Indian Currency to Indonesian Rupiah: మన దేశంలో ఒక లక్ష రూపాయలు అంటే మధ్యతరగతి వారికి ఒక మంచి సేవింగ్స్. కానీ, అదే సొమ్మును పట్టుకుని మీరు ఇండోనేషియా వెళ్తే, అక్కడ మీరు కోటీశ్వరులే! భారత కరెన్సీకి అక్కడ విపరీతమైన విలువ ఉండటమే దీనికి కారణం. ప్రకృతి అందాలకు, సాంస్కృతిక వైవిధ్యానికి నెలవైన ఈ దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరెన్సీ లెక్కలు..
భారత రూపాయి (INR) తో పోలిస్తే ఇండోనేషియా కరెన్సీ అయిన రుపియా (IDR) విలువ చాలా తక్కువ. ప్రస్తుతం ఒక భారత రూపాయి విలువ ఇండోనేషియాలో సుమారు 186 రుపియాలు. ఒక భారతీయుడు తన వద్ద ఉన్న రూ. 1,00,000 మార్పిడి చేస్తే, అక్కడ సుమారు 1,86,00,000 (1.8 కోట్లు) ఇండోనేషియా రుపియాలు లభిస్తాయి. అందుకే భారతీయులకు ఇండోనేషియాలో తక్కువ ఖర్చుతో విలాసవంతమైన హోటళ్లు, రుచికరమైన ఆహారం, పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉంటాయి.
ముస్లిం దేశం..కానీ నోట్లపై 'వినాయకుడు'!
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. అయినప్పటికీ, ఈ దేశం భారతీయ సంస్కృతిని, హిందూ వారసత్వాన్ని ఎంతో గౌరవిస్తుంది. ఇండోనేషియాలోని 20,000 రుపియా నోటుపై వినాయకుడి చిత్రం ఉండటం విశేషం. విజ్ఞానానికి, అదృష్టానికి చిహ్నంగా వారు గణపతిని భావిస్తారు. అంతేకాకుండా అక్కడి విద్యా మంత్రిత్వ శాఖ లోగోపై కూడా సరస్వతీ దేవి చిత్రం కనిపిస్తుంది. ఇది ఆ దేశానికి సంబంధించిన మత సామరస్యానికి, సంస్కృతి పట్ల ఉన్న మక్కువకు నిదర్శనం.
పర్యాటక స్వర్గం
ఇండోనేషియా కేవలం కరెన్సీ పరంగానే కాదు, పర్యాటక పరంగా కూడా అద్భుతమైన దేశం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీచ్‌లు, హిందూ దేవాలయాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. దట్టమైన అడవులు, అగ్నిపర్వతాలు, అందమైన ద్వీపాలతో ఈ దేశం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
ఒక దేశం యొక్క కరెన్సీ విలువ తక్కువగా ఉన్నంత మాత్రాన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమని అర్థం కాదు. కరెన్సీ విలువ అనేది ఆ దేశ ద్రవ్య విధానాలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ వాణిజ్యంపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, తక్కువ ఖర్చుతో విదేశీ పర్యటన చేయాలనుకునే భారతీయులకు ఇండోనేషియా ఎప్పటికీ బెస్ట్ ఛాయిస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
NPS Scheme Interest Rate: భారతీయ పౌరుల పదవీ విరమణ జీవితాన్ని మరింత ఆర్థిక భద్రతతో నింపేందుకు పెన్షన్ నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (PFRDA) విప్లవాత్మక మార్పులను ప్రకటించింది. తక్కువ మెయింటెనెన్స్ ఫీజు, పారదర్శకమైన పాలన, సులభతరమైన బ్యాంకింగ్ సేవలే లక్ష్యంగా ఈ సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి.
బ్యాంకులకు కొత్త బాధ్యతలు..
ఇప్పటివరకు పెన్షన్ నిధుల నిర్వహణలో ఉన్న సంక్లిష్ట నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. ప్రముఖ వాణిజ్య బ్యాంకులు ఇకపై తమ సొంత పేరుతో పెన్షన్ ఫండ్ కంపెనీలను నడపవచ్చు. బ్యాంకుల మధ్య పోటీ పెరగడం వల్ల కస్టమర్లకు అధిక రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఆర్థికంగా బలంగా ఉన్న బ్యాంకులు మాత్రమే దీనికి అనుమతి ఉంది.
NPS పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఇప్పుడు నిపుణులను నియమించారు. SBI మాజీ ఛైర్మన్ దినేష్ కుమార్ కారా NPS ట్రస్ట్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు ఆర్థిక నిపుణురాలు స్వాతి అనిల్ కులకర్ణి, డిజిటల్ ఇండియా ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ అరవింద్ గుప్తా సభ్యులుగా చేరారు.
పెట్టుబడిదారులకు మెరుగైన మెచ్యూరిటీ సొమ్ము అందించే లక్ష్యంతో, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఫీజు (IMF)ను తగ్గించారు. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. పెట్టుబడి మొత్తం,కొత్త నిర్వహణ రుసుము (IMF) రూ. 25,000 కోట్ల వరకు 0.12% ఉండగా.. రూ. 1.5 లక్షల కోట్లు దాటితే,కేవలం 0.04% గా నిర్ణయించారు. పెట్టుబడి పెరిగేకొద్దీ రుసుము తగ్గేలా ఈ విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రైవేట్ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వారికి ఎక్కువ లాభం చేకూరుతుంది.
NPS ఖాతాను తెరవడం ఎలా?
18 నుండి 70 సంవత్సరాల లోపు ఉన్న భారతీయులు లేదా NRIలు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు.
1. ఆన్‌లైన్ విధానం (e-NPS)
enps.nsdl.com లేదా enps.kfintech.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఆధార్/పాన్ కార్డ్ వివరాలు ఇచ్చి, మొబైల్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరించుకోండి.
ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి, కనీసం రూ. 500 తో ఖాతా ప్రారంభించవచ్చు.
ప్రక్రియ ముగిశాక మీకు PRAN (Permanent Retirement Account Number) కేటాయిస్తారు.
2. ఆఫ్‌లైన్ విధానం (Bank/Post Office)
సమీపంలోని బ్యాంకు లేదా పోస్టాఫీసులో NPS ఫారమ్ నింపి, KYC పత్రాలు సమర్పించడం ద్వారా మీ ఖాతాను ప్రారంభించవచ్చు.
ముఖ్యమైన విషయాలు
ఇది తప్పనిసరి పదవీ విరమణ ఖాతా. దీనికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 80CCD(1B) కింద రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది ఒక సేవింగ్స్ ఖాతా లాంటిది. పన్ను ప్రయోజనం ఉండదు కానీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు. మీరు చెల్లించే డబ్బును ఈక్విటీ (స్టాక్ మార్కెట్), ప్రభుత్వ బాండ్లు లేదా కార్పొరేట్ బాండ్లలో మీ ఇష్టానుసారం పెట్టుబడి పెట్టవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pandiri Farming Subsidy Business Ideas: వ్యవసాయం అనగానే. ఆదాయం తక్కువ.. నష్టం ఎక్కువ అనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్న ఘటనలు ఇందుకు కారణమని చెప్పాలి. ఈ కారణాలతోనే యువత సహా చాలా మంది వ్యవసాయ రంగానికి దూరంగా ఉంటున్నారు. అయితే వ్యవసాయ నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. సరైన పద్ధతిలో ప్రభుత్వ పథకాలు.. సబ్సిడీలను వినియోగించుకుంటే వ్యవసాయం ద్వారానే ఉన్న ఊరిలోనే మంచి ఆదాయం సంపాదించవచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం అలాంటి లాభదాయకమైన విధానాల్లో ఒకటిగా పందిరి వ్యవసాయం నిలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సహకారంతో శాశ్వత పందిరి నిర్మాణం చేపట్టి కూరగాయలు లేదా పండ్ల సాగు చేస్తే దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా రైతులు వెదురు బొంగులు లేదా చెక్క స్తంభాలతో తాత్కాలికంగా పందిరులు వేసి దొండ తీగ, బీరకాయ, సొరకాయ, ఆనపకాయ, కాకరకాయ, పొట్లకాయ వంటి పంటలను సాగు చేస్తుంటారు. అయితే గాలివానలు, భారీ వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఈ తాత్కాలిక పందిళ్లు కూలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పంటతో పాటు పెట్టుబడీ నష్టపోయే అవకాశం ఉంటుంది.
ఈ సమస్యకు పరిష్కారంగా రాళ్లు లేదా కాంక్రీట్ స్తంభాలతో శాశ్వత పందిరి ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి సరైన విధంగా నిర్మించిన పందిరి 10 నుంచి 15 సంవత్సరాల వరకు నిలబడే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఈ రాతి పందిళ్లు తట్టుకుని నిలబడతాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పందిరి వ్యవసాయం కోసం హార్టికల్చర్ శాఖ ద్వారా సబ్సిడీ అందుబాటులో ఉంది. సాధారణంగా ఒక ఎకరానికి రాతి పందిరి ఏర్పాటు చేయడానికి రూ.2 లక్షలకుపైగా ఖర్చవుతుంది.
అయితే.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది ప్రభుత్వం. ఇతర రైతులకు 40 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. ఈ సబ్సిడీ పొందాలంటే రైతులు తమ జిల్లాలోని హార్టికల్చర్ శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. సరైన మార్గదర్శకంతో ఈ పథకాన్ని వినియోగించుకుంటే పెట్టుబడి భారం గణనీయంగా తగ్గుతుంది.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
పందిరి సాగులో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, పంట ఒకేసారి కాకుండా ప్రతిరోజూ కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు రోజువారీ నగదు ఆదాయం లభిస్తుంది. వచ్చిన కూరగాయలను నేరుగా స్థానిక మార్కెట్లు, రైతు బజార్లు లేదా హోల్‌సేల్ మార్కెట్లలో విక్రయించుకోవచ్చు. ఒకే పందిరి వ్యవస్థను ఉపయోగించి 8 రకాల వరకు కూరగాయ పంటలు మార్పిడి పద్ధతిలో సాగు చేయవచ్చు. అంతేకాకుండా ద్రాక్ష, బొప్పాయి వంటి కొన్ని పండ్ల సాగుకూ ఈ పందిరి విధానం అనుకూలంగా ఉంటుంది.
శాశ్వత పందిరి వ్యవసాయం వల్ల ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఒక్కసారి పెట్టినా, దీర్ఘకాలం లాభాలు పొందవచ్చు. మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకుని సాగు చేస్తే, సీజన్‌లో మంచి లాభాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. aసంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా, ఆధునిక సాగు విధానాలను అవలంబిస్తే వ్యవసాయం కూడా లాభదాయకమైన వ్యాపారంగా మారుతుందన్నది నిజం. సరైన సమాచారం, ప్రభుత్వ మద్దతు, కాస్త ముందస్తు ప్రణాళిక ఉంటే రైతులు తమ భవిష్యత్తును బలంగా నిర్మించుకోవచ్చు.
Also Read: Pension Scheme: ఈ స్కీములో ఒకసారి పెట్టుబడి పెడితే.. జీవితాంతం రూ. లక్ష పెన్షన్ పొందవచ్చు.. !!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Vande Bharat Sleeper Launch Date: సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనిపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం కీలక ప్రకటన చేశారు.
దేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు కోల్‌కతా - గువాహటి నగరాల మధ్య నడవనుందని ఆయన ప్రకటన చేశారు. జనవరి 18 లేదా 19 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే 15-20 రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
విమానం కంటే తక్కువ ధరకే టికెట్లు!
మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ టికెట్ ధరలను నిర్ణయించింది. ప్రస్తుతం కోల్‌కతా-గువాహటి విమాన టికెట్ ధర రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఉండగా, వందే భారత్ స్లీపర్ ధరలు ఇలా ఉండబోతున్నాయి (ఆహారంతో కలిపి). 3rd క్లాస్ AC టికెట్ రూ. 2,300, 2nd క్లాస్ AC టికెట్ ధర సుమారు రూ. 3,000, 1st క్లాస్ AC టికెట్ ధర సుమారు రూ. 3,600 గా ఉండనున్నాయి.
గంటకు 180 కి.మీ వేగం..!
వందే భారత్ స్లీపర్ రైలు తన సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకుంది. రాజస్థాన్‌లోని కోటా నుంచి మధ్యప్రదేశ్‌లోని నాగ్దా మధ్య నిర్వహించిన పరీక్షల్లో ఈ రైలు గంటకు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందుకుంది. రైలు అత్యంత వేగంతో వెళ్తున్నప్పుడు గ్లాసుల నిండా నీళ్లు నింపి ఒకదానిపై ఒకటి ఉంచినా, అవి ఏమాత్రం కింద పడకపోవడం ఈ రైలు ప్రత్యేకత. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
రైలులోని అత్యాధునిక ఫీచర్లు
ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో ప్రయాణికుల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించారు. ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వల్ల ప్రయాణంలో కుదుపులు తెలియకుండా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిప్పును గుర్తించే వ్యవస్థ, సీసీటీవీ నిఘాతో పాటు విమానాల్లో ఉండే తరహాలో వ్యాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: School Holiday: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్..మరో 7 రోజులు సెలవు పొడిగింపు..పండగే పండగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Weight Loss With Curd: నేటి కాలంలో అధిక బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా మందిని వేధిస్తున్న సమస్య. అయితే, మన వంటింట్లో నిత్యం అందుబాటులో ఉండే పెరుగు, ఒక ప్రత్యేకమైన పొడి కలిపి తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, ఇది శరీర మెటబాలిజాన్ని పెంచే అద్భుతమైన ఔషధం. పెరుగులో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రించి, కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందులోని కాల్షియం శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరిచి, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
కొవ్వును కరిగించే 'సీక్రెట్ పౌడర్'..
పెరుగుతో జీలకర్ర పొడి కలిపి తీసుకోవడం వల్ల ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. ఎలా తినాలంటే..? ఒక కప్పు పెరుగులో అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కలిపి ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవాలి. జీలకర్ర శరీరంలోని క్యాలరీలను వేగంగా ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
పెరుగులోని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
పెరుగులో విటమిన్ B12, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ D పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును (BP) నియంత్రించి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. ప్రతిరోజూ సుమారు 200 గ్రాముల పెరుగు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆస్ట్రేలియాలోని వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. కాల్షియం, విటమిన్ D కారణంగా ఎముకలు దృఢంగా మారుతాయి.
ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
కీరదోస లేదా ఉల్లిపాయ ముక్కలతో రైతా తయారు చేసుకుని తినవచ్చు. పండ్లతో కలిపి హెల్తీ స్మూతీగా తీసుకోవచ్చు. పెరుగును చిలికి పలచటి మజ్జిగలా చేసి అందులో కాస్త జీలకర్ర పొడి, అల్లం కలిపి తాగడం వేసవిలో ఎంతో మేలు చేస్తుంది.
చివరిగా ముఖ్యమైన సూచన ఏంటంటే?.. పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారు చక్కెరను పూర్తిగా నివారించి, జీలకర్ర పొడి లేదా కాస్త సైంధవ లవణం (Pink Salt) వాడటం ఉత్తమం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Jio New Year Offer: జియో న్యూ ఇయర్ గిఫ్ట్ 2026..చౌకగా 3 రీఛార్జ్ ప్లాన్స్, అదిరిపోయే బెనిఫిట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party 2026 Calendar: తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మార్పు లేదని.. తిరోగమనం మాత్రమే ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు.. తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Harish Rao: కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదా? రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన సంవత్సర డైరీని మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించిన అనంతరం కీలక ప్రసంగం చేశారు. న్యూ ఇయర్ రోజు కూడా ప్రజలు సంతోషంగా లేరని.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలి కాలంలో కూడా గంటల తరబడి, రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముందుకు సాగుదామని.. 2028లో తిరిగి కేసీఆర్‌ని ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: Schools Holiday: జనవరి 1వ తేదీ అన్నీ స్కూళ్లకు సెలవు.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని కేటీఆర్ చెప్పారు. కేంద్రంతోనూ సమైక్యవాదులతోనూ 14 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: YS Sharmila: వైఎస్ షర్మిల సంచలనం.. ప్రధాని మోదీ దేశ ద్రోహి అని విమర్శలు
రెండేళ్లుగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. జెండాను చేతబట్టి నడిపించే నాయకుల కంటే.. ఆ జెండాను భూమిలో నిటారుగా పాతి “ఇది నా జెండా” అని గర్వంగా చెప్పే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పార్టీ శ్రేణులపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
లగచర్ల పోరాటం, రుణమాఫీ వ్యతిరేక ఆందోళనలు, రైతుబంధును ఎగ్గొట్టిన అన్యాయంపై, ‘ఆరు గ్యారంటీలు- 420 హామీలు’పై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కార్యకర్తలను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. 'గెలుపులు, ఓటములు శాశ్వతం కావని, అవి తాత్కాలికం. అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయని కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం, గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు ఒక ఆటలా ఉంటే, తెలంగాణ సాధించిన బీఆర్ఎస్‌కు రాజకీయాలు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ధర్మమని, ఒక విధి' అని కేటీఆర్ తెలిపారు. గెలుపుఓటములతో సంబంధం లేకుండా పార్టీ ప్రయాణం నిరంతరం కొనసాగాలని చెప్పారు.
ఒక వైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే.. మరో వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా అవసరమని కేటీఆర్ గుర్తు చేశారు. పోరాటం, నిర్మాణం రెండింటినీ ఆధారంగా చేసుకుని ముందుకు సాగాలని, ధర్మం, న్యాయం, నిజాయితీ తమవైపే ఉన్నాయని, అందుకే విజయం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటై బీఆర్ఎస్ పార్టీపై దాడి చేస్తున్నా.. ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా బీఆర్ఎస్‌ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదని ప్రకటించారు. 2028లో తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jio New Year Offer 2026: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో నూతన సంవత్సరానికి ముందు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు "హ్యాపీ న్యూ ఇయర్ 2026" ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో రూ.103 నుండి రూ.3,599 వరకు మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌తో ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్‌ల ప్రత్యేకత ఏంటంటే, వినోద ప్రియులకు 13 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ లభించడంతో పాటు, వ్యాపారం, ఉత్పాదకతపై దృష్టి సారించే వారికి జెమిని ప్రో AI సర్వీస్ కూడా ఉచితంగా లభిస్తుంది.
ఈ ప్లాన్‌లు జియో MyJio యాప్‌లో, అలాగే అన్ని జియో రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి.
1. జియో హీరో వార్షిక ప్లాన్ (రూ. 3,599)
ధర: రూ. 3,599
వ్యాలిడిటీ: 365 రోజులు
ప్రయోజనాలు: రోజుకు 2.5 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, అపరిమిత 5G ఇంటర్నెట్. ఈ ప్లాన్‌లో రూ. 35,100 విలువైన 18 నెలల ఉచిత Google Gemini Pro సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
2. జియో సూపర్ సెలబ్రేషన్ నెలవారీ ప్లాన్ (రూ. 500)
ఒకేసారి సంవత్సరం రీఛార్జ్ చేసుకోలేని వారి కోసం జియో ఈ ఆకర్షణీయమైన నెలవారీ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ధర: రూ. 500
వ్యాలిడిటీ: 28 రోజులు
ప్రయోజనాలు: రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు.
OTT ప్లాట్‌ఫామ్‌లు: ఈ ప్లాన్‌లో మొత్తం 13 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ లభిస్తుంది. వీటిలో యూట్యూబ్ ప్రీమియమ్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, సోనీ లీవ్, జీ5 వంటివి ఉన్నాయి.
AI సబ్‌స్క్రిప్షన్: ఈ ప్లాన్‌లో కూడా రూ. 35,100 విలువైన 18 నెలల ఉచిత జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ముఖ్యంగా, మీరు ఈ ప్లాన్‌ను కేవలం ఒక నెల పాటు రీఛార్జ్ చేసినప్పటికీ, మొత్తం 18 నెలల పాటు జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రీఛార్జ్ చేసిన తర్వాత, వినియోగదారులు తమ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను యాప్‌లో విడిగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. జియో చౌకైన ఫ్లెక్సీ ప్యాక్ (రూ. 103)
"హ్యాపీ న్యూ ఇయర్ 2026" ఆఫర్ కింద జియో అందించే అత్యంత చౌకైన డేటా ప్లాన్ ఇది.
ధర: రూ. 103
వ్యాలిడిటీ: 28 రోజులు
డేటా: 5GB డేటా.
ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్స్: ఈ ప్లాన్ వినియోగదారులకు మూడు విభిన్న ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ల నుండి ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది.
హిందీ ప్యాక్: జియో హాట్‌స్టార్, జీ5, సోనీ లీవ్
ఇంటర్నేషనల్ ప్యాక్: జియో హాట్‌స్టార్, ఫ్యాన్‌కోడ్, Lionsgate, డిస్కవరీ+
రీజినల్ ప్యాక్: జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, కాంచ లంక, హోయ్‌చోయ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
One dead and 15 hospitalized in biryani party tragedy Hyderabad: దేశమంత కూడా కొత్త ఏడాది సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా న్యూ ఇయర్ ను ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేళ కొంత మంది తమ ఇళ్లలో పార్టీలు చేసుకుంటే, మరికొంత మంది మాత్రం ఫ్రెండ్స్ లతో కలిసి ఇళ్ల దగ్గర అపార్ట్ మెంట్స్ లలో, హోటల్స్, రెస్టారెండ్ లలో చేసుకున్నారు. మొత్తంగా గతేడాదికి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇచ్చి మరీ న్యూ ఇయర్ ను గ్రాండ్ గా వెల్ కల్ చేప్పారు.
అయితే.. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు కాస్త విషాదంగా మారాయి. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టలో కొత్త ఏడాది సంబరాలు తీవ్ర విషాదంగా మారాయి. నిన్న రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషాదం కొత్త ఏడాది వేడుకల వేళ పెనువిషాదకరంగా మారింది.
జగద్గిరిగుట్టలోని భవానినగర్‌లో ఈ ఘటన సంభవించింది. న్యూ ఇయర్ సందర్భంగా సుమారు 17 చిన్న, పెద్దా దోస్తుల గ్యాంగ్ మంది ఒకచోట చేరి మద్యం సేవించారు. అనంతరం అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. అయితే.. తిన్న తర్వాత కొద్ది సేపటికి వారంతా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.
కొంత మంది వామిటింగ్ చేసుకున్నారు. దీంతో అక్కడి వారు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఒకరు చనిపోయారు. ఏకంగా మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పాండు (53) అనే వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మిగిలిన 15 మందికి చికిత్స అందిస్తున్నారు.
Read more: New Year 2026: ఇది కదా అసలైన హైదరాబాద్.. న్యూ ఇయర్ వేళ సీపీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్..
ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈ ఘటన జరిగిందా లేదా మరేతర కారణాలు ఉన్నాయా..?.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ ఘటన కొత్త ఏడాది ప్రారంభంవేళ హైదరాబాద్ లో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి