Huawei Mate 80 Pro Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హువావే మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ హువావే మేట్ 80 ప్రో పేరుతో లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే హువావే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ నెలలో చైనాలో ప్రవేశపెట్టింది. ఈ హువావే మేట్ 80 ప్రో మొబైల్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని కెమెరా మాడ్యుల్ రింగ్ డిజైన్‌తో రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ హువావే స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ స్పేస్ రింగ్ డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా విడుదలయ్యే ఈ హువావే మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్ చైనా మోడల్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యుల్‌తో పాటు XMAGE అనే బ్రాండింగ్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ డాన్ గోల్డ్ రంగులో మాత్రమే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు డిస్ప్లే స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు సమాచారం..
ఫిబ్రవరి 26వ తేదిన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరగబోయే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈ హువావే మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హువావే వాచ్ జిటి రన్నర్ 2తో పాటు మరికొన్ని పరికరాలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.75-అంగుళాల LTPO AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ప్రొటెక్షన్ కోసం ఇందులో కున్లున్ గ్లాస్‌ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ హువావే మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్ కిరిన్ 9030 ప్రో ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా చాలా శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ RYYB ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే అదనంగా 40-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు 48-మెగాపిక్సెల్ మాక్రో టెలిఫోటో కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇందులో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అలాగే 3D డెప్త్-సెన్సింగ్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Delhi woman jumps from fourth floor hotel after argument with boy friend: యువతీ, యువకులు ఎక్కడ చూసిన వాలెంటైన్స్ డే సంబరాల్లో మునిగితెలుతున్నారు. కొంత మంది తమ ప్రియమైన వాళ్లతో ఈ రోజు ఎంజాయ్ చేసేందుకు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తుంటారు. తమ వారికి లవ్ ను ప్రపోజ్ చేస్తారు. ఇదంతా ప్రతిఏటా జరిగిదే. కొంత మంది ప్రేమను యాక్సెప్ట్ చేస్తే ఆనందంతో పొంగిపోతే, మరికొంత మంది తమ ప్రేమను ఒప్పుకోలేని ఆవేశంతో ఎదుటివారిని చంపడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం చేస్తారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల యువతి ఏకంగా నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేసింది.
नीचे खड़ी भीड़ रोकती रही, लेकिन लड़की नहीं मानी। चौथे मंजिल से कूद गई लड़की। ये लड़की दिल्ली में एक होटल में अपने मित्र के साथ ठहरी थी। कोई बात हुई और, इसने कूदकर जान देने की कोशिश की। ऊंचाई से नीचे गिरने के कारण लड़की की हालत गंभीर है। अस्पताल में भर्ती कराया गया है।। pic.twitter.com/7CfTYUySAO
— MOHD KALEEM JOURNALIST ANI (@mohdkaleem36) February 14, 2026
ఢిల్లీలోని ఫర్ష్ బజార్ ప్రాంతంలోని ఒక హోటల్ ఉంది. అందలో యువతి, తన ప్రియుడితో కలిసి నాలుగో అంతస్థులోని గదిలో దిగారు. అయితే.. వీరిద్దరు వాలెంటైన్స్ డేను ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ ఇంతలో వారి మధ్య ఏంగొడవ ఏంజరిగిందో కానీ ఆమె శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హోటల్ విండో నుంచి కిందకు దూకేసింది. ఆమె గటట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు.
ఇంతలో ఆమె లక్ బాగుండి ఆమె నెల మీద కాకుండా అక్కడ ఉన్న కాటున్ డబ్బాలలో పడింది. దీంతో స్వల్పగాయలలో బైటపడింది. వెంటనే ఆమెను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఆ జంటపై కేసు నమోదు చేశారు.
యువతి ప్రేమను యువకుడు రిజక్ట్ చేశాడని అందుకే ఆమె నాలుగో అంతస్తు నుంచి దూకేసిందని అక్కడి వారు చెబుతున్నారు. తనను ఇన్నాళ్లు ప్రేమ పేరుతో మోసం చేశాడని తెలిసి ఈ విధంగా తన ప్రాణాలు తీసుకొవాలని సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెబుతున్నారు. మొత్తంగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandi Sanjay Latest Telugu News: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ, కుట్రలతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఈ మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..
