Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Hyderabad News: కుళ్లిన గుడ్లు.. నల్లటి నూనె.. జియాగూడలో కిల్లర్ సమోసాల తయారీ!
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 12:12:39
Hyderabad, Telangana

Adulterated Samosa Seized In Hyderabad News: మీరు బయట దొరికే వేడి వేడి సమోసాలను ఎంతో ఇష్టంగా తింటారా? అయితే ఈ వార్త చదివాక మీరు మరోసారి ఆలోచించాల్సిందే.. హైదరాబాద్‌లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ సమోసా తయారీ కేంద్రాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. ఎలాంటి శుభ్రత లేని వాతావరణంలో.. ప్రమాదకరమైన పదార్థాలతో సమోసా తయారు చేస్తున్న దృశ్యాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.. భద్రత ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్న సమోసా కేంద్రాలపై అధికారులు మెరుపు దాడులు చేశారు..

హైదరాబాద్‌లోని జియాగూడ ప్రాంతంలో అబ్దుల్ రసీద్ అనే వ్యక్తి ఎటువంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) అనుమతులు, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా గత కొంతకాలంగా ఈ క్రేంద్రాన్ని నడుపుతున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం.  అక్కడ జరుగుతున్న దారుణాలను బయటపెట్టింది.. తయారు కేంద్రం అంతా ఈగలతో పాటు మురికి నుండి ఉండటమే కాకుండా కనీస ఆరోగ్య సూత్రాలు పాటించడం లేదని పోలీసులు నిర్ధారించారు...

ఈ తనిఖీల్లో భాగంగా.. సమోస మిశ్రమాల్లో కలిపి ఎందుకు పాడైపోయిన, దుర్వాసన వస్తున్న గుడ్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటికే నల్లగా మారిన నూనెలను పదేపదే వేడి చేస్తూ సమోసాలను వేయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పురుగులు పట్టిన మైదా పిండితో పాటు నాణ్యతలేని మసాలా దినుసులను కూడా నిల్వ ఉంచినట్లు శోదాలలో తెలిపారు.. అంతేకాకుండా సమోసా స్టఫింగ్ కోసం కుళ్లిపోయిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని తేల్చి చెప్పారు..

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

ఈ దాడుల్లో భాగంగా అధికారులు సుమారు ఐదు లక్షల విలువైన విలువ ఉంచిన సమోసాలతో పాటు ముడి పదార్థాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సమోసా తయారీ కేంద్రం నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో సమోసాలు నగరంలోని వివిధ హోటళ్లతో పాటు తోపుడుబండ్లకు సరఫరా ఐతున్నట్లు విచారణలో తేలింది.. నిందితుడు అబ్దుల్ రషీద్ ను అరెస్టు చేసి అధికారులు రిమాండ్ కు తరలించారు.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆక్రమంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ డీసీపీ హెచ్చరించారు.. అంతేకాకుండా ఇలా భద్రత ప్రమాణాలు పాటించకుండా ఎక్కడ ఆహార కేంద్రాలున్న అధికారులకు సమాచారం అందించాలని కోరారు..

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 21, 2026 12:58:08
Wadgaon, Maharashtra:

Commercial Gas Quota: ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతదేశంపై ఊహించని రీతిలో ప్రభావం పడడంతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేకపోయినా భవిష్యత్‌లో ముప్పు పొంచి ఉండగా.. ఎల్పీజీ గ్యాస్‌ సంక్షోభం మాత్రం కొనసాగుతోంది. మూడు దేశాలు ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ముఖ్యంగా కమర్షియల్‌ గ్యాస్‌ ఇబ్బంది ఏర్పడగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్‌ కోటా పెంచుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!

దేశంలోని అన్ని రాష్ట్రాలకు గ్యాస్‌ సరఫరాపై తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కేటాయించే వాణిజ్య గ్యాస్ కోటాను 50 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు

రాష్ట్రాల్లో గ్యాస్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 20 శాతం కేటాయింపులతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలతో మరో 10 శాతం అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 20 శాతం అదనపు కమర్షియల్‌ గ్యాస్‌ కోటాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మార్చి 23వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోలియం శాఖ కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వ పెంపుతో రాష్ట్రాలకు అందే మొత్తం కమర్షియల్‌ గ్యాస్ సరఫరా అదనంగా 50 శాతానికి చేరుకోనుంది. అదనపు 20 శాతం గ్యాస్ కేటాయింపుల్లో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు, డెయిరీ రంగాలు, ప్రభుత్వ లేదా స్థానిక సంస్థల ద్వారా నడపబడే రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లకు కేటాయించిన అదనపు గ్యాస్‌ కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది.

అదనంగా కేటాయించిన 50 శాతం కోటాను పొందాలంటే వినియోగదారులకు పెట్రోలియం శాఖ కొన్ని నిబంధనలు విధించింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓంఎస్‌సీలు) వద్ద వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్‌ సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్‌ తప్పుదారి పట్టకుండా.. దుర్వినియోగం కాకుండా కేంద్ర పెట్రోలియం శాఖ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. గ్యాస్ మళ్లింపు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ఆ వాణిజ్య సిలిండర్లు రాష్ట్రాలకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రాల్లోని కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగదారులకు భారీ ప్రయోజనం లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

986
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 12:50:06
Hyderabad, Telangana:

 Giant Burmese Python Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనం నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్రూర మృగాలతో పాటు విసర్పాలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తాజాగా ఒక బర్మీస్ పైతాన్ కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. సాధారణంగా ఈ పాము కనిపిస్తేనే ఆమడ దూరం పారిపోతూ ఉంటారు.. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా ఆ భారీ కొండచిలువకు తన చేతులతో నీళ్లను తాగించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా ఒక భారీ పర్మిష్ బర్మీస్ పైథాన్‌కు నీటిని అందించడం మీరు చూడొచ్చు. ఒక చేతిలో ఒక గ్లాసు పట్టుకొని ఆ వ్యక్తి.. తన మరో అరచేతిని దోసిలిలా పట్టుకొని అందులో నీటిని పోస్తున్నాడు. ఆ భారీ సర్పం కూడా అతనిని ఏమీ చేయకుండా.. ఆ వ్యక్తి అరచేతిలో నుంచి నీటిని తాగుతోంది.. ఆ వ్యక్తి అలా నీటిని పోస్తూనే ఉన్నాడు.. ఆ పాము తాగుతూనే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..

సాధారణంగా బర్మీస్ పైథాన్‌లు చాలా శక్తివంతమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు. వివిధ ఆహారాన్ని చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేయగలవు.. అలాంటి భయంకరమైన పాము అంత శాంతంగా నీటిని తాగడం చూస్తుంటే.. ఏదో తేడానే అనిపిస్తోంది.  అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం ఒక్కసారిగా కంగు తింటున్నారు.. అతడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. కానీ అది చాలా ప్రమాదకరమని కొంతమంది ఈ వీడియో చూసినవారు అంటుంటే.. ఇక మరి కొంతమంది అయితే ప్రకృతిలో మనుషులు, జంతువుల మధ్య ఉండే సంబంధానికి ఇదొక అద్భుతమైన నిదర్శనమని వివరిస్తూ వస్తున్నారు..

 
 
 
 
 

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

ఇక మరి కొంతమంది అయితే ఆ పాముకు నీళ్లు సరిపోయాయా? దాని దాహం తీర్చిన ఆ వ్యక్తి రియల్ హీరో అంటూ కామెంట్లలో రాస్తు వస్తున్నారు.. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు.. పాములు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో ఊహించడం చాలా కష్టమని.. శిక్షణ లేని వారు ఇలాంటి పనులు చేయడం ప్రాణానికే ప్రమాదమని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎండల తీవ్రత పెరిగే సమయంలో ఇలా మూగజీవాల దాహం తీర్చడం గొప్ప విషయమేనని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కొనియాడుతున్నారు..

Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

1039
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 12:37:12
Hyderabad, Telangana:

 Two-headed Snake Video Watch: ప్రకృతి సృష్టిలో అప్పుడప్పుడు కొన్ని వింతలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను నోరెళ్లబెట్టుకునేలా చేస్తోంది.. సాధారణంగా ఒకతలతో ఉండే పామును మాత్రమే మనం చూస్తూ ఉంటాం.. అలాంటిది ఒకే శరీరానికి రెండు తలలు కలిగిన నల్లత్రాచు పిల్ల దర్శనం ఇవ్వడం ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీ అంశానికి దారితీసింది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలా రెండు తలలతో కూడా పాములు జన్మిస్తాయా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి తన చేతితో అప్పుడే జన్మించిన ఒక చిన్న నల్ల త్రాచును చూపించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. మొదటి చూపుతో అందరూ ఈ వీడియో చూడగానే అది మామూలు పాము పిల్ల అని అనుకుంటూ ఉంటారు.. అంతేకాకుండా అందరికీ ముందుగా అలాగే కనిపిస్తూ ఉంటుంది.. కానీ దానిని క్లియర్‌గా గమనిస్తే దాదాపు రెండు వేరువేరు తలలు ఉండటం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి కెమెరాకు దగ్గరగా ఆ పామును చూపిస్తుండగా.. ఈ వింత పాము తన రెండు తలలు అటు ఇటు వేగంగా కదుపుతూ పరిసరాలను గమనించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..

ఓకే వెన్నుముకకు రెండు తలలు ఉన్నట్లు మీకు ఈ వీడియోలో పామును చూస్తే అర్థమవుతుంది. ఆ వ్యక్తి పామును సున్నితంగా చేత్తో పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు.. అయితే, ఈ వీడియోలో ఆ పాము అటు ఇటు ఎంతో వేగంగా కదలడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.. సైన్స్ ప్రకారం ఇలాంటి వింతలను బైసెఫాలీ అని అంటూ ఉంటారు. మానవులలో కవలలు ఎలాగైతే అతుక్కొని పుడతారో.. పాముల్లో కూడా పిండం అభివృద్ధి చెందే సమయంలో విభజన సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలాంటి అరుదైన పాములు రెండు తలలతో జన్మిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

 
 
 
 
 

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య

ఇలాంటి పాములు ప్రకృతిలో ఎక్కువ కాలం జీవించడం కష్టమని కొంతమంది సైంటిస్టులు తెలుపుతున్నారు.  ఎందుకంటే రెండు తలలు వేర్వేరు దిశల్లో వెళ్లాలని ప్రయత్నించడం వల్ల ఆహారం తీసుకోవడంలోనూ, ఇతర పనుల్లోను ఇబ్బంది పడుతూ ఉంటాయి.. కాబట్టి వీటికి భూమ్మీద బతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. కొంతమంది దీనిని చూసి కామెంట్లు కూడా పెడుతున్నారు. పామును చూడటానికి భయం.. ఇందులోను రెండు తలలా! అని కామెంట్లలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

920
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 12:25:11
Hyderabad, Telangana:

 20-foot Massive Python Video Watch Here: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే వీడియో వెలుగులోకి వస్తూనే ఉంటుంది.. అయితే, ప్రతిరోజు ఎన్నో వింతలకు సంబంధించిన వీడియోలు మనం చూస్తూ ఉంటాం. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం సామాన్యులకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒక 20 అడుగులు కలిగిన భారీ కొండచిలువను.. ఓ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తోకని పట్టుకొని లాక్కెళ్ళడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

వైరల్ అవుతున్న ఈ రీల్‌లో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో భారీ శరీరంతో ఉన్న  కొండచిలువ పాము నెమ్మదిగా కదులుతూ ఉండడం మీకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా అంత పెద్ద పాము చూస్తే ఎవరైనా ఆవిడ దూరం పరుగులు తీస్తారు.. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించాడు.. ఆ కొండచిలువ వెనక భాగంలో ఉండి తోకను రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.. ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా దాన్ని వెనక్కి లాక్కు వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాము ఒకపక్క ముందుకు వెళ్లాలని చూస్తున్నప్పటికీ.. ఆ వ్యక్తి వెనుకకు ఈడ్చుకు వెళ్లడంతో అది తీవ్ర అవస్థల పాలవుతున్నట్లు తెలుస్తోంది..

ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని రోజుల్లోనే లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంది.. అంతేకాకుండా దీనిని వేలాదిమంది లైక్ చేసినట్లు కూడా తెలుస్తోంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో కింద కామెంట్లు కూడా చేస్తున్నారు. మరికొంతమంది ఈ వీడియోని చూసి డైరెక్టుగా స్పందిస్తున్నారు.. ఇతనికి ప్రాణం మీద ఆశ లేదా అని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది బహుశా ఆ వ్యక్తి పాములు పట్టడంలో ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

 
 
 
 
 

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

ఇక మరి కొంతమందైతే ఇలాంటి వన్యప్రాణుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం సరికాదని.. ఇలాంటి విన్యాసాలు ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.. కొండచిలువకు విషయం లేకపోయినప్పటికీ.. అవి తమకు ఉండే కండరాలతో మనుషులను ఎంతో సులభంగా ఉక్కిరిబిక్కిరి చేయగలుగుతాయి. కేవలం న్యూస్ కోసం లేదా రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం ఏమాత్రం సరైనది కాదు.. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారు అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.  కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది..

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

995
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 21, 2026 12:24:32
Tirupati Urban, Andhra Pradesh:

Chandrababu Naidu: తిరుమల భక్తుల నమ్మకానికి విఘాతం కలిగించకుండగా.. నిరంతరం వారి నమ్మకాన్ని కాపాడేలా కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా.. ఆరోగ్య భద్రతే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసిందని ప్రకటించారు.

Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీఆర్‌ నాయుడు గాడిదలు కాస్తున్నారా?

తన మనమడు దేవాన్ష్‌ జన్మదినం సందర్భంగా తిరుమలను సందర్శించిన సీఎం చంద్రబాబు అనంతరం కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంయుక్తంగా టీటీడీ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వాటర్ - ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌కు రిబ్బన్‌ కట్‌ చేశారు. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ఇదే అని ప్రకటించారు.

Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!

ల్యాబ్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం ల్యాబ్‌లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. పనితీరు, సామర్థ్యం గురించి అధికారులను  సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించవచ్చని ప్రశ్నించారు. ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో కచ్చితంగా విశ్లేషిస్తాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. 1981లో నీటి పరీక్షల కేంద్రం ప్రారంభమవగా.. ఇప్పుడు నెలకు వెయ్యి నుంచి 1,500 శాంపిళ్లను విశ్లేషించే స్థాయికి చేరిందని అధికారులు వెల్లడించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, ఇతర పదార్థాల కల్తీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కల్తీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. ఆధునిక జీసీ/హెచ్‌పీఎల్‌సీ యంత్రాలతో నెయ్యి స్వచ్ఛతను అత్యంత శాస్త్రీయంగా ఇక్కడే నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు. దీంతో కల్తీకి ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ముడి పదార్థాల్లో ఉండే పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్స్, లెడ్, ఆర్సినిక్ వంటి హెవీ మెటల్స్ కనుగొనే సామర్థ్యం ఉన్న పరికరాలను కూడా ఈ ల్యాబులో ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు.

తిరుమల శ్రీవారి ప్రసాదాలపై భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని.. ఆ మేరకు అధికారులు పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై నిరంతర తనిఖీలు చేసి పరిశుభ్రతను నిర్ధారించాలని చెప్పారు. శ్రీవారి ప్రసాదాలపై మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1027
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 21, 2026 10:54:54
Siddipet, Telangana:

Narmetta Oil Palm Factory: శ్రమ మాది, శిలాఫలకం రేవంత్ రెడ్డిది.. బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్ష చేస్తున్నాడని.. ఏకంగా రూ.1,070 కోట్ల అభివృద్ధి పనుల రద్దు చేశారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం జలాలతోనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని గుర్తుచేశారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రైతులకి ధోకా చేశాడని.. రేవంత్‌ రెడ్డి పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే రుణమాఫీ కాని రైతులు 350 మంది ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు.

Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్‌ అధినేత్రి మమతా టాప్‌ 10 హామీలు

రేవంత్‌ రెడ్డి సిద్దిపేట పర్యటన చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అనంతరం హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ' రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన కార్యక్రమం ఒక్కటీ లేదు. సిద్దిపేటలో రేవంత్‌ రెడ్డి ప్రారంభించబోతున్న కార్యక్రమాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి.. నిధులు కేటాయించి, నిర్మాణాలు పూర్తి చేసినవే' అని వివరించారు. మాదేమో శ్రమ ఫలితం.. రేవంత్ రెడ్డిదేమో శిలాఫలకం అని ప్రకటించారు.

Also Read: Kavitha: తెలంగాణ బడ్జెట్‌పై జాగృతి ఫైర్‌.. రాహుల్‌ గాంధీకి కొత్త పేరు పెట్టిన కవిత

శిలాఫలకాల మీద రేవంత్‌ రెడ్డి పేరు ఉండొచ్చు.. కానీ ప్రజల మనోఫలకాల మీద ఉండేది మాత్రం కేసీఆర్ పేరే అని హరీశ్‌ రావు ప్రకటించారు. 'రూ.300 కోట్లతో నర్మెట్టలో ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతే. దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రావడానికి, రిఫైనరీ పెట్టడానికి మేమే నిర్ణయం తీసుకున్నాం. టీజీఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చాం. రైతులను స్వయంగా ఒప్పించి మొక్కలు నాటించాం' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు.

Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్‌తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్‌ రావు

'కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఫ్యాక్టరీని ప్రారంభించడం శోచనీయం. ఈ ఫ్యాక్టరీ కోసం కాలువ పొడిగించి 20 కోట్ల లీటర్ల సామర్థ్యంతో చెరువును నిర్మించి నీరందించింది మేమే. పక్కనే పారుతున్న కాళేశ్వరం కాలువ నీళ్లను నెత్తిన జల్లుకుని ఫ్యాక్టరీని ప్రారంభించు' అని రేవంత్ రెడ్డికి హరీశ్‌ రావు సూచించారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఎన్ని కుట్రలు చేసినా.. మొక్కవోని దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నేలకు జలాలను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని గుర్తుచేశారు.

'ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన రేవంత్ రెడ్డి.. రుణమాఫీ పేరిట రైతులను దారుణంగా మోసం చేశారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా 52 శాతం మందికి, అంటే 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రూ.300 కోట్ల బకాయిలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది రైతులకు మాఫీ కాలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేట పర్యటనకి వస్తున్నారు' అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు నిలదీశారు. వరుసగా మూడు పంటలకు ఎగ్గొట్టిన రైతుబంధును.. ఈ మూడు సీజన్ల రైతుబంధు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 'సగం పనులైన ప్రభుత్వ వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నుంచి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎత్తుకుపోయారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగిన పనేనా?' అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతో రద్దు చేసిన రూ.1,070 కోట్ల పనులను తక్షణమే పునరుద్ధరించాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1074
comment0
Report
HDHarish Darla
Mar 21, 2026 10:49:26
Nunna, Vijayawada, Andhra Pradesh:

Rain Alert In AP For Next 3 Days: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఓ వైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఇప్పుడు మరోసారి వర్షాలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఏఏ ప్రాంతాల్లో కురవనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం సడెన్‌గా వాతావరణం మారిపోయింది. ఉపరితల ఆవర్తనంతో పాటు మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ అంతర కర్ణాటక పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర అంతర కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం ప్రస్తుతం కొంత తగ్గింది.

గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురవగా.. ఇప్పుడు మరో 3 రోజుల పాటు వర్షాల తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా గంటకు 40-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి వర్షాలు కొనసాగినా.. ఈదురుగాలులు మాత్రం గంటకు 30 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. రాగల 3 రోజులు ఏపీలో వాతావరణం దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. 

నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీయడం సహా రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి మాత్రం కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ జల్లుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు సంభవించకపోవడం గమనార్హం. వర్షాలు ముగిసిన తర్వాత ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Telangana SSC exams news: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు..కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..అసలు నిజం ఇదే!

Also REad: Water Melon For Diabetics: షుగర్ ఉన్న వాళ్లు వేసవిలో పుచ్చకాయ తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1095
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 09:37:24
Hyderabad, Telangana:

Jagtial Mango Market Losses Latest News: తెలంగాణ మామిడికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది తీపి కరువైంది గా భావించవచ్చు.. ఎంతో రుచికరమైన ఇక్కడి మామిడి పండ్లకు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం జగిత్యాల మామిడి మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది.. ఎగుమతులు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయల వ్యాపారం స్తంభించిపోయింది.. అటు రైతులతోపాటు ఇటు వ్యాపారాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది..

ప్రతి ఏటా జగిత్యాల మామిడి మార్కెట్ కు ఢిల్లీతో పాటు మహారాష్ట్ర గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తుంటారు.. ఇక్కడి క్వాలిటీ బాగా నచ్చడంతో వ్యాపారులు నేరుగా తోటల వద్ద కొనుగోలు జరిపి.. వాటిని ప్యాకింగ్ చేసి అమెరికాతో పాటు దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతులు చేస్తారు.. సాధారణంగా ఈ సీజన్లో జగిత్యాల నుంచి సుమారు 100 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతూ ఉండేవట.. కానీ ఈ ఏడాది యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడం, రవాణా చార్జీలు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరగడంతో ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..

మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అయ్యే మామిడిలో 60 శాతం జగిత్యాల నుంచే వెళ్తుంది.. అయితే ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆర్డర్లు రద్దు అయ్యాయట.. ఇంకా తేడాది ఈ సమయానికి 100 టన్నుల మామిడి విదేశాలకు వెళ్ళింది.. కానీ ఇప్పుడు స్థానిక మార్కెట్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. డిమాండ్ లేక ధరలు సగానికి సగం పడిపోయాయని స్థానిక రైతులతో పాటు వ్యాపారస్తులు వాపోతున్నారు.  అంతేకాకుండా కొన్నిచోట్లనైతే రైతులు సగం కంటే తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్మేయాల్సి వస్తోందట..

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

పెట్టుబడులు విపరీతంగా పెరిగి.. దిగుబడి తగ్గిన సమయంలో ఈ యుద్ధ ప్రభావం రైతులకు కోలుకోని దెబ్బగా మారింది.. ఎగుమతులు లేకపోవడంతో వ్యాపారాలు ఉన్నదారలకంటే 50 శాతం తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదట.. అంతర్జాతీయ మార్కెట్ తలుపులు మూసుకుపోవడంతో.. నిలువ చేసుకునే సదుపాయం లేక రైతులు చాలా చీప్ ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించి మామిడి ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు..

Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

990
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 09:22:10
Jagtial, Telangana:

Jagtial Telugu News: మనుషుల మధ్య బంధాల కంటే పేదరికం సృష్టించే కష్టాలే బలమైనవని నిరూపించే అత్యంత హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.. ప్రాణం ఉన్నంతవరకు తోడుంటానని ప్రమాణం చేసిన భార్య.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను కాపాడుకోలేక, తగిన గతిలేక స్మశాన వాటికలు వదిలేసి వెళ్లిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది..

జగిత్యాల జిల్లాకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఇదే సమయంలో ఆయనకు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో పరిస్థితి చాలా వరకు విషమించింది.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించినప్పటికీ.. ఆరోగ్యం ఏమాత్రం మెరుగు పడలేకపోయింది.. రోజురోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యం, పెరుగుతున్న వైద్య ఖర్చులు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అనేక సమస్యల్లో పడేసాయి..

శ్రీధర్ అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.. ముఖ్యంగా అర్థ కట్టలేని స్థితిలో ఉండడంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు.. మరోవైపు ఇద్దరు పిల్లల బాధ్యత తో పాటు వారి భవిష్యత్తు ఆ తల్లిని ఎంతగానో వేటాడాయి.. ఆటో అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న భర్తను చూసుకోలేక.. మరోవైపు పిల్లలను పోషించలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.. కొద్ది రోజులపాటు ఎంతగానో ఆలోచన చేసింది..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

చివరికి ఏ దారి కనిపించని స్థితిలో.. తన భర్తను జగిత్యాలలోని స్థానిక స్మశాన వాటికలో వదిలేసింది.. నేను నీకు చికిత్స చేయించలేను.. కనీసం ఉండటానికి నీడ కూడా లేదని.. ఎంతో నిస్సహాయ స్థితిలో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.. అయితే స్మశానంలో పడి ఉన్న శ్రీధర్ ను గమనించిన స్థానికులు వెంటనే సామాజిక కార్యకర్తలకు సమాచారం అందించారు.. మానవత్వంతో స్పందించిన వారు పోలీసుల సహాయంతో శ్రీధర్ను చికిత్స నిమిత్తం మళ్ళీ ఆస్పత్రికి తరలించారు.. ఈ వార్త తెలిసిన స్థానికులు.. పేదరికం ఒక మనిషిని ఎంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తుందని.. దానికి నిదర్శనం ఈ ఘటనేనని కన్నీరు పెడుతున్నారు.

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1034
comment0
Report
GSG Shekhar
Mar 21, 2026 08:49:19
Mallikarjunpally, Telangana:

Sangareddy Assigned Lands: అసైన్డ్ భూములు కొనడం.. అమ్మడం నిషేధం.. ఇది మనలో మాట కాదు.. గవర్నమెంట్ రూల్. పేదలకు పంచిన భూములను, ఫ్లాట్లను యథాతథ స్థితి (AS FOR RULE) ప్రకారమే వాడుకోవాలి.. ఇలా ఇవ్వగానే అలా అమ్మేస్తాం.. మా బంధువులకు ఇచ్చేస్తాం అంటే కుదరదు. అయితే ప్రతీ రూల్‌లోనూ కొన్ని లూప్ పోల్స్ ఉంటాయి.. వాటిని అడ్డుపెట్టుకుని వందల కోట్లకు పడగలెత్తుతున్నారు సంగారెడ్డి జిల్లా పొలిటికల్ లీడర్లు. ఏకంగా 250 ఎకరాల ప్రభుత్వం భూమి పేదల నుంచి లాగేసుకుని అప్పన్నంత ఆరగించేశారు. అయినవాళ్లకు కట్టబెట్టేశారు. వాళ్లకు అయిన వాళ్లంటే చుట్టాలో.. దోస్తులో కాదు.. పేరు మోసిన రియల్టర్లు. తిమ్మిని బమ్మి చేయగల సమర్థులు.

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో గుట్టుగా సాగిన భూ దందాలో రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. పేరుమోసిన అధికారులూ భాగస్వాములయ్యారు. గతంలో సంగారెడ్డి జిల్లాలో కీలక అధికారి చక్రం తిప్పితే. రాష్ట్ర సచివాలయంలోని మరో కీలక అధికారి ఆ వ్యవహారాన్నంతా చక్కబెట్టారు. ఇందుకోసం ప్రభుత్వ భూములకు ఏకంగా NOC లే ఇచ్చేశారు. NO OBJECTION CERTIFICATEను పెట్టేసి.. అసైన్డ్ భూమిని కాస్త పట్టా భూమిగా మార్చేశారు. ఇంకేముంది ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ భూములకు చక చక ఎన్ఓసిలు వచ్చేశాయి. ఆ ఖరీదైన భూములు ప్రైవేట్ రియల్టర్స్ చేతుల్లోకి వెళ్లిపోయాయి.

Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్‌ అధినేత్రి మమతా టాప్‌ 10 హామీలు

ఇక్కడ ట్విట్ ఏంటంటే భూ దందాలో అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్ష నేతలు ఒక్కటవ్వడమే. ఇదంతా వింటుంటే ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పొలిటికల్ సాంగ్ గుర్తుకొస్తుంది. గెలిచినాము యుద్ధమూ.. చల్ కేల్ ఖతమూ.. ఇక పగ లేంది బై.. ప్రతీకారమేంది బై.. ఈ నేల కోసం అన్నట్లుగా ఉంది భూ దందాలో నేతల ములాఖత్‌లు చూస్తే... నాటి, నేటి ప్రభుత్వ పెద్దలే అసైన్డ్ భూములను గద్దలా ఎగరేసుకుపోతున్నారు. వందలకోట్ల విలువ చేసే భూములను అప్పనంగా కాజేసుకుని జేబులు నింపుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Also Read: Kavitha: తెలంగాణ బడ్జెట్‌పై జాగృతి ఫైర్‌.. రాహుల్‌ గాంధీకి కొత్త పేరు పెట్టిన కవిత

ఇక సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్న పొతిరెడ్డి పల్లిలోని 153, 154, 155, 161 ని సర్వే నెంబర్లలో దాదాపు 250 ఎకరాల భూమిని గద్దల్లా తన్నెసుకుంటుంటే.. వాటిని పొందిన లబ్దిదారులు మాత్రం దిక్కుతోటక దిగాలు చెందుతున్నారు.. 2007లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డే ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటీవల కొందమంది పేదలు తమ ప్లాట్ల కోసం ఆ భూముల శివారులోకి వెళ్తే.. పోలీసులను పెట్టి గెంటించేశారు. గతంలో ప్రభుత్వం పేదలకు పంచిన భూములను బలవంతంగా లాగేసుకున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులది కూడా కీలక పాత్ర టాక్ వినిపిస్తోంది

భూ పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన తర్వాత గడువు లోగా అవి వాడుకలో లేకుంటే.. వెనక్కి తీసేసుకుంటామని మీకు ఇచ్చిన పట్టాలోనే రాసి ఉంది కదా.. అది తెలియకుండానే ఇప్పుడు గొడవకు వచ్చారా అంటున్నారు రెవెన్యూ ఆఫీసర్స్.  పట్టాలు ఇచ్చినప్పుడు రూల్స్ పెట్టిన అధికారులు.. ఇచ్చిన భూమిని సాగుకు యోగ్యం అయ్యేందుకు సహకరించారా.. పోనీ ఇళ్లు కట్టుకుంటామంటే ప్రభుత్వ పథకాలనేమైనా జత చేశారా అంటే అదీ లేదు. కానీ రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలోఅవుతున్నామంటారు. ఎందుకంటే పేదల భూములను లాగేసుకున్నా.. పెద్దగా పట్టించుకునే నాథుడు ఉండడు కాబట్టి. విచిత్రం ఏంటంటే సంగారెడ్డిలో పేదల భూములను లాక్కుని వెంచర్లు వేస్తుంటే.. ప్రతిపక్షాలు కూడా మౌనంగా ఉన్నాయి. ఇదేం దబాయింపు అని అడగడానికి కూడా ప్రతిపక్ష పార్టీలు జంకుతున్నాయి. నిజానికి ప్రతిపక్ష నేతల్లో ఉన్నది భయం కాదు. సర్కారు భూముల్లో తమ వాట ఎక్కడ పోతుందోనన్న ఆందోళన అని బాధితులే చెబుతున్నారు. అందుకే వాళ్లకు మేం కనిపించడం లేదంటూ గుండెలు బాదుకుంటున్నారు.

అయితే సంగారెడ్డిలో జరుగుతున్న భూ దందా ఉన్నతస్థాయి అధికారి నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు తెలియంది కాదు. కానీ ఇదేంటనీ ఏ ఒక్కరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే.. వారికి వాళ్ల కుర్చి.. ఉద్యోగం కాపాడుకోవడమే ముఖ్యం. ఏదైనా సమస్య వచ్చినప్పుడో.. కోర్టుల నుంచి మొట్టికాయలు పడ్డప్పుడో స్పందిస్తారు కానీ.. భూముల వ్యవహారంలో నామమాత్రంగా కూడా మాట్లాడరు. ఏదేమైనా సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడం.. ఇందుకోసం NOC లు ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1093
comment0
Report
GSG Shekhar
Mar 21, 2026 08:31:44
Avanigadda, Andhra Pradesh:

Avanigadda Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి నేతల కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో జనసేన, వర్సెస్ టీడీపీ అన్నట్టుగా నేతలు కొట్లాటలకు దిగుతున్నారు. ఇప్పుడు ఈ లొల్లి కృష్ణా జిల్లాకు పాకింది. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్, తెలుగుతమ్ముళ్ల మధ్చ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలకు జనసేన ఎమ్మెల్యే కండువాలు కప్పడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరే కార్యకర్తలకు నామినేటేడ్ పోస్టులు, ఇతర పోస్టులను ఆశ చూపిస్తుండటంతో.. కొందరు నేతలు జనసేనలో చేరిపోయారు. దాంతో రాష్ట్రంలో పొత్తు ధర్మాన్ని జనసేన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపించడం సంచలనంగా మారింది.

Also Read: Whip Appointment: నలుగురికి విప్‌ అవకాశం.. వేముల వీరేశం పదవితో కోమటిరెడ్డికి చెక్‌?

గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు పొత్తులుగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చాలా నియోజకవర్గాల్లో జనసేన కోసం తెలుగుతమ్ముళ్లు తమ అవకాశాలను వదులుకున్నారు. ఇందులో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కూడా ఒకటి.. ఇక్కడ జనసేన నుంచి మండలి బుద్దా ప్రసాద్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ లో నిలిచారు. ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేత్రత్వంలో జనసేన పరా్టీలో చేరిపోయారు. అయితే టీడీపీలో టికెట్ దక్కే అవకాశం లేదనే సమాచారంతో.. ఆయన జనసేన కండువా కప్పుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో దగ్గరుండి మరి ఆయన్ను టీడీపీ నేతలు గెలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎమ్మెల్యే అయ్యాక మండలి రాజకీయంగా బలపడే ప్రయత్నాల్లో టీడీపీ నేతలకు గాలం వేసే పనిలో బిజిబిజిగా ఉన్నారు. ఇటీవల టీడీపీకి చెందిన కొందరు నేతలకు ఆయనకు జనసేన కండువాలు కప్పారు. దాంతో తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అవనిగడ్డలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ద ప్రసాద్ పనిచేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్‌ అధినేత్రి మమతా టాప్‌ 10 హామీలు

ఈ క్రమంలోనే అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్, టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు రెండు పార్టీల నేతలు భూమి పూజ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కోడూరు మండలం ఎస్సీ కాలనీలో ఓ రోడ్డుకు మొదట్లో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం అదే రోడ్డుకు టీడీపీ నేతలు మరోసారి భూమి పూజ చేయడం హాట్ టాపిక్  ఆ మారింది. ఈ సందర్భంగా కూటమి నేతలు జనసేన ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్ పై బహిరంగంగా విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే కూటమి పొత్తు ధర్మంలో భాగంగా.. రహదారి నిర్మాణం టీడీపీ నేతలు చేపట్టాల్సి ఉందని.. కానీ ఎమ్మెల్యే మాత్రం ఒంటెద్దు పొకడలతో.. రోడ్డు పనులను ఎలా ప్రారంభిస్తారని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నించారు. ఎవరికి చెప్పకుండా దొంగ చాటుగా వచ్చి హడావుడిగా రహదారి పనులు ప్రారంభించారని టీడీపీ నేత బండే శ్రీనివాసరావు విమర్శలకు దిగారు.

అయితే ఎమ్మెల్యేపై విమర్శల విషయంలో టీడీపీ నేతలు ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారని వాళ్లే చెబుతున్నారు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, జిల్లా ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ కనపర్తి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకే రహదారి పనులకు మరోసారి ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు. అయితే బుద్దా ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యాక.. టీడీపీని భూస్థాపితం చేసే పనిలో ఉన్నారని నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలకు జనసేన కండువాలు కప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో నీటి సంఘాల ఎన్నికల సమయంలోనే టీడీపీ నేతలకు పదవులు ఆశచూపి జనసేన పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఇప్పుడు మరోసారి చేరికలకు తెరతీశారని మండిపడుతున్నారు.. అయితే నియోజకవర్గంలో టీడీపీ జరుగుతున్న నష్టాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.

మొత్తంగా ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్ తన పద్దతి మార్చుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. అవనిగడ్డలో కూటమి పొత్తు ధర్మాన్ని పాటించాలని తెలుగుతమ్ముళ్లు కోరుతున్నారు.. అయితే టీడీపీ నేతల విమర్శలను ఎమ్మెల్యే ఎంతమేర సీరియస్‌గా తీసుకుంటారో.. ఆ తర్వాత ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1018
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 07:36:46
Hyderabad, Telangana:

Vivo Y11 5G India Launch: ప్రముఖ వివో కంపెనీ మార్కెట్లోకి తమ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ సిరీస్‌లా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి వివో వై11 5జి, వివో వై21 5జి రెండు మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు మోడల్స్ కు సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.. ఈ మొబైల్స్ గతంలో విడుదల చేసిన అన్ని మోడల్స్ కంటే చాలా ప్రత్యేకమైన డిజైన్తో పాటు మిడిల్ క్లాస్ వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లో మాత్రమే లభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల సింగాపూర్‌లో విడుదలైన వివోకు సంబంధించిన ఓ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ మోడల్స్ ఫీచర్ల లాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 

ఇటీవల లీకైన వివో వై11 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ స్టోరేజ్ వేరియంట్లను బట్టి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 4జీబీ ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కలిగిన మొబైల్ ధర రూ.14 వేల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 128gb ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16 వేల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు నీకైనా వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇందులోని హై ఎండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.18 వేల నుంచి అందుబాటులోకి రాబోతోంది. 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.20 వేల నుంచి అందుబాటులోకి రాబోతోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో కూడిన టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ ధర రూ.22 వేల నుంచి ప్రారంభం కాబోతోంది..

ఇక ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్స్ ఒకేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హార్డ్వేర్ కూడా సేమ్‌గా ఉన్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ఎంతో ప్రత్యేకమైన 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. దీంతోపాటు ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ సపోర్టుతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇక ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యంగా వివో Y11 5Gలో 13MP ప్రధాన కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వివో Y21 5Gలో 50MP ప్రధాన కెమెరా ను కలిగి ఉండబోతుంది. అలాగే ఈ రెండు మోడల్స్‌లో ఫ్రంట్ కెమెరా 5MP ఉండబోతున్నట్లు సమాచారం.. ఇక ఈ రెండు మొబైల్ కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. రెండింటిలోనూ కంపెనీ ఎంతో శక్తివంతమైన 6,500mAh బ్యాటరీని అందించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6పై పనిచేస్తాయని తెలుస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1052
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 07:24:41
Hyderabad, Telangana:

Realme 16 5g India Launch: చైనీస్ స్మార్ట్‌ఫోన్‌తయారీ సంస్థ రియల్ మీ భారత్ మార్కెట్లోకి తమ కొత్త మొబైల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రియల్ మీ 16 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉండబోతోంది. ముఖ్యంగా మనం గతంలో ఎప్పుడూ చూడని అద్భుతమైన స్పెషల్ డిజైన్లు కలిగి ఉంటుంది. అలాగే వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అయితే, ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మీ 16 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలను  ఓ వార్తా సంస్థ తమ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో  త్వరలో మార్కెట్లోకి రాబోతుందని  తెలిపింది. అయితే, ఈ మొబైల్ గత మోడల్స్‌తో పోలిస్తే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతుందట. అయితే, రియల్‌ మీ కంపెనీ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇప్పటికీ చేయకపోవడం గమనార్హం.. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ప్రకారం మాత్రం.. రియల్‌మీ 16 5G, రియల్‌మీ 16Tల విడుదల త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. 

ఇప్పటికే రియల్‌మీ 16 5G ఈ సంవత్సరం జనవరిలో వియత్నాంలో విడుదలైంది. కానీ ఇంకా అందుబాటులోకి రాలేకపోయినట్లు తెలుస్తోంది. అలాగే అంతర్జాతీయంగాను విడుదల కాలేకపోవడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్  8GB RAM, 256GB స్టోరేజ్‌తో పాటు, 12GB, 256GB వేరియంట్లలో  విడుదలయ్యాయి. ఇది వైట్ స్వాన్, బ్లాక్ క్లౌడ్ రంగులలో అందుబాటులో ఉంది. రియల్‌మీ 16 5Gలో 6.57-అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4,200 నిట్స్  గరిష్ట బ్రైట్నెస్ సపోర్టుతో విడుదలైనట్లు సమాచారం..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

మీ డిస్ప్లేకు రియల్ మీ కంపెనీ DT స్టార్ D+ గ్లాస్  ప్రొటెక్షన్ ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్  ప్రాసెసర్‌తో పాటు మాలి-G57 MC2 GPUతో అందుబాటులోకి రాబోతోంది.  అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది..  దీంతోపాటు మీ మొబైల్ వెనుక భాగంలో కెమెరా డ్యూయల్ రియల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అదేవిధంగా వెనక భాగంలోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభించడం విశేషం. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీ 60 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1025
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 21, 2026 07:11:50
Hyderabad, Telangana:

Jharkhand Bomb Discovery Telugu: జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ సమీపంలో గల సువర్ణరేఖ నది తీరంలో భారీ పేలుడు పదార్థం లభ్యమవ్వడం స్థానికంగా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.. సుమారు దాదాపు 227 కిలోల బరువున్న ఈ శక్తివంతమైన బాంబు అమెరికాలో తయారైనట్లు ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది అధికారులు గుర్తించారు.  తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని బహరగోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా ఈ భారీ బాంబు  బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అసలు ఈ బాంబు అక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? ఇది రావడానికి గల కారణాలేంటి పూర్తి వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం..

నదిలో ఇసుక తీస్తున్న సమయంలో కూలీలకు గ్యాస్ సిలిండర్ ఆకారంలో ఉన్న ఈ ఒక భారీ వస్తువు కనిపించింది.. అయితే ఈ విషయాన్ని అక్కడే ఉన్న కూలీలు అంత గ్రామస్తులకు తెలియజేశారు.. దీంతో గ్రామస్తులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోగా.. అది బాంబని తేలడంతో భయాందోళనకు గురయ్యారు.. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. బాంబు చుట్టూ పది మీటర్ల మేర ఎవరిని రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేసి రక్షణ కల్పించారు..

ఈ బాంబుపై AN-M64 500 lb American-made అనే అక్షరాలు స్పష్టంగా కనిపించడం విశేషం.. అయితే ఇది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటిది లేదా 1971 భారత్ పాక్ యుద్ధ సమయంలో ఇక్కడ పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.. మరోవైపు 2018లో కలయికుండా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఒక యుద్ధ విమానం ఈ ప్రాంతంలోనే కూలిపోయింది.. బహుశా ఆ యుద్ధ విమానంలో బాంబులలో ఇది ఒకటై ఉంటుందని కూడా అధికారులు అనుమానిస్తున్నారు..

రాంచి నుంచి వచ్చిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఈ బాంబును ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అత్యంత శక్తివంతమైందని.. సాధారణ పద్ధతుల్లో దీనిని నిర్వీర్యం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.. ఒకవేళ ఇది పేలితే 100 మీటర్ల పరిధిలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. దీంతో దీనిని నిర్వీర్యం చేసేందుకు పశ్చిమ బెంగాల్లోని కలైకుండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారుల సహాయం కోరినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆర్మీ తో పాటు ఎయిర్ఫోర్స్ నిపుణులు వచ్చేవరకు ఆ ప్రాంతంలో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.. అది తీరానికి ఎవరు వెళ్లకుండా ప్రజలకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది..

Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1038
comment0
Report
Advertisement
Back to top