తారామతి పేట్ లో భారీ చోరి,30 తులాల బంగారు ఆభరణాలు కిలో వెండి అపహరణ
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు ఆనుకుని ఉన్న తారామతిపేట్ గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి అపహరించారు. ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. 8 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో 18 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని, ఆ సమయంలో పోలీసులు 1 తులాల బంగారం కూడా రికవరీ చేయలేదని మీకు తెలియజేద్దాం. పోలీసులు దొంగలను పట్టుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
How To apply Encumbrance Certificate what is the importance: భూమి..ఇల్లు.. ఫ్లాట్ ఇలా ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు చేయడం అనేది జీవితంలో ఒక ముఖ్య నిర్ణయమని చెప్పాలి. అయితే చాలా మంది స్థిర ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన పత్రాలను పొందడానికి తొందరపడుతుంటారు. ఇవి చట్టపరమైన ఇబ్బందులకు దారి తీస్తుంది. ఆస్తి లావాదేవీల్లో అలాంటి కీలకమైన పత్రం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ). మీరు ఆస్తులు కొనుగోలు చేస్తున్న ఆస్తులకు ఎలాంటి అప్పులు కానీ వివాదాలు లేదా చట్టపరమైన క్లెయిమ్స్ లేదని ఈ సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది. మరింత సులభంగా చెప్పాలంటే.. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మీ ఆస్తి ఒప్పందాన్ని సురక్షితంగా ఉంచే బలమైన సాక్ష్యమని చెప్పాలి.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది మీ సంబంధిత ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేస్తుంది. ఇది బ్యాంకు లోన్స్, తాకట్టు, కోర్టు కేసు లేదా ఇతర చట్టపరమైన ఎన్కంబరెన్స్ ద్వారా ఆసక్తిని విక్రయించారా లేదా అనేది స్పష్టం పేర్కొంటుంది. అందుకే ఎలాంటి ఆస్తి కొనుగోలు చేయాలన్న ముందుగా ఈసీని చూస్తుంటారు. ఆస్తిపై ఎలాంటి బకాయిలు లేదా వివాదాలు లేకుంటే కొనుగోలు చేయవచ్చని.. తర్వాత ఎలాంటి సమస్యలు రావని హామీ ఇస్తుంది.
ఈసీ ఎక్కడ పొందాలి? ఆస్తి రిజిస్టర్ చేసిన జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అనేక రాష్ట్రా్లలో ఈసీలను ఇప్పుడు ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా కూడా అప్లయ్ చేసుకునే సదుపాయం కల్పించాయి.
ఎలాంటి పత్రాలు అవసరం ?
⇒ ఆస్తి డీడ్ (సేల్ డీడ్ / గిఫ్ట్ డీడ్ కాపీ)
⇒ సర్వే నంబర్, ఖాస్రా నంబర్, గ్రామం లేదా నగరం పేరు వంటి పూర్తి ఆస్తి వివరాలు
⇒ దరఖాస్తుదారుడి గుర్తింపు, చిరునామా రుజువు
⇒ దరఖాస్తు ఫారం, నిర్ణీత రుసుములు
ఎంత ఫీజు చెల్లించాలి?
ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ కోసం రుసుము రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా ఛార్జ్ 200 నుండి 600 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు చేసిన 7 నుండి 15 రోజులలోపు EC జారీ చేస్తారు.
ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఎన్ని రకాలు ఉంటుంది?
1. నిల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్:
ఆస్తిపై ఎలాంటి లోన్స్, తనఖాలు లేదా ఇతర చట్టపరమైన చిక్కులు లేనప్పుడు నిల్ EC జారీ అవుతుంది. ఇది సురక్షితమైన, అతి ముఖ్యమైన సర్టిఫికెట్‌గా పరిగణించాలి.
2. వివరణాత్మక ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్
గతంలో ఆస్తిపై లోన్ తీసుకున్నట్లయితే లేదా ఏవైనా నమోదిత లావాదేవీలు జరిగి ఉంటే, వివరణాత్మక EC అన్ని వివరాలను కలిగి ఉంటుంది. ఇది గత లావాదేవీల రికార్డును అందిస్తుంది.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎన్ని ఏళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది?
EC కనీసం 13 సంవత్సరాలకు జారీ చేస్తారు. కానీ 30 సంవత్సరాల వరకు పొందడం అన్ని విధాల సురక్షితం.
ప్రతి ఆస్తి ఒప్పందానికి EC అవసరమా?
ఇల్లు, భూమి లేదా వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు EC అవసరం. ఈసీ లేనిదే ఆస్తులు కొనుగోలు చేయలేము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Santoor is number 1 soap in India: భారత సబ్బుల పరిశ్రమలో కీలకమైన మార్పు చోటుచేసుకుంది.విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్‌కు చెందిన సంతూర్ బ్రాండ్ తాజాగా దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సబ్బుగా నిలిచింది. గత ఏడాది కాలంలో సుమారు రూ.2,850 కోట్ల అమ్మకాలను నమోదు చేయడంతో.. ఎన్నేళ్లుగా మార్కెట్ లీడర్‌గా ఉన్న లైఫ్‌బాయ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
‘యవ్వనాన్ని నిలుపుకునే చర్మం’ అనే థీమ్ తో ప్రారంభం:
సంతూర్ ప్రయాణం 1985లో బెంగళూరులో ప్రారంభమైంది. మొదటిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సబ్బును.. 1986లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. గంధం, పసుపు వంటి సంప్రదాయ పదార్థాల మిశ్రమంతో ‘యవ్వనంగా కనిపించే చర్మం’ అనే థీమ్ వినియోగదారుల ముందుకు తీసుకెళ్లింది. ఈ ప్రత్యేకమైన వాగ్దానం సంతూర్‌ను త్వరగా ప్రజల్లోకి చేరేలా చేసింది.
దాదాపు నలభై ఏళ్లుగా మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్న సంతూర్.. తన విజయానికి వినియోగదారుల అభిరుచులను తెలసుకుంటుంది. ఉత్పత్తి నాణ్యతపై రాజీ పడకపోవడం... బలమైన పంపిణీ వ్యవస్థను నిర్మించుకోవడమే కారణమని విప్రో స్పష్టం చేసింది.ముఖ్యంగా బ్రాండ్ ప్రచారంలో సంతూర్ మామ్ గా ప్రసిద్ధి చెందిన ప్రకటనలు.. మహిళల జీవితాల్లో చోటుచేసుకుంటున్న సామాజిక మార్పులను ప్రతిబింబిస్తూ కాలానుగుణంగా మారుతూ రావడం బ్రాండ్‌కు విశేషమైన గుర్తింపును తెచ్చింది.
సంతూర్ ఎదుగుదలలో ఏపీది కీలక పాత్ర:
సంతూర్ జాతీయ స్థాయిలో ఎదగడంలో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించింది. 1990ల చివర్లో రాష్ట్రాల వారీగా విస్తరణ వ్యూహాన్ని రూపొందించిన విప్రో.. తొలి అడుగుగా ఏపీ మార్కెట్‌ను ఎంచుకుంది. అక్కడ సాధించిన విజయమే నేడు సంతూర్‌ను తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల వైపు విస్తరించేందుకు దోహదపడేలా చేసింది.
కాలక్రమేణా సంతూర్ అమ్మకాలు వేగంగా పెరిగాయి. 2012 నాటికి రూ. 1,000 కోట్ల అమ్మకాల మైలురాయిని చేరుకున్న ఈ బ్రాండ్.. 2018లో రూ. 2,000 కోట్ల అమ్మకాలతో లక్స్‌ను వెనక్కి నెట్టి దేశంలో రెండో స్థానానికి చేరింది. తాజాగా రూ. 2,850 కోట్ల అమ్మకాలతో భారత సబ్బుల మార్కెట్లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. ఈ విజయంపై విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సీఈఓ వినీత్ అగర్వాల్ స్పందించారు. వినియోగదారుల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం.. ఉత్పత్తి నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకెళ్లడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. అలాగే సంస్థ బృందాల అంకితభావం.. పంపిణీ భాగస్వాముల సహకారం ఈ విజయానికి ప్రధాన ఆధారమని ఆయన పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bangladesh's Crown Prince Re-Enters Arena After 17 Years In Exile: బంగ్లాదేశ్ రాజకీయాలు మరో కీలక మలుపునకు వేదిక కాబోతున్నాయి. దాదాపు 17 సంతవ్సరాల తర్వాత మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్ లండన్ నుంచి స్వదేశం బంగ్లాదేశ్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న తారిఖ్‌ను బంగ్లాదేశ్‌లో చాలామంది క్రౌన్ ప్రిన్స్ గా అభివర్ణిస్తారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తాత్కాలిక అధ్యక్షుడు కాగా.. ఫిబ్రవరి 2026లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ప్రధాన నాయకత్వం వహించనున్నారు. ఆయన రాకను బీఎన్పీ శ్రేణులు చారిత్రాత్మక ఘట్టంగా చూస్తుండగా.. ప్రత్యర్థులు మాత్రం ఇది రాజకీయ వ్యూహంలో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ తారిఖ్ రెహమాన్ ఎవరు? ఆయన ఎందుకు ఇన్నేళ్లు లండన్‌లో ఉన్నారు? ఈ పరిణామాలు భారత్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? అనే అంశాల గురించి తెలుసుకుందాం.
రాజకీయ వారసత్వం:
తారిఖ్ రెహమాన్ జీవితం.. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రతో గాఢంగా ముడిపడి ఉంది. ఆయన 1965లో... అప్పట్లో తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న బంగ్లాదేశ్‌లో జన్మించారు. 1971 విముక్తి యుద్ధ సమయంలో కేవలం 6ఏళ్ల వయసులో జైలుకు వెళ్లారు. అందుకే BNP ఆయనను అతి పిన్న వయస్కుడైన యుద్ధ ఖైదీగా పేర్కొంటుంది. ఆయన తండ్రి జియావుర్ రెహమాన్ 1975లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చారు. అదే తిరుగుబాటులో దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జియా కుటుంబం.. హసీనా కుటుంబాల మధ్య దీర్ఘకాలిక రాజకీయ శత్రుత్వానికి కారణమైంది. దీనినే బంగ్లాదేశ్ రాజకీయాల్లో బేగంల పోరుగా పిలుస్తారు. జియావుర్ రెహమాన్ 1977 నుంచి 1981 వరకు అధ్యక్షుడిగా పనిచేసి, BNPను స్థాపించారు. అయితే 1981లో సైనిక తిరుగుబాటులో ఆయన హత్యకు గురయ్యారు.
ఆ తరువాత ఖలీదా జియా పార్టీ నాయకత్వాన్ని స్వీకరించి మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తారిఖ్ ఆమె పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో 2015లో థాయిలాండ్‌లో మరణించారు. తారిఖ్ తన భార్య జుబైదా రెహమాన్, కుమార్తె జైమా రెహమాన్‌తో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు.
17 ఏళ్లుగా విదేశాల్లోనే ఎందుకు జీవించారు?
2000వ సంవత్సరం ప్రారంభంలో ఖలీదా జియా ప్రభుత్వంలో తారిఖ్ అత్యంత ప్రభావశీల వ్యక్తిగా ఎదిగారు. హవా భవన్ గా పిలిచే అనధికార అధికార కేంద్రంతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని..ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ దౌత్య కేబుల్స్‌లో కూడా ఆయనపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. కాగా 2007లో సైనిక మద్దతు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. సుమారు 18 నెలలు జైల్లో గడిపిన ఆయన.. హింసకు గురయ్యానని పలుమార్లు ఆరోపించారు. 2008లో బెయిల్‌పై విడుదలయ్యాక.. అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ.. లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఆయనపై అవినీతి, మనీలాండరింగ్ కేసులతో పాటు 2004 గ్రెనేడ్ దాడి కేసులో కూడా గైర్హాజరీలో జీవిత ఖైదు విధించింది. BNP మాత్రం ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించింది.
లండన్‌లో ఉంటూనే తారిఖ్ వీడియో కాల్స్.. సోషల్ మీడియా ద్వారా పార్టీని నడిపించారు. అయితే 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం హసీనా పతనానికి దారితీసింది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పలు కేసుల్లో తారిఖ్‌కు ఉపశమనం కల్పించింది. దీంతో ఆయన స్వదేశానికి తిరిగిరావడానికి మార్గం సుగమమైంది.
నాయకత్వ బదిలీ దశ:
ఖలీదా జియా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటించినప్పటికీ.. ఆరోగ్యం క్షీణించడంతో అది సాధ్యం కాలేదు. అందువల్ల పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం వహించగల వ్యక్తిగా తారిఖ్ రెహమాన్ ఒక్కరే మిగిలారని BNP నేతలు భావిస్తున్నారు. ఆయన రాక ప్రజాస్వామ్యానికి చారిత్రాత్మక ఘట్టమని పార్టీ నాయకత్వం చెబుతోంది.
ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయాలు:
2024 ఆగస్టులో హసీనా రాజీనామా చేసి భారత్‌కు వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితి పూర్తిగా మారింది. ఫిబ్రవరి 2026లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో BNP బలమైన పోటీదారుగా కనిపిస్తోంది. అవామీ లీగ్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది?
భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు నీరు, వాణిజ్యం, భద్రత, సరిహద్దు అంశాలపై ఆధారపడి ఉంటాయి. హసీనా ప్రభుత్వ కాలంలో ఈ సంబంధాలు బలంగానే ఉన్నాయి. అయితే ఆమె పతనం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తారిఖ్‌ను కొందరు భారత వ్యతిరేక నేతగా భావిస్తారు. తీస్తా జల వివాదం, హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం వంటి అంశాలపై ఆయన విమర్శలు చేశారు.BNP అధికారంలోకి వస్తే ఇస్లామిస్ట్ గ్రూపులతో పొత్తులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల తారిఖ్ భారత్‌తో మంచి సంబంధాలు కావాలని.. కానీ బంగ్లాదేశ్ ప్రయోజనాలే ప్రథమమని చెప్పడం గమనార్హం. భారత్ మాత్రం ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ.. ప్రాంతీయ స్థిరత్వం, మైనారిటీల భద్రతపై దృష్టి పెట్టిందని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
8th Pay Commission: కొత్త ఏడాది 2025 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు మరింత పెరిగాయి. 7వ వేతన సంఘం(7th Pay Commission) పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘంపై చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులందరిలోనూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.
అయితే ఈ అంశంపై ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ స్పష్టత ఇచ్చారు. 8వ వేతన సంఘం(8th Pay Commission)లో కనీసం 2.64 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్‌ను ఉద్యోగ సంఘాలు ముందుకు తెచ్చాయి. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor) అమలైతే.. ప్యూన్ నుంచి IAS స్థాయి అధికారుల వరకు మూల వేతనాలు భారీగా పెరుగుతాయని ఆయన వివరించారు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే.. ప్రస్తుతం ఉన్న బేసిక్ జీతాన్ని ఒక నిర్దిష్ట గుణకంతో గుణించడం ద్వారా కొత్త బేసిక్ జీతాన్ని నిర్ణయించే విధానం అని అర్థం. ఈ గుణకం ఎంత ఎక్కువగా ఉంటే.. (8th Pay Commission)ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అంత ఎక్కువగా పెరుగుతాయి. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఈసారి దానిని 2.64 లేదా అంతకంటే ఎక్కువగా నిర్ణయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
2.64 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు అయినట్లయితే.. వివిధ స్థాయిల్లో జీతాలు ఎలా మారుతాయో ఓసారి పరిశీలిద్దాం.
⇒ లెవల్–1లో ఉన్న ఉద్యోగి ప్రస్తుత మూల వేతనం రూ. 18,000 ఉండగా.. అది సుమారు రూ. 47,520కి పెరుగుతుంది.
⇒ లెవల్–2లో రూ. 19,900 ఉన్న జీతం రూ. 52,536కి పెరుగుతుంది.
⇒ లెవల్–3లో రూ. 21,700 ఉన్న వేతనం రూ. 57,288కి చేరుతుంది.
⇒ ఇదే విధంగా లెవల్–6లో ఉన్న ఉద్యోగి ప్రస్తుత బేసిక్ రూ. 35,400 నుంచి దాదాపు రూ. 93,456కి పెరుగుతుంది.
⇒ లెవల్–10లో రూ. 56,100గా ఉన్న మూల వేతనం రూ.1.48 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
⇒ అత్యున్నత స్థాయిల్లో మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. లెవల్–13లో ఉన్న అధికారుల జీతం రూ. 1.18 లక్షల నుంచి రూ.3.12 లక్షలకు పెరుగుతుంది.
⇒ లెవల్–15లో ఉన్న అధికారుల వేతనం రూ. 1.82 లక్షల నుంచి సుమారు రూ. 4.81 లక్షలకు పెరుగుతుంది.
⇒ లెవల్–18లో ప్రస్తుతం రూ. 2.50 లక్షలుగా ఉన్న మూల వేతనం దాదాపు రూ. 6.60 లక్షలకు చేరే అవకాశం ఉంది.
ఈ లెక్కన బట్టి చూస్తే.. ప్యూన్ నుంచి IAS వరకు అందరికీ భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టంగా అర్థం అవుతోంది.
అయితే 7వ వేతన సంఘం పదవీకాలం ముగిసిన వెంటనే 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా కొత్త వేతన సంఘం ఏర్పాటు చేసి.. దాని నివేదికను ప్రభుత్వం ఆమోదించడానికి ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అందువల్ల 2026 జనవరి నుంచి జీతాలు అమలుకాకపోయినా, తరువాత అమలు చేసినప్పుడు ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లింపులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor)నిర్ణయానికి ప్రభుత్వం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. దేశంలో ద్రవ్యోల్బణ స్థాయి, జీవన వ్యయం, CPI, CPI-IW గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, బడ్జెట్ భారం, ప్రైవేట్ రంగంతో జీతాల పోలిక, మార్కెట్ సర్వేలు వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ సమతుల్యం చేస్తూ తుది నిర్ణయం తీసుకుంటారు.
2.64 కంటే తక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor) ఉద్యోగులకు సరైన న్యాయం చేయదని మంజీత్ సింగ్ పటేల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉద్యోగుల జీవన వ్యయం, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే ఉద్యోగుల్లో సంతృప్తి పెరుగుతుందని, లేకపోతే అసంతృప్తి, విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మొత్తంగా చూస్తే, 8వ వేతన సంఘం చుట్టూ సాగుతున్న ఈ చర్చలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో కీలకంగా మారాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor)పై తీసుకునే నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPF withdrawal New Rules: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సంవత్సరం సరికొత్త శుభవార్తను అందించబోతోంది. కొత్త సంవత్సరం 2026 నుంచి ఉద్యోగస్థులకు ఈపీఎఫ్ విషయంలో భారీ ఉపశమనం కల్పించే మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు బాసటగా నిలుస్తూ.. అవసరం, అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బును విత్ర డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది. చాలా ఆలస్యం జరిగేది. ఈ సమస్యలను గుర్తించిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ విత్ డ్రా రూల్స్ మరింత ఈజీగా స్పష్టంగా మార్చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ మార్పులు పీఎఫ్ ఖాతాదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
ఇప్పటివరకు EPF విత్ డ్రాకు సంబంధించి 13 రకాల విభిన్న నిబంధనలు ఉండేవి. ఈ రూల్స్ ఉద్యోగులకు అర్థం కాకపోవడంతో గందరగోళానికి గురయ్యేవారు. తాజాగా మార్పుల ప్రకారం ఈపీఎఫ్ఓ ఈ నియమాలను మూడు ప్రధాన వర్గాలుగా విభజించింది. ముఖ్యమైన అవసరాలు, గ్రుహ సంబంధిత అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది. ఈ విధంగా విభజించడం వల్ల తమ అవసరానికి ఏ కేటగిరిలో విత్ డ్రా చేసుకోవచ్చో సులభంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు ఆన్ లైన్ క్లెయిమ్ ప్రక్రియ కూడా మరింత ఈజీ అయ్యింది.
మొత్తం EPF మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలటే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు ఉండాలి. ఉద్యోగి 58 సంవత్సరాల వయస్సు పూర్తి చేసిన తర్వాత.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పుడు.. శాశ్వత వైకల్యం కలిగినప్పుడు లేదా పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో మాత్రం మొత్తం EPF మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం కోల్పోయిన వెంటనే EPFలోని 75 శాతం మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. మిగిలిన 25 శాతం మొత్తాన్ని 12 నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు, విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిన వారు కూడా తమ EPF నిధులను పూర్తిగా విత్ డ్రా చేసుకునే వెలుసుబాటు కల్పించింది.
ఇక పాక్షిక ఉపసంహరణల విషయంలో కూడా EPFO స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఐదేళ్ల సర్వీస్ పూర్తైన తర్వాత ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా మరమ్మత్తుల కోసం EPF నుంచి డబ్బు తీసుకోవచ్చు. పదేళ్ల సర్వీస్ తర్వాత గృహ రుణాన్ని చెల్లించేందుకు మొత్తం PF నిల్వలో 90 శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇంటి మరమ్మతుల కోసం అయితే నెలవారీ జీతం లేదా ఉద్యోగి PFలో చేసిన సహకారానికి 12 రెట్లు వరకు తీసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని జీవితంలో రెండుసార్లు వినియోగించుకోవచ్చు.
వైద్య అవసరాల విషయంలో సర్వీస్ కాలానికి ఎలాంటి పరిమితి లేదు. ఉద్యోగి తనకు, భార్య లేదా భర్తకు, తల్లిదండ్రులకు లేదా పిల్లలకు వైద్య చికిత్స అవసరమైతే ఎప్పుడైనా EPF నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. వివాహం, చదువు అవసరాల కోసం కూడా సౌకర్యం ఉంది. ఏడేళ్ల సర్వీస్ ప పూర్తైన తర్వాత, ఉద్యోగి తన వివాహం లేదా పిల్లలు, తోబుట్టువుల వివాహం కోసం మొత్తం సహకారంలో 50 శాతం వరకు తీసుకోవచ్చు. అలాగే పిల్లల విద్య కోసం (10వ తరగతి తర్వాత) కూడా అదే విధంగా 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు మరింత ఉపశమనం కల్పించారు. 54 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు లేదా రిటైర్మెంట్ కు ఒక ఏడాది EPFలోని 90 శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే వరదలు, భూకంపాలు వంటి సహజ విపత్తులు సంభవించినప్పుడు లేదా రెండు నెలలకుపైగా జీతం అందకపోతే అత్యవసరంగా కొంత మొత్తం తీసుకోవచ్చు.
EPF విత్ డ్రాపై ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒక ఉద్యోగి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతరంగా ఉద్యోగంలో ఉన్నట్లయితే, EPF నుంచి తీసుకునే మొత్తం పూర్తిగా పన్ను మినహాయింపుకు అర్హం. కానీ ఐదేళ్ల కంటే ముందే విత్ డ్రా చేస్తే, నియమాల ప్రకారం TDS వర్తించే అవకాశం ఉంటుంది. ఈ మార్పులతో EPF ఖాతాదారులకు అవసరమైన సమయంలో తమ పొదుపును సులభంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్లో డిసెంబర్ 25వ తేదీ గురువారం బంగారం.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధరకు రూ.10 పెరుగుదల నమోదైంది. తాజా ధర ప్రకారం 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ.1,38,940కు చేరింది. ఇదే విధంగా 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.10 పెరిగి 10 గ్రాములకు రూ.1,27,360గా నమోదైంది. 18 క్యారెట్ బంగారం సైతం రూ.10 పెరిగి 10 గ్రాములకు రూ.1,04,210 వద్ద స్థిరపడింది.
వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. బుధవారం కిలో వెండి ధర రూ.2,33,000గా ఉండగా.. నేడు గురువారం అది రూ.2,33,100కు చేరింది. దేశీయ మార్కెట్లో పెరుగుదల తక్కువగా కనిపించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. అమెరికా మార్కెట్లో ఒక ఔన్స్ (సుమారు 31.2 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా దాదాపు 4,500 డాలర్ల స్థాయికి చేరడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ఇన్వెస్టర్ల ప్రవర్తనలో వచ్చిన మార్పేనని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. దేశీయంగా కూడా 24 క్యారెట్ బంగారం ధర చరిత్రలో తొలిసారిగా 10 గ్రాములకు రూ.1.40 లక్షల స్థాయిని దాటడం విశేషంగా చెప్పుకోవచ్చు.
బంగారం ధరల ఈ భారీ పెరుగుదల ఆభరణాల కొనుగోలుదారులకు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దేశీయంగా బంగారు ఆభరణాల డిమాండ్ పెద్దగా లేకపోయినా, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్లే ధరలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 2025లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ ఆర్థిక విధానాలపై అనిశ్చితి పెరిగిందని.. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నారని చెబుతున్నారు.
ఇక వెండి విషయానికి వస్తే.. అది కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క ఏడాదిలోనే దాదాపు 100 శాతం వరకు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా గ్రీన్ ఎనర్జీ, సౌర విద్యుత్ రంగాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. అదే సమయంలో సరఫరా పరిమితంగా ఉండటంతో వెండి ధరలు మరింత ఎగబాకుతున్నాయి. భవిష్యత్తులో కూడా వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
New Year 2026 Investment Plan: కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ.. చాలా మంది తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతుంటారు. ఆరోగ్యం, కెరీర్‌తో పాటు భవిష్యత్తు ఆర్థిక భద్రత కూడా ఇప్పుడు ప్రతి కుటుంబానికి ప్రధాన ఆలోచనగా మారింది. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ముందస్తుగా ప్రణాళిక చేసుకుంటే, పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితం గడపడం సాధ్యమవుతుంది. ఇలాంటి సందర్భంలో అటల్ పెన్షన్ యోజన (APY) ఒక నమ్మకమైన, సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తోంది.
భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా అటల్ పెన్షన్ యోజనలో ఖాతాలు తెరిచి పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత వారికి కలిపి నెలకు రూ.10,000 వరకు పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ పథకం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండటంతో.. దీని భద్రతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. 60 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత జీవితాంతం హామీతో కూడిన పెన్షన్‌ను ఈ పథకం అందిస్తుంది.
ఈ పథకం కింద ప్రతి వ్యక్తి తనకు నచ్చిన పెన్షన్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. భార్యాభర్తలిద్దరూ ఒక్కొక్కరూ రూ.5,000 పెన్షన్ ఎంపిక చేసుకుంటే.. పదవీ విరమణ తర్వాత వారికి కలిపి రూ.10,000 నెలవారీ ఆదాయం లభిస్తుంది. ఈ మొత్తం వృద్ధాప్యంలో రోజువారీ ఖర్చులు, వైద్య అవసరాలు వంటి వాటిని ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం లేకపోయే వయస్సులో ఈ పెన్షన్ ఒక పెద్ద భరోసాగా నిలుస్తుంది.
అటల్ పెన్షన్ యోజనలో 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు చేరవచ్చు. పెట్టుబడి ప్రారంభించే వయస్సు తక్కువగా ఉంటే.. నెలవారీ విరాళం అంత తక్కువగా ఉంటుంది. అంటే.. యువత తొందరగా ఈ పథకంలో చేరితే, తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ భవిష్యత్తులో మంచి పెన్షన్ పొందవచ్చు. పెట్టుబడి మొత్తం మీరు ఎంచుకునే పెన్షన్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉండటంతో పాటు, ప్రభుత్వ హామీ ఉన్నందున మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు. అందుకే భద్రత కోరుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపికగా చెప్పవచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభంలో భార్యాభర్తలు కలిసి ఈ పథకం కింద ఖాతాలు తెరిచి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రాబోయే సంవత్సరాల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించినట్లే అవుతుంది.
అటల్ పెన్షన్ యోజన ఖాతా తెరవడం కూడా చాలా సులభం. మీ సమీప బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి.. అవసరమైన పత్రాలు సమర్పిస్తే, కొన్ని సులభమైన దశల్లోనే ఖాతా ప్రారంభించవచ్చు. హామీ ఉన్న రాబడి, దీర్ఘకాలిక భద్రత, ప్రభుత్వ మద్దతు వంటి అంశాల కారణంగా అటల్ పెన్షన్ యోజన భార్యాభర్తలకు ఒక విశ్వసనీయమైన పెట్టుబడి మార్గంగా నిలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Cobra Snakes Video Viral: ప్రమాదకరమైన పాములను రక్షించడంలో స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలను పట్టుకునే సమయంలో కూడా వాటి కాటు బారిన పడి మరణిస్తున్నారు.. ఏది ఏమైనా పాములు పట్టేవారు ప్రకృతిలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రకృతిని రక్షించేందుకు వారు చేసే ప్రయత్నాలు అంతో ఇంతో కాదు వర్ణనాతీతం.. అయితే, చాలామంది యువత కూడా పాములు పట్టే ట్రైనింగ్ తీసుకొని.. ప్రకృతిని రక్షించే కార్యక్రమంలో పడ్డారు. ఇటీవల కాలంలో అడవి ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఆహార కోరత కారణంగా.. పల్లె ప్రాంతాల్లోకి ప్రమాదకరమైన పాములు సంచారం చేయడంతో.. వాటిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగమే జలీల్ బాయ్..
గత కొద్ది రోజుల నుంచి జలీల్ భాయ్ పాములను రెస్క్యూ చేసే పనిలో పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధరకు చెందిన అతను ఎక్కడ పాములు కనిపించిన అక్కడికి వెళ్లి రెస్క్యూ చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు అతను కొన్ని వందల పాములకు పైగా పట్టుకొని రెస్క్యూ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అతడు ఆ పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అతను తీసిన వీడియోలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములు పట్టుకునే క్రమంలో తీసిన కొన్ని వీడియోలైతే జనాలు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.
తాజాగా కూడా జలీల్ భాయ్ ఓ పామును పట్టుకుంటున్న క్రమంలో తీసి పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ ఇంట్లోకి సంచారం చేసిన కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం మీరు చూడొచ్చు. ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ గ్రామంలో కింగ్ కోబ్రా ఇంట్లోని వంట రూములో సిలిండర్ కింద సంచారం చేస్తుంది. అయితే, దీనిని గమనించిన ఆ ఇంటి యజమాని వెంటనే జలీల్ బాయ్ కి సమాచారం అందించారు వెంటనే అతను అక్కడికి చేరుకొని సిలిండర్ కింద ఉన్న ఆ పాముని రెస్క్యూ చేశారు.
ఈ సమయంలో అతను సిలిండర్ కింద ఉన్న చిన్న నాగుపామును తన చేతితోనే బయటికి లాగి.. తోకను పట్టుకొని ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించడం మీరు చూడొచ్చు. ఇలా అతను ఓ ప్లాస్టిక్ డబ్బాలో ఆ పామును బంధించి.. సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు యూట్యూబ్ షార్ట్ వీడియోను కొన్ని వందల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
