Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Oil Palm: రైతులకు సిరిసంపదలు అందించే పంట.. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు డబ్బే డబ్బు!: తుమ్మల
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 17:07:17
Hyderabad, Telangana

Gold Mine For Farmers: రాష్ట్రంలోని రైతాంగం సాంప్రదాయ పంటలకు గుడ్ బై చెప్పి.. లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకమైన పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఆయన, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అంతేకాకుండా ఆయిల్ ఫామ్ పంటలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలను కూడా రైతులకు తెలియజేశారు. రైతులు భారీ మొత్తంలో లాభాలు పొందడానికి ఈ పంట ఎంతగానో సహాయపడుతుందని తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతులకు భీమానిచ్చే ఏకైక పంట ఆయిల్ ఫామ్ అని.. స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వరి మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని.. కానీ ఆయిల్ ఫామ్ పంటలకు భారీ వర్షాలు, తుఫాన్ల బెడద అస్సలు ఉండదని తెలిపారు. గాలి వానలకు తట్టుకొని నిలబడటమే దీని ప్రత్యేకతని ఆయన వివరించారు. ఎలాంటి సమయంలోనైనా రైతులకు డబ్బులు అందించేందుకు ఈ ఆయిల్ ఫామ్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.

చాలా ప్రాంతాల్లో కోతులతో పాటు అడవి పందుల వల్ల పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ఆయిల్ ఫాన్స్ ఆగులు ఆ సమస్య ఉండదని మంత్రి పేర్కొన్నారు.. ఈ పంటను కోతులు నాశనం చేయలేవని.. అడవి పందుల బెడద ఉండదని.. చివరికి దొంగల భయం కూడా లేని ఏకైక పంట ఇది అని రైతులకు భరోసా ఇచ్చాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఈ పంటను సాగు చేయచ్చని మంత్రి తెలిపారు..

Also Read: Kodada Oil Mafia: అర్ధరాత్రి అక్రమ దందా.. కోదాడ కేంద్రంగా ఆయిల్ మాఫియా..

ఆయిల్ ఫాం సాగు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి కూడా మంత్రి తుమ్మల తెలిపారు.  ఈ పంట వేయడం వల్ల ప్రతినెల క్రమం తప్పకుండా చేతికి డబ్బులు అందే అవకాశాలు కూడా ఉన్నాయని.. పండిన గెలలను ఫ్యాక్టరీలే నేరుగా కొనుగోలు చేస్తాయని.. మార్కెటింగ్ కష్టాలు కూడా ఉండవని ఆయన అన్నారు. ఒకసారి నాటితే దాదాపు 30 ఏళ్ల పాటు దిగుబడిని ఇస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని.. సబ్సిడీలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందజేస్తూ ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు..

Also Read: Kodada Oil Mafia: అర్ధరాత్రి అక్రమ దందా.. కోదాడ కేంద్రంగా ఆయిల్ మాఫియా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 17:51:21
Hyderabad, Telangana:

Shukraditya And Malavya Rajayoga Effect On Zodiac: మార్చి మూడో వారంలో గ్రహాల స్థితిగతుల్లో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మార్చి 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్న ఈ వారంలో సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే మీనరాశిలో ఉన్న శుక్రుడు సూర్యుడి కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి తోడు శుక్రుడు బుచ్చరాశిలో ఉండడం వల్ల ఎంతో పవర్ఫుల్ అయిన మాళవ్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ రెండు రాజయోగాలు కొన్ని రాశుల వారికి వారం మొత్తం అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ క్రింది రాశుల వారికి కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనుకోకుండా ఈ సమయంలో అద్భుతమైన విజయాలు కూడా సాధించబోతున్నారు.

మేష రాశి 
మేషరాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ రెండు శక్తివంతమైన రాజయోగాల ఏర్పాటు వల్ల కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఆనందమయం అవుతుంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వారికి కార్యాలయాల్లో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. పనికి తగ్గ అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగస్వామ్య జీవితంలో మనస్పార్ధాలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల స్వల్పంగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహరాశి 
సింహ రాశి వారికి కూడా ఈ వారం ఆర్థికంగా చాలా కలిసి రాబోతోంది. వీరికి ఆకస్మిక ధన ధను లాభాలు కలగడమే కాకుండా కుటుంబంలో సుఖసంతోషాలు అద్భుతంగా పెరుగుతాయి. ఈ వారంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు అనుకోకుండా కఠినమైన పనుల్లో కూడా సక్సెస్ అవుతారు.

కన్య రాశి 
కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు మిత్రులుగా ఉన్న వారికి సహకారం లభిస్తుంది. దీని కారణంగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ వారం ఒత్తిడి నుంచి కూడా ఊహించని స్థాయిలో ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో జీవితంలో సానుకూలమైన మార్పులు లేని వ్యక్తులు.. ఈ సమయంలో మంచి మార్పులను కూడా చూడబోతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

222
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 17:40:53
Hyderabad, Telangana:

Sun Transit 2026 Effect On Zodiac: గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్య భగవానుడు తన రాశిని అతి త్వరలోనే మార్చుకోబోతున్నాడు. అయితే, ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఆత్మవిశ్వాసంతో పాటు గౌరవం ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచార దశలో ఉన్నాడు.. మార్చి 15వ తేదీ ఆదివారం తెల్లవారి జామున మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే మీన రాశిలో శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం ఇతర కొన్ని గ్రహాలు ఉన్నాయి. అయితే సూర్యుడు కూడా ప్రవేశించడం వల్ల ఎంతో శక్తివంతమైన రెండు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇందులో ముఖ్యమైన త్రిగ్రహీ యోగం రాజయోగం ఏర్పడుతుంది. అయితే, ఇది ఏర్పడడం వల్ల మొత్తం 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడినప్పటికీ.. కొన్ని రాశుల వారికి ఈ సమయంలో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రాశులవారికి లాభాలు:
వృషభ రాశి 
ముఖ్యంగా వృషభరాశి వారికి 11వ స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులు శరవేగంగా పూర్తయి అవకాశాలు కనిపిస్తున్నాయి.. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు కూడా లభించబోతోంది.

మిథున రాశి 
మిధున రాశి వారికి సూర్యుడి ప్రభావంతో ఆదివారం నుంచి ఎంతో అనుకూలమైన సమయం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా వీరికి కార్యాలయాల్లో మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఉన్నత అధికారుల నుంచి అద్భుతమైన సపోర్టు లభించబోతోంది. కొత్త  వ్యాపారాలు చేస్తున్నవారు ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారికి కూడా సూర్యుడి సంచారం ఎన్నో రకాల అద్భుతమైన అవకాశాల అందించబోతోంది. ముఖ్యంగా విదేశీ యాన మార్గం ఎంతో సులభతరం అవుతుంది. విద్యార్థులకు ఉన్నత చదువు కోసం విదేశాలు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అదృష్టం సహకరించి తక్కువ శ్రమతోనే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఎప్పటినుంచో కష్టపడుతున్న వ్యక్తులకు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులు సూర్యుడి సంచారంతో శత్రువులపై అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. వీరికి సమాజంలో గుర్తింపు లభించడమే కాకుండా.. ఆరోగ్య సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం లభించబోతోంది. ఎన్నో రకాల తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మంచి పరిష్కారం లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

136
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 17:28:19
Hyderabad, Telangana:

Heart-Wrenching Video Watch Here: కుక్క కాటు ఎంత ప్రమాదకరమైందో మరోసారి ఈ హృదయ విదారక ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో వెలుగు చూసిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం ఒక ఒక చిన్న నిర్లక్ష్యంతో పాటు పేదరికం కలిసి ఒక 17 ఏళ్ల యువకుడి ప్రాణాపాయస్థితికి తీసుకువచ్చింది. నాలుగు నెలల క్రితం జరిగిన కుక్క కాటుకు సరైన సమయంలో చికిత్స అందించకపోవడంతో.. ప్రస్తుతం ఆ బాలుడు రేబిస్ వ్యాధితో మరణంతో పోరాడుతున్నాడు.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.

మీర్జాపూర్ కు చెందిన 17 ఏళ్ల కరణ్‌ను సుమారు నాలుగు నెలల క్రితం ఒక వీధి కుక్క కరిచింది.. ఆ సమయంలో గాయం తీవ్రతను గుర్తించిన తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. వైద్యులు సూచించిన యాంటీ-రేబీస్ వ్యాక్సిన్ (ARV) కోర్సును పూర్తిగా పూర్తి చేయించలేకపోయారు.. ఒకటి రెండు డోసులతోనే చికిత్సను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, ఈ సమయంలోనే బాలుడు అప్పుడప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారని గమనించారు కుటుంబ సభ్యులు..

కొద్ది రోజుల క్రితం వరకు సాధారణంగానే ఉన్న కరణ్ ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతింది.. శరీరంలోని ప్రవేశించిన రేవిస్ వైరస్ మెదడుపై కూడా ఊహించని ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టేసింది.. దీంతో ఆ బాలుడు అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.. ముఖ్యంగా కుక్కలాగా అరవడమే కాకుండా.. నోటి నుంచి నురగ రావడంతో పాటు నీటిని చూసి తీవ్రంగా భయపడటం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు..

Also Read: Kodada Oil Mafia: అర్ధరాత్రి అక్రమ దందా.. కోదాడ కేంద్రంగా ఆయిల్ మాఫియా.

పరిస్థితి విషమించడంతోనే వెంటనే అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కరణ్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని.. రేబిస్ చివరి దశకు చేరుకోవడంతో బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే, రేబిస్ అనేది చికిత్స లేని వ్యాధి అని.. కేవలం వ్యాక్సిన్ ద్వారా మాత్రమే దీని నివారించగలమని వైద్యులు స్పష్టం చేశారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలని.. వైద్యులు సూచించిన అన్ని డోసుల వ్యాక్సిన్లు తప్పనిసరిగా తీసుకోవాలని.. వారి కోరారు.. వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత ప్రాణాలను కాపాడుకోవడం అసాధ్యమని వైద్యులు హెచ్చరించారు..

Also Read: Kodada Oil Mafia: అర్ధరాత్రి అక్రమ దందా.. కోదాడ కేంద్రంగా ఆయిల్ మాఫియా.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

187
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 17:18:08
Hyderabad, Telangana:

Iran Missile Attack On Israel Telugu News: మధ్యప్రచుర్యంలో యుద్ధమేఘాలు ఉగ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఒక్కసారిగా ఇజ్రాయిల్ పై భీకర దాడులకు తెరబడింది.. శనివారం తెల్లవారుజామున నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఒక 1,430 క్షిపణులను ఇజ్రాయిల్ భూభాగంపై ప్రయోగించి ఇరాన్ రాక్షసంగా విరుచుకుపడింది.. ఈ ఆకస్మిక దాడులతో ఇజ్రాయిల్ లోని ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఒక్కసారిగా దద్దరిల్లిపోయేలా క్షిపణుల వర్షం కురిపించింది. దీని దాటికి పెద్ద పెద్ద భవనాలన్నీ నేలమట్టమైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి. 

ఇరాన్ ప్రధానంగా దక్షిణ ఇజ్రాయిల్‌లోని పోర్ట్ సిటీ అయిన ఈలట్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే వందలాదిక్ క్షిపణులు నగరం పై పడటంతో భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణనాష్టం కూడా సంభవించిందని తెలుస్తోంది. క్షిపణుల ధాటికి పలు పెద్ద భవనాలు కూడా కుప్పకూలగా.. వాహనాలు అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. నగరమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అనేక క్షిపణులను అడ్డుకున్నప్పటికీ.. దాడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని క్షీపనలు జనాభాసాల్లో పడ్డాయి. 

ఈ దాడుల్లో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయిల్ జాతీయ అత్యవసర వైద్య సేవ విభాగం అధికారికంగా ప్రకటించింది. దాడులు జరిగిన వెంటనే పారామెడికల్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయని.. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు  తరలించి చికిత్సలు కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. దీని కారణంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు.

ఇరాన్ చేసిన ఈ దుశ్చర్యానికి ఇజ్రాయిల్ తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.. ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయిల్ రక్షణ ధనం ఇప్పటికే హెచ్చరించింది.. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలందరినీ బాంబు షెల్టర్లలోని ఉండాలని ఆదేశించింది. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరగడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా సహా పలు దేశాలు ఈ దాడిని ఖండించక యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

Also Read: Kodada Oil Mafia: అర్ధరాత్రి అక్రమ దందా.. కోదాడ కేంద్రంగా ఆయిల్ మాఫియా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

169
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 14, 2026 17:16:22
Nuzendla, Andhra Pradesh:

LPG Gas Cylinder: కొన్ని దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణంతో ముడి చమురు మార్కెట్‌పై తీవ్ర సంక్షోభం ఎదురైంది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై నీలి మేఘాలు కమ్ముకోవడంతో పెట్రోలియంతోపాటు గ్యాస్‌ కొరత వేధిస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ సంక్షోభం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్‌ కొరతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో కూడా గ్యాస్‌ కొరత ప్రభావం ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఎలాంటి కొరత లేదని ప్రకటించింది. గ్యాస్‌ సరఫరాపై కొరత లేదని.. కావాల్సిన గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్‌ కొరతపై సమీక్ష చేస్తున్నామని.. ఎలాంటి పుకార్లు నమ్మొద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.

Also Read: Iftar Party: 'చోటా యోగి' రేవంత్‌ రెడ్డి.. తెలంగాణలో బుల్డోజర్‌ సర్కార్‌: హరీశ్‌ రావు

ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ పరిస్థితి నియంత్రణలో ఉందని.. కొన్ని సోషల్ మీడియాల్లో వినియోగదారులను తప్పుదారి పట్టించేవారు/ నిరాధారమైన, తగినంత ఇంధనం లేదనే వదంతులు వాస్తవం కాదని ప్రభుత్వం ప్రకటించింది. సోషల్ మీడియా పుకార్లు కారణంగా దేశీయ రీఫిల్ బుకింగ్స్ 15 శాతం పెరిగిందని.. సరఫరా ఎఫ్‌ఐఎఫ్‌ఓ (FIFO) ఆధారంగా జరుగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. దుర్వినియోగం నిరోధించడానికి ఓటీపీ ఆధారిత డెలివరీ ప్రమాణీకరణ అమలు చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. పెండింగ్ బుకింగ్స్ పర్యవేక్షణ డిస్ట్రిబ్యూటర్-వారీగా, మార్కెట్ వారీగా, జిల్లా వారీగా, సేల్స్ ఏరియా వారీగా, ప్రాంతం-వారీగా ఉందని వెల్లడించింది. గృహ అవసరాలకు ప్రాధాన్యమివ్వడానికి పరిశ్రమలకు బల్క్ ఎల్‌పీజీ సరఫరా నిలిచిందని.. వాణిజ్య (కాని దేశీయ) సరఫరా పరిమితం చేసినట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈనెల 12వ తేదీ వరకు మొత్తం ఎల్‌పీజీ స్టాక్ లభ్యత 15,880 mt అంటే 3.92 రోజులు సరిపోతుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమైన విభాగాలు అంటే ఆసుపత్రులు, హాస్టల్స్, ప్రభుత్వ సేవలు వాణిజ్య సరఫరా కోసం ప్రాధాన్యమిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Also Read: Snake Poison: పాము కాటేసినా విద్యార్థికి పునర్జన్మ.. నాగుపాము విషం మింగిన టీచర్‌

ఎల్పీజీ కనెక్షన్లు
ఏపీలో ఎల్పీజీ కనెక్షన్లు మొత్తం: 161.19 లక్షలు
ఇండియన్‌ గ్యాస్‌ (IOCL): 56.86 లక్షలు (20.79 లక్షల డబుల్ బాటిల్ + 36.07 లక్షల సింగిల్ బాటిల్)
హెచ్‌పీ గ్యాస్‌ (HPCL): 74.11 లక్షలు (28.75 లక్షల డబుల్ బాటిల్ + 45.36 లక్షల సింగిల్ బాటిల్)
భారత్‌ గ్యాస్‌ (BPCL): 30.22 లక్షలు (11.13 లక్షల డబుల్ బాటిల్ + 19.09 లక్షల సింగిల్ బాటిల్)

Also Read: Snake Frog Dance: అవ్వ నిద్రిస్తుండగా.. గేటు బయట కప్ప, పాము సయ్యాట

ఏపీ ప్రభుత్వం సమీక్ష
గ్యాస్‌ కొరత, సరఫరాపై ఏపీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. దీనికోసం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు, ఓంఎస్‌సీ ప్రతినిధుల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. గ్యాస్‌ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు, తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తోంది. సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి.. అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా వాస్తవాన్ని తెలియజేయడానికి ఎప్పటి కప్పుడు పత్రికా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో  పౌర సరఫరాలు, వ్యవసాయం, పరిశ్రమలు,మౌలిక సదుపాయాలు, ఆర్‌టీజీఎస్‌ కార్యదర్శులతో ఏర్పాటైన కమిటీ వంట గ్యాస్ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మంత్రుల బృందం తాజా పరిణామాలు పరిస్థితులపై సమీక్షించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తోంది. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్ తదితర విభాగాల అధికారులతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసి ఎల్పీజీ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేయిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

116
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 14, 2026 16:04:49
Chitradurga, Karnataka:

Govt Teacher Swallows Snake Poison: తల్లిదండ్రుల తర్వాత గురువుకు భారతదేశంలో విశేష ప్రాధాన్యం ఉంది. గురువును దేవుడిగా కొలుస్తారు. తరగతి గదిలో బోధన చేసి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసే ఉపాధ్యాయుడు.. ఓ స్కూల్‌లో ప్రాణదాతగా మారాడు. పాపకు పునర్జన్మ ఇచ్చి నిజంగా దేవుడిగా మారాడు. పాఠశాలలో ఓ విద్యార్థినికి పాము కాటు వేయగా.. ఆ పాపను రక్షించేందుకు టీచర్‌ ప్రథమ చికిత్సలో భాగంగా పాము విషాన్ని తన నోటితో తీశాడు. విషం తీసి పాప ప్రాణం రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకాలో హుణసేకట్టే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్న రవిశంకర్ విద్యార్థులకు చక్కటి విద్యాభ్యాసం చేస్తూ పిల్లలకు ఇష్టమైన టీచర్‌గా మారాడు. ఒక రోజు పాఠశాలలో ఉండగా ఓ నాగుపాము ప్రవేశించింది. మధ్యాహ్న భోజన సమయంలో పాము సంచరించడంతో విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని సృష్టి మాబ్‌ను నాగుపాము కరిచింది. పాము కరవడంతో బాలిక విలవిలాడిపోయింది. నొప్పితో బాధపడుతూ రోదించింది.

సృష్టి మాబ్‌ ఏడుస్తుండగా.. తోటి విద్యార్థులు గుమిగూడారు. ఏం జరిగిందా? అని ఉపాధ్యాయుడు రవిశంకర్ హుటాహుటినా అక్కడకు వెళ్లాడు. బాలిక ఏడుపు చూసి ఓదార్చాడు. అయితే బాలిక కాలును చూడగా పాము కాటు వేసినట్టు రెండు చుక్కలు ఉన్నాయి. పాము కాటుతో విలవిలలాడుతున్న బాలికను ఓదార్చిన టీచర్‌ రవిశంకర్‌ వెంటనే కాలిని నోటితో కొరికాడు. పాము కాటు వేసిన చోట నోటితో పీల్చుతూ విషాన్ని బయట ఉమ్మాడు. ఇలా పలుమార్లు చేసిన అనంతరం వెంటనే తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి ఆస్పత్రికి తరలించారు.

పాముకాటుకు గురయిన బాలిక బసవేశ్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ప్రాణాపాయం తప్పింది. విషం పీల్చిన ఉపాధ్యాయుడు రవిశంకర్‌ జిల్లా ఆసుపత్రిలో చేరాడు. ముందస్తు జాగ్రత్తగా ఆయన ఆస్పత్రిలో చేరగా ఆయన కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. విద్యార్థిని కోసం పాము మింగిన వార్త వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరు కూడా చూసేయండి. అతడిని చూసి చాలా మంది అలా నేర్చుకోవాలని సూచిస్తున్నారు. పాము కాటు వేసిన సమయంలో భయాందోళన చెందకుండా కాటు వేసిన ప్రాంతాన్ని కొరికి అందులోని విషాన్ని నోటితో తీస్తే బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడుతారు.

198
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 14, 2026 14:28:03
Hyderabad, Telangana:

Revanth Reddy Is Chota: 'ఉత్తరప్రదేశ్‌లో యోగి బుల్డోజర్ల ప్రభుత్వంలాగే.. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. రేవంత్ రెడ్డి తెలంగాణకు ఛోటా యోగి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి‌ హరీశ్ రావు విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 10 వేల ఇండ్లు కూలగొడతామని చెబుతూ రేవంత్‌ రెడ్డి పేదల కంటిమీద కునుకు లేకుండా  చేస్తున్నాడని మండిపడ్డారు. పేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని ఈ ప్రభుత్వం ఉండి  ఏం ప్రయోజనం అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Snake Poison: పాము కాటేసినా విద్యార్థికి పునర్జన్మ.. నాగుపాము విషం మింగిన టీచర్‌

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని మార్తాండనగర్ బడా గుండులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రకటించారు. బీఆర్ఎస్ ఎప్పటికీ పక్కా సెక్యులర్ పార్టీ అని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ఏనాడైనా మతగురువులకు గౌరవ వేతనం ఇచ్చిందా? అని నిలదీశారు.

Also Read: Snake Frog Dance: అవ్వ నిద్రిస్తుండగా.. గేటు బయట కప్ప, పాము సయ్యాట

'కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారికంగా ఇఫ్తార్ విందులు నిర్వహించేవారు. ముస్లిం మైనార్టీలను కేసీఆర్ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. కేసీఆర్ పాలనలో రంజాన్ మాసంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందించేవారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి రాగానే జిల్లాల్లో ఆ పథకాన్ని బంద్ చేశారని తెలిపారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయనే స్వార్థంతోనే ఇప్పుడు హైదరాబాద్‌లో నామమాత్రంగా తోఫా  పంచుతున్నారని ఆరోపించారు.

Also Read: Richest MLAs: భారతదేశ రిచ్చెస్ట్ టాప్ 10 ఎమ్మెల్యేలు వీరే!.. వీరిలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌

'ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాక 24 గంటల కరెంటు, ఇంటింటికీ తాగునీరు అందించి ఆ కష్టాలు శాశ్వతంగా  తీర్చారు. ఆ ప్రేమ, అభిమానంతోనే గత ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో  గెలిపించారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు ఓడిపోయినా ఫర్వాలేదు కానీ బీజేపీతో కలిసే ప్రసక్తే  లేదని స్పష్టం చేశారు. 'మైనార్టీల సంక్షేమం కోసం రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లు కూడా ఖర్చు  చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా రూ.2,500 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసి ఆచరణలో చూపించింది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు వివరించారు.

'మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ 204 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ఉర్దూతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్య అందించారు. పేదరికంలో ఉన్న ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి కింద రూ.లక్ష ఇచ్చారు. కేసీఆర్ కిట్, రూ.13 వేలు ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యాక తల్లీబిడ్డలను క్షేమంగా ప్రభుత్వ వాహనంలోనే కేసీఆర్‌కు ఇంటి దగ్గర దింపారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు.

'కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాల్లో కనీసం మందులు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి  నెలకొంది. హైదరాబాద్‌లో పేదల కోసం కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా, హైడ్రా పేరుతో లక్ష ఇండ్లను కూలగొట్టారు' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు. ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, కొత్త సమస్యలు సృష్టించడమే రేవంత్ రెడ్డి స్టైల్ అని ఎద్దేవా చేశారు. పదేళ్లలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన ఫ్లైఓవర్లకు నేడు రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నాడని గుర్తుచేశారు. ముస్లింల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట.. కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు దగా చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

123
comment0
Report
HDHarish Darla
Mar 14, 2026 14:21:15
Hyderabad, Telangana:

Ustaad Bhagat Singh Trailer Event: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబో రానే వచ్చేస్తోంది. పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి గతంలో 'గబ్బర్ సింగ్' సినిమాతో బ్లాక్‌బాస్టర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి వీరి సినిమా రానుండడం వల్ల ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి. 'ఉస్తాద్ భగత్‌సింగ్' చిత్రం మార్చి 19న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

'ఓజీ' సినిమా తర్వాత పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కూడా 'గబ్బర్ సింగ్' లాగా సూపర్ హిట్ కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ డైలాగులతో ఆకట్టుకున్నారు. ఈసారి కూడా పవన్ వన్ మ్యాన్ షో చూపిస్తారని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.

అయితే ఎప్పటిలాగే యాక్షన్ తో పాటు ఇప్పుడు మరోసారి వింటేజ్ పవన్ కల్యాణ్ బయటకు వచ్చేలా కామెడీ పంచ్‌లు కూడా జోడించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసేందుకు వీలుగా సెన్సార్ బోర్డు కూడా U/A (యూ/ఏ) సర్టిఫికేట్ జారీ చేసింది.

Also Read: Train Fight Viral Video: చెప్పు చూపించిందని ఆంటీని చావగొట్టిన యువకుడు..రైల్లో సీటు కోసం పొట్టుపొట్టు తన్నుకున్నారు!

Also Read: Plants To Avoid In Home: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే పీకేయండి.. డబ్బు సమస్యలు, అప్పుల బాధ తప్పదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

262
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 14, 2026 13:42:35
Jagtial, Telangana:

Brahmans And Hindu Priests: ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మందుల సామేల్‌ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా అతడిని ఎమ్మెల్యే పదవి నుంచి రేవంత్ రెడ్డి తొలగించాలని కోరారు. హిందూ ద్రోహిగా తుంగతుర్తి ఎమ్మెల్యేను అభివర్ణించారు. బూతు పదాలు వాడిన వ్యక్తిని వెంటనే రాజకీయాల నుంచి బహిష్కరించాలని బ్రాహ్మణ సంఘాలు కోరాయి.

Also Read: Snake Poison: పాము కాటేసినా విద్యార్థికి పునర్జన్మ.. నాగుపాము విషం మింగిన టీచర్‌

బూతు పదాలతో విరుచుకుపడిన మందుల సామేల్‌ చిత్రపటాన్ని జగిత్యాలలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు దహనం చేశారు. మందుల సామేల్‌ క్షమాపణ చెప్పాలని.. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మోతే ఉమాకాంత్ శర్మ మాట్లాడుతూ.. కవ్వంపల్లి సత్యనారాయణ సభలో బాపనోళ్లు చదివిన మంత్రాల్లో మందుల సామేల్‌ బూతు పదాలు పలికారని ఆరోపించారు. బహిరంగంగా వేదమంత్రాల అర్థం తెలుసుకోకుండా వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులను పరుష పదజాలంతో మాట్లాడడం సరికాదని ప్రకటించారు.

Also Read: Snake Frog Dance: అవ్వ నిద్రిస్తుండగా.. గేటు బయట కప్ప, పాము సయ్యాట

సర్వేజనా సుఖినోభవంతు అంటూ వేద ఆశీర్వచనం చేసి శతమానం భవతి లాంటి వేదవాక్కులు పలికిన బ్రాహ్మణులను వేదాలను కించపరిచేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు మోతే ఉమాకాంత్ శర్మ ప్రకటించారు. బూతు పదాలను మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అడ్డుకోలేకపోవడం ఇది హిందూ ధర్మం దౌర్భాగ్యం అని తెలిపారు. ఏ మతంలో అయినా ఆశీస్సులు అందజేసేటప్పుడు తిట్ల పురాణం ఉండదని.. అన్ని మతాలు మంచినే బోధిస్తాయని గుర్తుచేశారు. చట్టప్రకారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై చర్యలు తీసుకోవడానికి తాము వెనుకాడమని హెచ్చరించారు. ప్రతి బ్రాహ్మణుడు లోకాసమస్తా సుఖినోభవంతు అందరూ బాగుండాలని ప్రతి నిత్యం కోరుకుంటారని.. అలాంటి బ్రాహ్మణులను దుర్భాషలాడడంతో మందుల సామేల్‌ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని బ్రాహ్మణ సేవా సంఘం ప్రకటించింది.

Also Read: Richest MLAs: భారతదేశ రిచ్చెస్ట్ టాప్ 10 ఎమ్మెల్యేలు వీరే!.. వీరిలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌

ఈ వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస ఎమ్మెల్యే మౌనంగా ఉంటే వారు హిందూ ధర్మానికి వ్యతిరేకులని ముద్రపడే అవకాశం ఉందని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మోతే ఉమాకాంత్ శర్మ హెచ్చరించారు. ఎవరైనా తమ పదవిని చూసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడితే వాళ్లకు సరైన బుద్ధి చెప్పే సామర్థ్యం తమకుందని ప్రకటించారు. ఆది జాంబవ పరియోజన ప్రాంత  ప్రముఖ అలగుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఎస్సీ సర్టిఫికెట్‌తో గెలిచిన మందుల సామేల్‌ తుంగతుర్తి ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేదాల అర్థం తెలుసుకొని మాట్లాడాలని మందుల సామేల్‌కు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు సిరిసిల్ల రాజేందర్ శర్మ, సురేష్ శర్మ, సంగనభట్ల గుండయ్య శర్మ మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, నేరెళ్ల శ్రీనివాస్ చారి, మెట్ట కిరణ్ భాస్కర్ శర్మ, కొత్తపల్లి శ్రీనివాస్ శర్మ గుండి శ్రీనివాస్ శర్మ, కొత్తపెల్లి రాజశేఖర్, రుద్రాంగి రాఘవేందర్ పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

151
comment0
Report
HDHarish Darla
Mar 14, 2026 11:54:36
Rajasthan:

LPG Cylinder Shortage: ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం వేళ దేశీయంగా వంటగ్యాస్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూలు కడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో గ్యాస్ సిలిండర్ లోడ్ వెళ్తున్న మినీలారీ బోల్తా కొట్టింది. జైపూర్ నుంచి అజ్మేర్ వైపు వెళ్తున్న నేషనల్ హైవే-48పై గ్యాస్ లారీ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అయితే గ్యాస్ సిలిండర్లు పడిన వెంటనే ఏం జరిగింది? దీని వెనుక కారణం ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

రాజస్థాన్‌ లోని కిషన్‌గఢ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది.  జైపూర్ నుంచి అజ్మేర్ నేషనల్ హైవే-48పై గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి పల్టీలు కొట్టింది. కిషన్‌గఢ్ టోల్ సమీపంలోని చిడియా బావడి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడున్న స్థానిక ప్రజలు అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు.. జాతీయ రహదారి-48పై వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా టైర్ పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీ బోల్తా కొట్టిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. లారీ బోల్తా కొట్టడం వల్ల అందులోని గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే అవి పేలుతాయేమో అని స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. అయితే ఈ ఘనటలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

అయితే లారీ డ్రైవర్‌కు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే డ్రైవర్‌ను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడిన కారణంగా అవి పేలుతాయనే భావనతో రోడ్లపై వాహానాలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్లను చెల్లాచెదురుగా పడిన వాటిని సేకరించడంలో స్థానికులు సహాయం చేశారు. అయితే సిలిండర్లన్నింటిన హైవే పక్కనే ఉన్న సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి.. వాటిలో లీకు జరిగిందా లేదా అని చెక్ చేశారు. అయితే వాటిలో ఎలాంటి లీకేజీ లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read: Train Fight Viral Video: చెప్పు చూపించిందని ఆంటీని చావగొట్టిన యువకుడు..రైల్లో సీటు కోసం పొట్టుపొట్టు తన్నుకున్నారు!

Also Read: Airtel 365 Days Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..రోజుకు కేవలం రూ.6 లకే అపరిమత కాలింగ్, ఉచిత ఇంటర్నెట్..ఎన్నో బెనిఫిట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

160
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 14, 2026 10:39:00
Raichur, Karnataka:

Snake And Frog Dance: వేసవికాలం కావడంతో వేడిమి తట్టుకోలేక ఆరు బయట నిద్రించడం సాధారణం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆరు బయట నిద్రిస్తుంటారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దొంగల భయంతోపాటు క్రిమీ కీటకాలు, పాములతో జాగ్రత్తగా ఉండాలి. అలా ఆరు బయట ఓ పెద్దావిడ నిద్రించగా పాము వచ్చేసింది. అయితే ఆ పాము కప్పను తరుముకుంటూ రాగా.. అక్కడ నిద్రిస్తున్న అవ్వపై ఆ రెండు వెళ్లాయి. ఏం జరిగిందో తెలియక ఉలిక్కిపడి లేచిన అవ్వ వెంటనే ఇంట్లోకి పరుగెత్తింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Richest MLAs: భారతదేశ రిచ్చెస్ట్ టాప్ 10 ఎమ్మెల్యేలు వీరే!.. వీరిలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో కర్ణాటకలోని రాయిచూర్‌ జిల్లాలో జరిగింది. మార్చి 8వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎండాకాలం వేడిమి తట్టుకోలేక ఓ అవ్వ ఇంటి బయట నిద్రపోయింది. అయితే అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా పాము దూసుకొచ్చింది. ఆ పాము కప్పను వేటాడుతూ వచ్చింది. ఆ కప్ప అవ్వ పరుచుకున్న చాపపై వచ్చేయగా.. కప్పను పట్టుకునే క్రమంలో పాము అవ్వపై పడింది. పాము, కప్ప పోట్లాడుకుంటుండడంతో ఆమె దుప్పట్లు చెల్లాచెదురయ్యాయి. అలజడి కలగడంతో అవ్వ వెంటనే లేచి చూసింది. పాము, కప్ప కొట్టుకుంటుండడంతో ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు.

Also Read: Harish Rao: గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డికి హరీశ్‌ రావు సూటిగా 8 ప్రశ్నలు

పాము, కప్పను వెళ్లగొట్టేందుకు చీపురు కట్ట పట్టుకుని వచ్చింది. పామును వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. అవి దాడి చేసే ప్రయత్నం చేయడంతో ఇంట్లోకి వెళ్లింది. అయితే అంతకుముందు పాము తనను కరిచేందేమోనని ఒకసారి రెండు సార్లు పరిశీలించింది. పాము వచ్చిందని తెలుసుకుని ఆమె కుటుంబసభ్యులు బయటకు వచ్చి చూడగా అప్పటికే పాము, కప్ప జారుకున్నాయి. అయితే ఇంట్లోకి వెళ్లిన బాధితురాలు లబోదిబోమని ఏడ్చారు. ఆ రాత్రి ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే బాధితురాలి పేరు ఎల్లమ్మ అని తెలిసింది.

Also Read: SVSN Varma: పవన్ కల్యాణ్ ఫొటోపై దుమారం.. మళ్లీ అలిగిన పిఠాపురం వర్మ

విషం మింగిన గురువు
కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకా హుణసేకట్టే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలికను నాగుపాము కాటేయగా విలవిలలాడింది. బాలిక ఏడుపును విని పాఠశాల ఉపాధ్యాయుడు రవిశంకర్‌ తరలివచ్చి చూశాడు. బాలికను పాము కాటేయడంతో కాటు వేసిన ప్రాంతాన్ని కొరికి విషాన్ని పీల్చి ఉమ్మివేశాడు. చివరకు హుటాహుటినా ఆస్పత్రికి తరలించడంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఆ వీడియో కూడా వైరల్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

173
comment0
Report
HDHarish Darla
Mar 14, 2026 10:26:38
Hyderabad, Telangana:

Airtel Cheapest 365 Days Plan: నెలనెలా పెరిగిపోతున్న రీఛార్జ్ ప్లాన్స్ చూసి విసిగిపోయారా? మీరు ఎయిర్‌టెల్ సిమ్ వినియోగదారులు అయితే మీకో గుడ్‌న్యూస్‌ ఉంది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్స్‌ను ప్రవేశపెట్టింది. రోజుకు కేవలం 6 రూపాయలకే ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిడెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు రానున్నాయి. 

365 రోజులు (ఒక సంవత్సరం కాలం) వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ను కస్టమర్ల ముందుకు తెచ్చింది. అయితే ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం రూ.2,500 కంటే తక్కువ ధరకే లభిస్తుండడం గమనార్హం. ఎయిర్‌టెల్ ఏడాది చెల్లుబాటుతో అందిస్తున్న రెండు రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  వీటిలో అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ డేటా, ఎస్ఎంఎస్‌లు అందజేయనున్నారు. అయితే కస్టమర్లకు రోజుకు 6 రూపాయలకే అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.2,249 రీఛార్జ్ ప్లాన్..
ఎయిర్‌టెల్ సంస్థ ప్రవేశపెట్టిన అతితక్కువ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో రూ.2,249 ఒకటి. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, ఏడాది పొడవునా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అన్‌లిమిటెడ్ డేటా, ఎస్ఎంఎస్‌లు వస్తాయి.  

అయితే ఈ ప్లాన్ కొనుగోలు చేసిన అదనంగా మరో 30GB హై-స్పీడ్ డేటాను అందివ్వనున్నారు. ఈ డేటా ఏడాది పొడవునా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం 3,600 SMSలను కూడా అందిస్తుంది. ఈ లెక్కన ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా రోజుకు రూ.6 ఖర్చుతో ఈ రీఛార్జ్ ప్లాన్‌ను పొందవచ్చు. 

ఈ ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలు..
ఈ ఏడాది ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అదనపు డిజిటల్ ప్రయోజనాలు కూడా అందుతాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా ఉచితంగా పొందుతారు. ఇందులో అనేక రకాల ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. దీంతో పాటు ఈ ప్లాన్‌లో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందుతోంది. అయితే ఇది విడిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే రూ.4,000 ఖర్చు అవుతుంది. ఇది ఈ కస్టమర్లు ఫొటో ఎడిటింగ్, డిజైనింగ్ వంటి వర్క్‌ను ఈజీగా చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. 

వార్షిక ప్లాన్ రూ.1849 ధరకే..
ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన మరో వార్షిక ప్లాన్ రూ.1849 ధరకే అందుబాటులో ఉంది. ఇది రూ.2,249 ప్లాన్ కంటే ఎంతో చౌకగా ఉంటుంది. ఇది కూడా ఏడాది పొడవునా అంటే 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు వస్తాయి. అయితే ఇందులో అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో రాదు. ఇది కేవలం అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. 

Also Read: Train Fight Viral Video: చెప్పు చూపించిందని ఆంటీని చావగొట్టిన యువకుడు..రైల్లో సీటు కోసం పొట్టుపొట్టు తన్నుకున్నారు!

Also Read: Plants To Avoid In Home: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే పీకేయండి.. డబ్బు సమస్యలు, అప్పుల బాధ తప్పదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

199
comment0
Report
IPInamdar Paresh
Mar 14, 2026 09:55:06
Hyderabad, Telangana:

Pet cats eats died elderly woman flesh in mancherial: సమాజంలో మానవ సంబందాలు మొత్తం కనుమరుగైపోయి. కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉన్నాయి. డబ్బులు ఉంటేనే ఎవరితోనైన మాటలు మాట్లాడతారు. ఒకవేళ డబ్బులు లేకుండా మన వాళ్లు కూడా పరాయి వాళ్లే అవుతారు . కొన్నిచోట్ల తమ పిల్లలు సైతం కన్నవాళ్లను ఆస్తులు పంచేవరకు బాగాఉండి ఆ తర్వాత తమ అసలు రంగును బైటపెడుతున్నారు. తమ వాళ్లను అనాథలుగా వదిలేస్తున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  మంచిర్యాలలో  అమానవీయకర ఘటన చోటు చేసుకుంది. 
 
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్ సింగ్ నగర్ కు  చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) సింగిల్ గా ఉంటుంది. ఆమె తన బిడ్డలకు అందరికి ఆస్తులు రాసిచ్చింది. ఇంకా ఆమెను అందరు  దూరం పెట్టారు . కానీ చిన్న కొడుకు సమేందర్ మాత్రం తల్లిని తన  వద్ద ఉంచుకున్నాడు.  అతను పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లగా లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు.

ఇటీవల రాత్రి పూట ఇంట్లో నుంచి ఎలాంటి  అలికిడి రాకపోవడంతో అనుమానంతో కిటిలో నుంచి చూశారు.ఆమె అపస్మారకంగా పడిపోయి ఉంది. వెంటనే కొడుకుకు సమాచారం ఇచ్చారు.  అతను వచ్చిచూడగా ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమె గడప తగిలి కింద పడిపోయినట్లు గుర్తించారు. ఆమె ఇంట్లో రెండు పిల్లుల్ని పెంచుకునేది.

Read more: Video Viral: ద్యావుడా.. సిలిండర్ సాధించిన భర్తకు ఆరతితో గ్రాండ్ వెల్ కమ్.. ఫన్నీ వీడియో వైరల్..

ఆమె చేతి మాంసంను రెండు పిల్లులు పీక్కుతిన్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. దీనిపై పోలీసులు ఘటన ప్రదేశంకు చేరి విచారణ చేపట్టారు.  కిందపడిపోయి గాయంతో ఆమె చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా తెల్చారు.ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

142
comment0
Report
HDHarish Darla
Mar 14, 2026 09:32:54
Hyderabad, Telangana:

Train Fight Viral Video News: భారత రైళ్లలో జనరల్ బోగీలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే చాలా సార్లు సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు సహజంగా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ ఆంటీ చెప్పు చూపించిందని ఓ యువకుడు ఆమెను చావకొట్టాడు. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఈ సంఘటన గుర్తుతెలియని రైలులోని ఓ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో జరిగింది. సీటు విషయంలో ఓ వ్యక్తితో మరో మహిళకు మధ్య జరిగిన వాగ్వాదం ఇది. అది మొదట్లో వాగ్వాదంగా ఉన్నా.. ఆ తర్వాత తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ వీడియోలో ఓ మహిళ యువకుడ్ని అవమానిస్తూ, చెప్పు చూపిస్తూ బెదిరించడం మొదలుపెట్టింది. ఆ యువకుడు తొలుత ఎంతో ప్రశాంతంగా మాట్లాడాడు. 

సీటు విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువకుడు ఎన్నోసార్లు చెప్పు కిందికి దించి మాట్లాడండి అని చెప్పినా.. ఆమె వినకుండా రెచ్చగొట్టే ధోరణిలో వెళ్లింది. ఎంతో సమయమనంతో అతడు మరో సీటుకు వెళ్లి కూర్చున్నా.. ఆ చెప్పుతో మహిళ మరింత బెదిరింపులకు దిగింది. ఆ వెంటనే ఉన్న ఓ మహిళతో కూడా ఆమె వాగ్వాదినికి దిగింది. ఆ మహిళ "నా కొడుకు ఇంజనీర్, నా భర్త సూపర్‌వైజర్" అని చెప్పడం మీరు వినవచ్చు. 

అయితే ఆమె ఆ యువకుడి బంధువో లేదా భార్యో తెలియడంలేదు. కానీ, సీన్‌లోకి ఆ మహిళపై వాగ్వాదానికి రాగానే.. చెప్పు చూపిన ఆంటీపై యువకుడు దూసుకొచ్చాడు. ముఖంపై గ్యాప్ లేకుండా చెంపదెబ్బలు కొడుతూనే ఉన్నాడు. ఆమె బెదిరింపులకు తాళలేకపోయిన ఆ వ్యక్తి దాడి చేసినట్లు చెబుతున్నాడు. 

ఆంటీపై తీవ్రంగా దాడి చేసిన యువకుడ్ని వారించేందుకు ప్రయాణికులు ఎంతో ప్రయత్నించారు. అయితే మహిళను కొట్టడం మంచి పద్ధతి కాదంటూ కొందరు అంటుంటే.. ఆమె చేసిన వ్యాఖ్యలకు తగిన శాస్తి జరిగిందని కొందరు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Plants To Avoid In Home: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే పీకేయండి.. డబ్బు సమస్యలు, అప్పుల బాధ తప్పదు!

Also Read: CSK Jailer Jersey: చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో షాక్..ఐపీఎల్ టీమ్‌పై కేసు పెట్టిన 'జైలర్' నిర్మాత..రూ.కోటి పరిహారం కోసం డిమాండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

175
comment0
Report
Advertisement
Back to top