Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380005
SA vs AFG Match: అహ్మదాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ..సౌతాఫ్రికా Vs అఫ్ఘానిస్థాన్ డబుల్ సూపర్ ఓవర్..ఎవరు...
HDHarish Darla
Feb 11, 2026 10:21:58
Ahmedabad, Gujarat

South Africa Vs Afghanistan Match: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 ప్రపంచకప్ 2026లో ఒక అద్భుతమైన పోరాటం ఆవిష్కృతమైంది. గ్రూప్ దశలో భాగంగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే 'డబుల్ సూపర్ ఓవర్' థ్రిల్లర్‌గా మారింది. ఉత్కంఠకు పరాకాష్ఠగా నిలిచిన ఈ పోరులో చివరకు దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సరిగ్గా 187 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది.

మొదటి సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 17 పరుగులు రాబట్టింది. లక్ష్య ఛేదనలో సఫారీలు కూడా సరిగ్గా 17 పరుగులే చేయడంతో తొలి సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు దారితీసింది.

రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా రెచ్చిపోయి ఆడింది. సఫారీ బ్యాటర్లు వీరవిహారం చేసి 23 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లక్ష్య ఛేదనలో తడబడింది. మొదటి రెండు బంతుల్లో పరుగులు రాలేదు సదాకా, నబీ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో రహ్మానుల్లా గుర్బాజ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

కేశవ్ మహారాజ్ వేసిన చివరి బంతికి ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 5 పరుగులు కావాలి. కానీ, భారీ షాట్‌కు ప్రయత్నించిన గుర్బాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా విజయం ఖాయమైంది.

గెలిపించేంత వరకు వచ్చి చివరి బంతికి ఓడిపోవడంతో ఆఫ్ఘన్ ఓపెనర్ గుర్బాజ్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత పోరాటం చేసినప్పటికీ, విజయం మాత్రం దక్షిణాఫ్రికాను వరించింది.

ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్థాయి ఏంటో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. దక్షిణాఫ్రికా ఒత్తిడిని అధిగమించి విజేతగా నిలవగా, క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఇది ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది.

Also Read: Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!

Also Read: Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Feb 11, 2026 12:05:30
Hyderabad, Telangana:

White King Cobra Video Watch: ప్రకృతి ఒడిలో ఎన్నో వింత జీవులు జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల జీవులు అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఇటీవల ఓ అందమైన నదిలో కనిపించిన అరుదైన పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పాములు మనం నలుపు గోధుమ రంగుల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఆ పాము తెలుపు రంగులో నదిలో పాకుతూ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారుల ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇక వీడియో వివరాల్లోకి వెళ్తే.. ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా ప్రవహిస్తున్న ఒక నది కనిపిస్తుంది.. అందులో నీరు ఎంతో నిర్మలంగా.. నది అడుగులో ఆకుపచ్చని రంగులో మెరుస్తూ ఉండడం మీరు చూడొచ్చు. కొందరు పర్యాటకులు నీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేస్తున్నారు. ఇంతలోనే నీటిలో నుంచి అనుకోకుండా ఒక భారీ పాము ప్రవేశించింది. ఆ పాము తెలుగులోని రంగులో ఉండడం మీరు గమనించవచ్చు. అయితే, అది చాలా పొడవుగా చూడడానికి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది..

ఈ పాము అక్కడ ఈదుతున్న పర్యాటకుల వైపుగా రావడం మీరు గమనించవచ్చు. ఆ పాము రావడం గమనించిన పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు ఆ పామును చూసి నీటిలో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. మరికొందరు ఒడ్డు పైనే ఉండి.. ఆ పామును మొబైల్‌లో చిత్రీకరిస్తున్నారు. అయితే, ఆ పాము మాత్రం ఎంతో వేగంగా పర్యాటకుల వైపు గానే దూసుకు రావడం మీరు గమనించవచ్చు. ఈ పాము ఎవరికీ హాని చెయ్యకుండా ఈదుతూ నెమ్మదిగా ముందుకు వస్తోంది. 

అయితే, అక్కడే ఉన్న కొంతమంది ఆ పాముకు భయపడి ఒడ్డు పైకి చేరుకున్నారు. ఆ పాము వారికి అతి సమీపంలోకి రావడం వల్ల ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ పాము నదిలోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. పర్యాటకుల ఆనందానికి మాత్రం అంతరాయం కలిగించింది. ప్రకృతిలో మనతోపాటు ఇలాంటి ఎన్నో జీవులు నివసిస్తూ ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు అనుకోకుండా దర్శనమిస్తాయి.. ఇలాంటి సందర్భాలను చిత్రీకరించి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 11:55:35
Hyderabad, Telangana:

Preconception Care Importance: మహిళలు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం అనేది గర్భం దాల్చిన తర్వాత మొదలయ్యే ప్రక్రియ కాదు. అది గర్భధారణకు ముందే ప్రారంభం కావాలి. తల్లి కావాలనుకునే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను ఫెర్నాండెజ్ హాస్పిటల్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీలేఖ A.R అందించిన కొన్ని సలహాలు, సూచనలు  తెలుసుకుందాం.

చాలామంది మహిళలు గర్భం దాల్చిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ, గర్భం దాల్చడానికి ముందే చేసే పరీక్షలు, పోషకాహార మార్పులు పుట్టబోయే బిడ్డలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నిరోధించగలవు.

ముందస్తు స్క్రీనింగ్ ఎందుకు అవసరం?
సాధారణ రక్త పరీక్షల ద్వారా శరీరంలోని కొన్ని నిశ్శబ్ద సమస్యలను గుర్తించవచ్చు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే (రక్తహీనత) అలసట రావడమే కాకుండా, అకాల ప్రసవం, శిశువు తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది.

చికిత్స చేయని థైరాయిడ్ వల్ల గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భస్రావం, శిశువు మెదడు అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుంటే గర్భం దాల్చిన తొలి వారాల్లోనే శిశువు అవయవాల అభివృద్ధిలో లోపాలు తలెత్తవచ్చు.

జీవనశైలి, బరువు నిర్వహణ
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల గర్భం దాల్చడం ఆలస్యం కావచ్చు. బరువు తక్కువగా ఉన్నా లేదా అధిక బరువు ఉన్నా అండోత్సర్గము లో సమస్యలు వస్తాయి. అధిక బరువు గర్భధారణ సమయంలో మధుమేహం, బిపి ప్రమాదాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని అధిగమించవచ్చు.

పోషకాహారం, సప్లిమెంట్లు
గర్భధారణ ప్రణాళికలో ఉన్న మహిళలు కింది పోషకాలపై దృష్టి పెట్టాలి.

ఫోలిక్ యాసిడ్: శిశువు మెదడు, వెన్నెముక లోపాలను నివారించడానికి ప్రతిరోజూ కనీసం 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి.

ఐరన్, విటమిన్ సి: రక్తహీనతను తగ్గించడానికి ఆకుకూరలు, బెల్లం, ఖర్జూరాలు, గుడ్లు తీసుకోవాలి. ఐరన్ గ్రహించడానికి విటమిన్ సి (నిమ్మ, నారింజ) తోడవ్వాలి.

విటమిన్ డి: సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి ఎండలో గడపడం లేదా వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం.

ఇవే కాకుండా వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతలైన తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి వంటి వాటిని గుర్తించడానికి ముందే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల అవసరమైనప్పుడు జన్యు కౌన్సెలింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చివరిగా.. ఫిబ్రవరి నెలలో పాటించే పునరుత్పత్తి ఆరోగ్య మాసం (Reproductive Health Month) సందర్భంగా, మహిళలందరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి. ఆరోగ్యకరమైన తల్లి ద్వారానే ఆరోగ్యకరమైన కుటుంబం సాధ్యమవుతుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయాన్ని అనుసరించి రాసినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని వ్యక్తిగతంగా కలవడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Usman Tariq Controversy: పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్..ధోనికి పి*చ్చ ఫ్యాన్..స్పిన్నర్ బయోగ్రఫీ ఇదే!

Also Read: Silver Price Prediction: వెండి ధరకు రెక్కలు..కిలో రూ.5 లక్షలకు చేరువలో? ఇన్వెస్టర్లు అప్రమత్తం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 11, 2026 11:52:40
Sangareddy, Telangana:

Police Attack On BJP Leaders: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అధికార పక్షం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను అని కూడా చూడకుండా రెచ్చిపోయి పోలీసులపై దాడులకు తెగబడ్డారు. పోలీసులకు వార్నింగ్‌ ఇస్తూ పోలింగ్‌ బూతుల్లో యథేచ్చగా ప్రలోభాలకు గురిచేస్తూ.. డబ్బులు పంచుతూ కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేశారు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ నాయకులపై కాంగ్రెస్‌ గూండాలు, పోలీసులు కూడా దాడులకు పాల్పడ్డారు. 

Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!

సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. పోలీసులతో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డిలో 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. కాంగ్రెస్‌ అభ్యర్థిని సీఐ దూషించారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలింగ్‌ బూత్‌లోకి చొచ్చుకెళ్లి పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇందిరా కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అడ్డుకోవడంతో జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ జగ్గారెడ్డి రెచ్చిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతోనే అడ్డుకున్నామని పోలీసులు చెప్పగా అయినా కూడా జగ్గారెడ్డి వినిపించుకోలేదు. దీంతో అదనపు ఎస్పీ రఘునందన్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతున్నారు.

Also Read: Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం

బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడి
కరీంనగర్‌లో పోలీసులు రెచ్చిపోయారు. కరీంనగర్‌ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. విచక్షణరహితంగా దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆరుగురు బీజేపీ కార్యకర్తల చేతులు విరిగాయి. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. తాము చెబుతుంటే పోలీసులు తమపై లాఠీఛార్జి చేయడం ఏమిటని మండిపడ్డారు.

Also Read: AP Budget Session: విధ్వంసం నుంచి అభివృద్ధి- సంక్షేమంపై పరుగులు: ఏపీ గవర్నర్

మెట్‌పల్లిలో ఉద్రిక్తత
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపల్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద వివాదం రాజుకుంది. పోలింగ్ కేంద్రం ముందు పలువురు అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య మాటల యుద్ధం ప్రారంభమై అది కాస్త ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఇరు వర్గాల మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ గొడవ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

పోలింగ్ కేంద్రం సమీపంలో జరిగిన వివాదానికి గొడవ విషయం తెలుసుకున్న ఎస్పీ అశోక్ కుమార్ హుటాహుటిన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అప్పటికే ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఎవరూ గుంపులుగా ఉండనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. 'జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరిగినా వెంటనే స్పందించి అదుపులోకి తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరూ గుంపులుగా ఉండనివ్వము. ప్రజలు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి' అని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 11:46:51
Hyderabad, Telangana:

Usman Tariq Bowling Action Legal Or Illegal: పాకిస్థాన్ క్రికెట్ మరో మిస్టరీ స్పిన్నర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. టీ20 ప్రపంచకప్ 2026లో తన విభిన్నమైన బౌలింగ్ శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ఆటగాడే ఉస్మాన్ తారిక్. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత, ఇప్పుడు భారత బ్యాటింగ్ లైనప్‌ను సైతం ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఉన్న 'ఎక్స్-ఫాక్టర్' (X-Factor)గా అతను మారాడని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అయితే ఉస్మాన్ తారిక్ ఎదుగుదల వెనుక అంతులేని పట్టుదల, కఠినమైన గతం దాగి ఉందట. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఉస్మాన్, కుటుంబాన్ని పోషించడానికి అనేక రకాల ఉద్యోగాలు చేశాడు. ఆ కష్టాలే ఈరోజు అతనికి మైదానంలో ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇచ్చాయి. 

ఎం.ఎస్. ధోనీ జీవిత చరిత్ర చూసిన తర్వాత, ఉస్మాన్ విదేశాల్లో స్థిరమైన జీవితాన్ని వదులుకుని ప్రొఫెషనల్ క్రికెట్‌ను ఎంచుకున్నాడు. భద్రత కంటే ఆశయం మిన్న అని నిరూపించాడు. సాంప్రదాయక పద్ధతుల్లో కాకుండా, ఇతని బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలెక్టర్ల కంట్లో పడ్డాడు.

'త్రో బౌలింగ్' వివాదం
ఉస్మాన్ బౌలింగ్ చేసేటప్పుడు క్రీజు దగ్గర ఒక్క క్షణం ఆగి, వింతైన స్లింగ్ మోషన్‌తో బంతిని వదులుతాడు. ఈ అసాధారణ యాక్షన్ చూసి చాలామంది ఇది 'త్రో బౌలింగ్' (అక్రమ బౌలింగ్) అని విమర్శించారు.

అయితే, ఐసీసీ (ICC) నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షల్లో ఉస్మాన్ ఉత్తీర్ణత సాధించాడు. మోచేయి వంపు నిబంధనల లోపే ఉందని నిర్ధారణ కావడంతో అతను చట్టబద్ధంగా బౌలింగ్ చేయడానికి అనుమతి పొందాడు.

టీమ్ ఇండియాకు ఇతను ప్రమాదకరమా?
భారత్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌ను తారిక్ ఎలా ఇబ్బంది పెట్టగలడో ఈ అంశాలు వివరిస్తాయి. ఇతని బౌలింగ్‌లో ఎకానమీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పరుగులు అవసరమైన మిడిల్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయగలడు.

బంతి రిలీజ్ అయ్యే పాయింట్ సాధారణ బౌలర్ల కంటే భిన్నంగా ఉండటంతో, బ్యాటర్లకు బంతి దిశను అంచనా వేయడానికి సమయం పడుతుంది. తన తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండగలనని నిరూపించుకున్నాడు.

పాకిస్థాన్ జట్టు అతన్ని ఒక 'వైల్డ్ కార్డ్' లాగా వాడుకుంటోంది. కొత్త స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే జట్లకు తారిక్ ఒక పెద్ద సవాలుగా మారనున్నాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇతను పాకిస్థాన్ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది.

వివాదం నుండి ప్రభావం వైపు ఉస్మాన్ తారిక్ ప్రయాణం సాగుతోంది. తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, 2026 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ప్రధాన బలమైన వ్యూహాత్మక ఆస్తిగా అతను నిలుస్తున్నాడు.

Also Read: SA vs AFG Match: అహ్మదాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ..సౌతాఫ్రికా Vs అఫ్ఘానిస్థాన్ డబుల్ సూపర్ ఓవర్..ఎవరు గెలిచారంటే?

Also Read; Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 11, 2026 11:46:48
Hyderabad, Telangana:

Boat Airdopes 161 Price Cut Flipkart: ఎప్పటినుంచో అత్యంత తగ్గింపు ధరకే మంచి ఇయర్ బడ్స్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ వీటిపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ముఖ్యంగా బోట్ కంపెనీకి సంబంధించిన ఇయర్ బడ్స్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇప్పుడు ఈ బ్రాండ్‌కు సంబంధించిన ఇయర్ బడ్స్‌ సగం ధరికే లభిస్తున్నాయి. అయితే, ఎలా కొనుగోలు చేస్తే.. ఇంత తగ్గింపు ధరకు పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

boAt Airdopes 161 (Advanced/4Mic ENx) మోడల్‌ ఇయర్ బడ్స్‌ చాలా తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇవి అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో 4-Mic ENx Technology అందుబాటులో ఉంది. దీనివల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వారికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే ఇందులో కంపెనీ 50 హవర్స్‌ప్లే టైమ్ అందిస్తోంది. 50 గంటల వరకు నాన్ స్టాప్‌గా ఒకే ఛార్జ్‌తో ప్లే బ్యాక్ పొందవచ్చు. ఇందులో కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. కేవలం పది నిమిషాలు చార్జ్ చేస్తే చాలు ఏకంగా మూడు గంటల వరకు పాటలు వినడమే కాకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే C టైప్ పోర్ట్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. 

ఇందులో కంపెనీ సౌండ్ క్వాలిటీ 10mm డ్రైవర్లను కూడా అందిస్తోంది. దీనివల్ల బోట్ సిగ్నేచర్ సౌండ్‌తో మంచి బేస్‌ను కొంత వచ్చు. అలాగే బ్లూటూత్ వెర్షన్ v5.3 కనెక్టివిటీతో లభిస్తోంది. ఈ టెక్నాలజీతో కేస్ ఓపెన్ చేయగానే ఫోన్‌ను వెంటనే ఇది కనెక్ట్ అవుతుంది. ఇక ఈ ఇయర్ బడ్స్‌ ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్కెట్‌లోకి MRP రూ.2,999తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఇది 73 శాతం తగ్గింపుతో కేవలం రూ.799కే పొందవచ్చు. అదేవిధంగా మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును కూడా వినియోగించవచ్చు. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.45 తగ్గింపు లభిస్తుంది. అదేవిధంగా యూపీఐ పేమెంట్ చేసే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేసిన.. ఇంతే మొత్తంలో తగ్గింపు లభిస్తుంది. కాబట్టి భారీ తగ్గింపుతో పొందడానికి క్రెడిట్ కార్డుతో పేమెంట్ వినియోగించవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 11:03:37
Hyderabad, Telangana:

Gas Cylinder Saving Tips At Home: గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్న తరుణంలో, గృహిణులందరికీ గ్యాస్ ఆదా చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. వంటగదిలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల గ్యాస్ త్వరగా అయిపోతుంటుంది. అయితే, కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు. సరైన పద్ధతిలో వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవ్వడమే కాకుండా, వంట కూడా వేగంగా పూర్తవుతుంది.

మూత పెట్టి వండటం మర్చిపోవద్దు
ఏదైనా పదార్థాన్ని ఉడికించేటప్పుడు పాత్రపై మూత పెట్టడం చాలా ముఖ్యం. దీనివల్ల లోపల వేడి, ఆవిరి బయటకు పోకుండా ఉండి ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఈ చిన్న అలవాటు గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

పాత్ర పరిమాణం ముఖ్యం
వండే ఆహార పదార్థం ఎంత ఉందో దానికి సరిపడా పాత్రనే ఎంచుకోండి. కొద్దిపాటి వంట కోసం పెద్ద పాత్రలు వాడటం వల్ల అవి వేడెక్కడానికి ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. అలాగే, వెడల్పాటి పాత్రలు వాడితే మంట పాత్ర అడుగు భాగానికి సరిగ్గా తగిలి వంట త్వరగా అవుతుంది.

ప్రెజర్ కుక్కర్ బెటర్
పప్పులు, మాంసం లేదా బియ్యం వండేటప్పుడు సాధారణ పాత్రల కంటే ప్రెజర్ కుక్కర్ వాడటం ఉత్తమం. ఇది తక్కువ సమయంలో ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసి వంటను వేగంగా పూర్తి చేస్తుంది. దీనివల్ల సుమారు 30% నుండి 50% వరకు గ్యాస్ ఆదా అవుతుంది.

చాలామంది గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం లేదా మసాలాలు వెతకడం చేస్తుంటారు. దీనివల్ల గ్యాస్ వృధా అవుతుంది. స్టవ్ వెలిగించే ముందే కూరగాయల కోయడం, నీళ్లు సిద్ధం చేసుకోవడం వంటి పనులు పూర్తి చేయండి.

లీకేజీలు, బర్నర్ల తనిఖీ
రెగ్యులేటర్ లేదా పైపుల వద్ద గ్యాస్ లీక్ అవుతుందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. మీ స్టవ్ మంట నీలి రంగులో కాకుండా పసుపు రంగులో వస్తుంటే, బర్నర్లలో దుమ్ము లేదా అడ్డుపడటం జరిగిందని అర్థం. ఇది గ్యాస్‌ను ఎక్కువ ఖర్చు చేస్తుంది. వెంటనే బర్నర్లను క్లీన్ చేయండి.

పాలు లేదా కూరగాయలు ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే స్టవ్ మీద పెట్టకండి. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు వేచి ఉండి, ఆ తర్వాతే వేడి చేయండి. చల్లగా ఉన్న పదార్థాలను వేడి చేయడానికి గ్యాస్ ఎక్కువ సేపు మండాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న చిట్కాలు పాటించడం ద్వారా ఒక సిలిండర్ వచ్చే కాలపరిమితిని మీరు కనీసం 10 నుండి 15 రోజులు పెంచుకోవచ్చు. దీనివల్ల మీ ఇంటి బడ్జెట్ అదుపులో ఉంటుంది.

Also Read: SA vs AFG Match: అహ్మదాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ..సౌతాఫ్రికా Vs అఫ్ఘానిస్థాన్ డబుల్ సూపర్ ఓవర్..ఎవరు గెలిచారంటే?

Also Read: Ambati Rambabu Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు..కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన గుంటూరు కోర్టు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 11, 2026 10:34:57
Amaravati, Andhra Pradesh:

Governor Abdul Nazeer Speech: 'గత 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోంది. సూపర్‌ సిక్స్‌ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి కార్యకలాపాలను పునఃప్రారంభించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాం' అని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. 'విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యాలలో కీలక సవరణలు చేశాం. 7 శ్వేతపత్రాల విడుదల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి పది సూత్రాలు రూపొందించాం' అని వెల్లడించారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై బిగ్‌ ట్విస్ట్‌.. ప్రభుత్వానికి బహిరంగ లేఖ

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమే మా లక్ష్యం అని ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్‌ ఒక స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించిందని చెప్పారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. '2019 తర్వాత వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు తలెత్తాయి. రాష్ట్ర అభివృద్ధి స్తంభించింది. ఆర్థిక ఒత్తిడి తీవ్రమైంది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి' అని ప్రసంగంలో వివరించారు.

Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!

'మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, సాగు నీటి పారుదల రంగాలు తీవ్ర తిరోగమనం చవిచూశాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు' అని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని.. శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని చెప్పారు. అమరావతిలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని.. ప్రపంచంలోనే రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు.

Also Read: Srisailam: శ్రీశైలం కొండపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. భక్తులు, శివస్వాముల ఆందోళన

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులతో అద్భుతమైన ప్రజారవాణా అందుబాటులోకి తెస్తామని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ వివరించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్‌ వివరించారు. 'వివిధ సందర్భాల్లో గత ప్రభుత్వ విధ్వంస విధానాలను ప్రస్తావిస్తూ కొనసాగిన గవర్నర్ ప్రసంగం. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావనను వివిధ సందర్భాల్లో తన ప్రసంగంలో గుర్తు చేశారు. 'అమరావతికి రాజధానిగా చట్టబద్దత ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. మూడు ప్రాంతాల్లోనూ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం' అని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. నల్లమల సాగర్, నదుల అనుసంధానం వంటి అంశాలపై గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

గవర్నర్‌ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ చేసిన ప్రసంగంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం 22ఏ పేరుతో వివాదాలు సృష్టించిందని పరోక్షంగా ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. గవర్నర్ ప్రంసంగం ప్రారంభించిన మూడో నిమిషం నుంచే సభలు నినాదాలు చేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా వినకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌ కూడా హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాసేపటికే సభ నుంచి జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 09:54:39
Nunna, Vijayawada, Andhra Pradesh:

Ambati Rambabu Bail Granted: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. పోలీస్ అధికారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో గుంటూరు కోర్టు ఆయనకు షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత కొద్ది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబు విడుదల మార్గం సుగమమైంది.

ఏం జరిగిందంటే?
గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గుంటూరులో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో విధుల్లో ఉన్న సీఐ (CI)ని అడ్డుకున్నారని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో, పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
అంబటి రాంబాబు తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంబటిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబు, బెయిల్ ఉత్తర్వులకు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు అందిన తర్వాత రేపు విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ శ్రేణులు అంబటి రాంబాబు బెయిల్ వార్తపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు.

Also Read: Silver Price Prediction: వెండి ధరకు రెక్కలు..కిలో రూ.5 లక్షలకు చేరువలో? ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Also Read: EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 08:37:37
Hyderabad, Telangana:

Silver Price Prediction 2026: ఇన్వెస్టర్లకు, సామాన్యులకు షాకిచ్చే వార్త ఒకటి బులియన్ మార్కెట్‌లో చక్కర్లు కొడుతోంది. రాబోయే రోజుల్లో వెండి ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని, కేవలం ఏడాది కాలంలోనే కిలో వెండి ఏకంగా రూ.5 లక్షల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇది కేవలం 'తుఫాను ముందు ప్రశాంతత' మాత్రమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల అంచనా (GJC విశ్లేషణ)
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) చైర్మన్ రాజేష్ రోక్డే వెల్లడించిన వివరాల ప్రకారం... 2026 చివరి నాటికి కిలో వెండి ధర రూ.5,00,000 కు చేరే అవకాశం ఉంది.

అదేవిధంగా 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,00,000 మార్కును తాకవచ్చు. ఒకవేళ ప్రభుత్వం జీఎస్టీ (GST), దిగుమతి సుంకాలను తగ్గిస్తేనే సామాన్యులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.  అంతర్జాతీయంగా వెండి స్పాట్ ధర ఔన్సుకు $82.43 కి పెరిగింది. అమెరికా ట్రెజరీ బాండ్ల దిగుబడి తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.

నేడు భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
కిలో వెండి సుమారు రూ.2,90,000 నుండి రూ.3,00,000 మధ్య ట్రేడ్ అవుతోంది. గత నెల రోజుల్లో వెండి ధర ఏకంగా ఒక లక్ష రూపాయల వరకు దిగి వచ్చినప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే ఇది పెరిగే దిశగానే కనిపిస్తోంది.

ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో కేవలం నగదును దాచుకోవడం కంటే, విలువైన లోహాలైన బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు నెమ్మదిగా వెండిని సేకరించడం ఇన్వెస్టర్లకు లాభదాయకంగా ఉండవచ్చు. అయితే, మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా సేకరించిన సమాచారం మాత్రేమే. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

ALso Read: EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!

Also Read: Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 08:05:27
Hyderabad, Telangana:

EPFO Wage Ceiling Hike 2026: కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ESIC వేతన పరిమితులను భారీగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరుగుతున్న ఈ కసరత్తు, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2014 తర్వాత పీఎఫ్ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు రాలేదు. పెరిగిన ద్రవ్యోల్బణం, జీతాల రీత్యా ఈ పరిమితిని పెంచడం ఇప్పుడు అత్యవసరంగా మారింది.

ప్రస్తుత వేతన పరిమితి vs ప్రతిపాదిత మార్పు
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వేతన సీలింగ్ ఈ విధంగా ఉంది. ప్రస్తుత పరిమితి నెలకు రూ.15,000. దీనిని రూ.25,000కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత పరిమితి నెలకు రూ.21,000. దీనిని కూడా సమాంతరంగా పెంచే అవకాశం ఉంది.

చివరిసారిగా 2014లో రూ.6,500 నుండి రూ.15,000కి పీఎఫ్ పరిమితిని పెంచారు. దశాబ్ద కాలంగా ఇది మారకపోవడంతో, కొంచెం ఎక్కువ జీతం ఉన్నవారు కూడా తప్పనిసరి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు.

ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు
వేతన సీలింగ్ పెంపు అమలులోకి వస్తే కలిగే లాభాలు ఇవే. లక్షలాది మంది కొత్త కార్మికులు EPFO, ESIC పరిధిలోకి వస్తారు. వేతన పరిమితి పెరగడం వల్ల ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నెలవారీ పొదుపు మొత్తం పెరుగుతుంది, ఇది రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. ESIC పరిమితి పెంపు ద్వారా ఎక్కువ మంది కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య బీమా సౌకర్యం లభిస్తుంది.

కేవలం వేతన పరిమితి మాత్రమే కాకుండా, కార్మిక శాఖ మరికొన్ని కీలక అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈపీఎస్-95 (EPS-95) కింద అందుతున్న కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన కనీస వేతన విధానాన్ని తీసుకురావడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ప్రతిపాదనలపై సానుకూల సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ రిపోర్టును సమీక్షిస్తోంది. ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పాత పరిమితులే (EPFO రూ.15,000, ESIC రూ.21,000) కొనసాగుతాయి.

వేతన పరిమితిని రూ.25,000కి పెంచడం అనేది మధ్య ఆదాయ వర్గాలకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఒక గొప్ప వరంగా మారుతుంది. ఇది దేశంలోని శ్రామిక శక్తికి మరింత బలమైన ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.

Also Read: Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!

Also Read: Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 11, 2026 07:55:39
Hyderabad, Telangana:

Anganwadi Teacher Telugu News: అన్యంపుణ్యం ఎరగని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి.. ఒక తల్లిలా అక్కున చేర్చుకోవాల్సిన అంగన్వాడీ టీచర్.. ఆ పిల్లాడి పాలిత కాల యముడు అయింది. క్రమశిక్షణ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఆ టీచర్ విచక్షణ కోల్పోయి.. ఓ పసివాడి పై విరుచుకుపడింది.. ఈ అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విద్యను అందించాల్సిన టీచర్ ఇలా అన్యం పుణ్యం ఎరగని ఓ చిన్నారిపై విరుచుకు పడడం స్థానికంగా తీవ్ర కరకలం రేపింది. ఇంతకీ ఏం జరిగింది? దీనికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన విధ్వాన్స్ అనే బాలుడు స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి గత కొద్ది రోజుల నుంచి వెళ్తున్నాడు. అయితే, పాఠశాల సమయాల్లో బాలుడు అల్లరి చేశాడనో లేదా మరేదైనా కారణంతో గాని అక్కడి టీచర్ తీవ్ర ఆగ్రహానికి లోనైంది.. దీంతో ఆమె పసి  పిల్లాడని చూడకుండా ఏకంగా తన చేతిలో ఉన్న కర్రతో రెచ్చిపోయి మరి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది..

అయితే, ఈ దాడిలో విధ్వాన్స్ కంటికి తీవ్ర గాయం అయింది.. అంతేకాకుండా శరీరం అంత వాతలు పడి చర్మం కమీలి పోయినట్లు తెలుస్తోంది.  ఆ టీచర్ కొట్టిన భారీ దెబ్బలకు చిన్నారి విలవిలలాడిపోతున్న సదరు ఉపాధ్యాయురాలు కనికరించకపోవడం స్థానికంగా ఊహించని స్థాయిలో చర్చనీ అంశానికి దారితీసింది. సాయంత్రం పూట బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత శరీరంపై ఉన్న గాయాలను చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. కన్ను విపరీతంగా కందిపోయి ఒళ్లంతా దెబ్బలు ఉండడంతో బాలుడిని తల్లిదండ్రులు ఏం జరిగిందని అసలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. 

దీంతో ఆ బాలుడు అంగన్వాడీ టీచర్ తనను దారుణంగా కొట్టిందని కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రుల వద్ద వివరించాడు.. వెంటనే తల్లిదండ్రులు తమ కుమారుడిని చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్ ఇలా రాక్షసంగా ప్రవర్తించడంపై సదరు బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఆ టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. మా బిడ్డలను అంగన్వాడికి పంపించేది కేవలం చదువుకోసమే కానీ.. ఇలా దెబ్బలు తినడానికి కాదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 11, 2026 07:19:35
Hyderabad, Telangana:

Lord Shiva Favorite Zodiac Signs: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగల్లో మహాశివరాత్రి ఒకటి. అయితే, ఈ ఏడాది వచ్చిన ఈ పండగకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏడాది పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి తిధి రోజు ఈ పవిత్రమైన పండగను జరుపుకుంటారు. ఈరోజు ఆ మహా శివుడిని అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. మహాశివరాత్రి రోజు శివుడిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించడమే కాకుండా.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. అందుకే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులంతా శివనామ స్మరణతో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు..

హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం వస్తోంది. చతుర్దశి తేదీ ఫిబ్రవరి 15 సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 6న సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. శుభ ఘడియలు ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 12 నుంచి తెల్లవారి జామున వరకు ఉంటాయి. భక్తులంతా ఫిబ్రవరి 15వ తేదీ లేదా 16వ తేదీల్లో ఉపవాసాలు ఉండవచ్చని కొంతమంది జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రాశుల వారు మహాశివుడిని పూజించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఎందుకంటే ఆయనకు కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎల్లప్పుడు ఆయా రాశుల వారికి ఊహించని ప్రయోజనాలను అందిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా చాలావరకు మేలు జరుగుతుంది. 

ఈ రాశులవారు బంపర్‌ జాక్‌పాట్:
వృషభ రాశి 
ముఖ్యంగా వృషభరాశి వారికి ఎల్లప్పుడు ఆ మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి వీరికి పనుల్లో అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా.. ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి.. ముఖ్యంగా వీరికి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని ఎప్పుడూ జపించడం వల్ల మానసిక సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామాలు కూడా చేస్తారు. వీరు రుద్రాక్ష మాలలు ధరించడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. 

మకర రాశి 
మహాశివుడు ఎంతో ఇష్టపడి రాశుల్లో మకర రాశి ఒకటి.. వీరికి ఎల్లప్పుడు ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా ఉంటాయి. పాత సమస్యల నుంచి సులభంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే వీరు శివుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.  సంతానం పొందే అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వీరు సోమవారం ఉపవాసం పాటించడం వల్ల జీవితంలో ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. అలాగే జీవితంలో వస్తున్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీరు ఈ మహాశివరాత్రి సమయంలో తప్పకుండా శివారాధన చేయడం చాలా మంచిది.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 11, 2026 07:00:31
Hyderabad, Telangana:

Manasantha Nuvve Re-Release: తెలుగు చిత్రపరిశ్రమలో 'లవర్ బాయ్'గా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా, నేటికీ ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం. తాజాగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

ఆమెను చూసిన అభిమానులు "అచ్చం ఉదయ్ కిరణ్ పోలికలే" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుస విజయాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన ఉదయ్ కిరణ్ నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ 'మనసంతా నువ్వే' మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

మళ్లీ వస్తున్న మనసంతా నువ్వే
2001లో విడుదలైన 'మనసంతా నువ్వే' సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక సంచలనం. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో, రీమా సేన్ కథానాయికగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు.

ఉదయ్ కిరణ్ మేనకోడలి వీడియో
ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఒక ప్రత్యేక వీడియో బైట్‌ను విడుదల చేసింది. "మనసంతా నువ్వే సినిమా విడుదలైనప్పుడు నేను కేవలం రెండు నెలల పాపను. ఇప్పుడు ఆ క్లాసిక్ మూవీ మళ్లీ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి" అని కోరింది.

ఈ వీడియో చూసిన అభిమానులు మహతి రూపం చూసి షాక్ అవుతున్నారు. మహతి కళ్లు, ముఖ కవళికలు చూస్తుంటే అచ్చం ఉదయ్ కిరణ్ గుర్తుకు వస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "ఉదయ్ కిరణ్‌ను మళ్లీ చూసినట్లు ఉంది" అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన ఉదయ్ కిరణ్.. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆయన తీసుకున్న కఠిన నిర్ణయం (ఆత్మహత్య) ఇప్పటికీ అభిమానులను కలచివేస్తూనే ఉంటుంది.

ప్రేమికుల రోజున 'మనసంతా నువ్వే' రీ-రిలీజ్ కానుండటంతో, ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను వెండితెరపై మరోసారి నెమరువేసుకోవడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. మేనకోడలి వీడియో ఆ ఉత్సాహాన్ని మరింత పెంచింది.

Also REad: Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?

Also Read: Suma Cash Program News: సుమ 'క్యాష్' అంతా మోసం..బండారం బయటపెట్టిన కమెడియన్ సుదర్శన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 11, 2026 06:58:34
Hyderabad, Telangana:

Mars Moon Transit 2026 Effect On Zodiac Telugu: శివపార్వతుల వివాహ దినోత్సవాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుని మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన వచ్చింది. అయితే, ఈ ఏడాది వచ్చిన పండగకు  చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇదే రోజు మూడు ప్రధాన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఈ సమయంలో కుజుడితో పాటు చంద్రుడు వాటి స్థానాలను మార్చుకోబోతున్నాయి. అలాగే బుధుడు శతభిషా నక్షత్రాన్ని వదిలి పూర్వభాద్ర పాద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. దీంతోపాటు కుజుడు, చంద్రగ్రహాలు శ్రవణా నక్షత్రం నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తాయి.. ఈ సమయంలో ఎంతో అద్భుతమైన సంయోగం ఏర్పడబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా ఆయా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలావరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మేష రాశి: 
ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఏర్పడే అద్భుతమైన సంయోగాల కారణంగా మేషరాశి వారికి ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు పూర్తి నమ్మకంతో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో ఉన్నటువంటి ఘనకాపాలు కూడా కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చాలా కాలంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పూర్తవుతాయి. ఇక కుటుంబ వాతావరణం కూడా చాలా సంతోషంగా మారుతుంది. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభాలు కలగడంతో కొన్ని రకాల వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు.

మిథున రాశి:
మిథున రాశి వారికి మహాశివరాత్రి నుంచి ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఊహించని స్థాయిలో సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే పూర్వీకుల ఆస్తుల నుంచి భారీ ప్రయోజనాలు పొందుతారు. విశ్వాసం కూడా విపరీతంగా పెరిగి కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా ఎంతో సింపుల్ పరిష్కారం అవుతాయి. అలాగే ఈ సమయంలో అదృష్టం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎన్నో రకాల పనులు సులభంగా పూర్తవుతాయి. దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో అనుకున్నన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు.

ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి కూడా మహాశివరాత్రి నుంచి మహాశివుడి అనుగ్రహంతో ధైర్యంతో నమ్మకం కూడా పెరుగుతుంది. దీనివల్ల మీరు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బంగారంతో పాటు వెండి ఇతర లోహాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా మారడమే కాకుండా.. ఉద్యోగాల్లో ఊహించని పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు కూడా లభించి.. జీవితంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా అప్పుల బాధల నుంచి ఈ సమయంలో కాస్త పరిష్కారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

మకర రాశి:
మహాశివరాత్రి నుంచి మకర రాశి వారికి శివుడి అనుగ్రహంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. నిలిచిపోయిన పనులు ఎంతో స్పీడుగా ఊపందుకునే అవకాశాలు కనిపి. ఆస్తి సంబంధిత సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. కోర్టు కేసుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాల విస్తరణ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. సొంత వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో పురోగతి కూడా లభించి పదోన్నతులు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top