Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో మార్పు వస్తోంది. ఈ క్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఆయన మున్సిపల్ ఎన్నికల వేళ తిరిగి గులాబీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సోదరుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అతడి చేరికకు సర్వం సిద్ధమైందని.. గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరుతారని చర్చ జరుగుతున్న సమయంలో ఆయన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో కొత్త లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సమయంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాకుండా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం తన మద్దతుదారులను గెలిపించాలని కోరారు. మూడుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి గెలుపొందారు.
Also Read: Harish Rao: హామీలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి అసలైన 'నకిలీ': హరీశ్ రావు
2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయి కాంగ్రెస్ వచ్చింది. కొన్ని నెలలకే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అయితే పార్టీలో జరిగిన తర్వాత అతడికి గౌరవం దక్కపోవడం.. తన అనుచరులకు అవకాశాలు రాకపోవడంతో గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉండడంతో మహిపాల్ రెడ్డి పునరాలోచనలో పడ్డాడు. తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్‌లో చేరి తప్పు చేసినట్లు ఓ సమావేశంలో ప్రకటించారు. అందులో భాగంగా తన సోదరుడిని గులాబీ అధినేత కేసీఆర్‌తో సమావేశమై తిరిగి రావడంపై చర్చించినట్లు సమాచారం. తిరిగి చేర్చుకునేందుకు ససేమిరా అన్నారని దీంతో ఆయన గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి మారడంతో గూడెం మహిపాల్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి చేరేందుకు సిద్ధమవగా మరి బీఆర్‌ఎస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందా లేదా అనేది తెలియాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు వేళ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపాలిటీల్లో మోరీ సమస్య వస్తే మోదీ వచ్చి పని చేస్తారా? అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంత ప్రజల తీర్పు ఇవ్వబోతున్న నేపథ్యంలో తమ భవిష్యత్‌ను దృష్టి పెట్టుకుని తీర్పు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతోందని ప్రకటించారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ, మోడీని చూసి ఓటేయమని వాళ్లు అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ఉన్న వారు గతంలో ఇచ్చిన హామీలు మర్చిపోయారు. నీట మునిగిన వారికి ఇంతవరకు సాయం చేయలేదు. ఓట్లేస్తే కేంద్రం నిధులు తెస్తామని మళ్లీ చెబుతున్న వాళ్లను నమ్ముతారా?' అని ప్రశ్నించారు. 'రూ.లక్షల కోట్లు ఇచ్చామని అంటున్నారు మరి ఆ డబ్బు ఎక్కడ పోయింది' అని నిలదీశారు.
Also Read: Chandrababu: కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందాం.. వేగంగా పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
'పన్నుల ద్వారా వచ్చే డబ్బు అని తేలిన అందులో కూడా వివక్ష చేస్తున్నారు. వాటా సరిగ్గా దక్కడం లేదని ఫైనాన్స్ వాళ్లు క్లారిటీ ఇచ్చారు. ఉత్తరాది వాళ్లకు ఒక న్యాయం మనకో న్యాయం చేస్తున్నారు. మనం ఒక్క రూ. చెల్లిస్తే 42 పైసలే కేంద్రం నుంచి వస్తున్నాయి' అని బడ్జెట్ వివరాలు రేవంత్ రెడ్డి వివరించారు. 'బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరూ ఇక్కడ ఉండి ఏం లాభం ఎందుకు అడగడం లేదు మీరు? మోదీ దగ్గర రాష్ట్ర పరువు ను తాకట్టు పెడుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జాతీయ ప్రాజెక్టు కింద ఏమన్నా తెచ్చి ఉంటే వీళ్లు ప్రయత్నం చేసినట్టు. కానీ ఏమీ చేయలేదు. గుజరాత్‌కు సబర్మతీ రివర్ ఫ్రంట్‌కు ఇస్తారు. ఇలా చాలా రాష్ట్రాలకు ఇస్తారు ఇక్కడ మీరెందుకు ఏం చేయరు?' అని కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరదలొచ్చినా కూడా మనకు అన్యాయం చేశారని తెలిపారు. ఎయిర్ పోర్టులోను అన్యాయమేనని చెప్పారు.
Also Read: Harish Rao: హామీలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి అసలైన 'నకిలీ': హరీశ్ రావు
'మోరి సమస్య వస్తే మోడీ ని కలుస్తారా ? కౌన్సిలర్లు ఎందుకు ఓట్లు వేయమంటారు? వాళ్ల దేవుడు అసద్ మాత్రమే. ఎన్నో సార్లు తలుచుకుంటున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నారు' అని బీజేపీపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'పదేళ్లు పాలించినా బీఆర్‌ఎస్ వాళ్లు ఓట్లు అడుగుతున్నారు. మొత్తం సీఎం నుంచి కౌన్సిలర్ పదవులు వరకు చేసిన బాగా చేస్తాము ఓట్లేయండి అంటే నమ్మేదెలా?' అని రేవంత్ రెడ్డి నిలదీశారు. 'మిగతా మంత్రులు తోలు బొమ్మలుగా ఉంచి మీ ముగ్గురే మాత్రమే కీలక శాఖల్లో ఉన్నారు. రూ.20 లక్షల కోట్లు ఇస్తే ఏం చేశారు ఇన్నేళ్లు. కనీసం రేషన్ కార్డులు కాదు సన్న బియ్యం ఇచ్చారా?' అని ప్రశ్నించారు.
Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Suma Cash Program Fake Or Real: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో యాంకర్ సుమ హోస్ట్ చేసిన 'క్యాష్' (Cash) ఒకటి. సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోలో లక్షలాది రూపాయల నగదు గెలుచుకున్నట్లు చూపించే సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. అయితే, నిజంగానే అంత నగదు ఇస్తారా? అక్కడ పగిలిపోయే ఫర్నీచర్ అసలైనదేనా? అనే సందేహాలకు కమెడియన్ సుదర్శన్ షాకింగ్ నిజాలను వెల్లడించారు. చాలా ఏళ్ల పాటు విజయవంతంగా నడిచిన 'క్యాష్' ప్రోగ్రామ్ గురించి జనాలు అనుకునేదానికి, అక్కడ జరిగేదానికి అస్సలు సంబంధం లేదని తేలిపోయింది.
కమెడియన్ సుదర్శన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. "నేను దాదాపు ఐదారు సార్లు 'క్యాష్' షోకి వెళ్లాను. వెళ్లిన ప్రతిసారీ రూ. 70-80 లక్షలు గెలుచుకున్నట్లు చూపించారు. అంటే మొత్తం మీద నేను రూ.3-4 కోట్లు సంపాదించానని మా ఊర్లో వాళ్లంతా నమ్మేశారు. కానీ, నిజానికి అక్కడ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు" అని చెప్పుకొచ్చాడు.
షో రేటింగ్ కోసం, ఉత్కంఠ పెంచడం కోసం మాత్రమే ఆ భారీ ప్రైజ్ మనీని గ్రాఫిక్స్‌లో లేదా బోర్డులపై చూపిస్తారు. ప్రతి వారం వచ్చే సెలబ్రిటీలకు కోట్లాది రూపాయలు ఇవ్వడం ఏ ఛానల్‌కైనా అసాధ్యమైన పని.
ఆ పగిలిపోయే ఫర్నీచర్ కథేంటి?
షోలో సమాధానం తప్పు చెబితే పైనుంచి ఫర్నీచర్, టీవీలు, బైక్‌లు కిందపడి పగిలిపోతుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం ఆశ్చర్యకరమైనదే! అవి అసలైన ఫర్నీచర్ కాదు. ప్రేక్షకులకు నిజమైన అనుభూతి కలిగించేందుకు డమ్మీ వస్తువులను ఉపయోగిస్తారు. పైనుంచి కింద పడేసేటప్పుడు రకరకాల యాంగిల్స్‌లో షూట్ చేసి, ఎడిటింగ్‌లో అవి భారీ ఖరీదైన వస్తువులనే భ్రమను కలిగిస్తారు.
ప్రమోషన్ల కోసం రివర్స్ పేమెంట్!
సాధారణంగా షోకి వచ్చిన వారికి డబ్బులు ఇస్తారని అందరూ భావిస్తారు. కానీ, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ప్రమోషన్ కోసం ఈ షోకి వస్తాయి. తమ సినిమాను కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మూవీ టీమ్స్ రివర్సులో ప్రొడక్షన్ హౌస్‌కు డబ్బులు చెల్లించి ఈ షోలో పాల్గొంటాయి.
'క్యాష్' నుండి 'సుమ అడ్డా' వరకు
కొన్ని కారణాల వల్ల 'క్యాష్' షోని నిలిపివేసి, ఇప్పుడు అదే తరహాలో 'సుమ అడ్డా' పేరుతో కొత్త షోని నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా వినోదానికి పెద్దపీట వేస్తూ సెలబ్రిటీలతో సందడి చేస్తున్నారు.
సుమ 'క్యాష్' ప్రోగ్రామ్ అనేది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ షో. అందులో కనిపించే లక్షల రూపాయల నగదు, పగిలిపోయే ఖరీదైన వస్తువులన్నీ కేవలం స్క్రిప్ట్, షో ఫార్మాట్‌లో భాగమే. సుదర్శన్ మాటలతో ఈ షోపై ఉన్న మిస్టరీ వీడిపోయింది.
Also Read: Bird Flu Cases In AP: ఏపీలో బర్డ్ ఫ్లూ పంజా..భారీగా పెరిగిన కేసులు..చికెన్, కోడిగుడ్లు తింటున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP CM Review Meeting: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన అందిద్దామని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు సూచించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని ప్రకటించారు. కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందామని.. సంక్షేమంతోనే అసమానతలు తగ్గుతాయని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడాలంటే.. ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంజీతో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమష్టి కృషితో లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ అని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై చర్చించారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూయర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, శాంతిభద్రతలు తదితర అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Harish Rao: హామీలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి అసలైన 'నకిలీ': హరీశ్ రావు
అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా భావించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని.. వాటిని నిబద్దతతో క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'నెల వారీగా సమీక్షించుకోవాలి, క్షేత్రస్థాయిలో పనుల్ని బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంఛార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో పనులు జరిగేలా చూడాలి' అని సూచించారు.
Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్
'ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలి. ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి, పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నాం. ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏమేరకు చేరుకున్నామన్నదానిపై స్పష్టతతో ఉంటున్నాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'గత పాలన అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశాం. వ్యవస్థలను తిరిగి గాడీన పెట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం' అని ప్రకటించారు.
'సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్ల తల్లుల ఖాతాల్లో వేశాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మొబిలిటి పెరిగి 4.29 కోట్ల మేర ఉచిత ప్రయాణాలు చేశారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.6,310 కోట్ల ఆర్ధిక సహకారం అందించాం. రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టాం. రైతు ఆత్మహత్యలనేవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని సమావేశంలో సీఎం చంద్రబాబు వివరించారు.
'దీపం 2.0 ద్వారా 4 విడతల్లో 3.64 కోట్ల గ్యాస్ సిలెండర్లు ఇప్పటి వరకూ ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్ధిక చేయూత అందించాం. పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. అవుట్ డేటెడ్, అవసరం లేని చట్టాలను సమీక్షించుకుని ముందుకు వెళ్దామని.. మెరుగైన ఫలితాలు సాధించడానికి లక్ష్యాలు నిర్దేశించుకుని అంతా కలిసి పని చేద్దామని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bird Flu Cases In AP: ఏపీలో బర్డ్ ఫ్లూ పంజా..భారీగా పెరిగిన కేసులు..చికెన్, కోడిగుడ్లు తింటున్నారా?
Bird Flu Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా) కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూయే కారణమని ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీ రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. అన్నమయ్య జిల్లాలోని సదుం మండలంలో కోళ్లు పెద్ద సంఖ్యలో మరణించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వైరస్ ఎలా నిర్ధారణ అయింది?
సదుం మండలంలోని పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లో కోళ్లు మృతి చెందడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) కు పంపగా, అక్కడ 'ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా' పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో లోతైన గోతులు తీసి పాతిపెడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మదనపల్లెలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అనుమానాలు ఉంటే 70139-14401, 93982-62752 నంబర్లకు సంప్రదించవచ్చు.
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో కూడా కోళ్లు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నాయి. అధికారులు అక్కడి నుంచి కూడా నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. పౌల్ట్రీ రైతులు కఠినమైన 'బయోసెక్యూరిటీ' నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు సోకడం చాలా అరుదు, కానీ అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు చెబుతున్నారు. చికెన్ లేదా గుడ్లను 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించి తినాలి. సగం ఉడికించిన మాంసం లేదా ఆమ్లెట్లు తినడం ప్రస్తుతానికి మానుకోవాలి. పచ్చి మాంసాన్ని తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ప్రస్తుతానికి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. చనిపోయిన పక్షులు లేదా కోళ్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.
Also REad: EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఉచితంగా రూ.7 లక్షలు.. ఎలా పొందాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO EDLI Scheme Benefit: పీఎఫ్ ఖాతాదారులు అందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీ జీతం నుండి పీఎఫ్ (PF) కట్ అవుతుంటే, మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రూ.7 లక్షల వరకు ఉచిత బీమా పొందే హక్కు మీకు ఉంటుంది. చాలా మందికి తెలియని ఈ EDLI (Employees' Deposit-Linked Insurance) పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన చందాదారుల కోసం అందిస్తున్న ఈ పథకం, ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుంది.
ఒక్క రూపాయి ప్రీమియం కట్టక్కర్లేదు!
సాధారణంగా ఏదైనా బీమా కావాలంటే మనం ప్రీమియం కట్టాలి. కానీ, ఈ EDLI పథకం ప్రత్యేకత ఏంటంటే.. ఈ బీమా కోసం ఉద్యోగి తన జేబు నుండి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బీమాకు కావాల్సిన పూర్తి ప్రీమియంను మీ కంపెనీ లేదా యజమాని మాత్రమే చెల్లిస్తారు. మీ పీఎఫ్ ఖాతా ఓపెన్ అయిన వెంటనే, మీరు ఆటోమేటిక్‌గా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చేస్తారు. దీనికోసం వేరే దరఖాస్తు చేయనక్కర్లేదు.
ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే, నామినీ ఈ డబ్బును పొందవచ్చు. మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ వివరాలు తప్పనిసరి. EDLI ఫారం 5 IF పూర్తి చేసి ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో ఇవ్వాలి. క్లెయిమ్ చేసిన 30 రోజుల్లోపు డబ్బు సెటిల్ చేయాలి. ఆలస్యమైతే ఈపీఎఫ్‌ఓ 12% వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
నామినేషన్ ముఖ్యం!
మీకు ఏదైనా జరిగినప్పుడు మీ కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇ-నామినేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. నామినీ ఉంటేనే ఈ ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. నామినీ లేకపోతే భార్య/భర్త లేదా 25 ఏళ్ల లోపు పిల్లలు దీనికి అర్హులు.
Also Read: EPFO Wage Limit Hike: ఉద్యోగులకు జాక్‌పాట్..ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన! పెరగనున్న కనీస పెన్షన్?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Farewell Party Obscene Dance Video: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాల ప్రాంగణం అశ్లీల నృత్యాలకు వేదికైంది. పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకల్లో నైతిక విలువలను గాలికొదిలేసి, రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యా వ్యవస్థను అపహాస్యం చేసేలా జరిగిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వీడ్కోలు వేడుకల్లో అశ్లీలత
కురుపాం మండలం నీలకంఠపురం బాలుర ఆశ్రమ పాఠశాలలో రెండు రోజుల క్రితం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించాల్సిన చోట, వార్డెన్ చంద్రశేఖర్ ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. వార్డెన్ సమక్షంలోనే అర్ధరాత్రి వరకు అశ్లీల నృత్యాలు సాగాయి. విద్యార్థులతో కలిసి నృత్యకారిణులు తైతక్కలాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలు కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన డీడీ విజయశాంతి, బాధ్యుడైన వార్డెన్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నేత పుష్ప శ్రీవాణి స్పందిస్తూ విద్యా వ్యవస్థలో ఇలాంటి ధోరణి సరికాదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
ఇదేనా మంచి ప్రభుత్వం..!!సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న దృశ్యం ఇది 😔
అశ్లీల నృత్యాలకు అడ్డాగా కురుపాం నియోజక వర్గంలో నీలకంఠా పురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను మార్చేశారు. సాక్షాత్తు గిరిజన సంక్షేమ మంత్రి జిల్లాలో, గిరిజన ప్రభుత్వ విప్ నియోజకవర్గంలో పిల్లల భవిష్యత్తు నాశనం… pic.twitter.com/kgD889yEjV
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) February 8, 2026
పరీక్షల సమయంలో విద్యార్థులను చదువుపై ఏకాగ్రత పెంచేలా ప్రోత్సహించాల్సింది పోయి, ఇలాంటి అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో క్రమశిక్షణ ఎటు పోతోందని వారు ప్రశ్నిస్తున్నారు.
సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల్లో కేవలం చదువు మాత్రమే కాదు, సంస్కారవంతమైన వాతావరణం ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
Also Read: Pakistan Demand ICC: భారత్‌తో ఆడేందుకు పాక్ 'కండీషన్స్'.. ఐసీసీ ముందు పాకిస్థాన్ 3 వింత డిమాండ్లు!
Also Read: EPFO Wage Limit Hike: ఉద్యోగులకు జాక్‌పాట్..ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన! పెరగనున్న కనీస పెన్షన్?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PCB Demands ICC Revenue Share: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాక్ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠ కొత్త మలుపు తీసుకుంది. మొన్నటి వరకు "భారత్‌తో ఆడేదే లేదు" అని భీష్మించుకూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇప్పుడు మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే, మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ (ICC) ముందు పాక్ మూడు వింతైన డిమాండ్లను ఉంచినట్లు సమాచారం.
మ్యాచ్ బహిష్కరిస్తే ఐసీసీ నుండి ఎదురయ్యే కఠిన చర్యలకు భయపడిన పీసీబీ, ఇప్పుడు 'బేరసారాల' పర్వానికి తెరలేపింది. తమను ఒప్పించాలంటే ఈ మూడు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతోంది.
ఐసీసీ రెవెన్యూలో అధిక వాటా
భారత్-పాక్ మ్యాచ్‌ల వల్ల ఐసీసీకి వేల కోట్ల ఆదాయం వస్తోందని, అందులో తమకు ఇచ్చే వాటాను పెంచాలని పాక్ డిమాండ్ చేస్తోంది. భారత జట్టు క్రేజ్ వల్ల వచ్చే లాభాల్లో తమకు పెద్ద పీట వేయాలని పీసీబీ కోరడం విశేషం.
ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన డిమాండ్ ఇది. గత పదేళ్లుగా నిలిచిపోయిన భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లను మళ్లీ ప్రారంభించాలని పీసీబీ పట్టుబడుతోంది. ఒకవైపు మ్యాచ్ ఆడబోమని చెబుతూనే, మరోవైపు సిరీస్‌లు కావాలని కోరడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
'హ్యాండ్‌షేక్' ప్రోటోకాల్
ఖేల్ రత్న లేదా స్పోర్ట్స్‌మన్‌షిప్ పేరుతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. మ్యాచ్‌కు ముందు, తర్వాత భారత ఆటగాళ్లు తప్పనిసరిగా పాక్ ఆటగాళ్లకు కరచాలనం చేయాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కోరుతోంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉండే ఉద్రిక్తతలను తగ్గించేందుకే ఈ ప్రతిపాదన అని వారు చెబుతున్నారు.
పాకిస్థాన్ పెట్టిన ఈ షరతులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఐసీసీ ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత ప్రభుత్వం అనుమతి లేకుండా బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆదాయం వాటా విషయంలో ఇతర సభ్య దేశాలు అంగీకరిస్తాయా అనేది సందేహమే.
కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని పాక్ తన పాత డిమాండ్లను నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే ఈ మ్యాచ్ భవితవ్యం ఇప్పుడు ఐసీసీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
Also Read: EPFO Wage Limit Hike: ఉద్యోగులకు జాక్‌పాట్..ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన! పెరగనున్న కనీస పెన్షన్?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO Salary Hike 2026: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ (ESIC) పరిధిలోని వేతన పరిమితిని పెంచడంతో పాటు, కనీస పెన్షన్ పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయమై సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ ఉద్యోగుల సామాజిక భద్రతను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనివల్ల జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల్లో భారీ మార్పులు రానున్నాయి.
వేతన పరిమితి పెంపు (Salary Limit Hike)
ప్రస్తుతం EPFO, ESIC పథకాలకు వర్తించే గరిష్ట వేతన పరిమితి నెలకు రూ.15,000గా ఉంది. పెరిగిన జీవన ప్రమాణాల దృష్ట్యా ఈ పరిమితిని రూ.21,000కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది అదనపు కార్మికులు ఈ పథకాల పరిధిలోకి వస్తారు. తద్వారా వారి పీఎఫ్ (PF) ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది.
EPS-95 కనీస పెన్షన్ పెంపు
ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు అందుతున్న కనీస పెన్షన్ చాలా తక్కువగా ఉంది. కనీస పెన్షన్ నెలకు రూ.1,000 మాత్రమే. ఈ మొత్తాన్ని రూ.3,000 నుండి రూ.7,000 వరకు పెంచాలని కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కేవలం నగదు ప్రయోజనాలే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్య బీమా సంస్థ (ESIC) సేవలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెరుగైన వైద్య సదుపాయాలు, బీమా సౌకర్యాలు అందేలా కొత్త గైడ్ లైన్స్ విడుదల కానున్నాయి.
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో కనీస వేతనం నిర్ణయించడం, పెన్షన్ పెంపు వంటి అంశాలపై సానుకూల స్పందన లభించింది. మోడీ ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే ఈ నిర్ణయం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒక 'జాక్‌పాట్' వంటిదని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
వేతన పరిమితి పెంపు వల్ల చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినా, దీర్ఘకాలంలో పీఎఫ్, పెన్షన్ రూపంలో భారీ మొత్తంలో పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి వచ్చే తుది నోటిఫికేషన్ కోసం ఉద్యోగులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bomb Threat Delhi Schools Today: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం ఉదయం పార్లమెంటుతో పాటు ఢిల్లీలోని సుమారు 9 ప్రముఖ పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. "ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది" అనే హెచ్చరికతో వచ్చిన ఈ మెయిల్స్ భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేశాయి.
నకిలీ బాంబు బెదిరింపులు మెట్రో నగరాల్లో నిత్యకృత్యంగా మారుతున్న తరుణంలో, తాజా ఘటన తల్లిదండ్రులు మరియు అధికారులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
లక్ష్యంగా చేసుకున్న పాఠశాలలు
సోమవారం ఉదయం 8:30 నుండి 9:00 గంటల మధ్య కనీసం తొమ్మిది విద్యా సంస్థలకు ఈ బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని లోరెటో కాన్వెంట్, రోహిణిలోని వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్, బాల్ భారతి, CM శ్రీ స్కూల్, శ్రీనివాసపురి.. న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని కేంబ్రిడ్జ్ స్కూల్, సాదిక్ నగర్‌లోని ది ఇండియన్ స్కూల్, INAలోని DTEA స్కూల్, న్యూ రాజిందర్ నగర్‌లోని మానవ్ స్థలి స్కూల్ వంటి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి.
బెదిరింపు ఇమెయిల్‌లోని సారాంశం
'ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ' పేరుతో వచ్చిన ఈ ఇమెయిల్‌లో అత్యంత వివాదాస్పదంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి: "మధ్యాహ్నం 1:11 గంటలకు పేలుడు జరుగుతుంది. ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఈ దాడి చేస్తున్నాం" అని అందులో పేర్కొన్నారు. ఈ వారం చివరలో, అంటే ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 1:11 గంటలకు పార్లమెంటు భవనంలో కూడా పేలుడు సంభవిస్తుందని నిందితులు హెచ్చరించారు.
రంగంలోకి భద్రతా బలగాలు
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళం, బాంబు నిర్వీర్య దళం పాఠశాలలకు చేరుకున్నాయి. ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను, సిబ్బందిని వెంటనే పాఠశాల ప్రాంగణం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, ప్రాథమికంగా ఇవి నకిలీ బెదిరింపులుగా కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. జనవరి 29న ఐదు పాఠశాలలకు ఇలాగే ఈమెయిల్ బెదిరింపులు వచ్చాయి, అవి అబద్ధమని తర్వాత తేలింది. అలాగే అంతకుముందు జనవరి 28న ద్వారకా కోర్టు సముదాయానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.
నిపుణుల హెచ్చరిక
పదేపదే వస్తున్న ఈ నకిలీ బెదిరింపుల మూలాన్ని కనిపెట్టేందుకు పోలీసులు సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Also Read: England Vs Nepal Match: ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్.. తృటిలో చేజారిన అద్భుత విజయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Indian Railways Liquor Carrying Rules: రైలు ప్రయాణంలో మద్యం బాటిళ్లను వెంట తీసుకెళ్లడం అనేది చాలా మంది ప్రయాణికుల్లో ఉండే ఒక పెద్ద సందేహం. సాధారణంగా రైల్వే స్టేషన్లు, రైళ్లను బహిరంగ ప్రదేశాలుగా పరిగణిస్తారు. అయితే, రైళ్లలో మద్యం రవాణాకు సంబంధించి రైల్వే చట్టాలతో పాటు ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ నిబంధనలు కూడా వర్తిస్తాయి.
అయితే ఈ విషయంలో చట్టం ఏం చెబుతోంది? ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. రైల్వే చట్టం 1989 ప్రకారం నేరుగా మద్యం రవాణాపై స్పష్టమైన నిషేధం లేనప్పటికీ, కొన్ని కీలక నిబంధనలు ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.
రాష్ట్ర చట్టాలదే పైచేయి
రైలులో మద్యం తీసుకెళ్లడం అనేది మీరు ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టారు? ఎక్కడికి వెళ్తున్నారు? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మద్యం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. కాబట్టి ప్రయాణికుడు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లేటప్పుడు ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ నిబంధనలను పాటించాలి. కొన్ని రాష్ట్రాలు నిర్దిష్ట పరిమితి వరకు అనుమతిస్తే, మరికొన్ని రాష్ట్రాలు అసలు అనుమతించవు.
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మద్యంపై పూర్తి నిషేధం ఉంది. ఇక్కడికి మద్యం తీసుకెళ్లడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. గుజరాత్, బీహార్, నాగాలాండ్, లక్షద్వీప్. ఒకవేళ మీ రైలు ఈ రాష్ట్రాల గుండా వెళ్తున్నప్పుడు మీ దగ్గర మద్యం ఉంటే, అది వేరే రాష్ట్రంలో కొన్నదైనా సరే, ఆ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు మిమ్మల్ని అరెస్టు చేసే అధికారం కలిగి ఉంటారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇవి అత్యంత కఠినమైన శిక్షలకు దారితీస్తాయి.
రైల్వే పరిధిలో మద్యం సంబంధిత నిబంధనలు అతిక్రమిస్తే ఈ క్రింది చర్యలు ఉంటాయి. 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రూ.500 నుండి రూ.1,000 వరకు జరిమానా విధిస్తారు (కొన్నిసార్లు జైలు, జరిమానా రెండు ఉండవచ్చు). మద్యం నిషేధిత రాష్ట్రాల్లో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు సుదీర్ఘ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్య విషయాలు..
రైలులో లేదా ప్లాట్‌ఫారమ్‌పై మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. సీలు వేసిన బాటిల్ అయినప్పటికీ, సంబంధిత రాష్ట్ర ఎక్సైజ్ అనుమతి లేనిదే రవాణా చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. పండుగలు, సెలవు దినాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తనిఖీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
చట్టపరమైన ఇబ్బందులు పడకుండా ఉండాలంటే రైలు ప్రయాణాల్లో మద్యాన్ని వెంట తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా మీరు వెళ్లే మార్గంలో మద్యం నిషేధిత రాష్ట్రాలు ఉంటే అది మరింత ప్రమాదకరం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: England Vs Nepal Match: ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్.. తృటిలో చేజారిన అద్భుత విజయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Power Cut Today: హైదరాబాద్ నగర వాసులకు ముఖ్య గమనిక. నేడు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ లైన్ల నిర్వహణ, ఫీడర్ల మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. నగరంలో విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు మరియు రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, పాతబడిన విద్యుత్ తీగలను మార్చడం, ట్రాన్స్‌ఫార్మర్ల నాణ్యతను తనిఖీ చేయడం వంటి పనులను విద్యుత్ శాఖ చేపడుతోంది.
ఇందులో భాగంగా వివిధ ఫీడర్ల వద్ద మరమ్మతులు అవసరం కావడంతో, ఆయా ప్రాంతాల్లో సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఈ అంతరాయం రెండు విడతలుగా ఉండనుంది. మొదటి విడత కోతలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయి. ఉదయం వేళలో పనులు ప్రారంభమయ్యే సమయం కావడంతో.. జవహర్‌నగర్, కళ్యాణ్ నగర్, మధురానగర్ ఈ నివాస ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి విద్యుత్ ఉండదు.
ఇక రెండవ విడత కోతలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండనున్నాయి. అలాగే మధ్యాహ్నం భోజన సమయం తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతాయి. పంజాగుట్ట బాటా షోరూమ్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (ఠాణా) ప్రాంతం మరియు హిమాలయా బుక్ డిపో పరిసరాల్లో సాయంత్రం వరకు విద్యుత్ ఉండదు. అంతేకాకుండా సాయిబాబా ఆలయ ప్రాంతం, పాత టెలిఫోన్ ఎక్ఛేంజ్ ఏరియాతో పాటు ద్వారకాపురి కాలనీ, సిద్ధార్థ నగర్, వెంగళరావు నగర్, మధురానగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమలవుతాయి.
అయితే మరమ్మతులు నిర్ణీత సమయం కంటే ముందే పూర్తయితే, వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. అయితే, వాతావరణ పరిస్థితులు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందుల వల్ల స్వల్పంగా సమయం మారే అవకాశం ఉండవచ్చని కూడా పేర్కొన్నారు.
Also Read: School Holiday: స్కూల్ విద్యార్థులకు బంపర్ న్యూస్.. ఈ వారంలో వరుసగా 4 రోజులు సెలవులు..!
Also Read: Today Rashi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. కోటిశ్వరులవ్వడం ఖాయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Municipal Elections: 'గల్లీల్లో పారే మురుగు నీరు కన్నా.. రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే మురికి మాటలు మరింత కంపు కొడుతున్నాయి. కమీషన్ల కోసం రూ.40,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఉన్నాయి కానీ ఉద్యోగులు, పేదలకు ఇవ్వడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం గులాబీ జెండానే ఎగురుతోందని జోష్యం చెప్పారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్, నర్సాపూర్, మెదక్.. మున్సిపాలిటీ ఏదైనా గెలిచేది కారు గుర్తేనని హరీశ్ రావు ప్రకటించారు.
Also Read: YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. 'మోసం చేసిన వాళ్లకు ఓటేస్తామా? అన్నం పెట్టిన కేసీఆర్‌కు ఓటేస్తామా? హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్ రెడ్డికి ఓటేద్దామా? ప్రజలు ఆలోచించుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు. 'తెలంగాణ సాధిస్తానంటే సాధించి చూపించింది కేసీఆర్ రూ.2000 పింఛన్ ఇస్తానంటే ఇచ్చింది కేసీఆర్. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష, కేసీఆర్ కిట్ కింద రూ.13,000 ఇచ్చి చూపించింది కేసీఆర్. ఇదీ అసలు నాయకుడి లక్షణం' అని వివరించారు.
Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్
'సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది. రూ.34 కోట్లతో ఇంటింటికి తాగునీళ్లు ఇచ్చి అక్కచెల్లెళ్ల కష్టాలు తీర్చాం. చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు రోడ్లు, లైట్లు, డివైడర్లు అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయింది. సంగారెడ్డిలో ఎక్కడైనా ఒక్క రూపాయి పని చేశారా?' అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం శాంక్షన్లు, టెండర్లు లేకుండా కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
Also Read: Harish Rao: బూతుల రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్‌లో బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు
'రేవంత్ రెడ్డిది కమీషన్ల ప్రభుత్వం. రూ.95 వేల కోట్ల టెండర్లు పిలిచి డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయి. రూ.40,000 కోట్లు కాంట్రాక్టర్లకు, మిత్రుకు కమీషన్లు తీసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రిటైర్డ్ ఉద్యోగులకు, పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తారు.. రిటైర్డ్ ఉద్యోగులు కమీషన్లు ఇవ్వరని వాళ్లకు ఇవ్వడం లేదా? అని నిలదీశారు. 'రుణమాఫీ పేరుతో దేవుళ్ల మీద ఒట్టేసి మోసం చేశారు. ఆగస్టు 15 కల్లా చేస్తానన్నాడు.. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా రైతులు ఆందోళన చేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా.. రేవంత్ రెడ్డి నువ్వు ఏ ఊరికైనా రా.. లేదా కొడంగల్ కు రమ్మన్నా వస్తా.. రుణమాఫీ పూర్తిగా జరిగిందో లేదో తేల్చుకుందాం' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook