Mortgage Property: సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు చాలా మంది రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటారు. అయితే సొంతింటి కల అనేది అందరికీ సులభంగా సాధ్యం అయ్యేది కాదు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గానికి ధరల భారం అడ్డంకిగా మారుతోంది. అందుకే తక్కువ ధరకు ఇల్లు దక్కే అవకాశాల కోసం చాలా మంది మార్ట్గేజ్ ప్రాపర్టీల వైపు దృష్టి పెడుతున్నారు. అయితే తాకట్టు పెట్టిన ఆస్తులు కొనుగోలు చేయడం సాధారణ ఆస్తుల కొనుగోలుతో పోలిస్తే భిన్నమైన నిబంధనలు, జాగ్రత్తలు అవసరం చేస్తుంది. అసలు మార్ట్గేజ్ ప్రాపర్టీ అంటే ఏమిటి? దీనికి సంబంధించిన నియమాలు ఏమిటి? అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవడం అవసరం.
మార్ట్‌గేజ్ అంటే ఏమిటి?
మార్ట్గేజ్ అంటే తాకట్టు అని అర్థం. ఒక వ్యక్తి తనకు చెందిన ఇల్లు లేదా భూమిని బ్యాంకు వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకుంటాడు. ఆస్తి యజమాని, బ్యాంకు మధ్య జరిగే ఒప్పందం ఇది. అయితే రుణం పూర్తిగా చెల్లించే వరకు ఆస్తిపై బ్యాంకుకు హక్కులు ఉంటాయి. ఒకవేళ రుణగ్రహీత నిర్ణీత గడువులో డబ్బు తిరిగి చెల్లించకపోతే, ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం బ్యాంకుకు ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో మార్ట్గేజ్ రుణాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా నిర్మించుకోవడానికి తీసుకునే గృహ రుణం. రెండోది ఇప్పటికే ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి వ్యాపార అవసరాలు, ఉన్నత విద్య, వైద్య ఖర్చుల కోసం తీసుకునే రుణం.
మార్ట్గేజ్ ఆస్తులను కొనుగోలు చేయడం వల్ల లాభాలు:
మార్ట్గేజ్ ఆస్తులను కొనుగోలు చేయడం వల్ల కొన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయి. సాధారణ మార్కెట్ ధరతో పోలిస్తే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. సాధారణంగా 10 నుంచి 20 శాతం వరకు తగ్గింపుతో దొరికే అవకాశం ఉంటుంది. అంతేకాదు, చాలా సందర్భాల్లో ఈ ఆస్తులు పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకుని ఉంటాయి. కొనుగోలు చేసిన వెంటనే నివాసానికి అనుకూలంగా ఉంటాయి. మరో ముఖ్యమైన అంశం భద్రత. బ్యాంకులు ఆస్తి పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే రుణం మంజూరు చేస్తాయి కాబట్టి, డాక్యుమెంట్ల పరంగా విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది.
కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి:
మార్ట్గేజ్ ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా యజమాని వద్ద ఉన్న అన్ని పత్రాల ఫొటోకాపీలు తీసుకుని పరిశీలించాలి. ఆస్తిపై ఎంత రుణం పెండింగ్‌లో ఉందో స్పష్టంగా తెలుసుకోవాలి. సంబంధిత బ్యాంకు నుంచి అవుట్‌స్టాండింగ్ లోన్ స్టేట్‌మెంట్ తప్పనిసరిగా పొందాలి. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత అసలు పత్రాలు విడుదల చేస్తామని బ్యాంకు ఇచ్చే అంగీకార పత్రాన్ని కూడా తీసుకోవాలి.
క్యాష్ ద్వారా కొనుగోలు చేస్తే ముందుగా బ్యాంకులో రుణాన్ని సెటిల్ చేసి, మిగిలిన మొత్తాన్ని యజమానికి చెల్లించడం మంచిది. రుణం ద్వారా కొనుగోలు చేస్తే ముందుగా బ్యాంకులో అప్లై చేసి, అవసరమైతే ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ లేదా చెక్ విధానం ద్వారా లావాదేవీ పూర్తి చేయాలి.
ఆస్తి కొనుగోలు ముందు సేల్ డీడ్, ఎన్‌కంబ్రాన్స్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ప్రాపర్టీ టాక్స్ రసీదులు, శాంక్షన్ ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వంటి పత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలి. అలాగే కోర్టు కేసులు ఏవైనా ఉన్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాలి. బ్యాంకు వెరిఫికేషన్‌పై మాత్రమే ఆధారపడకుండా ఒక న్యాయవాదితో డాక్యుమెంట్లు చెక్ చేయించుకోవడం మరింత భద్రత కలిగిస్తుంది.
ముగ్గురు.. కొనుగోలుదారు, విక్రేత, బ్యాంకు సంతకాలు చేసే ఒప్పందం చేసుకోవడం ఉత్తమం. అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే టోకెన్ అమౌంట్ ఇవ్వాలి. ఇలా జాగ్రత్తగా ముందుకు వెళ్తే, మార్ట్గేజ్ ప్రాపర్టీ ద్వారా తక్కువ ధరకు సొంత ఇల్లు కలను సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
AP Bullet Train Corridor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసేలా రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటికే ప్రకటించిన మూడు కారిడార్లకు అదనంగా, రాష్ట్రంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మరో రెండు కొత్త హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణానికి రైల్వే బోర్డు అడుగులు వేస్తోంది.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ మీదుగా వెళ్లే మూడు అంతర్రాష్ట్ర కారిడార్లను (హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రత్యేకంగా ఏపీలోని నగరాల మధ్య కనెక్టివిటీ పెంచేలా మరో రెండు మార్గాలను ప్రతిపాదించారు.
కొత్తగా ప్రతిపాదించిన కారిడార్లలో విజయవాడ - విశాఖపట్నం హైస్పీడ్ కారిడార్ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య సుమారు 350 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో భాగంగా విజయవాడ నుండి బయలుదేరి ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ మార్గంలో బుల్లెట్ రైళ్లు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి.
ఇది పూర్తయితే అమరావతి నుండి విశాఖకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది హైదరాబాద్-చెన్నై కారిడార్‌కు అనుసంధానం చేసేందుకు అవకాశం ఉంది.
ఈ కారిడార్లలో వినిపిస్తున్న రెండో రూట్ విజయవాడ - కర్నూలు సెమీ హైస్పీడ్ కారిడార్. ఇది గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుండి కర్నూలుకు నేరుగా వెళ్లే రైలు మార్గం సరిగ్గా లేదు అంటే డోన్ లేదా నంద్యాల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఈ కొత్త లైన్ ద్వారా రాయలసీమ, కోస్తా ఆంధ్ర మధ్య నేరుగా, వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.
అమరావతికి పెరగనున్న కనెక్టివిటీ
రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రెండు కొత్త లైన్లతో పాటు మరో ఆరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కూడా సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం తుది సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు.
గతంలో ప్రకటించిన మూడు కారిడార్లు కూడా ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్నాయి. 1) హైదరాబాద్ - చెన్నై, ఇది అమరావతి మీదుగా వెళ్తుంది.2) హైదరాబాద్ - బెంగళూరు, ఇది రాయలసీమ ప్రాంతం గుండా వెళ్తుంది. 3) చెన్నై - బెంగళూరు, ఇది చిత్తూరు జిల్లా మీదుగా ప్రయాణిస్తుంది.
రైల్వే బోర్డు నుండి అనుమతి రాగానే క్షేత్రస్థాయిలో సర్వే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణ వేగం పుంజుకోవడమే కాకుండా, పారిశ్రామికంగా కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Manda Krishna Madiga News: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సామాజిక వర్గాలకు సంబంధించిన అంశం వేడెక్కింది.. మాదిగలకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపిస్తూ.. ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రత్యేకమైన ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని ఆయన ఎమ్మార్పీఎస్ శ్రేణులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల ముందు తప్పకుండా ధర్నాలు నిర్వహించాలని కోరారు..
మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లోని కాంగ్రెస్ కార్యాలయాల ముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేయాలని కోరారు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించాలని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలని మందకృష్ణ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ప్రత్యేకమైన ధర్నాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయంగా ఎదగాల్సిన మాదిగలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకుంటుందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అంతేకాకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే మాదిగలను వాడుకుంటున్నారని.. నిర్ణయాత్మకమైన పదవుల దగ్గరకు వచ్చేసరికి అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.. ఇకనుంచైనా ప్రభుత్వం తప్పకుండా మాదిగలను గుర్తించి వారికి కావలసిన పదవులను ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: పీఎం కిసాన్ నిధి బ్యాలెన్స్ చెక్ చేయాలా? మొబైల్‌లో ఇలా సింపుల్ చెక్ చేసుకోండి..!
అలాగే మాదిగలు దేశానికి సంబంధించిన అత్యున్నత సభలకు వెళ్లడం కాంగ్రెస్కు ఇష్టం లేదని.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలు మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడం కాంగ్రెస్ తన వ్యతిరేకతను చాటుతుందని మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ ప్రభుత్వం వెనకడుగు వేసిందని.. తక్షణమే తమ సామాజిక వర్గానికి రాజకీయ వాటాను కల్పించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు మహరించినట్లు తెలుస్తోంది.
Also Read: పీఎం కిసాన్ నిధి బ్యాలెన్స్ చెక్ చేయాలా? మొబైల్‌లో ఇలా సింపుల్ చెక్ చేసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Oppo Find X9 Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Oppo మార్కెట్లోకి తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా పేరుతో లాంచ్ కాబోతోంది. ముఖ్యంగా ఇది అద్భుతమైన స్పెసిఫికేషన్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్ గత నవంబర్ నెలలో భారతదేశంలోకి విడుదల చేసిన ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌లోకి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ గత మోడల్స్ కంటే అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo Find X9 Ultra స్మార్ట్‌ఫోన్ అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్, విడుదల తేదీని అధికారికంగా వెల్లడించలేదు. కానీ లీకైన వివరాల ప్రకారం.. మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది చాలా ప్రత్యేకమైన ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది కెమెరా యూనిట్‌ను అప్‌గ్రేడ్‌తో విడుదల కాబోతోంది. ఇటీవల లీకైన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ ఏప్రిల్‌లోని అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అదనంగా 10x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 50-మెగాపిక్సెల్ సెకండరీ టెలిఫోటో కెమెరా కూడా అందుబాటులో ఉండబోతోంది. ఇక దీంతోపాటు ఫ్రంట్ భాగంలో ఎంతో ప్రత్యేకమైన 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
Oppo ఎగ్జిక్యూటివ్ జౌ యిబావో ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ Oppo Find X9 Ultra స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన 6.82-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండడమే కాకుండా.. ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది. ఈ మొబైల్ చూడగానే చాలా ప్రీమియం లుక్కులో కనిపిస్తుంది. అలాగే ఇది మొత్తం వివిధ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోవుతోంది. ముఖ్యంగా ఈ మొబైల్ వెనక భాగంలో చాలా స్పెషల్ అయిన కెమెరా మాడ్యూయల్‌ని కలిగి ఉంటుంది. అలాగే ఇది వెనుక భాగంలో చాలా శక్తివంతమైన LED ఫ్లాష్ తో అందుబాటులోకి రాబోతోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Real Estate: తెలంగాణలో భూముల విలువలు క్రమంగా పెరుగుతున్న పట్టణాల్లో సిద్ధిపేట ప్రత్యేకంగా నిలుస్తోంది. హైదరాబాద్ కు సమీపంలో ఉండటం, రాజకీయ–పరిపాలనా ప్రాధాన్యం కలగడం, మౌలిక వసతులు అభివృద్ధి చెందడం వంటి అంశాలు ఈ పట్టణానికి ఆకర్షణను పెంచుతున్నాయి. అందుకే ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా బలపడుతోంది.
ప్రస్తుతం సిద్ధిపేటలో డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ ధరలు సుమారు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య ఉన్నాయి. అదే స్థాయి ఫ్లాట్‌ను హైదరాబాద్‌లో కొనుగోలు చేయాలంటే దాదాపు రెట్టింపు ఖర్చు అవుతుంది. అద్దె పరంగా చూస్తే, ఇలాంటి ఫ్లాట్‌కు నెలకు సుమారు రూ.10,000 వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. తక్కువ పెట్టుబడితో స్థిరమైన రెంటల్ ఇన్‌కమ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా కనిపిస్తోంది.
కనెక్టివిటీ పరంగా కూడా సిద్ధిపేటకు అనుకూల పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడి నుంచి శామీర్ పేట్ వరకు దూరం సుమారు 70 కిలోమీటర్లు మాత్రమే. రహదారి పరిస్థితులను బట్టి గంట నుంచి గంటన్నరలో చేరుకోవచ్చు. శామీర్‌పేట దాకా మెట్రో విస్తరణ ప్రణాళికలో ఉండటం, అలాగే జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి శామీర్‌పేట వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ఈ మార్పులు సిద్ధిపేట రియల్ ఎస్టేట్‌కు మరింత ఊపునిస్తాయని భావిస్తున్నారు.
అదేవిధంగా, సిద్ధిపేట నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు దూరం సుమారు 40 కిలోమీటర్లు మాత్రమే. ఈ రింగ్ రోడ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వేగంగా చేరుకునే సౌకర్యం పెరుగుతుంది. అలాగే రాజీవ్ రహదారి విస్తరణ జరిగితే హైదరాబాద్–సిద్ధిపేట మధ్య ప్రయాణం మరింత సులభమవుతుంది. సాధారణంగా కనెక్టివిటీ మెరుగుపడిన ప్రాంతాల్లో ఆస్తుల విలువలు క్రమంగా పెరుగుతాయి.
సిద్ధిపేటలో ఐటీ టవర్, మెడికల్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. విద్యా, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఇక్కడ స్థిరపడే కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతోంది. సమీపంలో పర్యాటక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు ఉండటంతో వ్యాపార కార్యకలాపాలకు కూడా అవకాశాలు మెరుగవుతున్నాయి. పరిశ్రమలు, విద్యాసంస్థలు.. ఇవన్నీ కూడా పట్టణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి.
సిద్ధిపేటతో పాటు దుద్దెడ, కొమురవెల్లి ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడ ధరలు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. రెండో పెట్టుబడి కోసం చూస్తున్న వారికి ఇవి ఆచరణ సాధ్యమైన ఎంపికలుగా భావించవచ్చు. భవిష్యత్‌లో మౌలిక వసతులు మరింత మెరుగుపడితే ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్ధిపేటలో ప్రస్తుత ధరలు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండటం, అద్దె ఆదాయం స్థిరంగా లభించే అవకాశం ఉండటం, కనెక్టివిటీ ప్రాజెక్టులు, పారిశ్రామిక–విద్యా అభివృద్ధి కొనసాగడం వంటి అంశాలు ఈ పట్టణాన్ని పెట్టుబడిదారుల దృష్టిలో ముఖ్యమైన గమ్యస్థానంగా మార్చుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Iran Drone City Video Watch: మధ్య ప్రాచుర్యంలో ఉద్రుక్తతలు పెరుగుతున్న వేళ.. ఇరాన్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చూపించేలా ఒక సంచలన వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. భూమికి వందల అడుగుల లోతులో ఉన్న రహస్య సొరంగాల్లో వరుసగా పేర్చిన ఆధ్యాధునిక ద్రోన్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఇరాన్ అంటేనే అద్భుతమైన టెక్నాలజీతో కూడిన డ్రోన్లకు ప్రసిద్ధి.. అయితే, ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు డ్రోన్ల తయారీని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లకు సంబంధించిన పూర్తి వీడియో చూస్తూ సమాచారం తెలుసుకుందాం.
ఇరాన్ అధికారిక వార్త సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.. పర్వతాల లోపల నిర్మించిన సుదీర్ఘమైన కాంక్రీట్ సొరంగాల్లో వందలాది డ్రోన్లను సిద్ధంగా ఉంచినట్లు.. వీటిల్లో ప్రధానంగా అద్భుతమైన టెక్నాలజీ తో కూడిన సాహెద్ 136 వంటి కామికేజ్ డ్రోన్లను ప్రదర్శించడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఈ డ్రోన్లన్నీ ప్రత్యేకమైన లాకెట్ లాంచర్లపై అమర్చి ఉండడంతో పాటు.. ఎప్పుడైనా ప్రయోగించడానికి వీలుగా ఉంచినట్లు కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సొరంగాల గోడలపై ఇరాన్ జెండాలతో పాటు దేశ ఆధ్యాత్మికమైన నేతల ఫోటోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
ఇజ్రాయిల్ అమెరికా వంటి దేశాలతో ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఇరాన్ ఈ వీడియో విడుదల చేయడం ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ఆయుధ సంపత్తిపై శత్రువులు దాడి చేయకుండా ఉండేందుకే ఈ పటిష్టమైన భూగర్భ స్థావరాలను నిర్మించినట్లు ఇరాన్ కు సంబంధించిన కొంతమంది అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ సొరంగాలు బాంబు దాడులను కూడా ఎంతో సులభంగా తట్టుకోగలుగుతాయి.
Iran releases footage of its drone arsenal and launches towards US-Israeli targets in the region.
Follow https://t.co/B3zXG73Jym pic.twitter.com/FbUcK8CtqL
— Press TV 🔻 (@PressTV) March 2, 2026
గత కొద్ది రోజులుగా ఇరాన్ డ్రోన్లతో పాటు క్షిపణులతో పచ్చిమాసియాలోని పలు ప్రాంతాలపై దిమ్మ తిరిగే దాడులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగానే తమ వద్ద అనేక సంఖ్యలో ఇటువంటి డ్రోన్లు, ప్రత్యేకమైన క్షిపణులు కూడా ఉన్నాయని.. ఏ క్షణమైనా శత్రువుల స్థావరాలపై విరుచుకు పడగలమని ఇరాన్ పరోక్షంగా ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తోంది. అయితే ఈ వీడియో విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే ఈ వీడియో ఎప్పుడు తీశారన్న దానిపై కూడా సరైన స్పష్టత లేదు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో భూగర్భంలో ఉన్న డ్రోన్ సిటీ దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Powerful Kendra Trikona Raja Yoga Effect On Zodiac Telugu: అత్యంత శుభప్రదమైన గ్రహాల్లో శుక్రుడు ఒకటి. ఇది రాశి కదలికలు జరిపినప్పుడు మొత్తం అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో శక్తివంతమైన రాజయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే, శుక్రుడు కదలికలు జరిగినప్పుడు ఏర్పడే వాటిల్లో కేంద్ర త్రికోణ రాజయోగం ఒకటి. ఇది ఎంతో శక్తివంతమైనదిగా చెప్పుకుంటారు.
మార్చి రెండున తెల్లవారుజామున ఒకటి ఆ సమయంలో శుక్రుడు సంచారం చేశాడు. అయితే, ఈ గ్రహాన్ని ఆనందంతో పాటు శ్రేయస్సు, ప్రేమ, కల, సంపద, విలాసానికి సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మార్చి 26వ తేదీ వరకు ఈ గ్రహం మీనరాశిలోనే ఉండబోతోంది. ఆ తర్వాత ఇది మేషం లోకి ప్రవేశిస్తుంది. అంటే 25 రోజులపాటు కొన్ని రాశుల వారిపై కేంద్ర త్రికోణ రాజయోగం ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయంలో చాలా మేలు జరుగుతుంది.
ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు:
మేష రాశి
మేష రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం ప్రభావంతో సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక స్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా మారుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. కొత్త ఉద్యోగాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. వ్యాపారాల్లో కొత్త క్లైంట్లు రావడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు కూడా పొందుతారు. పాత పెట్టుబడిలో నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. అలాగే ఈ సమయంలో ఎంతో అద్భుతంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడడం కారణంగా అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రకాల సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. అలాగే కెరియర్ పరంగా సంపాదన కూడా లభిస్తుంది. వీరు ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు కూడా పొందే ఛాన్సులు ఉన్నాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ముందుంటారు. అలాగే అనేక సమస్యలు జీవితంలో తొలగిపోతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి కూడా ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారుతాయి. జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అలాగే సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడతాయి. దీంతోపాటు ఆదాయం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ మేలుకుంటుంది.. వీరు కొత్త వాహనాలు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SA vs NZ semi-final Preview: 2026 టీ20 ప్రపంచకప్‌లో తొలి ఫైనలిస్ట్ ఎవరో తేల్చే సమయం వచ్చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు అనగా మార్చి 4వ తేదీ జరగనున్న మొదటి సెమీఫైనల్లో పటిష్టమైన దక్షిణాఫ్రికా, పోరాట పటిమ కలిగిన న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత టోర్నీలో అజేయంగా దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ ప్రమాదకరంగా మారే న్యూజిలాండ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
దక్షిణాఫ్రికా టీమ్ ఎలా ఉందంటే?
గ్రూప్ దశ నుండి సూపర్-8 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరింది. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (268 పరుగులు) భీకర ఫామ్‌లో ఉన్నాడు. రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్‌లతో బ్యాటింగ్ లైనప్ ఏ బౌలింగ్‌నైనా ఆధిపత్యం చలాయించే సత్తా ఉంది. అదే విధంగా బౌలింగ్ లైనప్‌లో యాన్సెన్, ఎంగిడి, బోష్‌లు వికెట్లతో చెలరేగుతున్నారు. మిడిల్ ఓవర్లలో కేశవ్ మహరాజ్ కట్టుదిట్టమైన స్పిన్ ప్రత్యర్థిని కట్టడి చేస్తోంది.
న్యూజిలాండ్ బలాబలాలు ఇవే!
కివీస్ జట్టు సెమీస్ చేరడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సూపర్-8లో తడబడినప్పటికీ, ఇతర జట్ల ఫలితాలతో సెమీస్‌కు చేరింది. ఈ జట్టులోని కీలక ఆటగాడైన ఓపెనర్ సీఫెర్ట్ (216 పరుగులు) జట్టు ఆశలు మోస్తున్నాడు. అలెన్, ఫిలిప్స్, రచిన్ రవీంద్రలు బ్యాట్ ఝళిపిస్తేనే సౌతాఫ్రికాను అడ్డుకోవడం సాధ్యమవుతుంది.
మరోవైపు బౌలింగ్ లైనప్‌లో కెప్టెన్ శాంట్నర్ స్పిన్ మాయాజాలంపై కివీస్ ఆశలు పెట్టుకుంది. ఫెర్గూసన్ వేగం పవర్‌ప్లేలో కీలకం కానుంది.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాకు అద్భుతమైన రికార్డు ఉంది. వరల్డ్ కప్‌లో ఇరుజట్లు 5 సార్లు తలపడగా, ఐదుసార్లూ దక్షిణాఫ్రికానే గెలిచింది. మొత్తం టీ20ల్లో 19 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా 12, న్యూజిలాండ్ 7 మ్యాచ్‌లు గెలిచాయి.
పిచ్ ఎలా ఉందంటే?
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ 200 పైచిలుకు పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ, ఐసీసీ ఒక రిజర్వ్ డేని కేటాయించింది. ఒకవేళ రెండు రోజులూ ఆట సాధ్యపడకపోతే, సూపర్-8లో టేబుల్ టాపర్‌గా ఉన్న దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.
దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా)
క్వింటన్ డికాక్, రికెల్టన్, మార్‌క్రమ్ (కెప్టెన్), మిల్లర్, బ్రెవిస్, స్టబ్స్, బోష్, యాన్సెన్, రబాడ, కేశవ్ మహరాజ్, ఎంగిడి.
న్యూజిలాండ్ తుదిజట్టు (అంచనా)
అలెన్, సీఫర్ట్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, శాంట్నర్ (కెప్టెన్), నీషమ్, డఫీ, ఫెర్గూసన్, ఇష్ సోధి.
గతాన్ని పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాఫ్రికాదే పైచేయిగా కనిపిస్తున్నా, నాకౌట్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. నేటి రాత్రికి ఈడెన్ గార్డెన్స్‌లో జెండా పాతే జట్టు ఏదో తేలిపోనుంది.
Also Read: Iran Strike US Warship: అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడి?! మూడో ప్రపంచయుద్ధం మొదలైనట్టేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venus And Rahu Conjunction Effect On Zodiac Telugu: మార్చి రెండవ తేదీన ముఖ్యమైన కొన్ని గ్రహాలు సంయోగం చేశాయి. ముఖ్యంగా మాయాగ్రహంగా పరిగణించే రాహువుతో పాటు శుక్రుడి కలయిక జరిగింది. ఇప్పుడు శుక్రుడు కుంభరాశిలో సంచార దశలో ఉన్నాడు. రాహువు ఆ గ్రహంలోకి వెళ్లడం కారణంగా ఈ సంయోగం ఏర్పడింది. అయితే, దాదాపు 18 ఏళ్ల తర్వాత శుక్రుడితో పాటు రాహు గ్రహాల సంయోగం ఏర్పడిందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ఈ సంయోగం కారణంగా అరుదైన ధనయోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. దీని కారణంగా ఆయా రాశుల వారి జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.
ఈ రాశుల వారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
శుక్రుడు రాహు గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి సానుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొత్త ఆదాయ మార్గాలు రావడమే కాకుండా.. పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు. నిలిచిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా గ్రాఫ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆన్లైన్‌లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఎంతో లావదాయకంగా ఉంటుంది. కెరీర్‌తో పాటు వ్యాపారాల పరంగా చాలా వరకు కలిసి రాబోతోంది. ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అలాగే కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మార్కెటింగ్, మీడియా రంగాల్లో పనులు చేసే వ్యక్తులకు విశేషమైన లాభాలు కలిగే అవకాశాలున్నాయి. దీంతోపాటు కమ్యూనికేషన్ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అనుకోకుండా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడే అవకాశాలున్నాయి.
ధనస్సు రాశి
రాహువు శుక్రుడి కలయి క కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ధైర్యం పెంచుతుంది ఆస్తి, వాహనంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. అలాగే రాహు బలం వల్ల వీరు ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలివితేటలు విపరీతంగా పెరిగి ఈ సమయంలో అనుకున్న ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువు, శుక్రుడు కలయిక కారణంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. దీనికి తోడు వీరికి ఆకర్షణ కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కెరీర్లో భిన్నమైన గుర్తింపు పొందుతారు. ముఖ్యంగా సినిమా డిజైన్ ఫ్యాషన్ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు సృజనాత్మకత విపరీతంగా పెరుగుతుంది. అలాగే జీవితంలో అనుకున్న స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP DA Arrears Release Date: ఉద్యోగులు, పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పనున్నట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన డీఏ (DA) అరియర్స్ చెల్లింపుల విషయంలో నెలకొన్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక సమాచారాన్ని వెల్లడించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్ బిల్లుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రధాన సమస్య ఏంటి?
ప్రభుత్వం 2018 జూలై నుండి పెన్షనర్లు, సీపీఎస్ (CPS) ఉద్యోగులకు డీఏ అరియర్లను మంజూరు చేసింది. అయితే, CFMS (Comprehensive Financial Management System) పోర్టల్‌లో నెలకొన్న కొన్ని సాంకేతిక కారణాలు, ఇతర ఇబ్బందుల వల్ల చాలా మంది ఉద్యోగులకు ఈ నిధులు అందలేదు. ఒకసారి అప్లోడ్ చేసిన బిల్లులు తిరిగి సమర్పించే అవకాశం లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ హామీ ఏమిటంటే..
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించింది. నిలిచిపోయిన డీఏ అరియర్స్ బిల్లులను CFMSలో తిరిగి సమర్పించేలా వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు కోరారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ, ఉద్యోగులకు అరియర్స్ అందేలా చూసేందుకు నెల రోజుల్లోగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎవరికి ప్రయోజనం?
ఈ నిర్ణయం వల్ల 2018 నుండి డీఏ బకాయిల కోసం వేచి చూస్తున్న వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), సీపీఎస్ ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. నెల రోజుల్లో ప్రభుత్వం నుండి అధికారిక జీవో (GO) వెలువడితే, నిలిచిపోయిన నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే మార్గం సుగమం అవుతుంది.
Also Read: Iran Strike US Warship: అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడి?! మూడో ప్రపంచయుద్ధం మొదలైనట్టేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran Attacks On America warship: ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధ జ్వాలలు మరింత భయంకరంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య సాగుతున్న దాడులు-ప్రతిదాడుల పర్వం ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తాజాగా అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకపై తాము దాడి చేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
ఇరాన్ సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. తమ దేశ తీరానికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో మోహరించి ఉన్న అమెరికా యుద్ధనౌక (డిస్ట్రాయర్)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. తమ అత్యాధునిక క్షిపణులు లేదా డ్రోన్ల ద్వారా ఈ దాడిని విజయవంతంగా నిర్వహించామని ఇరాన్ సైన్యం పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ నేరుగా ఇంత పెద్ద ఎత్తున దాడికి దిగడం యుద్ధాన్ని మరో మలుపు తిప్పినట్లయింది.
తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితులు
కొద్ది రోజులుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో దాడులు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ సాహసోపేతమైన చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అమెరికా యుద్ధనౌకపై దాడి జరగడం వల్ల అమెరికా తన తదుపరి వ్యూహాన్ని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం వల్ల ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
అగ్రరాజ్యపు యుద్ధనౌకపై దాడి జరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ దాడి వార్తతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిశగా దూసుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే కీలకమైన సముద్ర మార్గాల్లో రవాణా నిలిచిపోయే అవకాశం ఉండటంతో భారత్ వంటి దేశాలకు ఎగుమతి, దిగుమతుల భారం పెరుగుతుంది.
అమెరికా ఈ దాడిపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఒకవేళ నౌకకు భారీ నష్టం వాటిల్లి ఉంటే, అది నేరుగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Temple: కలియుగ వైకుంఠవాసుడు కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యారు. భక్తులకు దర్శనమివ్వకుండా తలుపులు మూసుకుపోయిన శ్రీవారి.. ఎట్టకేలకు పదిన్నర గంటల తర్వాత పునఃదర్నం ఇచ్చాడు. దేవ దేవుడి ఆలయం తిరిగి తెరచుకుంది. చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేయగా.. గ్రహణం అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు మళ్లీ శ్రీవారు దర్శనమిచ్చారు.
Also Read: YS Jagan: మహిళలని చూడకుండా లాఠీఛార్జీ చేయిస్తావా? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
శ్రీవారి ఆలయంలో దర్శనాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. చంద్ర గ్రహణం ముగియడంతో శ్రీవారి ఆలయంతోపాటు ఉప ఆలయాలు కూడా తెరచుకున్నాయి. ఇక రాత్రి 8.30 నుంచి యథావిధిగా అన్నప్రసాద వితరణ కేంద్రం కూడా తెరచుకుంది. శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైందని టీటీడీ అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 3.26 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయ తలుపులు మూశారు. దాదాపు 10.30 గంటల అనంతరం మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు వేదమంత్రోచ్చరణాల మధ్య నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి
అన్నప్రసాద వితరణ ప్రారంభం
చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను రాత్రి 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి. వీటితోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలు కూడా తిరిగి తెరుచుకున్నాయి. దీంతో ఆలయాల్లో యథావిధిగా పూజా కార్యక్రమాలు, భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YSR Congress Party: ఆంధ్రప్రదశ్‌లో తమ వేతనాలు పెంచాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. నిరవధికంగా నిరసన చేపడుతుండడంతో అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చిన పోలీసులు అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లను అరెస్ట్ చేశారు. నిద్రలోనే వారిని ఎత్తుకుని వెళ్లిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: War Effect: కువైట్‌లో యుద్ధ భయాలు.. బెదిరిపోయి గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై ఎక్స్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. 'ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా?' అని చంద్రబాబును ప్రశ్నించారు. రెండేళ్లు అవుతున్నా ఆ హామీలకు దిక్కూమొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా?' అని నిలదీశారు.
Also Read: Bandi Sanjay: రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతదేశానికి గ్రహణం: బండి సంజయ్
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగం చేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారని పోలీసుల తీరును ఖండించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. 'ప్రజాస్వామ్యయుతంగా.. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: BR Naidu Resignation: బూతు రోత నాయుడు టీటీడీ చైర్మన్‌గా రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ
'ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో, ప్రజలంతా గమనిస్తున్నారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఒక్క అంగన్‌వాడీలకే కాదు, రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. దీనికి తప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
AP Youth Dead In Kuwait: ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని నిద్రపోనివడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆయా దేశాల్లో బతుకుతున్న ఇతర దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో కువైట్‌లో నివసిస్తున్న ఏపీ యువకుడు ప్రాణభయం పట్టుకుంది. యుద్ధ భయంతో గుండెపోటుకు గురయి ప్రాణం పోయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Bandi Sanjay: రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతదేశానికి గ్రహణం: బండి సంజయ్
పాలకొల్లు మండలం యాళ్లవాని గరువు పంచాయతీ డాంపేట గ్రామానికి చెందిన కందికట్ల శ్రీను, రమణ దంపతుల చిన్న కుమారుడు రాకేశ్ (26) తొమ్మిది నెలల కిందట ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు. రాకేష్ తల్లి రమణ కూడా కొన్నేళ్లుగా అక్కడే పని చేస్తోంది. కొన్ని రోజులుగా కువైట్‌లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర భయాందోళనగా మారింది. అక్కడ బాంబుల మోతలతో భయంకరంగా మారడంతో రాకేశ్ భయకంపితుడయ్యాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కావడంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాడు.
Also Read: BR Naidu Resignation: బూతు రోత నాయుడు టీటీడీ చైర్మన్‌గా రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ
యుద్ధ శబ్దాల మధ్య రాకేశ్ అనారోగ్యానికి గురయ్యాడు. ఈ ఘటన ఏపీలో.. స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో 'ఇక్కడ బాంబులు పడుతున్నాయి. నేను ఇంటికి వచ్చేస్తా' అంటూ రాకేష్ తన తండ్రి, బంధువులకు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే 'యుద్ధ పరిస్థితులు సద్దుమణిగాక రా' అని కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. అయితే ఇంతలో రాకేష్‌కు ఛాతీలో నొప్పి (గుండెపోటు) రావడంతో స్నేహితులు సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చి పంపించారు. కానీ ఆదివారం మళ్లీ తీవ్రమైన నొప్పి రావడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read: Dog Eat Body: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. మనిషి శవాన్ని పీక్కుతున్న కుక్క
ఈ విషాదంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడి పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
గుంటూరులో అగ్నిప్రమాదం
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానిక పోలీసులు, ఫైర్ సేఫ్ట్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
