Adulterated Ghee Seize: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. ప్రతిదీ కల్తీ చేస్తున్న కేటుగాళ్లు తాజాగా నెయ్యిని పెద్ద ఎత్తున కల్తీ చేస్తున్న ఉదంతం బయటపడింది. రంజాన్ మాసంతోపాటు పండుగ సీజన్ కావడంతో నాసిరకం పదార్థాలతో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లాభాలకు ఆశపడి ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా యథేచ్చగా కల్తీ నెయ్యి తయారుచేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. 460 కిలోల కల్తీ నెయ్యితోపాటు కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను సీజ్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి
కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీమ్, మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో కల్తీ నెయి ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని రోడ్ నంబర్ 12, భోలానగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైడ్ డెయిరీలో కల్తీ నెయ్యి తయారుచేస్తుండగా ఆ కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ దాడిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి భారీ మొత్తంలో కల్తీ నెయ్యి, తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: YS Jagan: మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేయిస్తావా? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
మొహమ్మద్ జునైద్ హుస్సేన్ (26), తన తండ్రి మొహమ్మద్ మౌజం హుస్సేన్ బంజారాహిల్స్‌లోని భోలానగర్ ప్రైడ్ డెయిరీ నిర్వహిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నాసిరకం వస్తువులతో కల్తీ నెయ్యి తయారుచేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు డెయిరీపై దాడి జరిపి పరిశీలించారు. ఈ దాడిలో సుమారు రూ.18,26,679 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా 460 కేజీల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యితో పాటు భారీ స్థాయిలో కల్తీకి ఉపయోగించే 2,090 కేజీల ఆవు మీగడ, 1,170 కేజీల గేదె మీగడ ఉన్నాయి.
Also Read: Bandi Sanjay: రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతదేశానికి గ్రహణం: బండి సంజయ్
స్వాధీనం చేసుకున్న వస్తువులు
నెయ్యి కల్తీ కోసం ఉపయోగిస్తున్న 28 డబ్బాల (15 కేజీలు) రుచి గోల్డ్ డాల్డా, ఇతర ఖాళీ డబ్బాలు, ఆయిల్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తయారీకి వినియోగిస్తున్న 2 బాయిలర్లు, ఒక పుషింగ్ మిషన్, ఒక ప్యాకింగ్ మిషన్, రెండు వెయిటింగ్ మిషన్లు, 4 గ్యాస్ సిలిండర్లు, నెయ్యి నిల్వ ఉంచిన సుమారు 70 రకాల చిన్న, పెద్ద బేసన్లు, ఖాళీ డ్రమ్ములు, ప్యాకింగ్ కవర్లను పోలీసులు సీజ్ చేశారు.
నిందితుడు మొహమ్మద్ జునైద్ హుస్సేన్ తన ప్రైడ్ డెయిరీ యూనిట్‌లో లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. తక్కువ నాణ్యత కలిగిన పామాయిల్, వనస్పతి (డాల్డా), ఇతర హానికరమైన పదార్థాలను ఆవు, గేదె మీగడలో కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. కల్తీ నెయ్యిని అసలైన నెయ్యిగా నమ్మిస్తూ హోటళ్లకు, శుభకార్యాలకు, వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ప్రైడ్ డెయిరీపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో హైదరాబాద్ సిటీ అడిషనల్ డిసిపి (టాస్క్ ఫోర్స్) అందె శ్రీనివాసరావు, సీఐలువెంకటేష్, ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు విజయానంద్, చందన ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
BRS Party Committees: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. 2023 ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గులాబీ పార్టీ గెలుచుకోలేక పోయింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సైతం బీఆర్ఎస్ సాహసం చేయలేదు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ చేతిలో కారు పార్టీ అడ్రస్ గల్లంతు అయ్యింది. ఇక డిసెంబర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అనుకున్న దాని కంటే ఎక్కువగానే గెలుచుకోగలిగింది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చాయి. 30 స్థానాలకు పైగా గెలుచుకుంటామని భావించిన సాధ్యం కాలేదు. అయితే ఓటమికి గల కారణాలను విశ్లేషించడంలో మాత్రం గులాబీ పార్టీ హైకమాండ్ మరిచిపోయిందన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కారు పార్టీ పెద్దలు దృష్టి పెట్టక పోవడంపై నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో కమిటీలు వేస్తామని, మెంబర్‌షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పిన ఇంకా దానిపై పార్టీ దృష్టి పెట్టడం లేదని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు.
