Anganwadi Teacher Telugu News: అన్యంపుణ్యం ఎరగని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి.. ఒక తల్లిలా అక్కున చేర్చుకోవాల్సిన అంగన్వాడీ టీచర్.. ఆ పిల్లాడి పాలిత కాల యముడు అయింది. క్రమశిక్షణ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఆ టీచర్ విచక్షణ కోల్పోయి.. ఓ పసివాడి పై విరుచుకుపడింది.. ఈ అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విద్యను అందించాల్సిన టీచర్ ఇలా అన్యం పుణ్యం ఎరగని ఓ చిన్నారిపై విరుచుకు పడడం స్థానికంగా తీవ్ర కరకలం రేపింది. ఇంతకీ ఏం జరిగింది? దీనికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన విధ్వాన్స్ అనే బాలుడు స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి గత కొద్ది రోజుల నుంచి వెళ్తున్నాడు. అయితే, పాఠశాల సమయాల్లో బాలుడు అల్లరి చేశాడనో లేదా మరేదైనా కారణంతో గాని అక్కడి టీచర్ తీవ్ర ఆగ్రహానికి లోనైంది.. దీంతో ఆమె పసి పిల్లాడని చూడకుండా ఏకంగా తన చేతిలో ఉన్న కర్రతో రెచ్చిపోయి మరి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది..
అయితే, ఈ దాడిలో విధ్వాన్స్ కంటికి తీవ్ర గాయం అయింది.. అంతేకాకుండా శరీరం అంత వాతలు పడి చర్మం కమీలి పోయినట్లు తెలుస్తోంది. ఆ టీచర్ కొట్టిన భారీ దెబ్బలకు చిన్నారి విలవిలలాడిపోతున్న సదరు ఉపాధ్యాయురాలు కనికరించకపోవడం స్థానికంగా ఊహించని స్థాయిలో చర్చనీ అంశానికి దారితీసింది. సాయంత్రం పూట బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత శరీరంపై ఉన్న గాయాలను చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. కన్ను విపరీతంగా కందిపోయి ఒళ్లంతా దెబ్బలు ఉండడంతో బాలుడిని తల్లిదండ్రులు ఏం జరిగిందని అసలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
దీంతో ఆ బాలుడు అంగన్వాడీ టీచర్ తనను దారుణంగా కొట్టిందని కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రుల వద్ద వివరించాడు.. వెంటనే తల్లిదండ్రులు తమ కుమారుడిని చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్ ఇలా రాక్షసంగా ప్రవర్తించడంపై సదరు బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. మా బిడ్డలను అంగన్వాడికి పంపించేది కేవలం చదువుకోసమే కానీ.. ఇలా దెబ్బలు తినడానికి కాదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Silver Price Prediction 2026: ఇన్వెస్టర్లకు, సామాన్యులకు షాకిచ్చే వార్త ఒకటి బులియన్ మార్కెట్‌లో చక్కర్లు కొడుతోంది. రాబోయే రోజుల్లో వెండి ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని, కేవలం ఏడాది కాలంలోనే కిలో వెండి ఏకంగా రూ.5 లక్షల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇది కేవలం 'తుఫాను ముందు ప్రశాంతత' మాత్రమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల అంచనా (GJC విశ్లేషణ)
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) చైర్మన్ రాజేష్ రోక్డే వెల్లడించిన వివరాల ప్రకారం... 2026 చివరి నాటికి కిలో వెండి ధర రూ.5,00,000 కు చేరే అవకాశం ఉంది.
అదేవిధంగా 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,00,000 మార్కును తాకవచ్చు. ఒకవేళ ప్రభుత్వం జీఎస్టీ (GST), దిగుమతి సుంకాలను తగ్గిస్తేనే సామాన్యులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా వెండి స్పాట్ ధర ఔన్సుకు $82.43 కి పెరిగింది. అమెరికా ట్రెజరీ బాండ్ల దిగుబడి తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.
