Renu Desai Cyber Crime: పోలీసులను ఆశ్రయించిన పవన్ కల్యాణ్ మాజీ భార్య..సైబరాబాద్ పోలీసులకు నటి రేణు దేశాయ్ ఫిర్యాదు!
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Peddi Movie Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది'. 'గేమ్ ఛేంజర్' ఫలితంతో సంబంధం లేకుండా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏంటో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు నిరూపిస్తున్నాయి. థియేటర్లలోకి రాకముందే నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలో ఈ సినిమా సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది.
ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా విడుదల కానున్న 'పెద్ది' చిత్రం, కేవలం డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారానే నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లింది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం.. ఈ సినిమా సాధించిన రికార్డు బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
డిజిటల్ రైట్స్..భారీ ఓటీటీ డీల్
ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గట్టి పోటీని ఎదుర్కొని మరీ సొంతం చేసుకుంది. అన్ని భాషలకు కలిపి సుమారు రూ.115 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్య ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. రామ్ చరణ్‌కు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ ఈ స్థాయి ధరకు ప్రధాన కారణం.
శాటిలైట్, ఆడియో హక్కులు
తెలుగుతో పాటు హిందీ, ఇతర భాషల శాటిలైట్ హక్కులు కలిపి రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. కేవలం తెలుగు వెర్షన్ కోసమే చానెల్స్ రూ.40 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండటంతో, టీ-సిరీస్ సంస్థ ఏకంగా రూ.35 కోట్లు వెచ్చించి ఆడియో హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే విడుదలైన 'చికిరి' సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం.
ఓవర్సీస్ మార్కెట్
రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు కారణంగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం విదేశీ హక్కుల ద్వారానే సుమారు రూ.40 కోట్లు వస్తాయని అంచనా.
బిజినెస్ బ్రేక్-అప్ (అంచనా)
మునుపటి సినిమా ఫలితం ఎలా ఉన్నా, రామ్ చరణ్ బాక్సాఫీస్ పుల్‌పై అది ఏమాత్రం ప్రభావం చూపలేదని 'పెద్ది' బిజినెస్ నిరూపిస్తోంది. ఒక సినిమా విడుదలకు ముందే రూ.275 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ చేయడం అంటే అది కేవలం చరణ్ గ్లోబల్ ఇమేజ్ వల్లే సాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే 'చికిరి' సాంగ్ సూపర్ హిట్ అవ్వగా.. ఇప్పుడు రెండో పాట 'రై రై రారా' విడుదలై ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Israel-US strikes on Iran: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఈ యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ అధ్యక్షుడు ఖొమెనీ మృతితో ఉద్రిక్తతలు ఆరంభం అయ్యాయి. అయితే ఇప్పటికి కూడా ఇరాన్ తన దాడిని ఇజ్రాయిల్, అమెరికా మిలిటరీ స్థావరాలపైన కొనసాగిస్తోంది. అయితే యుద్ధం ప్రపంచ దేశాలకు ఒక పాఠం నేర్పించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ యుద్ధంలో అతిపెద్ద సవాలు 'కాస్ట్ ఎక్స్ఛేంజ్ రేషియో. ఇరాన్ ఉపయోగిస్తున్న ఒక షాహెద్ (Shahed) డ్రోన్ ధర సుమారు 35,000 డాలర్లు (సుమారు రూ. 30-32 లక్షలు) మాత్రమే. కానీ దానిని గాలిలోనే అడ్డుకుని కూల్చివేయడానికి ఇజ్రాయెల్ వాడే ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 5 లక్షల నుండి 4 మిలియన్ డాలర్లు (రూ. 5 కోట్ల నుండి రూ. 36 కోట్ల) వరకు ఉంటుంది. అంటే శత్రువు చేసే తక్కువ ఖర్చు దాడిని ఆపడానికి, ఇజ్రాయెల్ వంద రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఇరాన్ వ్యూహం ఇదే..
ఇరాన్ వద్ద దాదాపు 80,000 డ్రోన్ల స్టాక్ ఉందని అంచనా. నెలకు 500 డ్రోన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం వారికి ఉంది. ఇరాన్ వ్యూహం ఏమిటంటే, ఒకేసారి వేల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను (ముఖ్యంగా ఐరన్ డోమ్ వంటివి) ఒత్తిడికి గురి చేయడం. ఒకే రోజులో 2,500 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగిస్తే, ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు కొద్ది రోజుల్లోనే అయిపోయే ప్రమాదం ఉంది. ఇది రక్షణ వ్యవస్థను దెబ్బ తీయడమే ఇందులోని అసలు వ్యూహం.
