Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ntr520010
Liquor Digital Payments In AP: మందుబాబులకు గుడ్‌న్యూస్..ఇకపై వైన్ షాపుల్లో అవి తప్పనిసరి..చిల్లర గాళ...
HDHarish Darla
Mar 04, 2026 10:25:06
Nunna, Vijayawada, Andhra Pradesh

Digital Payments Liquor Shop: ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. వైన్ షాపులు, బార్లలో ఇకపై చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ, 'డిజిటల్ చెల్లింపులు' తప్పనిసరి చేస్తూ ఎక్సైజ్ శాఖ సరికొత్త పాలసీని తీసుకువస్తోంది. మద్యం విక్రయాల్లో పారదర్శకత పెంచడంతో పాటు, కస్టమర్ల సౌకర్యార్థం ప్రభుత్వం 'లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పాలసీ'కి రూపకల్పన చేసింది. ఈ పాలసీ అమల్లోకి వస్తే, ఏ షాపు యజమాని కూడా డిజిటల్ పేమెంట్లను తిరస్కరించడానికి వీలుండదు.

పాలసీలోని ముఖ్యాంశాలు..
రాష్ట్రంలోని ప్రతి వైన్ షాప్, బార్‌లో డిజిటల్ పేమెంట్ సౌకర్యం ఉండాలి. కస్టమర్ కార్డు లేదా యూపీఐ (UPI) ద్వారా డబ్బులు చెల్లిస్తామంటే యజమానులు కాదనకూడదు. డిజిటల్ లావాదేవీల కోసం అవసరమైన క్యూఆర్ కోడ్ స్కానర్లు లేదా పీఓఎస్ మిషన్లను ఎక్సైజ్ శాఖే స్వయంగా సరఫరా చేస్తుంది. మద్యం సీసాను స్కాన్ చేసిన తర్వాతే కస్టమర్‌కు ఇవ్వాలి. ఆ వెంటనే జరిగే డిజిటల్ పేమెంట్ వివరాలు రియల్ టైమ్‌లో ఎక్సైజ్ శాఖ డేటాబేస్‌లో నమోదవుతాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో కేవలం 30 శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. దీనిని 60 శాతంకు పెంచాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ చెల్లింపుల వల్ల ఏ రోజు ఎంత విక్రయాలు జరిగాయి, ఎంత ఆదాయం వచ్చిందనేది ప్రభుత్వానికి స్పష్టంగా తెలుస్తుంది. అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట పడుతుంది. రౌండ్ ఫిగర్ పేరుతో అదనపు బాదుడుకు, చిల్లర లేదనే సాకుతో చేసే దోపిడీకి ఈ విధానం వల్ల స్వస్తి పలకవచ్చు.

ఎప్పటి నుంచి అమలు?
ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఈ పాలసీకి సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేసింది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచనున్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త నిబంధన అమలు కానుంది.

గతంలో ఉన్న నిబంధనలను యజమానులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో, ఈసారి దీనిని ఒక శాశ్వత పాలసీగా మార్చి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త పాలసీతో మందుబాబులకు "చిల్లర దేవుళ్ల" బాధ తప్పుతుంది. జేబులో పైసా లేకపోయినా, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు నచ్చిన బ్రాండ్‌ను కొనుగోలు చేయవచ్చు.
 

Also Read: Nagarkurnool Crime News: కన్నబిడ్డను కాటేసిన తల్లి..2 నెలల బిడ్డని నీటిలో ముంచి చంపిన కసాయి తల్లి!

Also Read: Bullet Train In AP: ఏపీలో దూసుకురానున్న బుల్లెట్ రైళ్లు.. గంటలో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లొచ్చు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 04, 2026 11:37:09
Karimnagar, Telangana:

Rah Veer Scheme Telugu News: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను చూసి చూడనట్లు వెళ్లకుండా.. వారిని సకాలంలో వైద్య సదుపాయం కల్పించే మనసున్న వ్యక్తుల కోసం భారత కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే రహ్ వీర్ (Rah Veer Scheme) పథకం.. దీని ద్వారా రోడ్డు ప్రమాదాల్లో సాయం చేసిన పౌరులకు రూ.25 వేల బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాల్లోనైనా గాయపడిన వారిని రక్షిస్తే ఈ పథకం చెల్లుబాటు అవుతుందని ఆయన తెలిపారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్య పరిభాషలో ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. ఈ సమయంలో బాధితుడికి సరైన చికిత్స అందితే ప్రాణాలు నిలిచే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఎంతోమంది బాధితులు సరైన సమయంలో ఆస్పత్రికి చేరలేక ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. సామాన్య పౌరులే అత్యవసర కష్టానికి మేలు చేసేవారుగా మారాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఇందులో భాగంగానే ఈ  పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. 

రహ్ వీర్ పథకం ప్రత్యేకత ఇదే..
ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. వారిని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. ప్రాణాలు కాపాడిన వారికి ఈ పథకం క్రింద రూ.25 వేల బహుమానం అందజేస్తారు. అంతేకాకుండా సాయం చేసిన వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ప్రశంసా పత్రం కూడా లభిస్తుంది.  అలాగే వారిని పోలీసులు వేధించారని.. గుడ్ సమరిటన్‌లుగా గుర్తించి గౌరవిస్తారని జగిత్యాల జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు..

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఇతరుల ప్రాణాలను కాపాడడం మనందరి సామాజిక బాధ్యతని.. ప్రజలు భయం వీడి మానవ దృక్పథంతో ముందుకు సాగాల్సిన సమయం రావాలని.. మీరు చేస్తే చిన్న సహాయం ఒక కుటుంబానికి ఎంతో ఊరటనిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా బాధితులకు వెంటనే వైద్యం అందడమే కాకుండా రోడ్డు ప్రమాద మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన మీడియా ముఖంగా ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఇప్పటికే ఈ పథకం ద్వారా కొంతమంది రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి రూ.25 వేలు పొందినట్లు సమాచారం. మీరు కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిలా మారి.. రోడ్డు ప్రమాద బాధితులను మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్చండి.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
BBhoomi
Mar 04, 2026 11:36:26
Lakshmapur, Telangana:

Kurdish Army: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కుర్దిష్ దళాల పాత్రపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అమెరికా కొత్త వ్యూహంలో కుర్దిష్ సాయుధ గుంపులను భాగస్వామ్యం చేయాలనే ఆలోచన ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్దులు ఎవరు? కుర్దిష్ సైన్యం అంటే ఏమిటి? అమెరికా వారికి మద్దతు ఇవ్వాలనుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కుర్దులు ఎవరు?
కుర్దులు మధ్యప్రాచ్యంలో విస్తరించి ఉన్న ఒక జాతి సమూహం. వీరు ప్రధానంగా టర్కీ, ఇరాక్, సిరియా, ఇరాన్, అమెరికా సరిహద్దు పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారి జనాభా సుమారు 25 నుంచి 35 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా. స్వతంత్ర దేశం లేకపోయినా, కుర్దులు తమ ప్రత్యేక భాష, సంస్కృతి, చరిత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. మధ్యప్రాచ్యంలో నాల్గవ అతిపెద్ద జాతి సమూహంగా వీరిని పరిగణిస్తారు.

ఇరాన్‌లో కుర్దుల పరిస్థితి:
షియా ముస్లింలు అధికంగా ఉన్న ఇరాన్‌లో, కుర్దులు ప్రధానంగా వాయువ్య ప్రాంతాల్లో నివసిస్తారు. వీరిలో ఎక్కువ మంది సున్నీ ముస్లింలు ఉన్నారు. మానవ హక్కుల సంస్థలు, ముఖ్యంగా ఆమేన్స్టీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం, ఇరానియన్ కుర్దులు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి, అభివృద్ధి, రాజకీయ ప్రతినిధిత్వం వంటి అంశాల్లో వారు వెనుకబడి ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

కుర్దిష్ సైన్యం అంటే ఏమిటి?
కుర్దిష్ సైన్యం అనేది ఒకే కేంద్రానికి చెందిన అధికారిక జాతీయ సైన్యం కాదు. వివిధ దేశాల్లోని కుర్దిష్ సాయుధ గుంపులు తమ తమ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి లేదా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుంటాయి. ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతం అనేక కుర్దిష్ రాజకీయ, సాయుధ గుంపులకు స్థావరంగా ఉంది. ఇరాన్ వ్యతిరేక కుర్దిష్ గుంపులు కొన్నిసార్లు సరిహద్దు ప్రాంతాల్లో ఇరాన్ భద్రతా దళాలతో ఘర్షణలకు దిగుతుంటాయి.

అమెరికా వ్యూహం ఏమిటి?
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. CIA ఇరాన్‌లోని కుర్దిష్ దళాలకు పరోక్ష మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉందని సమాచారం. అదేవిధంగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కాలంలో ఇరాన్ ప్రతిపక్ష గుంపులతో చర్చలు జరిగాయనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఇరాక్‌లోని కుర్దిష్ నాయకులతో వ్యూహాత్మక సహకారం పెంచే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు.

Also Read: Farming Business Ideas: వ్యవ‌సాయంలో వినూత్న ప‌ద్ధతులు..కింద చేప‌ల చెరువు.. పైన సొర‌కాయ‌ల సాగు.. ఏడాదికి ఎన్ని లక్షల లాభమంటే?  

ఈ వ్యూహం వెనుక ఉన్న భావన ఏమిటంటే.. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఒత్తిడి పెంచడం ద్వారా అక్కడి భద్రతా వ్యవస్థను బలహీనపరచడం. కొందరి అభిప్రాయం ప్రకారం, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రధాన నగరాల్లో ప్రజా నిరసనలు చెలరేగే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం వ్యూహాత్మక అంచనాలే తప్ప, వాస్తవ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.

ఇరాన్ లొంగిపోతుందా?
ఈ విధమైన చర్యలతో ఒక దేశం తక్షణమే లొంగిపోతుందని భావించడం సరళీకృత అంచనా మాత్రమే. ఇరాన్‌కు బలమైన సైనిక, భద్రతా వ్యవస్థ ఉంది. ముఖ్యంగా Islamic Revolutionary Guard Corps (IRGC) వంటి శక్తివంతమైన దళాలు అంతర్గత భద్రతను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తాయి. కాబట్టి బాహ్య మద్దతుతో జరిగే ప్రాంతీయ అస్థిరత దేశవ్యాప్తంగా రాజకీయ మార్పుకు దారి తీస్తుందా లేదా అన్నది అనిశ్చితమే. కుర్దిష్ అంశం మధ్యప్రాచ్య రాజకీయాల్లో సున్నితమైనది. అమెరికా లేదా ఇతర దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు, ప్రాంతీయ రాజకీయాలు, స్థానిక ప్రజల ఆకాంక్షలు ఇలా అన్ని కలిసి సంక్లిష్ట పరిస్థితిని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా మారుతాయో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

Also Read:  Mortgage Property: మార్ట్‌గేజ్ ప్రాప‌ర్టీ అంటే ఏంటి..? నిబంధ‌న‌లు ఏంటి..? కొనే ముందు ఈ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 04, 2026 11:24:44
Hyderabad, Telangana:

Dharavi Slum Tourism Telugu: ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవంతులు ఒకవైపు.. మరోవైపు అదే నగరంలోని ఆసియా అతిపెద్ద మురికివాడ ధారావి మరొకవైపు.. అయితే ఇప్పుడు ఈ మురికివాడ ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుందట.. వినడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ.. ధారావి గల్లీలను చూసేందుకు విదేశీ పర్యాటకులు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదండోయ్ కేవలం రెండు గంటల పర్యటన కోసం ఒక్కొక్క వ్యక్తి నుంచి గైడ్లు ఏకంగా రూ.15 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట. ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీ అంశానికి దారి తీస్తున్నాయి.

మురికివాడ అంటే కేవలం పేదరికం మాత్రమే కాదు.. అక్కడ ఉండే కుటీర పరిశ్రమల తో పాటు సాధారణమైన జీవనశైలి, మిడిమిడి జ్ఞానమున్న వ్యక్తులు. అయితే, వీటన్నిటిని దగ్గరగా చూడాలని కుతూహలం పర్యాటకుల్లో విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ధారావిలో జరిగే తోలు పరిశ్రమ, కుమ్మరి పనులు, రీసైకిలింగ్ యూనిట్ల పనితీరును చూసేందుకు ఇతర దేశాలకు సంబంధించిన టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇరుకైన గల్లీలో వేలాదిమంది ప్రజలు కలిసి మెలిసి జీవించే విధానం, వారి రోజువారి కష్టాలను స్వయంగా అనుభవించాలని పర్యాటకులు ఎంతగానో భావిస్తున్నారట.. అందుకే డబ్బులు కట్టి మరి ధారావిలోకి వెళ్తున్నారు. 

ప్రస్తుతం ఈ స్లామ్ టూరిజంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఒక వర్గానికి చెందినవారు దీనిని కుటీర పరిశ్రమలకు లభించే గుర్తింపుగా భావిస్తే.. మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పేదరికంని వ్యాపార వస్తువులుగా మార్చడం ఎంతవరకు మంచిదని? ప్రశ్నిస్తున్నారు. ఒకరి కష్టాలను చూసి ఆనందించడానికి మనసు ఎలా ఒప్పుతోందని మరి కొంతమంది సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

మరి కొంతమంది ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టూరిజం గైడ్లను విపరీతంగా దూషిస్తున్నారు. మురికివాడల్లో జీవించే ప్రజలను ఇలా చూపించి ఇతర దేశాల్లో తక్కువ చేయడం అంత మంచిది కాదని వారంటున్నారు. అంతేకాకుండా ఇతర దేశాలకు సంబంధించిన కొంతమంది యూట్యూబర్లు కూడా ధారవి లో ఉండే ప్రజల పరిస్థితులను తక్కువగా చూపెడుతూ వీడియోలు పోస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి టూరిజం గైడ్లు ఇకనుంచి అయినా ఇలా మురికివాడల్లో ఇతర దేశానికి సంబంధించిన టూరిస్టులను తీసుకురాకూడదని మరి కొంతమంది సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి ఐరోపాతో పాటు అమెరికా వంటి దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ధారావి ఒక లైవ్ మ్యూజియంలో చూస్తూ ఉండడంతో ఇక్కడ టూరిజం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా మారింది.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 04, 2026 10:04:58
Hyderabad, Telangana:

Viral Video Watch: రైలు ప్రయాణాల్లో కొంతమంది ప్రయాణికులు అనాలోచనతో చేసే పనులే వారి ప్రాణాలను ప్రమాదాల్లో నెట్టేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిందే. గత కొద్ది రోజుల నుంచి రైల్వే స్టేషన్ కు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న  వీడియో కూడా ఢిల్లీ ఆగ్రా మార్గంలో ఉన్న ఓ రైల్వే స్టేషన్‌కు సంబంధించిందే. అయితే, ఈ ఘటన ఢిల్లీ ఆగ్రా మధ్యలో నడుస్తున్న రైలు ప్లాట్ఫామ్‌పై చోటుచేసుకుంది. 

అసలు ఏమైందంటే..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక స్టేషన్ నుంచి రైలు అప్పుడే నెమ్మదిగా కదలడం మొదలైంది.. ప్లాట్‌ఫారమ్ మీద ఉన్న ఒక యువతి చేతిలో బ్యాగు పట్టుకొని కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించింది.. అయితే వేగంగా కదులుతున్న రైలు భోగి కి సంబంధించిన హ్యాండిల్ ను పట్టుకోబోయి ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌పై పడిపోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ యువతి అంతటితో ఆగకుండా ఆమె వెంటనే లేచి మళ్ళీ రైలు ఎక్కేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు. రెండోసారి కూడా ఆమె బ్యాలెన్స్ను కోల్పోయి.. భోగికి పక్కనే ప్లాట్‌ఫారమ్‌పై పడటం మీరు గమనించవచ్చు. ఇలా పడినప్పటికీ ఆ యువతి ఏమాత్రం రైలు భోగికి సంబంధించిన హ్యాండిల్ ని వదిలిపెట్టకపోవడంతో అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళింది.

pic.twitter.com/pBT7rRMtBi

సరిగ్గా రెండుసార్లు ఆ యువతి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవడం మీరు క్లియర్గా గమనించవచ్చు. ఆ యువతి ఏమాత్రం వెనకాడకుండా మరోసారి కూడా రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. మూడోసారిగా అతి కష్టం మీద రైలు  భోగికి సంబంధించిన హ్యాండిల్ ను పట్టుకొని.. లోపలికి ఎక్కేసింది. ఈ మొత్తం దృశ్యాలు రైల్వేస్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్కడే ఉన్న అధికారులు ఇతర ప్రయాణికులు ఇలా చేయకుండా ఆ వీడియోలను హెచ్చరికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అవ్వడంతో.. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేసుకొని మరి.. రి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలకు కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా చేస్తున్నారు. జీవితమంతా ఈజీగా అనిపిస్తుందా? అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది మాత్రం ఒక్కసారి పడిపోయినప్పుడే బుద్ధి రావాలి.. రెండోసారి కూడా ప్రాణాలు మీదికి తెచ్చుకోవడం మూర్ఖత్వం అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఆమె పట్టుదలను చూసి ఆశ్చర్యపోయినప్పటికీ.. ఎక్కువ మొత్తంలో సోషల్ మీడియా వినియోగదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 04, 2026 09:50:19
Secunderabad, Telangana:

Samsung Galaxy S26 Ultra vs Xiaomi 17 Ultra Telugu News: సాంసంగ్ కంపెనీ తమ ప్రీమియం మొబైల్ సిరీస్ గెలాక్సీ S సిరీస్ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. దీనినే కంపెనీ గెలాక్సీ S26 అల్ట్రా పేరుతో విడుదల చేసింది. అయితే, ఈ మొబైల్ గతంలో కంటే ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాంసంగ్ కంపెనీ ఈ మొబైల్స్ కు సంబంధించిన ప్రీ ఆర్డర్స్ కూడా ప్రారంభించింది. ఇదిలా ఉంటే దీనికి పోటీగా షియోమీ 17 అల్ట్రా అందుబాటులో ఉంది. అయితే, ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేసే వినియోగదారులు ఈ రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో అని తికమక పడుతున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది అద్భుతమైనదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

సాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా తన మునుపటి మోడల్స్ కంటే సన్నని (7.9mm) డిజైన్‌తో సరికొత్త రికార్డు  సృష్టించిందని చెప్పొచ్చు.. ఇందులో కంపెనీ ఒక అద్భుతమైన ఫీచర్ ని పరిచయం చేసింది.. సెక్యూరిటీ కోసం ప్రైవసీ డిస్‌ప్లే అనే కొత్త ఫీచర్‌ను  లభించడం విశేషం.. మరోవైపు, షియోమీ 17 అల్ట్రా మొదటిసారిగా తన అల్ట్రా లైనప్‌లో ఫ్లాట్  డిస్ప్లేతో ఈ మొబైల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. షియోమీ తన 12-బిట్ M10 OLED ప్యానెల్‌తో  సాంసంగ్ కంటే ఎక్కువ బ్రైట్‌నెస్, పవర్ ఎఫిషియెన్సీని అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన స్మూత్ స్క్రోలింగ్ ఆప్షన్ ను కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన ప్రాసెసర్లకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... రెండు ఫోన్‌లు క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యాయి. ముఖ్యంగా సాంసంగ్ ప్రత్యేకమైన ఆప్టిమైజేషన్ Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రాసెసర్ ను ఈ మొబైల్‌లో వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ రెండు మొబైల్స్ ప్రాసెసర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన మల్టీ  టాస్కింగ్ చేసుకునేందుకు సహాయపడతాయి. అలాగే సాంసంగ్ One UI 8.5 తో పాటు ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. షియోమీ 1-అంగుళం కలిగిన లైకా (Leica) సెన్సార్‌ అద్భుతమైన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఏ వాతావరణం లోనైనా మంచి ప్రీమియం ఫోటోలను అందిస్తుంది. ఇక సాంసంగ్ 200MP మెయిన్ కెమెరాతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కెమెరా ద్వారాలో లైట్లు కూడా అద్భుతంగా వీడియోలను తీయొచ్చు. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన సూపర్ స్టెడీ స్టెబిలైజేషన్‌ను కూడా అందిస్తోంది. ఫోటోగ్రఫీ కావాలనుకునే వారికి షియోమీ అదనంక ఫిజికల్ ఫోటోగ్రఫీ కిట్ను కూడా విక్రయిస్తోంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే..షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్‌ఫుల్ 6800mAh బ్యాటరీతో పాటు 90W వైర్డ్ చార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీనికి స్పెషల్ గా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. అలాగే సాంసంగ్ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో విడుదలైంది. ఇది 60W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే ఈ రెండిట్లో ఏ స్మార్ట్ ఫోన్ బెస్ట్ అనే అంశం చూస్తే.. కెమెరా హార్డ్వేర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకునేవారు తప్పకుండా షియోమీ 17 అల్ట్రా  బెస్ట్ ఆప్షన్ అని కొంతమంది టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సపోర్ట్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్కువ రోజులపాటు మన్నికగా ఉంటే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే గెలాక్సీ S26 అల్ట్రా మొబైల్ చాలా బెస్ట్..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 04, 2026 09:35:04
Hyderabad, Telangana:

Keerthy Suresh Weight Loss Transformation: నటి కీర్తి సురేష్ తన కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా కనిపించినా, ఆ తర్వాత అనూహ్యంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం 10 నెలల వ్యవధిలో ఆమె 10 కిలోల బరువు తగ్గడం వెనుక ఉన్న ఫిట్‌నెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన కీర్తి సురేష్, తన బరువు తగ్గే ప్రయాణంలో, పాటించిన ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు.

వ్యాయామాలు.. 
కీర్తి సురేష్ తన 18 ఏళ్ల వయసు వరకు పెద్దగా వ్యాయామం చేయలేదని, కానీ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాక జిమ్‌లో కఠినమైన శిక్షణ తీసుకున్నానని తెలిపారు.

కార్డియో: ప్రారంభంలో ఆమె తీవ్రమైన కార్డియో వ్యాయామాలు చేశారు. దీనివల్ల ఆమె శరీరంలోని కొవ్వు వేగంగా కరిగి, చాలా సన్నగా మారిపోయారు.

మజిల్ స్ట్రెంత్: గత రెండేళ్లుగా ఆమె కండరాల దృఢత్వం కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వారానికి 5 రోజులు, రోజుకు గంటన్నర పాటు క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తారు.

ప్రోటీన్ డైట్
కీర్తి సురేష్ కఠినమైన డైట్ పాటించకపోయినా, ఆమె తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఆమె రోజుకు 6 నుండి 7 గుడ్లు తింటారు. కానీ కేవలం తెల్లసొన మాత్రమే తీసుకుంటారు.

దీంతో పాటు శాకాహార ప్రోటీన్ ఫుడ్.. పనీర్, టోఫు, సోయాతో పాటు రకరకాల పప్పు ధాన్యాలను తన ఆహారంలో భాగం చేసుకున్నారు. అలాగే కండరాల పునరుద్ధరణ కోసం వర్కవుట్ తర్వాత ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు.

ఇష్టమైన ఆహారం తింటూనే..
డైట్ అంటే ఆహారాన్ని పూర్తిగా మానేయడం కాదని కీర్తి నమ్మకం. ఆమెకు ఎంతో ఇష్టమైన దోసెలను ఇప్పటికీ తింటారు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎంచుకుంటారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకుంటారు. కేవలం వ్యాయామం మాత్రమే కాదు, తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అయితే అందరీ శరీర తత్వం ఒకేలా ఉండదు. సెలబ్రిటీల డైట్ ప్లాన్‌ను యథావిధిగా అనుసరించే కంటే, మీ శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం. బరువు తగ్గడానికి వ్యాయామం ప్రారంభించే ముందు లేదా డైట్‌లో మార్పులు చేసే ముందు వైద్య నిపుణులను లేదా డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.

Also Read: DA Arrears GO AP: ఉద్యోగులకు భారీ ఊరట..త్వరలోనే అకౌంట్లోకి డీఏ పెండింగ్ బిల్లులు..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం?!

Also Read: Bullet Train In AP: ఏపీలో దూసుకురానున్న బుల్లెట్ రైళ్లు.. గంటలో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లొచ్చు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 04, 2026 08:26:32
Hyderabad, Telangana:

Bride Viral Video Watch Here: శుభకార్యాల్లో ముహూర్తం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే.. సరిగ్గా నిర్ణయించిన సమయానికి పెళ్లి పీటల మీద  ఉండాలని వధూవరుల తరపున కుటుంబ సభ్యులు ఎంతగానో పరితపిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని రకాల అడ్డంకులు ఏర్పడటం వల్ల సరైన సమయంలో పెళ్లి పీటలపై వధూవరులు ఉండలేకపోతుంటారు.. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. పెళ్లికూతురు సరైన సమయానికి తన మెడలో తాళి కట్టించుకోవడానికి ఏకంగా బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు అందర్నీ ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. అయితే, పెళ్లికూతురు బైక్‌పై వెళ్లడానికి గల కారణాలేంటి? అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ యువతి పెళ్లి పీటలు ఎక్కేందుకు ఎంతో అందంగా ముస్తాబయింది.. పూలతో అలంకరించుకొని కారులో కళ్యాణమంటపం దగ్గరికి బయలుదేరింది. అయితే ఈ సమయంలోనే ఒక అనుకోని సంఘటన ఎదురైంది. వడోదరలోని అజ్వా రోడ్డు సమీపంలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంతసేపటికి వాహనాలు కథలకు పోవడంతో పెళ్లి ముహూర్తం సమయం దాటి పోతుందేమో అనుకొని ఆ పెళ్లికూతురు ఆందోళన చెందింది. అలాగే కొన్ని నిమిషాల తరబడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో.. ఆ పెళ్లికూతురు ఒక పని చేసేసింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ట్రాఫిక్ తగ్గడానికి చాలా సమయం పడుతుందని గ్రహించిన ఆ పెళ్లికూతురు ఏమాత్రం ఆందోళన చెందకుండా కారు దిగి రోడ్డుపైకి వచ్చేసింది.. అంతేకాకుండా ఆ యువతి ఒక టూ వీలర్ వ్యక్తిని లిఫ్ట్ అడిగేసింది.. అయితే ఆ వ్యక్తి కూడా ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు.. వెంటనే అందంగా లెహంగాతో ముస్తాబైన ఆ యువతి అతని బైక్ ఎక్కి ట్రాఫిక్ దాటుకుంటూ ముందుకెళ్లారు. ఆమె వెనక మరో బైక్ లో తమ బంధువులు కూడా వెళ్లారు. ఈ సందర్భంలోనే వారు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోని వైరల్‌గా మారింది..

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

ఇన్స్టంట్ బాలీవుడ్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వినియోగదారులు ఆ యువతీ ధైర్యాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.. కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. చాలా తెలివైన పనిచేసింది.. ముహూర్తం కంటే ఏది ముఖ్యం కాదు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది ఇది నిజమైన డెడికేషన్ అని ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి కూతురుకు సంబంధించిన బైక్ రైడ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

0
comment0
Report
HDHarish Darla
Mar 04, 2026 08:21:52
Bijinapalle, Telangana:

Mother Kills Baby in Nagarkurnool: కన్నప్రేమ కరువైందో లేక కఠిన నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ, ఒక తల్లి తన రెండు నెలల పసికందును అత్యంత కిరాతకంగా చంపేసింది. భర్తతో కలవడానికి అడ్డంకిగా ఉన్నాడని భావించి, సొంత బిడ్డనే నీటి తొట్టిలో ముంచి ప్రాణాలు తీసిన ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది.

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన నీలమ్మకు, పానగల్ మండలం శాగాపురానికి చెందిన నరేందర్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే, గత రెండేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో నీలమ్మ పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే జనవరి 4న ఆమె మరో మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఏం జరిగిందంటే?
ఈనెల 27న నరేందర్ తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటికి వచ్చి, నీలమ్మను కాపురానికి పంపమని చర్చించి వెళ్లాడు. భర్తతో తిరిగి కలిసి ఉండటానికి ఈ రెండు నెలల బాబు అడ్డుగా ఉన్నాడని నీలమ్మ భావించింది. బాబు లేకపోతే భర్త తనను వెంటనే తీసుకెళ్తాడని ఒక కిరాతక నిర్ణయానికి వచ్చింది.

అదే రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో నీలమ్మ తన పసిబిడ్డను ఎత్తుకుని బయటకు వెళ్లింది. ఇంటి పక్కనే ఉన్న నీటి తొట్టిలో పసివాడిని పడేసి, ఏమీ తెలియనట్టు వచ్చి పడుకుంది. తెల్లవారుజామున లేచి బాబు కనిపించడం లేదంటూ డ్రామా మొదలుపెట్టింది. గాలించగా బాబు నీటి తొట్టిలో శవమై కనిపించాడు.

నీలమ్మ తన భర్త నరేందర్ వచ్చి బాబును చంపేశాడని కుటుంబ సభ్యులను, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా భర్తపైనే ఫిర్యాదు కూడా ఇచ్చింది. పోలీసుల విచారణలో భర్త ఆ సమయంలో అక్కడ లేడని తేలింది. అనుమానం వచ్చి నీలమ్మను తమదైన శైలిలో విచారించగా, అసలు నిజాన్ని ఒప్పుకుంది. సంసారానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తానే బిడ్డను చంపినట్లు ఆమె అంగీకరించింది.

పసిపాప ప్రాణాలు తీసి మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చిన నీలమ్మను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పాలబుగ్గల చిన్నారి కన్నతల్లి చేతిలోనే బలికావడం ఆ గ్రామంలో పెను విషాదాన్ని నింపింది.

Also Read: Bullet Train In AP: ఏపీలో దూసుకురానున్న బుల్లెట్ రైళ్లు.. గంటలో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లొచ్చు!

Also Read: SA vs NZ playing XI: టీ20 ప్రపంచకప్‌లో నేడే తొలి సెమీ-ఫైనల్..సౌతాఫ్రికా జోరును న్యూజిలాండ్ అడ్డుకోగలదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 04, 2026 08:12:08
Hyderabad, Telangana:

 Girl Dance Viral Video Watch Here: ప్రస్తుతం ఇంటర్నెట్ కాలంలో ఏదైనా ప్రతిభ ఉంటే చాలు రాత్రికి రాత్రి స్టార్ల అయిపోవచ్చని మరోసారి ఓ వీడియో ద్వారా నిరూపితమైంది. బాలీవుడ్ ఎవర్గ్రీన్ బ్యూటీ మాధురి దీక్షిత్ ఐకానిక్ సాంగ్ ధక్ ధక్ కర్నే లగా పాటకు ఓ యువతి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమె వేసిన స్టెప్పులను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. సినిమాలో కూడా హీరోయిన్ అలా వేసి ఉండదని కామెంట్లు పెడుతున్నారు. 

బాలీవుడ్ మాధురి దీక్షిత్ దేశవ్యాప్తంగా ధక్ ధక్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక పాటతో ఆమెకు ఎంత క్రేజీ లభించిందో మనందరికీ తెలిసిందే. శతాబ్దాలు గడిచిన ధక్ ధక్ కర్నే లగా పాట క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.. తాజాగా అదే పాటకి ఓ యువతి నల్లటి చీర ధరించి అద్భుతంగా డాన్స్ చేసి అందర్నీ మెప్పించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. 

 
 
 
 
 

వైరల్ అవుతున్న వీడియోలు ఆ యువతి అచ్చం మాధురి దీక్షిత్‌లా స్టెప్పు లేసింది. తన హావాభావాలతో అక్కడున్న అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఆమె వెనక మరి కొంతమంది యువతులు ఆమె స్టెప్పులను చూసి చప్పట్లు కొట్టారు. ముఖ్యంగా చీర కట్టులో ఆమె చేసిన డ్యాన్స్ మూవ్మెంట్స్ సోషల్ మీడియా వినియోగదారులను ఫిదా చేస్తున్నాయి. సాధారణంగా ఇలా చీర కట్టులో డ్యాన్స్ చేయడం చాలా అరుదు. 

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

ఈ వీడియోను పూర్వీ_త్రిపాఠి_17 ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షలాదిమంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేల సంఖ్యలు లైకులు కూడా చేశారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా చేశారు. అచ్చం మాధురి దీక్షిత్ చూసినట్లే ఉందని.. కామెంట్లు పెడితే.. మరి కొంతమంది చాలా అద్భుతమైన డ్యాన్స్ అని కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇలాంటి డ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు.. చాలా బాగా చేశారని అంటూ కొంతమంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

  

0
comment0
Report
HDHarish Darla
Mar 04, 2026 07:45:09
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP Bullet Train Corridor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసేలా రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటికే ప్రకటించిన మూడు కారిడార్లకు అదనంగా, రాష్ట్రంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మరో రెండు కొత్త హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణానికి రైల్వే బోర్డు అడుగులు వేస్తోంది. 

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ మీదుగా వెళ్లే మూడు అంతర్రాష్ట్ర కారిడార్లను (హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రత్యేకంగా ఏపీలోని నగరాల మధ్య కనెక్టివిటీ పెంచేలా మరో రెండు మార్గాలను ప్రతిపాదించారు.

కొత్తగా ప్రతిపాదించిన కారిడార్లలో విజయవాడ - విశాఖపట్నం హైస్పీడ్ కారిడార్ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య సుమారు 350 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో భాగంగా విజయవాడ నుండి బయలుదేరి ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ మార్గంలో బుల్లెట్ రైళ్లు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి.

ఇది పూర్తయితే అమరావతి నుండి విశాఖకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది హైదరాబాద్-చెన్నై కారిడార్‌కు అనుసంధానం చేసేందుకు అవకాశం ఉంది.

ఈ కారిడార్లలో వినిపిస్తున్న రెండో రూట్ విజయవాడ - కర్నూలు సెమీ హైస్పీడ్ కారిడార్. ఇది గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుండి కర్నూలుకు నేరుగా వెళ్లే రైలు మార్గం సరిగ్గా లేదు అంటే డోన్ లేదా నంద్యాల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఈ కొత్త లైన్ ద్వారా రాయలసీమ, కోస్తా ఆంధ్ర మధ్య నేరుగా, వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.

అమరావతికి పెరగనున్న కనెక్టివిటీ
రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రెండు కొత్త లైన్లతో పాటు మరో ఆరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కూడా సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం తుది సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు.

గతంలో ప్రకటించిన మూడు కారిడార్లు కూడా ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్నాయి. 1) హైదరాబాద్ - చెన్నై, ఇది అమరావతి మీదుగా వెళ్తుంది.2) హైదరాబాద్ - బెంగళూరు, ఇది రాయలసీమ ప్రాంతం గుండా వెళ్తుంది. 3) చెన్నై - బెంగళూరు, ఇది చిత్తూరు జిల్లా మీదుగా ప్రయాణిస్తుంది.

రైల్వే బోర్డు నుండి అనుమతి రాగానే క్షేత్రస్థాయిలో సర్వే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణ వేగం పుంజుకోవడమే కాకుండా, పారిశ్రామికంగా కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది.

Also Read: SA vs NZ playing XI: టీ20 ప్రపంచకప్‌లో నేడే తొలి సెమీ-ఫైనల్..సౌతాఫ్రికా జోరును న్యూజిలాండ్ అడ్డుకోగలదా?

Also Read: DA Arrears GO AP: ఉద్యోగులకు భారీ ఊరట..త్వరలోనే అకౌంట్లోకి డీఏ పెండింగ్ బిల్లులు..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 04, 2026 07:02:29
Hyderabad, Telangana:

Manda Krishna Madiga News: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సామాజిక వర్గాలకు సంబంధించిన అంశం వేడెక్కింది.. మాదిగలకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపిస్తూ.. ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రత్యేకమైన ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని ఆయన ఎమ్మార్పీఎస్  శ్రేణులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల ముందు తప్పకుండా ధర్నాలు నిర్వహించాలని కోరారు.. 

మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లోని కాంగ్రెస్ కార్యాలయాల ముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేయాలని కోరారు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించాలని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలని మందకృష్ణ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ప్రత్యేకమైన ధర్నాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయంగా ఎదగాల్సిన మాదిగలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకుంటుందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అంతేకాకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే మాదిగలను వాడుకుంటున్నారని.. నిర్ణయాత్మకమైన పదవుల దగ్గరకు వచ్చేసరికి అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.. ఇకనుంచైనా ప్రభుత్వం తప్పకుండా మాదిగలను గుర్తించి వారికి కావలసిన పదవులను ఇవ్వాలని  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. 

Also Read: పీఎం కిసాన్‌ నిధి బ్యాలెన్స్‌ చెక్‌ చేయాలా? మొబైల్‌లో ఇలా సింపుల్‌ చెక్‌ చేసుకోండి..!

అలాగే మాదిగలు దేశానికి సంబంధించిన అత్యున్నత సభలకు వెళ్లడం కాంగ్రెస్కు ఇష్టం లేదని.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలు మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడం కాంగ్రెస్ తన వ్యతిరేకతను చాటుతుందని మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ ప్రభుత్వం వెనకడుగు  వేసిందని.. తక్షణమే తమ సామాజిక వర్గానికి రాజకీయ వాటాను కల్పించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు మహరించినట్లు తెలుస్తోంది.

Also Read: పీఎం కిసాన్‌ నిధి బ్యాలెన్స్‌ చెక్‌ చేయాలా? మొబైల్‌లో ఇలా సింపుల్‌ చెక్‌ చేసుకోండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top