Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500003
EPF withdrawal New Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాది సరికొత్తగా.. ఒక క్లిక్‎తో మీ ప...
BBhoomi
Dec 25, 2025 04:22:30
Secunderabad, Telangana

EPF withdrawal New Rules: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సంవత్సరం సరికొత్త శుభవార్తను అందించబోతోంది. కొత్త సంవత్సరం 2026 నుంచి ఉద్యోగస్థులకు ఈపీఎఫ్ విషయంలో భారీ ఉపశమనం కల్పించే మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు బాసటగా నిలుస్తూ.. అవసరం, అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బును విత్ర డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది. చాలా ఆలస్యం జరిగేది. ఈ సమస్యలను గుర్తించిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ విత్ డ్రా రూల్స్ మరింత ఈజీగా స్పష్టంగా మార్చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ మార్పులు పీఎఫ్ ఖాతాదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.

ఇప్పటివరకు EPF విత్ డ్రాకు సంబంధించి 13 రకాల విభిన్న నిబంధనలు ఉండేవి. ఈ రూల్స్ ఉద్యోగులకు అర్థం కాకపోవడంతో గందరగోళానికి గురయ్యేవారు. తాజాగా మార్పుల ప్రకారం ఈపీఎఫ్ఓ ఈ నియమాలను మూడు ప్రధాన వర్గాలుగా విభజించింది. ముఖ్యమైన అవసరాలు, గ్రుహ సంబంధిత అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది. ఈ విధంగా విభజించడం వల్ల తమ అవసరానికి ఏ కేటగిరిలో విత్ డ్రా చేసుకోవచ్చో సులభంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు ఆన్ లైన్ క్లెయిమ్ ప్రక్రియ కూడా మరింత ఈజీ అయ్యింది.

మొత్తం EPF మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలటే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు ఉండాలి. ఉద్యోగి 58 సంవత్సరాల వయస్సు పూర్తి చేసిన తర్వాత.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పుడు.. శాశ్వత వైకల్యం కలిగినప్పుడు లేదా పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో మాత్రం మొత్తం EPF మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం కోల్పోయిన వెంటనే EPFలోని 75 శాతం మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. మిగిలిన 25 శాతం మొత్తాన్ని 12 నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు, విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిన వారు కూడా తమ EPF నిధులను పూర్తిగా విత్ డ్రా చేసుకునే వెలుసుబాటు కల్పించింది.

ఇక పాక్షిక ఉపసంహరణల విషయంలో కూడా EPFO స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఐదేళ్ల సర్వీస్ పూర్తైన తర్వాత ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా మరమ్మత్తుల కోసం EPF నుంచి డబ్బు తీసుకోవచ్చు. పదేళ్ల సర్వీస్ తర్వాత గృహ రుణాన్ని చెల్లించేందుకు మొత్తం PF నిల్వలో 90 శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇంటి మరమ్మతుల కోసం అయితే నెలవారీ జీతం లేదా ఉద్యోగి PFలో చేసిన సహకారానికి 12 రెట్లు వరకు తీసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని జీవితంలో రెండుసార్లు వినియోగించుకోవచ్చు.

Also Read: Small Business Ideas 2026: ధురంధర్' లాగా భారీగా సంపాదించండి. 2026 లో కేవలం రూ.లక్షతో ప్రారంభమయ్యే 5 చిన్న వ్యాపారాలు ఇవే..!!

వైద్య అవసరాల విషయంలో సర్వీస్ కాలానికి ఎలాంటి పరిమితి లేదు. ఉద్యోగి తనకు, భార్య లేదా భర్తకు, తల్లిదండ్రులకు లేదా పిల్లలకు వైద్య చికిత్స అవసరమైతే ఎప్పుడైనా EPF నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. వివాహం, చదువు అవసరాల కోసం కూడా సౌకర్యం ఉంది. ఏడేళ్ల సర్వీస్ ప పూర్తైన తర్వాత, ఉద్యోగి తన వివాహం లేదా పిల్లలు, తోబుట్టువుల వివాహం కోసం మొత్తం సహకారంలో 50 శాతం వరకు తీసుకోవచ్చు. అలాగే పిల్లల విద్య కోసం (10వ తరగతి తర్వాత) కూడా అదే విధంగా 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు మరింత ఉపశమనం కల్పించారు. 54 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు లేదా రిటైర్మెంట్ కు ఒక ఏడాది EPFలోని 90 శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే వరదలు, భూకంపాలు వంటి సహజ విపత్తులు సంభవించినప్పుడు లేదా రెండు నెలలకుపైగా జీతం అందకపోతే అత్యవసరంగా కొంత మొత్తం తీసుకోవచ్చు.

EPF విత్ డ్రాపై ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒక ఉద్యోగి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతరంగా ఉద్యోగంలో ఉన్నట్లయితే, EPF నుంచి తీసుకునే మొత్తం పూర్తిగా పన్ను మినహాయింపుకు అర్హం. కానీ ఐదేళ్ల కంటే ముందే విత్ డ్రా చేస్తే, నియమాల ప్రకారం TDS వర్తించే అవకాశం ఉంటుంది. ఈ మార్పులతో EPF ఖాతాదారులకు అవసరమైన సమయంలో తమ పొదుపును సులభంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది.

Also Read: Business Ideas: తమ్ముడు.. ఇది రాసిపెట్టుకో... ఈ ఒక్క బిజినెస్ ఐడియాతో ఎవరి సపోర్టు లేకుండానే.. కోట్లకు పడగలెత్తొచ్చు..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Dec 25, 2025 05:05:09
Secunderabad, Telangana:

8th Pay Commission: కొత్త ఏడాది 2025 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు మరింత పెరిగాయి. 7వ వేతన సంఘం(7th Pay Commission) పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘంపై చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులందరిలోనూ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.

అయితే ఈ అంశంపై ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ స్పష్టత ఇచ్చారు. 8వ వేతన సంఘం(8th Pay Commission)లో కనీసం 2.64 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్‌ను ఉద్యోగ సంఘాలు ముందుకు తెచ్చాయి. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor) అమలైతే.. ప్యూన్ నుంచి IAS స్థాయి అధికారుల వరకు మూల వేతనాలు భారీగా పెరుగుతాయని ఆయన వివరించారు.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే.. ప్రస్తుతం ఉన్న బేసిక్ జీతాన్ని ఒక నిర్దిష్ట గుణకంతో గుణించడం ద్వారా కొత్త బేసిక్ జీతాన్ని నిర్ణయించే విధానం అని అర్థం. ఈ గుణకం ఎంత ఎక్కువగా ఉంటే.. (8th Pay Commission)ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అంత ఎక్కువగా పెరుగుతాయి. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఈసారి దానిని 2.64 లేదా అంతకంటే ఎక్కువగా నిర్ణయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

2.64 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు అయినట్లయితే.. వివిధ స్థాయిల్లో జీతాలు ఎలా మారుతాయో ఓసారి పరిశీలిద్దాం.

⇒ లెవల్–1లో ఉన్న ఉద్యోగి ప్రస్తుత మూల వేతనం రూ. 18,000 ఉండగా.. అది సుమారు రూ. 47,520కి పెరుగుతుంది.

⇒ లెవల్–2లో రూ. 19,900 ఉన్న జీతం రూ. 52,536కి పెరుగుతుంది.

⇒ లెవల్–3లో రూ. 21,700 ఉన్న వేతనం రూ. 57,288కి చేరుతుంది.

⇒ ఇదే విధంగా లెవల్–6లో ఉన్న ఉద్యోగి ప్రస్తుత బేసిక్ రూ. 35,400 నుంచి దాదాపు రూ. 93,456కి పెరుగుతుంది.

⇒ లెవల్–10లో రూ. 56,100గా ఉన్న మూల వేతనం రూ.1.48 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

⇒ అత్యున్నత స్థాయిల్లో మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. లెవల్–13లో ఉన్న అధికారుల జీతం రూ. 1.18 లక్షల నుంచి రూ.3.12 లక్షలకు పెరుగుతుంది.

⇒ లెవల్–15లో ఉన్న అధికారుల వేతనం రూ. 1.82 లక్షల నుంచి సుమారు రూ. 4.81 లక్షలకు పెరుగుతుంది.

⇒ లెవల్–18లో ప్రస్తుతం రూ. 2.50 లక్షలుగా ఉన్న మూల వేతనం దాదాపు రూ. 6.60 లక్షలకు చేరే అవకాశం ఉంది.

ఈ లెక్కన బట్టి చూస్తే.. ప్యూన్ నుంచి IAS వరకు అందరికీ భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టంగా అర్థం అవుతోంది.

అయితే 7వ వేతన సంఘం పదవీకాలం ముగిసిన వెంటనే 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా కొత్త వేతన సంఘం ఏర్పాటు చేసి.. దాని నివేదికను ప్రభుత్వం ఆమోదించడానికి ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అందువల్ల 2026 జనవరి నుంచి జీతాలు అమలుకాకపోయినా, తరువాత అమలు చేసినప్పుడు ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లింపులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: EPF withdrawal New Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాది సరికొత్తగా.. ఒక క్లిక్‎తో మీ పీఎఫ్ డబ్బులు విత్ డ్రా..!!

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor)నిర్ణయానికి ప్రభుత్వం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. దేశంలో ద్రవ్యోల్బణ స్థాయి, జీవన వ్యయం, CPI, CPI-IW గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, బడ్జెట్ భారం, ప్రైవేట్ రంగంతో జీతాల పోలిక, మార్కెట్ సర్వేలు వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ సమతుల్యం చేస్తూ తుది నిర్ణయం తీసుకుంటారు.

2.64 కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor) ఉద్యోగులకు సరైన న్యాయం చేయదని మంజీత్ సింగ్ పటేల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉద్యోగుల జీవన వ్యయం, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే ఉద్యోగుల్లో సంతృప్తి పెరుగుతుందని, లేకపోతే అసంతృప్తి, విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మొత్తంగా చూస్తే, 8వ వేతన సంఘం చుట్టూ సాగుతున్న ఈ చర్చలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో కీలకంగా మారాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌(Fitment Factor)పై తీసుకునే నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.

Also Read: 8th Pay Commission: 7వ వేతనం అమలులోని 10ఏళ్లలో జీతాలు, భీమా, పెన్షన్లలో ఏం మారింది..? 8వ వేతన సంఘం నుంచి ఏం ఆశించవచ్చు..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 25, 2025 03:46:12
Secunderabad, Telangana:

Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ 25వ తేదీ గురువారం బంగారం.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధరకు రూ.10 పెరుగుదల నమోదైంది. తాజా ధర ప్రకారం 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ.1,38,940కు చేరింది. ఇదే విధంగా 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.10 పెరిగి 10 గ్రాములకు రూ.1,27,360గా నమోదైంది. 18 క్యారెట్ బంగారం సైతం రూ.10 పెరిగి 10 గ్రాములకు రూ.1,04,210 వద్ద స్థిరపడింది.

వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. బుధవారం కిలో వెండి ధర రూ.2,33,000గా ఉండగా.. నేడు గురువారం అది రూ.2,33,100కు చేరింది. దేశీయ మార్కెట్లో పెరుగుదల తక్కువగా కనిపించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. అమెరికా మార్కెట్‌లో ఒక ఔన్స్ (సుమారు 31.2 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా దాదాపు 4,500 డాలర్ల స్థాయికి చేరడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ఇన్వెస్టర్ల ప్రవర్తనలో వచ్చిన మార్పేనని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. దేశీయంగా కూడా 24 క్యారెట్ బంగారం ధర చరిత్రలో తొలిసారిగా 10 గ్రాములకు రూ.1.40 లక్షల స్థాయిని దాటడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Also Read: Small Business Ideas 2026: ధురంధర్' లాగా భారీగా సంపాదించండి. 2026 లో కేవలం రూ.లక్షతో ప్రారంభమయ్యే 5 చిన్న వ్యాపారాలు ఇవే..!!

బంగారం ధరల ఈ భారీ పెరుగుదల ఆభరణాల కొనుగోలుదారులకు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దేశీయంగా బంగారు ఆభరణాల డిమాండ్ పెద్దగా లేకపోయినా, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్లే ధరలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 2025లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ ఆర్థిక విధానాలపై అనిశ్చితి పెరిగిందని.. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నారని చెబుతున్నారు.

ఇక వెండి విషయానికి వస్తే.. అది కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క ఏడాదిలోనే దాదాపు 100 శాతం వరకు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా గ్రీన్ ఎనర్జీ, సౌర విద్యుత్ రంగాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. అదే సమయంలో సరఫరా పరిమితంగా ఉండటంతో వెండి ధరలు మరింత ఎగబాకుతున్నాయి. భవిష్యత్తులో కూడా వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి.

Also Read: Business Ideas: తమ్ముడు.. ఇది రాసిపెట్టుకో... ఈ ఒక్క బిజినెస్ ఐడియాతో ఎవరి సపోర్టు లేకుండానే.. కోట్లకు పడగలెత్తొచ్చు..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
Dec 25, 2025 01:12:27
0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 13:57:06
Secunderabad, Telangana:

New Year 2026 Investment Plan: కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ.. చాలా మంది తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతుంటారు. ఆరోగ్యం, కెరీర్‌తో పాటు భవిష్యత్తు ఆర్థిక భద్రత కూడా ఇప్పుడు ప్రతి కుటుంబానికి ప్రధాన ఆలోచనగా మారింది. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ముందస్తుగా ప్రణాళిక చేసుకుంటే, పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితం గడపడం సాధ్యమవుతుంది. ఇలాంటి సందర్భంలో అటల్ పెన్షన్ యోజన (APY) ఒక నమ్మకమైన, సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తోంది.

భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా అటల్ పెన్షన్ యోజనలో ఖాతాలు తెరిచి పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత వారికి కలిపి నెలకు రూ.10,000 వరకు పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ పథకం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండటంతో.. దీని భద్రతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. 60 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత జీవితాంతం హామీతో కూడిన పెన్షన్‌ను ఈ పథకం అందిస్తుంది.

ఈ పథకం కింద ప్రతి వ్యక్తి తనకు నచ్చిన పెన్షన్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. భార్యాభర్తలిద్దరూ ఒక్కొక్కరూ రూ.5,000 పెన్షన్ ఎంపిక చేసుకుంటే.. పదవీ విరమణ తర్వాత వారికి కలిపి రూ.10,000 నెలవారీ ఆదాయం లభిస్తుంది. ఈ మొత్తం వృద్ధాప్యంలో రోజువారీ ఖర్చులు, వైద్య అవసరాలు వంటి వాటిని ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం లేకపోయే వయస్సులో ఈ పెన్షన్ ఒక పెద్ద భరోసాగా నిలుస్తుంది.

Also Read:  Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

అటల్ పెన్షన్ యోజనలో 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు చేరవచ్చు. పెట్టుబడి ప్రారంభించే వయస్సు తక్కువగా ఉంటే.. నెలవారీ విరాళం అంత తక్కువగా ఉంటుంది. అంటే.. యువత తొందరగా ఈ పథకంలో చేరితే, తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ భవిష్యత్తులో మంచి పెన్షన్ పొందవచ్చు. పెట్టుబడి మొత్తం మీరు ఎంచుకునే పెన్షన్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉండటంతో పాటు, ప్రభుత్వ హామీ ఉన్నందున మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు. అందుకే భద్రత కోరుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపికగా చెప్పవచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభంలో భార్యాభర్తలు కలిసి ఈ పథకం కింద ఖాతాలు తెరిచి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రాబోయే సంవత్సరాల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించినట్లే అవుతుంది.

అటల్ పెన్షన్ యోజన ఖాతా తెరవడం కూడా చాలా సులభం. మీ సమీప బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి.. అవసరమైన పత్రాలు సమర్పిస్తే, కొన్ని సులభమైన దశల్లోనే ఖాతా ప్రారంభించవచ్చు. హామీ ఉన్న రాబడి, దీర్ఘకాలిక భద్రత, ప్రభుత్వ మద్దతు వంటి అంశాల కారణంగా అటల్ పెన్షన్ యోజన భార్యాభర్తలకు ఒక విశ్వసనీయమైన పెట్టుబడి మార్గంగా నిలుస్తోంది.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 24, 2025 13:15:45
Hyderabad, Telangana:

Cobra Snakes Video Viral: ప్రమాదకరమైన పాములను రక్షించడంలో స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలను పట్టుకునే సమయంలో కూడా వాటి కాటు బారిన పడి మరణిస్తున్నారు.. ఏది ఏమైనా పాములు పట్టేవారు ప్రకృతిలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రకృతిని రక్షించేందుకు వారు చేసే ప్రయత్నాలు అంతో ఇంతో కాదు వర్ణనాతీతం.. అయితే, చాలామంది యువత కూడా పాములు పట్టే ట్రైనింగ్ తీసుకొని.. ప్రకృతిని రక్షించే కార్యక్రమంలో పడ్డారు. ఇటీవల కాలంలో అడవి ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఆహార కోరత కారణంగా.. పల్లె ప్రాంతాల్లోకి ప్రమాదకరమైన పాములు సంచారం చేయడంతో.. వాటిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగమే జలీల్ బాయ్..

గత కొద్ది రోజుల నుంచి జలీల్ భాయ్ పాములను రెస్క్యూ చేసే పనిలో పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధరకు చెందిన అతను ఎక్కడ పాములు కనిపించిన అక్కడికి వెళ్లి రెస్క్యూ చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు అతను కొన్ని వందల పాములకు పైగా పట్టుకొని రెస్క్యూ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అతడు ఆ పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అతను తీసిన వీడియోలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములు పట్టుకునే క్రమంలో తీసిన కొన్ని వీడియోలైతే జనాలు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. 

తాజాగా కూడా జలీల్ భాయ్ ఓ పామును పట్టుకుంటున్న క్రమంలో తీసి పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ ఇంట్లోకి సంచారం చేసిన కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం మీరు చూడొచ్చు. ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ గ్రామంలో కింగ్ కోబ్రా ఇంట్లోని వంట రూములో సిలిండర్ కింద సంచారం చేస్తుంది. అయితే, దీనిని గమనించిన ఆ ఇంటి యజమాని వెంటనే జలీల్ బాయ్ కి సమాచారం అందించారు వెంటనే అతను అక్కడికి చేరుకొని సిలిండర్ కింద ఉన్న ఆ పాముని రెస్క్యూ చేశారు. 

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం.

ఈ సమయంలో అతను సిలిండర్ కింద ఉన్న చిన్న నాగుపామును తన చేతితోనే బయటికి లాగి.. తోకను పట్టుకొని ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించడం మీరు చూడొచ్చు. ఇలా అతను ఓ ప్లాస్టిక్ డబ్బాలో ఆ పామును బంధించి.. సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు యూట్యూబ్ షార్ట్ వీడియోను కొన్ని వందల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 13:05:32
Secunderabad, Telangana:

New Rules From January 2026: 2026 సంవత్సరం సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా అనేక కొత్త నిబంధనలు, విధాన మార్పులు అమలుకు సిద్ధమవుతున్నాయి. ప్రతి కొత్త సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, ఉద్యోగాలు, రైతాంగం, సోషల్ మీడియా, రవాణా వంటి అనేక రంగాల్లో మార్పులు సామాన్యుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించనున్నాయి. ఈ మార్పులు యువత నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ తాకనున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు:

2026 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ నిర్వహణలో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి అప్ డేట్ అయ్యే క్రెడిట్ డేటాను ఇకపై ప్రతి వారం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల రుణాలపై వడ్డీ రేట్లు, లోన్ అర్హత మరింత పారదర్శకంగా మారనుంది. అదే సమయంలో SBI, PNB, HDFC వంటి ప్రధాన బ్యాంకులు రుణ వడ్డీ రేట్లలో కోత ప్రకటించాయి. ఈ తగ్గింపు ప్రభావం కొత్త సంవత్సరం నుంచి స్పష్టంగా కనిపించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లలో కూడా మార్పులు చేసి, జనవరి నుంచి కొత్త రేట్లు అమలు చేయనున్నారు.

UPI, ఇతర డిజిటల్ చెల్లింపుల విషయంలో భద్రతను మరింత కఠినతరం చేశారు. PAN–Aadhaar లింకింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఇది లేకపోతే బ్యాంకింగ్ లేదా ప్రభుత్వ సేవలు నిలిపివేయబడే అవకాశం ఉంది. అలాగే WhatsApp, Telegram, Signal వంటి యాప్‌లలో సిమ్-లింక్ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు.

సోషల్ మీడియా, ట్రాఫిక్ నియమాల్లో మార్పులు:

సోషల్ మీడియా వినియోగంపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా 16 ఏళ్ల లోపు పిల్లల కోసం కఠిన నియమాలు తీసుకురావాలని చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల మాదిరిగా వయస్సు పరిమితి, కంటెంట్ నియంత్రణలు అమలు చేసే అవకాశముంది.రవాణా రంగంలోనూ మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా కొన్ని నగరాల్లో డీజిల్, పెట్రోల్ వాహనాల వాణిజ్య వినియోగంపై పరిమితులు విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాల్లో డెలివరీ వాహనాలపై కొత్త నిబంధనలు అమలు కావచ్చు.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మార్పులు:

డిసెంబర్ 31తో ఏడవ వేతన సంఘం కాలపరిమితి ముగియడంతో... ఎనిమిదవ వేతన సంఘంపై అంచనాలు పెరిగాయి. 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీనితో పాటు కరువు భత్యం (DA) పెంపు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల కనిపించవచ్చు. హర్యానా వంటి రాష్ట్రాల్లో పార్ట్-టైమ్, రోజువారీ వేతన కార్మికులకు కనీస వేతనం పెంచే నిర్ణయాలు తీసుకున్నారు.

రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు:

రైతుల కోసం కూడా కీలక మార్పులు అమలవుతున్నాయి. ముఖ్యంగా PM కిసాన్ పథకం కింద రైతు ఐడీ తప్పనిసరి చేస్తున్నారు. ఇది లేకపోతే వాయిదాలు రైతు ఖాతాల్లో జమ కావు. పంట బీమా పథకంలో కూడా మార్పులు వచ్చాయి. అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగినా ఇప్పుడు బీమా కవరేజీ లభించనుంది. అయితే నష్టం జరిగిన 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

పన్నులు, గ్యాస్, విమాన టిక్కెట్లపై ప్రభావం:

2026 జనవరి నుంచి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్ విడుదల కానుంది. ఇందులో బ్యాంకింగ్ లావాదేవీలు, ఖర్చుల వివరాలు ముందుగానే పొందుపరిచే అవకాశం ఉంది. LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు జనవరి 1 నుంచి సవరిస్తారు. అలాగే ఎయిర్ ఫ్యూయల్ ధరల్లో మార్పులతో విమాన టిక్కెట్ ధరలపై ప్రభావం పడవచ్చు.

Also Read:  Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

ఈ విధంగా 2026 సంవత్సరం అనేక మార్పులతో మొదలుకాబోతోంది. బ్యాంకింగ్ నుంచి వ్యవసాయం వరకు, ఉద్యోగాల నుంచి సోషల్ మీడియా వరకు ప్రతీ రంగంలో కొత్త నిబంధనలు మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఈ మార్పులను ముందుగానే తెలుసుకుని, జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే కొత్త సంవత్సరం మనకు మరింత లాభదాయకంగా మారే అవకాశం ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 24, 2025 13:04:45
Hyderabad, Telangana:

Rare Cobra Video Watch Now: ప్రకృతిలో పాములు అత్యంత కీలకమైన జీవులుగా చెప్పుకుంటారు.. ఇవి ఆహార గొలుసులో భాగంగా కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవలే అడవుల్లో వనరుల కోరత తగ్గిపోయి.. ఎక్కువగా జనావాసాల మధ్యలోకి పాములు రావడం ప్రారంభమైంది. దీని కారణంగా కొన్ని అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉండే ఊళ్ళలోకి ఎక్కువగా విషపూరితమైన పాములు సంచారం చేస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ పాములు ఇళ్లలోని వంట గదిలో చేరి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే కొంతమంది స్నేక్ క్యాచర్స్ వాటిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. అయితే ఈ సమయంలోనే వారు వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

తాజాగా ప్రముఖ స్నేక్ రెస్క్యూయర్ జలీల్ భాయ్ ఓ అరుదైన 12 ఏళ్ల వయస్సు కలిగిన ఇండియన్ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేస్తున్న సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అతను అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ఎలా పట్టుకుంటున్నాడనేది క్లియర్‌గా కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. 12 ఏళ్లు కలిగిన అత్యంత ప్రమాదకరమైన నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చాలామంది ఇలాంటి కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోలు చూసి అప్పుడప్పుడు భయపడుతూ కూడా ఉంటారు. అయితే ఈ వీడియో కూడా అదే కోవాకు చెందింది గా అనిపిస్తోంది.

వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఈ వీడియోలో ఆ స్నేక్ క్యాచర్ ఒక పెద్ద పాములు పట్టే కర్రను తీసుకొని.. ఆ ప్రమాదకరమైన నాగుపాము తలభాగాన్ని దానితో పట్టి ఉంచడం మీరు గమనించవచ్చు. అయితే ఈ సమయంలో అది ఏ మాత్రం దాడి చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ రెస్క్యూట్ స్టిక్ తో పామును సులభంగా నియంత్రించడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా 12 ఏళ్ల నాటి పాము కావడంతో దాని శరీరం మొత్తం పోలీసులు వదులుతున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. అలాగే దాని తలభాగం కూడా చాలా పెద్దదిగా ఉండడం గమనించవచ్చు. అయితే, జలీల్ భాయ్ ఆ పాముని పట్టుకొని ఓ సంచిలో బంధించాడు. 

ఈ వీడియోలో జలీల్ భాయ్ పామును రక్షించే సమయంలో ఆయన వ్యూయర్స్‌కి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. నాగుపాములు జెర్రిపోతులు సాధారణంగా గుడ్లు పెడతాయని.. రక్తపింజర జాతికి సంబంధించిన పాములు మాత్రం నేరుగా పిల్లలను జన్మనిస్తాయని అతను తెలిపాడు. అంతేకాకుండా ఇలాంటి ప్రమాదకరమైన పాములు కనిపించినప్పుడు తప్పకుండా రెస్క్యూ ఇబ్బందికి సమాచారం అందించాలని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో జలీల్ భాయ్ తన యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Dec 24, 2025 12:23:43
Secunderabad, Telangana:

8th pay commission expectations 7th pay commission impact: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో కీలక దశకు తెరలేవనుంది. డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం పదవీకాలం ముగుస్తుంది. గత 10ఏండ్ల కాలంలో అమలైన మార్పులు మరోసారి చర్చకు వస్తున్నాయి. జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు, పదవీ విరమణ ప్రయోజనాల వరకు 7వ వేతన సంఘం తీసుకొచ్చిన నిర్ణయాలు కోట్లాది కుటుంబాల ఆర్థిక జీవనంపై గణనీయమైన ప్రభావం చూపాయి. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘంపై కేంద్రీకృతమైంది. జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? పెన్షనర్లకు ఎంత ప్రయోజనం లభిస్తుంది? అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే ఇవి 50 లక్షలకుపైగా ఉద్యోగులు.. దాదాపు 69 లక్షల పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.

7వ వేతన సంఘం అమలు.. ప్రధాన మార్పులు:

7వ వేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతాన్ని నెలకు రూ.18,000గా నిర్ణయించారు. అదే సమయంలో అపెక్స్ స్థాయి అధికారుల గరిష్ట జీతాన్ని రూ.2.25 లక్షలుగా, క్యాబినెట్ సెక్రటరీ వంటి అగ్రస్థాయి అధికారులకు రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు. పాత పే బ్యాండ్.. గ్రేడ్ పే విధానాన్ని రద్దు చేసి, కొత్తగా పే మ్యాట్రిక్స్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని వల్ల ఉద్యోగుల స్థాయి, జీతాల పురోగతి స్పష్టంగా మారింది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇంక్రిమెంట్లు:

7వ వేతన సంఘంలో 2.57 యూనిఫాం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అన్ని ఉద్యోగులకు ప్రయోజనాలను అందించారు. దీని కారణంగా ప్రాథమిక జీతాలు గణనీయంగా పెరిగాయి. వార్షిక ఇంక్రిమెంట్ రేటును మాత్రం 3 శాతానికి పరిమితం చేశారు. దీంతో జీతాల పెరుగుదల స్థిరంగా కొనసాగింది.

MACP.. అలవెన్సుల మార్పులు:

MACP నిబంధనల్లో పనితీరు ప్రమాణాన్ని గుడ్ నుంచి వెరీ గుడ్ కు పెంచారు. అదే సమయంలో 52 అలవెన్సులను రద్దు చేసి, మిగిలినవాటిని విలీనం చేశారు. రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సుల కోసం ప్రత్యేకంగా 9-టైర్ మ్యాట్రిక్స్‌ను అమలు చేశారు. ఇంటి అద్దె భత్యం విషయంలో X, Y, Z నగరాలకు వరుసగా 24శాతం, 16శాతం, 8శాతంగా నిర్ణయించారు. డీఏ పెరిగే కొద్దీ HRAలోనూ మార్పులు చేశారు.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

అడ్వాన్సులు, వైద్య సౌకర్యాలు, పెన్షన్:

వడ్డీ లేని అడ్వాన్సులను రద్దు చేసి.. గృహ నిర్మాణ అడ్వాన్సు (HBA) పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. CGEGIS కింద బీమా కవర్ పెరిగింది. వైద్య సదుపాయాల విషయంలో CGHS పరిధిని విస్తరించారు. 2016కి ముందు రిటైర్ అయిన వారికి పెన్షన్ పునఃలెక్కింపు అమలు చేశారు. గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం పెద్ద ఉపశమనంగా మారింది.

8వ వేతన సంఘం.. ఆశలు, అంచనాలు:

8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమలవుతుందా? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వం ఇప్పటివరకు తేదీని ఖరారు చేయలేదని తెలిపింది. కమిషన్ నోటిఫికేషన్ తర్వాత నివేదిక రావడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, ఉద్యోగులు, పెన్షనర్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతాల పెరుగుదల, పెన్షన్ సవరణలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 7వ వేతన సంఘం ముగింపుతో.. ఇప్పుడు 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read:  Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
christmas
Advertisement
Back to top