Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
8th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్..DA పెంపు, ఇతర ప్రయోజనాలు రద్దు..క్లారిటీ...
HDHarish Darla
Dec 17, 2025 09:10:10
Hyderabad, Telangana

8th Pay Commission DA Reset: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ పొందిన వారికి రాబోయే రోజుల్లో డియర్నెస్ రిలీఫ్ (DR), పెన్షన్ పెంపు వంటి ప్రయోజనాలు రావరంటూ ఇటీవలే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ వార్త పెన్షనర్లలో తీవ్ర ఆందోళన కలిగించడం వల్ల ప్రభుత్వ అధికారిక వాస్తవ నిర్ధారణ సంస్థ PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) దీనిపై స్పందించింది.

ఏం జరిగింది?
ఆర్థిక చట్టం 2025 ప్రకారం.. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై కరువు భత్యం (DA/DR) పెంపు ఉండదని, అలాగే కొత్త వేతన సంఘం సిఫార్సుల ద్వారా వచ్చే ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ఉపసంహరించనున్నట్లు ఇటీవలే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇదే..!
ఈ వైరల్ వార్తను సంపూర్ణంగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తోసిపుచ్చింది. ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. "ఆర్థిక చట్టం 2025 ప్రకారం.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందవనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మొద్దు, షేర్ చేయవద్దు" అని PIB ఫ్యాక్ట్ చెక్ X (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

ఉద్యోగుల్లో గందరగోళానికి అసలు కారణం..
ఈ తప్పుడు ప్రచారం పెరగడానికి ప్రధాన కారణం CCS (పెన్షన్) రూల్స్, 2021లోని 37వ నిబంధనలో జరిగిన ఒక చిన్న మార్పు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే అందరికీ ఇది వర్తిస్తుందని భయపడుతున్నారు.

నిజానికి రూల్ 37 దేని గురించి చెబుతుంది?
ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో (PSU) విలీనమైన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ సదరు ఉద్యోగి తీవ్రమైన దుష్ప్రవర్తన కారణంగా ఉద్యోగం నుండి తొలగిస్తే, అప్పుడు మాత్రమే వారి పెన్షన్ ప్రయోజనాలను కోల్పోతారు. ఇది సాధారణంగా పదవీ విరమణ చేసిన ఇతర ఏ పెన్షనర్‌కు వర్తించదు. పెన్షన్ లెక్కించే విధానంలో ఎలాంటి మార్పులూ జరగలేదు. ప్రభుత్వం ఎప్పుడూ పెన్షనర్ల ప్రయోజనాలను గౌరవిస్తుందని, పండుగలకు ముందు డీఆర్ (DR) ప్రకటించే సంప్రదాయం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. తప్పుడు వార్తలను చూసి ఆందోళన చెందకుండా, అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించాలని కోరారు.

Also Read: IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలం పూర్తయ్యింది..ఐపీఎల్‌లో ఇప్పుడన్న డేంజరస్ టీమ్ ఏదో తెలుసా?

Also Read: Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా? సంజీవని లాంటి ఔషధం..కొద్దిరోజుల్లోనే పూర్తి ఆరోగ్యం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Dec 17, 2025 10:52:35
Hyderabad, Telangana:

Ayesha Takia Plastic Surgery: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల కెరీర్ చాలా చిత్రంగా ఉంటుంది. కొందరు ఏళ్లపాటు సినిమాల్లో వరుస అవకాశాలతో దశాబ్దాల పాటు రాణిస్తే, మరికొందరు ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ తెచ్చుకొని..అంతే వేగంగా కనుమరుగవుతారు. అలాంటి వాళ్లలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' మూవీ హీరోయిన్ అయేషా టాకియా ఒకరు. టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇప్పటికీ ఆమె అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

టాలీవుడ్‌లో మెరుపు తీగలా వచ్చెళ్లింది..
కింగ్ నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సూపర్' సినిమాతో అయేషా టాకియా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా.. హీరోయిన్ ఆయేషా టకియా అందానికి సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. "తెలుగు ఇండస్ట్రీకి మరో క్రేజీ బ్యూటీ దొరికింది" అని అందరూ అనుకునేలోపే ఆమె టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్‌ బాట పట్టింది. ఆ సినిమా తర్వాత ఆయేషా మరో తెలుగు సినిమాలో నటించలేదు. 

పెళ్లి..మత మార్పిడి..సినిమాలకు స్వస్తి
హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే అయేషా టాకియా పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమైంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కొడుకు, వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని హీరోయిన్ ఆయేషా టకియా వివాహం చేసుకుంది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవడం కోసం అయేషా..మత మార్పిడి కూడా చేసుకుంది. దాదాపు పదమూడేళ్లుగా ఆమె వెండితెరకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిస్తోంది.

గుర్తుపట్టలేనంతగా మారిన రూపం
ప్రస్తుతం సోషల్ మీడియాలో అయేషా టాకియాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'సూపర్' సినిమాలో ఎంతో ముద్దుగా, గ్లామరస్‌గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ముఖ కవళికల్లో వచ్చిన మార్పులు చూసి ఆమె ఏవైనా సర్జరీలు చేయించుకుందా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన చిరునవ్వుతో వెండితెరను ఏలిన ఈ డ్రీమ్ గర్ల్, ఇప్పుడు లైమ్ లైట్‌కు దూరంగా సామాన్య గృహిణిగా తన జీవితాన్ని గడుపుతోంది.

ALso Read: 8th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్..DA పెంపు, ఇతర ప్రయోజనాలు రద్దు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Also REad: IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలం పూర్తయ్యింది..ఐపీఎల్‌లో ఇప్పుడన్న డేంజరస్ టీమ్ ఏదో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 17, 2025 09:36:55
Hyderabad, Telangana:

Kedi Movie Director Kiran Kumar Passed Away: తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)లో మరో విషాదం చోటుచేసుకుంది. అక్కినేని నాగార్జున నటించిన 'కేడీ' చిత్ర దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

సినిమా ప్రస్థానం
కిరణ్ కుమార్ కేవలం దర్శకుడిగానే కాకుండా, అంతకుముందు పలు చిత్రాలకు రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. 2010లో కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'కేడీ' సినిమాతో ఆయన దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా, కేడీ డైరెక్టర్ కిరణ్ కుమార్ వద్దనే పనిచేయడం గమనార్హం.

విడుదలకు సిద్ధంగా ఉన్న తదుపరి చిత్రం
చాలా కాలం విరామం తర్వాత డైరెక్టర్ కిరణ్ కుమార్ మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. ఆయన డైరెక్షన్‌లో రూపొందిన ‘కేజేక్యూ: కింగ్‌.. జాకీ.. క్వీన్‌’ (KJQ) అనే సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సినిమా విడుదల చూడకుండానే ఆయన మరణించడం అభిమానులను, చిత్ర బృందాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది.

'కేడీ' డైరెక్టర్ కిరణ్ కుమార్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ నటులు, దర్శకులు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా ఆయన ఫ్యాన్స్ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Also REad: 8th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్..DA పెంపు, ఇతర ప్రయోజనాలు రద్దు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Also Read: IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలం పూర్తయ్యింది..ఐపీఎల్‌లో ఇప్పుడన్న డేంజరస్ టీమ్ ఏదో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 17, 2025 09:20:08
Hyderabad, Telangana:

Bharat Taxi App Launch Date: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దేశీయ రవాణా రంగంలో అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రముఖ ప్రైవేట్‌ క్యాబ్‌ సంస్థలు ఉబర్‌తో పాటు ఓలాకు దీటుగా భారత్‌ ట్యాక్సీ (Bharat Taxi) యాప్‌ను తీసుకు రాబోతున్నట్లు తెస్తోంది. భారత ప్రజలకు కొత్త సంవత్సరం గిఫ్ట్‌గా దీని సేవలను జనవరి 1వ తేది నుంచి అందుబాటులో తీసుకు రాబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజు క్యాబ్‌లు వినియోగించే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. 

ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో క్యాబ్‌ సేవలు ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. దీని కారణంగా కొన్ని కంపెనీలు డిమాండ్‌ను బట్టి చార్జీలను ఇష్టానుసారంగా పెంచుతూ వస్తున్నాయి. అలాగే రైడ్ క్యాన్సిలేషన్ ఫీజులతో పాటు డ్రైవర్ల ప్రవర్తన వంటి అంశాలపై ఇప్పటికి ప్రయాణికుల నుంచి ఎన్నో ఫిర్యాదు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతి సామాన్యుడు అతి తక్కువ ధరలోనే నగరాల్లో అన్ని ప్రదేశాలకు సురక్షితంగా ప్రయాణాన్ని అంచడమే లక్ష్యంగా చేసుకుని క్రేంద్రం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంపెనీ ప్రత్యేకమైన పనులను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా డ్రైవర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికీ భారత్‌లోని ప్రధాన నగరాల్లో భారత్ ట్యాక్సీ యాప్‌లో దాదాపు 56 వేల మంది డ్రైవర్లు పేర్లను నమోదు చేసినట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది. అయితే, ప్రైవేటు కంపెనీతో పోలిస్తే.. ఈ యాప్‌లో డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్ చాలా తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని సమచారం.. అయితే, ఈ కమిషన్‌ తగ్గడం వల్ల డైవర్ల ఆదాయం భారీగా పెరుగుతుంది.

Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్‌ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!

ఈ భారత్‌ ట్యాక్సీ (Bharat Taxi) యాప్‌ వల్ల ప్రయాణికులకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రైవేట్ క్యాబ్‌లతో పోలిస్తే 16 నుంచి 25 శాతం వరకు తక్కువ ధరలకే ప్రయాణం చేయడానికి సాధ్యమవుతుందని సమాచారం.. అలాగే సర్జ్ ప్రైసింగ్ నుంచి కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఇది ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటంతో భద్రతా ప్రమాణాలను కూడా కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సేవలను ప్రారంభించబోతున్నట్లు కేంద్రం యోచిస్తోంది. ఆ తర్వాత దశలవారీగా దేశమంతటా విస్తరించే ఛాన్స్‌లు ఉన్నాయి.

Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్‌ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Dec 17, 2025 08:26:34
Hyderabad, Telangana:

IPL 2026 Team Players List: ఐపీఎల్ 2026 సీజన్ కోసం మెగా వేలం ముగియడంతో, మొత్తం 10 జట్ల తుది ఆటగాళ్ల వివరాలు ఖరారయ్యాయి. ఈసారి చాలా మంది స్టార్ ఆటగాళ్లు కొత్త జట్లలోకి మారగా, పలువురు పాత జట్లకే రిటైన్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ వరకు అన్ని జట్ల ప్లేయర్ లిస్ట్, కెప్టెన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
కెప్టెన్:
పాట్ కమిన్స్,  
కీలక ఆటగాళ్లు: ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి.  
ఇతర జాబితా: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, ఆర్. స్మరణ్, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కోర్సే, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్ తదితరులు.

2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
కెప్టెన్:
రజత్ పాటిదార్ 
కీలక ఆటగాళ్లు: విరాట్ కోహ్లి, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్. 
ఇతర ఆటగాళ్ల జాబితా: దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, యశ్ దయాల్, నువాన్ తుషార, సుయాష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్.

3. ముంబై ఇండియన్స్ (MI)
ప్రధాన ఆటగాళ్లు:
హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇతర ఆటగాళ్ల జాబితా: తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికిల్టన్, రాబిన్ మింజే, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, అల్లా గఫాంజర్, శార్దూల్ ఠాకూర్, క్వింటన్ డి కాక్, దీపక్ చాహర్, మయాంక్ మార్కండే.

4. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
కెప్టెన్:
రుతురాజ్ గైక్వాడ్ 
కీలక ఆటగాళ్లు: ఎం.ఎస్. ధోనీ, సంజూ శాంసన్, శివమ్ దూబే. 
ఇతర ఆటగాళ్ల జాబితా: ఆయుష్ మ్హత్రే, డెవాల్డ్ బ్రీవిస్, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, శ్రేయాస్ గోపాల్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్.

5. లక్నో సూపర్‌జెయింట్స్‌ (LSG)
కెప్టెన్:
రిషబ్‌ పంత్‌ 
కీలక ఆటగాళ్లు: నికోలస్‌ పూరన్‌, మయాంక్‌ యాదవ్‌, మహమ్మద్ షమీ. 
ఇతర ఆటగాళ్ల జాబితా: అబ్దుల్‌ సమద్‌, ఆయుష్‌ బదోని, ఐడెన్‌ మర్‌క్రామ్‌, మాథ్యూ బ్రిట్జ్‌కే, మిచెల్‌ మార్ష్‌, షాబాజ్‌ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌, వనిందు హసరంగా, అన్రిచ్ నోకియా, అర్జున్ టెండూల్కర్, జోష్ ఇంగ్లిస్.

6. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
కీలక ఆటగాళ్లు:
కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్. 
ఇతర ఆటగాళ్ల జాబితా: నితీష్ రాణా, అభిషేక్ పోరెల్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, టి నటరాజన్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, పృథ్వీ షా, కైల్ జేమీసన్, లుంగీ ఎన్గిడి.

7. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)
కీలక ఆటగాళ్లు:
సునీల్ నరైన్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా. 
ఇతర ఆటగాళ్ల జాబితా: అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్, ఉమ్రాన్ మాలిక్, కామెరూన్ గ్రీన్, మతీషా పతిరాణ, రాహుల్ త్రిపాఠి, ముస్తాఫిజుర్ రెహమాన్, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్.

8. రాజస్థాన్ రాయల్స్ (RR)
కీలక ఆటగాళ్లు:
యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్. 
ఇతర ఆటగాళ్ల జాబితా: ధ్రువ్ జురెల్, ర్యాన్ పరాగ్, సందీప్ శర్మ, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్.

9. గుజరాత్ టైటాన్స్ (GT)
కెప్టెన్:
శుభమన్ గిల్ 
కీలక ఆటగాళ్లు: సాయి సుదర్శన్, జోస్ బట్లర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్. 
ఇతర ఆటగాళ్ల జాబితా: కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్, జాసన్ హోల్డర్.

10. పంజాబ్ కింగ్స్ (PBKS)
కెప్టెన్:
శ్రేయాస్ అయ్యర్ 
కీలక ఆటగాళ్లు: అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్. 
ఇతర ఆటగాళ్ల జాబితా: ప్రభాసిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వైషాక్ విజయ్‌కుమార్, విష్ణు వినోద్.

Also Read: Fatty Liver Treatment: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా? సంజీవని లాంటి ఔషధం..కొద్దిరోజుల్లోనే పూర్తి ఆరోగ్యం!

Also Read: Bizarre News: నెలకు రూ.1.31 కోట్ల జీతం..కానీ జాబ్‌ను వదిలేస్తున్నాడు..కారణం తెలిస్తే ఇరగదీస్తారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 17, 2025 07:46:52
Hyderabad, Telangana:

Fatty Liver Healthy Drinks: కాలేయం దాని వ్యవస్థ మన శరీరంలోని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దాని పనితీరు మందగిస్తే.. మనిషి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని మరణం సంభవించవచ్చు. ప్రస్తుత వివిధ ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిలో కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోయి 'ఫ్యాటీ లివర్' సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను దూరం చేసి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి పసుపు ఒక అద్భుతమైన 'సూపర్ హెర్బ్'గా పనిచేస్తుంది.

పసుపులో ఉండే కర్కుమిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం కాలేయ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో కొన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం.

కాలేయానికి పచ్చి పసుపు కలిగించే ప్రయోజనాలు
1. కొవ్వును కరిగిస్తుంది:
పసుపులోని కర్కుమిన్ కాలేయంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును (ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్) తగ్గించడంలో సాయపడుతుంది. ఇది లిపిడ్ జీవక్రియను మెరుగుపరచి, ఫ్యాటీ లివర్ లక్షణాలను నయం చేస్తుందట.

2. వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది: పసుపుకు సహజంగానే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కాలేయ వాపును తగ్గించడమే కాకుండా, కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.

3. కాలేయ ఎంజైమ్‌ల నియంత్రణ: కాలేయ ఆరోగ్య దెబ్బతిన్నప్పుడు పెరిగే ALT, AST వంటి ఎంజైమ్‌ల స్థాయిలను ఈ పసుపు నియంత్రణ చేస్తుంది. తద్వారా కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

4. సహజ నిర్విషీకరణ: పచ్చి పసుపు రక్తం నుండి విషతుల్యాలను తొలగించి, కాలేయాన్ని శుభ్రపరిచే సహజ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది.

పచ్చి పసుపును ఎలా తీసుకోవాలి?
కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి పచ్చి పసుపు నీరు ఉత్తమ మార్గంగా ఉంది. ముందుగా పచ్చి పసుపు కొమ్మును తీసుకుని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కగా నూరాలి లేదా తురమాలి. ఈ పసుపును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. రుచికోసం ఇందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ పానీయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని ఆరోగ్య నివేదికల ద్వారా పేర్కొన్నాము. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Dhurandhar Collection: ప్రభాస్ రికార్డుకు ఎసరు పెట్టిన 'ధురంధర్'..రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన బాలీవుడ్ బ్లాక్‌బాస్టర్ మూవీ!

Also Read: School Holiday: తల్లీదండ్రులకు ముఖ్యగమనిక..రేపు స్కూళ్లకు సెలవు..బయటకు వెళ్తే ప్రాణాలతో చెలగాటమే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
PPINEWZ
Dec 17, 2025 07:11:12
Hyderabad, Telangana:

Moto G Power 2026 Launch: ప్రముఖ మోటోరోలా (Motorola) కంపెనీ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ Moto G పవర్ 2026 మొబైల్ పేరుతో లాంచ్‌ చేసింది. ఇది Moto G పవర్‌ 2025కు సక్సెసర్‌గా లాంచ్‌ అయ్యింది. దీని బేస్‌ వేరియంట్‌ను కంపెనీ 8GB RAMతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో లాంచ్‌ చేసింది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ 5200mAh బ్యాటరీని ప్యాక్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ప్రీమియం డిస్ల్పేతో విడుదల చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో Full HD+ రిజల్యూషన్‌తో లాంచైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ Moto G పవర్ 2026 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ USతో పాటు కెనడాలో అధికారికంగా విడుదల చేసింది. దీనిని కంపెనీ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో ప్రారంభించింది. ఇది ధర రూ. 27,100తో లభిస్తోంది. ఇక కెనడాలో సుమారు రూ. 29,500తో అందుబాటులో ఉందని సమాచారం. దీనిని కంపెనీ రెండు (ఈవినింగ్ బ్లూ, ప్యూర్ కాష్మెర్ కలర్) కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన సేల్‌ను కంపెనీ జనవరి 8న ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని వివరాలను  Motorola అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన విక్రయాలు ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌తో పాటు అధికారక వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. 

Moto G పవర్ 2026 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెసిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.8-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో లాంచ్‌ అయ్యింది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. డిస్ప్లే ప్రొటక్షన్‌ కోసం ఇందులో కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iను కూడా అందిస్తోంది. అంతేకాకుండా డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుంది. 

Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్‌ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!

ఈ మొబైల్‌ను కంపెనీ Android 16 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రన్‌ చేస్తోంది. ఇక ఈ మొబైల్‌ వెనక భాగంలో 50 మెగాపిక్సెల్స్  ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరాలను అందిస్తోంది. ఇందులో ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇక ఫ్రంట్‌ భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తోంది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన  ఆటో నైట్ విజన్, పోర్ట్రెయిట్ మోడ్, ఆటో స్మైల్ క్యాప్చర్ ఏఐ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన  5200mAh బ్యాటరీని కూడా అందిస్తోంది. దీంతో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా లభిస్తుంది. 

Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్‌ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Dec 17, 2025 04:49:58
Secunderabad, Telangana:

 Rupee Weakness Results: ఫారెన్ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడంతో రూపాయి ఒత్తిడిలో పడింది. దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారడంతో ఈ క్షీణత సాధారణ ప్రజలపై ప్రభావం చూపనుంది. దీని ఫలితంగా పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రానిక్స్, విదేశీ ప్రయాణాల ధరలకు రెక్కలు రానున్నాయి. 2025లో ఫారెన్ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 16న డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ 91.02కి పడిపోయింది. ఇప్పటి ఇప్పటి వరకు ఉన్న అత్యల్ప స్థాయి. భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరించుకోవడంతో రూపాయిపై భారీ ఒత్తిడిని పడింది. రూపాయి బలహీనపడం సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దిగుమతులు మరింత ఖరీదుగా మారుతాయి. పెట్రోల్, డీజిల్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ లేదా విదేశాలకు ప్రయాణించే ఖర్చులు భారీగా పెరుగుతాయి.

రూ. 91.02 – డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. 20శాతం – ఏప్రిల్ 2022 నుండి రూపాయి క్షీణతకు గురైంది. 6శాతం – 2025లోనే పతనమయ్యింది. ఆసియాలోనే ఇది అత్యధికంగా 18 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2025లో ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్ నుంచి 50శాతం పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే కొన్ని భారతీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించింది.

మొత్తానికి రూపాయికి కష్టకాలం వచ్చిందనే చెప్పాలి. సోమవారం కనిష్ట స్థాయికి చేరుకుని కొత్త రికార్డుకు చేరుకుంది. 2025లో రూపాయి ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబర్చిన కరెన్సీగా మారింది. థాయిలాండ్, దక్షిణకొరియా ఇండోనేషియా కరెన్సీల కంటే దారుణంగా పడిపోయింది. ఈ క్షీణత ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 2022 ఏప్రిల్ నుంచి క్షీణిస్తుంది. అప్పటి నుంచి డాలర్ తో పోలిస్తే దాదాపు 20శాతం, యూరోతో పోలిస్తే 29శాతం, బ్రిటిష్ పౌండ్ తో పోలిస్తే 23శాతం బలహీనపడింది.

రూపాయి ఎందుకు బలహీనపడుతోంది అనేదానికి కారణం ఏంటంటే.. భారత్ నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై అమెరికా 50శాతం వరకు సుంకాలను విధించింది. దీంతో భారతదేశపు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ కు దెబ్బతగిలినట్లయ్యింది. ఇండో అమెరికా వాణిజ్య చర్చలను నిలిపివేసింది. ఇదొక కారణం అయితే రెండో కారణం కూడా ఉంది. అమెరికా, ఇతర మార్కెట్లో మెరుగైన రాబడిని చూసి ఫారెన్ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు 2025లో ఇఫ్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు 18 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. డిసెంబర్ లో 500బిలియన్ డాలర్లకు పైగా బాండ్ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ భారీ తరలింపు అనేది రూపాయిపై భారీ ఒత్తిడిని కలిగించింది.

సామాన్యులపై ఎలాంటి ప్రభావ చూపనుంది?

రుపాయి బలహీనపడుతుందంటే... దిగుమతులు ఖరీదుగా మారుతాయి. భారత్ తన చమురు అవసరాల్లో 8శాతానికిపైగా విదేశాలపైనే ఆధారపడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు మొబైల్స్, ల్యాప్ టాప్స్, ఐఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి డాలర్, యూర్, పౌండ్ తో పోలిస్తే రూపాయి బలహీనంగా మారడంతో విదేశీ ప్రయాణాలు కూడా మరింత ప్రియం అవుతాయి.

రూపాయి బలహీన పడితే ఎవరు ప్రయోజనం పొందుతారు?

రూపాయి బలహీనపడటం వల్ల ఎగుమతి కంపెనీలు లాభం పొందుతాయి. ఐటీ కంపెనీలు, ఔషధ తయారీదారు కంపెనీలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని డాలర్ల రూపంలోనే సంపాదిస్తాయి. కాబట్టి రూపాయి బలహీనపడితే వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

Also Read: Highest Currency World Oman Riyal : మోదీ ఒమన్ పర్యటన వెనకున్న సీక్రెట్ ఇదే.. రూపాయితో పోలిస్తే రియాల్ ఎంత శక్తివంతమైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

డాలర్ కు 95 రూపాయల వరకు చేరుకునే ఛాన్స్:

డాలర్ బలంగా ఉండి.. ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగిస్తే.. రూపాయి విలువ డాలర్ కు 92 నుంచి 95కి చేరుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బిఐ డాలర్లను అమ్మడం ద్వారా క్షీణతను అరికట్టేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ దాని పరిధి అనేది పరిమితంగా ఉంటుంది.

ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందా?

రూపాయి బలహీనత ఇక నుంచి కేవలం కరెన్సీ సమస్య మాత్రమే కాదు.. ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం కూడా ఉంటుంది. విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. భారత దేశ ఆర్ధికాభివ్రుద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉన్నా.. రూపాయి పడిపోవడం వల్ల ఈ మొత్తం వ్రుద్ధి కథకు భారీ సవాల్ విసురుతోంది.

Also Read: Rupee Fall: ట్రంప్ ప్రకటనతో మరోసారి రూపాయ్‌ కొంపమునిగింది.. ఆల్ టైమ్ కనిష్ఠానికి ఇండియన్ కరెన్సీ.. ప్చ్.. ఇప్పడేం చేయాలి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

 

0
comment0
Report
BBhoomi
Dec 17, 2025 03:53:09
Secunderabad, Telangana:

Post Office Schemes: కేంద్ర ప్రభుత్వం.. ప్రజల్లో పొదుపు అలవాట్లను ప్రోత్సహించేందుకు.. అనేక చిన్న మొత్తాల సేవింగ్స్ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. ముఖ్యంగా పోస్టల్ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న పొదుపు స్కీమ్స్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా రూపకల్పన చేసింది. భద్రత, స్థిరమైన వడ్డీ, పన్ను ప్రయోజనాలు వంటి అంశాల వల్ల ఈ పథకాలకు మంచి ఆదరణ ఉంది. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టిన అసలు మొత్తానికి, వడ్డీ రాబడులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండటంతో మదుపర్లు భరోసాతో పెట్టుబడి పెట్టవచ్చు. చాలా పథకాలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. ఆ పథకాలేవి.. అందులో ఎంత వడ్డీ లభిస్తుంది.. ఎంత లాభం వస్తుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్:

ఈ ఖాతాను ఒక వ్యక్తి ఒంటరిగా లేదా ఇద్దరు కలిసి జాయింట్‌గా తెరవవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్ లేదా మానసికంగా అశక్తుడైన వ్యక్తి తరఫున గార్డియన్ ద్వారా కూడా అకౌంట్ తీసుకోవచ్చు. ఇందులో వార్షిక వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. కనీసంగా రూ.500 డిపాజిట్ చేయాలి. రోజువారీ లావాదేవీలకు ఇది ఉపయోగపడే ప్రాథమిక సేవింగ్స్ అకౌంట్.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)

ఐదేళ్ల కాలపరిమితితో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. పెట్టుబడిదారులు ఎన్ని అకౌంట్లైనా తెరవొచ్చు. నెలకు కనీసం రూ.100 చొప్పున డిపాజిట్ చేయాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.70 శాతం వడ్డీ అమల్లో ఉంది. చిన్న మొత్తాల్లో క్రమంగా పొదుపు చేయాలనుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

పోస్టాఫీస్ టైం డిపాజిట్

ఈ పథకంలో 1, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ అనంతరం ఖాతాను మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఐదేళ్ల టైం డిపాజిట్‌పై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి –

• 1 సంవత్సరం: 6.90శాతం

• 2 సంవత్సరాలు: 7శాతం

• 3 సంవత్సరాలు: 7.5శాతం

• 5 సంవత్సరాలు: 7.50శాతం

కనీస డిపాజిట్ రూ.1,000 కాగా, గరిష్ట పరిమితి లేదు.

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)

ఈ పథకం నెలనెలా వడ్డీ ఆదాయం కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.40 శాతం. కనీస డిపాజిట్ రూ.1,000. సింగిల్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ ఆదాయంపై వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

60 ఏళ్లు పైబడిన వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. అవసరమైతే వడ్డీ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌కు ఆటో క్రెడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.20 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్టంగా రూ.30 లక్షల వరకు అవకాశం ఉంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

ఒక వ్యక్తికి ఒక్క పీపీఎఫ్ ఖాతా మాత్రమే అనుమతి ఉంటుంది. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ ఖాతా తెరవవచ్చు. వడ్డీపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. మెచ్యూరిటీ సమయానికి అసలు, వడ్డీ మొత్తం కలిపి చెల్లిస్తారు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.10 శాతం. కనీస డిపాజిట్ రూ.500, గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షలు. ఖాతా కాలపరిమితి 15 సంవత్సరాలు కాగా, తరువాత ప్రతి 5 సంవత్సరాలకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

Also Read: Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

సుకన్య సమృద్ధి యోజన

ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన ఈ పథకంలో ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరు మీద అకౌంట్లు తెరవవచ్చు. పాప వయసు 10 సంవత్సరాలు పూర్తయ్యేలోపు తల్లిదండ్రులు లేదా గార్డియన్ అకౌంట్ తెరవాలి. వడ్డీ వార్షికంగా లెక్కించి మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.1 శాతం. కనీస డిపాజిట్ రూ.250, గరిష్టంగా రూ.1.50 లక్షలు. మెచ్యూరిటీపై పన్ను లేదు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)

ఈ స్కీమ్‌లో ఎన్ని అకౌంట్లైనా తెరవవచ్చు. వడ్డీ వార్షికంగా లెక్కించి మెచ్యూరిటీకి అసలుతో కలిపి చెల్లిస్తారు. 18 ఏళ్లు నిండిన వారు అకౌంట్ తెరవవచ్చు. మైనర్ల తరఫున గార్డియన్‌కు అవకాశం ఉంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.70 శాతం. కనీస డిపాజిట్ రూ.1,000, కాలవ్యవధి 5 సంవత్సరాలు.

కిసాన్ వికాస్ పత్ర (KVP)

ఈ పథకంలో పెట్టుబడి చేసిన మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. 18 ఏళ్లు నిండిన వారు అకౌంట్ తెరవవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.50 శాతం. కనీస డిపాజిట్ రూ.1,000, గరిష్ట పరిమితి లేదు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్

మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకంలో మహిళలు తమ పేరుతో లేదా మైనర్ బాలికల తరఫున గార్డియన్‌గా అకౌంట్ తెరవవచ్చు. మెచ్యూరిటీ సమయంలో అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.50 శాతం. కనీస డిపాజిట్ రూ.1,000, గరిష్టంగా రూ.2 లక్షలు. డిపాజిట్ కాలపరిమితి 2 సంవత్సరాలు.

Also Read: Sukanya Samriddhi Scheme: ఏ వయస్సున్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వర్తిస్తుంది? అర్హతలు ఏంటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి..?

ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షించి మారుస్తుంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, కాలవ్యవధి, పన్ను ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని సరైన పథకాన్ని ఎంచుకోవడం మంచిది. మరింత స్పష్టమైన సమాచారం కోసం సమీప పోస్టాఫీసును సంప్రదిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
IPInamdar Paresh
Dec 17, 2025 02:54:04
Hyderabad, Telangana:

20 foot king cobra rescued video: సోషల్ మీడియాలో కోబ్రాల వీడియోలు ఇటీవల బాగా ట్రెండ్ అవుతున్నాయి. పాములు అంటేనేచాలా మంది భయంతో వణికిపోతారు. పొరపాటున ఎక్కడైన చీకట్లో తాడు కన్పించిన పామని భయపడిపోయే వారు చాలా మంది ఉంటారు. కోబ్రాలే డేంజర్ అంటే కింగ్ కోబ్రాల గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అవి చాలా డెంజర్గా ఉంటాయి. వీటి విషంలో సెకనుల వ్యవధిలో మనిషి చనిపోతారు. కింగ్ కోబ్రా విషం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ,నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.

 

దీంతో కింగ్ కోబ్రా కాటు వేసిన కొద్దిసేపటికి వ్యక్తి ప్రాణాలు కొల్పోతాడు. అడవులు, దట్టమైన కొండలు, చెరువులు మొదలైన ప్రాంతాల్లో ఎక్కువగా కింగ్ కోబ్రాలు ఉంటాయి. అవి ఇతర సర్పాలను తినేస్తాయి. గూడు కట్టుకుని ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భారీ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి వచ్చింది. అయితే..  వారు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అతను  రంగంలోకి దిగాడు.

ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం భారీ కింగ్ కోబ్రా జనల మధ్యలోకి వచ్చింది. అక్కడి వారు స్నేక్ క్యాచర్ కు చెప్పడంతో చాకచక్యంగా దాన్ని పట్టుకొవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అది పలుమార్లు అతనిపై దాడికి యత్నించింది. అతను కింగ్ కోబ్రా కాటు నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా కింగ్ కోబ్రా కొన్ని గంటల పాటుముప్పు తిప్పలు పెట్టింది.

Read more: Snake Video: అరె వావ్... తాడును చుట్టుకుని నాట్యం చేస్తున్న నాగుపాము.. అరుదైన వీడియో...

ఎంతో చాకచక్యంగా ప్రయత్నించి చిరవకు కింగ్ కోబ్రాను మెల్లగా తనతో తెచ్చుకున్న కర్రను ఉపయోగించి తన ఆధీనంలోకి తెచ్చుకుని బందించాడు. ఆ తర్వాత దగ్గరలోని అడవిలో తీసుకెళ్లి వదిలేశాడు. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది.

 

0
comment0
Report
Dec 15, 2025 11:32:35
0
comment0
Report
Advertisement
Back to top