నేడు భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
కిలో వెండి సుమారు రూ.2,90,000 నుండి రూ.3,00,000 మధ్య ట్రేడ్ అవుతోంది. గత నెల రోజుల్లో వెండి ధర ఏకంగా ఒక లక్ష రూపాయల వరకు దిగి వచ్చినప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే ఇది పెరిగే దిశగానే కనిపిస్తోంది.
ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో కేవలం నగదును దాచుకోవడం కంటే, విలువైన లోహాలైన బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు నెమ్మదిగా వెండిని సేకరించడం ఇన్వెస్టర్లకు లాభదాయకంగా ఉండవచ్చు. అయితే, మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా సేకరించిన సమాచారం మాత్రేమే. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
ALso Read: EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!
Also Read: Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!
EPFO Wage Ceiling Hike 2026: కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ESIC వేతన పరిమితులను భారీగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరుగుతున్న ఈ కసరత్తు, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2014 తర్వాత పీఎఫ్ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు రాలేదు. పెరిగిన ద్రవ్యోల్బణం, జీతాల రీత్యా ఈ పరిమితిని పెంచడం ఇప్పుడు అత్యవసరంగా మారింది.
ప్రస్తుత వేతన పరిమితి vs ప్రతిపాదిత మార్పు
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వేతన సీలింగ్ ఈ విధంగా ఉంది. ప్రస్తుత పరిమితి నెలకు రూ.15,000. దీనిని రూ.25,000కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత పరిమితి నెలకు రూ.21,000. దీనిని కూడా సమాంతరంగా పెంచే అవకాశం ఉంది.
చివరిసారిగా 2014లో రూ.6,500 నుండి రూ.15,000కి పీఎఫ్ పరిమితిని పెంచారు. దశాబ్ద కాలంగా ఇది మారకపోవడంతో, కొంచెం ఎక్కువ జీతం ఉన్నవారు కూడా తప్పనిసరి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు.
ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు
వేతన సీలింగ్ పెంపు అమలులోకి వస్తే కలిగే లాభాలు ఇవే. లక్షలాది మంది కొత్త కార్మికులు EPFO, ESIC పరిధిలోకి వస్తారు. వేతన పరిమితి పెరగడం వల్ల ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నెలవారీ పొదుపు మొత్తం పెరుగుతుంది, ఇది రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. ESIC పరిమితి పెంపు ద్వారా ఎక్కువ మంది కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య బీమా సౌకర్యం లభిస్తుంది.
కేవలం వేతన పరిమితి మాత్రమే కాకుండా, కార్మిక శాఖ మరికొన్ని కీలక అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈపీఎస్-95 (EPS-95) కింద అందుతున్న కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన కనీస వేతన విధానాన్ని తీసుకురావడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ప్రతిపాదనలపై సానుకూల సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ రిపోర్టును సమీక్షిస్తోంది. ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పాత పరిమితులే (EPFO రూ.15,000, ESIC రూ.21,000) కొనసాగుతాయి.
వేతన పరిమితిని రూ.25,000కి పెంచడం అనేది మధ్య ఆదాయ వర్గాలకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఒక గొప్ప వరంగా మారుతుంది. ఇది దేశంలోని శ్రామిక శక్తికి మరింత బలమైన ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.
Also Read: Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lord Shiva Favorite Zodiac Signs: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగల్లో మహాశివరాత్రి ఒకటి. అయితే, ఈ ఏడాది వచ్చిన ఈ పండగకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏడాది పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి తిధి రోజు ఈ పవిత్రమైన పండగను జరుపుకుంటారు. ఈరోజు ఆ మహా శివుడిని అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. మహాశివరాత్రి రోజు శివుడిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించడమే కాకుండా.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. అందుకే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులంతా శివనామ స్మరణతో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు..
హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం వస్తోంది. చతుర్దశి తేదీ ఫిబ్రవరి 15 సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 6న సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. శుభ ఘడియలు ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 12 నుంచి తెల్లవారి జామున వరకు ఉంటాయి. భక్తులంతా ఫిబ్రవరి 15వ తేదీ లేదా 16వ తేదీల్లో ఉపవాసాలు ఉండవచ్చని కొంతమంది జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రాశుల వారు మహాశివుడిని పూజించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఎందుకంటే ఆయనకు కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎల్లప్పుడు ఆయా రాశుల వారికి ఊహించని ప్రయోజనాలను అందిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా చాలావరకు మేలు జరుగుతుంది.
ఈ రాశులవారు బంపర్ జాక్‌పాట్:
వృషభ రాశి
ముఖ్యంగా వృషభరాశి వారికి ఎల్లప్పుడు ఆ మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి వీరికి పనుల్లో అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా.. ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి.. ముఖ్యంగా వీరికి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని ఎప్పుడూ జపించడం వల్ల మానసిక సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామాలు కూడా చేస్తారు. వీరు రుద్రాక్ష మాలలు ధరించడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
మకర రాశి
మహాశివుడు ఎంతో ఇష్టపడి రాశుల్లో మకర రాశి ఒకటి.. వీరికి ఎల్లప్పుడు ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా ఉంటాయి. పాత సమస్యల నుంచి సులభంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే వీరు శివుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. సంతానం పొందే అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వీరు సోమవారం ఉపవాసం పాటించడం వల్ల జీవితంలో ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. అలాగే జీవితంలో వస్తున్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీరు ఈ మహాశివరాత్రి సమయంలో తప్పకుండా శివారాధన చేయడం చాలా మంచిది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Manasantha Nuvve Re-Release: తెలుగు చిత్రపరిశ్రమలో 'లవర్ బాయ్'గా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా, నేటికీ ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం. తాజాగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆమెను చూసిన అభిమానులు "అచ్చం ఉదయ్ కిరణ్ పోలికలే" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుస విజయాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన ఉదయ్ కిరణ్ నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ 'మనసంతా నువ్వే' మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
మళ్లీ వస్తున్న మనసంతా నువ్వే
2001లో విడుదలైన 'మనసంతా నువ్వే' సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక సంచలనం. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో, రీమా సేన్ కథానాయికగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఉదయ్ కిరణ్ మేనకోడలి వీడియో
ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఒక ప్రత్యేక వీడియో బైట్‌ను విడుదల చేసింది. "మనసంతా నువ్వే సినిమా విడుదలైనప్పుడు నేను కేవలం రెండు నెలల పాపను. ఇప్పుడు ఆ క్లాసిక్ మూవీ మళ్లీ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి" అని కోరింది.
ఈ వీడియో చూసిన అభిమానులు మహతి రూపం చూసి షాక్ అవుతున్నారు. మహతి కళ్లు, ముఖ కవళికలు చూస్తుంటే అచ్చం ఉదయ్ కిరణ్ గుర్తుకు వస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "ఉదయ్ కిరణ్‌ను మళ్లీ చూసినట్లు ఉంది" అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన ఉదయ్ కిరణ్.. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆయన తీసుకున్న కఠిన నిర్ణయం (ఆత్మహత్య) ఇప్పటికీ అభిమానులను కలచివేస్తూనే ఉంటుంది.
ప్రేమికుల రోజున 'మనసంతా నువ్వే' రీ-రిలీజ్ కానుండటంతో, ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను వెండితెరపై మరోసారి నెమరువేసుకోవడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. మేనకోడలి వీడియో ఆ ఉత్సాహాన్ని మరింత పెంచింది.
Also Read: Suma Cash Program News: సుమ 'క్యాష్' అంతా మోసం..బండారం బయటపెట్టిన కమెడియన్ సుదర్శన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mars Moon Transit 2026 Effect On Zodiac Telugu: శివపార్వతుల వివాహ దినోత్సవాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుని మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన వచ్చింది. అయితే, ఈ ఏడాది వచ్చిన పండగకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇదే రోజు మూడు ప్రధాన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఈ సమయంలో కుజుడితో పాటు చంద్రుడు వాటి స్థానాలను మార్చుకోబోతున్నాయి. అలాగే బుధుడు శతభిషా నక్షత్రాన్ని వదిలి పూర్వభాద్ర పాద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. దీంతోపాటు కుజుడు, చంద్రగ్రహాలు శ్రవణా నక్షత్రం నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తాయి.. ఈ సమయంలో ఎంతో అద్భుతమైన సంయోగం ఏర్పడబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా ఆయా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలావరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మేష రాశి:
ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఏర్పడే అద్భుతమైన సంయోగాల కారణంగా మేషరాశి వారికి ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు పూర్తి నమ్మకంతో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో ఉన్నటువంటి ఘనకాపాలు కూడా కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చాలా కాలంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పూర్తవుతాయి. ఇక కుటుంబ వాతావరణం కూడా చాలా సంతోషంగా మారుతుంది. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభాలు కలగడంతో కొన్ని రకాల వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి మహాశివరాత్రి నుంచి ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఊహించని స్థాయిలో సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే పూర్వీకుల ఆస్తుల నుంచి భారీ ప్రయోజనాలు పొందుతారు. విశ్వాసం కూడా విపరీతంగా పెరిగి కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా ఎంతో సింపుల్ పరిష్కారం అవుతాయి. అలాగే ఈ సమయంలో అదృష్టం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎన్నో రకాల పనులు సులభంగా పూర్తవుతాయి. దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో అనుకున్నన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి కూడా మహాశివరాత్రి నుంచి మహాశివుడి అనుగ్రహంతో ధైర్యంతో నమ్మకం కూడా పెరుగుతుంది. దీనివల్ల మీరు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బంగారంతో పాటు వెండి ఇతర లోహాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా మారడమే కాకుండా.. ఉద్యోగాల్లో ఊహించని పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు కూడా లభించి.. జీవితంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా అప్పుల బాధల నుంచి ఈ సమయంలో కాస్త పరిష్కారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
మకర రాశి:
మహాశివరాత్రి నుంచి మకర రాశి వారికి శివుడి అనుగ్రహంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. నిలిచిపోయిన పనులు ఎంతో స్పీడుగా ఊపందుకునే అవకాశాలు కనిపి. ఆస్తి సంబంధిత సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. కోర్టు కేసుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాల విస్తరణ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. సొంత వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో పురోగతి కూడా లభించి పదోన్నతులు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit 2026 Effect On Zodiac: జాతకంలో సూర్యుడు క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు అధిపతిగా కూడా భావిస్తారు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని ఆత్మకు కారకంగా కూడా పిలుస్తారు. కాబట్టి హిందూ సాంప్రదాయంలో సూర్యభగవానుడికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే గ్రహాలకు రాజు అయిన ఈ సూర్యుడు ప్రతినెల ఏదో ఒక రాశి సంచారం చేస్తూనే ఉంటాడు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు అన్ని రాశుల వారిపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు శని రాశిగా భావించే కుంభంలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే, ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దీంతో ఆయారాశుల వారి జీవితాల్లో ఎన్నో రకాల మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయట.
ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్:
మేషరాశి
మేషరాశి వారికి సూర్యుడి సంచారం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. వీరికి ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా.. అన్ని రకాల పనుల్లో అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడి కొన్ని రకాల విషయాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. చాలా కాలంగా వస్తున్న సమస్యలు ఎంతో సింపుల్ గా పరిష్కారం అవుతాయి.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. వ్యక్తిగత జీవితంలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అంతేకాకుండా భారీ మొత్తంలో ఆదాయం లభించడమే కాకుండా ఆనందం కూడా పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారీ మొత్తంలో లాభాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
మిథున రాశి
మిథున రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. విద్యా పరిశోధన మీడియా రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. సీనియర్ల నుంచి మంచి గుర్తింపు పొందడమే కాకుండా జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Massive Transfers Of IAS Officers: రాష్ట్రంలో పరిపాలన విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం ప్రభుత్వం 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అత్యంత కీలకమైన సింగరేణిలో కూడా మార్పు చేయడం గమనార్హం. మున్సిపల్ ఎన్నికల రోజే ఈ బదిలీ జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పరిపాలన సౌలభ్యం కోసం ఈ ఆఫీసర్ల బదిలీ జరిగినట్లు సమాచారం. ఇక సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమించారు. ఆ బాధ్యతలో ఉన్న డి. కృష్ణ భాస్కర్ ను తప్పించారు.
ఇక దివ్య దేవరాజన్ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ భాగంతో పాటు రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించారుజ మయాంక్ మిట్టల్ జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించగా.. రఘురాం శర్మను పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి సభ్యసాచి ఘోష్ ప్రస్తుతం బాధ్యతలతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా నియమించింది.
ఇక కాత్యాయని దేవిని ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ చేశారు. ఆమె స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
IAS - Transfers and Postings - Orders - Issued. pic.twitter.com/5hnibXsLVR
— IPRDepartment (@IPRTelangana) February 11, 2026
Also Read: గందరగోళంగా అర్ధరాత్రి విడుదలైన టెట్ ఫలితాలు.. ఆ టీచర్‌లే సత్తా చాటారు..!
Also Read: వాహనదారులకు బిగ్ అలెర్ట్.. మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరిగితే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Govt Employees Holiday: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అన్నీ శాఖల ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. వాస్తవంగా అయితే సెలవు కానీ అందరూ విధుల్లో ఉండాల్సిన దృష్ట్యా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఉద్యోగులు కూడా భాగం కావాల్సి ఉండడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే తెలంగాణలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణలోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సెలవు ప్రకటించినా కూడా ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో ఉద్యోగులు విధిగా విధులు నిర్వర్తించాల్సి ఉంది. దీంతో వేతనంతో కూడిన సెలవు ప్రభుత్వం ఇచ్చింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వానికి బహిరంగ లేఖ
రేపు పోలింగ్..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల సందర్భంగా రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారం ముగియగా ఎన్నికలు రేపు ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో బుధవారం రోజున సెలవు ఇవ్వగా.. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా పలుచోట్ల స్కూళ్లకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. ఈ మున్సిపల్ పోరులో బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులతోపాటు పలు సర్వేలు వెల్లడించాయని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయని సమాచారం. అందుకే విచ్చలవిడిగా ఎన్నికల్లో ప్రలోభాలు, డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Also Read: TTD Services: భక్తులతో టీటీడీ చైర్మన్.. ఎలా ఉన్నాయమ్మ తిరుమల అన్నప్రసాదం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo K14x 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మొబైల్ను విడుదల చేసింది. ఇది ఒప్పో K14x 5G పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌తో లాంచ్ చేసింది. ఇది చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వివిధ కలర్ ఆప్షన్స్‌లో విడుదలైంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది IP64-రేటెడ్‌తో వినిపిస్తోంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మార్కెట్‌లో వేరియంటును బట్టి ధర అందుబాటులో ఉంది.. ముఖ్యంగా 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.14 వేల నుంచి ప్రారంభమవుతుంది.
ఇక 6జిబి ర్యాంతో పాటు 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ. 16,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్లలో కూడా లభిస్తుంది. మొదటి సెల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ తీసుకున్న ఆఫర్స్ కూడా లభిస్తాయి. Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్ 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది.
అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6300 6nm ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. అలాగే స్టోరేజ్‌ను పెంచుకోవడానికి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఇది Android 16 ఆధారంగా ColorOS 16పై రన్ అవుతుంది. ఈ Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన IP64 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని వెనక భాగంలో ప్రత్యేకమైన సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు అదనంగా 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా కూడా లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇక ఈ Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది ప్రత్యేకమైన సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఒప్పో కంపెనీ 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది ప్రత్యేకమైన 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఫీచర్లతో లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Russells Viper Video Watch Here: ఇటీవలే ఓ నివాసిత ప్రదేశంలో అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర పాము ప్రత్యక్షమై స్థానికులను తీవ్రభయాందోళనకు గురిచేసింది. ఇంట్లోని మెట్ల కింద ఉన్న చిన్న చిన్న వస్తువుల మధ్య దాగి ఉన్న పామును ఒక వన్యప్రాణి సంరక్షకుడు రెస్క్యూ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా అడవికి దగ్గరగా ఉండే ప్రదేశాలు ఇలా ప్రమాదకరమైన పాములు సంచారం చేయడం సర్వసాధారణమే. కానీ, వీరు ఎల్లప్పుడు ఇంటి పరిసరాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణానికే ముప్పు.. అయితే ఈ వీడియోలో అతను ఆ ప్రమాదకరమైన రక్తపింజర పాము (Russell’s Viper)ను ఎలా పట్టుకున్నాడో? దీనికి సంబంధించిన పూర్తి వీడియోకు సంబంధించిన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇంటి లోపల మెట్ల కింద ఉన్న కొన్ని వస్తువుల్లో భారీ రక్తపింజర పాము ఉన్నట్లుండి యజమాని గుర్తించారు. అయితే వెంటనే అతను వన్యప్రాణి సంరక్షకుల బృందానికి సమాచారం అందించారు. ఆ స్నేక్ క్యాచర్ టీం వెంటనే అక్కడికి చేరుకొని ఆ పామును రెస్క్యూ చేపట్టేందుకు ప్రయత్నించారు.. అయితే ఈ రక్త పింజర పాము చాలా డేంజర్.. కాబట్టి దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే వారు ఈ పాముకు చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగింది.
స్నేక్ క్యాచర్ ముందుగా ఆ పామును పట్టుకోవడానికి మెట్ల కింద ఉన్న వస్తువులను అటు ఇటు కలిపాడు.. వెంటనే వారికి ఒక గిన్నెలో రక్తపింజర పాము కనిపిస్తుంది. దానిని అతని దగ్గర ఉన్న స్నేక్ హుక్కుతో బయటికి తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో ఆ పాము దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఆ స్నేక్ క్యాచర్ ఎంతో ఓపికతో ఆ పామును బయటికి తీసి ఒక ప్లాస్టిక్ బకెట్‌లో వేసుకొని బయటికి ఎంతో జాగ్రత్తగా తీసుకువస్తాడు. ఆ తర్వాత అతను ఆ ప్రమాదకరమైన పామును ఎంతో తేలికగా ఒక ప్లాస్టిక్ డబ్బా నుంచి మరో ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చుతాడు.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
ఇలా ఆ పామును డబ్బా మార్చే క్రమంలో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతను ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకొని.. డబ్బాలో బంధించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కన ఉన్న వారంతా పామును చూసి ఆశ్చర్యపోతారు. భయంతో దూరంగా నిలబడడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇలా డబ్బాలో బంధించిన పామును అక్కడి నుంచి ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pay Revision Commission: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్‌లో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు తమ ఇళ్ల గేట్లకు బోర్డులు, బ్యానర్లు ప్రదర్శించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు.
Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణలోని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 డీఏలను పెండింగ్‌లో ఉందని బండి సంజయ్ గుర్తుచేశారు. ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ బకాయిలను కూడా చెల్లించడం లేదని వివరించారు. 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని రెండున్నరేళ్లు అవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయం అని చెప్పారు. కనీసం పీఆర్సీ రిపోర్ట్‌ను కూడా తెప్పించకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉందో అర్ధం చేసుకోవచ్చని లేఖలో బండి సంజయ్ ప్రస్తావించారు.
Also Read: Srisailam: శ్రీశైలం కొండపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. భక్తులు, శివస్వాముల ఆందోళన
'ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. 2024 నుంచి నేటి వరకు దాదాపు 13 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. నేటి వరకు వారికి రావాల్సిన బెనిఫిట్స్, 5 డీఏలు చెల్లించకపోవడం ఎంతవరకు న్యాయం?' అని లేఖలో బండి సంజయ్ ప్రశ్నించారు. రిటైర్ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదని స్పష్టం చేశారు. జీవితాంతం ప్రభుత్వానికి ఊడిగిం చేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయితే వారిని బెనిఫిట్స్ అన్నీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వారి ఉసురు పోసుకోవడం అత్యంత శోచనీయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. బెనిఫిట్స్ అందక ఏడాది నుంచి 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు లోనై మరణించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా? వారిపై ఆధారపడిన కుటుంబాలకు మీరేం సమాధానం చెబుతారు? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
'రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయలకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కలిపితే రూ.12 వేల కోట్లకుపైగా ఉన్నాయి. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించడం భారంగా మారిందా?' అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలన్నీ చెల్లించాలని రేవంత్ రెడ్డిని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల తరఫున తాము పెద్దఎత్తున ఆందోళనలు చేసేందుకూ వెనుకాడమని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Schools Holiday: హైదరాబాద్‌లోని గాజులరామారం డివిజన్ పరిధిలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భూమి దాదాపు నాలుగు నుంచి ఐదు సెకండ్ల పాటు కనిపించింది. దీంతో స్థానికులంతా తీవ్రభయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మెట్కాన్‌గూడ ప్రాంతంలో భారీ శబ్దంతో కూడిన ప్రకంపనులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు ఇళ్ళ నుంచి బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో తీవ్రభయాందోళనలు చెందారు.
మీడియాతో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల సమయంలో అకస్మాత్తుగా భూమి వెలపల నుంచి పెద్ద శబ్దం వినిపించిందని.. ఆ వెంటనే భూమి కనిపించినట్లు అనిపించడంతో వారంతా షాక్కు గురయ్యారని చెబుతున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో ఆ ప్రకంపనల దాటికి ఇంట్లో సామాన్లు కదడంతో పాటు పాత్రలు కింద పడిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని.. వారంతా రోడ్లపైకి వచ్చినట్లు తెలిపారు.
మెట్కాన్‌గూడలోనైతే.. ఉన్నట్టుండి భారీ శబ్దం రావడంతో.. ఇంట్లో ఉన్న తలుపులతో పాటు కిటికీలు వణికి పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.. ఇక కొంతమంది భూకంపమేనని భయపడి పిల్లలతో కలిసి బయటకు పరుగులు తీసిన సందర్భం కూడా వచ్చిందని వారు మీడియాకు తెలిపారు..
భూ ప్రకంపనల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్థానికంగా ఉన్న పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్త మైనట్లు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించి.. విద్యార్థులను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.. అకస్మాత్తుగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఆ ప్రాంతంలో కాసేపు గందరగోల పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పాఠశాలలో మళ్లీ 11వ తేదీన తెరుచుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Earthquake Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం?
ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికుల్లో పలు అనుమానాలు రేకెత్తుతూ వస్తున్నాయి.. ఈ భూప్రకంపనలనేవి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినవా? లేక సమీపంలో ఏమైనా భారీ పేలుడు పదార్థాలు ప్రయోగించడం వల్ల వచ్చిన శబ్దమా? అనే కోణంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.. అయితే, అధికారులు దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.. ముఖ్యంగా గనుల తవ్వకాల్లో వాడే జిలెటిన్ స్టిక్స్ పేలుళ్ల వల్ల కూడా ఇలాంటి శబ్దాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Earthquake Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook