Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

Tadipatri: జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి బస్తీ మే సవాల్‌

PPINEWZ
Jan 17, 2026 05:07:44
Watch Kethireddy Pedda Reddy Challenge To JC Prabhakar Reddy Viral Video
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Jan 17, 2026 05:06:22
Lakshmapur, Telangana:

EPF Money Via UPI Soon: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక సౌలభ్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా తక్షణమే PF మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే దాదాపు 8 కోట్ల మంది సభ్యులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు క్లెయిమ్ దాఖలు, ధృవీకరణ, బ్యాంక్ బదిలీ వంటి ప్రక్రియలతో కొంత సమయం తీసుకున్న ఉపసంహరణలు, ఇకపై చాలా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సంస్కరణ ద్వారా ‘జీవన సౌలభ్యం’ను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత విధానం ప్రకారం, EPF సభ్యులు తమ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన UPI గేట్‌వే ద్వారా తమ అర్హత కలిగిన PF బ్యాలెన్స్‌ను నేరుగా చూడగలుగుతారు. అవసరమైన మొత్తాన్ని UPI పిన్ సహాయంతో సురక్షితంగా తమ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. ఒకసారి డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత, దానిని ATMల ద్వారా నగదుగా తీసుకోవచ్చు లేదా డిజిటల్ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు.

భద్రత మరియు భవిష్యత్ పొదుపుల దృష్ట్యా, మొత్తం PFలో కొంత భాగాన్ని ‘ఫ్రీజ్’గా ఉంచే విధానాన్ని కూడా EPFO ప్రవేశపెట్టనుంది. కొత్త నిబంధనల ప్రకారం, సభ్యులు తమ మొత్తం సహకారంలో కనీసం 25 శాతం మొత్తాన్ని ఖాతాలో తప్పనిసరిగా నిల్వగా ఉంచాలి. మిగిలిన మొత్తాన్ని అవసరాల మేరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ 25 శాతం నిల్వపై ప్రస్తుత 8.25 శాతం వడ్డీ రేటుతో పాటు కాంపౌండింగ్ లాభం కొనసాగుతుంది. దీని వల్ల పదవీ విరమణ సమయానికి సభ్యులకు పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంటాయి.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

ఇక ఉపసంహరణలకు సంబంధించిన క్లిష్టమైన నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. ఇప్పటివరకు ఉన్న 13 రకాల పాక్షిక ఉపసంహరణ నిబంధనలను తొలగించి, వాటిని మూడు ప్రధాన వర్గాలుగా విభజించింది. అవి అత్యవసర అవసరాలు (వైద్య చికిత్స, విద్య, వివాహం), గృహ అవసరాలు మరియు ప్రత్యేక పరిస్థితులు. ఈ మార్పులకు EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ఆమోదించిన వెంటనే ఇవి అమల్లోకి వస్తాయి.

ప్రస్తుతం EPFO ప్రతి ఏడాది దాదాపు 5 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఉపసంహరణలకే సంబంధించినవి. ఆటో సెటిల్‌మెంట్ విధానంలో రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు మూడు రోజుల్లోనే పూర్తవుతున్నప్పటికీ, UPI ఏకీకరణతో ఈ సమయం మరింత తగ్గనుంది. EPFOకు స్వంత బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోయినా, UPI అనుసంధానంతో బ్యాంకింగ్ తరహా సేవలను అందించే స్థాయికి సంస్థ చేరుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం సజావుగా అమలయ్యేలా అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు, సాంకేతిక లోపాల పరిష్కారంపై ప్రస్తుతం EPFO తీవ్రంగా పనిచేస్తోంది.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 16, 2026 17:28:13
Hyderabad, Telangana:

Sampath Kumar Harassment: నేషన్ హైవే 44 పనుల్లో రూ.8 కోట్లు డబ్బులు ఇస్తేనే పనులు సాగనిస్తానని బెదిరింపులు కాంగ్రెస్‌ నాయకుడు సంపత్ కుమార్‌ బెదిరింపులకు పాల్పడడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ పార్టీ ఆలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు కీలక విషయాలు వెల్లడించారు. మండల స్థాయి అధికారులను నిత్యం భయపెట్టి వసూలు చేస్తున్నాడని.. వసూలు రాజాగా సంపత్‌ మారాడని ఆరోపించారు. 

Also Read: Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో-2 దశపై కీలక పరిణామం.. ఏం జరిగిందో తెలుసా?

హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సంపత్‌ కుమార అక్రమాలు, కమీషన్‌కు దాడులకు పాల్పడడం వంటి అంశాలను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే విజయుడు వివరించారు. వసూల్ రాజా సంపత కుమార్‌పై అన్ని ఆధారాలు ఉన్నాయని.. త్వరలోనే బయట పెడతామని ప్రకటించారు. నడిగడ్డ నీ రాజ్యం కాదు ప్రజలదని స్పష్టం చేశారు.

Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్‌పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి

'40 వేల ఓట్లతో ఆయన ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. తనను ముట్టుకుంటే అగ్గి అవుతారు అన్నాడు. అగ్గి కాదు కానీ మట్టి అవుతారు ఎందుకంటే మీరు చేసే అక్రమ దందా మట్టి దందానే. జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఆయన జాతీయ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ నాయకుడు కనుక మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్తారా? లేక హోమ్ మంత్రి అలియాస్ రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్తారా?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకుడు మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.

Also Read: Sankranti Offer: సంక్రాంతికి బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే విమాన టికెట్‌

'జర్నలిస్టుల మీద సిట్ వేసిన ప్రభుత్వం ఇతని మీద సిట్ విచారణ వేస్తారా? మారణాయుధాలతో బెదిరించారు అని శ్రీ భ్రమర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఫిర్యాదు చేసింది. రేపు అక్కడకు పర్యటనకు వెళ్తున్న రేవంత్‌ రెడ్డి సిట్ విచారణ వేయాలి' అని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. సంపత్‌ మాట్లాడిన బూతులు చూస్తూ బయట పెట్టడం లేదు. సంపత్ సతీమణి ప్రభుత్వ టీచర్ అంట.మరి విధులకు వెళ్తుందో లేదో తెల్వదు ఆయన ఏదో మ్యానేజ్ చేసుకుంటున్నారు. ఆయన అఫిడవిటలో ఎలాంటి భూములు లేవని నిల్ అని పెట్టారు. ఇప్పుడు మాత్రం అసైన్డ్స్ ల్యాండ్  రెండు ఎకరాలు సతీమణి మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా కబ్జాలు చాలా ఉన్నాయి.అన్ని ఆధారాలు ఉన్నాయి' అని మన్నె క్రిశాంక్ వెల్లడించారు.

'సంపత్ అబ్బాయి ఒక్క కంపెనీ డైరెక్టర్. 100 పడకల హాస్పిటల్ కేసీఆర్ సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేశారు. కానీ సంపత్ కుమార్ కొడుకు గ్లోబెన్ కంపెనీకి మాత్రమే టెండర్లు రావాలి అని బెదిరిస్తున్నారు. కాంటాక్ట్ రావాలి అంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రమే రావాలి. ఇందులో కాంట్రాక్ట్ మాత్రం వాళ్ల అబ్బాయికి ఇచ్చారు. చిన్నది అయిన పెద్దది అయిన మట్టి అయిన ఇంకా ఏదైనా టెండర్ రావాలి అంటే కేవలం సంపత్ కుమార్ కుటుంబ సభ్యులకు మాత్రమే రావాలి' అని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Jan 16, 2026 16:11:00
Lakshmapur, Telangana:

EPFO Digital Life Certificate: పెన్షన్‌దారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఒక కీలకమైన, ఉపయోగకరమైన నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్‌ (EPS) కింద పెన్షన్ పొందుతున్న వారు ఇకపై ఇంటి వద్ద నుంచే ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సమర్పించుకునే వెసులుబాటు కల్పించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ (IPPB)తో భాగస్వామ్యంలో ఈ కొత్త సేవను అమలులోకి తీసుకొచ్చింది.

ప్రతి ఏడాది పెన్షన్ కొనసాగాలంటే లైఫ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్నవారు లేదా స్మార్ట్‌ఫోన్‌లు, బయోమెట్రిక్ కేంద్రాలు అందుబాటులో లేని పెన్షనర్లకు ఇది పెద్ద సమస్యగా మారుతోంది. బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా EPFO కార్యాలయాలకు వెళ్లడం చాలా మందికి శారీరకంగా, మానసికంగా భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని EPFO ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.

జనవరి 9, 2025న విడుదల చేసిన అధికారిక సర్క్యులర్‌లో EPFO ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. చాలా మంది EPS పెన్షనర్లు టెక్నాలజీపై అవగాహన లేకపోవడం, స్మార్ట్‌ఫోన్‌లు లేని కారణంగా లేదా బయోమెట్రిక్ ధృవీకరణ కేంద్రాలు దూరంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, IPPB సహకారంతో డోర్‌స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవను ప్రారంభించినట్లు వెల్లడించింది.

ఈ సేవలో భాగంగా, పోస్ట్‌మ్యాన్ లేదా డాక్ సేవక్ నేరుగా పెన్షనర్ ఇంటికే వస్తారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్‌ను అక్కడికక్కడే డిజిటల్‌గా సబ్‌మిట్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు పెన్షనర్ల నుంచి ఎటువంటి ఛార్జీ వసూలు చేయరు. ఈ సేవకు సంబంధించిన ఖర్చును EPFO సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ అండ్ రికార్డ్ సెంటర్ భరిస్తుంది.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

హోమ్ విజిట్‌ను ఎలా బుక్ చేసుకోవాలి?
పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు IPPB కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి డోర్‌స్టెప్ సర్వీసును బుక్ చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేసిన తర్వాత సంబంధిత పోస్ట్‌మ్యాన్ లేదా డాక్ సేవక్‌కు హోమ్ విజిట్ కేటాయిస్తారు. వారు నిర్ణీత తేదీన పెన్షనర్ ఇంటికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను పూర్తిచేస్తారు. దీంతో పెన్షనర్‌కు బ్యాంకులు లేదా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?
పెన్షన్‌దారు జీవించి ఉన్నారని నిర్ధారించేందుకు లైఫ్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ పంపిణీ సంస్థలు ఈ ధృవీకరణ ఆధారంగానే నెలవారీ పెన్షన్‌ను ఖాతాలో జమ చేస్తాయి. పెన్షనర్ మరణించిన తర్వాత తప్పుడు క్లెయిమ్‌లు జరగకుండా నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఇది ప్రభుత్వ నిధుల పరిరక్షణకు, అలాగే నిజమైన లబ్ధిదారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది.

మొత్తంగా, EPFO తీసుకొచ్చిన ఈ డోర్‌స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవ వృద్ధులు, అసహాయ పెన్షనర్లకు ఎంతో ఊరట కలిగించే నిర్ణయంగా నిలవనుంది. పెన్షన్ ప్రక్రియను మరింత సులభం, పారదర్శకం, ప్రజాహితంగా మార్చే దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావించవచ్చు.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 16, 2026 16:09:53
Tadipatri, Andhra Pradesh:

Kethireddy Peddareddy vs JC Prabhakar Reddy: ఆర్థిక సంఘం నిధుల విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని.. దీనిపై తాను ఎక్కడికైనా.. ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధమని జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన సవాల్‌ చేశారు. ప్రభుత్వం నిర్వహించే స్పందన కార్యక్రమంలో సామాన్యుల ఫిర్యాదులకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఫిర్యాదు ఇస్తేనే చర్యలు కరువయ్యాయని ఆరోపించారు. స్పందన అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని, ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే పరిష్కారాలు ఎలా లభిస్తాయని ప్రశ్నించారు.

Also Read: YS Jagan: పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

అనంతపురంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. '15వ ఆర్థిక సంఘంలో పెద్ద అవినీతి జరిగిందని.. ఎరువు వంకపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు తక్షణం స్పందించి ప్రారంభం నుంచి చివరి వరకు సర్వే చేసి దానిలో వైఎస్సార్‌సీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా చర్యలు తీసుకోవాలి' అని సవాల్‌ చేశారు. 'తాడిపత్రిలో డ్రైనేజీ నీరు కాలనీల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రద్ధ పెట్టాలని లేదా అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యను పరిష్కరించాలి' అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో-2 దశపై కీలక పరిణామం.. ఏం జరిగిందో తెలుసా?

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడకుండా పౌరుషం గురించి మాట్లాడాడని ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి పౌరుషం గురించి మాట్లాడుతున్నాడని  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. వెంకట్రామిరెడ్డి ఏదైనా తప్పు మాట్లాడితే ప్రభుత్వం నుంచి వకాల్తా తీసుకొని ఖండించాలి తప్ప మా కుటుంబంపై పదే పదే టార్గెట్ చేసి మాట్లాడటం సరికాదు' అని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. ఒకవేళ గొడవలు కావాలి అంటే టైమ్ డేట్ ఫిక్స్ చేసి చెప్పాలని..  మీ కుటుంబం మా కుటుంబం రెండు కుటుంబాలు మాత్రమే కొట్టుకోవాలని సవాల్‌ చేశారు.

Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్‌పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి

'దమ్ము ఉంటే ఎస్పీకి ఈ గొడవలో ఎవరి మీద కేసులు నమోదు చేయకూడదని ఒక లేఖ ద్వారా తెలియచేసి రాయలసీమలో ఏ సెంటర్‌కి రమ్మన్నా.. వస్తానని' అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అమాయక ప్రజలను ఉసిగొల్పి  వారి ప్రాణాలను బలి తీయవద్దు అని జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. తమ కొడుకు గురించి కూడా మాట్లాడుతున్నారని పోలీసులు అడ్డుకోకపోతే తాడిపత్రిలో తిరగడానికి నా కొడుకును గంటల్లో పిలుస్తానని ప్రకటించారు.

తాడిపత్రిలో పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నలలో నడుస్తున్నారు తప్ప ఎస్పీ చెప్పినట్టు వినడం లేదని ఆరోపించారు. క్రైమ్‌ రేట్ లేకపోయినా తాడిపత్రిలో అమాయకులను తీసుకువచ్చి పోలీసులు ప్రగల్భాలు పలుకుతున్నారని.. అసలైన వారిని అరెస్ట్ చేసి పోలీసులు నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు. ప్రభాకర్ రెడ్డి ఏదైనా మాట్లాడాలి అంటే మీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధంగా ఉంటే చెప్పాలని సవాల్‌ చేశారు. బూటకపు మాటలు వదిలి అభివృద్ధి పై దృష్టి సారించాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Jan 16, 2026 15:44:17
Lakshmapur, Telangana:

Budget 2026: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టున్న బడ్జెట్ 2026పై సామాన్యులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.  బడ్జెట్ 2026తో ఎలక్ట్రానిక్ వస్తువులు చౌకగా మారతాయని చాలా మంది వినియోగదారులు ఆశిస్తున్నారు. అయితే పరిశ్రమ వర్గాలు మాత్రం ఈ ఆశలకు విరుద్ధమైన సంకేతాలను ఇస్తున్నాయి. బడ్జెట్ ప్రభావంతో ధరలు తగ్గే అవకాశం కంటే..  రాబోయే నెలల్లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరింత ఖరీదయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు (AI) , హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) రంగాల్లో వేగంగా పెరుగుతున్న వినియోగం. ఈ విస్తరణ వల్ల మెమరీ చిప్‌లపై డిమాండ్ భారీగా పెరిగింది. అదే సమయంలో సరఫరా పరిమితంగా ఉండటంతో మెమరీ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ తయారీదారులపై పడుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం... వచ్చే రెండు నెలల్లోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు మరో 4 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త విషయం కాదు. ఇప్పటికే గత నవంబర్–డిసెంబర్ నెలల్లోనే స్మార్ట్‌ఫోన్ ధరలు సగటున 3 శాతం నుంచి 21 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది మొత్తం ధరల పెరుగుదల ఒకేసారి కాకుండా, ప్రతి త్రైమాసికం లేదా కొన్ని సందర్భాల్లో నెలవారీగా కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ప్రపంచ మెమరీ మార్కెట్ ప్రస్తుతం  హైపర్-బుల్  దశలో ఉంది. అంటే ధరలు చాలా వేగంగా, నిరంతరంగా పెరుగుతున్న పరిస్థితి. గత త్రైమాసికంలోనే మెమరీ చిప్ ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ప్రస్తుత త్రైమాసికంలో మరో 40–50 శాతం వరకు పెరుగుదల నమోదవుతుండగా, ఏప్రిల్–జూన్ కాలంలో కూడా అదనంగా 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పరిశోధన డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ, ఈ ధరల భారాన్ని ఇప్పటికే కొన్ని బ్రాండ్‌లు వినియోగదారులపై మోపడం ప్రారంభించాయని తెలిపారు. వివో, నథింగ్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జనవరిలోనే తమ హ్యాండ్‌సెట్ ధరలను రూ.3,000 నుంచి రూ.5,000 వరకు పెంచాయి. మరోవైపు, శామ్‌సంగ్ వంటి బ్రాండ్‌లు నేరుగా ధరలు పెంచకుండా, ఇప్పటివరకు అందిస్తున్న క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్లు, డిస్కౌంట్‌లను తగ్గించడం ద్వారా పరోక్షంగా ధరల పెంపును అమలు చేస్తున్నాయి.

తరుణ్ పాఠక్ మాటల్లో చెప్పాలంటే.. 2026లోనే కాకుండా వచ్చే ఏడాదిలో కూడా మెమరీ చిప్‌ల ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త మోడళ్ల లాంచ్ సమయంలో బ్రాండ్‌లు ఈ ఖర్చును లెక్కలోకి తీసుకుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ధరలు అదుపులో ఉంచేందుకు డిస్ప్లేలు లేదా ఇతర భాగాల నాణ్యతను కొద్దిగా తగ్గించడం వంటి  కాస్ట్ కటింగ్ చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని ఆయన తెలిపారు.

మెమరీ చిప్‌ల సరఫరా కూడా పెద్ద సవాలుగా మారింది. కోడాక్, థామ్సన్, బ్లాపంక్ట్ వంటి టీవీ బ్రాండ్‌లను విక్రయిస్తున్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సంస్థ తనకు అవసరమైన మెమరీ చిప్ ఆర్డర్లలో కేవలం 10 శాతం మాత్రమే అందుకోగలుగుతోందని తెలిపింది. ఇది తయారీ, సరఫరా చైన్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ధరల పెరుగుదల ఎలా జరుగుతోందో సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా వివరించారు. ఆయన ప్రకారం, నవంబర్‌లో ధరలు 7 శాతం పెంచగా, డిసెంబర్‌లో మరో 10 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో మళ్లీ 4 శాతం పెంపు ప్రణాళికలో ఉంది. అంతేకాదు, రాబోయే రిపబ్లిక్ డే సేల్‌లో కూడా గతంలా భారీ డిస్కౌంట్‌లు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

రిటైల్ రంగం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. ల్యాప్‌టాప్ ధరలు ఇప్పటికే 5–8 శాతం వరకు పెరిగాయని రిటైలర్లు చెబుతున్నారు. ప్రధాన టీవీ కంపెనీలు కూడా త్వరలో ధరల పెంపును అమలు చేయనున్న సంకేతాలు ఇస్తున్నాయి. గ్రేట్ ఈస్టర్న్ రిటైల్ డైరెక్టర్ పుల్కిత్ బైద్ మాట్లాడుతూ..  ఈ ధరల పెరుగుదల డిమాండ్‌పై తక్షణ ప్రభావం చూపుతుందని, వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసే అవకాశం ఉందని అన్నారు.

ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) గణాంకాల ప్రకారం..  నవంబర్–డిసెంబర్ కాలంలోనే స్మార్ట్‌ఫోన్ ధరలు 3 నుంచి 21 శాతం వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా మొబైల్ స్టోర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న AIMRA, బ్రాండ్‌ల నుంచి అందిన సంకేతాల ఆధారంగా, రాబోయే నెలల్లో మొత్తం ధరల పెరుగుదల 30 శాతం వరకు చేరవచ్చని హెచ్చరిస్తోంది.

ధరల పెరుగుదల వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం తప్పదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. AIMRA చైర్మన్ కైలాష్ లఖ్యాని మాట్లాడుతూ, ఈ పరిస్థితి వల్ల మార్కెట్‌లో 10–12 శాతం వరకు క్షీణత రావచ్చని అన్నారు. ముఖ్యంగా రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్‌ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. ఎందుకంటే భారతదేశంలో ఇదే అతిపెద్ద అమ్మకాల సెగ్మెంట్. ఇప్పటికే వినియోగదారులు  వేచి చూసే  ధోరణిలోకి వెళ్లిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2026లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గతంలో అంచనా వేసిన 2 శాతం క్షీణతను మించిపోయే అవకాశం ఉందని తెలిపింది. మెమరీ చిప్ ధరలు పెరగడం, హ్యాండ్‌సెట్ ధరలు ఎక్కడం, రూపాయి విలువ బలహీనపడటం ఇవన్నీ కలిసి మార్కెట్‌పై అదనపు ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు, 4GB RDIMM మెమరీ ధర సెప్టెంబర్ 2025లో డాలర్ 255గా ఉండగా.. డిసెంబర్ నాటికి అది డాలర్ 450కి చేరింది. మార్చి 2026 నాటికి అదే ధర డాలర్ 700 వరకు వెళ్లవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026 నుంచి తక్షణ ధరల ఊరట ఆశించడం కష్టమేనని పరిశ్రమ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 16, 2026 15:38:26
Hyderabad, Telangana:

Hyderabad: 'విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారు. పదేళ్లు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీపై ఆలోచ‌న చేయ‌లేదు. తెలంగాణ యువ‌త గురించి ఆలోచించ‌లేదు. వాళ్ల ఉద్యోగాలు తొల‌గిస్తేనే మాకు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నిరుద్యోగ యువ‌త న‌డుం బిగించారు కాబ‌ట్టే ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'టీఎస్‌పీఎస్సీలో దారుణ ప‌రిస్థితులు అంద‌రికీ తెలుసు. పద్నాలుగేళ్ల పాటు గ్రూప్ 1 నియామ‌కాలు చేప‌ట్ట‌లేక‌పోయారు. ఇంతకంటే దారుణం, ఘోరం ఎక్క‌డైనా ఉంటుందా?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: Sankranti Offer: సంక్రాంతికి బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే విమాన టికెట్‌

'టీఎస్‌పీఎస్సీని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం. యూపీఎస్సీని స్వ‌యంగా ప‌రిశీలించి టీఎస్‌పీఎస్సీని ఏర్పాటు చేశాం. తెలంగాణ ప‌ట్ల చిత్త‌శుద్ది ఉన్న‌వాళ్లేనే టీఎస్‌పీఎస్సీ స‌భ్యులుగా నియ‌మించాం. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశాం. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. భ‌విష్య‌త్తు త‌రాల‌కు మీ ఉద్యోగాలు దిక్సూచిగా మారుతుందని చెప్పారు.

Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్‌పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి

'తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. తెలంగాణ రాష్ట్ర పున‌ఃనిర్మాణంలో మీమ్మ‌ల్ని భాగ‌స్వాములు చేస్తోంది. ఉద్యోగ నియామ‌కాల‌తో మమ్మ‌ల్నీ క‌లిసి మీ క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నే ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశాం. విద్య అంద‌రికీ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికి నాణ్య‌మైన విద్య ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేదు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌పైన ఎందుకు విశ్వాసం త‌గ్గుతుందో ఆలోచించాలి?' అని రేవంత్‌ రెడ్డి సూచించారు.

Also Read: Revanth Reddy: ఆదిలాబాద్‌పై రేవంత్‌ రెడ్డి వరాలు.. ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రీయల్‌ కారిడార్‌

'పేద‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తే ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌గ‌ల‌మనే విశ్వానం నాకు ఉంది. ‌దేశంలోనే అత్య‌ధికంగా వ‌రి పండించే రాష్ట్రం గా తెలంగాణ నిల‌బ‌డింది. నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం, స్కిల్‌పై దృష్టి పెడుతున్నాం. స్కిల్ లేక‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. విద్య‌లో స్కిల్ చాలా ముఖ్య‌మైన‌ది.. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం ప‌నిచేయాల్సి ఉంది' అని గుర్తుచేశారు.

'నాణ్య‌మైన విద్య‌ను అందించే అవ‌కాశం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉంది. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది. ప్ర‌భుత్వానికి వార‌ధులు, సార‌ధులు ప్ర‌భుత్వ ఉద్యోగులే' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గ‌రం, న‌రం, బేష‌ర‌మ్ నానుడి త‌ప్పు అని ఉద్యోగులు నిరూపించాలి. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని  ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలి' అని సూచించారు. త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వంగా చూసుకొని ఉద్యోగుల‌ జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి త‌ల్లిదండ్రుల‌కు అంద‌జేస్తామని ప్రకటించారు. త‌ల్లిదండ్రుల‌ను స‌రిగా చూసుకోని వాళ్లు మాన‌వ జ‌న్మ‌లో ఉండొద్దని చెప్పారు. 'రాజ‌కీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 16, 2026 14:44:24
Nirmal, Telangana:

Adilabad Airport: 'ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరైనా ఏర్పాటు జాప్యమైంది. బాసర ఐఐటీలో యూనివర్సిటీకి ఏర్పాటు చేసుకుందాం. ఒక నివేదిక తయారు చేసి ఇస్తే ఆదిలాబాద్‌కు కావాల్సిన అభివృద్ధి, రావాల్సిన నిధులను మంజూరు చేసుకుందాం. ఆదిలాబాద్ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సిందే. బడ్జెట్ సమావేశాల లోపు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌ను ఆదేశాలు ఇస్తున్నా' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Also Read: Traffic Diversion: సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ వాహనాలు దారి మళ్లింపు

నిర్మల్‌లో ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 'ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. జల్ జంగల్ జమీన్ అని నినదించిన పోరాటాల గడ్డ ఇది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. అందుకే పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు ఇస్తానని చెప్పా. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా అభివృద్ధి పథంలో సాగేది. కానీ కారణాలు ఏవైనా ప్రాజెక్టులు పూర్తి కాలేదు' అని రేవంత్ రెడ్డి వివరించారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్టుల పూర్తి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

Also Read: YS Jagan: పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

'తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించుకుందాం.. ప్రతీ చుక్కను ఒడిసిపట్టుకుని ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసుకుందాం. ఆదిలాబాద్‌లో ఎయిర్ బస్ తిరిగేలా ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసుకుందాం. ఎయిర్‌పోర్టు ఒక్కటే ఏర్పాటు ఒక్కటే కాదు అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసుకుందాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పదివేల ఎకరాలు సేకరించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.

'ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు ముగిసాక అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళదాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు. ప్రజలకు మంచి జరగాలన్నదే మా ఆలోచన. ప్రజల కోసం.. ప్రాంత అభివృద్ధి కోసం ఎవరినైనా కలవడానికి వెనకాడ. నేను పైరవీల కోసం ఎవరి దగ్గరకు వెళ్లను. నాకు పర్సనల్ ఎజెండాలు లేవు' అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆనాటి పాలకులు చేసిన అప్పులు.. ఉతితాడుగా మారి ప్రజల ఊపిరి తీసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

'రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తా. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మంజూరు చేయించుకుందాం. దీనికి బీజేపీ ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలి. పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ఎజెండా. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం.. సన్నాలకు బోనస్ అందిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో-2 దశపై కీలక పరిణామం.. ఏం జరిగిందో తెలుసా?

'మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం.. ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డలని యజమానులను చేశాం. మహిళా స్వయంసహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్దుతున్నాం. ప్రజలకు మంచి జరుగుతుంటే పదేండ్లు అధికారం అనుభవించినవాళ్లు చూసి ఓర్వలేకపోతున్నారు. నేను ప్ఫిపోయినవారి గురించి, పడిపోయిన వారి గురించి మాట్లాడదలచుకోలేదు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచి చేయడానికే కేటాయిస్తా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసేవారిని, అభివృద్ధి చేసే వారినే గెలిపించుకోండి. గత ఎన్నికల్లో గెలిచాం.. రాబోయే ఎన్నికల్లో గెలుస్తాం. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తాం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top