Couple Romance Video Watch: నేటి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఏ చిన్న వింత జరిగిన క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతోంది. తాజాగా ఇద్దరు వయసు భయపడిన దంపతులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశానికి దారితీసింది. పబ్లిక్ పార్కులో అందరూ చూస్తుండగానే సదరు జంట ప్రవర్తించిన తీరు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఇంతకీ ఆ వృద్ధ జంట ఏం చేసిందో తెలుసా? ఇంతలా వీడియో వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ పబ్లిక్ పార్కులో ఒక అంకుల్‌తో పాటు ఆంటీ కలిసి నిలబడి వాకింగ్ చేస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే చుట్టూ జనం ఎవరూ లేరని గమనించిన ఆ జంట ఒక్కసారిగా పరస్పరం పెదవులపై ముద్దులు పెట్టుకున్నారు. అంకుల్ ఆ మహిళను దగ్గరకు తీసుకొని.. హత్తుకొని ముద్దులు పెట్టడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఈ దృశ్యాలు స్పష్టంగా లేకపోయినప్పటికీ.. వారైతే ముద్దులు పెట్టుకున్నట్లు కనిపించడం మీరు చూడొచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇంకా తెలియదు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
వారు అలా ముద్దులో మునిగిపోయి ఉన్న సమయంలోనే అక్కడే ఉన్న కొంతమంది యువకులు తమ స్మార్ట్‌ఫోన్స్‌తో ఈ దృశ్యాలను చిత్రీకరించారు.. ఆ జంట తమలోకంలో తాము ఉండడంతో కెమెరా సైతం గమనించలేదు. ఇలా రికార్డు చేసిన వీడియోలు ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్గా మారింది.. ఇంస్టాగ్రామ్‌తో పాటు ఎక్స్ వంటి వేదికలపై ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకుంది. చాలామంది ఈ వీడియోని చూసి షేర్ కూడా చేస్తున్నారు..
ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. మద్దతుగా కొంతమంది ప్రేమకు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదని.. వారు తమ భాగస్వామితో సంతోషంగా ఉంటే తప్పేంటని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఇక మరికొందరు మాత్రం పబ్లిక్ పార్కులు పిల్లలు, కుటుంబాలు వచ్చే ప్రదేశాలు.. ఇలాంటి చోట్ల అసభ్యంగా ప్రవర్తించడమేంటని.. వయస్సులో పెద్దవారై ఉండి.. ఇలా బహిరంగంగా ప్రవర్తించడం సరికాదని కొంతమంది కామెంట్లలో మండిపడుతున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Raja Singh Shobha Yatra: శ్రీరామనవమి అంటే దేశవ్యాప్తంగా గుర్తొచ్చేది హైదరాబాద్‌లో జరిగే శోభయాత్ర. ఎంతో ఉత్సాహంగా.. భక్తి ప్రపత్తులతో సాగే శ్రీరామనవమి శోభయాత్రకు అనుకోని పరిణామం ఎదురైంది. ఊహించని విధంగా శోభయాత్రకు అడ్డంకి ఏర్పడింది. శోభయాత్రకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్ రథం రెండు ఇళ్ల మధ్య ఇరుక్కుపోయింది. ఈ కారణంతో హైదరాబాద్‌లో జరుగుతున్న శ్రీరామనవమి శోభయాత్ర మరింత ఆలస్యం కానుంది.
Also Read: Kavitha Party: రాజకీయ పార్టీపై కవిత కీలక ప్రకటన.. ఏప్రిల్ 25న పార్టీ పేరు వెల్లడి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్నమంగళ్‌హట్‌లో ఎమ్మెల్యే రాజా సింగ్ నివసిస్తుంటారు. హిందూవులకు ప్రతినిధిగా ఉన్న రాజాసింగ్ చేపట్టే శోభయాత్రకు అత్యంత విశిష్టంగా మారింది. శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం రాజాసింగ్ తన శోభయాత్రున ప్రారంభించాడు. తన రథంపై మంగళ్‌హట్‌లో శోభయాత్ర ప్రారంభించగా.. కొద్దిసేపటికే రథ ఇళ్ల మధ్య ఇరుక్కుపోయింది. ప్రధాన విగ్రహం ఉన్న వాహనానికి ఒక ఇంటి పిల్లర్ అడ్డుగా నిలిచింది.
Also Read: AP High Court Jobs: ఏపీ నిరుద్యోగులకు పండుగ.. హైకోర్టులో 300 ప్రభుత్వ ఉద్యోగాలు
ఇటీవల నిర్మాణం చేపట్టిన ఇంటి పిల్లర్ రావడంతో వాహనం వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. దానిని తొలగించేందుకు రెండు గంటలకు పైగా శోభాయాత్ర నిర్వాహకులు శ్రమించారు. రెండు బిల్డింగ్‌ల మధ్య శోభాయాత్ర రథం ఇరుక్కుపోవడంతో హిందూవులు ఆందోళన చెందారు. చివరికి ఆ ఇంటి గోడను పగలగొట్టడంతో రథం ముందుకు కదిలింది. రెండు గంటలపాటు తీవ్రంగా శ్రమించిన నిర్వాహకులు గోడను కూల్చడంతో శోభయాత్ర ప్రారంభమైంది. దీంతో శోభయాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు గంటల పాటు అర్ధాంతరంగా రోడ్లపైనే వాహనాలు నిలిచిపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అంచనాకు మించి భారీ సెటప్ ఏర్పాటు చేయడంతోనే ఆటంకం ఏర్పడిందని తెలుస్తోంది.
Also Read: KTR On Sports Meet: అసెంబ్లీ సమావేశాల వేళ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలా? కేటీఆర్ ఆగ్రహం
శోభయాత్ర ఆలస్యం
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శోభయాత్ర ఆలస్యం కావడంతో పాతబస్తీలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్ణీత సమయం వరకు శోభయాత్ర ముగించాల్సి ఉండగా.. రాజాసింగ్ రథం నిలిచిపోవడంతో శోభయాత్ర ఆలస్యమవుతోంది. శోభయాత్రను త్వరగా ముగించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యాత్ర ఆలస్యమైతే ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంది. శోభయాత్రను ముందుగా పూర్తి చేసి తమకు సహకరించాలని భక్తులను పోలీసులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Video Viral: ప్రకృతిలో కొన్ని సంఘటనలు చూస్తే సైన్స్ కూడా ఆశ్చర్య పోవాల్సిందే.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా ఏ ప్రాణికైనా తల తెగిపడితే క్షణాల్లో ప్రాణం పోతుంది.. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ కింగ్ కోబ్రా మాత్రం ఎందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. తల వేరైనప్పటికీ ఆ పాము ఇంకా బ్రతికే ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్‌గా మారింది..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక నల్లని కింగ్ కోబ్రా పాము తల ధాని మొండెం నుంచి పూర్తిగా వేరు చేయబడి ఉన్నట్లు మీరు వీడియోలో చూడొచ్చు. పాము తోక భాగం ఎటువంటి కదలికలు లేకపోయి ఉన్నప్పటికీ.. విడిపోయిన తలభాగం మాత్రం ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది.. పాతాళ అటు ఇటు కదుపుతూ చురుకుగా వెన్నులోని వణుకు పుట్టించేలా ఆ తలభాగం తన నోరు తెరిచి కోరలను బయటికి తీస్తోంది. ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు..
పాములకు సంబంధించిన ఇలాంటి వింత ప్రవర్తనల వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు తెలుపుతున్నారు. పాములు శీతల రక్త జంతువులు.. వీటి మెటపాలిజం రేటు చాలా తక్కువగా ఉంటుంది.. తల తెగిపోయిన తర్వాత కూడా వాటి శరీరంలోని నాడీ వ్యవస్థ కొంత సమయం వరకు పనిచేస్తూ ఉంటుంది. మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయిన.. కణజాలం వెంటనే చనిపోదు.. అందుకే తల వేరైనప్పటికీ పాములు స్పందిస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది శరీరం నుంచి తలభాగం వేరు చేసిన సమయంలో తలను ముట్టుకున్న సందర్భాల్లో దాని కాటుకు గురైన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ఇప్పుడు ఈ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న వీడియో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఇది చూస్తుంటే చాలా భయంగా ఉందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ వస్తుంటే.. మరి కొంతమంది ప్రకృతి వింత విచిత్రమైనదో కదా సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. పాము చనిపోయిందని భావించి.. తల తెగిందని నిర్లక్ష్యంగా దగ్గరకు వెళ్లి దానిని ముట్టుకుంటే చాలా ప్రమాదకరమని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు తెలుపుతున్నారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PMSYM Monthly Pension News: మీరు లేదా మీ కుటుంబంలో.. మీ సన్నిహితుల్లో ఎవరైనా అసంఘటిత రంగంలో (కూలీగా) పనిచేస్తున్నారా? అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల్లాగా ఆర్థిక భద్రత లేదని ఆందోళన చెందేవారికి ఇదో ఆపన్నహస్తంగా మారనుంది.
ఉద్యోగులు మాదిరిగానే అలాంటి అసంఘటిత రంగంలో ఉన్నవారికి కూడా వారికి 60 ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ పొందేందుకు వీలు ఉంది. ఇదే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాంధన్' (పీఎం ఎస్‌వైఎం) అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద.. కార్మికులు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 హామీతో కూడిన పింఛను పొందవచ్చు.
ఎంప్లాయిస్ పెన్షన్ ఫండ్ (EPF), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) లేదా ఇతర అధికారిక పింఛను ప్రయోజనాలు పొందలేని వారికి ఇదో పెన్షన్ దక్కే మార్గం. నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ ఆధారిత కార్మికులు, చిన్న వ్యాపార యజమానులతో సహా లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులకు పదవీ విరమణ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది.
ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాంధన్ (పీఎం ఎస్‌వైఎం) పథకం అనేది అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ పింఛను కార్యక్రమం. ఇందులో వీధి వ్యాపారులు, నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు, చిన్న వ్యాపార యజమానులను పరిధిలోకి తీసుకువస్తుంది. ఈ పథకం కింద కార్మికులు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పింఛనుకు అర్హులుగా పరిగణిస్తారు. ఈ పథకం ఒక సులభమైన సూత్రంపై పనిచేస్తుంది. మీరు పనిచేసే ఏళ్లలో నెలవారీగా ఒక చిన్న మొత్తాన్ని చెల్లిస్తారు. పదవీ విరమణ తర్వాత, మీరు పింఛను అందుకోవడం ప్రారంభిస్తారు.
ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాంధన్ (PM SYM) పథకంలో చేరేందుకు.. వ్యక్తులు నిర్దిష్ట అర్హత షరతులను నెరవేర్చాలి. వారి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలవారీ ఆదాయం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అయితే వారు ఇప్పటికే EPF, ESIC లేదా NPS పథకాల్లో నమోదు అయి ఉండకూడదు. నెలవారీ చెల్లింపు లబ్ధిదారుని వయస్సుపై ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల వయస్సు ఉన్నవారు ప్రతి నెలా రూ.55 చెల్లిస్తే , 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారు నెలకు రూ.200 చెల్లిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం మీ వాటాకు సమానమైన మొత్తాన్ని జతచేస్తుంది. కాబట్టి మీరు అవసరమైన మొత్తంలో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన సగాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది పదవీ విరమణ తర్వాత కార్మికులు సురక్షితమైన పెన్షన్ కోసం పొదుపు చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
ఈ పథకానికి ఎలా నమోదు చేసుకోవాలి?
భారతదేశంలో సుమారు 4 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) ఉన్నాయి. లబ్ధిదారులు తమకు అత్యంత సమీపంలో ఉన్న CSCలో నమోదు చేసుకోవచ్చు. అదే విధంగా PM SYM పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చు . ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మార్చి 12, 2026 నాటికి 52.5 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. ఇది అసంఘటిత రంగంలోని కార్మికులలో పెరుగుతున్న అవగాహన, భాగస్వామ్యాన్ని సూచిస్తుంది .
దీని వల్ల ప్రయోజనం ఏంటి?
1) 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.3,000 హామీతో కూడిన పింఛను
2) కూలీలుగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత
3) ప్రభుత్వ సహకారంతో తక్కువ నెలవారీ చెల్లింపులు.
Also Read: Vijay Mallya RCB Sale: ఆర్సీబీ జట్టు రూ.16 వేల కోట్లకు అమ్మకం..ఇందులో విజయ్ మాల్యా లాభం ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kavitha New Political Party: తన రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ కవిత కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఇంటి పార్టీగా.. ప్రాంతీయ పార్టీగా తాము కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు సాధించుకోలేకపోయామని... ప్రజా సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలు ప్రజలను పట్టించుకోవడం లేదని.. దీంతో కొత్త పార్టీ ఏర్పాటు అవసరం ఉందని చెప్పారు. ఆ పార్టీ అన్ని వర్గాల్లో వెలుగులు నింపాలని.. ఆ లక్ష్యంతోనే తాము పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కటిత ప్రకటించారు.
Also Read: Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు గల్లంతు.. పీఆర్‌సీ కమిటీ గడువు మళ్లీ పొడిగింపు
నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్లు కవిత స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉందన్నారు. మేడ్చల్‌లో మునీరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీని ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో, రాజకీయాల్లో మార్పు రావాలనుకున్న వారు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆ రోజు పార్టీ పేరు ప్రకటించి, జెండా ఎగురవేస్తామరని వెల్లడించారు.
Also Read: AP High Court Jobs: ఏపీ నిరుద్యోగులకు పండుగ.. హైకోర్టులో 300 ప్రభుత్వ ఉద్యోగాలు
'రాముడు తన ప్రజలను గుండె హత్తుకొని పాలన చేశారు. ఈ క్రమంలో శ్రీరామ నవమి రోజు కొత్త పార్టీపై ప్రకటన చేస్తున్నా' అని కవిత తెలిపారు. తాను నిజామాబాద్ కోడలిని అని.. ఇక్కడ పుట్టిన ఏ ఆలోచన అయినా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు కవిత గుర్తుచేశారు. రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశామని.. రాష్ట్రం వచ్చాక ప్రజల సమస్యలను లేవనెత్తినట్లు చెప్పారు.
Also Read: Tirumala: తిరుమల ఆలయానికి సినీ ప్రముఖుల తాకిడి.. బైకర్ సినిమా బృందం మొక్కులు
ఖమ్మం వెలుగుమట్లలో నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష చేయడంతోనే ప్రభుత్వం దిగి వచ్చి పట్టాలు ఇచ్చిందని కవిత తెలిపారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలని.. సర్వోదయ తెలంగాణ సాధన కోసమే తాము పార్టీ పెడుతున్నట్లు పేర్కొన్నారు.
కాశీకి వెళ్లి శివుడికి అభిషేకం చేసి వస్తామని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. అనంతరం వచ్చే నెల 25వ తేదీన పార్టీ పేరు, అజెండా, జెండా ప్రకటిస్తామని.. ఈ నెల రోజుల్లో పార్టీ ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేస్తామని వెల్లడించారు. తాము ఎవరికి బీ పార్టీగా ఉండబోమని స్పష్టం చేశారు. నంబర్ వన్ పార్టీగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో అధికారంలోకి వస్తామని.. రాముడిని ఆదర్శంగా తీసుకొని పని చేస్తామని కవిత తెలిపారు. అన్నివర్గాలను కలుపుకొని వెళ్తామని.. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని పార్టీ ఏర్పాటు అనంతరం ప్రకటిస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ లేదని.. తమది ప్రతి ఇంటి పార్టీ అవుతుందని.. ఉద్యమకారుల అనుభవాలను తీసుకుంటామని కవిత చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jharkhand Exam Bribe News: దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో బోర్డు ఎగ్జామ్స్ ముగిశాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు పూర్తవ్వగా.. ఇప్పుడు ఆన్సర్ షీట్ కరెక్షన్ (మూల్యాంకనం) జరుగుతోంది. ప్రతి విద్యార్థి రాసిన జవాబు పత్రాలను పరిశీలించి ఉపాధ్యాయులు ఎంతో జాగ్రత్తగా పేపర్లను కరెక్షన్ చేస్తున్నారు. విద్యార్థుల్లో చాలా మంది రేయింపవళ్లు కష్టపడి చదివి పరీక్షలు పూర్తి చేస్తే.. కొందరు ఆకతాయిలు ఏకంగా షార్ట్‌కట్స్ ద్వారా పరీక్షల్లో పాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు అలాంటి ఓ విద్యార్థి కథ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ వింత సంఘటన చూసి అందరూ టీచర్స్ ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ విచిత్ర సంఘటన ఝార్ఖండ్ బోర్డు పరీక్షల నేపథ్యంలో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని పలాములోని ఒక పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. సంస్కృత పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను తనిఖీ చేస్తున్న ఒక ఉపాధ్యాయుడికి ఊహించని విషయం ఎదురైంది. ఒక విద్యార్థి తనకు ఇచ్చిన ప్రశ్నాపత్రంలోని వాటికి జవాబులు రాయకుండా.. ఏకంగా ఆన్సర్ షీట్‌లో రూ.500 నోటు పెట్టాడు. అయితే ఆ పేపర్ మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థికి గట్టి షాక్ ఇచ్చాడు. పేపర్‌ను తనిఖీ చేస్తున్న ఉపాధ్యాయుడు నిబంధనలను కఠినంగా పాటించడమే కాకుండా.. జవాబులు ఇవ్వని ఆన్సర్ షీట్‌లో సున్నా మార్కులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఝార్ఖండ్‌లో జరిగిన బోర్డు ఎగ్జామ్స్ మూల్యాంకనంలో పాల్గొన్న టీచర్స్ తాము నిజాయితీగా ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. పరీక్షలను ప్రభావితం చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవనే సందేశాన్ని వారు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఉపాధ్యాయుడు చేసిన పనికి మెచ్చుకున్నారు. అదే విధంగా విద్యార్థికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వారు సలహా ఇచ్చారు. మరో విద్యార్థి ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడకుండా తగిన విధంగా బుద్ధి చెప్పాలని వారు కోరుతున్నారు.
విద్యార్థులలో మంచి అలవాట్లను పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది. పరీక్షలు కేవలం మార్కుల కోసమే కాదని, అవి నేర్చుకోవడం, నిజాయితీకి సంబంధించినవని పిల్లలు అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా మాత్రమే విద్యార్థులు మంచి భవిష్యత్తును పొందగలరనే విషాయన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
Also Read: Vijay Mallya RCB Sale: ఆర్సీబీ జట్టు రూ.16 వేల కోట్లకు అమ్మకం..ఇందులో విజయ్ మాల్యా లాభం ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Mallya RCB Sale: ఆర్సీబీ జట్టు రూ.16 వేల కోట్లకు అమ్మకం..ఇందులో విజయ్ మాల్యా లాభం ఎంతో తెలుసా?
Vijay Mallya RCB Share News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ప్రజాదరణ పొందిన టీమ్ అంటే చాలా మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే చెబుతారు. ఎందుకంటే అందులోని ప్రపంచస్థాయి ఆటగాడు విరాట్ కోహ్లీ వల్ల అంతటి క్రేజ్ లభించిందని చాలామందికి తెలిసిన విషయమే. ఇటీవలే ఈ టీమ్ రికార్డు ధరకు అమ్ముడయ్యింది. దాదాపుగా రూ.16 వేల కోట్లకు పైగా అమ్ముడైన తరుణంలో ఆర్సీబీ మాజీ యజమాని, ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా ఇప్పుడు ఎంత లాభం వచ్చిందనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
2008లో ఐపీఎల్ ప్రారంభమైన సీజన్‌లో విజయ్ మాల్యా తన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఫ్రాంచైజీగా ఏర్పాటు చేశాడు. ఈ జట్టు కోసం తాను కేవలం రూ.446 కోట్లను పెట్టుబడిగా పెట్టాడు. అయితే ఐపీఎల్ ద్వారా తన మద్యం బ్రాండ్‌ను అంతర్జాతీయంగా ప్రచారం చేసుకునేందుకు ఇదో వేదికగా ఉపయోగించుకోవాలని విజయ్ మాల్యా ప్లాన్. ఆ సమయంలో విమర్శలకు గురైనప్పటికీ, వ్యాపార పరంగా గొప్పగా లాభాలను ఆర్జించాడు. రాయల్ ఛాలెంజర్స్ అనే బ్రాండ్ ప్రజల్లో బలంగా వెళ్లేలా ఈ జట్టు ఓ కారణం అయ్యింది. కేవలం రెండు దశాబ్దాలలోనే జట్టు విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది.
ప్రస్తుత ఆర్సీబీ జట్టు అమ్మకం ద్వారా విజయ్ మాల్యాకు ఒక్క రూపాయి కూడా దక్కలేదు. ఎందుకంటే ఆయన సంస్థలో ఇప్పుడు ఒక్క షేర్ కూడా మిగిలి లేదు. 2012లో బ్రిటిష్ కంపెనీ 'డయాజియో', యునైటెడ్ స్పిరిట్స్‌లో మాల్యాకు ఉన్న 53.4 శాతం వాటాను రూ.11,166 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో మాల్యాకు సుమారు రూ.3,635 కోట్లు ముట్టజెప్పారు.
2013-14లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభంలోకి వెళ్లినప్పుడు విజయ్ మాల్యా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తర్వాత డియాజియో తన వాటాను 56 శాతానికి పెంచుకుంది. ఆ సమయంలో ఛైర్మన్ పదవి నుంచి అతన్ని తొలగించినందుకు అదనంగా రూ.515 కోట్లు చెల్లింపులు చేసి ఛైర్మన్ పదవి నుంచి మాల్యా తప్పుకునేలా చేశారు. 2016లో మాల్యా లండన్‌కు పారిపోయేనాటికి ఆర్సీబీ జట్టు విలువ రూ.1,200 కోట్లకు చేరగా, డియాజియో పూర్తి యాజమాన్యాన్ని తీసుకుంది.
ఇప్పుడు 2026లో జరిగిన తాజా విక్రయం విలువ రూ.16,600 కోట్లుకు ఎగబాకింది. ఈ సొమ్ము నేరుగా యూఎస్ఎల్ (డయాజియో)కు వెళ్తుంది. అయితే ప్రస్తుతం ఆ టీమ్ యాజమాన్య హక్కులు డయాజియో వద్ద ఉండడం వల్ల పూర్తి డబ్బు ఆ సంస్థకే చేరుతుంది. తాజాగా తన మాజీ టీమ్ అమ్మకంపై విజయ్ మాల్యా లండన్ నుంచి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు దీనివల్ల ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఒకప్పుడు అతి తక్కువ ధరకు కొనుగోలు చేయబడిన ఒక జట్టు, ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు అమ్ముడవ్వడంపై ఐపీఎల్ బ్రాండ్ శక్తి ఓ నిదర్శనం అని స్పష్టం చేశాడు. బీసీసీఐ అధికారికంగా ఆమోదించిన తర్వాత ఆర్‌సీబీ పూర్తి యాజమాన్యం ఆదిత్య బిర్లా గ్రూప్ చేతిలోకి వెళ్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Albino Python Snake Viral Video Watch: సాధారణంగా పాములు కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడుతూ ఉంటాం.. అలాంటిది మనుషుల ప్రాణాలను నిమిషాల్లో తీయగల ప్రమాదకరమైన విష సర్పంతో ఓ చిన్నారి ఆడుకుంటే? అది ఆ పాప ముఖాన్ని ముద్దాడుతుంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే వెన్నులో మనకు పుడుతుంది కదూ.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి హాయిగా పడుకుని.. టీవీ చూస్తుండడం మీరు గమనించవచ్చు.. అయితే ఆమె పక్కనే అత్యంత భయంకరమైన తెల్లటి రంగులో ఉన్న ఓ పెద్ద పాము ఉండడం కూడా మీరు చూడొచ్చు.. ఆ పాము మెల్లగా ఆ చిన్నారి ముఖం వద్దకు వచ్చి.. దాని నాలుకతో పాప ముఖాన్ని నాకుతోంది. మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు లేదా పిల్లులు చేసే చేష్టల్లాగే ఆ పాము కూడా చాలా ఫ్రెండ్లీగా ప్రవర్తించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు..
సాధారణంగా చిన్నపిల్లలు ఏదైనా చిన్న పురుగును చూసిన భయపడుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో ఉన్న చిన్నారి మాత్రం ఆ పామును చూసి అస్సలు భయపడకుండా ఉండడం.. దానిని చాలా ప్రేమగా నిమురుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా.. ఆ పాము కూడా ఆ చిన్నారికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఆమెతో ఆడుకుంటుంది.. ఈ దృశ్యాలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు.. ఇదేం వింత స్నేహం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు... ఇక మరికొందరైతే ఇది ఎంత ఫ్రెండ్లీగా ఉన్న ప్రమాదకరం.. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
నిపుణులు తెలిపిన అభిప్రాయం ప్రకారం.. ఆ వీడియోలో ఉన్నది అల్బీనో రకానికి చెందిన సర్పమని తెలుస్తోంది. జన్యుపరమైన లోపాల వల్ల వీటికి తెల్లటి రంగు వస్తుంది.. అయితే ఇవి పెంచుకునే పాములే అయినప్పటికీ చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని వన్యప్రాయాన్ని సంరక్షకులు సైతం సూచిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ తీశారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ తో పాటు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా వస్తున్నాయి..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MRI Scan Prices Hike: పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు కేవలం పెట్రోల్ డీజిల్ ధరలనే కాదు.. సామాన్యుడి ఆరోగ్య బడ్జెట్‌ను కూడా దెబ్బతీసేలా ఉన్నాయి..ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న పోరు ప్రపంచవ్యాప్తంగా హీలియం కొరతకు దారితీస్తోంది. దీని ప్రభావం నేరుగా భారతదేశంలోని వైద్య సేవలపై.. ముఖ్యంగా ఎంఆర్ఐ (MRI) స్కాన్ చార్జీలపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, హీలియంకి ఈ స్కాన్ మిషన్లకు ఎలాంటి సంబంధం ఉంది? ఈ రీజన్ వల్లనే ధరలు ఎలా పెరుగుతాయి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఒక MRI మిషన్ పనిచేయాలంటే హీలియం గ్యాస్ అత్యంత కీలక.. ఈ యంత్రంలో ఉండే శక్తివంతమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్లను అతి శీతలీకరణ స్థితిలో ఉంచడానికి ద్రవరూపంలో ఉన్న హీలియంను ఉపయోగిస్తారు. మిషన్ వేడెక్కకుండా నిరంతరం చల్లబరిచే ఈ గ్యాస్ హరహర ఆగిపోతే.. కోట్ల విలువైన యంత్రాలు మొరాయించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ హీలియం ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వాటా ఒక్క ఖతార్ దేశానిదే.. అయితే, ఇటీవల ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతార్‌లోని ప్రధాన గ్యాస్ తయారీ కేంద్రాలు దెబ్బతిన్నట్లు మనం వార్తల్లో చూసాం.. దీంతో ఉత్పత్తి ఒక్కసారిగా నిలిచిపోయింది.. భారతదేశ తన హీలియం అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. సరఫరా గొలుసు దెబ్బతీయడంతో మార్కెట్‌లోని హీలియం ధరలు అప్పుడే పెరగడం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
Read more: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
ప్రస్తుతం ఒక MRI స్కాన్‌కు ప్రాంతాన్ని బట్టి రూ.5 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు.. ఒకవేళ హీలియం కొరత ఇలాగే కొనసాగితే.. నిర్వహణ వేయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి స్టాక్ అందుబాటులో ఉన్నప్పటికీ యుద్దం సుదీర్ఘకాలం కొనసాగితే సేవలో అంతరాయం తప్పదని మెడికల్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
Read more: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Two snakes spotted near silathoranam queue line in Tirumala: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారంఅయిన తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఒకవైపు వరుస సెలవులు,మరోవైపు లాంగ్ వీకెండ్ లలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.టొకెన్లు ఉన్నవారి దర్శనాలకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక టోకెన్లు లేని వారికి 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది. రూ. 300 టొకెన్లు ఉన్నవారికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. తిరుమలలో దాదాపు అన్ని కంపార్ట్ మెంట్ లు భక్తులతో నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచిఉంటున్నారు. మరోవైపు తిరుమలలో ఇటీవల అడవి జంతువులు కూడా మెట్ల మార్గంలోకి వచ్చే స్తున్నాయి.
ఇప్పటికే చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు,పాములు తరచుగా భక్తులకు టెన్షన్ పెడుతున్నాయి. టీటీడీ అధికారులు మాత్రం భక్తులంతా గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. తిరుమలలో రెండు పాములు శిలాతోరణం వద్ద రెండు పాములు హల్ చల్ చేశాయి. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
తిరుమల లోని శిలాతోరణం వద్ద క్యూలైన్ లో రెండు పాములు భక్తుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. అందులో ఒకటి 8 అడుగులు ఉండగా, మరొకటి 6 అడుగుల పొడవు ఉంది. జనాల రద్దీ మధ్య ఈ పాములు రావడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు.
Read more: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకొని భక్తుల మధ్య బుసలు కొడుతున్న రెండు పాముల్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత వాటిని దట్టమైన అడవిలో వదిలేశాడు. దీంతో అక్కడున్న భక్తులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు మెట్ల మార్గంలో, శిలాతోరణం గుండా తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. గుంపులు, గుంపులుగా వెళ్లాలని భక్తులకు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
AP High Court Recruitment Notification: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది అద్భుత అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయసంస్థ హైకోర్టులో భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఇప్పటికే ఉగాది పండుగకు ఉద్యోగాల క్యాలెండర్ ప్రభుత్వం విడుదల చేయగా.. తాజాగా హైకోర్టులో ఉద్యోగాల భర్తీ ప్రకటన రావడంతో నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. ఏపీ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు గల్లంతు.. పీఆర్‌సీ కమిటీ గడువు మళ్లీ పొడిగింపు
ఏపీ హైకోర్టులో చాలా కాలం తర్వాత భారీగా ఉద్యోగాల ప్రకటన వెలువడింది. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులు 300 ఉండగా.. వాటికి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: KTR On Sports Meet: అసెంబ్లీ సమావేశాల వేళ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలా? కేటీఆర్ ఆగ్రహం
పోస్టుల వివరాలు
సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 1
సెక్షన్ ఆఫీసర్స్: 5
కంప్యూటర్ ఆపరేటర్:31
అసిస్టెంట్ లైబ్రెరీయన్: 1
లైబ్రైరియన్ గ్రేడ్-II: 1
యూడీ స్టెనోగ్రాఫర్: 7
అసిస్టెంట్: 78
ఎగ్జామినర్: 27
టైపిస్ట్: 44
కాపీస్ట్: 34
డేటా ఎంట్రీ ఆపరేటర్: 50
స్టెనోగ్రాఫర్: 1
ఆఫీస్ సబార్డినేట్: 20
ఈ పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో వివిధ విద్యార్హతలు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/ డిగ్రీ/ బీటెక్/ లా డిగ్రీ చదివిన వారు హైకోర్టు ఉద్యోగాలకు అర్హులు. దీంతోపాటు టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కూడా ఉండాలి. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారిని కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.
Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు
వయో పరిమితి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి వయో పరిమితి 01.01.2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు ప్రారంభం: 30.03.2026 చివరి గడువు: 19.04.2026.
పూర్తి వివరాలకు https://aphc.gov.in/docs/notification_1774248554_0.pdf
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MLA And MLCs Sports Meet: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతుండగా.. కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్‌ఎస్ పార్టీ నిలదీస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తుండడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చేతకాదు కానీ క్రీడా పోటీలా? అని మండిపడ్డారు. కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ప్రభుత్వం కొత్త ఎత్తుగడ అని విమర్శించారు.
Also Read: Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు గల్లంతు.. పీఆర్‌సీ కమిటీ గడువు మళ్లీ పొడిగింపు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో గురువారం లాబీల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత కీలకమైన పద్దులపై చర్చలతో కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇంత సీరియస్‌గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సాగునీటి వంటి అత్యంత ముఖ్యమైన సబ్జెక్టులపై సభలో లోతైన చర్చ జరగాల్సి ఉందని.. కానీ ప్రభుత్వం మాత్రం పద్దులపై చర్చను త్వరగా ముగించి పారిపోవాలని చూస్తోందని విమర్శించారు. కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు ఆటలు ఆడుతుంటే ప్రజలు ఏమనుకుంటారని ప్రశ్నించారు.
Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు
ఈ నెల 28, 29 తేదీల్లో ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కాలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా.. ఇలాంటి కార్యక్రమాలతో కాలయాపన చేయడం సరికాదని తప్పుబట్టారు. పద్దులపై చర్చకు తగినంత సమయం కేటాయించకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. చర్చించాల్సిన కీలకమైన అంశాలు పక్కనపెట్టి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్రీడా పోటీలను ఒక సాకుగా చూపిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Govt Employees: గంపెడాశలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పిడుగులాంటి వార్త ఇది. వేతన సవరణ సంఘం గడువును మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు పీఆర్‌సీ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పీఆర్‌సీ కమిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. భారీ ఆశల్లో ఉన్న ఉద్యోగులకు ఈ వార్త చేదు గుళికగా మారింది.
Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 2020 సవరించిన వేతన శ్రేణుల (ఆర్‌పీ-2020) పే-ఫిక్సేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గడువును మరోసారి పొడిగించింది. పీఆర్‌సీ కమిటీ గడువు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలలు పొడిగించడంతో సెప్టెంబర్ వరకు ఈ కమిటీ గడువు పొడిగించారు. పెండింగ్‌లో ఉన్న పే-ఫిక్సేషన్ పనులన్నింటినీ సెప్టెంబర్ 30, 2026లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు
ఈ ప్రక్రియను మార్చి 31, 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా మూడేళ్ల నుంచి గడువు పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి పొడిగింపు చేశారు. కొన్ని కారణాలతో ఇంకా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం భావించి గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. అయితే ఆఫీసర్స్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు సమాచారం. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు నిర్ణీత గడువులోగా అర్హతలకు అనుగుణంగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: YS Jagan: ఇక రోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తా..! పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
ప్రభుత్వం తాజాగా పొడిగించడంతో ఉద్యోగులు తమ జీతాల పెంపు ఆశలు అడియాశలైనట్లు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలు పెండింగ్‌లో ఉండగా ఇప్పుడు పీఆర్‌సీని కూడా వాయిదా వేయడంతో ప్రభుత్వం తమపై నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తోందని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే నాలుగు డీఏలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు దిక్కులేదు. ఇక పెండింగ్ బిల్లులు విడతల వారీగా ఇస్తుండగా.. రిటైర్మెంట్ ఉద్యోగులకు వారి బెనిఫిట్స్ రాక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినా పీఆర్‌సీ వస్తుందనుకుంటే మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్ పొడిగించడంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వేతన స్థిరీకరణ సమస్యలు పరిష్కారమై తమ ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందుతాయని ఆశించగా నిరాశే ఎదురైంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోయారు. ఓట్ల కోసం తమను వాడుకున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల్లోనే కొత్త పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించి ఇప్పుడు రెండున్నరేళ్లవుతున్నా అమలు చేయకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. తాజాగా పీఆర్‌సీ కమిటీ గడువు పొడిగింపుతో ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే భారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డీఏలు పెండింగ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు వంటివి అపరిష్కృతంగా ఉండడంతో ఉద్యోగ వర్గాలు ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IPL 2026 Full Schedule News: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను విడుదల చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు ఫుల్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మిగిలిన మ్యాచ్‌ల వేదికలతో పాటు ఇతర వివరాలను ఆ షెడ్యూల్‌లో పొందుపరిచింది.
తొలి షెడ్యూల్ మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు ప్లాన్ చేయగా.. ఇప్పుడు రెండో ఫేజ్ కోసం 2026 ఏప్రిల్ 13 నుంచి మే 24 మధ్య 12 వేదికలలో 50 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే రెండో షెడ్యూల్ విడుదల చేసే క్రమంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను మే 31న నిర్వహించనున్నట్లు తెలియజేసింది. అయితే ప్లేఆఫ్స్ గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు హోమ్ గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఫైనల్ మ్యాచ్‌కు వేదిక కానుంది.
దేశంలో రాబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది బీసీసీఐ విడతలుగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. భారత ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకోవడం ద్వారా బీసీసీఐకి అవసరమైన సెక్యూరిటీ, లాజిస్టికల్ ప్రణాళికలతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లను దేశంలోనే సురక్షితంగా నిర్వహించేలా పక్కాగా ప్లాన్ చేసింది.
రెండో దశ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక పోరుతో తిరిగి ప్రారంభమవుతుంది. టోర్నీ రెండవ భాగంలో ఎనిమిది డబుల్-హెడర్ మ్యాచ్‌లు ఉండబోతున్నాయి. మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు, అలాగే సాయంత్రపు మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
సాంప్రదాయానికి భిన్నంగా మార్చి 28న బెంగళూరులో జరగాల్సిన సీజన్ ఆరంభ మ్యాచ్‌కు సంబంధించిన ఆరంభోత్సవాలను బీసీసీఐ రద్దు చేసింది. గతేడాది టైటిల్ వేడుకల సందర్భంగా బెంగళూరు నగరంలో జరిగిన ఘోర తొక్కిసలాట బాధితుల నివాళులర్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ సీజన్‌ను ఘనంగా ముగించేందుకు మే 31న జరిగే ఫైనల్‌కు ఒక భారీ ముగింపు వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook