సాఫ్ట్వేర్ బాలికపై అత్యాచారం చేసిన వనస్థలిపురంలోని హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు
Vanasthalipuram, Telangana:వనస్థలిపురం సీఐ అశోక్‌రెడ్డి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కందుకూరు రంగారెడ్డి జిల్లా అధికారి సుధీర్‌బాబు ఆదేశాల మేరకు ఈరోజు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ బొమ్మరిల్లు కాంప్లెక్స్‌ను సీజ్ చేశారు పట్టించుకోలేదు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Cobra Video: వామ్మో.. మరుగుదొడ్డిలో ప్రత్యక్షమైన కోబ్రా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Cobra In Toilet Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో ఊహించడం కష్టం.. ఇందులో కూడ కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. కానీ, తాజాగా నెట్టింట హల్చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. నిత్యం మనం ఉపయోగించే మరుగుదొడ్డిలో ఊహించని విధంగా ఒక ప్రమాదకరమైన కోబ్రా ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాక్‌కు అవుతున్నారు.
కమోడ్‌లో ప్రత్యక్షమైన కాలనాగు..
జనాభా ఎక్కువగా ఉండే ఒక నివాస ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.. సదరు ఇంటి సభ్యులు ఎప్పటిలాగే మరుగుదొడ్డికి వెళ్లగా.. అక్కడి వెస్ట్రన్ కమోడ్‌లో ఏదో కదిలిన్నట్లు కనిపించింది. దానిని గమనించగా.. అందులో ఒక భారీ కోబ్రా పామును చూసి వారు ఒక్కసారిగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.. సాధారణంగా అడవులు, పొలాల్లో తిరిగే పాము.. ఇలా ఏకంగా ఇంట్లోని కమోడ్‌లోకి ఎలా దూరిందో అర్థం కాక.. ఆ కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు.
రంగంలోకి స్నేక్ క్యాచర్..
పామును చూసి భయాందోళనకు గురైన ఇంటి యజమానులు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. సమయానికి చేరుకున్న స్నేక్ క్యాచర్, కమోడ్‌లో నక్కి ఉన్న పామును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఆ స్నేక్ క్యాచర్ తన వద్ద ఉన్న ప్రత్యేకమైన స్టిక్‌తో పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ కోబ్రా తీవ్ర కోపంతో పైకి లేస్తూ.. బుసలు కొడుతూ దాడి చేయడానికి యత్నించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా ఊపిరి బిగబట్టి నిలబడిన్నట్లు తెలుస్తోంది. ఆ స్నేక్ క్యాచర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ.. ప్రాణాలకు తెగించి ఆ నాగుపామును రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
నెటిజన్లు షాక్...
ఈ భయంకరమైన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకపై బాత్రూమ్కు వెళ్లాలన్నా భయమేస్తోంది బాబోయ్.. అని ఒకరు కామెంట్ చేయగా.. ఇంట్లోకి పాములు రాకుండా డ్రైనేజీ పైపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని మరికొందరు సలహాలు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకరమైన పాము రావడం నిజంగా ఆందోళనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Viral Video: వైరల్ బాల బాబా నిమ్మకాయ మ్యాజిక్.. ఎంటో చూశారా?
Hyderabad, Telangana:Bala Baba Viral Video Watch Now: సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకో వింతైన వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో కొన్ని సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని తీవ్ర చర్చలకు దారితీస్తూ ఉంటాయి.. తాజాగా ఒక బాల బాబాకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. నీటిపై ఉన్న నిమ్మకాయను ఒక బాల బాబా తన మాయతో పైకి లేపడం మీరు చూడొచ్చు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వైరల్ వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న ఆ వీడియోను గమనిస్తే.. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బాల బాబా నీటిలో కూర్చుని ఉండడం మీరు గమనించవచ్చు. అతని ముందు నీటిలో ఒక నిమ్మకాయ మునిగి ఉండడం మీరు చూడొచ్చు.. ఆ బాల బాబా తన చేతులను గాల్లో ఆడిస్తూ.. ఏదో మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తూ.. కెమెరా వైపు చూడడం మీరు గమనించవచ్చు. అంతే, క్షణాల వ్యవధిలో నీటి అడుగున ఉన్న ఆ నిమ్మకాయ నెమ్మదిగా పైకి లేచి.. నీటిపై తేలడం మీరు చూడొచ్చు. తనకున్న అద్భుత శక్తులతోనే ఆ నిమ్మకాయను నీటిపైకి లేపాడం చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అవుతున్నారు..
నెటిజన్ల ట్రోలింగ్..
ఈ వీడియో ఊహించని స్థాయిలో వ్యూస్, లైకులను సంపాదించుకుంది.. కొందరు భక్తులు ఇది దైవ శక్తి.. బాల బాబా మహిమ అంటూ కామెంట్లు పెడుతుండగా.. మెజారిటీ నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఫేక్ వీడియో.. జనాలను మోసం చేయడానికి చేస్తున్న విన్యాసం అని కొంతమంది కామెంట్ చేయగా.. సైన్స్‌ను నమ్మండి, ఇలాంటి మూఢనమ్మకాలను కాదని మరొకరు కామెంట్లు రాసుకొచ్చారు.
మరికొందరు ఈ వీడియోను పూర్తిగా పరిశీలించి.. ఇది కేవలం వీడియో ఎడిటింగ్ ట్రిక్ లేదా గ్రాఫిక్స్ (VFX) అని కొట్టిపారేస్తున్నారు. నిమ్మకాయకు సన్నటి దారం కట్టి పైకి లాగడం లేదా రివర్స్ వీడియో టెక్నిక్ ఉపయోగించి ఉండవచ్చని కొంతమంది నెటజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
నిజానికి నీటిలో నిమ్మకాయ తేలడం వెనుక ఎలాంటి మంత్రాలు.. తంత్రాలు లేవని, ఇది కేవలం సాంద్రత (Density) ఆధారంగా జరిగే ఒక చిన్న సైన్స్ ప్రయోగమని నిపుణులు చెబుతూ వస్తున్నారు. సాధారణ నీటిలో నిమ్మకాయ మునుగుతుంది. కానీ.. ఆ నీటిలో ఎక్కువ మొత్తంలో ఉప్పు (Salt) కలిపితే నీటి సాంద్రత పెరుగుతుంది. అప్పుడు నిమ్మకాయ మునగకుండా పైకి తేలుతుందని అన్నారు. ఈ వీడియోలో కూడా బాల బాబా కూర్చున్న నీటిలో ఏదైనా కెమికల్ లేదా ఉప్పు కలిపి ఉండవచ్చని, లేదా కెమెరా ట్రిక్స్ వాడి ఉండవచ్చని వారు తెలుపుతున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
షాకింగ్ ప్రైస్.. అమెజాన్‌లో రూ.25 వేల Realme 5G ఫోన్ కేవలం రూ.849కే..
Hyderabad, Telangana:Realme Narzo 100 Lite 5G Price Cut: మీరు కొత్త ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు ఇది అద్బుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసిన రియల్‌మి నార్జో 100 లైట్ 5G (realme narzo 100 Lite 5G) స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అసలు ధరపై ఏకంగా వేల రూపాయల తగ్గింపును అందిస్తూ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చాలా ఛీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
MRPపై ఏకంగా రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్..
ప్రస్తుతం రియల్మీ కంపెనీ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర (MRP) రూ. 24,999తో విక్రయిస్తోంది. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్ ఆఫర్లలో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ. 10,000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది.. ఈ భారీ డిస్కౌంట్ వినియోగిస్తూ.. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు కేవలం రూ.14,999 లోపే సొంతం చేసుకోవచ్చు.. బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారి ఇది ఒక గొప్ప డీల్ అని భావించవచ్చు.
అదనపు బ్యాంక్ ఆఫర్స్..
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత తగ్గింపు అందించేందుకు అమెజాన్ అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో Amazon Pay ICICI లేదా HSBC Bank క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ చేస్తే.. అదనంగా దాదాపు రూ.749 వరకు తక్షణ తగ్గింపు (Instant Discount) పొందవచ్చు. అలాగే కంపెనీ వీటిని అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చీప్ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఊహించని తగ్గింపు..
ఈ సేల్‌లో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే.. అమెజాన్ అందిస్తున్న భారీ ఎక్స్ఛేంజ్ బోనస్.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. ఈ సరికొత్త రియల్‌మి ఫోన్‌పై దాదాపు రూ.14,150 వరకు అదనపు బోనస్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పూర్తిగా క్లెయిమ్ చేసుకోగలిగితే.. అన్ని ఆఫర్లు పోను ఈ ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.849 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, రూ.25 వేల విలువైన ఫోన్‌ను ఇంత తక్కువ ధరకు లభించడం నిజంగా ఊహించని ఆఫర్‌గానే చెప్పొచ్చు.. అయితే, ఈ బోనస్ అనేది పాత స్మార్ట్‌ఫోన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ వర్కింగ్ కండీషన్లో ఉంటేనే లభిస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amazonలో Redmi Turbo 5 ఫోన్‌పై రూ.53,000 తగ్గింపు.. ఎలా కొనాలో చూడండి!
Hyderabad, Telangana:Redmi Turbo 5 Offer News: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ కస్టమర్ల కోసం.. అదిరిపోయే ప్రత్యేక డీల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన పనితీరుతో మార్కెట్లో మంచి డిమాండ్ సొంతం చేసుకున్న Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లను అందిస్తూ.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ అందించింది. రూ.55 వేల విలువైన ఈ ఫోన్‌ను కస్టమర్లు ఇప్పుడు అత్యంత చీప్ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది. అయితే, అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్‌ను అందిస్తోంది? ఎలా కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చో? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లాట్ డిస్కౌంట్‌తో భారీగా తగ్గిన ధర..
మార్కెట్లో Redmi Turbo 5 అసలు ధర (MRP) రూ.54,999తో అందుబాటులో ఉంది.. అయితే, అమెజాన్ అందిస్తున్న స్పెషల్ డీల్స్‌లో భాగంగా భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.17,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉండడం విశేషం. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత కస్టమర్లు ఈ ఫోన్‌ను చీప్ ధరకే రూ.37,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరింత తగ్గింపు కావాలనుకునేవారు తప్పకుండా ఎక్చేంజ్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది.
అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.2,000 తగ్గింపు..
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్ల కోసం అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో ప్రముఖ బ్యాంకులైన Amazon Pay ICICI, SBI బ్యాంక్, Kotak బ్యాంక్‌తో పాటు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి.. పేమెంట్ చేస్తే, కస్టమర్లకు దాదాపు రూ.2,000 వరకు అదనపు ఇన్స్టంట్ తగ్గింపు పొందవచ్చు. దీనితో ఫోన్ ధర మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయి..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
కేవలం రూ.1,900కే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చా?
ఈ ఆఫర్లలో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్.. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల గరిష్టంగా రూ.36,099 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. అయితే, మీరు ఈ పూర్తి ఎక్స్ఛేంజ్ బోనస్ పొందితే.. అన్ని ఆఫర్లు పోను ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,900 లోపే మీ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మీరు ఎక్చేంజ్ చేసే పాత మొబైల్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు భారీ ఎక్చేంజ్ ఆఫర్ లభిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ చీప్ ధరకే సొంతం చేసుకొవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit: పుష్య నక్షత్రంలోకి సూర్యుడి సంచారం.. ఆగస్టు 3 వరకు ఆ రాశుల వారికి అదృష్ట కాలం..
Hyderabad, Telangana:Sun Transit In Pushya Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడి నక్షత్ర మార్పుకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. రాబోయే జూలై 20, సోమవారం ఉదయం 11:33 గంటలకు ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలకు కారకుడైన సూర్య దేవుడు తన స్థానాన్ని మార్చుకుని పుష్య నక్షత్రం లోకి సంచారం చేయబోతున్నాడు.
ఆగస్టు 3వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. సూర్యుడి ఈ నక్షత్ర మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ.. ముఖ్యంగా నాలుగు రాశుల వారి జీవితాలను పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా విపరీతమైన ధన లాభాలు కలగడమే కాకుండా.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి (Leo)
సింహ రాశికి అధిపతి సూర్యుడే కావడం వల్ల ఈ నక్షత్ర సంచారం వీరికి అద్భతమైన లాభాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.. ధన లాభం కలగడం వల్ల మానసిక ప్రశాంతత కూడా సులభంగా లభించబోతోంది..
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి జీవితంలో సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి.. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా బలంగా మారుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఏదైనా పెద్ద సమస్య లేదా ప్రమాదం నుంచి స్నేహితుల సహాయంతో సురక్షితంగా బయపడే అవకాశాలు ఉన్నాయి.. ఆఫీసులో పెద్ద బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.
మేష రాశి (Aries)
మేష రాశివారికి సూర్యుని నక్షత్ర సంచారంతో పనితీరులో అద్భుతమైన విజయాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక స్థిరత్వం గణనీయంగా పెరుగుతుంది.. వృత్తి జీవితంలో మెరుగైన అవకాశాలు కలుగుతాయి. మీ శ్రమకు కార్యాలయంలో అద్బుతమైన గుర్తింపు, ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా సులభంగా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు వస్తాయి.. సామాజికంగా మీ గౌరవ ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం ఒక వరం లాంటిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వివిధ మార్గాల నుంచి వీరు తప్పకుండా ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్లో పెద్ద పురోగతిని సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.. ఇవి మీ వ్యాపార లేదా వృత్తి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Labhadrishti Rajayoga: శని, కుజుల లాభదృష్టి రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Saturn Mars 60 Degree Conjunction Telugu News: వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక గ్రహాలు కలిసి వివిధ యోగాలను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ యోగాలు అన్ని రాశుల పైన ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే 2026 జూలై 19వ తేదీన ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటిగా భావిస్తారు. కుజ శని గ్రహాల కలయిక కారణంగా.. ఒక దానికి ఒకటి 60 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఎంతో శక్తివంతమైన లాబదృష్టి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆనందంతో పాటు శ్రేయస్సు ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన వృద్ధి కూడా పెరగడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరబోతున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి లభించబోతా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు. వీరికి ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. అయితే, ఈ మూడు రాశుల వారికి లాభదృష్టి రాజయోగం అద్భుతమైన ఫలితాలను అందించబోతుందో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి లాభాలే..
మేషరాశి
శని కుజ గ్రహాలు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల నాలుగు రాశుల వారిలో ముఖ్యంగా మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.. ఈ కాలంలో వైవాహిక జీవితంలో అద్భుతమైన ప్రశాంతత లభించబోతోంది. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో విపరీతమైన పురోగతి సాధించే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఉన్నత అధికారుల తో మంచి పరిచయాలు ఏర్పడి పదోన్నతులు కూడా వారి నుంచి పొందే అవకాశాలున్నాయి. ఈ సమయంలో సహుద్యోగులు కూడా పనిలో మీకు తోడు ఉండడం వల్ల ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో భారీ ధన లాభాలు కూడా పొందగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా అదృష్టం విపరీతంగా లభిస్తుంది.
వృశ్చిక రాశి
ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అదృష్టాన్ని కలిగించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో విపరీతమైన ప్రయోజనాలు కలగడమే కాకుండా.. మానసిక సమస్యలు తొలగిపోబోతున్నాయి. అలాగే ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగి శారీరక బలం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు శత్రుత్వం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు అందరితో స్నేహంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు తప్పకుండా ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీని కారణంగా వీరు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో వచ్చే అన్ని సమస్యలు సులభంగా పరిష్కారం కాబోతున్నాయి..
మకర రాశి
మకర రాశి లో జన్మించిన వ్యక్తులకు కూడా శని కుజ గ్రహాల ప్రభావం ఊహించని స్థాయిలో పడుతుంది. దీని కారణంగా వీరికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. వీరికి ఊహించని స్థాయిలో అదృష్టం కూడా కలిసి రాబోతోంది. ఈ సమయంలో కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. వీరి జీవితం పై విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుని అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన పాత పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కూడా గొప్ప పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా విపరీతంగా ఏర్పడి అవసరమైన ఒత్తిడిని వదిలేసుకునే అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా ఇతరులతో మంచి సమయాన్ని గడుపుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Skoda Kodiaq RS: జనానిది కడుపు మంటా? కారు క్రేజా? అంతలా ఏకిపారేసి.. 6 నిమిషాల్లో ఎలా కొనేశారయ్యా బాబూ..!!
Secunderabad, Telangana:Skoda Kodiaq RS: స్కోడా భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన వాహన శ్రేణిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ తన కొత్త కోడియాక్ ఆర్ఎస్ ఎస్ యూవీని మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. జూన్ 22 నుంచి కోడియాక్ ఆర్ఎస్ కోసం అధికారికంగా బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. అయితే లాంచ్ కు ముందే ఈ ఎస్ యూవీ భారీ సక్సెస్ సాధించింది. అన్ని యూనిట్లు కేవలం నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. స్కోడా ఈ ఎస్ యూవీని లిమిటెడ్ ఎడిషన్ గా అందిస్తోంది కంపెనీ. బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ ఎస్ యూవీ కోసం పోటెత్తారు.
మొత్తం 20 యూనిట్లు కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. కోడియాక్ ఆర్ఎస్ బుకింగ్‌లను ప్రారంభించడానికి ముందు.. భారతదేశంలో కేవలం 50 యూనిట్లను మాత్రమే విక్రయిస్తామని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తదుపరి బ్యాచ్‌ను భారతదేశానికి తీసుకువస్తుందో లేదో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ శక్తివంతమైన ఎస్యూవీ భారతదేశంలోకి పూర్తిగా నిర్మించిన యూనిట్‌గా దిగుమతి కానుంది. ఫలితంగా, దిగుమతి చేసుకున్న వాహనాలపై అధిక పన్ను భారం కారణంగా భారతదేశంలో దీని ధర ఎక్కువగా ఉంటుంది.
కోడియాక్ RS దాని రూపాన్ని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంచుకుంది. కానీ RS బ్యాడ్జింగ్, స్పోర్టీ హంగులను కలిగి ఉంది. ఇందులో గ్లాస్ బ్లాక్ గ్రిల్, మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు, బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు, పెద్ద అల్లాయ్ వీల్స్ దీని దూకుడు రూపాన్ని మరింత పెంచుతాయి.
ఈ 7-సీటర్ SUVలో అనుసంధానించిన LED టెయిల్ ల్యాంప్‌లు, బ్యాక్ సైడ్‌లో స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి. క్యాబిన్ కూడా విశాలంగా ఉండి, ప్రయాణీకులందరికీ తగినంత స్థలాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. దీని క్యాబిన్లో స్పోర్ట్ సీట్లు, లెదర్, స్యూడ్ ఫినిషింగ్‌లు, ఎరుపు రంగు కుట్లు, RS బ్రాండింగ్ ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 13-స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ ఎస్‌యూవీకి 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 265 హెచ్‌పి, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్, వోక్స్వ్యాగన్ గోల్ఫ్ జిటిఐలకు శక్తినిచ్చే ఇంజన్ కూడా ఇదే. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఇది నాలుగు చక్రాలకూ శక్తిని అందిస్తుంది.
భద్రత పరంగా చూస్తే.. ఈ ఎస్‌యూవీలో9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, హిల్ అసిస్ట్, లెవెల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.
8-లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగిన ఈ మూడు వరుసల SUV, అన్ని సీట్లను మడిచినప్పుడు 281 లీటర్ల బూట్ స్పేస్‌ను, కేవలం మూడవ వరుసను మడిచినప్పుడు 786 లీటర్లను, రెండవ, మూడవ వరుసలను మడిచినప్పుడు ఏకంగా 1,976 లీటర్ల స్థలాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలోనే పూర్తిగా అమ్ముడైపోవడం భారత మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీలకు వేగంగా పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని చెప్పాలి. కోడియాక్ ఆర్ఎస్ ఈ విభాగంలో ఒక కొత్త సంచలనాన్ని సృష్టించింది.
Also Read: జూలైలో మరింత పతనం.. 10గ్రాముల పసిడి రూ. 1 లక్షకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
ఆర్టీసీ బస్సులో సిగరెట్ కాల్చిన కండక్టర్.. మద్యం మత్తులో వీరంగం
Vinukonda, Andhra Pradesh:RTC Bus Cigarette Smoke: ఎంతో మంది ప్రయాణికులను ప్రజా సేవగా భావించి వారితో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆర్టీసీ కండక్టర్ రెచ్చిపోయాడు. తాగి విధులకు హాజరవడమే కాకుండా తాగిన మైకంలో అనుచితంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో దుర్భాషలాడుతూ వారిపై బూతు పంచాంగం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా బస్సులోనే సిగరెట్ కాలుస్తూ వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వైరల్‌గా మారిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆర్టీసీ కండక్టర్ అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సంఘటన వినుకొండలో జరగడం కలకలం రేపింది. మద్యం మత్తులో బస్సులోనే సిగరెట్ కాలుస్తూ.. ఇదేమిటని ప్రశ్నించిన ప్రయాణికులను అసభ్య పదజాలంతో దూషించాడు. బొల్లపల్లి మండలం దోమలగుండం గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్యూటీ ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఒక ఆర్టీసీ కండక్టర్ ఎక్కాడు.
అతడు అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో తూగుతున్నాడు. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సులోనే నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ పొగతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అతడిని ప్రయాణికులు వారించబోగా ఆ కండక్టర్ మరింత రెచ్చిపోయాడు. తాగిన మైకంలో ప్రయాణికులతో అసభ్యకర రీతిలో ప్రవర్తించడమే కాకుండా బూతుల పంచాంగం మొదలుపెట్టాడు. అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు.
అతడు బస్సులో వ్యవహరించిన తీరుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తమకు రక్షణగా.. ఆదర్శంగా ఉండాల్సిన ఆర్టీసీ సిబ్బందే ఇలా ప్రవర్తించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఆ కండక్టర్‌పై అంతర్గత విచారణకు ఆర్టీసీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అతడిని విధుల నుంచ సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్ల తెలుస్తోంది.
శైలజా రామయ్యర్‌కు స్థాన చలనం.. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
Hyderabad, Telangana:Telangana IAS Officers Transfers: పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారులకు స్థాన చలనం కల్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారిన రోజే ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన శాఖలకు సంబంధించిన అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అధికారుల మార్పులు చేర్పులు జరిగాయి. 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ జరగ్గా ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేవాదాయ శాఖ నుంచి బదిలీ
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు జరిగాయి. 13 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు ప్రభుత్వం ఇచ్చింది. జీఓ ఆర్టీ నంబర్ 914ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ నియమితులవగా.. దేవాదాయ శాఖ నుంచి ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖకు శైలజా రామయ్యర్ బదిలీ అయ్యారు. ఇక పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్ పోస్టింగ్ లభించింది.
రాహుల్ బొజ్జాకు స్థాన చలనం
డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియామకం కాగా.. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీజీఆర్‌ఈడీసీఓ వీసీ, ఎండీగా ముషర్రఫ్ అలీ ఫారూఖీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. హ్యాండ్లూమ్స్, టెక్ట్స్‌టైల్స్ స్పెషల్ సీఎస్‌గా పి. కాత్యాయిని దేవి నియమితులవగా.. టీజీఆర్‌ఈఆర్‌ఏ ఈడీ కె. గంగాధర్‌కు ఆర్ అండ్ బీ శాఖలో పోస్టింగ్ లభించింది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా టి. వెంకన్న బదిలీ కాగా.. టూరిజం డైరెక్టర్‌గా కె. విద్యాసాగర్ నియామకం అయ్యారు. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కే. చంద్రకళకు ఎఫ్ఏసీ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.
అదనపు బాధ్యతలు
మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శిగా ఎం. రఘునందన్ రావుకు పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించగా.. టీజీ ట్రాన్స్‌కో వీసీ,ఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీకి ఎఫ్ఏసీ బాధ్యతలు ప్రభుత్వం ఇచ్చింది. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా విద్యాసాగర్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. శంషాబాద్ జోనల్ కమిషనర్ కె. చంద్రకళకు హెచ్ఎండీఏలో ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చింది. కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులైన సంజయ్ జాజుకి అదనపు బాధ్యతల కొనసాగింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు సంజయ్ జాజుకే సీఎస్‌గా అవకాశం ఇచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ అదనపు బాధ్యతలు కొనసాగించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా కూడా సంజయ్ జాజు కొనసాగనున్నారు. స్పీడ్ వ్యవస్థ బాధ్యతలు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దే ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఆందోళన.. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హత్యకు కుట్ర?
Hyderabad, Telangana:RS Praveen Kumar Security Withdraw: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తొలగించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలను ఎత్తి చూపుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తీసేస్తే ఆయనను చంపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా అనే అనుమానం కలుగుతోందని గులాబీ పార్టీ పేర్కొంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపుపై హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తొలగించడం సరైంది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
కక్ష సాధింపు చర్యలు
'ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతుండడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అసహనంతో నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి ఐపీఎస్ అధికారి, అనేక అవార్డ్స్ వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాల కార్యదర్శిగా అద్భుతంగా పని చేశారు. కాంగ్రెస్ హయాంలో సమర్థవంతంగా కూడా ఆయన పనిచేశాడు. సమర్థవంతంగా పనిచేయడంతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రాణహానీ ఉంది' అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సెక్యూరిటీ తీసేస్తే ఎలా?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బతికినంత కాలం సెక్యూరిటీ ఇవ్వాలని ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధంగా ప్రవీణ్ కుమార్ భద్రతా తొలగించారు. రాష్ట్రపతి అవార్డు, సెక్యూరిటీ అవార్డు పొందిన ప్రవీణ్ కుమార్‌కే సెక్యూరిటీ తీసేస్తే ఎలా?' అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. సిర్పూర్- కాగజ్‌నగర్ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తీసేస్తే ఆయన్ని చంపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అనే అనుమానం కలుగుతుంది' అని సంచలన ఆరోపణలు చేశారు.
'రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కూడా ప్రాణహాని ఉన్న అధికారులకు భద్రత ఇవ్వాలని చెబుతుంది. ప్రజా జీవితంలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పెంచాల్సింది పోయి తీసేయడం ఎంతవరకు సమంజసం?' అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఆపద పొంచి ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. ముప్పు ఉన్నవారికి సెక్యూరిటీని ఇష్టానుసారంగా తీసేస్తే కోర్టులు ఒప్పుకోవని గుర్తుచేశారు.
వందకు వంద శాతం
'రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల సెక్యూరిటీ తీసేస్తే, భవిష్యత్ లో ఊర్లో తిరగలేరు, ఇంట్లో ఉండలేరు' అని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
EPF Investment: నెలకు రూ.1,800 పొదుపు చేస్తే చాలు.. రిటైర్మెంట్ నాటికి ఏకంగా రూ.19 లక్షలు.. EPF మ్యాజిక్ లెక్కలివే..!!
Secunderabad, Telangana:EPF Investment: పదవి విరమణ తర్వాత భారీగా నిధిని నిర్మించుకోవాలంటే.. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వంటి స్కీములో చేసే.. చిన్న క్రమమైన పెట్టుబడులు దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ కాలక్రమైనా పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈపీఎఫ్ పై 8.25శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది.ఇదొక సురక్షితమైన ఆకర్షణీయమైన పొదుపు ఎంపికగా నిలుస్తుందని చెప్పాలి.
ఒక ఉద్యోగి ఈపీఎఫ్ కు నెలకు 1800 రూపాయలు జమ చేసినట్లయితే ఆ మొత్తం ఒక ఏడాదిలో 21,600రూపాయలు అవుతుంది. ఈ పెట్టుబడి 25 ఏళ్ల పాటు నిరంతరంగా కొనసాగినట్లయితే.. మొత్తం డిపాజిట్ సుమారుగా 5.4 లక్షలు అవుతుంది. అయితే వడ్డీ, చక్రవడ్డీ కారణంగా చివరి నిధి అనేక రేట్లు ఎక్కువగా పెరుగుతుంది. 25 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం సుమారు 18 లక్షల నుంచి 19 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీనిలో కేవలం వడ్డీ నుంచే సుమారుగా 13 లక్షల రూపాయలు పొందవచ్చు.
ఈపీఎఫ్ అతిపెద్ద బలం.. కాలంతోపాటు చక్రవడ్డీ అని చెప్పాలి. ప్రారంభ సంవత్సరాల్లో వడ్డీ తక్కువగా ఉంటుంది. కానీ మొత్తం డిపాజిట్ పెరిగినా కొద్దీ వడ్డీ మొత్తం వేగంగా పెరుగుతూనే ఉంటుంది. అందుకే దీర్ఘకాలం పాటు పెట్టుబడిలో ఉండటం చాలా కీలకమని చెప్పాలి. ముందుగానే ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ కి నిరంతరం చెల్లింపులు చేసేవారు తమ రిటైర్మెంట్ నాటికి భారీ నిధిని పొందుతారు.
ఉద్యోగి జీతం పెరిగినా కొద్దీ వారి ఈపీఎఫ్ వాటా కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇది వారి రిటైర్మెంట్ నిధికి వేగంగా పెంచుకునేందుకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా బోనసులు, ఇంక్రిమెంట్లు లేదా అదనపు ఆదాయాన్ని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే రిటైర్మెంట్ నాటికి నిధి మరింత పెరుగుతుందని చెప్పాలి. ఈ విధమైన క్రమబద్ధమైన పెట్టుబడి దీర్ఘకాలంలో ఆర్థిక భద్రతను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2021 బడ్జెట్ తరువాత ఈపీఎఫ్ ఫై పన్ను నిబంధనలు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఉద్యోగి వ్యక్తిగత వాటా 2.5 లక్షలు దాటితే ఆ అదనపు మొత్తం పై వచ్చే బట్టి పన్ను పరిధిలోకి వస్తుంది. టీడీఎస్ కు లోబడి ఉంటుంది. ఈ నిబంధన ఉద్యోగి వాటాకు మాత్రమే వర్తిస్తుందని చెప్పాలి. యజమాని వాటాకు వర్తించదు. ఉద్యోగులు పరిమితంగా సమతుల్యంగా పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ఈ విధంగా ప్రోత్సహిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ పరిమితిని వారి కోసం 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచింది ప్రభుత్వం. కేవలం జనరల్ ఈపీఎఫ్ కు మాత్రమే క్రమ తప్పకుండా చెల్లింపు చేసే వారిపై ముఖ్యంగా ఆ చెల్లింపు నెలకు 1800రూపాయలకే పరిమితమైనప్పుడు ఈ నిబంధన ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పాలి
నెలకు కేవలం 1800 రూపాయల పొదుపుతో దీర్ఘకాలంలో సుమారు 19లక్షలు ఎలా సృష్టించవచ్చో ఈ ఉదాహరణతో తెలుసుకున్నాం. క్రమశిక్షణ, సమయం, నిలకడతో కూడిన ఈపీఎఫ్ వంటి స్కీం పదవి విరమణ కోసం బలమైన ఆర్థిక భద్రతను కల్పిస్తుందని చెప్పాలి. అందుకే చక్రవడ్డీ పూర్తి ప్రయోజనాలు పొందడానికి పెట్టుబడులను ముందుగానే ప్రారంభించి వాటిని నిలకడగా కొనసాగించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
Also Read: ముడి చమురు ధరలు భారీ పతనం.. నేడు జూన్ 26వ తేదీ పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: యాపిల్ యూజర్లకు బిగ్ షాక్.. మ్యాక్ బుక్, ఐప్యాడ్ ధరలు ఏకంగా 1లక్ష వరకు పెంపు..!!
Also Read: AI ఇంజనీర్ ఉద్యోగానికి రిజైన్.. వ్యవసాయం చేస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్న యువకుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అలర్ట్.. త్వరలోనే కీలక ప్రకటన.. 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!!
Secunderabad, Telangana:8th Pay Commission: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఎనిమిదవ వేతన సంఘంపై ఒక కీలక అప్డేట్ వెలువడింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్, జీతాల పెంపు, పెన్షన్ సంస్కరణలకు సంబంధించి కమిషన్ తన ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. దీంతో సుమారు 1.9 కోట్ల మందికి నేరుగా లబ్ధి పొందేలా ఈ సమావేశాలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. 2025 నవంబర్ 3వ తేదీన 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన ఒక తాత్కాలిక కమిషన్ ఇది. తన సిఫార్సులను సిద్ధం చేసేందుకు ఈ కమిషన్ కు 18 నెలల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2027 మధ్య నాటికి ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది . అయితే కమిషన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాల సూచనలు, ఫిర్యాదులను సేకరిస్తుంది. సమాజంలో ప్రతి వర్గం వారి అభిప్రాయాలను చేర్చడమే ఈ కమిషన్ లక్ష్యం. వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను వినేందుకు కమిషన్ పలు రాష్ట్రాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. కమిషన్ అధికారిక సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంది.
-2026 మే 29న కమిషన్ మెమోరాండం లను సమర్పించేందుకు గడువును 2026 మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు పొడిగించింది. దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు వీలు కల్పించింది.
-2026 జూలై 9, 10వ తేదీల్లో కోల్ కతాలో భాగస్వాములైన వారితో సమావేశం జరుగుతుందని కమిషన్ ప్రకటించింది.
-మే 26వ తేదీ భువనేశ్వర్ పర్యటనకు సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా జారీ చేసింది. దీనిలో భాగంగా జులై 6, 7వ తేదీల్లో ఉద్యోగ సంఘాల నుంచి సూచనలు స్వీకరిస్తుంది.
- మే 21వ తేదీన లక్నోలో.. జూన్ 22, 23 తేదీల్లో జరగాల్సి ఉన్న చర్చలు ఇప్పుడు పూర్తయ్యాయి. అంతకుముందు 2026 మే 13, 14వ తేదీల్లో ఢిల్లీలో ఉద్యోగ సంఘాలు, ఇతర భాగస్వాములతో కూడా సమావేశాలు నిర్వహించింది.
అయితే ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లేదా జీతాల పెంపునకు సంబంధించి కమిషన్ ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. రానున్న నెలలో వేతన నిర్మాణాన్ని నిర్ణయించడంలో ఈ చర్చలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. గత వేతన సంఘాల్లో 6వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86 ఉండగా.. 7వ వేతన సంఘంలో దాన్ని 2.57 గా నిర్ణయించారు. అయితే ఈసారి ఉద్యోగ సంఘాలు అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ చేస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల పై ప్రభావం చూపనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల ఆదాయం, జీవనశైలి మారే ఛాన్స్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు కమిషన్ సమావేశాలు తాజా సమాచారాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ సమావేశాల్లో చేసే సూచనలు డిమాండ్ లు భవిష్యత్తులో వారి జీతభత్యాలు, పెన్షన్లకు ఆధారమవుతాయి.
Also Read: ముడి చమురు ధరలు భారీ పతనం.. నేడు జూన్ 26వ తేదీ పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: యాపిల్ యూజర్లకు బిగ్ షాక్.. మ్యాక్ బుక్, ఐప్యాడ్ ధరలు ఏకంగా 1లక్ష వరకు పెంపు..!!
Also Read: AI ఇంజనీర్ ఉద్యోగానికి రిజైన్.. వ్యవసాయం చేస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్న యువకుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Husband Support Pregnancy: ప్రెగ్నెన్సీ కేవలం తల్లి ప్రయాణం కాదు..భర్త తోడుంటేనే అది 'సంపూర్ణం' అవుతుంది!
Hyderabad, Telangana:Husband Support Pregnant Wife: సాధారణంగా గర్భధారణను కేవలం ఒక మహిళకు సంబంధించిన విషయంగానే అందరూ చూస్తుంటారు. కానీ, నిజానికి ఏ మహిళ కూడా ఈ ప్రయాణాన్ని ఒంటరిగా సాగించాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలలు ఆమె బిడ్డను గర్భంలో మోస్తున్నప్పటికీ, ఆ అనుభూతి తల్లిదండ్రులిద్దరికీ చెందుతుంది. ఈ సమయంలో భర్త అందించే తోడ్పాటు ఆ తొమ్మిది నెలలను మరింత ఆరోగ్యకరంగా, ఒత్తిడి లేకుండా, సంతోషంగా మార్చగలదు.
చాలా మంది భర్తలు తమ భార్యను ఆసుపత్రికి చెకప్‌ల కోసం తీసుకెళ్తే బాధ్యత తీరిపోయిందని భావిస్తారు. అది మంచి విషయమే అయినప్పటికీ, భర్త పాత్ర అంతకంటే చాలా పెద్దదని ఫెర్నాండేజ్ హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ పల్లవి చంద్ర రావుల అంటున్నారు.
శారీరక, మానసిక మార్పులను అర్థం చేసుకోండి..
గర్భధారణ సమయంలో మహిళల్లో శారీరక అసౌకర్యాలు, హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్ (భావోద్వేగాల హెచ్చుతగ్గులు), ప్రసవం, భవిష్యత్తుపై ఆందోళనలు సహజం. కొన్ని రోజులు ఆమె చాలా ఉత్సాహంగా ఉండవచ్చు, మరికొన్ని రోజులు విపరీతమైన నీరసం, అలసట లేదా ఒత్తిడికి గురికావచ్చు. ఇలాంటి సమయాల్లో భర్త చూపించే ఓర్పు, అవగాహన ఆమెకు కొండంత అండగా నిలుస్తాయి.
చిన్న చిన్న పనుల్లో..పెద్ద సాయం!
భార్యకు మద్దతుగా నిలవడం అంటే పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, రోజువారీ చిన్న విషయాల్లో తోడుగా ఉంటే చాలు. అలాగే ఆమెకు నచ్చిన ఆరోగ్యకరమైన వంటకాలు చేయడం, తగినంత నీరు తాగమని గుర్తుచేయడం, విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహించడం వంటివి చేస్తుండాలి.
ఇంటి పనులను పంచుకోవడం వల్ల తనపై భారం తగ్గిందనే భరోసా ఆమెకు లభిస్తుంది. సాయంత్రం వేళల్లో ఆమెతో కలిసి కాసేపు నడవడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడటమే కాకుండా శారీరకంగానూ మంచిది.
డాక్టర్ చెకప్స్, లేబర్ రూమ్‌లో భర్త పాత్ర
వైద్య పరీక్షలకు భార్యతో కలిసి వెళ్లడం వల్ల గర్భం ఏ విధంగా సాగుతోందో భర్తలకు అవగాహన వస్తుంది. డౌట్స్ ఉంటే డాక్టర్‌ను అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ప్రసవానికి ముందు ఇచ్చే క్లాసులకు (Antenatal classes) దంపతులు కలిసి హాజరైతే ప్రసవ వేదనను ఎలా తట్టుకోవాలో, బిడ్డ పుట్టాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక స్పష్టత వస్తుంది.
ముఖ్యంగా ప్రసవ వేదన (Labor Pain) సమయంలో భర్త తోడుండటం ఎంతో అవసరం. ఆ శారీరక, మానసిక శ్రమ సమయంలో భార్య చేయి పట్టుకోవడం, ధైర్యం చెప్పడం, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం వల్ల ఆమెలో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో వచ్చే భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు. కొన్నిసార్లు ఆమె బాధను చూసి వెంటనే ఏదో ఒక పరిష్కారం చెప్పేయడం కంటే, ఆమె చెప్పేది ఓపిగ్గా వినడమే ఒక భర్త ఇవ్వగల అతిపెద్ద మానసిక మద్దతు.
చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక బిడ్డకు తండ్రి అయ్యే బాధ్యత డెలివరీ రూమ్ బయట ప్రారంభం కాదు. అది నెలల ముందే.. ఇద్దరూ కలిసి పంచుకునే బాధ్యత, సంరక్షణ ద్వారా మొదలవుతుంది. గర్భధారణ సమయం నుండి భార్యకు తోడుగా ఉండే భర్త, ఆమెకు మాత్రమే కాదు.. పుట్టబోయే తన బిడ్డకు కూడా ఒక సురక్షితమైన, అందమైన భవిష్యత్తును అందిస్తున్నాడని మరవద్దు.
Also Read: భోజనం చేసిన తర్వాత నడిస్తే ఏం జరుగుతుంది? తిన్నాక
Also Read: కోడి కాళ్ల కూర తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? ఎవ్వరూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
