Mahalakshmi Free Smart Cards: తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రజాదరణ పొందిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. రద్దీని తగ్గించడం, టికెట్ జారీ ప్రక్రియను సులభతరం చేయడంపై సర్కార్ దృష్టి సారించింది.
బడ్జెట్‌లో రూ.7,000 కోట్ల ప్రతిపాదనలు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మహాలక్ష్మి పథకం సజావుగా సాగడానికి టీజీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి రూ.7,000 కోట్లు కేటాయించాలని కోరింది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా 680 కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.241 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బస్టాండ్లు, డిపోల ఆధునీకరణకు రూ.442 కోట్లు, బస్ పాస్ రాయితీల కోసం రూ.358 కోట్లు కేటాయించాలని నివేదికలో పేర్కొంది.
జూన్ 2 నుంచి 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు'
ప్రస్తుతం ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆధార్ కార్డు చూపుతున్నారు. అయితే, ఆధార్‌లో ఫోటోలు స్పష్టంగా లేకపోవడం వల్ల కండక్టర్లతో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ కార్డులను తీసుకువస్తున్నారు. ఈ కార్డుపై ప్రయాణికురాలి పేరు, పుట్టిన తేదీతో పాటు ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది.
బస్సు ఎక్కగానే కండక్టర్ దగ్గర ఉండే మిషన్ ద్వారా ఈ కార్డును స్కాన్ చేస్తే సరిపోతుంది. జీరో టికెట్ తీసుకోవడం మరింత సులభమవుతుంది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుంచి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. కార్డుల తయారీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేసింది.
మహిళలకు కలిగే ప్రయోజనాలు..
ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, స్మార్ట్ కార్డు ఉంటే సరిపోతుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ వల్ల టికెట్ జారీ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే బస్సుల్లో రద్దీ తగ్గి, ప్రయాణం సుఖమయంగా మారుతుంది. ఈ కొత్త మార్పుల వల్ల మహాలక్ష్మి పథకం మరింత పారదర్శకంగా అమలు కావడమే కాకుండా, ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గడానికి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగడానికి దోహదపడనుంది.
Also REad: AP Crime News: కోరిక తీర్చాలని వదినను బలవంతపెట్టిన మరిది..యాసిడ్‌తో దాడికి యత్నం..చివరికి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
AP RTE Admission 2025-26 Notification: ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏపీ ప్రభుత్వం ఈ గొప్ప అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో మొదటి తరగతిలో ఉచితంగా ప్రవేశం పొందవచ్చు.
2026 - 27 విద్యా సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సీట్ల కేటాయింపు (25% కోటా) మొత్తం కేటాయించిన సీట్లలో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ (SC) 10%, ఎస్టీ (ST) 4%.. బీసీ, మైనారిటీలు & ఇతరులు 6%.. అనాథలు, దివ్యాంగులు & హెచ్‌ఐవీ బాధిత పిల్లలు 5 శాతం సీట్లు కేటాయించారు.
అర్హత ప్రమాణాలు..
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల లోపు ఉండాలి.
వయస్సు: జూన్ 1, 2026 నాటికి కనీసం 5 ఏళ్లు నిండి ఉండాలి.
స్టేట్ సిలబస్: జూన్ 2, 2020 – మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
CBSE సిలబస్: ఏప్రిల్ 1, 2020 – మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
కావలసిన పత్రాలు..
దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి. పిల్లల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate), ఆధార్ కార్డు (తప్పనిసరి), కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate), ఫోటో, నివాస ధృవీకరణ పత్రం వంటివి తప్పనిసరి.
దరఖాస్తు చేసుకునే విధానం..
అర్హులైన తల్లిదండ్రులు ఈ మార్గాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా అప్లై చేయవచ్చు. లేదంటే సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయం సందర్శించవచ్చు. అలాగే మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయం ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. ఏవైనా సందేహాలుంటే 1800 425 899 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read: Free Bus Scheme Smart Cards: మహిళలకు శుభవార్త..ఉచిత బస్సులో కీలక మార్పులు..బడ్జెట్‌లో భారీగా నిధులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ration Card Update Only 7 Days Left: మన దేశవ్యాప్తంగా వైట్ రేషన్ కార్డు పై సరుకులను పేద కుటుంబాలకు అందిస్తాయి. ప్రధానంగా బీపీఎల్ ఈ రేషన్ కార్డు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు రేషన్ కార్డు ద్వారా వివిధ పథకాలను పొందుతారు. ప్రతి నెల బియ్యం, పప్పులు ఇతర సామాగ్రి కూడా రేషన్ కార్డుల నుంచి పొందుతారు. అయితే ఈ రేషన్ కార్డుకు కుటుంబ సభ్యులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేకపోతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఉచిత రేషన్ అందించారు. 2026 ఫిబ్రవరి 28వ లోపు మీరు ఈ పని పూర్తి చేసుకోవాలి . ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఈ కీలక హెచ్చరికలు చేసింది. అయితే లబ్ధిదారులు ఈకేవైసీ ఫిబ్రవరి 28వ తేదీ లోపు పూర్తి చేయకపోతే వారికి ఉచిత రేషన్ అందించబడదు అని హెచ్చరిస్తుంది. అంటే ఈ కేవైసీ 28 ఫిబ్రవరి లోపు పూర్తి చేయటం మంచిది ..
ఈకేవైసీ ఎందుకు?
అసలు చాలామందికి రేషన్ కార్డుకు ఈ కేవైసీ ఎందుకు అనే సందేహం కూడా వచ్చింది. అయితే ప్రభుత్వ పథకాలు కేవలం అర్హులైన వారికి అందించడానికి ఈకేవైసీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే చనిపోయిన వారు ఇక ఆ జాబితా నుంచి తొలగిస్తారు. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేస్తారు. అనర్హులైన వారి పేర్లను తొలగిస్తారు.
ఇంట్లో నుంచి ఈకేవైసీ పూర్తి చేయండి..
మీరు ఇంట్లో నుంచే ఈకేవైసీ పూర్తి చేసే విధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనికి ఈపీడీఎస్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడ మీరు 'లింక్ ఆధార్ రేషన్ కార్డ్ లేదా ఈ కేవైసీ' ని సెలెక్ట్ చేయండి. మీ రేషన్ కార్డు నెంబర్ ఆధార్ వివరాలు నమోదు చేయండి. అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఈ కేవైసీ పూర్తవుతుంది.
అయితే ఒకవేళ మీ రేషన్ కార్డు ఈకేవైసీ ఆన్‌లైన్‌లో పూర్తి చేయకపోతే మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ షాప్ కి వెళ్ళండి. అక్కడ ఈ కేవైసీకి సంబంధించిన వివరాలు నమోదు చేయించండి. మీ ఇతర కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు కూడా నమోదు చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి మీ థంబ్ ప్రింట్ డీలర్ Epos మెషిన్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి డీలర్ మీ వద్ద నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. వెంటనే ఈకేవైసీ ప్రక్రియను ఫిబ్రవరి 28వ తేదీలోపు పూర్తి చేయండి.
Also Read: రైల్వే ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్.. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ బుకింగ్ మరింత సులభతరం..!
Also Read: బాగల్‌కోట్‌లో శివాజీ జయంతి ఊరేగింపు ఉద్రిక్తం.. రాళ్ల దాడులు, వాహనాలకు నిప్పు వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Real Nagamani Video Watch Here: మీ అందరికీ నాగమణి వజ్రం ఎలా ఉంటుందో తెలుసా? ఇది నాగుపాము తలపై రాత్రి సమయాల్లో అద్భుతమైన కాంతితో మెరుస్తూ ఉంటుంది. దీనిని పూర్వీకులు అత్యంత రహస్యమైన రత్నంగా భావించేవారు. ఇది కేవలం నాగుపాముల తలపై మాత్రమే పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా పూర్వీకులు ఎక్కువగా నాగుపాము తలభాగం నుంచి తీసిన రత్నాన్ని ధరిస్తూ ఉండేవారు. అంతేకాకుండా దానిని చూపుడు వేలుకు పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని వారు నమ్ముతూ ఉండేవారు. ముఖ్యంగా రాజులైతే బంగారంతో కలిపి ఉంగరంలా తయారు చేసుకొని ధరించేవారు.. ఇలా ధరిస్తే అనారోగ్య సమస్యలు ఏవైనా దూరం అవ్వడమే కాకుండా.. రాజ్యంలో కరువు కాటకాలు రాకుండా ఉండేవని నమ్ముతూ ఉండేవారు.
పురాణాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అత్యంత అరుదైన నాగమణి వజ్రాలు కొన్ని శక్తివంతమైన పాముల తల భాగంలో మాత్రమే తయారవుతాయట.. అంతేకాకుండా ఇలాంటి రత్నం కలిగిన పాములు చీకటి ప్రదేశాల్లో కాంతిని కలిగి ఉంటాయని కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. అలాగే నాకు పాముల తల పై భాగంలో ఈ రత్నాలు సాధారణంగానే తయారవుతాయని సమాచారం.. ఇక సైంటిఫిక్‌గా చూస్తే.. ఈ వజ్రాలు నాగుపాము తలపై భాగంలో విషం గడ్డ కట్టడం వల్ల.. ఏర్పడుతుందట.. అంతేకాకుండా మరి కొంతమందైయితే నాగదేవతలు కొన్ని శక్తివంతమైన పాములకు అందించిన వరంగా కూడా నమ్ముతూ ఉంటారు..
రియల్ నాగమణులు ఇప్పటికీ ఉన్నాయా అంటే? ఉన్నాయని సందేహం కలుగుతోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా చీకట్లో పాములు కనిపించకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు.. ఓ పాము దగ్గర కాంతివంతమైన మెరుపు మీరు చూడొచ్చు. అంతేకాకుండా అది అడగ విప్పిన సమయంలో రత్నం దగదగా మెరవడం మీరు క్లియర్‌గా ఈ వీడియోలో వీక్షించవచ్చు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
గత కొన్ని రోజుల నుంచి నాగమణి స్టోన్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అవుతున్నారు.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కంగు తింటున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో @SsBolgSsBolg అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.. నాగమణి అని ట్యాగు పెట్టి పోస్ట్ చేయడం విశేషం. ఇలాంటి ఘటనలు చాలా రేర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
20-foot Anaconda Video Watch Here: ప్రకృతి ఒడిలో ఎన్ని రకాల వింతలు ఉన్నాయో.. అన్ని రకాల ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.. ముఖ్యంగా ఆమెజాన్ వంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో చెప్పడం ఎవరి సాధ్యం కాదు. తాజాగా కొంతమంది పర్యాటకులు ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్ని అద్భుతమైన దృశ్యాలను చూశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో పడవపై ప్రయాణం చేస్తున్న కొంతమంది పర్యాటకులకు ఊహించని ఒక ఘటన ఎదురైంది.. దాదాపు 20 అడుగులకు పైగానే పొడవున్న భారీ అనకొండ పాము నీటిలో ఈదుతూ.. అది నేరుగా వారి వైపు దూసుకు రావడం మీరు గమనించవచ్చు.. సాధారణంగా పాములను చూస్తేనే భయపడుతూ ఉంటారు.. అలాంటిది కొండచిలువకు సంబంధించిన భారీ సర్పంచ్ ఒక్కసారిగా ఉన్నట్టుండి నీటిలో పడవలు ఈదుతున్న వారి వైపుకు దూసుకు వస్తే ఎలా ఉంటుంది?
ఆ భారీ సర్పం నీటి అలలు సైతం దాటుతూ అత్యంత వేగంగా పడవ వైపుకు రావడం వీడియోలో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. పడవకు అతి సమీపంలోనే ఆ అనకొండ పాము ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా కడప దగ్గరికి వచ్చి.. ఆ ప్రయాణికులపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే, ఆ పడవలో ఉన్న కొంతమంది ప్రయాణికులు ఈ దృశ్యాలను వారి స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించారు. ఆ పాము అతి సమీపంలోకి రావడం, దీంతో పడవలు ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
ఈ వీడియోను అన్‌సీన్ వైల్డ్ లైఫ్ అమెజాన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించగా.. వేల సంఖ్యలో దీనికి లైక్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఆ పడవలో ఉండే అందరి ప్రయాణికులు ప్రాణాలు పోయేవని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో చూసిన మరికొంతమంది మాత్రం ఇది నిజమైన వీడియో కాదని ఎవరో కావాలని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వినియోగించి సృష్టించారని కామెంట్లు చేస్తున్నారు. ప్రకృతి అందాలను చూసేతందుకు వెళ్లాలనుకునేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pax Silica India Telugu News: భారత్ మరో ముందడుగు వేసింది.. అమెరికా రూపొందించిన ప్యాక్స్ సిలికా కూటమిలో మన దేశం అధికారికంగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో పాటు సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాల సరఫరాను మరింత బలోపేతం చేసే లక్ష్యంలో ఈ కూటమిని అమెరికా రూపొందించింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ప్యాక్స్ సిలికా ప్రకటనపై సంతకం చేసింది. ఇంతకీ ప్యాక్స్ సిలికా అంటే ఏంటి? ఇది భారత్ కి ఎలా ఉపయోగపడుతుందని అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్యాక్స్ సిలికా అంటే ఏమిటో తెలుసా? (what is pax silica)
గత సంవత్సరం డిసెంబర్లో అమెరికా ప్యాక్స్ సిలికా కూటమిని ప్రారంభించింది.. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సెమీ కండక్టర్లతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సాంకేతికతకు అవసరమైన అన్ని రకాల ముడి పదార్థాల సరఫరాలో చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం అన్నమాట.. ప్యాక్స్ అంటే లాటిన్ భాషలో శాంతి అని.. ఇక సిలికా అంటే చిప్ తయారీకి వాడే సిలికాన్ అని అర్థం.. అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక భద్రతను, శాంతిని కాపాడుకోవడమే దీని ప్రధాన లక్ష్యం..
