష్టమైన రిజర్వ్ బ్యాంక్ విధానాలు రూపాయికి మద్దతునిస్తున్నాయి.

1 అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో 1 యూఎస్‌డీ సుమారుగా 94 భారతీయ రూపాయలు లేదా 280 పాకిస్తానీ రూపాయలకు సమానంగా ఉంది. దీని అర్థం పాకిస్తానీ ఆర్థిక వ్యవస్థ డాలర్ పట్ల మరింత సున్నితంగా ఉంది. ఇది భారత రూపాయి-పాకిస్తానీ రూపాయి మారకపు రేటును నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ రేటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం, వలసదారుల పంపకాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

భారతీయ పర్యాటకులు లేదా వ్యాపారవేత్తలు పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు వారి పెట్టుబడికి ఎక్కువ విలువ లభిస్తుంది. కానీ పాకిస్తానీ పౌరులు భారతదేశంలో ఖర్చు చేసినప్పుడు ఎక్కువ డబ్బును కోల్పోతారు.

Also Read: RCB Vs SRH Rain Prediction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..RCB Vs SRH మ్యాచ్ రద్దు అవుతుందా? షాకిచ్చిన వరుణుడు!

Also Read: PMSYM Monthly Pension: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్..60 ఏళ్లు దాటితే నెలకు రూ.3,000 పెన్షన్..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 28, 2026 10:06:21
Hyderabad, Telangana:

Gold Bag Recovery: కోటిన్నరకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ.. ప్రజల భద్రతను పోలీసులు పకడ్బందీగా చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన కేసును.. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేసి అత్యంత వేగంగా పరిష్కారం చూపుతున్నారు. కొన్ని కేసులు ఇలా ఫిర్యాదు చేయగానే ఎఫైఆర్‌ అయ్యేలోపు పోలీసులు పరిష్కారం చూపుతున్నారు. తాజాగా ఓ మహిళా బంగారు ఆభరణాలు పోగొట్టుకుంటే అర్ధ గంటల్లోనే ఛేదించారు. ఈ సంఘటన లక్డీకాపూల్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: AP High Court Jobs: ఏపీ నిరుద్యోగులకు పండుగ.. హైకోర్టులో 300 ప్రభుత్వ ఉద్యోగాలు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిమేగల ఈ నెల 27వ తేదీన రాత్రి లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ బస్టాప్ వద్ద రాపిడో ఆటోలో వచ్చింది. అయితే ఆ సమయంలో తన హ్యాండ్‌బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయింది. ఆ బ్యాగ్‌లో సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు గాజులు, కమ్మలతో రూ.30 వేల నగదు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. మరచిపోయిన విషయం గుర్తుచేసుకునేలోపు ఆటో తుర్రుమంది. ఏం చేయాలో దిక్కుతోచక ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

Also Read: Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు గల్లంతు.. పీఆర్‌సీ కమిటీ గడువు మళ్లీ పొడిగింపు

బాధితురాలి ఫిర్యాదుపై సైఫాబాద్ సీఐ సీతయ్య తక్షణమే స్పందించి క్రైమ్ టీమ్‌ను రంగంలోకి దించారు. సాంకేతిక సమాచారంతో ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. చాదర్‌ఘాట్ ప్రాంతంలో ఆటోను గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాదర్‌ఘాట్‌ పోలీసుల సహాయంతో ఆటోలో హ్యాండ్‌బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్యాగ్‌ స్టేషన్‌కు చేరడంతో బాధితురాలు మణిమేగలకు అప్పగించారు. బ్యాగులోని నగదు, ఆభరణాలను సురక్షితంగా అప్పగించడంతో బాధితురాలు హైదరాబాద్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. 

హైదరాబాద్ మహానగరంలో తాను పోగొట్టుకున్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును సైఫాబాద్ పోలీసులు కేవలం 30 నిమిషాల్లోనే రికవరీ చేసి అప్పగించడంతో ఆమె ఆనందంలో ఉంది. ఇలాంటి కేసులు హైదరాబాద్‌లో తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పోలీసుల పనితీరుతో అత్యంత వేగంగా కేసులు పరిష్కారమవుతున్నాయి. కొన్ని కేసులు ఎఫ్‌ఐఆర్‌ అయ్యేలోపు కూడా పరిష్కారమవుతుండడం గమనార్హం. నేరం జరిగిన వెంటనే విచారణ, దర్యాప్తు ప్రారంభిస్తే అంతే వేగంగా కేసు పరిష్కారమవుతుందని హైదరాబాద్‌ పోలీసులు నమ్ముతున్నారు. ఆ నమ్మకమే హైదరాబాద్‌ పోలీసుల సక్సెస్‌ రేటు పెంచుతోంది. 

Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్‌ తరుణ్‌ మాజీ లవర్‌ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

784
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 28, 2026 09:41:14
Hyderabad, Telangana:

Vivo T5 Pro Launch Date India Telugu: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్‌లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.. తన పాపులర్ T సిరీస్‌లో భాగంగా వివో టి 5 ప్రో (Vivo T5 Pro) పేరుతో త్వరలోనే సరికొత్త మొబైల్ ను విడుదల చేయబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంసంగ్‌తో పాటు వన్ ప్లస్, రెడ్‌మీ దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిస్తూ..ఎన్నో ఊహకందని ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వివో T5 ప్రో స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బ్యాటరీ.. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో కేవలం 6,000mAh బ్యాటరీని చూసి ఉంటాం.. కానీ ఇందులో ఎంతో శక్తివంతమైన 9,020mAh భారీ బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం. అతి తక్కువ సమయంలోనే ఈ భారీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నాన్ స్టాప్ బ్యాటరీ లైఫ్ నందిస్తుంది.. అదేవిధంగా ఇందులో ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్ ఉండబోతున్నాయి.

ముఖ్యంగా ఈ వివో T5 ప్రోలో ఎంతో ప్రత్యేకమైన 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీడియో స్ట్రీమింగ్ ప్రియులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. దీంతోపాటు ఇందులో కంపెనీ ప్రత్యేకమైన ప్రాసెస్ కూడా అందించింది. 

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

ఈ వివో T5 ప్రో మొబైల్‌కు సంబంధించిన ప్రాసెస్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన Snapdragon 7s Gen 4 చిప్‌సెట్‌పై తయారుచేసినట్లు తెలుస్తోంది. హై ఎండ్ గేమ్లను సైతం ఎంతో సునాయాసంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ ప్రియులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగం వివరాల్లోకి వెళితే.. అద్భుతమైన Sony IMX882 ప్రైమరీ సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలా ప్రత్యేకమైన 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ లభించడం విశేషం. అంతేకాకుండా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కాబోతోంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం విడుదల చేసిన వివో T4 ప్రోకు సక్సెసర్‌గా.. అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని ధర గత మోడల్ కంటే చాలా ఎక్కువ రేటే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ రూ.35 వేలలో వేరియంటును బట్టి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి మంచి బ్యాటరీ తో పాటు కెమెరా సెటప్ ను కలిగిన మొబైల్ ని కొనుగోలు చేయాలనుకునేవారు ఇంకొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

943
comment0
Report
IPInamdar Paresh
Mar 28, 2026 09:26:06
Hyderabad, Telangana:

PM Modi inaugurates Noida International Airport in Jewar: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయేల్ ల యుద్దంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఎల్పీజీ కొరత మరోవైపు చమురు సమస్యలను ఎదుర్కొంటుంది. హర్మూజ్ జల సంధి నుంచి నౌకలపై ఇరాన్ కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతిస్తుంది. ఈ క్రమంలో భారత్ లో లాక్ డౌన్ విధిస్తున్నారని వదంతులు వ్యాపించాయి. దీనిపై కేంద్రమంత్రి రంగంలోకి దిగి మరీ లాక్ డౌన్ ప్రకటించే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. అలాంటి వాటిని నమ్మకూడదన్నారు. అంతేకాకుండా భారత్ అన్నిరకాలుగా కొరతను ఎదుర్కొవడానికి సమర్థవంతంగా ముందుకు వెళ్తుందన్నారు. ఆహరం, ఇంధనం, ఎల్పీజీ కొరతపై ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ఇటీవల ఎన్ని కలు జరుగుతున్న రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా భేటీ అయ్యారు.

ఎల్జీజీ,  నిత్యవసర ధరల పెరుగుదలపై చర్చించారు. అంతేకాకుండా సరిహద్దురాష్ట్రాలు అప్రమత్తంగా  ఉండాలన్నారు. ఫెక్ ప్రచారాలను నమ్మకూడదన్నారు.  ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. డబులు ఇంజీన్ సర్కారు డెవలప్ మెంట్ తో రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించిందని మోదీ అన్నారు. 

 నోయిడాలోని జేవన్ ప్రాంతంలో పీపీపీ పద్దతిలో రూ. 11,200 కోట్లతో  ఈ విమానశ్రయంను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అధునాత నావిగేషన్ సిస్టమ్స్ సాయంతో, 3,900 మీటర్ల పొడవైన ఈ విమానాశ్రయ రన్ వే పై అతి పెద్ద విమానాలు కూడా రాకపోకలు సాగిస్తాయని అన్నారు. సరకు రవాణాకు కార్గో లాజిస్టిక్ జోన్లను అనుసంధానం చేస్తూ మల్టీ మోడల్ కార్గో హబ్ ను నిర్మించినట్లు మోదీ తెలిపారు. గతంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం ఫైళ్లకే పరిమితమైందని, అభివృద్ధి పట్ల కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

డబుల్ ఇంజీన్ సర్కారుతో యూపీ మరింతగా ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికే మౌళిక వసతుల కోసం రూ. 17 లక్షల కోట్లు ఖర్చుచేశామన్నారు. దేశంలో ఉన్న రైల్వే లైన్లలో 40 వేల కి. మీ. మేర విద్యుదీకరణ చేశామన్నారు.

Read more: Live in relation ship: పెళ్లి తర్వాత మరోకరితో లివింగ్ రిలేషన్ తప్పు కాదు.. అలహబాద్ హైకోర్టు సెన్సెషనల్ తీర్పు..

అలాగే ఎన్డీయే హయాంలో పోర్టుల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఇలాంటి కష్టసమయంలో అపోసిషన్ పార్టీలు దుష్ట రాజకీయాలు చేయోద్దన్నారు.  కొన్ని పార్టీలు పనిగట్టుకుని కేంద్రంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరికి ప్రజలు సరైన విధంగా బుద్ది చెప్తారని మాట్లాడారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

1030
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 28, 2026 09:24:25
Hyderabad, Telangana:

Iphone 200mp Camera Leak News: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ సమస్త యాపిల్.. భవిష్యత్తులో రాబోయే ఐఫోన్ మోడల్ కోసం ఒక భారీ అప్‌గ్రేడ్‌ను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్‌తో పాటు కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టిన యాపిల్.. ఇప్పుడు మెగాపిక్సెల్స్ పెంచడానికి దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం.. యాపిల్ సంస్థ ప్రస్తుతం 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను పరీక్షిస్తోందట.. ఒకవేళ సక్సెస్ అయితే రాబోయే యాపిల్ స్మార్ట్‌ఫోన్స్ అన్ని అద్భుతమైన కెమెరా సెటప్‌తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. యాపిల్ కంపెనీ భారీ సెన్సార్ ను పరీక్షిస్తుందట.. ఇదే తరహా సెన్సార్ ను ఒప్పో త్వరలో విడుదల విడుదల చేయబోయే Find X9 Ultraలో కూడా వినియోగించినట్లు వార్తలు వస్తున్నాయి. యాపిల్ సాధారణంగా మెగాపిక్సెల్స్ సంఖ్య కంటే పిక్చర్ క్వాలిటీకి ఎక్కువగా ప్రాధాన్యతిస్తూ ఉంటుంది.. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లు 200MP కెమెరాలతో మార్కెట్లో సంచలనం సృష్టించడం వల్ల యాపిల్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది..

ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో మాత్రమే ఉంది.. కాబట్టి ఇది ఏ మోడల్‌లో వస్తుందని అంశంపై ఇంకా స్పష్టత లేదు.. వచ్చి ఏడాది రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌కు సంబంధించిన లీకులు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.. వాటిలో ఈ 200MP కెమెరా ప్రస్తావన లేకపోయినప్పటికీ.. కొంతమంది టెక్ నిపుణులు మాత్రం ఇందులోని రాబోతున్నట్లు చెబుతున్నారు. ఇక ఐఫోన్ 19 లేదా ఆ తర్వాత రాబోయే మోడల్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ భారీ సెన్సార్‌ను కేవలం ప్రైమరీ  కెమెరాకు మాత్రమే పరిమితం చేయాలని యాపిల్ భావిస్తుందట..

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

ఇప్పటికే యాపిల్ తన 48MP కెమెరా సెన్సార్‌తోనే అత్యుత్తమైన ఫోటోగ్రఫీని అందిస్తూ వస్తోంది.. ఒకవేళ 200MP సెన్సార్‌ కలిగిన కెమెరా ఫీచర్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తే.. ఐఫోన్ ఫోటోగ్రఫీ స్థాయి మరో స్థాయికి చేరే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లో కూడా అద్భుతమైన చిత్రాలను తీయడానికి.. 8k వీడియో రికార్డింగ్ సపోర్టును మరింత మెరుగుపరచడానికి ఈ సెన్సార్ ఎంతో సహాయపడుతుందని తెలుస్తోంది. అయితే ఈ కెమెరా సెన్సార్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే యాపిల్ కంపెనీ విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది..

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1042
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 28, 2026 08:30:54
Hyderabad, Telangana:

 First Night Video Watch Here: నేటి ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి పరాకాష్టంకు చేరుతోంది. వ్యూస్ కోసం, లైకుల కోసం ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో కొందరు యువతీ యువకులు విచిత్రంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. తాజాగా ఒక నూతన వధూవరులు తమ అత్యంత వ్యక్తిగతమైన శోభనం వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఆనందంగా గడపాల్సిన ఘటనలు కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేంటని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు..

సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెరలు కొడుతున్న ఈ వీడియోలో.. ఒక కొత్త జంట పెళ్లి బట్టలతో కనిపిస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. తమ మొదటి రాత్రికి సిద్ధమవుతున్నట్లు వారి వీడియోల్లో పేర్కొనడం మీరు చూసి ఉంటారు. నవ వరుడు తన భార్య జడలో ఉన్న పువ్వులను ఒక్కొక్కటిగా తీస్తూ కెమెరాకు ఫోజులు ఇవ్వడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. బెడ్ రూమ్ అలంకరణ, ఆ సమయానికి సంబంధించిన దృశ్యాలను వారు రీల్ రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

సాధారణంగా హిందూ సాంప్రదాయంలో మొదటి రాత్రి అత్యంత పవిత్రంతో పాటు చాలా సీక్రెట్ అయినదిగా భావిస్తూ ఉంటారు.. అది ఒక జంట జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన క్షణం.. కానీ ఈ జంట ఆ పవిత్రతను పక్కనపెట్టి.. కేవలం సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తమ ప్రైవసీని పణంగా పెట్టడంపై సోషల్ మీడియా వినియోగదారులు ఊహించని స్థాయిలో మండిపడుతున్నారు. సాంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోండి.. లైకుల కోసం ఇంత దిగజారాల అంటూ సోషల్ మీడియా వినియోగదారులు ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు..

 
 
 
 
 

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులతోపాటు ఇతర మత పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం.. అటువంటి బంధంలో మొదటి అడుగున ఇలా బహిరంగంగా ప్రదర్శించడం.. సాంస్కృతికి విరుద్ధమని కొందరు కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. ఇది డిజిటల్ పిచ్చికి పరాకాష్టం.. రేపు తమ పిల్లల పుట్టుకను కూడా ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేస్తారేమో అని.. అంటూ మరికొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. ఏది ఏమైనా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్‌గా మారింది.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1019
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 28, 2026 08:19:11
Hyderabad, Telangana:

Delhi Second Hand Car And Bikes News: సొంతంగా ఒక కారు లేదా బైక్ కొనుగోలు చేయాలన్నది సామాన్యుడి చిరకాల కోరిక.. అయితే రోజురోజుకు పెరుగుతున్న వాహనాల ధరలు చూస్తుంటే ఆ కల నెరవేయడం చాలా కష్టంగా మారుతూ వస్తోంది. కొత్త వాహనాలు కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది.. అయితే మీరు ఇకనుంచి వాటికోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కొన్ని సీక్రెట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి.. ఇక్కడ బైకులు కేవలం రూ.10 వేల నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి.. అంతేకాకుండా లగ్జరీ కార్లు సైతం అత్యంత చీప్ ధరలకే లభించడం విశేషం..

ఢిల్లీలోని కోరల్ భాగ్ సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పేరు ఉంది. ఇక్కడ సాధారణంగా స్కూటర్ల నుంచి అత్యంత ఖరీదైన సూపర్ బైకుల వరకు అన్ని ఎంతో చీప్ ధరల్లో లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడి విశేషమేంటంటే.. ఇక్కడ బైక్ ధర రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుంది. మీరు బేరమాడితే.. మంచి కండిషన్లో ఉన్న బైకులను చాలా తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్ లు కొనుగోలు చేయాలనుకునే వారు ఇక్కడ అత్యంత తక్కువ ధరలు మంచి డీల్స్లో కొనుగోలు చేయొచ్చు..

ఇక కార్ల విషయానికొస్తే.. ఢిల్లీలోని మోతీ నగర్ మార్కెట్ చవక కార్లకు అత్యంత గుర్తింపు కలిగింది.. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు కేవలం 50,000 నుంచి ప్రారంభమవుతాయి. లగ్జరీ కార్లు సైతం సగం కంటే తక్కువ ధరలకు ఇక్కడ లభించడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఇక్కడికి వచ్చి తమ బడ్జెట్కు తగినట్లుగా వాహనాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. వీటితో పాటు వికాస్ పూరి, లజ్పత్ నగర్ తో పాటు సరోజినీ నగర్ సమీపంలో కూడా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లు భారీగా ఉండడం విశేషం..

అయితే, ఈ మార్కెట్లలో కార్లు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా.. తొందరపడకుండా అన్ని చెక్ చేసుకుని కొనుగోలు చేయాల్సి ఉంటుందని కొంతమంది ఆటోమొబైల్ నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వాహనానికి సంబంధించిన ఆర్సితో పాటు ఇన్సూరెన్స్, కాలుష్యానికి సంబంధించిన సర్టిఫికెట్స్ సక్రమంగా ఉన్నాయో లేదో తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంజన్ కండిషన్ తో పాటు టైర్లు, బ్యాటరీ వంటివి నమ్మకమైన మెకానిక్ తో చెక్ చేయించుకుంటే చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వాహనాలపై ఎలాంటి కేసులు లేదా చలాన్లు ఉన్నాయా అనే అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని కార్లు కొనుగోలు చేయడం మంచిది.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1039
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 28, 2026 08:03:58
Hyderabad, Telangana:

Karimnagar Liquor Telugu News: మందుబాబులు సాధారణంగా బ్రాండ్‌ను చూసి మురిసిపోతూ ఉంటారు.. కానీ కరీంనగర్ జిల్లాలోని ఓ మందు బాబుకి ఎదురైన అనుభవం చూస్తే అసలు మనం తాగేది ఏ బ్రాండ్? అన్న అనుమానం తప్పకుండా కలుగుతుంది. శంకరపట్నం మండలం కేశవపట్నం లోని వైన్ షాపులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక కంపెనీ సీసాకు మరో కంపెనీ స్టిక్కర్ను అంటించి విక్రయించడంతో ఆ మందు బాబు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు..

కేశవపట్నంలోని ఓ వైన్ షాప్ కు వెళ్లిన ఒక వ్యక్తి తనకి ఇష్టమైన కింగ్ ఫిషర్ లైట్ బీర్ను కొనుక్కొని చేశాడు.. చేతిలోకి తీసుకొని చూస్తే.. అతనికి గందరగోళం మొదలైంది. అలాగే ఆ సీసన్ గమనించగా.. అది కింగ్ ఫిషర్ సీసానే కాదు.. అదొక ట్యూబోర్గ్ కంపెనీకి చెందిన సీసా అని తెలిసి వచ్చింది.. కానీ దానిపై మాత్రం కింగ్ ఫిషర్ స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. ఇది చూసిన సదరు వినియోగదారుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు..

మద్యం వ్యాపారులు ఇంత బహిరంగంగా మోసాలకు పాల్పడుతున్న.. నాణ్యతలేని లేదా మిస్సింగ్ చేసిన మద్యాన్ని అంటగడుతున్న పట్టించుకునే నాధుడే లేడని స్థానిక మందుబాబులు మండిపడుతున్నారు.. ఒక బ్రాండ్ సీసాకు... మరో బ్రాండ్ స్టిక్కర్ వేసి అమ్ముతున్నారంటే లోపల ఉన్న మద్యం అసలు ఏ కంపెనీదో? అది తాగితే ప్రాణాలకు గ్యారెంటీ ఉంటుందో లేదో ఎవరికి తెలుసు? అని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వైన్ షాప్ యాజమాన్యం లాభాల కోసం ఇలాంటి చేష్టాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు..

Also Read:​ Dhurandhar The Revenge: ‘దురందర్ 2’లో ప్రధాని మోడీ.. దావూద్ లదే రోల్..

జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు కేవలం మామూళ్ల మత్తులో మునిగిపోయి.. క్షేత్రస్థాయిలో తనిఖీలను గాలికి వదిలేసారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.. నిబంధనల ప్రకారం ప్రతి బాటిల్ స్కాన్ చేసి విక్రయించాలి.. కానీ ఇలాంటి మిక్స్డ్ బాటిల్లు మార్కెట్లోకి ఎలా వస్తున్నాయని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి.. కేశవపట్నం లోని సదరు వైన్ షాపుపై విచారణ జరిపి కఠిన.. అలాగే జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని డిమాండ్లు చేస్తున్నారు..

Also Read:​ Dhurandhar The Revenge: ‘దురందర్ 2’లో ప్రధాని మోడీ.. దావూద్ లదే రోల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

1099
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 27, 2026 17:06:58
Hyderabad, Telangana:

BRS Party MLAs Boycott Sports Meet: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో.. ఆరు గ్యారంటీలు అమలు చేయక విఫలమైన సమయంలో క్రీడా పోటీలు నిర్వహించడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మరోసారి తప్పుబట్టారు. ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను తమ బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. శాసనసభ్యుల క్రీడా పోటీల్లో బీఆర్ఎస్ సభ్యులు పాల్గొనరని తెలిపారు. ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉండగా క్రీడా పోటీలు అవసరమా? అని ప్రశ్నించారు.

Also Read: Tirumala Temple: తిరుమల ఆలయంలో నేత్రపర్వంగా శ్రీరామనవమి వేడుకలు

హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ - 4 ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్‌ విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అనేక సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలలో పాల్గొని సమయం వృథా చేయడం తగదని స్పష్టం చేశారు.

Also Read: Raja Singh: ఇళ్ల మధ్య ఇరుక్కున్న రథం.. నిలిచిపోయిన రాజాసింగ్‌ శోభయాత్ర

మేము ఎమ్మెల్యేలుగా ఈ క్రీడా పోటీలలో పాల్గొనబోమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని.. అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కనబెట్టి.. అర్థాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం ప్రజలు సమర్థించరని పేర్కొన్నారు. ఇది మంచి పరిణామం కాదని ప్రకటించారు. ప్రభుత్వం కూడా ఈ క్రీడా పోటీలపై పునరాలోచన చేయాలని మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Also Read: Kavitha Party: రాజకీయ పార్టీపై కవిత కీలక ప్రకటన.. ఏప్రిల్‌ 25న పార్టీ పేరు వెల్లడి

'మేము క్రీడలు ఆడి ఒలింపిక్స్‌కి వెళ్లేది ఏమీ లేదు. క్రీడలను ప్రోత్సహించాలంటే పిల్లలకు అవకాశాలు కల్పించి.. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆటలు ఆడించడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎవరైనా క్రీడల్లో పాల్గొనాలనుకుంటే ముందుగా ప్రజా సమస్యలపై చర్చలు పూర్తిచేసి.. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత రెండు రోజులపాటు క్రీడలు నిర్వహించుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం హాస్యాస్పదమని చెప్పారు. ఈ పరిణామాలు చూస్తే ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Also Read: AP High Court Jobs: ఏపీ నిరుద్యోగులకు పండుగ.. హైకోర్టులో 300 ప్రభుత్వ ఉద్యోగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1060
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 27, 2026 16:05:42
Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Sri Rama Navami: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీవారిని శ్రీరాముడిగా భావించే భక్తుల కోసం మలయప్ప స్వామి తన పరమ భక్తుడైన హనుమంతుడిపై కొలువై మాడవీధుల్లో విహరించారు. భక్తజన జయ జయ ధ్వానాల మధ్య సాగాయి. ఈ వాహన సేవకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

Also Read: Raja Singh: ఇళ్ల మధ్య ఇరుక్కున్న రథం.. నిలిచిపోయిన రాజాసింగ్‌ శోభయాత్ర

శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద అర్చకులు శ్రీరామనవమి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామి శ్రీరాముడి రూపంలో ధనుర్భాణాలను ధరించి హనుమంత వాహనాన్ని అధిరోహించారు. తన హృదయంలో కొలువైన సీతారామచంద్రుడిని భుజాలపై మోస్తున్నట్లుగా హనుమంతుడు కనిపించారు. స్వామి వారు అభయప్రదాతగా భక్తులకు దర్శనమిచ్చారు.

Also Read: Kavitha Party: రాజకీయ పార్టీపై కవిత కీలక ప్రకటన.. ఏప్రిల్‌ 25న పార్టీ పేరు వెల్లడి

తిరుమల నాలుగు మాడ వీధుల్లో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలు, గోవింద నామ స్మరణల మధ్య ఈ ఊరేగింపు సాగింది. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాహన సేవల్లో హనుమంత వాహనం ఒకటి. త్రేతాయుగంలో రాముడికి సేవ చేసిన హనుమంతుడు, కలియుగంలోనూ తన భక్తిని చాటుకుంటున్నట్లుగా ఈ దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో మలయప్ప స్వామిని హనుమంతుడిపై చూడటం భక్తులు తమ అదృష్టంగా భావిస్తూ.. రాముడి రూపంలో స్వామి వారు ఎంతో ప్రసన్నం చేసుకున్నారు. గోవింద నామాలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. వాహన సేవ అనంతరం స్వామి వారికి విశేష హారతులు సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పులకించిపోయారు. ఈ వేడుకతో తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి.

Also Read: AP High Court Jobs: ఏపీ నిరుద్యోగులకు పండుగ.. హైకోర్టులో 300 ప్రభుత్వ ఉద్యోగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1094
comment0
Report
HDHarish Darla
Mar 27, 2026 16:00:06
Bengaluru, Karnataka:

RCB Vs SRH Rain Prediction News: మరో 24 గంటల్లో క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ‌(ఐపీఎల్) ఘనంగా ప్రారంభం కానుంది. శనివారం అనగా మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్‌ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తలపడనుంది. చాలా రోజుల తర్వాత చిన్నస్వామి స్టేడియంపై ఉన్న నిషేధం తొలగిపోవడంతో ఈసారి సొంత గడ్డపై ఆర్సీబీ ఆడనుంది. 

ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కూడా సిద్ధమైంది. గత కొన్ని మ్యాచ్‌లకు ఆ స్టేడియంపై నిషేధం విధించడంతో ఆర్సీబీ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో హోమ్ టీమ్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచ్‌లను నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతినిచ్చింది.  

ఇందులో భాగంగానే ఐపీఎల్ 2026లో భాగంగా తొలిమ్యాచ్‌ ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరగనుంది. గత సీజన్‌ (ఐపీఎల్ 2025)లో ఈ స్టేడియంలో ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 2 గెలిచి, మూడింటిలో ఓడింది. ఈ స్టేడియంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద తిరుగులేని రికార్డు ఉంది. 106 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఏకంగా 3618 పరుగులు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్..
మార్చి 28న సాయంత్రం జరగబోయే ఐపీఎల్ తొలి మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయమై బెంగళూరు వాతావరణ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. రేపు అనగా శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందట. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం కురిసే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వర్షం వచ్చినా మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. కనీసం ఓవర్లు తగ్గించి మ్యాచ్‌ను పూర్తిచేసే అవకాశం ఉంది.

మార్చి 28 శనివారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే అంతకుముందే 7:00 గంటలకు అంపైర్లు టాస్ వేస్తారు. అయితే ఈసారి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలు ఉండబోవని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను చూడవచ్చు. మరోవైపు మొబైల్ వినియోగదారులు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు.

Also Read: PMSYM Monthly Pension: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్..60 ఏళ్లు దాటితే నెలకు రూ.3,000 పెన్షన్..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Also Read: Jharkhand Exam Bribe: ఎగ్జామ్ 'పాస్' చేయాలని టీచర్‌కు విద్యార్థి లంచం..డైరెక్ట్‌గా ఆన్సర్ షీట్‌లో డబ్బు పెట్టి..చివరికి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1087
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 27, 2026 13:34:06
Hyderabad, Telangana:

Raja Singh Shobha Yatra: శ్రీరామనవమి అంటే దేశవ్యాప్తంగా గుర్తొచ్చేది హైదరాబాద్‌లో జరిగే శోభయాత్ర. ఎంతో ఉత్సాహంగా.. భక్తి ప్రపత్తులతో సాగే శ్రీరామనవమి శోభయాత్రకు అనుకోని పరిణామం ఎదురైంది. ఊహించని విధంగా శోభయాత్రకు అడ్డంకి ఏర్పడింది. శోభయాత్రకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్‌ రథం రెండు ఇళ్ల మధ్య ఇరుక్కుపోయింది. ఈ కారణంతో హైదరాబాద్‌లో జరుగుతున్న శ్రీరామనవమి శోభయాత్ర మరింత ఆలస్యం కానుంది.

Also Read: Kavitha Party: రాజకీయ పార్టీపై కవిత కీలక ప్రకటన.. ఏప్రిల్‌ 25న పార్టీ పేరు వెల్లడి

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్నమంగళ్‌హట్‌లో ఎమ్మెల్యే రాజా సింగ్‌ నివసిస్తుంటారు. హిందూవులకు ప్రతినిధిగా ఉన్న రాజాసింగ్‌ చేపట్టే శోభయాత్రకు అత్యంత విశిష్టంగా మారింది. శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం రాజాసింగ్‌ తన శోభయాత్రున ప్రారంభించాడు. తన రథంపై మంగళ్‌హట్‌లో శోభయాత్ర ప్రారంభించగా.. కొద్దిసేపటికే రథ ఇళ్ల మధ్య ఇరుక్కుపోయింది. ప్రధాన విగ్రహం ఉన్న వాహనానికి ఒక ఇంటి పిల్లర్ అడ్డుగా నిలిచింది.

Also Read: AP High Court Jobs: ఏపీ నిరుద్యోగులకు పండుగ.. హైకోర్టులో 300 ప్రభుత్వ ఉద్యోగాలు

ఇటీవల నిర్మాణం చేపట్టిన ఇంటి పిల్లర్ రావడంతో వాహనం వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. దానిని తొలగించేందుకు రెండు గంటలకు పైగా శోభాయాత్ర నిర్వాహకులు శ్రమించారు. రెండు బిల్డింగ్‌ల మధ్య శోభాయాత్ర రథం ఇరుక్కుపోవడంతో హిందూవులు ఆందోళన చెందారు. చివరికి ఆ ఇంటి గోడను పగలగొట్టడంతో రథం ముందుకు కదిలింది. రెండు గంటలపాటు తీవ్రంగా శ్రమించిన నిర్వాహకులు గోడను కూల్చడంతో శోభయాత్ర ప్రారంభమైంది. దీంతో శోభయాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు గంటల పాటు అర్ధాంతరంగా రోడ్లపైనే వాహనాలు నిలిచిపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అంచనాకు మించి భారీ సెటప్ ఏర్పాటు చేయడంతోనే ఆటంకం ఏర్పడిందని తెలుస్తోంది.

Also Read: KTR On Sports Meet: అసెంబ్లీ సమావేశాల వేళ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలా? కేటీఆర్‌ ఆగ్రహం

శోభయాత్ర ఆలస్యం
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శోభయాత్ర ఆలస్యం కావడంతో పాతబస్తీలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్ణీత సమయం వరకు శోభయాత్ర ముగించాల్సి ఉండగా.. రాజాసింగ్‌ రథం నిలిచిపోవడంతో శోభయాత్ర ఆలస్యమవుతోంది. శోభయాత్రను త్వరగా ముగించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యాత్ర ఆలస్యమైతే ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంది. శోభయాత్రను ముందుగా పూర్తి చేసి తమకు సహకరించాలని భక్తులను పోలీసులు కోరుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1020
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 27, 2026 13:14:02
Hyderabad, Telangana:

 Couple Romance Video Watch: నేటి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఏ చిన్న వింత జరిగిన క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతోంది. తాజాగా ఇద్దరు వయసు భయపడిన దంపతులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశానికి దారితీసింది. పబ్లిక్ పార్కులో అందరూ చూస్తుండగానే సదరు జంట ప్రవర్తించిన తీరు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఇంతకీ ఆ వృద్ధ జంట ఏం చేసిందో తెలుసా? ఇంతలా వీడియో వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ పబ్లిక్ పార్కులో ఒక అంకుల్‌తో పాటు ఆంటీ కలిసి నిలబడి వాకింగ్ చేస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే చుట్టూ జనం ఎవరూ లేరని గమనించిన ఆ జంట ఒక్కసారిగా పరస్పరం పెదవులపై ముద్దులు పెట్టుకున్నారు. అంకుల్ ఆ మహిళను దగ్గరకు తీసుకొని.. హత్తుకొని ముద్దులు పెట్టడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఈ దృశ్యాలు స్పష్టంగా లేకపోయినప్పటికీ.. వారైతే ముద్దులు పెట్టుకున్నట్లు కనిపించడం మీరు చూడొచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇంకా తెలియదు..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

వారు అలా ముద్దులో మునిగిపోయి ఉన్న సమయంలోనే అక్కడే ఉన్న కొంతమంది యువకులు తమ స్మార్ట్‌ఫోన్స్‌తో ఈ దృశ్యాలను చిత్రీకరించారు.. ఆ జంట తమలోకంలో తాము ఉండడంతో కెమెరా సైతం గమనించలేదు.  ఇలా రికార్డు చేసిన వీడియోలు ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్గా మారింది.. ఇంస్టాగ్రామ్‌తో పాటు ఎక్స్ వంటి వేదికలపై ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకుంది. చాలామంది ఈ వీడియోని చూసి షేర్ కూడా చేస్తున్నారు..

 
 
 
 
 

ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. మద్దతుగా కొంతమంది ప్రేమకు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదని.. వారు తమ భాగస్వామితో సంతోషంగా ఉంటే తప్పేంటని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఇక మరికొందరు మాత్రం పబ్లిక్ పార్కులు పిల్లలు, కుటుంబాలు వచ్చే ప్రదేశాలు.. ఇలాంటి చోట్ల అసభ్యంగా ప్రవర్తించడమేంటని.. వయస్సులో పెద్దవారై ఉండి.. ఇలా బహిరంగంగా ప్రవర్తించడం సరికాదని కొంతమంది కామెంట్లలో మండిపడుతున్నారు..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

  

1095
comment0
Report
Advertisement
Back to top