కరీంనగర్ ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు.. స్వతంత్ర అభ్యర్థులు కూడా చేరడంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. కానీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసినా కనీసం 26 సీట్లు కూడా రాలేదు. అయినా.. మేయర్ పదవి కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్నారు" అని బండి సంజయ్ విమర్శించారు. ప్రజల తీర్పుకు విరుద్ధంగా కుట్రలు చేస్తే ఒక్క నేతను కూడా రోడ్లపై తిరగనివ్వమని.. ఒక్కొక్కరిని ఉరికిస్తామని ఆయన హెచ్చరించారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో మహిళలకు ఇస్తానన్న రూ.2,500 ఏమయ్యాయని ప్రశ్నించారు. వృద్ధులకు త్వరలో ఇస్తామని అన్న రూ.4,000 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఉద్యోగుల DAలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కోసం లక్షలాది మందిని రోడ్లపైకి తెచ్చి.. ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు.
MIMను ఒక జీవం లేని పార్టీగా అభివర్ణించిన ఎంపీ బండి సంజయ్.. రజాకార్ల వారసత్వాన్ని మోస్తున్న ఆ పార్టీకి పునరుజ్జీవ ఉత్సవాలు జరుపుకునే అర్హత లేదని స్పష్టం చేశారు.. భాగ్యనగరాన్ని మూడు ముక్కలు చేసి MIMకు రాసివ్వాలని సీఎం చూస్తున్నారని, హైదరాబాద్ ఎవరి సొంత ఆస్తి కాదని హెచ్చరిక చేశారు. అలాగే ఇప్పుడు ముస్లిం మహిళలు చాలా మంది కూడా ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత మోదీ పాలనను కోరుకుంటున్నారని.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్ తెలిపారని పేర్కొన్నారు.
నాడు రెండు ఎంపీ సీట్ల నుంచి నేడు కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చామని గుర్తు చేస్తూ.. 2028లో తెలంగాణలో BJP జెండా ఎగరడం ఖాయమని ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర నిధుల నుంచి రూ.1,400 కోట్లు తెచ్చామని.. చేసిన అభివృద్ధిని బుక్‌లెట్ రూపంలో ఇంటింటికీ పంపామని బండి సంజయ్ వివరించారు.
Also Read: Sangareddy: అయ్యే.. ఎన్నికల డబ్బులు చోరీ.. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Bus Announced To Physically Challenged In Budget 2026-27: ఏపీ 2026 -27 బడ్జెట్‌లో దివ్యాంగులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని 'ఇంద్ర ధనస్సు' పేరుతో అమలు చేయనున్నట్లు పేర్కొంది. అయితే దివ్యాంగులకు ఇప్పటికే 50 శాతం సబ్సిడీతో ఏపీఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. ఈ స్కీం అమలు చేస్తే మహిళలతోపాటు దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం లభిస్తుంది. అయితే, ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు లక్షల పై దివ్యాంగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ఇక ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సులను ప్రయాణాన్ని అమల్లోకి తీసుకువచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
అయితే గత ఏడాది ఈ ఉచిత సౌకర్యానికి సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత శాఖకు పంపించామని కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు. గత ఏడాది లెక్కల ప్రకారం ఏపీలో దాదాపు రెండు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇందులో ఇప్పటికే వీరు 50 శాతం రాయితీ బస్సు ప్రయాణ సమయంలో పొందుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఏటా రూ.180 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఇక ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించిన ఏపీ కూటమి సర్కార్. ఈ దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే దివ్యాంగులైన మగవారు కూడా ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం పొందుతారు. అయితే, ఎప్పటి నుంచి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని కూడా ఇచ్చారు. ప్రధానంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు.
రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా..
అందులో మూలధన వ్యయం రూ.53,915 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు
ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు
ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రూ.9.74 లక్షల కోట్లు అప్పుతో ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది. మేం చేస్తున్న అప్పు ఉత్పాదకతకు ఖర్చు చేస్తున్న ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదు. పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. అనేక సవాళ్లు ఉన్న అభివృద్ధి సంక్షేమంపై మా లక్ష్యాలలో మార్పు లేదు అని ప్రకటించారు.
Also Read: ఏపీ బడ్జెట్ లెక్కలకు వేళయా.. ఏ రంగానికి ఎన్ని నిధులు..?
Also Read: ఏపీ బడ్జెట్ హైలెట్స్.. ఈ శాఖలకు భారీగా నిధులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Budget 2026 27 Highlights: ఏపీ అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (ఫిబ్రవరి 14, 2026) 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ ఇది. గత ఆర్థిక వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ, వృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా, పారిశ్రామిక వృద్ధి, సంక్షేమ హామీలు, రాజధాని నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.
బడ్జెట్ అంచనాలు & వృద్ధి
మొత్తం వ్యయం రూ.3,32,205 కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి 11.75 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, 2025-26లో ఇది 10.75 శాతంగా ఉండవచ్చని అంచనా. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం 'జీరో పావర్టీ' (పేదరికం లేని రాష్ట్రం) సాధించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
కీలక రంగాలకు కేటాయింపులు
విద్య, వైద్య రంగాలకు ఈసారి బడ్జెట్‌లో సింహభాగం దక్కింది. రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది.
1) 'వీబీ జీ రామ్ జీ'- రూ.8,365 కోట్లు
2) గృహ నిర్మాణం- రూ.5,451 కోట్లు
3) ఎన్టీఆర్ వైద్య సేవ- రూ.4,000 కోట్లు
4) జల్‌జీవన్- రూ.4,000 కోట్లు
5) స్వచ్ఛ భారత్ మిషన్- రూ.1,037 కోట్లు
6) విద్యుత్ రంగం - రూ.13,934 కోట్లు
7) రోడ్లు, పోర్టు, విమానాశ్రయాలకు - రూ.13,546 కోట్లు
8) పరిశ్రమలకు - రూ.3,161 కోట్లు
9) పాఠశాల విద్యాశాఖ - రూ.32,308
10) ఎస్సీ కాంపోనెంట్ - రూ.20,644
11) ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ - రూ.19,306
12) జల వనరుల శాఖ - రూ.18,224
13) మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి - రూ.14,539
14) ఎనర్జీ (విద్యుత్ శాఖ) - రూ.13,934
15) వ్యవసాయ, అనుబంధ రంగాలు - రూ.13,598
16) హోమ్ శాఖ - రూ.9,165
17) అన్నదాత సుఖీభవ - 6600 కోట్లు
18) పోలవరం- 6105 కోట్లు
19) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన - 1927 కోట్లు
20) మత్స్యకార సేవలో - 260 కోట్లు
21) ధరల స్థిరీకరణ నిధి - 500 కోట్లు
22) క్రాప్ ఇన్సూరెన్స్ - 250కోట్లు
23) పీఎం కృషి సించాయి యోజన - 190 కోట్లు
24) పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్- 22,941 కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Spa Center Telugu News: నగంలోని మసాజ్ సెంటర్ల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముసుగును కేపీహెచ్‌బీ పోలీసులు రట్టు చేశారు.. చాలా రద్దిగా ఉండే స్థానిక నివాస ప్రాంతాల మధ్య వెలసిన ఓ వెల్‌నెస్ సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అధికారిక సమాచారంతో పోలీసులు శనివారం అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున నిందుతులు పట్టుబడటంతో పోలీసు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. KBHP పరిధిలోని అసాన వెల్ నెస్ స్పా కేంద్రంగా గత కొన్ని రోజుల నుంచి ఈ దందా కొనసాగుతోంది.. మసాజ్ సెంటర్ ముసుగులో నిర్వాహకులు ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా పురుషులకు యువతులతో క్రాస్ మసాజ్ చేస్తామంటూ సోషల్ మీడియాల్లో విటులను ఆకర్శిస్తున్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి.. వారికి అధికంగా డబ్బు ఆశచూపి.. ఈ వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు విచారణలో తెలిసింది.
Also Read: Sangareddy: అయ్యే.. ఎన్నికల డబ్బులు చోరీ.. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు!
గత కొన్ని రోజులుగా ఈ స్పాపై పోలీసు నిఘా ఉంచిన్నట్లు తెలుస్తోంది.. అయితే, శనివారం మధ్యహ్నం ఆకస్మికంగా లోపలికి ప్రవేశించి.. ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. వీరు మసాజ్ సెంటర్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులను చూసి పోలీసులు అధికారులు ఆశ్చర్యపోయారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన మసాజ్ సౌకర్యాల కంటే.. అసాంఘిక కార్యకలాపాలకు అనుగుణంగానే ఈ గదులు రూపొందించిన్నట్లు వారు గుర్తించారు.
ఈ ఆకస్మిక మెరుపు దాడుల్లో పోలీసులు దాదాపు 15 మందికి పైగా యువతులను సురక్షితంగా రక్షించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిని పునరావాస కేంద్రాలకు కూడా తరిలించిన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు ఇతర సిబ్బంది కలిపి మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతుల వద్ద నుంచి స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Sangareddy: అయ్యే.. ఎన్నికల డబ్బులు చోరీ.. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sangareddy Telugu News: మున్సిపల్ ఎన్నికల వేళ కొన్ని పార్టీలు భారీగా డబ్బులు పంచాయి. కొన్ని చోట్ల దాదాపు ఓటుకు రూ.2 వేయిలు పంచినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మున్సిపల్ ఎన్నికల వేళ అందిన డబ్బును ఓ వ్యక్తి దాచుకుంటే..గుర్తుతెలియని వ్యక్తులు దానిని దొంగతనం చేయడంతో మనస్థాపానికి గురైన అతన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింద. జోగిపేట పట్టణానికి చెందిన ఆశోక్ అనే యువకుడు తన వద్ద ఉన్న డబ్బులు పోవడంతో తీవ్ర ఆవేదన చెంది.. సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడం స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది.
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కొంత మొత్తంలో అశోక్‌కు డబ్బులు అందినట్లు తెలుస్తోంది. అలాగే ఆ యువకుడు పొందిన డబ్బులతో మంచి స్మార్ట్‌ఫోన్ కూడా కొనుక్కోవాలని అనుకున్నారట.. కూలి పనులు చేసుకుంటూ జీవించే అశోక్.. తనకు వచ్చిన డబ్బులను ఓ చోట దాచుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు అలా అతను దాచుకున్న డబ్బులను ఎవరో దొంగిలించారు.
శుక్రవారం ఉదయమే ఆశోక్ నిద్రలేచి చూసేసరికి ఆతను ఓ చోట పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురయిన్నట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి సంపాదించినా.. ఎన్నికల వేళ వచ్చినా.. ఫోన్ కొనాలన్న తన కల నెరవేరకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై.. పట్టణంలోని ఒక సెల్ టవర్ పైకి ఎక్కాడు.
అయితే, అశోక్ వెంటనే ఇంటికి దగ్గరలో ఉన్న సెల్ టవర్‌కి ఎక్కేసాడు.. అతను కిందకు దూకేస్తానని కేకలు వేయడంతో స్థానికులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, స్థానికంగా ఉంన్న ప్రజలు వెంటనే పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని అతడిని కిందకు దిగాల్సిందిగా కోరారు. "డబ్బులు పోతే పోయాయి, ప్రాణాలు ముఖ్యం.. కిందకు దిగు నాయనా.." అంటూ అక్కడున్న కొంతమంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆశోక్ దాదాపు గంటపాటు టవర్ పైనే ఉండి కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చివరకు స్థానికులతో పాటు పోలీసులు ఇచ్చిన హామీతో ఆతను టవర్‌పై నుంచి కిందికి దిగివచ్చాడు.
పాపం ఆ కుర్రాడు.. కష్టం చేసి, ఎన్నికల సమయంలో వచ్చిన డబ్బులను ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాడు.. దొంగలు ఆ డబ్బును దోచుకెళ్లడం అతను తట్టుకోలేపోయాడు.. అంటూ స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేయడం విశేషం.. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hardik Pandya Girlfriend In Colombo: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఆయన ప్రవర్తన బీసీసీఐ (BCCI) నిబంధనలను ఉల్లంఘించేలా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి కనిపించడమే ఇప్పుడు ఈ దుమారానికి కారణమైంది. పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైన వేళ, హార్దిక్ వ్యక్తిగత వ్యవహారం జట్టు క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు స్వాగతం పలుకుతున్న సమయంలో.. అర్ష్‌దీప్ సింగ్ డాన్స్ చేస్తున్న వీడియోలో హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి టీమ్ బస్సు ఎక్కుతూ కనిపించారు. మిగిలిన ఆటగాళ్లంతా ఒంటరిగా వస్తే, హార్దిక్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా గర్ల్‌ఫ్రెండ్‌ను వెంట తెచ్చుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీసీసీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
సాధారణంగా ఐసీసీ మెగా టోర్నీల సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ కఠిన రూల్స్ పెడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ వరల్డ్ కప్ గ్రూప్ దశలో భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ను వెంట తెచ్చుకోవడానికి బోర్డు అనుమతి ఇవ్వలేదు. పర్యటన 45 రోజుల కంటే ఎక్కువ ఉంటేనే ఫ్యామిలీకి పరిమిత రోజులు (14 రోజులు) అనుమతి ఉంటుంది. కానీ హార్దిక్ నేరుగా టీమ్ అఫీషియల్ బస్సులోనే ఆమెను తీసుకురావడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు.
BCCI Policy? What Policy? 😂
According to BCCI rules, players can't keep their girlfriends or wives with them during tournament, especially on overseas tours.
But Hardik Pandya was seen with his girlfriend at the hotel yesterday, traveling together on the team bus today. 😅 pic.twitter.com/c5dFjKW3EI
— Jara (@JARA_Memer) February 13, 2026
కోచ్ గంభీర్ రియాక్షన్?
భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పాక్ వంటి కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో విభేదాలు లేదా ఏకాగ్రత లోపించే చర్యలను గంభీర్ సహించరనే పేరుంది. ఈ వ్యవహారంపై బీసీసీఐ వివరణ కోరే అవకాశం ఉంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే భారీ జరిమానా లేదా హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉంది.
మైదానంలో తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు వెన్నెముకగా నిలిచే హార్దిక్, ఇలాంటి వివాదాల వల్ల విమర్శల పాలవుతున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందు ఇలాంటి చర్చలు రావడం జట్టు వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Reserves Indian Households: భారతీయులకు బంగారం అంటే కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, తరతరాల ఆస్తి మాత్రమే కాకుండా ఆర్థిక భరోసా కూడా. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం.. భారతీయ ఇళ్లలో ఉన్న పసిడి నిల్వల విలువ దేశ వార్షిక ఆదాయాన్ని (GDP) మించిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయని నిపుణుల అంచనా.
సంపద విలువ - అంకెల్లో చూస్తే..
భారతీయ ఇళ్లలో సుమారు 30,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ 5 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.452 లక్షల కోట్లు). 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత నామమాత్రపు జీడీపీ 4.125 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. అంటే, భారతీయుల ఇళ్లలోని బంగారం విలువ దేశం మొత్తం ఏడాది పొడవునా చేసే ఉత్పత్తి (GDP) కంటే ఎక్కువ.
ధరల పెరుగుదలకు కారణాలు
2025లో బంగారం ధరలు దాదాపు 65% మేర పెరగడం వల్ల ఈ ఆస్తి విలువ అమాంతం పెరిగింది. దీనికి ప్రధాన కారణాలు.. అంతర్జాతీయంగా డాలర్, ప్రభుత్వ బాండ్లపై నమ్మకం తగ్గడంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుద్ధ వాతావరణం).. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేయడం వంటి వాటిని ప్రామాణికంగా చూసుకుంటారు.
భారతీయులు బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే 'భద్రతా వలయం'గా భావిస్తారు. అయితే, నిపుణులు మరో కోణాన్ని కూడా సూచిస్తున్నారు. ఇంట్లో నిల్వ ఉన్న బంగారం నేరుగా ఆదాయాన్ని లేదా ఉద్యోగాలను సృష్టించదు. ఇది దేశ ఆర్థిక వృద్ధికి ప్రత్యక్షంగా తోడ్పడదు.
ప్రస్తుతం చాలామంది ఫిజికల్ గోల్డ్ (ఆభరణాలు) కంటే గోల్డ్ బాండ్లు, గోల్డ్ లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఇళ్లలోని బంగారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం ఉంది.
భారతీయ ఇళ్లలోని ఈ భారీ పసిడి నిధి దేశ ఆర్థిక స్థితిగతులను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంపదను ఉత్పాదక మార్గాల్లోకి మళ్లించగలిగితే, భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bhopal Septic tank Murder Update: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ఒక పరిచయం.. ప్రేమ, సహజీవనం, బ్లాక్‌మెయిలింగ్ మీదుగా సాగి చివరికి హత్యతో ముగిసింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన ప్రియురాలిని గొంతు కోసి చంపడమే కాకుండా, శవాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన వైనం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
నిషాత్‌పురా ప్రాంతంలోని ఒక ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో అది మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియా మృతదేహంగా తేలింది.
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం..
మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన సియాకు, భోపాల్‌కు చెందిన సమీర్‌తో ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, మూడు నెలల క్రితం ఆమె తన ఇంటిని వదిలి భోపాల్‌కు వచ్చేసింది. అయితే సమీర్‌కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసినా సియా అతనితోనే సహజీవనం చేయడం ప్రారంభించింది.
సమీర్ ఇంట్లోనే సియా ఉండటంతో అతని భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని లేదా రూ.5 లక్షలు ఇచ్చి సెటిల్ చేయాలని సియా డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించడంతో సమీర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
గత సోమవారం సాయంత్రం జరిగిన తీవ్ర వాగ్వాదంలో సమీర్ ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఈ విషయాన్ని తన తల్లి, సోదరుడు, సోదరికి చెప్పాడు. వారందరూ కలిసి మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కారు. అర్ధరాత్రి సమయంలో ఆ పెట్టెను ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు.
కేసు ఛేదన ఇలా..
గురువారం ఆ ట్యాంక్ సమీపంలో ఆడుకుంటున్న పిల్లలకు దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయినప్పటికీ, ఆమె చేతిపై ఉన్న 'దీపం' పచ్చబొట్టు మరియు "26 మే 1992" అనే పుట్టిన తేదీ ఆధారంగా పోలీసులు ఆమెను గుర్తించారు.
ప్రస్తుతం నిందితుడు సమీర్ పరారీలో ఉండగా, హత్యకు సహకరించిన అతని తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు గతంలో మూడుసార్లు వివాహం చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India vs Pakistan Match Weather Forecast: టీ20 ప్రపంచకప్ 2026లో క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజీ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్ల సూపర్-8 అవకాశాలపై ప్రభావం చూపనుంది.
వాతావరణ అంచనా
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 15న కొలంబోలో వాతావరణం ఇలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పగటి పూట ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 60% నుండి 50% వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
అలాగే మ్యాచ్ సమయంలో సాయంత్రం 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు వర్షం పడే అవకాశం 10% నుండి 20% వరకు తక్కువగానే ఉన్నప్పటికీ, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఫిబ్రవరి 14 నుండే అక్కడ జల్లులు పడే అవకాశం ఉండటంతో మైదానం తడిగా మారే ప్రమాదం ఉంది.
గ్రూప్-స్టేజ్ సమీకరణాలు
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ రెండు జట్లు కూడా తమ ఆరంభ మ్యాచ్‌లలో అజేయంగా నిలిచాయి. ఒకవైపు భారత్ తాను ఆడిన అమెరికా, నమీబియా జట్లపై విజయాలతో జోరు మీదుంది. పాకిస్థాన్ కూడా అమెరికా, నెదర్లాండ్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో గట్టి పోటీనిస్తోంది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ప్రపంచకప్‌లో భారత్‌దే పైచేయి
టీ20 ప్రపంచకప్‌ల చరిత్ర చూస్తే పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది.
మొత్తం మ్యాచ్‌లు: 08
భారత్ గెలుపు: 07
పాక్ గెలుపు: 01 (2021లో)
మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?
దురదృష్టవశాత్తు వర్షం కారణంగా మ్యాచ్ కనీసం 5 ఓవర్ల పాటు కూడా సాధ్యం కాకపోతే.. గ్రూప్ దశలో 'రిజర్వ్ డే' నిబంధన లేదు. కాబట్టి మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున కేటాయిస్తారు. ఇది పాయింట్ల పట్టికలో మార్పులకు దారితీయడమే కాకుండా.. నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.
ప్రస్తుతం కొలంబోలో గాలుల దిశ మార్పు వల్ల వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, సాయంత్రం సమయానికి వర్షం తగ్గుముఖం పడితే కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్‌నైనా చూడొచ్చని అభిమానులు ఆశపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahabubnagar Municipal Elections: ఒక ముఖ్యమంత్రి ఉంటే అతడి సొంత ప్రాంతంలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేదు. రేవంత్ రెడ్డి చరిష్మా లేనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పాలమూరు ప్రాంతంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా కూడా ఇతర జిల్లాలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ. మొత్తం 18 మున్సిపాలిటీల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ హోరాహోరీగా తలపడి సొంతంగా మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించినా.. వారంతా గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నవారే. దీంతో ఆ మున్సిపాలిటీ కూడా గులాబీ ఖాతాలోకే వెళ్తుంది. నారాయణపేటలో బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉండగా.. ఇక మూడు మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. మిగతా అన్నీ చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
Also Read: KTR: మున్సిపల్ ఫలితాలతో సంతృప్తి చెందాం.. 2029లో కేసీఆర్ సీఎం కావడం పక్కా: కేటీఆర్
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ విజయం సాధించింది. కొడంగల్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ విజయం సాధించగా.. మక్తల్ నియోజకవర్గంలో రెండు చోట్ల హంగ్ రాగా.. మక్తల్‌లో కాంగ్రెస్ గెలిచింది. నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది. అయిజ, ఆమన్‌గల్ మున్సిపాలిటీలను ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది.
Also Read: Municipal Elections: తెలంగాణలో కిడ్నాప్‌ల కలకలం.. స్వతంత్ర అభ్యర్థుల కోసం ఘర్షణ
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని మున్సిపాలిటీల ఫలితాలు ఇలా ఉన్నాయి.
మక్తల్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు -15
కాంగ్రెస్ - 12
బీజేపీ -3
నారాయణపేట మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-24
కాంగ్రెస్ - 7
బీఆర్‌ఎస్ పార్టీ -2
బీజేపీ - 11
ఎంఐఎం - 2
ఫార్వార్డ్ బ్లాక్ -1
స్వతంత్రులు -1
గద్వాల్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు -37
కాంగ్రెస్ - 16
బీఆర్‌ఎస్ పార్టీ - 11
ఎంఐఎం - 1
బీజేపీ - 7
స్వతంత్రులు - 2
Also Read: BRS Clean Sweep: బీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్.. కేసీఆర్‌కు గూడెం మహిపాల్ రెడ్డి గిఫ్ట్
కల్వకుర్తి మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-22
కాంగ్రెస్ - 13
బీజేపీ - 5
బీఆర్‌ఎస్ పార్టీ - 3
స్వతంత్రులు -1
కొడంగల్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు -12
బీఆర్‌ఎస్ పార్టీ - 1
కాంగ్రెస్ – 10
స్వతంత్రులు - 1
కోస్గి మున్సిపాలిటీ
మొత్తం వార్డులు- 16
కాంగ్రెస్ - 16
మద్దూరు మున్సిపాలిటీ
మొత్తం వార్డులు -16
కాంగ్రెస్ - 9
బీఆర్‌ఎస్ పార్టీ - 6
స్వతంత్రులు - 1
ఆమన్‌గల్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు -15
బీఆర్‌ఎస్ పార్టీ - 8
కాంగ్రెస్ - 1
బీజేపీ -6
కొల్లాపూర్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు -19
కాంగ్రెస్ - 16
బీఆర్‌ఎస్ పార్టీ - 3
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు -24
కాంగ్రెస్ -18
బీఆర్‌ఎస్ పార్టీ -6
వనపర్తి మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-33
కాంగ్రెస్ - 21
బీఆర్‌ఎస్ పార్టీ - 7
బీజేపీ -2
సీపీఐ -1
స్వతంత్రులు -2
అమరచింత మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-10
కాంగ్రెస్ - 3
బీఆర్‌ఎస్ పార్టీ -3
బీజేపీ -3
సీపీఐ -1
ఆత్మకూరు మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-10
కాంగ్రెస్ -6
బీఆర్‌ఎస్ పార్టీ -1
బీజేపీ -3
కొత్తకోట మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-15
కాంగ్రెస్ -10
బీఆర్‌ఎస్ పార్టీ -3
బీజేపీ - 1
స్వతంత్రులు-1
పెబ్బేరు మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-12
కాంగ్రెస్ -7
బీఆర్‌ఎస్ పార్టీ -5
వడ్డేపల్లి మున్సిపాలిటీ
మొత్తం వార్డులు -10
ఫార్వార్డ్ బ్లాక్ - 8
బీఆర్‌ఎస్ పార్టీ -1
కాంగ్రెస్ - 1
ఆలంపూర్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-10
బీఆర్‌ఎస్ పార్టీ -5
కాంగ్రెస్ -5
అయిజ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-20
బీఆర్‌ఎస్ పార్టీ -13
కాంగ్రెస్ -7
దేవరకద్ర మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-12
కాంగ్రెస్ -6
బీఆర్‌ఎస్ పార్టీ -4
స్వతంత్రులు -1
బీజేపీ -1
భూత్పూర్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-10
కాంగ్రెస్ -7
బీఆర్‌ఎస్ పార్టీ -1
బీజేపీ -2
షాద్‌నగర్ మున్సిపాలిటీ
మొత్తం వార్డులు-28
కాంగ్రెస్ -15
బీఆర్‌ఎస్ పార్టీ -11
బీజేపీ -1
స్వతంత్రులు -1
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Expressway Toll Reduction: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తియ్యని కబురు అందించింది. పాక్షికంగా పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేసే టోల్ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15, 2026 నుండి అమలులోకి రానున్నాయి. నిర్మాణంలో ఉన్న రోడ్లపై కూడా పూర్తిస్థాయి టోల్ వసూలు చేయడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
25 శాతం మేర తగ్గింపు
ఇకపై ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తిగా ముగియకుండా, కేవలం పాక్షికంగా (Partial) అందుబాటులోకి వచ్చిన మార్గాల్లో ప్రయాణిస్తే.. వాహనదారులు సాధారణ టోల్ ధరలో 25 శాతం తక్కువ చెల్లిస్తే సరిపోతుంది. అంటే, రోడ్డు సౌకర్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు అధిక భారం పడకుండా కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది.
నిబంధనలలో మార్పు (2008 రూల్స్ సవరణ)
టోల్ ఫీజుల వసూలు కోసం గతంలో 2008లో రూపొందించిన 'జాతీయ రహదారుల రుసుము నిబంధనలను' కేంద్రం సవరించింది. ఈ సవరణ ప్రకారం.. రోడ్డు నిర్మాణం జరుగుతున్న సమయంలో వాహనదారులకు కలిగే అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ తగ్గింపును వర్తింపజేస్తారు. ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తిగా పూర్తయ్యే వరకు (సుమారు ఏడాది పాటు) ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత తిరిగి సాధారణ ఛార్జీలు వసూలు చేస్తారు.
దీని ప్రధాన ఉద్దేశం..
టోల్ ఫీజులు తక్కువగా ఉంటే వాహనదారులు కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలను ఎక్కువగా వినియోగిస్తారు. దీనివల్ల పాత జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. పనులు పూర్తి కాకపోయినా పూర్తి ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రయాణికులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించడం. ఎక్స్‌ప్రెస్‌వేలు పాక్షికంగా అందుబాటులోకి వచ్చినా, ప్రజలు వాటిని తక్కువ ధరకే వినియోగించుకునేలా ప్రోత్సహించడం.
ఫిబ్రవరి 15 నుండి అమలులోకి రానున్న ఈ నిర్ణయం దూరప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా రవాణా రంగం వారికి పెద్ద ఊరటనిస్తుంది. నిర్మాణంలో ఉన్న రహదారుల గుండా వెళ్లేవారు ఇకపై పూర్తి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hung Municipalities: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొన్ని చోట్ల తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎవరికీ మెజార్టీ లభించని మున్సిపాలిటీల్లో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులను కిడ్నాప్‌కు ప్రయత్నిస్తున్నారు. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దాడులు, కిడ్నాలప్‌కు పాల్పడింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. స్వతంత్రులతోపాటు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గులాబీ పార్టీ క్యాంపు రాజకీయానికి తెరలేపింది.
Also Read: Municipal Election Results: ఈ మున్సిపాలిటీల్లో హంగ్.. హోరాహోరీ పోరులో ఎవరిదో పీఠం
ఇస్నాపూర్‌లో..
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించినా ఎలాగైనా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్‌లకు పాల్పడుతోంది. స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీలోకి వచ్చేయాలని కాంగ్రెస్ పార్టీ లాగేసింది. దీంతో ఇస్నాపూర్ ఎన్నికల పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల బందోబస్తు ఉన్నపటికి కూడా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: BRS Clean Sweep: బీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్.. కేసీఆర్‌కు గూడెం మహిపాల్ రెడ్డి గిఫ్ట్
ఆదిలాబాద్ మున్సిపాలిటీ..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో హంగ్ రావడంతో ఇక్కడ కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకున్నా మ్యాజిక్ ఫిగర్ మాత్రం దాటలేదు. 22 వార్డులను బీజేపీ గెలుచుకోగా.. 5 మంది స్వతంత్రులు గెలిచారు. వారిని వెంటనే తమ గుప్పిట్లోకి బీజేపీ తీసుకుంది. స్వతంత్రులతో కలిపి ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలం పార్టీ భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: KTR: మున్సిపల్ ఫలితాలతో సంతృప్తి చెందాం.. 2029లో కేసీఆర్ సీఎం కావడం పక్కా: కేటీఆర్
మహబూబాబాద్ జిల్లా..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కూడా హంగ్ వచ్చింది. హంగ్ ఏర్పడడంతో బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా యుద్ధంగా జరుగుతోంది. దీంతో కౌంటింగ్ సెంటర్ వద్ద గులాబీ, కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
జనగామ మున్సిపాలిటీ..
జనగామ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్వతంత్రుల మద్దతు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి స్వతంత్రులు కీలకం కావడంతో వారిని తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక రౌడీలా మారిపోయి స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసి బందించారు. పలువురు స్వతంత్రులను బలవంతంగా తీసుకుపోయే ప్రయత్నం చేయడంతో జనగామలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జనగామ 15 అవార్డు అభ్యర్థిగా గెలిచిన మారబోయిన పాండును కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ చేసిందని సమాచారం.
Also Read: Tirumala: గుండు చేయించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook