Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500058

శ్రీకర మ్యుచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రీజనల్ కార్యాలయం ప్రారంభం

Jul 19, 2024 08:26:28
Hyderabad, Telangana

ఎల్‌బీనగర్‌ బీవైరెడ్డి నగర్‌లోని శ్రీకర మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ప్రాంతీయ కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వ అదనపు కార్యదర్శి సైదా, జీహెచ్‌ఎంసీ జాయింట్‌ కమిషనర్‌ వెంకట్‌రెడ్డితో పాటు సంఘం ఎండీ రవీంద్ర, అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడు కేవీఎన్‌ ప్రారంభించారు. నరసింహారెడ్డి మరియు సభ్యులు. 2015 సంవత్సరం నుండి, శ్రీకర పరస్పర సహాయ సహకార సంఘం ప్రజలకు బ్యాంకింగ్‌కు సమాంతరంగా సేవలు అందిస్తోంది.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
VVishnupriya
Dec 08, 2025 14:28:54
Baddipadaga, Telangana:

Telangana 2026 Holidays List Released: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సాధారణ సెలవులు.. ఆప్షనల్ సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటనను సాధారణ పరిపాలనా శాఖ (General Administration Department) విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలకు వర్తించే సెలవులు ఖరారు చేయబడ్డాయి.

2026 సంవత్సరానికి మొత్తం 27 సాధారణ సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ముఖ్యమైన పండుగలు, జాతీయ పండుగలు కూడా ఉన్నాయి. జనవరి 1న న్యూయర్ డే, జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం ముఖ్యమైన సెలవులుగా ఉన్నాయి. అలాగే మహా శివరాత్రి, హోళీ, ఉగాది, రంజాన్ ఈద్, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి, బక్రీద్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, గాంధీ జయంతి, దసరా పండుగలు, దీపావళి, క్రిస్మస్ వంటి ప్రధాన పండుగలకు కూడా సెలవులు ఇచ్చారు.

ఇవే కాకుండా ఆప్షనల్ సెలవులు (Optional Holidays) కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇవి ఉద్యోగుల ఇష్టానుసారం తీసుకునే సెలవులు. ఈ జాబితాలో బర్త్‌డే ఆఫ్ హజ్రత్ అలీ, శ్రీ పంచమి, మిలాద్ ఉన్ నబీ, మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, వరలక్ష్మి వ్రతం, రథయాత్ర, పర్షియన్ న్యూ ఇయర్, గురునానక్ జయంతి, నరక చతుర్దశి, క్రిస్మస్ ఈవ్ వంటి రోజులు ఉన్నాయి. ఉద్యోగులు ఈ ఆప్షనల్ సెలవులలో.. గరిష్టంగా ఐదు రోజులు మాత్రమే వినియోగించుకోవచ్చు.

ఈ సెలవుల జాబితా వల్ల ఉద్యోగులు తమ సెలవులను ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చదువు, పండుగలు.. కుటుంబ కార్యక్రమాలకు సమయం కేటాయించుకోవడం సులభమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఈ సెలవుల ప్రకారం పనిచేస్తాయి.

మొత్తానికి 2026 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ సెలవుల జాబితా ఉద్యోగులు, విద్యార్థులు.. ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలు తమ వ్యక్తిగత మరియు కుటుంబ కార్యక్రమాలను ముందుగానే సక్రమంగా ప్రణాళిక చేసుకోవచ్చు.

Also Read: Govt Employees Leaves: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. 12 సెలవులు పొడగింపు

Also Read: New Labour Codes: కొత్త లేబర్ కోడ్‌లపై కేటీఆర్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

149
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 08, 2025 11:28:24
Hyderabad, Telangana:

Aditya Mangla Raja Yoga Effect On Zodiac News: అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో కుజుడు కూడా ఒకటి. ఈ గ్రహం చాలా ప్రత్యేకమైన సమయంలో మాత్రమే సంచారం చేస్తుంది. డిసెంబర్ 7వ తేదీన ఆదివారం ధనస్సు రాశిలోకి ప్రవేశించింది. అయితే, ఇదే రాశిలోకి డిసెంబర్ 16న సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. ధనస్సులోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగానే ఆదిత్య మంగళ రాజయోగం (Aditya Mangla Raja Yoga) ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఏర్పడడం అత్యంత శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని ప్రభావం జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శక్తివంతమైన యోగ ప్రభావంతో ఏయే రాశుల ప్రభావితం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్..
మకర రాశి 
ఆదిత్య మంగళం రాజయోగ (Aditya Mangla Raja Yoga) ప్రభావంతో మకర రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి జనవరి 14వ తేదీ వరకు అన్ని రంగాల్లో ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వాముల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అలాగే ప్రేమ జీవితం కూడా చాలావరకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఫిబ్రవరి ఈ సమయాల్లో ప్రమోషన్స్ కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా వీరు ఈ సమయాల్లో ఆర్థికంగా అద్భుతమైన లాభాలు పొందుతారు. 

సింహరాశి 
కుజుడి సంచార ప్రభావం వల్ల ఏర్పడే ఆదిత్య మంగళ రాజయోగం (Aditya Mangla Raja Yoga) కారణంగా సింహరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా కొన్ని శుభవార్తలు వినే ఛాన్స్ కూడా ఉంది. అలాగే పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు. వ్యక్తిగత సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే వీరి మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు.

తులారాశి 
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆదిత్య మంగళ రాజు యోగ ప్రభావం ఫిబ్రవరి నెల వరకు ఉండబోతోంది. దీని కారణంగా వీరికి అదృష్టం సహకరించబోతోంది. దీనివల్ల వీరు అన్ని పనులు ఎంతో సులభంగా చేయగలిగి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు. ఆరోగ్యం గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడుతుంది. దీంతోపాటు ఆర్థికంగా బలం కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. 

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

కుంభ రాశి 
శని గ్రహం పాలించే కుంభరాశి వారికి కూడా ఆదిత్య మంగళ రాజయోగం (Aditya Mangla Raja Yoga)  కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి అహంకారం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా భారీ మొత్తంలో పొందగలుగుతారు. వీరు ఈ సమయంలో మంచి విజయాలు సాధించగలుగుతారు. గొప్ప మనసుతో ఎలాంటి కోరికలు కోరుకున్న ఈ సమయంలో నెరవేరుతాయి. ముఖ్యంగా వీరు అపారమైన విజయాలు సాధించగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు. అలాగే ఈ సమాచారం నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

135
comment0
Report
VVishnupriya
Dec 07, 2025 14:44:35
Kanagumakulapalli, Andhra Pradesh:

AP DWCRA women scheme:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరోసారి శుభవార్త చెప్పింది. మహిళలు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించనుంది. అంతేకాదు, స్వయం ఉపాధికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా ఇస్తామని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిర్ణయంతో ప్రతి డ్వాక్రా మహిళకు లక్ష నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు రుణం అందే అవకాశం ఉంది. ఈ డబ్బును చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి..వ్యవసాయ పనులకు..కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ఈ సాయం వల్ల చాలా మంది మహిళల జీవితాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

స్త్రీ నిధి పథకం కింద ఈ రుణాలు అందిస్తారు. మహిళలు రుణం తీసుకున్న తరువాత.. ఒకవేళ వారికి ఏదైనా ప్రమాదం జరిగితే.. కుటుంబంపై భారం పడకుండా బీమా సదుపాయం కూడా కల్పిస్తారు. అంటే రుణం మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మహిళలకు మరింత భద్రత కలిగించే విషయం.

మహిళల పనితీరును బట్టి సంఘాలను ఏ, బి, సి, డి గ్రేడ్లుగా విభజిస్తారు. ఏ గ్రేడ్ సంఘాలకు ఎక్కువ రుణ సాయం లభిస్తుంది. బి, సి, డి గ్రేడ్లకు.. కూడా తగినంతగా రుణం ఇస్తారు. ఈ విధంగా ప్రతి సంఘానికి సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇంకాmmడ్వాక్రా మహిళల పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక సాయం అందిస్తోంది. విద్య కోసం..వివాహ ఖర్చుల కోసం ఇచ్చే ఈ ఆర్థిక సహాయం వల్ల కుటుంబాలకు పెద్ద ఊరట కలుగుతుంది. అధిక వడ్డీ అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

ప్రభుత్వం ప్రకటించిన ఈ సాయంతో రెండు రోజుల్లోనే మహిళల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం. దీని ద్వారా మహిళలు తమ కలలను నిజం చేసుకునే అవకాశం లభిస్తోంది. స్వయం ఉపాధితో వారు గౌరవంగా జీవించగలరని అధికారులు చెబుతున్నారు.

ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నిజంగా అభినందనీయం.

Also Read: Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!

Also Read: New Labour Codes: కొత్త లేబర్ కోడ్‌లపై కేటీఆర్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

153
comment0
Report
IPInamdar Paresh
Dec 07, 2025 10:46:12
Hyderabad, Telangana:

Brs ktr posts former cm kcr interesting photo on social media: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొత్తంగా  ఒకరిపై మరోకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గెలిచాక.. ఫామ్ హౌస్ లో కూర్చుని ఉన్నాడని, ఆయన గురించి ఇప్పుడు అనవసరమని, రాజకీయాల్లోమరల యాక్టివ్ అయిన తర్వాత ఆయనపై మాట్లాడుతానంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత కూడా ఎక్కడ చాన్స్ దొరికిన కూడా కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి మాటల యుద్దంను మాత్రం ఆపలేదు.

తెలంగాణకు ఈ గతి కేసీఆర్ కుటుంబ పాలన వల్ల కల్గిందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కేసీఆర్ ఆసక్తికర  ఫోటోను షేర్ చేశారు. 
 ఆ ఫొటోలో కేసీఆర్ మెడలో గులాబీ కండువాతో ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఆయన కాళ్ల వద్ద ఓ శునకం కూర్చుని ఉంది.

ఈ ఫొటోకు ఆయన 'IYKYK' అనే చిన్న క్యాప్షన్ పెట్టారు. 'If You Know, You Know' అనే ఆంగ్ల వాక్యానికి ఇది సంక్షిప్త రూపంగా ఉంది. "తెలిసిన వాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే అర్థాన్ని ఇది సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేటీఆర్ పోస్ట్  పెట్టిన కొద్ది సేపటికే ఇది నెట్టింట విపరీతంగా వైరల్గా  మారింది.

Read more: Harish Rao: కనకపు సింహసనం మీద కూర్చొబెట్టిన శునకం బుద్ది మారదు.!. రేవంత్‌ రెడ్డిపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..

కేటీఆర్ ఉన్నట్లుండి..ఈ పిక్ ఎందుకు పెట్టారు.. దీని వెనుక అపోసిషన్ పార్టీలకు ఇవ్వాలనుకుంటున్న మెస్సెజ్ ఏంటని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. కొందరు రాజకీయ తమదైన కోణంలో విశ్లేషిస్తుండగా, మరికొందరు తమకు తోచిన విధంగా కొత్త కొత్త అర్థాలు చెబుతున్నారు. దీనిపై రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

178
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 07, 2025 09:15:58
Hyderabad, Telangana:

Motorola Edge 70 Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటరోలా మార్కెట్‌లోకి మొబైల్స్‌ను అత్యంత చౌవక ధరలోనే విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ మోటార్ల ఎడ్జ్ 70 (motorola edge 70) పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మోడల్ మొబైల్ గతంలో కంపెనీ విడుదల చేసిన అన్ని మోడల్స్ కంటే ఎంతో ప్రీమియం లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ చాలా అద్భుతమైన ఫీచర్లతో విడుదల చేయబోతోంది. దీనిని ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ధర వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు లీక్ అవుతూ వస్తున్నాయి. 

మోటరోలా ఎడ్జ్ 70 మొబైల్ అతి త్వరలోనే కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది మోస్ట్ ప్రీమియం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు కూడా సమాచారం. ఇక ఈ మొబైల్ ను కంపెనీ వివిధ స్టోరేజ్ వేరియన్స్‌తో పాటు అనేక రంగులు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌ని కూడా కలిగి ఉంటుంది.. ఇది మొబైల్‌కు మంచి డిజైన్ కూడా అందిస్తున్నట్లు లీకైన ఫోటోల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని 5.99 మిమీ మందంతో సన్నని డిజైన్‌లో కనిపించబోతోంది.

ఇక ఈ motorola edge 70 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 6.67-అంగుళాల pOLED సూపర్ HD డిస్‌ప్లేతో లాంచ్ చేయబోతోంది. అంతేకాకుండా 1,220 x 2,712 పిక్సెల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు కంపెనీ దీని బేస్ వేరియంటను 12gb ర్యామ్ తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అలాగే ఇది Android 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వెనక కెమెరా వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ మొబైల్‌కి సంబంధించిన విడుదల తేది, ఫీచర్స్‌ అధికారకంగా ప్రకటించబోతోంది.

Also Read: MOTOROLA G35 5G: రూ.10,000లకే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కలిగిన Moto G35 స్మార్ట్‌ఫోన్..5000mAh అదిరిపోయే బ్యాటరీతో!

ఇక అదనంగా ఈ motorola edge 70 స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా,  50-మెగాపిక్సెల్ కెమెరాలు కూడా లభిస్తాయి. ఇక ఈ మొబైల్ ను కంపెనీ ఎంతో శక్తివంతమైన 4,800 mAh బ్యాటరీ 68 W వైర్డు చార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. మోటరోలా కంపెనీ గతంలో కాకుండా ఇప్పుడు టెక్నాలజీనిబట్టి కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది ఇటీవల కూడా భారత్‌లో మోటరోలా G67 పవర్ 5G స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీతో విడుదలైంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇందులో ప్రత్యేకమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

Also Read: MOTOROLA G35 5G: రూ.10,000లకే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కలిగిన Moto G35 స్మార్ట్‌ఫోన్..5000mAh అదిరిపోయే బ్యాటరీతో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

77
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 05, 2025 06:17:11
Hyderabad, Telangana:

King Cobra Around Lamb Neck Video Watch Here: సాధారణంగా పాములు ఎక్కువగా దట్టమైన అడవి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి జనాలకు చాలా దూరంగా నివాసిస్తూ ఉంటాయి. అయితే, ఆహారంతో పాటు ఆశ్రయం కోసం కొన్ని పాములు గ్రమాల్లోకి వచ్చి ఇళ్లలో చొరబడుతున్నాయి. ఇలా ఎవరు లేని సమాయాల్లో ఇళ్లలోకి దూరి మనుషులపై దాడి చేస్తున్నాయి. ఇలా చాలా వరకు ఇళ్లలోకి ప్రవేశిస్తున్న సమయంలో కొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌ వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అయితే, తాజాగా కూడా సోషల్ మీడియాలో ఓ పాముకు సంబంధించిన వీడియో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియో ఏంటో? దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Snake Catcher అనే య్యూటుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో గొర్రెల మందలోకి దూరిన పాము.. ఓ గొర్రె పిల్ల మెడ భాగం చుట్టు చుట్టేసుకుంది. అయితే, దీనిని ముందుగానే గమనించిన గొర్రెల కాపరి.. వెంటనే స్నేక్‌ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. అయితే, దీనిని తెలుసుకుని వారు కూడా వెంటనే అక్కడి చేరుకున్నారు. అప్పటి వరకు ఈ ఆ కింగ్‌ కోబ్రా పాము గొర్రె పిల్ల మెడకే చుట్టుకుని ఉంది. 

స్నేక్ క్యాచర్ పాములు పట్టే హుక్‌తో నెమ్మదిగా గొర్రె పిల్ల మెడలో ఉన్న పామును తీసేందుకు ప్రయత్నించాడు. ఆ పామును స్నేక్‌ క్యాచర్‌ ఎంతో నెమ్మదిగా గొర్రె పిల్లపై ఎలాంటి దాడి చెయ్యకుండా.. స్నేక్‌ స్టిక్‌తో పాటు పైపుతో ఎంతో నెమ్మదిగా.. ఆ పామును గొర్రె పిల్ల మెడలో నుంచి తీసే ప్రయత్నం చేశాడు. ఇలా కొద్ది సేపటి తర్వాత గొర్రె పిల్ల మెడలో నుంచి ఆ పామును తొలగించారు. ఈ సమయంలో పాము కూడా గొర్రెపై ఎలాంటి దాడి చెయ్యలేకపోంది. 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను Snake Catcher అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్ చేశారు. దీనికి Galy men nag అనే క్యాప్షన్‌ పెట్టి సోషల్‌ వీడియాలో వదిలారు. ఈ పట్టుకున్న పామున స్నేక్‌ క్యాచర్‌ అడవిలో విడిచి పెట్టిన్నట్లు తెలుస్తోంది. ఇలా వైరల్ అవుతున్న వీడియోను చాలా మంచి వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన వారు కామెంట్లు కూడా చేస్తున్నారు. 

Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

221
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 04, 2025 11:01:36
Hyderabad, Telangana:

Big Basket Vegetables Discount Offers: చాలా మంది మార్కెట్‌కి వెళ్లి రోజు కూరగాయలు విక్రయిస్తూ ఉంటారు. నిజానికి చాలా మంది రోజు ఇలాగే చేస్తూ సమయం వృధా చేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది దగ్గరగా ఉన్న రతన్‌దీప్‌తో పాటు విజేత స్టోర్స్‌కి వెళ్తారు. వీటన్నింటిలో కూరగాల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులుగా చీప్‌ ధరలతో ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

చాలా మంది అధిక రేట్లతో కూరగాయలను విక్రయిస్తున్నారు. నిజానికి చాలా మంది కీలో మీటర్ల దూరం రైతు బజార్‌కి వెళ్లి కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటన్నింటి కంటే బిగ్‌బాస్కెట్‌లో చాలా తక్కుద ధరలకే వెజిటెబుల్స్‌ లభిస్తాయి. బిగ్‌బాస్కెట్‌లో అన్ని రకాల కూరగాయలను చీప్‌ ధరకే కొనుగోలు చేయోచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల వెజిటెబ్స్‌ అయితే, దాదాపు 40 నుంచి 50 శాతం వరకు తగ్గింపు ధరలకే లభిస్తూ ఉంటాయి. ఇందులో ప్రాంతాన్ని బట్టి, రోజువారీ డిమాండ్, సప్లైని బట్టి ధరలు నిర్ణయిస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఈ కామర్స్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌లో ఎలాగైతే డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తాయో.. బిగ్‌బాస్కెట్‌లో కూడా అలాంటి ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి రోజు చౌవక (Har Din Sasta) సేల్‌లో భాగంగా నిత్యవసరాలతో కూరగాయలు చీప్‌ ధరలకే పొందవచ్చు. అయితే, ఈ రోజు ఏయే కూరగాయలు ఎంత డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారో తెలుసుకోండి. 

Also Read: DMart Offers: డీమార్ట్‌ కంటే చాలా చీప్ ధరలు..నెల బడ్జెట్‌తో రెండు నెలల కిరాణా సరుకులు కొనేయోచ్చు!

 బిగ్‌బాస్కెట్‌లో ప్రత్యేకమైన Har Din Sasta సేల్‌లో భాగంగా ఈ రోజు కొన్ని తాజా కూరగాయలు చీప్‌ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వెజిటెబుల్స్‌ దాదాపు 50 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. చాలా మంది రోజువారి ఆహారాల్లో వినియోగించే ఉల్లిపాయలు (Onion) 1kgకి ఏకంగా 40 నుంచి 49 శాతం వరకు    తగ్గింపుతో రూ.24 నుండి  రూ.43 ధరల్లో అందుబాటులో ఉంది. 

అలాగే కొత్త ఆలుగడ్డలు (Potato New) 5 kgలకు ఏకంగా 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.159 అందుబాటులో ఉన్నాయి. ఇక టొమాటోలు 1 kg ఏకంగా    48 శాతం తగ్గింపుతో రూ.64తో అందుబాటులో ఉంది. ఇక బీన్స్  కూడా ఒక kgకి దాదాపు 61 శాతం వరకు తగ్గింపుతో రూ.100కే లభిస్తోంది. ముల్లంగి (White Radish) కేజీ గ్రాములు 24 శాతం డిస్కౌంట్‌తో రూ.86, లేడీస్ ఫింగర్ (Ladies Finger) 1 kgకి 40 శాతం వరకు తగ్గింపుతో రూ. 62 ధరతో, దోసకాయ 1 kg ధర 24 శాతం తగ్గింపుతో రూ.70 ధర, క్యాప్సికమ్ (Capsicum) 1 kg 24 శాతం తగ్గింపుతో రూ.93తో లభిస్తోంది. ఈ సేల్స్‌లో భాగంగా బల్క్‌గా కూరగాయలు కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతు బజార్‌ కంటే ఏకంగా 40 శాతం తగ్గింపుతో ఇందులో ఎక్కువగా కూరగాయలు కొనుగోలు చేయోచ్చు. 

Also Read: DMart Offers: డీమార్ట్‌ కంటే చాలా చీప్ ధరలు..నెల బడ్జెట్‌తో రెండు నెలల కిరాణా సరుకులు కొనేయోచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

141
comment0
Report
IPInamdar Paresh
Dec 04, 2025 10:18:16
Hyderabad, Telangana:

 YS Sharmila slams on ap cm Chandrababu naidu on Electric charges row:  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటలు యుద్దం నడుస్తుంది. ఎక్కడ చాన్స్ దొరికిన  కూడా నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు విద్యుత్ చార్జీలను పెంచబోమన్నారు. అంతే కాకుండా.. ప్రజలపై తమ ప్రభుత్వం ఎలాంటి భారం మోపదన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ట్విట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుచేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లు వేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛార్జీలు పెంచబోమని  చెప్పడం చాలా హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం మోపిందని ఆరోపణలు గుప్పించారు. ఇది చంద్రబాబు గారు చెబుతున్న ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ గా అభివర్ణించారు. 

విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు హస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బిల్లుల మోతతో చాలా మంది ఇల్లు గుల్ల చేస్తున్నారని కూటమి సర్కారుపై షర్మిల మండిపడ్డారు.

17 నెలల కూటమి పాలనలో ప్రజలపై మోపిన అధిక చార్జీల భారం రూ.15,485 కోట్లు. వచ్చే రెండేళ్ల పాటు ట్రూ అప్ ప్రజల నెత్తిన పెను భారమే. యూనిట్ కు అదనంగా 40 పైసలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తూన్నారని షర్మిలా ఎద్దేవా చేశారు. ఒకవేళ కూటమికి నిజంగానే.. ఛార్జీల భారం ప్రజలపై పడొద్దనే చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సర్దుబాటు భారం రూ.15,485 కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Read more: Tirumala: లక్కీ డీప్‌లో రాలేదా..?.. తిరుమల భక్తులకు టీటీడీ మరో అద్భుతమైన శుభవార్త..

ట్రూ అప్ పేరుతో వసూలు చేసిన 3 వేల కోట్లను ప్రజలకు ట్రూ డౌన్ రూపంలో తిరిగి చెల్లించాలన్నారు. అదే విధంగా.. ఏపీలో అమలౌతున్న ఛార్జీలలో 30 శాతం తగ్గింపు వెంటనే అమలు చేయాలని వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా  డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.  ఇప్పటికే విద్యుత్ చార్జీల అంశంపై వైఎస్ షర్మిల పలుమార్లు  కూటమి సర్కారుపై నిరసనలకు దిగారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

198
comment0
Report
IPInamdar Paresh
Dec 04, 2025 08:57:16
Hyderabad, Telangana:

Sama ram mohan reddy fires on union minister kishan reddy: తెలంగాణలో ప్రస్తుతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై చేసిన కామెంట్స్ పెనుదుమారంగా మారాయి. దీనిపై మొత్తంగా అన్ని పార్టీలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. దీనిపై హిందు సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాల్ని, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అయితే..ఇప్పటికే తన వ్యాఖ్యలపై లేనిపోనీ వివాదాలు రాజేయోద్దని, వక్రీకరించవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే.. తాజాగా.. కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచనల వ్యాఖ్యలు చేశారు.
సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారన్నారు.  అంతే కాకుండా.. కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది కాకుండా కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారంటూ బీజేపీపై మండిపడుతున్నారు. కేటీఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ చెప్పిందే కాపీ పెస్ట్ చేసి కిషన్ రెడ్డి చెపుతున్నాడంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందంటూ ఎద్దేవా చేశారు.

ఒకటే స్క్రిప్ట్ ను కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిరాక్స్ చేసి చదువుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏమైనా ఉందా?.. అంటూ ప్రశ్నలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలిని కొనుక్కొని బతికే పరిస్థితి వచ్చిందని, 

హైదరాబాద్ ను కూడా ఢిల్లీగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారా?.. అంటూ విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి గాలికి మాట్లాడతా అంటే ఒప్పుకునేది లేదని,  మహేశ్వర్ రెడ్డికి చిట్టిలు అందించేది ఎవరో తెలియదా? అంటూ సామా రామ్మోహన్ ఏకీపారేశారు.

హిల్ట్ పాలసీ కింద ఉన్నవి  ప్రయివేట్  ఓనర్ల నిరుపయోగమైన భూములపై వాలంటరీగా వెసులుబాటు ఇస్తే కేటీఆర్ కి వచ్చిన నొప్పి ఏంటని సామా రామ్మోహన్ ప్రశ్నించారు.

హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదని స్పష్టంచేశారు.  దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బీజేపీ నాయకులు మౌనంగా ఉంటారా?.. అంటూ సామా రామ్మోహన్ ప్రశ్నించారు.  తెలంగాణ దేవాయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి రెడీనా అంటూ మండిపడ్డారు.

Read more: Pushapa 2 stampede: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. శ్రీ తేజ్ హెల్త్ కండీషన్ చెబితే ఎవరు పట్టించుకోవట్లేదు..

బీజేపీ నాయకులకు నరేంద్ర మోదీ ఒక్కడే దేవుడని, కానీ నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారంటూ సామా రామ్మోహన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

80
comment0
Report
IPInamdar Paresh
Dec 04, 2025 08:21:26
Hyderabad, Telangana:

Madras High Court stay orders on bala krishna akhanda 2 thandavam: బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా అఖండ 2 తాండవం రిలీజ్ కు ముందే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అఖండ 2 తాండవం రేపు డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఏపీలో టికెట్లపై పెంపుపై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. దీంతో అభిమానులు బాలయ్య మూవీని ఎప్పుడెప్పుడు చూడాలో అని పూనకాలతో ఊగిపోతున్నారు.ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు బాలయ్య సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది.

ఈ చిత్రం విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనంఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే..ఈరోస్ సంస్థ, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మధ్య రచ్చ కాస్త కోర్టుకు ఎక్కింది.

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ. 28 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.  దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని, కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోస్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. 

Read more: Pushapa 2 stampede: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. శ్రీ తేజ్ హెల్త్ కండీషన్ చెబితే ఎవరు పట్టించుకోవట్లేదు..

ఈ క్రమంలో బాలయ్య మూవీని ఎటువంటి రూపంలో కూడా విడుదల చేయోద్దని, థియేటర్లు, ఓటీటీ, సాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూటషన్లకు కూడా స్టే విధిస్తు మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే..ఈ మూవీపై ఇటు అఖండ 2 మూవీ టిమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో కొన్ని గంటల ముందు మా బాలయ్య మూవీకి ఏంటీ ఈ అడ్డంకులు అంటూ అభిమానులు తెగ  టెన్షన్ పడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

156
comment0
Report
Advertisement
Back to top