Back

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే
Jangareddigudem, Andhra Pradesh:
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం చింతలపూడి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు.రోగులతో మాట్లాడి వైద్య సహాయం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.పాయిజన్ తీసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థి పై మండిపడ్డారు, చాలా భవిష్యత్తు ఉంది, పాయిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని ఇంకొక్కసారి తీసుకోకూడదని హెచ్చరించారు. ఆసుపత్రులలో సదుపాయాలపై వైద్యుల ను ఆరా తీశారు
0
Report
కూటమికి అండగా నిలిచిన ఎన్నారై లకు ధన్యవాదాలు
Palakollu, Andhra Pradesh:
ఆంధ్ర రాష్ట్రభవితవ్యం , భవిష్యత్ తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి కి అండగా నిలిచి విజయాన్ని చేకూర్చిన ఎన్నారైలకు జల వనరుల శాఖ మంత్రి , పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా లో విజయోత్సవాలు జరుపుకుంటున్న ఎన్నారై టిడిపి, జనసేన, బిజెపి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.
0
Report
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి
Aluru, Andhra Pradesh:
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో తల్లాడ , దేవరపల్లి జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరినిు లారీ ఢీకొనడంతో చుండ్రు దేవా (22) అనే వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్త తరలించారు. జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0
Report
మత్స్యకార వేషధారణలో ఎమ్మెల్యే
Narsapuram, Andhra Pradesh:
మత్స్యకార వేషధారణలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం వినూత్న రీతిలో అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. సాంప్రదాయ మత్స్యకారునిగా అసెంబ్లీలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు
0
Report
Advertisement
డంపింగ్ యార్డులో చెత్త నుండి సంపదల సృష్టించేలా చర్యలు
Palakollu, Andhra Pradesh:
పాలకొల్లు పట్టణ యడ్లబజార్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య తీరెలా ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డులో చెత్తను సంపదగా చేసేలా చర్యలు చేపడతామని అన్నారు.
0
Report