ఇండస్ట్రియల్ వార్:
యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, ఫ్యాక్టరీల మధ్య కూడా జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, అమెరికా , ఇజ్రాయెల్ వద్ద ఉన్న క్షిపణి నిల్వలు త్వరగా తగ్గిపోవచ్చు. ఇక్కడ ముఖ్యం ఏమిటంటే:
మీ వద్ద ఎన్ని క్షిపణులు ఉన్నాయి?
మీరు వాటిని ఎంత వేగంగా తయారు చేయగలరు?
మీ సప్లై చైన్ (సరఫరా వ్యవస్థ) ఎంత బలంగా ఉంది?
ఈ మూడు అంశాలే యుద్ధ గమనాన్ని ప్రస్తుతం నిర్ణయిస్తాయి. ఒకవేళ యుద్ధం సుదీర్ఘంగా సాగితే, తక్కువ ఖర్చుతో కూడిన ఇరాన్ డ్రోన్ల ఉత్పత్తి వేగం ముందు, ఖరీదైన పాశ్చాత్య క్షిపణుల తయారీ వేగం సరిపోకపోవచ్చు.
ఐరన్ బీమ్ (Iron Beam): ఒక ఆశాకిరణం:
ప్రస్తుత ఖరీదైన రక్షణ వ్యవస్థకు ఇజ్రాయెల్ కనుగొన్న పరిష్కారం 'ఐరన్ బీమ్' లేజర్ సిస్టమ్. దీని ద్వారా ఒక్కో డ్రోన్‌ను కూల్చడానికి అయ్యే ఖర్చు కేవలం 2 నుండి 5 డాలర్లు మాత్రమే (సుమారు రూ. 200-రూ. 500) మాత్రమే. ఇది వినడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ, ఈ టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఒకటి రెండు సిస్టమ్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. ఇది భారీ స్థాయిలో అందుబాటులోకి వస్తే తప్ప ఇరాన్ డ్రోన్ ఆర్థిక వ్యూహాన్ని దెబ్బకొట్టడం కష్టం.
యుద్ధ సమయంలోనూ ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ 8% ఎందుకు పెరిగింది?
ఇజ్రాయెల్ వైపు డ్రోన్లు దూసుకొస్తున్నా, అక్కడి స్టాక్ మార్కెట్ (TA-35 ఇండెక్స్) దాదాపు 9% పెరగడం ఆశ్చర్యకరం. దీనికి ప్రధాన కారణాలు చూస్తే, స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ప్రస్తుత భయం కంటే భవిష్యత్తు లాభాలను చూస్తుంది. ఇజ్రాయెల్ సాధించబోయే 'నిర్ణయాత్మక విజయం' (Decisive Victory) పై ఇన్వెస్టర్లు నమ్మకంగా ఉన్నారు. ఇరాన్ ప్రయోగ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు సమర్థవంతంగా ఉన్నాయని, దీనివల్ల దీర్ఘకాలిక ముప్పు తగ్గిందని మార్కెట్ భావిస్తోంది. అమెరికా , బ్రిటన్ నేరుగా రంగంలోకి దిగడం వల్ల ఇజ్రాయెల్ ఒంటరి కాదనే ధీమా మార్కెట్‌కు బలాన్నిచ్చింది.
ఈ కారణాలతో ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ పెరిగింది..
డిఫెన్స్ స్టాక్స్: రక్షణ రంగ కంపెనీల షేర్లు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఎయిర్ డిఫెన్స్ టెక్: కొత్త రకమైన లేజర్ , తక్కువ ఖర్చుతో కూడిన రక్షణ సాంకేతికత కలిగిన కంపెనీలకు డిమాండ్ పెరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Black Rice Telugu News: సాధారణంగా మనమంతా తెల్ల బియ్యం తింటూ ఉంటాం.. కానీ మార్కెట్లో వివిధ రకాల రంగుతో కూడిన బియ్యాలుంటాయి. అందులో నలుపు రంగు బియ్యం ఒకటి. నిజంగా నలుపు రంగు బియ్యాన్ని ఆహారంగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన పూర్వీకులు ఎక్కువగా ఈ రంగు బియ్యాన్ని వినియోగించేవారు. రోజు మధ్యాహ్నం భోజనం తో పాటు రాత్రి డిన్నర్ లో ఈ విజయాన్ని వినియోగిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ బియ్యంలో కొన్ని రకాల అద్భుతమైన పోషకాలు కూడా లభిస్తాయని వారు చెబుతున్నారు.
బ్లాక్ రైస్ రోజు తినడం వల్ల శరీరానికి అధిక మోతాదులో ఆంథోసైనిన్ (Anthocyanin) అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బ్లాక్ రైస్ తో కలిగే లాభాలు ఇవే..
గుండె ఆరోగ్యం
ముఖ్యంగా బ్లాక్ రైస్ తినడం వల్ల గుండె ఆరోగ్యం చాలావరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా ఇందులో లభించే కొన్ని గుణాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పూర్తిగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గుండెపోటు సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు తప్పకుండా బ్లాక్ రైస్ తీసుకోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గడానికి..
ఇందులో లభించే అద్భుతమైన పీచు పదార్థం శరీరంలోని జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరిచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల శరీర బరువు కూడా ఎంతో సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజు ఉదయాన్నే తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి లభిస్తుంది.. దీనివల్ల ఎక్కువ తినాలని కోరికలు కూడా తగ్గుతాయి.. దీంతో శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
మధుమేహం నియంత్రణ
ముఖ్యంగా ఈ అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలోని చక్కర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ కు బదులుగా దీనిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
లివర్ డిటాక్స్..
నల్లబియ్యం లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయడమే కాకుండా కాలయాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇందులోని లభించే కొన్ని అద్భుతమైన గుణాలు కాలయంలో పేరుకుపోయిన మలిన పదార్థాలను బయటికి పంపించేందుకు ఎంతగానో సహాయ పడతాయి. అంతేకాకుండా తీవ్ర కాలయ వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Velugumatla Bhoodan Houses Demolish: పేదోడి ఇళ్లు, భూములపై పడి విధ్వంసం సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఖమ్మంలో చేపట్టిన ఇళ్ల కూల్చివేత దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చకు దారితీసింది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడాన్ని సీపీఐ (ఎం) అగ్ర నాయకులు, కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. బుల్డోజర్ పాలన అని అభివర్ణించారు. తెలంగాణలో విధ్వంసం చేస్తూ.. కేరళలో ప్రజలకు న్యాయం చేస్తామనడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు అని తీవ్రంగా విమర్శించారు.
Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్
ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో అక్కడి పేదలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. అకస్మాత్తుగా తెల్లవారుజామున భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఆ ఇళ్లను కూల్చివేశారు. 700 ఇళ్లకు పైగా కూల్చివేయగా.. దాదాపు 3 వేల మంది పేదలు నిరాశ్రయులుగా మారాయి. ఈ కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ కేరళం సీఎం పినరయి విజయన్ స్పందించారు. 'ఎక్స్' వేదికగా సంచలన ప్రకటన చేశారు.
Also Read: Govt Teachers: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పది నిమిషాలు లేట్ అయితే జీతం కట్!
తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని కేరళం సీఎం పినరయి విజయన్ విమర్శించారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చివేసి, 3,000 మందిని నిరాశ్రయులను చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలని కేరళం సీఎం సవాల్ చేశారు. తెలంగాణలో అణగారిన వర్గాల ఇళ్లను కూల్చి.. కేరళంలో మాత్రం ప్రజలతో నిలబడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం అవమానం.. సిగ్గుచేటు అని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు.
Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!
కేరళం ముఖ్యమంత్రి విమర్శలు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పినరయి విజయన్ స్పందనతో ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది. పినరయి విమర్శలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన నడిపిస్తున్నాడని చేస్తున్న విమర్శలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి అండగా నిలిచింది. ఇళ్ల విధ్వంసాన్ని కళ్లారా చూసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేశాక.. అక్కడ పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rahu And Ketu Retrograde 2026 Effect On Zodiac Telugu: హోలీ పండుగ తానే వచ్చేసింది.. అయితే ఈ పండగకు అన్నింటికంటే చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ హోలీ పండుగ రోజు నాలుగు ప్రధాన గ్రహాలు తిరోగమనంలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా అంతుచిక్కని గ్రహాలుగా పరిగణించే రాహు, కేతువు గ్రహాలు ఈరోజు తిరోగమనం చేయబోతున్నాయి. అలాగే బృహస్పతి గ్రహం కూడా హీరోగమనం చేయబోతోంది. చాలా ఏళ్ల తర్వాత ఈ అరుదైన యాదృచ్ఛికం ఏర్పడబోతోంది. ముఖ్యంగా హోలీ పండుగ రోజునే ఈ మూడు గ్రహాలు ఉన్నట్టుండి తిరోగమనం చేయడం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కలుగబోతోంది.
హోలీ పండగ రోజు అద్భుతమైన లాభాలు పొందే రాశులు..
వృషభరాశి
ముఖ్యంగా వృషభరాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. క్రమంగా ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిన డబ్బులు కూడా తిరిగివచ్చే సూచనలు ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మంచి క్లైంట్లను కూడా పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు కుటుంబ వాతావరణంలో కూడా అద్భుతమైన మెరుగుదల కనిపించబోతోంది. అలాగే ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
మిథున రాశి
మిధున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా ఫలప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి పొందడమే కాకుండా.. వాటి నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. అలాగే అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తిగా పరిపూర్ణమవుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చదువుకోవాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహువు కేతువు, బృహస్పతి గ్రహాల ప్రభావంతో హోలీ పండుగ నుంచి ఎన్నో రకాల అనుకూలమైన లాభాలు కలుగుతాయి. కెరీర్పరంగా కొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయి. అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలున్నాయి. పదోన్నతులు లభించడమే కాకుండా ఈ సమయంలో ఎన్నో రకాల శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు.
తులారాశి
తులా రాశి వారికి ఎన్నో రకాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు లభించడమే కాకుండా.. కొత్త ఆదాయ వనరుల పొంది వాటి నుంచి భారీ లాభాలు పొందుతారు. ఇక ఏవైనా పనులు అసంపూర్ణంగా ఉంటే.. వాటిని ఎంతో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయంలో ఎంతో సులభంగా పరిష్కారం లభించబోతోంది. అంతేకాకుండా సృజనాత్మకత పెరిగి కొన్ని పనుల్లో రాణించగలుగుతారు..
మకర రాశి
మకర రాశి వారికి ఈ మూడు ప్రభావం అద్భుతమైన ఆనందాన్ని అందించబోతోంది. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు చాలా అద్భుతంగా ఆలోచించి తీసుకోగలుగుతారు. ఏమైనా బకాయలు ఇతరులకు ఇచ్చినవి తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు కూడా లభించవచ్చు. ఇది భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసే వ్యక్తులు స్థిరమైన వృద్ధి పొందగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలగబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran War Impact On Indian Economy: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలకే పరిమితం కాకుండా, భారత సామాన్యుడి జేబుపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పప్పుల నుంచి పెట్రోల్ వరకు అన్నింటికీ 'రెక్కలు' రావడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్ వంటి వర్ధమాన ఆర్థిక వ్యవస్థలపై ఈ యుద్ధ ప్రభావం బహుముఖంగా ఉండబోతోంది. రవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరిగిన బీమా ఖర్చులు అంతిమంగా వినియోగదారుడిపైనే భారం మోపనున్నాయి.
వంటగదిపై యుద్ధ ప్రభావం
భారత్ ఏటా సుమారు 5-6 మిలియన్ టన్నుల కంది, మినుము, పెసర పప్పులను ఆఫ్రికా, కెనడా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా ఖర్చులు పెరిగి, దేశీయంగా పప్పుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మన బాస్మతి బియ్యానికి ఇరాన్ అతిపెద్ద కొనుగోలుదారు. యుద్ధ ఉద్రిక్తతల వల్ల కొత్త ఆర్డర్లు నిలిచిపోయాయి. దీనివల్ల ఎగుమతిదారులు నష్టపోయే ప్రమాదం ఉంది.
పెట్రోల్, డీజిల్ భారం
భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్ యుద్ధం తీవ్రమైతే హార్ముజ్ జలసంధి గుండా రవాణా కష్టమవుతుంది. దీనివల్ల బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, పండ్లు, కూరగాయలతో సహా అన్ని వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.
యుద్ధం కారణంగా ఎగుమతి-దిగుమతి రంగాలు గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. సముద్ర మార్గాల మార్పు (కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ప్రయాణం) వల్ల నౌకల ప్రయాణ దూరం పెరిగి, షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరుగుతాయి. ఇది భారతీయ కంపెనీల లాభాలను తగ్గించడమే కాకుండా, దేశంలో ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran War Impact On Cryptocurrency: ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లతో పాటు క్రిప్టో కరెన్సీ రంగంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జియోటస్ సీఈఓ విక్రం సుబ్బురాజ్ విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ ఆస్తుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత యుద్ధ మేఘాల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో క్రిప్టో మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మార్చి 1 నాటికి బిట్‌కాయిన్ సుమారు 66,000 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ప్రస్తుతం 65,000 డాలర్ల స్థాయి బిట్‌కాయిన్‌కు అత్యంత కీలకం. ఒకవేళ ధర దీనికంటే దిగువకు పడిపోతే, అది వేగంగా 60,000 డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. పైకి వెళ్లాలంటే 67,000 - 68,000 డాలర్ల రేంజ్‌ను దాటాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకునే సత్తా పెరిగితేనే బిట్‌కాయిన్ 70,000 డాలర్ల మార్కును చేరుకోగలదు.
మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న అంశాలు..
ఫిబ్రవరి 27న అమెరికా స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల నుండి సుమారు 27.5 మిలియన్ల డాలర్ల నిధులు బయటకు వెళ్లాయి. ఇది సంస్థాగత పెట్టుబడిదారులు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నారని సూచిస్తోంది. అలాగే మార్చి 17-18 తేదీల్లో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కీలకం కానుంది. వడ్డీ రేట్లపై వచ్చే అంచనాలు మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి. యుద్ధ భయంతో చమురు ధరలు 10 శాతం పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇది సాధారణంగా క్రిప్టో వంటి రిస్క్ ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆల్ట్‌కాయిన్ల పరిస్థితి (మార్చి 1 నాటికి)..
ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుందా? లేదా? అనే అంశంపై పాలీమార్కెట్ వంటి ప్రిడిక్షన్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 529 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.4,400 కోట్లు) ట్రేడింగ్ జరగడం గమనార్హం. భౌగోళిక రాజకీయ రిస్క్‌ను అంచనా వేయడానికి ట్రేడర్లు ఈ వేదికలను ఒక సూచికగా వాడుకుంటున్నారు.
పెట్టుబడిదారులకు సూచన..
ప్రస్తుతం మార్కెట్ విపరీతమైన ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెరివేటివ్స్ ట్రేడర్లు కట్టుదిట్టమైన రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించాలి. లాభాల కంటే మూలధనాన్ని కాపాడుకోవడం ఈ సమయంలో అత్యంత ముఖ్యం. యుద్ధ పరిస్థితులు చల్లారే వరకు క్రిప్టో మార్కెట్ ఒక పరిధిలోనే కదిలే అవకాశం ఉంది. అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం అవసరం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయం మేరకు పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Air Conditioner Power Saving Tips: వేసవి కాలంలో ఏసీ వాడకం పెరగడం వల్ల కరెంట్ బిల్లు భారీగా వచ్చే అవకాశం ఉంది. అయితే, నిపుణులు సూచిస్తున్న కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, రోజులో ఎక్కువ సమయం ఏసీ వాడినా విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఏసీ వాడటం తప్పనిసరి. కానీ బిల్లు భయంతో చాలా మంది ఏసీ వేయడానికి వెనుకాడతారు. ఈ కింది పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని పొందవచ్చు.
1) చాలా మంది ఏసీ ఆన్ చేయగానే 16 లేదా 18 డిగ్రీల వద్ద పెడతారు. దీనివల్ల కంప్రెషర్ ఎక్కువ సేపు పనిచేసి కరెంట్ బిల్లు పెరుగుతుంది. నిపుణుల సూచన ప్రకారం ఏసీని 24°C నుండి 26°C మధ్య ఉంచడం ఉత్తమం. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటుంది.
2) ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోని కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చూసుకోండి. బయటి వేడి గాలి లోపలికి రాకుండా ఉంటే, గది త్వరగా చల్లబడుతుంది. దీనివల్ల ఏసీ ఎక్కువ సేపు కష్టపడాల్సిన అవసరం ఉండదు.
3) ఏసీ వేసినప్పుడు తక్కువ స్పీడ్‌లో సీలింగ్ ఫ్యాన్ వేయడం వల్ల చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల గది మూలమూలలా చల్లదనం అందుతుంది. ఏసీపై భారం తగ్గుతుంది.
4) ఏసీ ఫిల్టర్లలో దుమ్ము చేరితే కూలింగ్ సరిగ్గా రాదు. ఫలితంగా ఏసీ ఎక్కువ కరెంట్‌ను వాడుకుంటుంది.
5) ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయడం వల్ల ఏసీ పనితీరు మెరుగుపడటమే కాకుండా కరెంట్ ఆదా అవుతుంది.
చాలా మంది ఏసీని కేవలం రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తారు. కానీ, స్విచ్ బోర్డు వద్ద మెయిన్ బటన్ ఆఫ్ చేయకపోతే కొద్దిపాటి విద్యుత్ వినియోగం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాడనప్పుడు ప్లగ్ వద్ద ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.
రాత్రి పూట నిద్రపోయేటప్పుడు టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. గది చల్లబడిన తర్వాత ఆటోమేటిక్‌గా ఏసీ ఆఫ్ అయ్యేలా చూసుకుంటే అనవసరమైన విద్యుత్ ఖర్చును అరికట్టవచ్చు. కొత్తగా ఏసీ కొనేవారు ఇన్వర్టర్ ఏసీ, 5-స్టార్ రేటింగ్ ఉన్న మోడళ్లను ఎంచుకోవడం వల్ల కరెంట్ బిల్లును 30% నుండి 40% వరకు తగ్గించుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gautam Gambhir On Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్‌పై భారత్ సాధించిన విజయంపై టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన సంజూ శాంసన్ (97* పరుగులు) ఇన్నింగ్స్‌ను మెచ్చుకుంటుంటే.. గంభీర్ మాత్రం ఈ మ్యాచ్ క్రెడిట్ మరోకరికి ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చావో-రేవో లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన టీమ్ఇండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. విండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజింగ్‌లో సంజు శాంసన్ (97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, కోచ్ గంభీర్ దృష్టిలో మాత్రం శివమ్ దూబే పోషించిన పాత్ర వెలకట్టలేనిదని చెప్పుకొచ్చాడు.
టీమ్ఇండియా 195 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరిలో ఉత్కంఠ నెలకొంది. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత, భారత్ గెలవడానికి 10 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉంది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు.
గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే..
"సాధారణంగా పెద్ద స్కోర్లు చేసిన వారే వార్తల్లో నిలుస్తారు. కానీ నాకు మాత్రం శివమ్ దూబే కొట్టిన ఆ రెండు ఫోర్లు, సంజు చేసిన 97 పరుగులంతే ముఖ్యం. ఆ రెండు బౌండరీలు పడకపోతే ఈరోజు మనం సంజు ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్లం కాదు. ఇది ఒక జట్టుగా ఆడిన ఆట. చిన్న ఇన్నింగ్స్ అయినా, కీలక సమయంలో ఇచ్చే సహకారమే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తుంది" అని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
మ్యాచ్ హైలైట్స్
తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ లో టీమ్ఇండియా కేవలం 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయి 199 రన్స్ రాబట్టింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అలాగే శివమ్ దూబే కీలక సమయంలో బాదిన ఫోర్లు భారత్‌ను విజయతీరాలకు చేర్చాయి.
సెమీఫైనల్ బెర్త్ ఖరారు
ఈ విజయంతో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లోకి చేరింది. సెమీస్‌లో భారత్ తన పాత ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో తలపడనుంది. సంజు శాంసన్ ఫామ్, దూబే ఫినిషింగ్ టచ్ చూస్తుంటే ఈసారి కప్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ వ్యాఖ్యలు జట్టులో ప్రతి ఒక్కరి ప్రాధాన్యతను గుర్తుచేశాయి. స్టార్ ప్లేయర్ల స్కోర్లతో పాటు, క్లిష్ట సమయంలో వచ్చే చిన్న సహకారాలే టోర్నీలను గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