ఈ కూటమి ఒప్పందం కారణంగా భారతదేశ టెక్నాలజీ సరఫరాల గొలుసులో భాగంగా కీలక భాగస్వామిగా మారే అవకాశాలున్నాయి.. విదేశీయంగా చిప్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి.. అత్యాధునిక టు నానోమీటర్ చిప్పులను రూపొందించడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా విద్యుత్ వాహనాలు.. రక్షణ పరికరాల్లో వాడే అరుదైన ఖనిజాల సరఫరాలో అంతరాయం కలగకుండా సభ్య దేశాల నుంచి సహకారమందుతుంది. ఈ రంగంలో సుమారు 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరమవుతారని.. ఆ డిమాండ్ ను భారత్ తీర్చగలుగుతుందని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా గూగుల్ కంపెనీకి చెందిన CEO సుందర్ పిచాయ్‌తో పాటు అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారత్ చేరికతో ఈ కూటమి మరింత శక్తివంతమైందని.. ఇది కేవలం అన్ని దేశాల అవసరాలను తీర్చడమే కాకుండా.. వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారుతుందని అమెరికా రాయబారి తెలిపారు.. భారత్తో కలిసి ఈ కూటమిలో జపాన్‌తో పాటు యునైటెడ్ కింగ్డమ్, దక్షిణ కొరియా ఆస్ట్రేలియా వంటి పది దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అతి త్వరలోనే మరికొన్ని దేశాలు కూడా ఇందులో కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Burnt Ironing Shirt Video Watch Here: ఫ్యాషన్ ప్రపంచంలో వింతలకు అసలు కొదవే లేకుండా పోతోంది.. అప్పుడప్పుడు కొన్ని లగ్జరీ బ్రాండ్లు తీసుకువచ్చి డిజైన్లు అసలు సాధారణ మనుషులకు అర్థం కాకపోవడమే కాకుండా... కొన్ని డిజైన్లు అయితే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ వెట్‌మెంట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన తెల్లచొక్కా ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు అయితే విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ చొక్కాలో ఏముంది? ఇంత చర్చనీ అంశానికి దారి తీయడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా మనం బట్టలు ఇస్త్రీ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇస్త్రీ పెట్టె వేడికి బట్టలు కాలిపోతూ ఉంటాయి.. అంతేకాకుండా తెల్లటి దుస్తులపై.. కాలిపోయిన నల్లటి మచ్చలు పడుతూ ఉంటాయి. అలాంటి చుక్కలను మనం బయట పారేస్తూ ఉంటాం.. లేదా ఇంట్లో వివిధ రకాల పనులకు వినియోగిస్తాం.. కానీ ఈ బ్రాండ్ విడుదల చేసిన వైట్ షర్ట్ కాలిన గుర్తు డిజైన్‌తో రూపొందించారు.. వైట్ ఐరనింగ్ బర్న్ గ్రాఫిక్స్ షర్ట్ అని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
ఈ కాలిన గుర్తు ప్రింటింగ్ షర్ట్ ధర అక్షరాల 1000 డాలర్లకు పైగానే ఉంది.. అంటే భారత కరెన్సీలో సుమారు ఒక లక్ష రూపాయలకు పైమాటే.. ఈ చొక్కాపై జేబు భాగంలో ఇస్తిరి పెట్టతో కాలినట్లు ఉండే గ్రాఫిక్స్.. మనం ఫోటోలో చూడొచ్చు. అయితే, ఈ చొక్కాపై కాలినట్లు కనిపించినప్పటికీ.. చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఇవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి..
VETEMENTS made a graphic shirt with an “iron burn” print that retails $1,139 pic.twitter.com/F5e9pkLQ8j
— STAYGROUNDEAD TV (@staygroundeadtv) February 16, 2026
అయితే, ఈ చొక్కాపై సోషల్ మీడియా వినియోగదారులు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.. కొంతమంది అయితే నేను ఇలాంటి డిజైన్లను ఎన్నో ఏళ్లుగా ఉచితంగా ఇంట్లోనే తయారు చేస్తున్నాను.. ఇప్పుడు నా పాత బట్టలన్నీ లగ్జరీ ఫ్యాషన్ కిందికి వస్తాయన్నమాట.. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు ఫన్నీగా కామెంట్ చేశాడు.. అలాగే ధనవంతులు నుంచి డబ్బులు ఎలాగా గుంజాను చూపేందుకు లగ్జరీ బ్రాండ్లు చేస్తున్న అత్యద్భుతమైన ప్రయోగం ఇది అని.. మరొక సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ చేశాడు.. ఇలా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ చేస్తూ వచ్చారు..
Also Read: జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook
Old Woman Viral Video Watch Here: వయస్సు పైబడిన వారు చాలావరకు విశ్రాంతి తీసుకుంటారు.. అయితే, విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో.. ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తన ఆత్మ గౌరవం కోసం పడుతున్న తపన సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. పశ్చిమ బెంగాల్ హౌరాకు చెందిన ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తూ వస్తోంది.. ఆమె దగ్గరికి పదుల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. అయితే, ఆ వృద్ధురాలు పడుతున్న కష్టాన్ని ఇంస్టాగ్రామ్ కు సంబంధించిన ఓ కంటెంట్ క్రియేటర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
భర్త మరణించిన తర్వాత వృద్ధురాలు దీపాలి ఘోష్‌కు ఈ చిన్న హోటల్ ఒక ప్రధాన ఆధారమైంది.. ఉదయాన్నే కూరగాయలు కొనుగోలు చేయడం నుంచి.. వంట చేయడం, గిన్నెలు శుభ్రం చేయడంతో పాటు పరిసరాలను శుభ్రం చేయడం ఇలా అన్ని ఆమె ఒక్కరే చేసుకుంటునారు.. ఆమెకు సహాయం చేసే వారు ఎవ్వరూ లేరు.. ఈ వయస్సులో సరిగ్గా వినిపించక పోయిన.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. కేవలం తిండి, ఔషధాల ఖర్చులకోసం ఆమె ప్రతిరోజు ఇలా శ్రమించాల్సి వస్తోంది.
అన్నింటికంటే బాధ పడాల్సిన విషయం ఏంటంటే.. ఆ చిన్న హోటలే ఆమెకు నివాసం.. మసి పట్టిన గోడలతో పాటు చిల్లులు పడిన పైకప్పు ఉన్న ఇరుకైన గదిలోనే ఆ వృద్ధురాలు చిన్న చెక్క ముక్క పై పడుకుంటుంది. ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత ఆమె పరిస్థితి ఊహించని స్థాయిలో దిగజారింది. అయినప్పటికీ ఆ వృద్ధురాలు ఎవరిపైన ఇసుమంత ఆధారపడలేదు.. అంతేకాకుండా వృద్ధాశ్రమానికి వెళ్లే ఆలోచన లేక తనని తానే మనస్సును దృఢంగా చేసుకొని ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ వచ్చింది..
Also Read: జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్..!
అయితే, ఈ వీడియో చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. వెంటనే ఆ బామ్మ ఉంటున్న దుకాణాన్ని బాగు చేయడమే కాకుండా.. ఆమెకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.. మరి కొంతమంది ఈ వీడియోను చూసి ఆమె ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఎవ్వరి దగ్గర రూపాయి అడగకుండా కష్టపడుతున్న ఆమె నిజంగా చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆమెకు ఆర్థిక సహాయం చేయడానికి.. హోటల్ ను బాగు చేయడానికి ముందుకు వస్తున్నారు.
Also Read: జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
India And Bangladesh Relations Latest News: భారత్ బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఉధృప్తతలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.. మీరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు చాలా రోజుల తర్వాత మళ్లీ గాడిన పడుతున్నాయి అనే సంకేతాలు గత రెండు మూడు రోజుల నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి.. బంగ్లాదేశ్‌లో భారత్ త్వరలో అన్ని రకాల వీసా సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించబోతున్నట్లు భారత ఉన్నత స్థాయి దౌత్యవేత్త అనిరుద్ధ దాస్ వెల్లడించారు. దీంతో బంగ్లాదేశ్లో చదువుకోవాలనుకుంటున్న యువతకు ఇది ఎంతగానో సహాయ పడబోతోంది.
2024 ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం.. ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ అస్థిరత కారణంగా భారత్ తన వీసా సేవలను నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే.. ముఖ్యంగా భారత రాయబార కార్యాలయం పై దాడుల ముప్పు పొంచి ఉండడంతో.. భద్రతా కారణాల దృశ్య.. 2025 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన వీసా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. అప్పటినుంచి కేవలం అత్యవసర వైద్య చికిత్సలతో పాటు డబుల్ ఎంట్రీ వీసాలను మాత్రమే పరిమితంగా జారీ చేశారు.
సిల్హెట్‌లో ఉన్న భారత సీనియర్ కన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మెడికల్ తో పాటు డబుల్ ఎంట్రీ వీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. అతి త్వరలోనే టూరిస్ట్ వీసాలతో పాటు అన్ని ఇతర రకాల కేటగిరీలకు సంబంధించిన సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. అని తెలిపారు. బంగ్లాదేశ్లో తారీక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్తో సంబంధాలను మెరుగుపరచుకోవడంలో పురోగతి కనిపిస్తోంది..
మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం హయాంలో.. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.. అయితే ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్తో సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ వస్తోంది. రెండు దేశాల ప్రజలే ఈ సంబంధానికి ప్రధాన భాగస్వాములు.. మన ఆలోచనలు సాంస్కృతులు ప్రాచీన కాలం నుంచే ఒకే దారంతో అల్లారని.. అనిరుద్ధ దాస్ మీడియా ముఖంగా తెలిపారు..
Also Read: జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్..!
గతంలో రోజుకు సగటున ఎనిమిది వేల వీసాలను భారత్ జారీ చేస్తూ ఉండేది.. అయితే ఉద్రిక్తత తల కారణంగా ఈ సంఖ్యను కేవలం 1500 కు తగ్గించింది.. ఇప్పుడు అన్ని సేవలు పునరుద్ధరిస్తే సాధారణ పౌరులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడడమే కాకుండా మీరు దేశాల మధ్య వాణిథ్యం కూడా మెరుగుపరవచ్చు. అంతేకాకుండా సాంస్కృతిక బంధాలు మళ్లీ బలపడే అవకాశాలు ఉండబోతున్నాయి..
Also Read: జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Biryani Tax Scam Telugu Latest News: హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో సాధారణంగా మొదలైన తనిఖీలు.. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ రంగంలోని జరుగుతున్న ఊహించని కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. కొన్ని హోటల్స్‌కి సంబంధించిన యజమానులు అత్యాధునిక సఫ్ట్‌వేర్లను అడ్డంపెట్టుకుని ప్రభుత్వానికి దాదాపు రూ. 70,000 కోట్ల మేర పన్నులు ఎగవేసినట్లు అధికారు గుర్తించారు. దీంతో ఈ వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
జరిగింది ఇదే..
హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ సెంటర్లపై ఐటీతో పాటు GST అధికారులు దాడులు నిర్వహించగా.. అసలు విషయం అప్పుడు బయటపడింది.. హోటళ్లు వాడుతున్న బిల్లింగ్ సాఫ్ట్‌వేర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ప్రత్యేకమైన అనలిటిక్స్ వినియోగించి పూర్తిగా విశ్లేషించగా.. అందులో ఊహించని స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు తేలింది.. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఇదే తరహా సాఫ్ట్‌వేర్‌ను వాడుతూ పన్నులు ఎగ్గొడుతున్నట్లు అధికారులు నిర్ధారించిన్నట్లు తెలుస్తోంది.
అసలు వ్యూహం ఇదే...
వినియోగదారులు బిల్లులు చెల్లించి వెళ్లిన తర్వాత.. ఆ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను సాఫ్ట్‌వేర్‌ల నుంచి ఎంతో సులభంగా చాలా రహస్యంగా డిలీట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్యాష్‌తో వచ్చే ఆదాయాన్ని లెక్కల్లో చూపించకుండా.. పూర్తిగా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సమయాల్లో ఒక రోజు లేదా నెల రోజుల అమ్మకాలను సైతం ఎంతో సులభంగా రికార్డ్‌ల నుంచి తొలగిస్తున్నారు. చాలా తక్కువ మొత్తంలో ఆదాయం చూపిస్తూ.. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చెబుతున్నారు.
దీనికి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలను అధికారులు బటపెట్టారు. దేశవ్యాప్తంగా రూ. 13,000 కోట్లకు పైగా బిల్లులను సాఫ్ట్‌వేర్ నుంచి డిలీట్ చేయగా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.5,100 కోట్ల మేర విక్రయాలను దాచి ఉంచిన్నట్లు అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేతలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం సుమారు రూ. 70,000 కోట్లు కుంభకోణం జరిగిన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 6 సంవత్సరాలకు సంబంధించిన 60 టెరాబైట్ల డేటాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన్నట్లు తెలుస్తోంది.. కేవలం నగదు మాత్రమే కాకుండా, కార్డ్‌తో పాటు యూపీఐ చెల్లించిన వాటిలో కూడా అవకతవకలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Heritage Controversy in AP Assembly: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హెరిటేజ్ సంస్థ తితిదేకు నెయ్యి సరఫరా చేసిందంటూ అసత్య ప్రచారాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తితిదేకు ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని, ఇది 'నిప్పులాంటి నిజం' అని తిరుమల తిరుపతి దేవస్థానముల ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
చీజ్ ప్యాకెట్‌ను నెయ్యి అన్నారా?
శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీరును ఆయన తప్పుబట్టారు. "హెరిటేజ్ చీజ్ ప్యాకెట్‌ను చూపిస్తూ అది నెయ్యి అని చెప్పి వైకాపా తన పరువును తానే పోగొట్టుకుంది" అని ఎద్దేవా చేశారు. స్వామివారి అన్న ప్రసాదాల నాణ్యత విషయంలో తమ పాలకవర్గం అత్యంత కఠినంగా ఉందని ఆయన తెలిపారు. గతంలో లాగా తక్కువ ధరలకు నాణ్యత లేని సరుకులు కొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నెయ్యి ధరలపై వైకాపా నేతలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ, ఓపెన్ టెండర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా, జగన్ చెప్పినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
"స్వామివారికి సమర్పించే నైవేద్యాల విషయంలో ఎంత ఖర్చవుతుందనే లెక్కలు వేయం. భక్తులకు అందే అన్న ప్రసాదాలు, లడ్డూల నాణ్యత పెంచడమే మా మొదటి ప్రాధాన్యత. దేవుడి సొమ్మును ఆయన సేవకే ఖర్చు చేస్తున్నాం" అని బీఆర్ నాయుడు తన ప్రకటనలో వివరించారు.
Also Read: AP Crime News: కోరిక తీర్చాలని వదినను బలవంతపెట్టిన మరిది..యాసిడ్‌తో దాడికి యత్నం..చివరికి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rompicherla Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రక్షణగా ఉండాల్సిన మరిదే వదినపై కన్నేసి, లోబడకపోతే యాసిడ్ దాడికి తెగబడిన ఈ ఉదంతం బయటపడింది.
అన్న చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వదినకు అండగా నిలవాల్సిన మరిది, కామంతో కళ్లు మూసుకుపోయి ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశాడు. తన కోరిక తీర్చకపోతే యాసిడ్ పోసి చంపుతానంటూ బరితెగించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఏం జరిగింది?
రొంపిచర్ల మండలానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళ, తన భర్త ఏడాదిన్నర క్రితం మరణించడంతో ముగ్గురు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమెపై, భర్త తమ్ముడైన శామ్యూల్ కన్నేశాడు. గతంలోనూ శామ్యూల్ ఆమెపై అత్యాచార యత్నం చేయగా, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అప్పట్లో తప్పు ఒప్పుకుని, వదిన కాళ్లు పట్టుకుని వేడుకోవడంతో ఆమె క్షమించి వదిలేసింది.
బుద్ధి మార్చుకోని శామ్యూల్, ఫిబ్రవరి 16వ తేదీ అర్ధరాత్రి ఆమె నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో, వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై పోసేందుకు ప్రయత్నించాడు. సమయస్ఫూర్తితో ఆమె అక్కడి నుండి తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీసుల రంగప్రవేశం
మరిది వేధింపులు మితిమీరిపోవడంతో పాటు ప్రాణహాని ఉందని గ్రహించిన బాధితురాలు, బుధవారం తన బంధువులతో కలిసి రొంపిచర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. "అమ్మలా చూడాల్సిన వదిన అని కూడా చూడకుండా, గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. పంచాయితీలో కాళ్లు పట్టుకుని కూడా మళ్లీ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. నాకూ, నా పిల్లలకు రక్షణ కల్పించండి" అని ఆమె పోలీసులను వేడుకుంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు శామ్యూల్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒంటరి మహిళలపై జరుగుతున్న ఇటువంటి దాడులు సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Buttermilk With Ginger Benefits For Weight Loss: వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే పానీయాల్లో మజ్జిగకు సాటి లేదు. అయితే, కేవలం చల్లదనం కోసమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా మజ్జిగను ఒక ఆయుధంగా వాడుకోవచ్చని మీకు తెలుసా? ఒక గ్లాసు మజ్జిగలో ఒక చెంచా అల్లం రసం కలిపి తీసుకుంటే శరీరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, అల్లంలోని ఔషధ గుణాలు కలిస్తే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అల్లం శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ప్రతిరోజూ మజ్జిగలో అల్లం రసం కలిపి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కణాల విచ్ఛిన్న ప్రక్రియ వేగవంతమై, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఇది సరైన పరిష్కారం. ఆకలి లేని వారికి మజ్జిగలో అల్లం రసం కొద్దిగా ఉప్పు కలిపి ఇస్తే ఆకలి పెరుగుతుంది. అలాగే అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, మజ్జిగలోని లాక్టోస్ శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరంలో లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ (మంట) తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ఉత్పత్తి పెరిగి, రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది కాలేయ పనితీరును మెరుగుపరిచి, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలి?
ఒక గ్లాసు చిక్కని మజ్జిగ తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ తాజా అల్లం రసం, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు, రుచి కోసం కొత్తిమీర లేదా పుదీనా ఆకులు కలపండి. దీనిని మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
(గమనిక: ఈ సమాచారం ప్రాథమిక అవగాహన, ఆయుర్వేద చిట్కాల ఆధారంగా పేర్కొన్నాము. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా చికిత్స పొందుతున్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీనిని అనుసరించాలి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Driver Subramanyam Case Anantha Babu Wife: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు భార్య ప్రమేయంపై సిట్ (SIT) సంచలన విషయాలను వెల్లడించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో సిట్ బృందం అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
సిట్ నివేదికలో ఇలా..
ఈ హత్య కేసులో ఆమెను రెండవ నిందితురాలిగా (A-2) సిట్ పేర్కొంది. సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారని అధికారులు కోర్టుకు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల విశ్లేషణ తర్వాతే ఆమెపై ఈ అభియోగాలు మోపినట్లు సిట్ వెల్లడించింది.
ప్రస్తుతం లక్ష్మీ దుర్గ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. గతంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పుడు, ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఏం జరిగిందంటే?
2022 మే 19న వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించారు. అర్ధరాత్రి సమయంలో అనంత బాబు స్వయంగా సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం పెను దుమారం రేపింది. తొలుత ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, తీవ్ర నిరసనల మధ్య విచారణ జరిపి అనంత బాబును ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.
సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గతేడాది జూలైలో ప్రభుత్వం ఈ కేసుపై తదుపరి విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ గన్‌మెన్లు, అనుచరులను విచారించిన సిట్, తాజాగా అనంత బాబు భార్య ప్రమేయాన్ని నిర్ధారిస్తూ చార్జిషీట్ దాఖలు చేయడం కేసులో కీలక మలుపుగా మారింది. ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబు ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ఇప్పుడు ఆయన భార్యపై కూడా తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు కావడంతో ఈ కేసు విచారణ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: Vizag AI Data Centre: విశాఖలో గూగుల్ మెగా ఏఐ హబ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారీ ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook