Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
648591
Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్...
HDHarish Darla
Mar 05, 2026 12:52:10
Krasnoyarskiy kray

Russia Massive Oil To India: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కీలకమైన 'హొర్ముజ్ జలసంధి' మార్గం మూతపడటంతో భారత్‌కు ఇంధన గండం పొంచి ఉంది. ఈ క్లిష్ట సమయంలో రష్యా భారత్‌కు బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య దాడులు-ప్రతిదాడుల నేపథ్యంలో సముద్ర మార్గాల్లో చమురు రవాణా నిలిచిపోయింది. 

భారత్‌లో నిల్వల పరిస్థితి..
ప్రస్తుతం భారతదేశం వద్ద కేవలం 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. రిఫైనరీల వద్ద ఎల్‌పీజీ, గ్యాసోలిన్ వంటి ఇంధనాలు కూడా తక్కువ పరిమాణంలోనే ఉన్నాయి. భారత్ దిగుమతి చేసుకునే చమురులో దాదాపు 40 శాతం వాటా హొర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో వందలాది నౌకలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ తప్పనిసరి అయింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో 10-15 రోజులు ఇలాగే కొనసాగితే భారత్‌లో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా నుండి నిలిచిపోయిన సరఫరాను భర్తీ చేసేందుకు, భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల చమురును మళ్లించడానికి రష్యా అంగీకరించినట్లు సమాచారం. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. రష్యా నుండి అందే ఈ అదనపు నిల్వలు దేశీయ అవసరాలకు పెద్ద ఊరటనివ్వనున్నాయి.

హొర్ముజ్ జలసంధి మార్గం పూర్తిగా మూతపడితే సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాల నుండి వచ్చే చమురు ఆగిపోతుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలైన రష్యా నుండి చమురును వేగంగా తరలించడానికి సురక్షితమైన సముద్ర మార్గాలను భారత్ వెతకాల్సి ఉంది. పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రష్యా సహాయంతో ఇంధన భద్రతను కాపాడుకోవాలని భారత్ భావిస్తోంది.

Also Read: Iran Attacks US Warship: ఇరాన్ ట్యాంకర్ కూల్చిన 24 గంటల్లో అమెరికా ట్యాంకర్‌‌ని కూల్చేసిన ఇరాన్‌!

Also Read: Pakistan Cricketer Misconduct: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ..హోటల్‌లో అమ్మాయిలతో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 05, 2026 14:04:26
Hyderabad, Telangana:

Vrushakarma Movie Glimpse: టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య వరుస ప్రయోగాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ 'వృషకర్మ' చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'విరూపాక్ష' వంటి సెన్సేషనల్ హిట్ అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

చిత్రబృందం విడుదల చేసిన గ్లింప్స్ చూస్తుంటే, దర్శకుడు మరోసారి ప్రేక్షకులను ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడని స్పష్టమవుతోంది. "అతీంద్రియ శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది" అంటూ సాగే డైలాగ్ సినిమా మూడ్‌ను సెట్ చేసింది. 2 నిమిషాల 9 సెకన్ల పాటు సాగే ఈ గ్లింప్స్‌లో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. హారర్, మిస్టరీ అంశాలను మేళవించిన తీరు అద్భుతంగా ఉంది.

కథానాయకుడు నాగచైతన్య ఇందులో ఒక అన్వేషకుడిగా కనిపించగా.. హీరోయిన్ మీనాక్షి చౌదరి, జయరామ్‌లు ఆర్కియాలజిస్ట్ పాత్రల్లో మెరిశారు. ముఖ్యంగా బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సాంకేతిక హంగులు
'వృషకర్మ' గ్లింప్స్‌లో కనిపించిన విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచేలా ఉన్నాయి. మీనాక్షి చౌదరి పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలక ప్రాధాన్యత కలిగి ఉండబోతోందని సమాచారం.

సోషల్ మీడియాలో 'వృషకర్మ' గ్లింప్స్‌కు భారీ స్పందన లభిస్తోంది. "చైతూ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్న కథాంశాలను ఎంచుకోవడంలో నాగ చైతన్య చూపిస్తున్న పరిణతిని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో నాగచైతన్య ప్రతి సినిమాలోనూ తనదైన స్టైల్‌ను కొనసాగిస్తూనే..ఈ మూవీలోనూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే 'తండేల్' సినిమా నుంచి ఆయనలో మరింత పరిణితి కనిపిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మొత్తానికి 'విరూపాక్ష' సినిమాతో భయపెట్టిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు, ఇప్పుడు 'వృషకర్మ'తో అంతకంటే పెద్ద మ్యాజిక్ చేయబోతున్నాడని అర్థమవుతోంది. మరి ఈ అన్వేషణలో నాగ చైతన్య ఎలాంటి రహస్యాలను ఛేదిస్తాడో చూడాలి!

Also Read: Keerthy Suresh Transformation: జెట్ స్పీడ్‌లో బరువు తగ్గిన హీరోయిన్ కీర్తి సురేష్..ఈ ట్రిక్స్‌తో 10 కిలోలు తగ్గిపోయింది!

Also Read: Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 13:35:07
Abbeyville, Colorado:

Trump Epstein Files News: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలో ఊహించని రాజకీయ సంక్షోభం ఎదురవుతోంది. సంచలనం సృష్టించిన 'ఎప్‌స్టీన్ ఫైళ్ల' విషయంలో అటార్నీ జనరల్ పామ్ బోండి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.

జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో దాగి ఉన్న వేలాది పత్రాలను విడుదల చేసేందుకు అమెరికా న్యాయ శాఖ సిద్ధమవుతోంది. ఈ పరిణామం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ ఫైళ్లలో ఏముంది?
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి మొత్తం 6 లక్షల పత్రాలు ఉండగా, ఇప్పటివరకు సగం మాత్రమే బహిర్గతమయ్యాయి. గతంలో కనిపించకుండా పోయాయని భావించిన 50,000 కీలక పత్రాలను ఇప్పుడు న్యాయశాఖ గుర్తించింది. ఈ కొత్త పత్రాలలో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందనే వార్తలు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే వారంలోగా ఈ ఫైళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

అటార్నీ జనరల్ పామ్ బోండి ఈ వ్యవహారంలో తీసుకున్న స్టాండ్ చర్చనీయాంశమైంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను దాచిపెట్టి ప్రభుత్వం తనను తప్పుదారి పట్టించిందని ఆమె ఆరోపించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆమె హౌస్ కమిటీ ముందుకు హాజరుకానున్నారు.

బోండిని కమిటీ ముందు ప్రశ్నించే విషయంపై జరిగిన ఓటింగ్‌లో 24 మంది సభ్యులు అనుకూలంగా, 19 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆమె కమిటీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పనిసరి అయ్యింది.

ఇప్పటివరకు వెలుగులోకి రాని ఉన్నత స్థాయి వ్యక్తుల వివరాలు ఈ 50,000 పత్రాల ద్వారా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ బోండి కమిటీ ముందు సరైన వివరణ ఇవ్వకపోతే, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు యుద్ధం, అటు ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగతో అమెరికా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పత్రాల విడుదల తర్వాత అమెరికాలో మరిన్ని సంచలనాలు రేగే అవకాశం ఉంది.

Also Read: Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!

Also Read: Iran Attacks US Warship: ఇరాన్ ట్యాంకర్ కూల్చిన 24 గంటల్లో అమెరికా ట్యాంకర్‌‌ని కూల్చేసిన ఇరాన్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Mar 05, 2026 13:34:44
Secunderabad, Telangana:

Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో... వరుసగా పతనమవుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు గురువారం పుంజుకున్నాయి. యుద్ధ భయాలు పూర్తిగా తగ్గకపోయినా, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన కొన్ని సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల నమ్మకాన్ని కొంతమేర పెంచాయి. దాంతో ప్రధాన సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. మార్కెట్‌లో వచ్చిన ఈ పుంజుకోలు కారణంగా ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.6 లక్షల కోట్ల మేర పెరిగినట్లు అంచనా.

మార్చి 5న జరిగిన ట్రేడింగ్ సెషన్‌లో ప్రారంభం నుంచే మార్కెట్‌కు సానుకూల వాతావరణం కనిపించింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్ 79,530 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజు మొత్తం కూడా కొనుగోళ్ల ఊపు కొనసాగడంతో ఒక దశలో సూచీ 1,100 పాయింట్లకు పైగా పెరిగి 80,303 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు సెన్సెక్స్ 900 పాయింట్లకు సమీపంగా లాభపడి 80,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ కూడా బలమైన ప్రదర్శన కనబరిచి 285.40 పాయింట్లు పెరిగి 24,765 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌లోని కొన్ని ప్రధాన కంపెనీల షేర్లు గణనీయంగా లాభపడ్డాయి. ముఖ్యంగా అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, రిలయన్స్, బెల్ వంటి స్టాక్స్ నాలుగు శాతం వరకు పెరిగాయి. అయితే టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి కొన్ని కంపెనీల షేర్లు మాత్రం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.

మార్కెట్ పుంజుకోవడానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉందని ఉప విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన మార్కెట్‌లో ఆశాజనక సంకేతాలను పంపింది. అదేవిధంగా అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో చర్చలకు సిద్ధమనే వార్తలు వెలువడటంతో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై పెట్టుబడిదారుల్లో ఆశలు పెరిగాయి.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!!  

ప్రపంచ మార్కెట్లలో కూడా ఇదే తరహా ధోరణి కనిపించింది. గత సెషన్‌లో భారీగా పడిపోయిన దక్షిణ కొరియా కోస్పీ సూచీ ఈరోజు దాదాపు 9 శాతం వరకు పెరిగింది. అలాగే జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అంతేకాకుండా అమెరికా మార్కెట్లు కూడా ముందురోజు ట్రేడింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాయి.ఇక అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు తక్కువ ధరకే బీమా సదుపాయం కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. అవసరమైతే చమురు నౌకలకు అమెరికా నౌకాదళం భద్రత కల్పిస్తుందని ఆయన తెలిపారు.

ఇవే కాకుండా రూపాయి విలువ కూడా కొంత బలపడింది. గత ట్రేడింగ్ సెషన్‌లో డాలర్‌తో పోలిస్తే 92 స్థాయిని దాటిన రూపాయి, ఈరోజు తిరిగి 91.60 వద్ద ట్రేడ్ కావడం మార్కెట్‌కు మరో సానుకూల అంశంగా మారింది. అలాగే రిలయన్స్ వంటి భారీ వెయిటేజీ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరగడం కూడా మార్కెట్ సూచీలకు బలాన్నిచ్చింది. మొత్తంగా చూస్తే వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈరోజు ట్రేడింగ్ కొంత ఊరటనిచ్చిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Stock Market: వార్ ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ. 10లక్షల కోట్ల సంపద ఆవిరి..!!  

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

 

0
comment0
Report
IPInamdar Paresh
Mar 05, 2026 13:15:10
Hyderabad, Telangana:

Chandrababu naidu key statement on population management policy: ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల కన్నా సౌత్ రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మండలిలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఇక జనాభా నియంత్రణ నుంచి పాపులేషన్ మెనెజ్ మెంట్ దిశగా ముందుకు వెళ్తుందన్నారు.  దీనిపైన నెల రోజుల్లో ఒక డ్రాఫ్ట్ రూపొందిస్తామన్నారు. అదే విధంగా ఏపీలో సంతానోత్పత్తి ప్రస్తుతం  రేటు 1.5 గా ఉందని, దీన్ని 2.1 గా తీసుకొని వెళ్లడమే తమ టార్గెట్ అన్నారు.  1997 లో ఏపీ పాపులేషన్ పాలసీ తెచ్చామన్నారు . తమిళనాడులో 1.4, కేరళ 1.6, బీహర్ 3 టీఎఫ్ ఆర్ ఉందని అన్నారు. ముఖ్యంగా ప్రజలు.. 57 శాతం ఒకరితో సంతానంను ఆపేస్తున్నారని, 32 శాతం ఇద్దర్ని, 9 శాతం మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లల్ని కంటున్నారని అన్నారు.

మరోవైపు 60 ఏళ్లు దాటిన వారు 10 శాతం ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమలుచేసేలా ముందుకు వెళ్తామన్నారు. అదే విధంగా.. పాపులేషన్ పాలసీ అమలులో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా చేస్తామన్నారు టీఎఫ్ఆర్ ను 2.1 కు తీసుకెళ్లేలా చూస్తామన్నారు.ఈ క్రమంలో ఇద్దరుకంటే ఎక్కువగా పిల్లల్ని కనేవారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాన్పుకు రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నగదు పురస్కారం గెమ్ చెంజర్ గా మారుతుందని అన్నారు.

రెండో బిడ్డ పుడితే తండ్రికి ఒకనెల, మూడో బిడ్డ పుడితే రెండు నెలల పెయిడ్ లీవ్ మంజురు చేస్తామన్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పథంక అమలు చేస్తామన్నారు.ఈ పథకం జనాభా పెరుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. ఇప్పటికే తమిళనాడు , కేరళ జనాభా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, యూపీ , బీహర్ లు మాత్రమే కాస్తంత బెటర్ గా ఉన్నాయన్నారు.

Read more: kalvakuntla Kavitha: తిరుపతికి చేరుకున్న కల్వకుంట్ల కవిత.!. జై ఆంధ్రా అంటూ సెన్సెషనల్ కామెంట్స్..

ఆ బిడ్డ సంతానంకు ఐదేళ్ల పాటు నెలకు1 వెయ్యి, మూడు ఆపై జననాలకు 12 నెలల పెరెంటల్ లీవ్,షీ క్యాబ్స్, వర్కింగ్ ఉమెన్ హస్టళ్లు, ఉద్యోగులకు  15 రోజుల వెల్ నెస్ లీవ్, ఆరోగ్య నిధి కింద రూ. 50 వేలు ఇస్తామని  చంద్రబాబు ప్రకటించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 11:10:53
:

Iran Attack On US Submarine: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్‌ యుద్ధ నౌక ఐరిస్‌ దేనాపై అమెరికా దాడి చేసి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్ దానికి ప్రతీకారంగా అమెరికా ట్యాంకర్‌ను పేల్చేసింది. గల్ఫ్‌లోని యూఎస్ ట్యాంకర్‌ను కూల్చినట్లు ఆ దేశ మీడియా కథనాల్లో వెల్లడిస్తోంది.

ఇరాన్‌ మీడియా చెప్పిన కథనం ప్రకారం.. పర్షియన్‌ గల్ఫ్‌లోని అమెరికా యుద్ధ‌ ట్యాంకర్‌పై క్షిపణితో దాడి చేసినట్లు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ప్రకటించింది. ఆ యుద్ధ నౌక నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడినట్లు పేర్కొంది. 

అయితే ఈ దాడిలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించలేదు. తమ యుద్ధనౌకపై దాడికి ప్రతీకారంగానే అమెరికా యుద్ధ ట్యాంకర్‌పై దాడి చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై ఇరాన్‌ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు సహా అటు అమెరికా కూడా దీనిపై ఇంకా స్పందన లేదు.

మరోవైపు భారత్‌లోని వైజాగ్ నుంచి ఇరాన్‌కు తిరిగి వెళ్తున్న ఐరిస్‌ దేనా-75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దాడిలో 87 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరికొందర్ని శ్రీలంక రక్షణ దళాలు రక్షించాయి. 

కొందరు సముద్రంలో గల్లంతయ్యారు. ఇప్పటికే అమెరికా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో యూఎస్ ట్యాంకర్‌పై దాడి జరగడం గమనార్హం.

Also Read: Pakistan Cricketer Misconduct: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ..హోటల్‌లో అమ్మాయిలతో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన!

Also Read: SA Vs NZ Semi Final 2026: సెమీఫైనల్లో కివీస్ విధ్వంసం..చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా..ఫైనల్‌కు న్యూజిలాండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 09:39:09
Kandy, Central Province:

Pakistan Cricket Player Controversy: పాకిస్థాన్ క్రికెట్ జట్టును వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అటు మైదానంలో వరుస పరాజయాలు, ఇటు మైదానం బయట ఆటగాళ్ల క్రమశిక్షణారాహిత్యం ఆ దేశ క్రికెట్ బోర్డును (PCB) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఒక ఆటగాడి అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ కప్ ప్రదర్శన కంటే కూడా ఇప్పుడు ఒక వివాదాస్పద ఘటన పాకిస్థాన్ క్రికెట్ పరువును బజారున పడేసింది. 

హోటల్‌లో ఏం జరిగింది?
టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో భాగంగా శ్రీలంకలోని కాండీలో పాక్ జట్టు బస చేసింది. ఆ సమయంలో ఒక గుర్తు తెలియని పాక్ క్రికెటర్, హోటల్‌లోని మహిళా హౌస్ కీపింగ్ సిబ్బందితో అత్యంత అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు వెంటనే అప్రమత్తమై అలారం మోగించడంతో హోటల్ యాజమాన్యం జోక్యం చేసుకుంది.

ఈ విషయం తీవ్రరూపం దాల్చడంతో హోటల్ సీనియర్ అధికారులు కఠిన చర్యల కోసం పట్టుబట్టారు. అయితే, టీమ్ మేనేజర్ నవీద్ చీమా మధ్యవర్తిత్వం వహించి హోటల్ వర్గాలకు క్షమాపణలు చెప్పారు. ఆ ఆటగాడికి భారీ జరిమానా విధించి, ప్రస్తుతానికి విషయాన్ని బయటకు పొక్కకుండా మేనేజ్ చేశారు. కానీ, పీసీబీ ఈ కేసును ఇంకా క్లోజ్ చేయలేదని సమాచారం.

పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం
టీ20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యాలు, బోర్డు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు పాక్ క్రికెట్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాయి. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, ముఖ్యంగా భారత్ చేతిలో ఓటమిని పీసీబీ సీరియస్‌గా తీసుకుంది. దీనికి బాధ్యతగా ప్రతి ఆటగాడికి రూ.50 లక్షల (పాక్ రూపాయలు) భారీ జరిమానా విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బాబర్ అజామ్, సైమ్ అయూబ్ వంటి కీలక ఆటగాళ్లను తొలగించడం పెను దుమారం రేపుతోంది. టీ20 వైఫల్యానికి వన్డే జట్టు నుండి వారిని తప్పించడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. మరోవైపు ఇరాన్, యూఎస్-ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల బంగ్లాదేశ్ పర్యటన పూర్తిగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌కు కూడా చేరలేకపోయిన పాక్ జట్టు, ఇప్పుడు ఇటువంటి వ్యక్తిగత ప్రవర్తనా వివాదాలతో మరింత అప్రతిష్ట పాలవుతోంది. సదరు ఆటగాడిపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Also Read: SA Vs NZ Semi Final 2026: సెమీఫైనల్లో కివీస్ విధ్వంసం..చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా..ఫైనల్‌కు న్యూజిలాండ్!

Also Read: Liquor Digital Payments In AP: మందుబాబులకు గుడ్‌న్యూస్..ఇకపై వైన్ షాపుల్లో అవి తప్పనిసరి..చిల్లర గాళ్ల ముప్పు తప్పినట్టే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Mar 05, 2026 03:42:21
Secunderabad, Telangana:

Gold Rate Today: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ బంగారం మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా  ఇరాన్ , ఇజ్రాయెల్   మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గోల్డ్ ధరలను కొన్ని రోజుల క్రితం భారీగా పెంచాయి. అయితే ఇటీవల పరిస్థితుల్లో కొంత స్థిరత్వం కనిపించడంతో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదవుతోంది.

హైదరాబాద్  నగరంలో నిన్న బంగారం ధరలు గణనీయమైన స్థాయిలోనే కొనసాగినా, స్వల్పంగా తగ్గాయి. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,64,510 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,800 వద్ద ఉండగా, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,23,380 వద్ద నమోదైంది. అయితే నిన్నటి ధరలతో పోలిస్తే ప్రతి గ్రాముకు ఒక రూపాయి చొప్పున తగ్గుదల కనిపించింది. దీంతో పది గ్రాముల బంగారంపై మొత్తం రూ.10 వరకు ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ రోజు కూడా బంగారం ధరలు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,64,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,790 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.1,23,370 వద్ద ట్రేడ్ అవుతోంది.

బంగారం ధరలతో పాటు వెండి మార్కెట్‌లో కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్‌లో ఒక కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో 100 గ్రాముల వెండి ధర రూ.29,500 వద్ద నమోదైంది. అయితే ఈ రోజు వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,94,900 వద్ద ఉంది. అలాగే 100 గ్రాముల వెండి ధర రూ.10 తగ్గి రూ.29,490 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.16,450గా ఉండగా, విజయవాడలో అది రూ.16,451గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.16,466 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో ఒక గ్రాము బంగారం ధర హైదరాబాద్‌తో సమానంగా రూ.16,450 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read: Kurdish Army: కుర్దిష్ సైన్యం దెబ్బతో ఇరాన్‌ లొంగిపోనుందా? అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే..!!  

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా ఈ అంశాల ఆధారంగా గోల్డ్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.

Also Read: Mortgage Property: మార్ట్‌గేజ్ ప్రాప‌ర్టీ అంటే ఏంటి..? నిబంధ‌న‌లు ఏంటి..? కొనే ముందు ఈ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి..!!  

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 04, 2026 17:32:21
Balapur, Telangana:

Telangana CM Delhi Tour: అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. మావోయిస్టుల ఏరివేత.. లొంగుబాటుతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై సమావేశంలో  చర్చలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు కూడా కేంద్ర హోంమంత్రి ముందు ఉంచారు. కేంద్ర హోంమంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబీ ఐజీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

Also Read: BRS Party: గులాబీ పార్టీలో గుబులు.. సంస్థాగత నిర్మాణంపై మళ్లీ చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. డ్రగ్స్‌, గంజాయి వంటి నివారణకు ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, సైబర్ నేరాలను, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ప్రస్తావించి వాటి పనితీరు.. సాధించిన ఫలితాలు వివరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమీషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటుచేసిన విషయాన్ని ప్రస్తావించారు.

Also Read: Adulterated Ghee: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌.. బంజారాహిల్స్‌లో 460 కిలోల కల్తీ నెయ్యి సీజ్‌

తెలంగాణకు మరింత సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని.. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కేంద్ర హోంమంత్రిని తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా, పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారుల కేటాయింపు అత్యవసరం అని.. ఈ దిశగా కేంద్ర హోం శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విన్నవించారు.

మావోయిస్టుల లొంగుబాటు అంశం
తెలంగాణ రాష్ట్రంలో అజ్ఞాతం వీడి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టు నాయకుల విషయాన్ని కేంద్ర హోంమంత్రి వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. మావోయిస్టుల లొంగుబాటు అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. మిగిలిన మావోయిస్టు నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం సంబంధించిన విషయాలను ఈ భేటీలో కేంద్ర హోంమంత్రికి వివరించారు. రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయని.. మొత్తం 591 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల పలువురు మావోయిస్టు అగ్ర నాయకులు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకువచ్చారని తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం తరపున కల్పిస్తున్న సౌకర్యాలను కేంద్ర హోంమంత్రికి తెలంగాణ సీఎం వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారంపై కేంద్ర హోంమంత్రితో తెలంగాణ సీఎం చర్చించారు. పలు అంశాలపై కేంద్ర హోంమంత్రికి విజ్ఞాపనలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 04, 2026 17:06:03
Kolkata, West Bengal:

SA Vs NZ Semi Final 2026 Scorecard: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికా కథ విషాదాంతమైంది. టోర్నీ ఆరంభం నుండి అజేయంగా నిలిచిన సఫారీలు, కీలకమైన సెమీస్‌లో చేతులెత్తేసి మరోసారి 'ఛోకర్స్' ముద్రను చెరిపలేకపోయారు. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన దక్షిణాఫ్రికా టోర్నీ నుండి నిష్క్రమించగా, కివీస్ ఘనవిజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది.

తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ పిచ్ పరిస్థితులను బట్టి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 169/6 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఊహించని రీతిలో ఛేదించి రికార్డు సృష్టించింది.

ఫిన్ ఆలెన్ సెంచరీ సునామీ
ఛేజింగ్‌లో 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు దక్షిణాఫ్రికా బౌలర్లను చీల్చిచెండాడారు. ఫిన్ ఆలెన్ కేవలం 33 బంతుల్లోనే 100 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 303 స్ట్రైక్ రేట్‌తో ఆలెన్ ఆడిన తీరు సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది.

టిమ్ సీఫెర్ట్ కూడా ఆలెన్‌కు సహకరిస్తూ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి ధాటికి దక్షిణాఫ్రికా బౌలింగ్ లైనప్ పూర్తిగా విఫలమైంది. రబాడ ఒక్క వికెట్ తీయగా, మిగిలిన వారందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఒక దశలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మార్కో జాన్సెన్ 30 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

ట్రిస్టన్ స్టబ్స్ కూడా 29 పరుగులతో జాన్సెన్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 73 పరుగులు జోడించడంతో సఫారీలు 169 పరుగులు చేయగలిగారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మెక్‌కాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బతీశారు.

దక్షిణాఫ్రికా ఓటమికి ప్రధాన కారణాలు..
ఈడెన్ గార్డెన్స్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలించడం కివీస్‌కు కలిసి వచ్చింది. అలాగే 170 పరుగుల స్కోరును కాపాడుకోవడంలో సఫారీ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫిన్ ఆలెన్ దాడిని అడ్డుకోవడంలో ఎటువంటి వ్యూహాలు పలించలేదు. 

మరోవైపు కీలక మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. లీగ్ దశలో అదరగొట్టిన సౌతాఫ్రికా, సెమీఫైనల్ ఒత్తిడిని తట్టుకోలేక మరోసారి నిష్క్రమించింది. ఇక రేపు జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనుంది.

Also Read: Liquor Digital Payments In AP: మందుబాబులకు గుడ్‌న్యూస్..ఇకపై వైన్ షాపుల్లో అవి తప్పనిసరి..చిల్లర గాళ్ల ముప్పు తప్పినట్టే!

Also Read: DA Arrears GO AP: ఉద్యోగులకు భారీ ఊరట..త్వరలోనే అకౌంట్లోకి డీఏ పెండింగ్ బిల్లులు..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 04, 2026 14:43:01
Hyderabad, Telangana:

BRS Party Committees: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. 2023 ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గులాబీ పార్టీ గెలుచుకోలేక పోయింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సైతం బీఆర్ఎస్ సాహసం చేయలేదు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ చేతిలో కారు పార్టీ అడ్రస్ గల్లంతు అయ్యింది. ఇక డిసెంబర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అనుకున్న దాని కంటే ఎక్కువగానే గెలుచుకోగలిగింది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చాయి. 30 స్థానాలకు పైగా గెలుచుకుంటామని భావించిన సాధ్యం కాలేదు.  అయితే ఓటమికి గల కారణాలను విశ్లేషించడంలో మాత్రం గులాబీ పార్టీ హైకమాండ్ మరిచిపోయిందన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కారు పార్టీ పెద్దలు దృష్టి పెట్టక పోవడంపై నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో కమిటీలు వేస్తామని, మెంబర్‌షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పిన ఇంకా దానిపై పార్టీ దృష్టి పెట్టడం లేదని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు.

Also Read: Adulterated Ghee: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌.. బంజారాహిల్స్‌లో 460 కిలోల కల్తీ నెయ్యి సీజ్‌

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండేళ్లు అవుతోంది. ఒకవైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. తాజాగా వికారాబాద్ లో డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతులను సైతం హస్తం పార్టీ నిర్వహించింది. ఈ శిక్షణ తరగతులకు పీసీసీ చీఫ్ తో పాటు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. రాహుల్  గాంధీ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులకు పార్టీ సంస్టగత నిర్మాణంపై దిశ నిర్దేశం చేశారు. కానీ రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ మాత్రం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టలేదనీ సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి గులాబీ పార్టీకి రాష్ట్ర కమిటీ కూడా లేకపోవడం ఆ పార్టీ నాయకత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని చర్చించుకుంటున్నారు. ఇక గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు కొత్తవి వేస్తే యువత కూడా యాక్టివ్ గా పని చేస్తుందని చర్చించుకుంటున్నారు. అలాగే పార్టీ అనుబంధ సంఘాలు ఉన్నాయో లేవో కూడా అర్థం కాని పరిస్థితులు ప్రతిపక్ష బిఆర్ఎస్ లో ఉన్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించింది. తర్వాత అధికారంలోకి వచ్చాక ఎన్నడూ సంస్థాగత నిర్మాణంపై కానీ.. శిక్షణ తరగతుల గురించి కానీ ఆలోచన చేయలేదు అని పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో  బిఆర్ఎస్ నాయకత్వం ఆలోచన చేయడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.

Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి

మరొకవైపు పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు.. సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని గత ఏడాది ప్రారంభంలో బిఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రకటించారు. గత ఏప్రిల్ 27న బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించింది. మళ్లీ బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం దగ్గరికి వస్తున్నప్పటికీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయట. అన్ని జిల్లాల్లో శిక్షణా తరగతులు కూడానిర్వహిస్తామని కేటీఆర్ గతంలోనే చెప్పారు. కానీ ఆచరణకి మాత్రం నోచుకోలేదు. మరొకవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘాలు బలంగా పనిచేశాయి. విద్యార్థి, యువజన విభాగంతోపాటు మహిళా విభాగం చాలా కీలకంగా ఉద్యమంలో పనిచేశాయి. అయితే 2017లో ఏర్పాటు చేసిన కమిటీలు, అనుబంధ సంఘాలే ఇప్పటికి కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మహిళా అధ్యక్షులుగా ఉన్న గుండు సుధారాణి పార్టీని వీడినప్పటికీ ఇప్పటికీ ఆమె పోస్ట్ ను భర్తీ చేయలేదు. ఇక బీఆర్ఎస్ యువ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కొనసాగుతున్నారు. బీఆర్ఎస్వీ నేతగా గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. విద్యార్థి, యూత్, మహిళా విభాగాలతో పాటు.. రైతు, కార్మిక, ఎస్సీ, ఎస్టీ విభాగాలకు భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు బిఆర్ఎస్ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి.

Also Read: YS Jagan: మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేయిస్తావా? చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

మండల, రాష్ట్రస్థాయి పదవుల భర్తీ ఇప్పట్లో లేనట్టేనా?
ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా పని చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీలో కమిటీలను వేసి పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారట. ముఖ్యంగా చాలా కాలంగా తమకు పార్టీ పదవులు వస్తాయని ఆశతో ఉన్న నేతలు.. చురుగ్గా పని చేయడానికి సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ తమకు తగిన గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదనలో మెజార్టీ నేతలు క్యాడర్ ఉన్నారని నేతలు  చర్చించు కుంటున్నారు. పార్టీ సంస్థ గత నిర్మాణంపై దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నారు.. కమిటీలు శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా పార్టీలో ఉండే యువత నాయకులు యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొంటారని చర్చించుకుంటున్నారు. అయితే అధికారం కోల్పోయ రెండు సంవత్సరాలు అవుతున్న ఇంకా తాత్సారం చేయడంపైన క్యాడర్ లో అసంతృప్తి నెలకొంది. ఈ ఫిబ్రవరి నెలలోనే కమిటీలో ఉంటాయని భావించిన నేతలకు నిరాశే మిగిలింది. మొత్తంమీద గులాబీ బాస్ కేసీఆర్ మనసులో ఏముందో అంతుచిక్కడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 04, 2026 13:41:03
Velgapudi, Andhra Pradesh:

No Confidence Motion Against Moshenu Raju: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్‌పై కూటమి సర్కార్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ పదవి నుంచి తప్పించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నట్టు సమచారం. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే ఆయనపై అవిశ్వాసం పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయినప్పటికీ మండలిలో మాత్రం వైసీపీ హవానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆవిశ్వాసం దిశంగా ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీలో అనేక అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఇటీవల తిరుమల లడ్డూ వ్యవహారం, ఇతర అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీపై పైచేయి సాధించింది. కానీ మండలిలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దమైన వాతావరణం కనిపిస్తోంది. ఇందుకు కారణం మండలిలో వైసీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉండటమే. అంతేకాదు ప్రస్తుతం మండలి చైర్మన్ కూడా వైసీపీ నేత కావడంతో కూటమి నేతల పప్పులు ఉడకడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు కొన్ని రకాల బిల్లులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వైసీపీతో పాటు శాసనమండలి పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీల విషయంలో చైర్మన్ మోషేన్ రాజు అడ్డంకిగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను పదవి నుంచి దించాలని కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చినట్లు కనిపిస్తోంది.

Also Read: YS Jagan: మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేయిస్తావా? చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

మొన్నటి ఎన్నికల వరకు శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల బలం 38 మంది. అయితే క్రమేపీ వారి సంఖ్య తగ్గుతోంది. ఓ ఆరుగురు ఎమ్మెల్సీలకు రాజీనామా చేశారు. మరికొందరు అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మండలిలో కూటమి బలం పెరుగుతూ వస్తోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉండనే ఉన్నారు. అటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా మంత్రులు ఉన్నారు. అందుకే మండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూటమి ప్రభుత్వం డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. 18 నెలలుగా చైర్మన్ మండలిలో కొనసాగుతున్న తీరును కూటమి ప్రభుత్వం తప్పుపడుతోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదని అనిపిస్తోంది. అయితే ఇంకా రెండేళ్లు పదవి ఉండగానే ఆయన్ను తప్పించేందుకు అవిశ్వాసం అస్త్రాన్ని బయటకు తీసినట్టు తెలుస్తోంది.

ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2022లో మోషేన్ రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి మండలిలో గట్టి పట్టు ఉండేది. ఎప్పుడైతే మండలిలో వైసీపీ బలం పెరిగిందో అప్పుడే మోషన్ రాజుకు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. మోషేన్ రాజుకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉంది. అప్పటివరకు చైర్మన్‌గా ఆయనను కూర్చోబెడితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీకి కొందరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అయినప్పటికీ వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. పైగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైసీపీకి సభలో ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే అవిశ్వాసం పెట్టి మోషేన్ రాజును గద్దెదించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలనే ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 04, 2026 13:09:15
Hyderabad, Telangana:

Adulterated Ghee Seize: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌. ప్రతిదీ కల్తీ చేస్తున్న కేటుగాళ్లు తాజాగా నెయ్యిని పెద్ద ఎత్తున కల్తీ చేస్తున్న ఉదంతం బయటపడింది. రంజాన్‌ మాసంతోపాటు పండుగ సీజన్‌ కావడంతో నాసిరకం పదార్థాలతో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లాభాలకు ఆశపడి ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా యథేచ్చగా కల్తీ నెయ్యి తయారుచేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. 460 కిలోల కల్తీ నెయ్యితోపాటు కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను సీజ్‌ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి

కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీమ్, మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో కల్తీ నెయి ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్ పరిధిలోని రోడ్ నంబర్ 12, భోలానగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైడ్ డెయిరీలో కల్తీ నెయ్యి తయారుచేస్తుండగా ఆ కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ దాడిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి భారీ మొత్తంలో కల్తీ నెయ్యి, తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: YS Jagan: మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేయిస్తావా? చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

మొహమ్మద్ జునైద్ హుస్సేన్ (26), తన తండ్రి మొహమ్మద్ మౌజం హుస్సేన్ బంజారాహిల్స్‌లోని భోలానగర్‌ ప్రైడ్‌ డెయిరీ నిర్వహిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నాసిరకం వస్తువులతో కల్తీ నెయ్యి తయారుచేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు డెయిరీపై దాడి జరిపి పరిశీలించారు. ఈ దాడిలో సుమారు రూ.18,26,679 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా 460 కేజీల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యితో పాటు భారీ స్థాయిలో కల్తీకి ఉపయోగించే 2,090 కేజీల ఆవు మీగడ, 1,170 కేజీల గేదె మీగడ ఉన్నాయి.

Also Read: Bandi Sanjay: రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతదేశానికి గ్రహణం: బండి సంజయ్‌

స్వాధీనం చేసుకున్న వస్తువులు
నెయ్యి కల్తీ కోసం ఉపయోగిస్తున్న 28 డబ్బాల (15 కేజీలు) రుచి గోల్డ్ డాల్డా, ఇతర ఖాళీ డబ్బాలు, ఆయిల్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తయారీకి వినియోగిస్తున్న 2 బాయిలర్లు, ఒక పుషింగ్ మిషన్, ఒక ప్యాకింగ్ మిషన్, రెండు వెయిటింగ్ మిషన్లు, 4 గ్యాస్ సిలిండర్లు, నెయ్యి నిల్వ ఉంచిన సుమారు 70 రకాల చిన్న, పెద్ద బేసన్లు, ఖాళీ డ్రమ్ములు, ప్యాకింగ్ కవర్లను పోలీసులు సీజ్ చేశారు.

నిందితుడు మొహమ్మద్ జునైద్ హుస్సేన్ తన ప్రైడ్ డెయిరీ యూనిట్‌లో లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు.  తక్కువ నాణ్యత కలిగిన పామాయిల్, వనస్పతి (డాల్డా), ఇతర హానికరమైన పదార్థాలను ఆవు, గేదె మీగడలో కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. కల్తీ నెయ్యిని అసలైన నెయ్యిగా నమ్మిస్తూ హోటళ్లకు, శుభకార్యాలకు, వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ప్రైడ్‌ డెయిరీపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో హైదరాబాద్ సిటీ అడిషనల్ డిసిపి (టాస్క్ ఫోర్స్) అందె శ్రీనివాసరావు, సీఐలువెంకటేష్, ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు విజయానంద్, చందన ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top