Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

Chiranjeevi Family: తిరుమలకు తరలివచ్చిన చిరంజీవి కుటుంబ మహిళలు

PPINEWZ
Dec 30, 2025 03:15:22
Chiranjeevi Family Uttara Dwara Darshan At Tirumala Temple Watch Video
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Dec 30, 2025 04:37:16
Secunderabad, Telangana:

Former prime minister and BNP chairperson Khaleda Zia:  బంగ్లాదేశ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒక శకానికి ముగింపు పలికింది. దేశ తొలి ప్రధాని.. మూడుసార్లు ప్రధానిగా చేసిన బేగం ఖలీదా జియా ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బేగం ఖలీదా జియా మరణంతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా మూగబోయింది. ఇక.. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను చూసినట్లయితే.. గత కొన్ని దశాబ్దాలుగా ఆ దేశ రాజకీయాలను ప్రధానంగా ఇద్దరు మహిళలు శాసించారు. ఒక వైపు బంగాబందు కుమార్తెగా పేరొందిన షేక్ హసీనా.. మరోవైపు ఉక్కు మహి, ప్రజాస్వామ్య తల్లిగా గుర్తింపు తెచ్చుకున్న బేగం ఖలీదా జియా.. వీరిద్దరి మధ్య జరిగిన రాజకీయ పోటీ, విభేదాలు, ఘర్షణలు, బంగ్లాదేశ్ రాజకీయాలకు దిశానిర్దేశం చేశాయి. 

బేగం ఖలీదా జియా 1945 ఆగస్టు 15న అప్పటి అవిభక్త బెంగాల్‌లోని జల్పైగురిలో జన్మించారు. ఈ ప్రాంతం ఇప్పుడు భారత్ లో ఉంది. ఆమె కుటుంబం తరువాత బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. 1959లో కేవలం 15 ఏళ్ల వయస్సులోనే.. పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేస్తున్న జియావుర్ రెహమాన్‌ను ఖలీదా జియా  వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఖలీదా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఒక సాధారణ గ్రుహిణిగా అన్ని బాధ్యతలు నిర్వర్తించారు.వారికి ఇద్దరు కుమారులు.. తారిక్ రెహమాన్, అరాఫత్ రెహమాన్ (కోకో)..వారి పెంపకమే ఆమె జీవితంగా సాగింది.

అయితే.. జియావుర్ రెహమాన్ జీవితం బంగ్లాదేశ్ చరిత్రలో కీలక మలుపు అని చెప్పవచ్చు. ఆయన 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 1977లో దేశ అధ్యక్షుడయ్యారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో.. 1981 మే 30న చిట్టగాంగ్‌లో జరిగిన ఓ సైనిక తిరుగుబాటు ప్రయత్నంలో జియావుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఖలీదా జియా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

భర్త మరణంతో ఆమె ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటి వరకు వంటింటికే పరిమితమైన జియా.. భర్త మరణంతో  బయటి ప్రపంచాన్ని చూసింది. ఆయన స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కూడా పతన అంచున నిలిచింది. పార్టీ కార్యకర్తల ఒత్తిడి, ప్రజల మద్దతుతో ఖలీదా 1982లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1984లో BNP అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి బంగ్లాదేశ్ సైనిక పాలకుడు హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్‌కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించారు.

ఎర్షాద్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఖలీదా జియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక సార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. చివరకు 1990లో ఎర్షాద్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జరిగిన 1991 సాధారణ ఎన్నికల్లో BNP విజయం సాధించడంతో ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.

ఆమె తొలి పదవీకాలంలో ఆర్థిక సంస్కరణలు.. ఎగుమతుల పెరుగుదల, తాత్కాలిక ప్రభుత్వ (కేర్‌టేకర్ గవర్నమెంట్) వ్యవస్థ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తరువాత కొంతకాలం రాజకీయ ఒడిదుడుకుల తర్వాత 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే, ఈ రెండో పదవీకాలం అవినీతి ఆరోపణలు, కుటుంబ రాజకీయాలు, మత ఛాందసవాదులపై చర్యలు వంటి అంశాలతో తీవ్ర వివాదాలకు లోనైంది.

ఇదే సమయంలో షేక్ హసీనా–ఖలీదా జియా మధ్య శత్రుత్వం మరింత తీవ్రమైంది. గత మూడు దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలు ఈ ఇద్దరి చుట్టూనే తిరిగాయి. వీరి మధ్య పోరును ప్రజలు  బేగంల యుద్ధంగా పిలిచేవారు. తొలుత ఎర్షాద్‌ను కూలదోసేందుకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ.. తర్వాత తీవ్ర రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. భర్త, తండ్రి హత్యలు, కుటుంబ వారసత్వాలు ఈ వైరాన్ని మరింత పెంచాయి.

Also Read: Railway stocks: దుమ్మురేపుతోన్న రైల్వే స్టాక్స్.. టికెట్ ఛార్జీల పెంపుతో.. 5 రోజుల్లో 26శాతం లాభాలు..!!

2008 తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖలీదా జియాపై అనేక అవినీతి కేసులు నమోదయ్యాయి. 2018లో ఆమె జైలుకు వెళ్లారు. తీవ్ర అనారోగ్య కారణాలతో తర్వాత బెయిల్‌పై విడుదలై గృహ నిర్బంధంలో ఉన్నారు. 2024లో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత పరిస్థితులు మారాయి. ఖలీదా జియాపై ఉన్న కేసులు ఎత్తివేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు VVIP భద్రత కల్పించింది. అయితే అప్పటికే ఖలీదా జియా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. లివర్ సిర్రోసిస్, కిడ్నీ వైఫల్యం, డయాబెటిస్, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆమె తీవ్రంగా బాధపడుతున్నారు. వెంటిలేటర్, డయాలసిస్ సహాయంతో చికిత్స పొందినా.. శరీరం చివరకు తట్టుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఆమె మరణానికి ఐదు రోజుల ముందు.. డిసెంబర్ 25న.. పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చాడు. రాజకీయ వేధింపుల కేసులతో 2008 నుంచి విదేశాల్లో ఉన్న తారిక్, అక్కడి నుంచే BNPని నడిపించాడు. అతని రాకకు లక్షలాది మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రిలో ఉన్న తల్లిని కలిసిన తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టాడు.

డిసెంబర్ 30, 2025 ఉదయం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో 80 ఏళ్ల వయసులో బేగం ఖలీదా జియా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు… బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక కీలక అధ్యాయానికి ముగింపు. ఇప్పుడు అందరి చూపూ తారిక్ రెహమాన్‌పైనే ఉంది. ఫిబ్రవరి 2026 ఎన్నికల్లో BNP బలమైన పోటీదారుగా నిలవనుంది. తల్లి రాజకీయ వారసత్వాన్ని తారిక్ ముందుకు తీసుకెళ్లగలడా? అస్థిరత, ఆర్థిక సంక్షోభం, హింసతో పోరాడుతున్న బంగ్లాదేశ్‌కు ఆయన నాయకత్వం దిశానిర్దేశం చేయగలదా? అనే ప్రశ్నలకు రాబోయే రోజులు సమాధానం చెప్పనున్నాయి.

Also Read:  Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 30, 2025 01:54:17
Hyderabad, Telangana:

Hyderabad Commissonarates: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం విభజించింది. జీహెచ్‌ఎంసీని విభజించినట్టు ప్రభుత్వం విభజన చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మూడు కమిషనరేట్‌లు ఉండగా.. ఇప్పుడు కొత్తగా నాలుగో కమిషనరేట్‌ ప్రకటించారు. అందులో భాగంగా నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ  కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.

Also Read: Heavy Cold Waves: తెలంగాణలో చలి ప్రచండం.. రెండు రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

నాలుగు పోలీస్ కమిషరేట్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం వెలువరించింది. కమిషనరేట్ల పరిధి నుంచి భువనగిరి జిల్లా మినహాయింపు చేశారు. పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Also Read: Tirumala Temple: ఇల వైకుంఠంగా తిరుమల ఆలయం.. శ్రీవారికి ఎవరూ దిష్టి పెట్టొద్దు

ప్రజలకు మెరుగైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగాంగా జీహెచ్‌ఎంసీని పునర్‌వ్యవస్థీకరించగా.. ఇప్పుడు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరించింది. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించినట్టు.. ఇతర శాఖలను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ, సచివాలయం, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు.

Also Read: Tirumala Temple: ఇల వైకుంఠంగా తిరుమల ఆలయం.. శ్రీవారికి ఎవరూ దిష్టి పెట్టొద్దు

ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలు పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్‌సీ పురం, అమీన్‌పూర్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి.

రాచకొండ స్థానంలో మల్కాజిగిరి
రాచకొండ కమిషనరేర్‌ను పునర్ వ్యవస్థీకరించిన ప్రభుత్వం మల్కాజిగిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. కీసర, శామీర్ పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని ప్రభుత్వం నియమించనుంది.

కొత్తగా ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Dec 29, 2025 15:49:41
Secunderabad, Telangana:

How 10 Minute Delivery Model Works: క్విక్ కామర్స్ యాప్‌లు ఈరోజుల్లో 10 నిమిషాల్లో డెలివరీ చేయడం చూస్తే అది ఏదో మాయలా అనిపిస్తుంది. కానీ దీని వెనుక రిస్క్ డ్రైవింగ్ ...టెక్నాలజీ.. డేటా విశ్లేషణ.. చక్కటి ప్లానింగ్ నెట్‌వర్క్ ఉంది. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ వంటి కంపెనీలు ఈ వ్యవస్థను ఉపయోగించి మన రోజువారీ షాపింగ్ అలవాట్లనే మార్చేశాయి. ఒక ఉదాహరణగా తీసుకుంటే.. మీరు టీ పెట్టేటప్పుడు చక్కెర అయిపోయింది అనుకోండి.. వెంటనే మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తారు. డికాషన్  మరిగేలోపే.. చక్కెర మీ ఇంటి గుమ్మం వద్ద ఉంటుంది. ఇంత ఫాస్టుగా ఎలా డెలివరీ చేస్తారు. తెలుసుకుందాం. 

క్విక్ కామర్స్ అంటే ఏమిటి?
క్విక్ కామర్స్ అనేది రోజువారీ అవసరాలైన కిరాణా, స్నాక్స్, పానీయాలు వంటి వస్తువులను చాలా తక్కువ సమయంలో వినియోగదారులకు చేరవేసే మోడల్. ఇందులో ప్రధానమైన అంశం ఏమిటంటే.. వస్తువులు మీ ఇంటికి చాలా దగ్గరలో ఉన్న గిడ్డంగిలోనే స్టోర్ అయి ఉంటాయి. సాధారణంగా ఈ గిడ్డంగి మీ ఇంటికి 1–2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే డెలివరీకి ఎక్కువ సమయం పట్టదు.

డార్క్ స్టోర్స్ – వేగానికి అసలైన బలం:
10 నిమిషాల డెలివరీకి ప్రధాన కారణం డార్క్ స్టోర్స్. ఇవి సాధారణ షాపులు కావు. కస్టమర్లు లోపలికి వెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉండదు. ఇవి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిన్న గిడ్డంగులు. బేస్‌మెంట్లు, ఖాళీ వాణిజ్య భవనాలు లేదా సందుల్లో ఇవి పనిచేస్తుంటాయి. మీ ఇంటికి దగ్గరగా ఉండటం వల్ల డెలివరీ సమయం గణనీయంగా తగ్గిపోతుంది.

Also Read: Railway stocks: దుమ్మురేపుతోన్న రైల్వే స్టాక్స్.. టికెట్ ఛార్జీల పెంపుతో.. 5 రోజుల్లో 26శాతం లాభాలు..!!

డేటానే నిర్ణయం తీసుకుంటుంది:
ఈ డార్క్ స్టోర్స్‌లో ఏ వస్తువులు నిల్వ చేయాలన్నది మేనేజర్ ఇష్టానికి వదిలేయరు. ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఏ వస్తువు ఎక్కువగా అమ్ముడవుతుందో కంపెనీలు డేటా ద్వారా తెలుసుకుంటాయి. ఉదాహరణకు.. రాత్రి సమయంలో ఒక ప్రాంతంలో ఐస్‌క్రీమ్ లేదా స్నాక్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటే.. ఆ స్టోర్‌లో అవే ఎక్కువగా నిల్వ చేస్తారు. దీనివల్ల కస్టమర్ ఆర్డర్ చేసిన వెంటనే వస్తువు అందుబాటులో ఉంటుంది.

ఆర్డర్ చేసేలోపే పని మొదలవుతుంది:
మీరు యాప్‌లో ఒక ఉత్పత్తిని సెర్చ్ చేసిన క్షణంలోనే సిస్టమ్ పని చేయడం మొదలుపెడుతుంది. సమీపంలోని డార్క్ స్టోర్‌లో స్టాక్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఏ ఉద్యోగి ప్యాక్ చేయాలి.. ఏ రైడర్ డెలివరీ చేయాలి అన్నది ముందుగానే నిర్ణయిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చెల్లింపు పూర్తి చేయకముందే ప్యాకింగ్ ప్రారంభమవుతుంది. సాధారణంగా మొత్తం ఆర్డర్ 60 నుంచి 90 సెకన్లలో ప్యాక్ అయిపోతుంది.

రియల్ టైమ్ GPS, రైడర్ ప్లానింగ్:
డెలివరీ రైడర్లు స్టోర్ దగ్గరే సిద్ధంగా ఉంటారు. GPS, AI ఆధారిత సాఫ్ట్‌వేర్ ద్వారా ఎవరు దగ్గరగా ఉన్నారు. ఏ రూట్‌లో ట్రాఫిక్ తక్కువగా ఉందో సిస్టమ్ నిర్ణయిస్తుంది. దీనివల్ల రైడర్ వేగంగా లేదా ప్రమాదకరంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా.. సమయానికి డెలివరీ పూర్తవుతుంది. ప్రతి నిమిషం టెక్నాలజీ ద్వారానే లెక్కిస్తుంది. 

మన షాపింగ్ అలవాట్లలో మార్పు:
ఈ 10 నిమిషాల డెలివరీ సౌలభ్యం మన ఆలోచన విధానాన్ని కూడా మార్చింది. ఒక నెలకు సరిపడా సరుకులు కొనడం తగ్గి..  అవసరమైనప్పుడు అవసరమైనంత మాత్రమే ఆర్డర్ చేసే అలవాటు పెరిగింది. దీని వల్ల కొనుగోళ్లు ఎక్కువసార్లు జరుగుతున్నాయి. సౌలభ్యం పెరిగింది కానీ ముందుగా ప్లాన్ చేసుకునే అలవాటు కొంత తగ్గింది.

Also Read:  Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!

క్విక్ కామర్స్ భవిష్యత్తు:
జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డన్జో వంటి కంపెనీలు తమ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి. భవిష్యత్తులో డెలివరీలు ఇంకా వేగంగా, వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా మారే అవకాశం ఉంది. 10 నిమిషాల డెలివరీ ఇక కేవలం సౌలభ్యం కాదు. పట్టణ జీవనశైలిలో ఒక భాగంగా మారుతోంది. టెక్నాలజీ, డేటా,  స్థానిక ఉనికిని సమర్థంగా కలపగలిగినవారే ఈ రంగంలో ముందుండనున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 29, 2025 14:37:52
Secunderabad, Telangana:

EPFO Big Update: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఈ ఏడాది మంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమయ్యే వార్షిక వడ్డీ ఈసారి భారీగా ఉండే అవకాశం ఉంది. సుమారు 8.75 శాతం వడ్డీ రేటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పీఎఫ్ అకౌంట్లో రూ. 5లక్షలు ఉన్న ఉద్యోగులకు వేలల్లో లాభం దక్కనుంది. 

ఉదాహరణకు.. ఒక ఉద్యోగి PF ఖాతాలో రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే.. ఏడాదికి దాదాపు రూ.44,000 వరకు వడ్డీ జమ అవుతుంది. ఇదే బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఉంటే.. వడ్డీ మొత్తం సుమారు రూ.51,000 వరకు చేరుతుంది. అంటే బ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే.. వడ్డీ రూపంలో వచ్చే ప్రయోజనం కూడా అంతగా పెరుగుతుందన్న మాట. ఈ విధంగా EPF దీర్ఘకాలంలో ఉద్యోగుల పదవీ విరమణ పొదుపును మరింత బలోపేతం చేస్తోంది.

ప్రతి సంవత్సరం EPFO వడ్డీ రేటును ప్రకటించినప్పటికీ..  కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాతే ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. వడ్డీ మొత్తం ఆటోమెటిగ్గా PF పాస్‌బుక్‌లో కనిపిస్తుంది. ఇందుకోసం సభ్యులు ఎలాంటి ప్రత్యేక దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.

Also Read:  Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!

తమ PF బ్యాలెన్స్.. వడ్డీ వివరాలను ఉద్యోగులు చాలా సులభంగా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. UMANG యాప్ లేదా EPFO సభ్యుల పోర్టల్ ద్వారా ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. UMANG యాప్‌లోకి వెళ్లి EPFO సేవలను ఎంచుకుని  పాస్‌బుక్ వ్యూ.. అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ UAN నంబర్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా ధృవీకరణ పూర్తిచేస్తే, సభ్యుల IDని ఎంచుకుని పాస్‌బుక్‌ను చూడవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎటువంటి అదనపు పెట్టుబడి చేయకుండానే ప్రతి ఏడాది వడ్డీ రూపంలో వచ్చే ఈ ఆదాయం ఉద్యోగులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. భద్రత, స్థిరత్వం, పన్ను ప్రయోజనాల పరంగా EPF ఇప్పటికీ జీతం పొందే ఉద్యోగులకు అత్యంత నమ్మకమైన పొదుపు పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, EPF ఖాతా భవిష్యత్తుకు బలమైన ఆర్థిక ఆధారంగా నిలుస్తోంది.

Also Read: Railway stocks: దుమ్మురేపుతోన్న రైల్వే స్టాక్స్.. టికెట్ ఛార్జీల పెంపుతో.. 5 రోజుల్లో 26శాతం లాభాలు..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 29, 2025 13:08:43
Hyderabad, Telangana:

KTR Chit Chat: జీహెచ్‌ఎంసీ విభజనపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. 'జీహెచ్ఎంసీని మూడు చేస్తారు. ఫోర్త్ సిటీ అని పెట్టాడు కదా దాన్ని కూడా ఏదో కార్పొరేషన్ చేస్తాడు కావచ్చు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకుంటారా? అన్నింటికి సమాధానం చెప్పాలి' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలి.. చర్చలో మేము అన్ని మాట్లాడతామని తెలిపారు.

Also Read: KTR Chit Chat: కేసీఆర్‌కు పేరు.. చంద్రబాబుకు కోపం వస్తుందని రేవంత్‌ రెడ్డి డ్రామాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ సోమవారం కేటీఆర్‌ మీడియాతో కేటీఆర్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిపాలన యంత్రాంగం విభజనపై స్పందించిన కేఈఆర్‌.. 'జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో..? ఎవరికి లాభం చేకూర్చేలా చేసుకుంటారో వాళ్ల ఇష్టం. మాకు 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక చరిత్రాత్మక ఎన్నిక. అలాంటి ఎన్నిక ఇప్పటివరకు చూడలేదు. మళ్లీ చూడబోము' అని తెలిపారు. కేవలం డబ్బులు సేకరణ కోసం మర్చంట్ బ్యాంకర్ బ్రోకర్లు చెప్పినట్లు చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. 'ఈ డిలిమిటేషన్ కేవలం డబ్బుల కోసం చేస్తున్నదే. అడ్డగోలుగా విభజన చేశారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా మేము రెండో స్థానంలో గెలవడం జరిగింది. గతంలో మేం గెల్చిన సీట్లు ఇంకా ఎవరు గెలవలేరు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Also Read: Tirumala Temple: ఇల వైకుంఠంగా తిరుమల ఆలయం.. శ్రీవారికి ఎవరూ దిష్టి పెట్టొద్దు

టెలిఫోన్ ట్యాపింగ్‌పై నానా హడావుడి చేస్తున్న రేవంత్‌ రెడ్డి తీరుపై కేటీఆర్ స్పందిస్తూ.. 'ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్‌ వస్తుంది. గుడాచారి వ్యవస్ధ నెహ్రు నుంచి నేటి దాకా ఉంది. శాంత్ర భద్రతలు, రాష్ట్ర రక్షణ కోసం చేస్తున్నారు. ఈ రోజు నిఘా వ్యవస్ధ లేదా? ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా? ప్రతిపక్షనాయకుల ఫోన్ ట్యాప్ చేయడం లేదా?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. ఫోన్లు ట్యాపింగ్‌ చేయడం లేదని రేవంత్‌ రెడ్డి చెప్పగలడా? అని సవాల్‌ చేశారు.

Also Read: KTR: రైతుబంధు పాలన పోయింది రాబందు పాలన వచ్చింది: కేటీఆర్

'ట్యాపింగ్ నిజం అయితే అధికారులు ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టడం లేదా? ఇప్పుడున్న డీజీపీ కూడా అప్పుడు అధికారులుగా ఉన్నారు. అయనకు కూడా నిఘా వ్యవస్ధ గురించి తెలుసు. ఏ విధంగా నిఘా వ్యవస్ధ పనిచేస్తుందో ముఖ్యమంత్రికి అధికారులు చెప్పరు. వారికున్న నిబంధనల మేరకు ఎలాం సమాచారం వస్తుందో కూడ సీఎం అడగరు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. 'ఈ సిట్ వంటి డ్రామాలతో ఎన్ని రోజులు ప్రజల దృష్టిని తప్పిస్తారు. ఈ అటెన్షన్ డైవర్షనతో ఎన్ని రోజులు కాలం వెల్లదీస్తారు? ఇన్ని సిట్‌లు,  విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటి?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

కనీసం ఒక్క దాంట్లో అయినా నిజం ఉందని తేలిందా? అని కేటీఆర్‌ నిలదీశారు. 'ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారు.  అందుకే మాకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మాకు ఒటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన రాదు అని తేలిపోయింది. కాంగ్రెస్ అప్పుల ప్రచారం కూడా ప్రజలు నమ్మడం లేదు. కాగ్ లెక్కలు నిజాల కూడా ప్రజలకు తెలుసు. 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్‌ నిలదీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top