Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sangareddy502313
Petrol Price: పెట్రోల్ ధరలకు రెక్కలు విరుగుతాయా? యుద్ధం ఆపేందుకు ట్రంప్ మాస్టర్ ప్లాన్.. జెడి వాన్స...
BBhoomi
Mar 29, 2026 04:14:40
Lakshmapur, Telangana

Petrol Price:  ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ముదురుతున్న వేళ, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఇంధన ధరల విషయంలో కొంత ఆశాజనకమైన వార్తను పంచుకున్నారు. ఇరాన్-అమెరికా మధ్య సాగుతున్న పోరు వల్ల ఆకాశాన్నంటిన పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇది జరగాలంటే ఇరాన్ సముద్ర మార్గాల్లో చేస్తున్న దురాక్రమణకు ముగింపు పలకడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.

పెరుగుతున్న ఇంధన ధరలు - వాన్స్ విశ్లేషణ:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికా వంటి శక్తివంతమైన దేశాల్లో సైతం గ్యాస్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనిపై స్పందించిన జె.డి. వాన్స్, అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశం ఇరాన్‌తో దశాబ్దాల పాటు యుద్ధం చేయడం కాదని పేర్కొన్నారు. "మా లక్ష్యం స్పష్టం.. పని పూర్తి చేయడం మరియు త్వరగా బయటకు వచ్చేయడం (Get the job done and get out). ఇరాన్ నావికాదళం అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు సవాలు విసరలేనంతగా దానిని శక్తిహీనంగా మార్చడమే మా ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం" అని ఆయన వివరించారు. ఈ సైనిక చర్య విజయవంతం కాగానే చమురు సరఫరా పునరుద్ధరించబడి, ధరలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు.

ఇరాన్ నౌకాదళంపై తుది పోరు:
ఇరాన్ సైనిక స్థావరాలు మరియు నౌకాదళ నౌకలను లక్ష్యంగా చేసుకుని జరిపిన క్షిపణి దాడుల తాలూకు దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేసింది. దశాబ్దాలుగా అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి ముగింపు పలికామని అమెరికా ధీమా వ్యక్తం చేస్తోంది. వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ క్షిపణి కేంద్రాలను అమెరికా సేనలు ధ్వంసం చేశాయి.

Also Read: PM E-DRIVE: ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. పీఎం ఈ-డ్రైవ్ గడువు పొడిగింపు..ఆ లోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరి!  

పరస్పర విరుద్ధ నివేదికలు - యుద్ధ క్షేత్రంలో అసలేం జరుగుతోంది?
అమెరికా తాను విజయం సాధించానని చెప్తుంటే, ఇరాన్ మీడియా మాత్రం మరో భయంకరమైన కథనాన్ని వినిపిస్తోంది. దుబాయ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భీకరంగా విరుచుకుపడిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ దాడిలో వందలాది మంది అమెరికా సైనికులు మరణించారని, క్షతగాత్రులను తరలించడానికి అంబులెన్సులు గంటల తరబడి శ్రమించాయని ఇరాన్ నివేదికలు చెబుతున్నాయి. ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు అంతర్జాతీయ సమాజంలో మరింత ఆందోళనను పెంచుతున్నాయి.

 Also Read: Copper Price Crash 2026: రాగి దెబ్బ.. బంగారం అబ్బా.. భారీగా పడిపోయిన కాపర్ ధరలు.. తదుపరి టార్గెట్ పసిడియేనా?  

యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం యుద్ధ క్షేత్రంలోనే దాగి ఉంది. అమెరికా తన 'క్విక్ ఎగ్జిట్' ప్లాన్ అమలు చేసి ధరలను అదుపులోకి తెస్తుందా లేక ఇరాన్ ప్రతిఘటనతో ఈ సంక్షోభం మరిన్ని రోజులు కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Mar 29, 2026 03:58:36
Lakshmapur, Telangana:

No Kings protest America March 2026: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి.  నో కింగ్స్ అనే శక్తివంతమైన నినాదంతో ఈ శనివారం అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో సుమారు 3,300 కంటే ఎక్కువ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇది అమెరికా దేశీయ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద నిరసన దినంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఉద్యమానికి పునాది.. ఆ ఇద్దరి మరణం : ఈ నిరసనలకు ప్రధాన కేంద్రం మిన్నియాపాలిస్. జనవరిలో ఫెడరల్ అధికారులు జరిపిన కాల్పుల్లో రెనీ గుడ్,  అలెక్స్ ప్రెట్టి అనే ఇద్దరు అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వలసదారులపై అణిచివేత పేరుతో ఫెడరల్ ఏజెంట్లు జరిపిన ఈ దాడులు, సామాన్య ప్రజల్లో భయాందోళనలను పెంచాయి. ముఖ్యంగా ముసుగులు ధరించిన ఏజెంట్లు వీధుల్లో తిరుగుతూ ప్రజలను వేధించడం అమెరికన్లకు తమ ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పోగొట్టింది.

ఇరాన్ యుద్ధం .. సామాన్యుడిపై భారం:
నిరసనకారుల ఆగ్రహానికి మరో ప్రధాన కారణం.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనడం. గత నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటివరకు 1,500 మంది ఇరాన్ పౌరులు,  13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతిని, అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాల ధరలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురవ్వడం సామాన్య కుటుంబాలను రోడ్లపైకి వచ్చేలా చేసింది.

హోంల్యాండ్ సెక్యూరిటీ షట్‌డౌన్.. విమానాశ్రయాల్లో గందరగోళం:
మరోవైపు వలస విధానాలపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఫిబ్రవరి 14 నుండి  డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ  (DHS) మూతపడింది. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది కొరత ఏర్పడి, ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించి, రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోందని ప్రజలు మండిపడుతున్నారు.

Also Read: PM E-DRIVE: ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. పీఎం ఈ-డ్రైవ్ గడువు పొడిగింపు..ఆ లోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరి!  

ప్రధాన నగరాల్లో ప్రజా ప్రభంజనం:

మిన్నియాపాలిస్ - సెయింట్ పాల్: ఇక్కడ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ వంటి దిగ్గజ గాయకులు సంగీతంతో నిరసన తెలుపుతుండగా, సెనేటర్ బెర్నీ శాండర్స్, గవర్నర్ టిమ్ వాల్జ్ వంటి నాయకులు ప్రసంగించనున్నారు.

వాషింగ్టన్ డీసీ: నేషనల్ మాల్ వద్ద దాదాపు 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా. ట్రంప్ నిరంకుశ పోకడలకు రాజధాని నుండే గట్టి సమాధానం ఇవ్వాలని నిరసనకారులు భావిస్తున్నారు.

చికాగో , న్యూయార్క్: చికాగోలోని గ్రాంట్ పార్క్ వద్ద  మా ప్రజాస్వామ్యంపై దాడులు ఆపండి  అనే నినాదాలతో లక్షలాది మంది ప్రజలు గుమిగూడుతున్నారు. న్యూయార్క్‌లో దాదాపు 3.5 లక్షల మంది పాల్గొంటున్నట్లు అంచనా.

 ట్రంప్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే నేషనల్ గార్డ్‌ను పంపడం, కోర్టుల అనుమతి లేకుండా నిర్బంధించడం వంటి చర్యలు అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని నిరసనకారులు వాదిస్తున్నారు. ఈ శనివారం నాటి ర్యాలీలు కేవలం నిరసనలు మాత్రమే కావు, రాబోయే ఎన్నికల్లో ట్రంప్ భవిష్యత్తును నిర్ణయించే బలమైన సంకేతాలు. అమెరికాలో ప్రజాస్వామ్యం నిలుస్తుందా లేదా అనే ప్రశ్నకు ఈ ఉద్యమమే సమాధానం కానుంది.

Also Read: Copper Price Crash 2026: రాగి దెబ్బ.. బంగారం అబ్బా.. భారీగా పడిపోయిన కాపర్ ధరలు.. తదుపరి టార్గెట్ పసిడియేనా?  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

919
comment0
Report
BBhoomi
Mar 29, 2026 03:07:52
Lakshmapur, Telangana:

PM E-DRIVE: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-DRIVE) పథకంలో కీలక మార్పులు జరిగాయి. గతంలో ఉన్న 'ఫేమ్' (FAME) పథకం స్థానంలో వచ్చిన ఈ పీఎం ఈ-డ్రైవ్ గడువును పెంచుతూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

కొత్త గడువు తేదీలు :
గత నిబంధనల ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు సబ్సిడీ పొందే గడువు మార్చి 31, 2026 తో ముగియాల్సి ఉంది. అయితే తయారీదారులు, వినియోగదారుల అభ్యర్థన మేరకు దీనిని జూలై 31, 2026 వరకు పొడిగించారు. అంటే.. ఈ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు (ఈ-రిక్షాలు, ఈ-కార్టులు) విషయానికి వస్తే.. వీటికి మునుపటి గడువు తేదీ అయిన మార్చి 31, 2028 వరకు రాయితీలు అందుబాటులో ఉంటాయి.

ధరల పరిమితి, సబ్సిడీ వివరాలు:

-అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రాయితీ వర్తించదు. దీనికోసం కేంద్రం నిర్దిష్టమైన ధరల పరిమితిని విధించింది:

ఎలక్ట్రిక్ టూ-వీలర్లు: వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.5 లక్షల లోపు ఉండాలి.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు: వీటి ధర రూ. 2.5 లక్షల లోపు ఉంటేనే సబ్సిడీకి అర్హత ఉంటుంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ఒక కిలోవాట్ అవర్ (kWh) కు రూ. 2,500 చొప్పున గరిష్టంగా రూ. 5,000 వరకు సబ్సిడీ లభిస్తోంది.

Also Read: Silver Price Drop Today: రికార్డుల నుంచి కిందికి.. వెండి ధరల్లో భారీ మార్పు.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలు ఇవే..!!  

నిధుల లభ్యత - ఒక హెచ్చరిక:
పీఎం ఈ-డ్రైవ్ పథకం కోసం కేంద్రం మొత్తం రూ. 10,900 కోట్లు కేటాయించింది. అయితే  ఇది ఒక  ఫండ్-లిమిటెడ్ పథకం. అంటే.. ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులు పైన పేర్కొన్న గడువు తేదీల కంటే ముందే అయిపోతే, అప్పటికప్పుడు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. ఆ తర్వాత ఎటువంటి రాయితీ దరఖాస్తులను స్వీకరించరు. ఇప్పటికే ఈ-త్రీవీలర్ (L5 కేటగిరీ) విభాగం తన లక్ష్యాన్ని చేరుకోవడంతో గతేడాది డిసెంబర్‌లోనే ఆ విభాగానికి సబ్సిడీని నిలిపివేశారు.

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం..పెట్రోల్, డీజిల్ దిగుమతుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ రాయితీలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారు ఈ సవరించిన గడువులను దృష్టిలో పెట్టుకుని, నిధులు ముగియక ముందే తమ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉత్తమం.

Also Read: Gold Rate Today: పసిడి ధరలకు బ్రేక్.. మార్చి 29వ తేదీ ఆదివారం విజయవాడ, హైదరాబాద్‎లో ధరలు ఇవే..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

1035
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 28, 2026 19:07:18
Bengaluru, Karnataka:

Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమవగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో తలపడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో అద్భుతం చేసినా బౌలింగ్‌లో విఫలమవడంతో కొత్త సీజన్‌ను సన్‌రైజర్స్‌ ఓటమితో ప్రారంభించగా.. ఆర్‌సీబీ విజయంతో శుభారంభం చేసింది. 201 లక్ష్యాన్ని ఆర్‌సీబీ 15 ఓవర్లలోనే ముగించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 7 పరుగులకే ఔటవగా.. ట్రావిడ్‌ హెడ్‌ 11 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ దంచికొట్టాడు. తుఫాన్‌ ఇన్సింగ్స్‌ ఆడి 38 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. నితీశ్‌ కుమార్‌ ఒక్క పరుగే చేయగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ 31 పరుగులతో పర్వాలేదనిపించాడు. సలీల్‌ అరోరా 9కే ఔటవగా.. అనికేత్‌ వర్మ అద్భుతంగా ఆడి 43 పరుగులు జోడించాడు. హర్ష్‌ దుబే (3), హర్షల్‌ పటేల్‌ పరుగులు చేయలేకపోయారు. ప్రత్యర్థి ఆర్‌సీబీ తమ సొంత గడ్డపై అద్భుతంగా ఆడాడు. జాకబ్ డఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే నిప్పులు చెరిగి సన్‌రైజర్స్‌ను భారీ దెబ్బతీశాడు. దీంతో ఒక దశలో హైదరాబాద్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు మాంచి స్కోర్‌తో రాణించారు. దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ తన మార్క్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (31) దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ విజయం సులువైంది. కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు జోడించడంతో బెంగళూరు 15.4 ఓవర్లలోనే 202 చేసి ఆర్సీబీ విజయం సాధించింది. 

బ్యాటర్లు ఘనం.. బౌలర్లు విఫలం
తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌ విఫలమవడంతో మళ్లీ జట్టు కూర్పుపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్‌ పరంగా అదరగొట్టగా.. బౌలింగ్‌లోనే సన్‌రైజర్స్‌ తడబడింది. ఐపీఎల్‌ సీజన్‌ తొలి నుంచి సన్‌రైజర్స్‌ ప్రధాన లోపం బౌలింగ్‌ లేకపోవడం. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్‌ను బౌలర్లు కాపాడడంలో విఫలమవడంతో జట్టు పరాజయం వైపు నిలిచింది. గత సీజన్‌లలో కూడా ఇదే లోపంతో ఇబ్బందులు ఎదుర్కొన్న సన్‌రైజర్స్‌.. ఆ లోపం నుంచి బయటపడడం లేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1087
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 28, 2026 15:57:28
Hyderabad, Telangana:

Revanth Reddy 1 50 Lakh Crore Corruption: తెలంగాణలో తన కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని.. అలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు.

Also Read: Sports Meet: అన్ని స్టేడియాలను అభివృద్ధి చేస్తాం.. స్పోర్ట్స్‌ మీట్‌లో రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన బీఆర్‌ఎస్‌వీ సమావేశంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే రేవంత్‌ రెడ్డి.. తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.

Also Read: IPL 2026: ఐపీఎల్‌ ప్రారంభం వేళ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్‌ వార్నింగ్‌

కేసీఆర్‌ ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం.. అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు.

Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్‌.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్‌ పోలీసులు

మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయినా ఇప్పుడు దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే శివతాండవం చేస్తానని మాట్లాడటం  రేవంత్‌ రెడ్డి అహంకారానికి నిదర్శనమని తెలిపారు. రేవంత్ రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని.. మూసీ ప్రాజెక్ట్‌ను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, ఉర్దూలో ప్రత్యేక డీఎస్సీ, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ఇలా అన్నీ అమలు కాలేదని గుర్తుచేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు గడిచినా ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. నన్ను కోసినా పైసలు లేవు అనే రేవంత్ రెడ్డి మూసీ కోసం మాత్రం రూ.లక్షల కోట్లు ఉన్నాయని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1090
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 28, 2026 13:05:54
Hyderabad, Telangana:

Telangana Legislators Sports Meet 2026: 'నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూ.. నిరంతరం సమస్యలంపరిష్కారం కోసం విరామం లేకుండా పనిచేసే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఇక్కడ అద్భుతంగా ఆడకపోవచ్చు.. కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఎల్బీ స్టేడియం వేదిక అవుతుంది. ఈ మైదానంలో శిక్షణ పొందిన వారు మంత్రివర్గంలో ఉన్నారు. క్రికెట్‌లో దేశానికి వన్నె తెచ్చిన అజారుద్దీన్ మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు.

Also Read: IPL 2026: ఐపీఎల్‌ ప్రారంభం వేళ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్‌ వార్నింగ్‌

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 'రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడిన వాకిటి శ్రీహరి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత క్రీడా స్ఫూర్తి కరువైంది. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చాం' అని తెలంగాణ సీఎం వివరించారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సీఎం కప్ పోటీలను నిర్వహించామని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలంపిక్స్ లో ఒక్క పతకం సాధించలేదని గుర్తుచేశారు.

Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్‌.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్‌ పోలీసులు

'3 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది. సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకే 16 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'విద్యార్థులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకుని రాణించండి. క్రీడా స్ఫూర్తిని నింపేందుకే ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని  హైదరాబాద్ తీసుకొచ్చాం' అని వివరించారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారని.. ఫుట్‌బాల్ దిగ్గజం హైదరాబాద్‌కు వస్తే మన ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. కానీ ప్రతిపక్ష నాయకులు డ్రగ్ లాడ్ కింగ్‌ను రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారో నాకు తెలియదు' అని చెప్పారు.

'ఫామ్‌హౌస్ పార్టీలకు దూరంగా.. మత్తుకు దూరంగా ఉండాలని క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. ఎల్బీ స్టేడియం రాజకీయ కార్యకలాపాలకే పరిమితమైంది. ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రపంచ క్రీడా పోటీలు నిర్వహించేలా అభివృద్ధి చేయబోతున్నాం. బేగంపేట హాకీ క్రీడా మైదానాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. ఫుట్‌బాల్‌లో గతంలో దేశానికి మెడల్స్ తెచ్చిన ఏడుగురిలో 4 గురు మన ప్రాంతానికి చెందినవారు ఉన్నారని.. మళ్లీ ఆ స్థాయికి క్రీదా స్ఫూర్తిని నింపి క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించామని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1090
comment0
Report
IPInamdar Paresh
Mar 28, 2026 13:05:17
Hyderabad, Telangana:

Harish rao fires on cm revanth reddy govt in assembly session: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.  ఈక్రమంలో ఇప్పటికే ఎక్కడ చాన్స్ దొరికిన అధికార, అపోసిషన్ పార్టీలు తరచుగా మాటల యుద్దంకు దిగుతాయి.  అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హరీష్ రావు  రాఘవ కన్స్ట్రక్షన్స్ వివాదంపై మంత్రి పొంగులేటిపై సంచలన ఆరోపణలు చేశారు. రాఘవ పేరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరన్న సంగతి అందరికి తెలుసన్నారు.  అదే విధంగా...మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ఏకీపారేశారు.  రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ  సాక్షిగా సీఎం రేవంత్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సభను సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించారని ఎద్దేవా చేశారు. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు.  అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా?.. అంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.

జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయమన్నారు. దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి సైతం రాఘవ కన్స్ట్రక్షన్ పై సీబీ సిఐడి విచారణ జరిపిస్తామన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు సివరేజ్ ఫీజు కట్టిందని స్పష్టం చేశారు.

Read more: IPL 2026: ఐపీఎల్‌ ప్రారంభం వేళ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్‌ వార్నింగ్‌

ఇది వారు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదని.. ఆ సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం రాబట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.  మొత్తంగా  రాఘవ కన్స్ట్రక్షన్స్  అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

1092
comment0
Report
HDHarish Darla
Mar 28, 2026 11:56:24
Bengaluru, Karnataka:

RCB Vs SRH Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ నేడు మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయన్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న RCB ఆత్మవిశ్వాసంతో ఉండగా, గణాంకాల పరంగా హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్‌లు గెలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. అందులో మిగిలిన 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆర్సీబీపై సన్‌రైజర్స్ జట్టు ఆధిపత్యం పుష్కలంగా కనిపిస్తోంది.

ఆర్సీబీ బలాబలాలు.. 
రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్‌లో కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా ఆర్సీబీ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో.. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడి ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారనుంది. గత సీజన్‌లో వీరిద్దరూ జట్టుకు ఘోరమైన ఆరంభాన్ని అందించారు.

అతనితో పాటు దేవదత్ పడిక్కల్ ఇటీవలే దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వీరి తర్వాత టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి భారీ హిట్టర్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ చేరికతో జట్టు మరింత సమతుల్యంగా మారింది.

ఆర్సీబీలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న తర్వాత ఆర్సీబీ బౌలింగ్ విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. జట్టు కీలక పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. ఇది జట్టుకు పెద్ద దెబ్బ. హేజిల్‌వుడ్ లేని లోటును సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పూరించాల్సి ఉంటుంది. ఇప్పుడు భువి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు. అదే విధంగా ఈ సీజన్‌లో యశ్ దయాల్ కూడా దూరంగా ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ ప్రదర్శన ఆర్సీబీకి చాలా కీలకం. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనపై జట్టు ఆశలు పెట్టుకుంది.

సన్‌రైజర్స్ బలాబలాలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తమ టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లతో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో, ప్రారంభ మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించే అవకాశం ఉంది. గత సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక పరుగులు సాధించాడు. అనికేత్ వర్మ గతేడాది ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు. ఈసారి నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టన్ వంటి ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ బాగా రాణిస్తే, హైదరాబాద్ భారీ స్కోరు సాధించడం ఖాయం.

బ్యాటింగ్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం కొంచెం బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పాట్ కమిన్స్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అనే చెప్పాలి. ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ ఫాస్ట్ బౌలింగ్‌ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ కీలకంగా మారతాడు. హైదరాబాద్ జట్టులో స్పిన్ విభాగంలో పెద్ద ఆటగాళ్లు ఎవరూ లేరు. మొత్తంగా, నేటి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!

Also Read: Indian Rupee Vs Pakistan Rupee: భారత్‌లో లక్ష రూపాయలు పాకిస్తాన్‌లో ఎంత? అంతటి డబ్బుతో ఏవేవి కొనవచ్చు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1011
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 28, 2026 11:47:05
Hyderabad, Telangana:

 Badminton Video Watch: ప్రతిభకు పేదరికం అడ్డు కాదని.. క్రీడల పట్ల ఆసక్తి ఉంటే సౌకర్యాలు లేకపోయినా అద్భుతాలు చేయవచ్చని ఇద్దరు చిన్నారులు నిరూపించారు.. సాధారణంగా బ్యాడ్మింటన్ ఆడాలంటే చేతిలో ఖరీదైన బ్యాట్లు, మంచి షటిల్ కాకులు ఎంతగానో అవసరం ఉంటాయి. కానీ ఈ బుజ్జి ఆటగాళ్లు మాత్రం తమ దగ్గర ఉన్న వస్తువులతోనే అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని చాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ.. సోషల్ మీడియా వినియోగదారుల ప్రశంసలను అందుకుంటుంది..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఇద్దరు పిల్లలు ఒక చిన్న ప్లేగ్రౌండ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపిస్తారు.. అయితే, వారి చేతుల్లో బ్యాట్లు లేవు.. వాటికి బదులుగా తమ కాలి చెప్పులను చేతుల్లో పట్టుకొని.. వాటినే బ్యాడ్మింటన్సుగా వాడుతున్నారు.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒక పాడైపోయిన షటిల్ కాకును వారు ఆడుతున్న తీరు ప్రొఫెషన్ ఆటగాళ్లని తలపిస్తోంది. ఎక్కడ వేగం తగ్గకుండా.. కాకు కింద పడకుండా ఒకరికొకరు షాట్లు కొట్టుకుంటూ.. ఎంతో ఏకాగ్రతతో ఆడుతున్నారు..

 
 
 
 
 

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. ఆ పిల్లల ప్రతిభను చూసి ఫీదా అవుతున్నారు.. ఆట మీద ఇష్టమే వారిని ఇలా ఆడిస్తోందని.. నిజమైన క్రీడా స్ఫూర్తి అంటే ఇదే అంటూ చాలామంది కామెంట్లతో ముంచేత్తుతున్నారు.. వస్తువులు లేవని కుంగిపోకుండా.  ఉన్న వాటితోనే ఆనందాన్ని వెతుక్కుంటూ.. ఆడుతున్న ఈ చిన్నారుల వీడియోను ప్రముఖులు సైతం షేర్ చేస్తున్నారు. వీరికి సరైన శిక్షణతో పాటు వసతులు కల్పిస్తే భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతూ వస్తోంది.. దీనిని లక్షలాదిమంది వీక్షించడమే కాకుండా వేల సంఖ్యలో లైక్ చేస్తూ షేర్ కూడా చేస్తున్నారు.. ఏ ఆడంబరాలు లేని ఈ స్వచ్ఛమైన క్రీడా చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని చాలామంది రీ పోస్ట్ కూడా చేస్తున్నారు. ముఖంపై చిరునవ్వుతో.. చెప్పులతోనే వారు చేస్తున్న ఆ విన్యాసం నేటి తరానికి గొప్ప సందేశాన్నిస్తోంది.. వస్తువులు ఏదైతేనేం.. గురి తప్పలేదు.. సంకల్పం వీడలేదు అన్నట్లుగా సాగుతున్న వీరి ఆట సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద సెన్సేషన్‌గా మారింది..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1026
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 28, 2026 11:38:32
Hyderabad, Telangana:

 Delivery Boy Stealing Chocolate Video: నేటి కాలంలో ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసి నిమిషాల్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటి ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఫుడ్ నుంచి కిరాణా సామాగ్రి వరకు అన్ని డెలివరీ సర్వీసులు మన జీవితంలో భాగమైపోయాయి.. అయితే వినియోగదారులు కంపెనీల పై ఉంచే నమ్మకాన్ని కొందరు డెలివరీ బాయ్స్ తగ్గించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తాజాగా ఓ డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ నుంచి వస్తువును దొంగలిస్తూ అడ్డంగా దొరికిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రముఖ డెలివరీ సంస్థకు చెందిన ఏజెంట్.. కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి ఒక అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు.. ఇంటి బయట వేచి ఉన్న సమయంలో.. చుట్టుపక్కల ఎవ్వరూ లేరని గమనించిన అతను మెల్లగా ఆర్డర్ ప్యాక్‌ను తెరిచారు.. అందులో ఉన్న ఒక చాక్లెట్ ను బయటకు తీసి తన జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ప్యాకెట్‌ను మళ్ళీ యధావిధిగా సర్ది కస్టమర్కు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

డెలివరీ బాయ్ తనను ఎవరు గమనించడం లేదనుకున్నాడు కానీ.. అదే బిల్డింగ్ పై అంతస్తులు ఉన్న ఒక వ్యక్తి ఇదంతా గమనించాడు.. వెంటనే తన మొబైల్‌ను తీసి ఆ డెలివరీ బాయ్ చేస్తున్న పనిని చిత్రీకరించాడు.. ఆర్డర్ నుంచి వస్తువులను తీసి జేబులో వేసుకోవడం ఆ వీడియోలో ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. సదరు వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.. ఇది చూసిన వినియోగదారుల సైతం ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు..

 
 
 
 
 

వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సదరు డెలివరీ బాయ్‌పై మండిపడుతున్నారు.. మేము డెలివరీ చార్జీలతో పాటు టిప్పులు ఇస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు మంచిది.. అని కొంతమంది ప్రశ్నిస్తుంటే.. మరి కొంతమంది మాత్రం పాపం ఆకలి వేసి.. తీసుకున్నాడేమో అని ఆ డెలివరీ బాయ్ ని వెనకేసుకొస్తున్నారు.. కానీ ఈ వీడియో చూసిన చాలా మంది మాత్రం విపరీతంగా షేర్ చేస్తున్నారు.. ఇలాంటి ఘటనాల వల్ల నిజాయితీగా పని చేసే ఇతర డెలివరీ బాయ్స్ పరుగు పోతోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు కంపెనీ దీనిపై స్పందించి ఆ డెలివరీ బాయ్ పై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1018
comment0
Report
HDHarish Darla
Mar 28, 2026 11:21:40
Hyderabad, Telangana:

Redneck Keelback Snake Found In India: ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అనేక రహస్యాలు శాస్త్రవేత్తలకు ఎన్నో సవాళ్లను విసురుతుంది. అయితే ఇప్పుడు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) శాస్త్రవేత్తలు కనుగొన్న రెండు కొత్త జాతుల కీల్‌బ్యాక్ పాములు ఈ జాబితాలో చేరాయి. ప్రపంచ జీవవైవిధ్య పటంలో భారతదేశానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. భారత్‌లో అడవులు, పర్వతాలు, చిత్తడి నేలలు వేలాది అరుదైన జంతువులు, పక్షులకు నిలయంగా ఉన్నాయి. 

ముఖ్యంగా పాముల విషయానికి వస్తే.. భారతదేశంలో 500 కంటే ఎక్కువ విభిన్న జాతుల పాములు నివసిస్తున్నాయి. సాధారణ ప్రజలు పాములకు భయపడటం సహజం. కానీ నిజానికి, మన దేశంలో కనిపించే మొత్తం పాములలో కేవలం 60 జాతులు మాత్రమే విషపూరితమైనవిగా ఉన్నాయి. మిగిలిన పాము జాతులన్నీ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఇటీవలి ఈ ముఖ్యమైన పరిశోధన ప్రకారం.. ఈశాన్య భారతదేశంలోని అడవులలో రెండు కొత్త జాతుల కిల్‌బ్యాక్ పాములను కనుగొన్నారు. ఈ పాములు ఇంతకుముందు మయన్మార్ వంటి పొరుగు దేశాలలో మాత్రమే కనిపించేవని జంతు పరిశోధన శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఇప్పుడు మిజోరంలోని న్గేగ్పుయ్ వన్యప్రాణుల అభయారణ్యం, అరుణాచల్ ప్రదేశ్‌లోని నమ్దఫా జాతీయ ఉద్యానవనం వంటి దట్టమైన అటవీ ప్రాంతాలలో ఇవి కనిపించడం పర్యావరణ శాస్త్రవేత్తలలో గొప్ప ఉత్సుకతను రేకెత్తించింది. 

వేటాడే జాతికి చెందిన ఈ పాములు చాలా అరుదైనవిగా పరిగణించారు. ఇవి ప్రధానంగా విషరహితమైనవిగా వస్తున్నాయట. నీటి సమీప ప్రాంతాలలో లేదా చిత్తడి నేలల్లో నివసించడానికి ఇష్టపడతాయి. ఆహార గొలుసులో వీటి పాత్ర చాలా పెద్దది.

ఈ కిల్‌బ్యాక్ పాముల శారీరక నిర్మాణం ఇతర సాధారణ పాముల కంటే భిన్నంగా ఉంటుంది. ఇవి లేత ఎరుపు రంగులో ఉండి, వాటి శరీరంపై స్పష్టమైన పొడవైన గీతను కలిగి ఉంటాయి. ఈ పాముల చర్మం నునుపుగా కాకుండా చాలా గరుకుగా ఉంటుంది. ఈ కారణంగానే వీటిని 'కిల్‌బ్యాక్‌ స్నేక్స్' అని పిలుస్తారు. ఈ పాముల అత్యంత ప్రత్యేక లక్షణం వాటి 'మభ్యపెట్టే' సామర్థ్యం. వాటి చర్మానికి కాంతిని ప్రతిబింబించే గుణం ఉండటం వల్ల, అవి నివసించే పరిసరాల రంగుకు అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకుంటాయి. 

దీనివల్ల అవి చిత్తడి నేలల్లో లేదా మట్టిలో పూర్తిగా కలిసిపోతాయి. శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి, వేటాడటానికి ఈ లక్షణం వాటికి ఒక వరం. అవి మట్టి రంగుతో సరిపోలడం వల్ల, సాధారణ ప్రజలు లేదా జంతువులు వాటిని గుర్తించడం అంత సులభం కాదు.

Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!

Also Read: Indian Rupee Vs Pakistan Rupee: భారత్‌లో లక్ష రూపాయలు పాకిస్తాన్‌లో ఎంత? అంతటి డబ్బుతో ఏవేవి కొనవచ్చు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1017
comment0
Report
HDHarish Darla
Mar 28, 2026 10:59:26
Nunna, Vijayawada, Andhra Pradesh:

Amaravati Farmers Tax Exemption: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కేంద్రంలోని మోదీ సర్కారు తీపికబురు చెప్పింది. ఓ పక్క అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తున్న తీర్మానంపై చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్రం ఈ ప్రకటన వెలువరించింది. రాజధాని భూసమీకరణలో భాగంగా తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రయోజనం చేకూరేలా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి రైతుల కోసం క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్ మినహాయింపు గడువును మరో కొన్నేళ్లు పొడిగించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం.. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు గడువును 2031 మార్చి 31 వరకు కొనసాగించనున్నట్లు నివేదికలో తెలిపారు. అయితే ఈ సడలింపు అనేది కేవలం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో పాల్గొన్న రైతులకు వర్తించనుందని తెలుస్తోంది.

అయితే సమైఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అలా భూములు ఇచ్చిన రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి ఆర్థిక భద్రతకు ఈ నిర్ణయం ఎంతో కీలకంగా మారనున్నట్లు కేంద్రం భావించింది. 

ముఖ్యంగా రైతులు తమ భూముల మార్పిడి, ప్లాట్ల కేటాయింపులో వచ్చే పన్ను భారాన్ని తగ్గించడంలో ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుంది. ఈ చర్య అమరావతి రైతులకు ఎంతో పెద్ద ఊరటనిచ్చినట్లైంది. భవిష్యత్తులోనూ అమరావతి రాజధాని అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించే విధంగా పన్ను మినహాయింపు నిర్ణయం అనేది తోడ్పడుతుంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతి రైతులు ఆర్థిక భద్రతతో పాటు రాజధాని ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అడుగులు వేసినట్లు అవుతుంది.

Also Read: Indian Rupee Vs Pakistan Rupee: భారత్‌లో లక్ష రూపాయలు పాకిస్తాన్‌లో ఎంత? అంతటి డబ్బుతో ఏవేవి కొనవచ్చు?

Also Read: RCB Vs SRH Rain Prediction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..RCB Vs SRH మ్యాచ్ రద్దు అవుతుందా? షాకిచ్చిన వరుణుడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1097
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 28, 2026 10:50:34
Hyderabad, Telangana:

Say No To Cricket Betting: క్రీడా ప్రపంచంలో ఐపీఎల్‌కు ఉన్నంత క్రేజ్‌ ఏ ఆటకు లేదు. అలాంటి ఐపీఎల్‌ సరికొత్త సీజన్‌ ప్రారంభమవడంతో బెట్టింగ్‌ రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఐపీఎల్‌ 2026పై బెట్టింగ్‌లు పెరిగే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్‌పై క్రికెట్‌ బెట్టింగ్‌ కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ కోసం జీవితాన్ని నాశనం చేసుకోకూడదని యువతకు పోలీసులు సూచించారు.

Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్‌.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్‌ పోలీసులు

బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సూచించారు. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని.. బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో బెట్టింగ్‌ యాప్‌ల నిషేదంపై ప్రచారం చేయడంతో వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు. ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్‌ క్రికెట్‌ దందా కొత్త రూపం దాల్చిందని వెల్లడించారు.

Also Read: KT Rama Rao: మాజీ మంత్రి కేటీఆర్‌ నిర్ణయం.. ఎమ్మెల్యేల క్రీడా పోటీల బహిష్కరణ

కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్‌ హెచ్చరించారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతుండడంతో వారిపై తమ ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. బెట్టింగ్‌తో అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సూచించారు.

ఐపీఎల్‌ 2026 సీజన్‌ శనివారం ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది చాంపియన్‌గా నిలిచిన ఆర్‌సీబీ మరోసారి ట్రోఫీని సాధించాలనే కసితో ఆడనుండగా.. ఈసారి కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి ఈ సీజన్‌లో సత్తా చాటాలని హైదరాబాద్‌ ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది.

Also Read: Raja Singh: ఇళ్ల మధ్య ఇరుక్కున్న రథం.. నిలిచిపోయిన రాజాసింగ్‌ శోభయాత్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1096
comment0
Report
Advertisement
Back to top