Also Read: Adulterated Ghee: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. బంజారాహిల్స్‌లో 460 కిలోల కల్తీ నెయ్యి సీజ్
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండేళ్లు అవుతోంది. ఒకవైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. తాజాగా వికారాబాద్ లో డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతులను సైతం హస్తం పార్టీ నిర్వహించింది. ఈ శిక్షణ తరగతులకు పీసీసీ చీఫ్ తో పాటు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. రాహుల్ గాంధీ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులకు పార్టీ సంస్టగత నిర్మాణంపై దిశ నిర్దేశం చేశారు. కానీ రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ మాత్రం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టలేదనీ సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి గులాబీ పార్టీకి రాష్ట్ర కమిటీ కూడా లేకపోవడం ఆ పార్టీ నాయకత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని చర్చించుకుంటున్నారు. ఇక గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు కొత్తవి వేస్తే యువత కూడా యాక్టివ్ గా పని చేస్తుందని చర్చించుకుంటున్నారు. అలాగే పార్టీ అనుబంధ సంఘాలు ఉన్నాయో లేవో కూడా అర్థం కాని పరిస్థితులు ప్రతిపక్ష బిఆర్ఎస్ లో ఉన్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించింది. తర్వాత అధికారంలోకి వచ్చాక ఎన్నడూ సంస్థాగత నిర్మాణంపై కానీ.. శిక్షణ తరగతుల గురించి కానీ ఆలోచన చేయలేదు అని పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో బిఆర్ఎస్ నాయకత్వం ఆలోచన చేయడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.
Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి
మరొకవైపు పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు.. సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని గత ఏడాది ప్రారంభంలో బిఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రకటించారు. గత ఏప్రిల్ 27న బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించింది. మళ్లీ బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం దగ్గరికి వస్తున్నప్పటికీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయట. అన్ని జిల్లాల్లో శిక్షణా తరగతులు కూడానిర్వహిస్తామని కేటీఆర్ గతంలోనే చెప్పారు. కానీ ఆచరణకి మాత్రం నోచుకోలేదు. మరొకవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘాలు బలంగా పనిచేశాయి. విద్యార్థి, యువజన విభాగంతోపాటు మహిళా విభాగం చాలా కీలకంగా ఉద్యమంలో పనిచేశాయి. అయితే 2017లో ఏర్పాటు చేసిన కమిటీలు, అనుబంధ సంఘాలే ఇప్పటికి కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మహిళా అధ్యక్షులుగా ఉన్న గుండు సుధారాణి పార్టీని వీడినప్పటికీ ఇప్పటికీ ఆమె పోస్ట్ ను భర్తీ చేయలేదు. ఇక బీఆర్ఎస్ యువ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కొనసాగుతున్నారు. బీఆర్ఎస్వీ నేతగా గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. విద్యార్థి, యూత్, మహిళా విభాగాలతో పాటు.. రైతు, కార్మిక, ఎస్సీ, ఎస్టీ విభాగాలకు భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు బిఆర్ఎస్ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి.
Also Read: YS Jagan: మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేయిస్తావా? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
మండల, రాష్ట్రస్థాయి పదవుల భర్తీ ఇప్పట్లో లేనట్టేనా?
ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా పని చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీలో కమిటీలను వేసి పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారట. ముఖ్యంగా చాలా కాలంగా తమకు పార్టీ పదవులు వస్తాయని ఆశతో ఉన్న నేతలు.. చురుగ్గా పని చేయడానికి సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ తమకు తగిన గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదనలో మెజార్టీ నేతలు క్యాడర్ ఉన్నారని నేతలు చర్చించు కుంటున్నారు. పార్టీ సంస్థ గత నిర్మాణంపై దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నారు.. కమిటీలు శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా పార్టీలో ఉండే యువత నాయకులు యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొంటారని చర్చించుకుంటున్నారు. అయితే అధికారం కోల్పోయ రెండు సంవత్సరాలు అవుతున్న ఇంకా తాత్సారం చేయడంపైన క్యాడర్ లో అసంతృప్తి నెలకొంది. ఈ ఫిబ్రవరి నెలలోనే కమిటీలో ఉంటాయని భావించిన నేతలకు నిరాశే మిగిలింది. మొత్తంమీద గులాబీ బాస్ కేసీఆర్ మనసులో ఏముందో అంతుచిక్కడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
No Confidence Motion Against Moshenu Raju: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్‌పై కూటమి సర్కార్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ పదవి నుంచి తప్పించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నట్టు సమచారం. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే ఆయనపై అవిశ్వాసం పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయినప్పటికీ మండలిలో మాత్రం వైసీపీ హవానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆవిశ్వాసం దిశంగా ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీలో అనేక అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఇటీవల తిరుమల లడ్డూ వ్యవహారం, ఇతర అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీపై పైచేయి సాధించింది. కానీ మండలిలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దమైన వాతావరణం కనిపిస్తోంది. ఇందుకు కారణం మండలిలో వైసీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉండటమే. అంతేకాదు ప్రస్తుతం మండలి చైర్మన్ కూడా వైసీపీ నేత కావడంతో కూటమి నేతల పప్పులు ఉడకడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు కొన్ని రకాల బిల్లులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వైసీపీతో పాటు శాసనమండలి పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీల విషయంలో చైర్మన్ మోషేన్ రాజు అడ్డంకిగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను పదవి నుంచి దించాలని కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చినట్లు కనిపిస్తోంది.
Also Read: YS Jagan: మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేయిస్తావా? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
మొన్నటి ఎన్నికల వరకు శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల బలం 38 మంది. అయితే క్రమేపీ వారి సంఖ్య తగ్గుతోంది. ఓ ఆరుగురు ఎమ్మెల్సీలకు రాజీనామా చేశారు. మరికొందరు అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మండలిలో కూటమి బలం పెరుగుతూ వస్తోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉండనే ఉన్నారు. అటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా మంత్రులు ఉన్నారు. అందుకే మండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూటమి ప్రభుత్వం డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. 18 నెలలుగా చైర్మన్ మండలిలో కొనసాగుతున్న తీరును కూటమి ప్రభుత్వం తప్పుపడుతోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదని అనిపిస్తోంది. అయితే ఇంకా రెండేళ్లు పదవి ఉండగానే ఆయన్ను తప్పించేందుకు అవిశ్వాసం అస్త్రాన్ని బయటకు తీసినట్టు తెలుస్తోంది.
ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2022లో మోషేన్ రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి మండలిలో గట్టి పట్టు ఉండేది. ఎప్పుడైతే మండలిలో వైసీపీ బలం పెరిగిందో అప్పుడే మోషన్ రాజుకు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. మోషేన్ రాజుకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉంది. అప్పటివరకు చైర్మన్‌గా ఆయనను కూర్చోబెడితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీకి కొందరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అయినప్పటికీ వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. పైగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైసీపీకి సభలో ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే అవిశ్వాసం పెట్టి మోషేన్ రాజును గద్దెదించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలనే ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Stock Market: భారతీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై పెట్టుబడిదారులను కలవరపరిచాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న నెగెటివ్ సిగ్నల్స్ అన్ని కలిసి దేశీయ స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే అమ్మకాలు ఆధిపత్యం చెలాయించగా, రోజు ముగిసే సరికి సూచీలు గణనీయమైన నష్టాలతో ముగిశాయి.
బెంచ్‌మార్క్ సూచీలలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు (సుమారు 1.4శాతం) పడిపోయి 79,116.19 వద్ద నిలిచింది. ఒక దశలో ఇది 1,700 పాయింట్ల వరకు క్షీణించడం గమనార్హం. అదే సమయంలో నిఫ్టీ 50 385.20 పాయింట్లు (1.55శాతం) తగ్గి 24,480.50 వద్ద ముగిసింది. ఈ పతనంతో సెన్సెక్స్ దాదాపు 11 నెలల కనిష్టాన్ని, నిఫ్టీ 10 నెలల కనిష్టాన్ని తాకాయి. మార్కెట్ వెడల్పు బలహీనంగా ఉండటం పరిస్థితిని మరింత స్పష్టంగా చూపించింది. లాభాల్లో ముగిసిన షేర్లు 759 మాత్రమే కాగా, 2,945 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్‌లో భయాందోళనలను కొలిచే సూచికగా భావించే ఇండిమా VIX ఒక్కరోజే 22 శాతం ఎగిసి 20.83 వద్దకు చేరింది. ఇది పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆందోళనకు అద్దం పడుతోంది. మరోవైపు రూపాయి విలువ కూడా ఒత్తిడిని ఎదుర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 69 పైసలు క్షీణించి 92.18 స్థాయికి చేరడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Also Read: Iranian ship: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక ప్రమాదం.. 100 మందికిపైగా గల్లంతు..!!
చమురు ధరల పెరుగుదల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా బ్రైంట్ క్రూయిడ్ ధర బ్యారెల్‌కు 82.11 డాలర్లకు చేరుకుంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో, ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సరఫరా గొలుసుపై ప్రభావం చూపితే వ్యాపార లోటు పెరిగి, రూపాయి విలువపై మరింత ఒత్తిడి రావచ్చు.
ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. దక్షిణ కొరియా కోస్పి సూచీ గణనీయంగా పడిపోగా, జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) వరుసగా అమ్మకాలు కొనసాగించడం దేశీయ మార్కెట్‌ను మరింత బలహీనపరుస్తోంది. సోమవారం ఒక్కరోజే వారు రూ.3,295 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించినట్లు డేటా సూచిస్తోంది.మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, నిఫ్టీ 24,500 స్థాయికి పైగా నిలబడితే కొంత ఉపశమనం లభించవచ్చు. లేకపోతే 24,000 నుంచి 23,550 మధ్య స్థాయిలను పరీక్షించే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించి, దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Kurdish Army: కుర్దిష్ సైన్యం దెబ్బతో ఇరాన్ లొంగిపోనుందా? అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Iranian warship accident: పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. శ్రీలంక సముద్ర జలాల్లో చోటుచేసుకున్న ఒక సంఘటన అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించింది. ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ఒకటి శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురికావడం.. ఆ తర్వాత చేపట్టిన రక్షణ చర్యలు ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం.. గాలె తీరానికి సుమారు 40 నాటికల్ మైళ్ల దూరంలో “IRIS Dena” అనే ఇరాన్ యుద్ధనౌక ప్రమాదంలో పడినట్లు సమాచారం అందింది. వెంటనే శ్రీలంక నేవీ శ్రీలంక ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. నౌకాదళ నౌకలు, గగనతల సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి.
ఆ నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారిక సమాచారం. అందులో 78 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు శ్రీలంక రక్షణ వర్గాలు తెలిపాయి. రక్షించిన వారిలో 32 మంది గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. గాయపడినవారిని నేవీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, సుమారు 101 మంది సిబ్బంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారి కోసం సముద్రంలో విస్తృత శోధన కొనసాగుతోంది.
ఈ నౌక ఎలా ప్రమాదానికి గురైందన్న అంశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం జలాంతర్గామి దాడి జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నౌకకు తీవ్ర నష్టం వాటిల్లి మంటలు చెలరేగినట్లు సమాచారం. దాడి అనంతరం నౌక నుంచి అత్యవసర సంకేతాలు శ్రీలంక నేవీకి చేరినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Kurdish Army: కుర్దిష్ సైన్యం దెబ్బతో ఇరాన్ లొంగిపోనుందా? అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే..!!
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక సముద్ర జలాల్లో ఇరాన్ నౌకపై దాడి జరగడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయితే ఈ దాడి వెనుక ఏ దేశం ఉందో, వాస్తవంగా జలాంతర్గామి దాడే జరిగిందో లేదో ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. మరో ముఖ్య అంశం ఏమిటంటే, ఈ నౌక ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు సమాచారం. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరాన్‌కు బయలుదేరిన ఈ నౌక శ్రీలంక సముద్ర జలాల గుండా ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీలంక రక్షణ బలగాలు గల్లంతైన సిబ్బందిని గుర్తించేందుకు శోధన చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటన పశ్చిమాసియా ఉద్రిక్తతలు దక్షిణాసియా సముద్ర జలాల వరకు విస్తరించాయనే సంకేతాన్ని ఇస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Rah Veer Scheme Telugu News: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను చూసి చూడనట్లు వెళ్లకుండా.. వారిని సకాలంలో వైద్య సదుపాయం కల్పించే మనసున్న వ్యక్తుల కోసం భారత కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే రహ్ వీర్ (Rah Veer Scheme) పథకం.. దీని ద్వారా రోడ్డు ప్రమాదాల్లో సాయం చేసిన పౌరులకు రూ.25 వేల బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాల్లోనైనా గాయపడిన వారిని రక్షిస్తే ఈ పథకం చెల్లుబాటు అవుతుందని ఆయన తెలిపారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య పరిభాషలో ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. ఈ సమయంలో బాధితుడికి సరైన చికిత్స అందితే ప్రాణాలు నిలిచే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఎంతోమంది బాధితులు సరైన సమయంలో ఆస్పత్రికి చేరలేక ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. సామాన్య పౌరులే అత్యవసర కష్టానికి మేలు చేసేవారుగా మారాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఇందులో భాగంగానే ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
రహ్ వీర్ పథకం ప్రత్యేకత ఇదే..
ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. వారిని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. ప్రాణాలు కాపాడిన వారికి ఈ పథకం క్రింద రూ.25 వేల బహుమానం అందజేస్తారు. అంతేకాకుండా సాయం చేసిన వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ప్రశంసా పత్రం కూడా లభిస్తుంది. అలాగే వారిని పోలీసులు వేధించారని.. గుడ్ సమరిటన్‌లుగా గుర్తించి గౌరవిస్తారని జగిత్యాల జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు..
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఇతరుల ప్రాణాలను కాపాడడం మనందరి సామాజిక బాధ్యతని.. ప్రజలు భయం వీడి మానవ దృక్పథంతో ముందుకు సాగాల్సిన సమయం రావాలని.. మీరు చేస్తే చిన్న సహాయం ఒక కుటుంబానికి ఎంతో ఊరటనిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా బాధితులకు వెంటనే వైద్యం అందడమే కాకుండా రోడ్డు ప్రమాద మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన మీడియా ముఖంగా ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఇప్పటికే ఈ పథకం ద్వారా కొంతమంది రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి రూ.25 వేలు పొందినట్లు సమాచారం. మీరు కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిలా మారి.. రోడ్డు ప్రమాద బాధితులను మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్చండి.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Kurdish Army: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కుర్దిష్ దళాల పాత్రపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అమెరికా కొత్త వ్యూహంలో కుర్దిష్ సాయుధ గుంపులను భాగస్వామ్యం చేయాలనే ఆలోచన ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్దులు ఎవరు? కుర్దిష్ సైన్యం అంటే ఏమిటి? అమెరికా వారికి మద్దతు ఇవ్వాలనుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కుర్దులు ఎవరు?
కుర్దులు మధ్యప్రాచ్యంలో విస్తరించి ఉన్న ఒక జాతి సమూహం. వీరు ప్రధానంగా టర్కీ, ఇరాక్, సిరియా, ఇరాన్, అమెరికా సరిహద్దు పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారి జనాభా సుమారు 25 నుంచి 35 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా. స్వతంత్ర దేశం లేకపోయినా, కుర్దులు తమ ప్రత్యేక భాష, సంస్కృతి, చరిత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. మధ్యప్రాచ్యంలో నాల్గవ అతిపెద్ద జాతి సమూహంగా వీరిని పరిగణిస్తారు.
ఇరాన్‌లో కుర్దుల పరిస్థితి:
షియా ముస్లింలు అధికంగా ఉన్న ఇరాన్‌లో, కుర్దులు ప్రధానంగా వాయువ్య ప్రాంతాల్లో నివసిస్తారు. వీరిలో ఎక్కువ మంది సున్నీ ముస్లింలు ఉన్నారు. మానవ హక్కుల సంస్థలు, ముఖ్యంగా ఆమేన్స్టీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం, ఇరానియన్ కుర్దులు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి, అభివృద్ధి, రాజకీయ ప్రతినిధిత్వం వంటి అంశాల్లో వారు వెనుకబడి ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
కుర్దిష్ సైన్యం అంటే ఏమిటి?
కుర్దిష్ సైన్యం అనేది ఒకే కేంద్రానికి చెందిన అధికారిక జాతీయ సైన్యం కాదు. వివిధ దేశాల్లోని కుర్దిష్ సాయుధ గుంపులు తమ తమ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి లేదా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుంటాయి. ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతం అనేక కుర్దిష్ రాజకీయ, సాయుధ గుంపులకు స్థావరంగా ఉంది. ఇరాన్ వ్యతిరేక కుర్దిష్ గుంపులు కొన్నిసార్లు సరిహద్దు ప్రాంతాల్లో ఇరాన్ భద్రతా దళాలతో ఘర్షణలకు దిగుతుంటాయి.
అమెరికా వ్యూహం ఏమిటి?
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. CIA ఇరాన్‌లోని కుర్దిష్ దళాలకు పరోక్ష మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉందని సమాచారం. అదేవిధంగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కాలంలో ఇరాన్ ప్రతిపక్ష గుంపులతో చర్చలు జరిగాయనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఇరాక్‌లోని కుర్దిష్ నాయకులతో వ్యూహాత్మక సహకారం పెంచే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు.
ఈ వ్యూహం వెనుక ఉన్న భావన ఏమిటంటే.. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఒత్తిడి పెంచడం ద్వారా అక్కడి భద్రతా వ్యవస్థను బలహీనపరచడం. కొందరి అభిప్రాయం ప్రకారం, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రధాన నగరాల్లో ప్రజా నిరసనలు చెలరేగే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం వ్యూహాత్మక అంచనాలే తప్ప, వాస్తవ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.
ఇరాన్ లొంగిపోతుందా?
ఈ విధమైన చర్యలతో ఒక దేశం తక్షణమే లొంగిపోతుందని భావించడం సరళీకృత అంచనా మాత్రమే. ఇరాన్‌కు బలమైన సైనిక, భద్రతా వ్యవస్థ ఉంది. ముఖ్యంగా Islamic Revolutionary Guard Corps (IRGC) వంటి శక్తివంతమైన దళాలు అంతర్గత భద్రతను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తాయి. కాబట్టి బాహ్య మద్దతుతో జరిగే ప్రాంతీయ అస్థిరత దేశవ్యాప్తంగా రాజకీయ మార్పుకు దారి తీస్తుందా లేదా అన్నది అనిశ్చితమే. కుర్దిష్ అంశం మధ్యప్రాచ్య రాజకీయాల్లో సున్నితమైనది. అమెరికా లేదా ఇతర దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు, ప్రాంతీయ రాజకీయాలు, స్థానిక ప్రజల ఆకాంక్షలు ఇలా అన్ని కలిసి సంక్లిష్ట పరిస్థితిని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా మారుతాయో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Dharavi Slum Tourism Telugu: ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవంతులు ఒకవైపు.. మరోవైపు అదే నగరంలోని ఆసియా అతిపెద్ద మురికివాడ ధారావి మరొకవైపు.. అయితే ఇప్పుడు ఈ మురికివాడ ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుందట.. వినడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ.. ధారావి గల్లీలను చూసేందుకు విదేశీ పర్యాటకులు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదండోయ్ కేవలం రెండు గంటల పర్యటన కోసం ఒక్కొక్క వ్యక్తి నుంచి గైడ్లు ఏకంగా రూ.15 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట. ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీ అంశానికి దారి తీస్తున్నాయి.
మురికివాడ అంటే కేవలం పేదరికం మాత్రమే కాదు.. అక్కడ ఉండే కుటీర పరిశ్రమల తో పాటు సాధారణమైన జీవనశైలి, మిడిమిడి జ్ఞానమున్న వ్యక్తులు. అయితే, వీటన్నిటిని దగ్గరగా చూడాలని కుతూహలం పర్యాటకుల్లో విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ధారావిలో జరిగే తోలు పరిశ్రమ, కుమ్మరి పనులు, రీసైకిలింగ్ యూనిట్ల పనితీరును చూసేందుకు ఇతర దేశాలకు సంబంధించిన టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇరుకైన గల్లీలో వేలాదిమంది ప్రజలు కలిసి మెలిసి జీవించే విధానం, వారి రోజువారి కష్టాలను స్వయంగా అనుభవించాలని పర్యాటకులు ఎంతగానో భావిస్తున్నారట.. అందుకే డబ్బులు కట్టి మరి ధారావిలోకి వెళ్తున్నారు.
ప్రస్తుతం ఈ స్లామ్ టూరిజంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఒక వర్గానికి చెందినవారు దీనిని కుటీర పరిశ్రమలకు లభించే గుర్తింపుగా భావిస్తే.. మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పేదరికంని వ్యాపార వస్తువులుగా మార్చడం ఎంతవరకు మంచిదని? ప్రశ్నిస్తున్నారు. ఒకరి కష్టాలను చూసి ఆనందించడానికి మనసు ఎలా ఒప్పుతోందని మరి కొంతమంది సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
మరి కొంతమంది ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టూరిజం గైడ్లను విపరీతంగా దూషిస్తున్నారు. మురికివాడల్లో జీవించే ప్రజలను ఇలా చూపించి ఇతర దేశాల్లో తక్కువ చేయడం అంత మంచిది కాదని వారంటున్నారు. అంతేకాకుండా ఇతర దేశాలకు సంబంధించిన కొంతమంది యూట్యూబర్లు కూడా ధారవి లో ఉండే ప్రజల పరిస్థితులను తక్కువగా చూపెడుతూ వీడియోలు పోస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి టూరిజం గైడ్లు ఇకనుంచి అయినా ఇలా మురికివాడల్లో ఇతర దేశానికి సంబంధించిన టూరిస్టులను తీసుకురాకూడదని మరి కొంతమంది సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి ఐరోపాతో పాటు అమెరికా వంటి దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ధారావి ఒక లైవ్ మ్యూజియంలో చూస్తూ ఉండడంతో ఇక్కడ టూరిజం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా మారింది.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Digital Payments Liquor Shop: ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. వైన్ షాపులు, బార్లలో ఇకపై చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ, 'డిజిటల్ చెల్లింపులు' తప్పనిసరి చేస్తూ ఎక్సైజ్ శాఖ సరికొత్త పాలసీని తీసుకువస్తోంది. మద్యం విక్రయాల్లో పారదర్శకత పెంచడంతో పాటు, కస్టమర్ల సౌకర్యార్థం ప్రభుత్వం 'లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పాలసీ'కి రూపకల్పన చేసింది. ఈ పాలసీ అమల్లోకి వస్తే, ఏ షాపు యజమాని కూడా డిజిటల్ పేమెంట్లను తిరస్కరించడానికి వీలుండదు.
పాలసీలోని ముఖ్యాంశాలు..
రాష్ట్రంలోని ప్రతి వైన్ షాప్, బార్‌లో డిజిటల్ పేమెంట్ సౌకర్యం ఉండాలి. కస్టమర్ కార్డు లేదా యూపీఐ (UPI) ద్వారా డబ్బులు చెల్లిస్తామంటే యజమానులు కాదనకూడదు. డిజిటల్ లావాదేవీల కోసం అవసరమైన క్యూఆర్ కోడ్ స్కానర్లు లేదా పీఓఎస్ మిషన్లను ఎక్సైజ్ శాఖే స్వయంగా సరఫరా చేస్తుంది. మద్యం సీసాను స్కాన్ చేసిన తర్వాతే కస్టమర్‌కు ఇవ్వాలి. ఆ వెంటనే జరిగే డిజిటల్ పేమెంట్ వివరాలు రియల్ టైమ్‌లో ఎక్సైజ్ శాఖ డేటాబేస్‌లో నమోదవుతాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో కేవలం 30 శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. దీనిని 60 శాతంకు పెంచాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ చెల్లింపుల వల్ల ఏ రోజు ఎంత విక్రయాలు జరిగాయి, ఎంత ఆదాయం వచ్చిందనేది ప్రభుత్వానికి స్పష్టంగా తెలుస్తుంది. అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట పడుతుంది. రౌండ్ ఫిగర్ పేరుతో అదనపు బాదుడుకు, చిల్లర లేదనే సాకుతో చేసే దోపిడీకి ఈ విధానం వల్ల స్వస్తి పలకవచ్చు.
ఎప్పటి నుంచి అమలు?
ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఈ పాలసీకి సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేసింది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచనున్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త నిబంధన అమలు కానుంది.
గతంలో ఉన్న నిబంధనలను యజమానులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో, ఈసారి దీనిని ఒక శాశ్వత పాలసీగా మార్చి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త పాలసీతో మందుబాబులకు "చిల్లర దేవుళ్ల" బాధ తప్పుతుంది. జేబులో పైసా లేకపోయినా, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు నచ్చిన బ్రాండ్‌ను కొనుగోలు చేయవచ్చు.
Also Read: Nagarkurnool Crime News: కన్నబిడ్డను కాటేసిన తల్లి..2 నెలల బిడ్డని నీటిలో ముంచి చంపిన కసాయి తల్లి!
Also Read: Bullet Train In AP: ఏపీలో దూసుకురానున్న బుల్లెట్ రైళ్లు.. గంటలో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video Watch: రైలు ప్రయాణాల్లో కొంతమంది ప్రయాణికులు అనాలోచనతో చేసే పనులే వారి ప్రాణాలను ప్రమాదాల్లో నెట్టేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిందే. గత కొద్ది రోజుల నుంచి రైల్వే స్టేషన్ కు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా ఢిల్లీ ఆగ్రా మార్గంలో ఉన్న ఓ రైల్వే స్టేషన్‌కు సంబంధించిందే. అయితే, ఈ ఘటన ఢిల్లీ ఆగ్రా మధ్యలో నడుస్తున్న రైలు ప్లాట్ఫామ్‌పై చోటుచేసుకుంది.
అసలు ఏమైందంటే..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక స్టేషన్ నుంచి రైలు అప్పుడే నెమ్మదిగా కదలడం మొదలైంది.. ప్లాట్‌ఫారమ్ మీద ఉన్న ఒక యువతి చేతిలో బ్యాగు పట్టుకొని కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించింది.. అయితే వేగంగా కదులుతున్న రైలు భోగి కి సంబంధించిన హ్యాండిల్ ను పట్టుకోబోయి ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌పై పడిపోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ యువతి అంతటితో ఆగకుండా ఆమె వెంటనే లేచి మళ్ళీ రైలు ఎక్కేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు. రెండోసారి కూడా ఆమె బ్యాలెన్స్ను కోల్పోయి.. భోగికి పక్కనే ప్లాట్‌ఫారమ్‌పై పడటం మీరు గమనించవచ్చు. ఇలా పడినప్పటికీ ఆ యువతి ఏమాత్రం రైలు భోగికి సంబంధించిన హ్యాండిల్ ని వదిలిపెట్టకపోవడంతో అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళింది.
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 1, 2026
సరిగ్గా రెండుసార్లు ఆ యువతి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవడం మీరు క్లియర్గా గమనించవచ్చు. ఆ యువతి ఏమాత్రం వెనకాడకుండా మరోసారి కూడా రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. మూడోసారిగా అతి కష్టం మీద రైలు భోగికి సంబంధించిన హ్యాండిల్ ను పట్టుకొని.. లోపలికి ఎక్కేసింది. ఈ మొత్తం దృశ్యాలు రైల్వేస్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్కడే ఉన్న అధికారులు ఇతర ప్రయాణికులు ఇలా చేయకుండా ఆ వీడియోలను హెచ్చరికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అవ్వడంతో.. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేసుకొని మరి.. రి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలకు కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా చేస్తున్నారు. జీవితమంతా ఈజీగా అనిపిస్తుందా? అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది మాత్రం ఒక్కసారి పడిపోయినప్పుడే బుద్ధి రావాలి.. రెండోసారి కూడా ప్రాణాలు మీదికి తెచ్చుకోవడం మూర్ఖత్వం అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఆమె పట్టుదలను చూసి ఆశ్చర్యపోయినప్పటికీ.. ఎక్కువ మొత్తంలో సోషల్ మీడియా వినియోగదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Samsung Galaxy S26 Ultra vs Xiaomi 17 Ultra Telugu News: సాంసంగ్ కంపెనీ తమ ప్రీమియం మొబైల్ సిరీస్ గెలాక్సీ S సిరీస్ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనినే కంపెనీ గెలాక్సీ S26 అల్ట్రా పేరుతో విడుదల చేసింది. అయితే, ఈ మొబైల్ గతంలో కంటే ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాంసంగ్ కంపెనీ ఈ మొబైల్స్ కు సంబంధించిన ప్రీ ఆర్డర్స్ కూడా ప్రారంభించింది. ఇదిలా ఉంటే దీనికి పోటీగా షియోమీ 17 అల్ట్రా అందుబాటులో ఉంది. అయితే, ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేసే వినియోగదారులు ఈ రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో అని తికమక పడుతున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది అద్భుతమైనదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా తన మునుపటి మోడల్స్ కంటే సన్నని (7.9mm) డిజైన్‌తో సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు.. ఇందులో కంపెనీ ఒక అద్భుతమైన ఫీచర్ ని పరిచయం చేసింది.. సెక్యూరిటీ కోసం ప్రైవసీ డిస్‌ప్లే అనే కొత్త ఫీచర్‌ను లభించడం విశేషం.. మరోవైపు, షియోమీ 17 అల్ట్రా మొదటిసారిగా తన అల్ట్రా లైనప్‌లో ఫ్లాట్ డిస్ప్లేతో ఈ మొబైల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. షియోమీ తన 12-బిట్ M10 OLED ప్యానెల్‌తో సాంసంగ్ కంటే ఎక్కువ బ్రైట్‌నెస్, పవర్ ఎఫిషియెన్సీని అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన స్మూత్ స్క్రోలింగ్ ఆప్షన్ ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన ప్రాసెసర్లకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... రెండు ఫోన్‌లు క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యాయి. ముఖ్యంగా సాంసంగ్ ప్రత్యేకమైన ఆప్టిమైజేషన్ Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రాసెసర్ ను ఈ మొబైల్‌లో వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ రెండు మొబైల్స్ ప్రాసెసర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన మల్టీ టాస్కింగ్ చేసుకునేందుకు సహాయపడతాయి. అలాగే సాంసంగ్ One UI 8.5 తో పాటు ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. షియోమీ 1-అంగుళం కలిగిన లైకా (Leica) సెన్సార్ అద్భుతమైన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఏ వాతావరణం లోనైనా మంచి ప్రీమియం ఫోటోలను అందిస్తుంది. ఇక సాంసంగ్ 200MP మెయిన్ కెమెరాతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కెమెరా ద్వారాలో లైట్లు కూడా అద్భుతంగా వీడియోలను తీయొచ్చు. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన సూపర్ స్టెడీ స్టెబిలైజేషన్‌ను కూడా అందిస్తోంది. ఫోటోగ్రఫీ కావాలనుకునే వారికి షియోమీ అదనంక ఫిజికల్ ఫోటోగ్రఫీ కిట్ను కూడా విక్రయిస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే..షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్‌ఫుల్ 6800mAh బ్యాటరీతో పాటు 90W వైర్డ్ చార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీనికి స్పెషల్ గా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. అలాగే సాంసంగ్ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో విడుదలైంది. ఇది 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే ఈ రెండిట్లో ఏ స్మార్ట్ ఫోన్ బెస్ట్ అనే అంశం చూస్తే.. కెమెరా హార్డ్వేర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకునేవారు తప్పకుండా షియోమీ 17 అల్ట్రా బెస్ట్ ఆప్షన్ అని కొంతమంది టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సపోర్ట్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్కువ రోజులపాటు మన్నికగా ఉంటే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే గెలాక్సీ S26 అల్ట్రా మొబైల్ చాలా బెస్ట్..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Keerthy Suresh Weight Loss Transformation: నటి కీర్తి సురేష్ తన కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా కనిపించినా, ఆ తర్వాత అనూహ్యంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం 10 నెలల వ్యవధిలో ఆమె 10 కిలోల బరువు తగ్గడం వెనుక ఉన్న ఫిట్‌నెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన కీర్తి సురేష్, తన బరువు తగ్గే ప్రయాణంలో, పాటించిన ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు.
వ్యాయామాలు..
కీర్తి సురేష్ తన 18 ఏళ్ల వయసు వరకు పెద్దగా వ్యాయామం చేయలేదని, కానీ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాక జిమ్‌లో కఠినమైన శిక్షణ తీసుకున్నానని తెలిపారు.
కార్డియో: ప్రారంభంలో ఆమె తీవ్రమైన కార్డియో వ్యాయామాలు చేశారు. దీనివల్ల ఆమె శరీరంలోని కొవ్వు వేగంగా కరిగి, చాలా సన్నగా మారిపోయారు.
మజిల్ స్ట్రెంత్: గత రెండేళ్లుగా ఆమె కండరాల దృఢత్వం కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వారానికి 5 రోజులు, రోజుకు గంటన్నర పాటు క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తారు.
ప్రోటీన్ డైట్
కీర్తి సురేష్ కఠినమైన డైట్ పాటించకపోయినా, ఆమె తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఆమె రోజుకు 6 నుండి 7 గుడ్లు తింటారు. కానీ కేవలం తెల్లసొన మాత్రమే తీసుకుంటారు.
దీంతో పాటు శాకాహార ప్రోటీన్ ఫుడ్.. పనీర్, టోఫు, సోయాతో పాటు రకరకాల పప్పు ధాన్యాలను తన ఆహారంలో భాగం చేసుకున్నారు. అలాగే కండరాల పునరుద్ధరణ కోసం వర్కవుట్ తర్వాత ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు.
ఇష్టమైన ఆహారం తింటూనే..
డైట్ అంటే ఆహారాన్ని పూర్తిగా మానేయడం కాదని కీర్తి నమ్మకం. ఆమెకు ఎంతో ఇష్టమైన దోసెలను ఇప్పటికీ తింటారు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎంచుకుంటారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకుంటారు. కేవలం వ్యాయామం మాత్రమే కాదు, తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే అందరీ శరీర తత్వం ఒకేలా ఉండదు. సెలబ్రిటీల డైట్ ప్లాన్‌ను యథావిధిగా అనుసరించే కంటే, మీ శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం. బరువు తగ్గడానికి వ్యాయామం ప్రారంభించే ముందు లేదా డైట్‌లో మార్పులు చేసే ముందు వైద్య నిపుణులను లేదా డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.
Also Read: Bullet Train In AP: ఏపీలో దూసుకురానున్న బుల్లెట్ రైళ్లు.. గంటలో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
