Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతా...
HDHarish Darla
Feb 05, 2026 05:20:57
Hyderabad, Telangana

TTD Ghee Testing Lab Setup: తిరుమల శ్రీవారి భక్తులకు స్వచ్ఛమైన, నాణ్యమైన ప్రసాదాలు, ఆహారం అందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో ముందడుగు వేసింది. లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో, భక్తుల నమ్మకాన్ని కాపాడేందుకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుమలలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను టీటీడీ నిర్మిస్తోంది. ఈ కొత్త ల్యాబ్‌లో అత్యంత ఖరీదైన, ఆధునిక సాంకేతిక పరికరాలను అమర్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో 15 రకాల హైటెక్ పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేసింది.

హై ఫర్‌ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమోగ్రాఫ్ (HPLC), గ్యాస్ క్రోమటోగ్రాఫ్ (GC), ఐసీపీఎంసీ (ICPMC) వంటి పరికరాల ద్వారా ఆహారంలో కలిసే అతి సూక్ష్మమైన రసాయనాలను లేదా కల్తీ పదార్థాలను కూడా సులభంగా గుర్తించవచ్చు.

మార్చి నుంచే సేవలు ప్రారంభం
ప్రస్తుతం తిరుమలలో నీరు, ఆహార నాణ్యతను పరీక్షించే చిన్న ల్యాబ్ అందుబాటులో ఉంది. దానికి సమీపంలోనే ఈ కొత్త ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) ల్యాబ్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే మార్చి నెల కల్లా ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి ఇటీవలే పనులను పర్యవేక్షించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

కల్తీ నెయ్యిపై సిట్ (SIT) విచారణ అప్‌డేట్
మరోవైపు, గతంలో జరిగిన నెయ్యి కల్తీపై ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తు కొనసాగిస్తోంది. కేవలం తిరుమలకే కాకుండా, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా 2022-23 కాలంలో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ గుర్తించింది.

విజయ డెయిరీ స్థానంలో వచ్చిన రాజేశ్ కార్పొరేషన్ సరఫరా చేసిన నెయ్యిలో రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే తిరుమలలో ఈ పటిష్టమైన ల్యాబ్ వ్యవస్థను తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అన్నప్రసాదం నుండి లడ్డూ ప్రసాదం వరకు ప్రతిదీ నాణ్యంగా ఉండేలా చూడటం ద్వారా భక్తుల ఆరోగ్యం, సెంటిమెంట్‌ను కాపాడటమే ఈ ల్యాబ్ ప్రధాన ఉద్దేశం.

Also REad: Peddi Postponed: బాబాయ్ కోసం రేసు నుంచి తప్పుకున్న అబ్బాయ్! పెద్ది సినిమా విడుదల వాయిదా..ఎప్పుడంటే?

Also Read: Vaibhav Suryavanshi Record: బాబర్ ఆజం రికార్డుపై వైభవ్ గురి..సెమీస్‌లో 103 పరుగులు చేస్తే కొత్త చరిత్ర!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 05, 2026 07:16:32
Ghawcqol, Ghazni:

Taliban New Law On Women: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల స్వేచ్ఛపై తాలిబన్ ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే విద్య, ఉద్యోగాల విషయంలో అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్న అక్కడి మహిళలకు, ఇప్పుడు వ్యక్తిగత ప్రయాణాల విషయంలోనూ కొత్త కఠిన చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

సాధారణంగా దంపతుల మధ్య గొడవలు జరిగినప్పుడు లేదా మనస్పర్థలు వచ్చినప్పుడు భార్యలు తమ పుట్టింటికో లేదా బంధువుల ఇంటికో వెళ్లడం సహజం. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలా చేయడం ఇకపై నేరం కానుంది.

ఏంటీ కొత్త నిబంధన?
తాలిబన్ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏ మహిళ అయినా తన బంధువుల ఇంటికి వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా తన భర్త నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. భర్త అనుమతి లేకుండా ఇల్లు దాటి బంధువుల దగ్గరకు వెళ్లినట్లు తేలితే, ఆ మహిళకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారు.

ఎందుకు ఈ నిర్ణయం?
కుటుంబ వ్యవస్థను కాపాడటం, సంప్రదాయాలను గౌరవించడం అనే సాకుతో తాలిబన్లు ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు జరిగినప్పుడు మహిళలు ఇల్లు వదిలి వెళ్లడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని వారు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళల కదలికలపై భర్తలకు పూర్తి నియంత్రణను కట్టబెట్టారని అంటున్నారు.

ఈ అమానవీయ చట్టంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో పార్కులు, జిమ్ములు, విద్యా సంస్థలకు దూరమైన ఆఫ్ఘన్ మహిళల ప్రాథమిక హక్కులను ఈ చట్టం పూర్తిగా కాలరాస్తోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భర్త వేధింపులకు గురిచేస్తున్నా కూడా అనుమతి లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి కల్పించడం వల్ల మహిళల భద్రత గాలిలో దీపంలా మారుతుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో రోజురోజుకూ మహిళలపై ఆంక్షలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కొత్త జైలు శిక్ష నిబంధనతో అక్కడి స్త్రీలు తమ సొంత బంధువులను కలుసుకోవడానికి కూడా భయం నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: Vahini Death News: ప్రముఖ నటి మృతి..శోకసంద్రంలో టాలీవుడ్..వైద్యానికి డబ్బు లేక చివరికి ఇలా!

Also Read: India US Trade Deal: అమెరికా బెదిరింపులకు భారత్ చెక్..డోభాల్-మార్కో రూబియో భేటీలో సంచలన విషయాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 06:43:56
Vizianagaram, Andhra Pradesh:

Actress Vahini Passed Away: తెలుగు బుల్లితెర, సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి వాహిని (వాసవి అలియాస్ పద్మ) బుధవారం కన్నుమూశారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఆమెను చుట్టుముట్టడంతో చివరకు విజయనగరంలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. నటి వాహిని మరణవార్త పరిశ్రమలో కలకలం రేపింది. ముఖ్యంగా ఆమె ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడిన తీరు అందరినీ కలిచివేస్తోంది.

సినీ ప్రస్థానం
1978లో విజయనగరంలో జన్మించిన వాహిని, 'జయ వాహిని' పేరుతో గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సీరియల్స్ ద్వారా గృహిణిలకు దగ్గరయ్యారు. 2019లో వచ్చిన 'రఘుపతి వెంకయ్య నాయుడు' చిత్రంలో నరేష్ సరసన నటించారు. ఆమె చివరిగా 'బహిర్భూమి' అనే చిత్రంలో కనిపించారు.

ఆర్థిక కష్టాలు, అనారోగ్యం
వాహిని గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స కోసం తన వద్ద ఉన్నదంతా ఖర్చైపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా చితికిపోయారు. వాహిని దీనస్థితిని చూసి నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరించారు. ఇండస్ట్రీలోని పలువురు నటులు ఆర్థిక సహాయం అందించినప్పటికీ, క్యాన్సర్ ముదిరిపోవడంతో పరిస్థితి విషమించింది.

వాహిని మరణవార్తను కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. "మా ఇళ్లు విజయనగరంలో పక్కపక్కనే ఉండేవి. చిన్నప్పటి నుంచి ఆమె నాకు తెలుసు. నా సోదరిని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించాను, కానీ ఫలితం లేకపోయింది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో, వైద్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను విజయనగరం తరలించగా, బుధవారం సాయంత్రం ఆమె ప్రాణాలు విడిచారు.

ఒకప్పుడు కెమెరా ముందు నవ్వుతూ కనిపించిన నటి, చివరకు వైద్యానికి కూడా డబ్బు లేని స్థితిలో ప్రాణాలు కోల్పోవడం సినీ రంగంలోని చీకటి కోణాన్ని ప్రతిబింబిస్తోంది. వాహిని మృతికి పలువురు టీవీ నటులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Schools And Colleges: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీల్లోనే సదుపాయం.. అది కూడా పూర్తిగా ఉచితం ఫ్రీ!

Also Read: TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 06:15:50
Nunna, Vijayawada, Andhra Pradesh:

Free Aadhaar Update For Students AP: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఆధార్ వివరాల అప్‌డేట్ కోసం కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. విద్యార్థులు తమ విద్యా సంస్థల్లోనే ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.

చిన్న వయసులో ఆధార్ తీసుకున్న విద్యార్థులు, వయసు పెరిగే కొద్దీ తమ బయోమెట్రిక్ (వేలిముద్రలు, ఐరిస్) వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని నిబంధన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లోనే ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తోంది.

ఫిబ్రవరి నెల షెడ్యూల్ ఇక్కడే..
ఈ నెలలో రెండు విడతలుగా ఈ ప్రత్యేక క్యాంపులు జరగనున్నాయి.
మొదటి విడత: ఫిబ్రవరి 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు.
రెండో విడత: ఫిబ్రవరి 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు.

బయట ఆధార్ సెంటర్లలో అప్‌డేషన్ కోసం రుసుము వసూలు చేస్తారు. కానీ, 5 నుండి 17 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు ఈ స్కూల్ క్యాంపుల్లో ఉచితంగా అప్‌డేట్ చేయించుకోవచ్చు. గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా స్కూళ్లకు వచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆధార్ సెంటర్ల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు, ప్రయాణ ఖర్చులు కూడా తప్పుతాయి.

ఎందుకు అప్‌డేట్ చేయించుకోవాలి?
చిన్నప్పుడు తీసుకున్న ఆధార్‌లోని బయోమెట్రిక్ వివరాలు పెద్దయ్యాక మారతాయి. వీటిని అప్‌డేట్ చేయకపోతే.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఉన్నత చదువుల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తులో ఆధార్ కార్డు చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉంది.

తెలంగాణలోనూ ఇదే సదుపాయం
ఏపీ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సంబంధిత మండల విద్యాశాఖాధికారిని (MEO) సంప్రదించవచ్చు.

విద్యార్థుల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ అప్‌డేట్ ద్వారా ప్రభుత్వ పథకాలు, విద్యా సంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు.

Also Read: TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతారు!

Also Read: Jabardasth Bobby Accident: జబర్దస్త్ నటుడు మృతి..రాజమండ్రి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..కన్నీరుమున్నీరైన సుమ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 05:46:25
Hyderabad, Telangana:

India America Trade Deal Latest News: అమెరికా-భారత్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. టారిఫ్‌ల విషయంలో అమెరికా బెదిరింపులకు భారత్ ఏమాత్రం తలొగ్గలేదని, అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ వ్యవహరించిన తీరు ఇరుదేశాల మధ్య ఒప్పందానికి దారితీసిందని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది.

బెదిరింపులకు తావులేదు
సెప్టెంబరులో అజిత్ డోభాల్, యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య కీలక సమావేశం జరిగింది. ఆ సమయంలో డోభాల్ కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

"ట్రంప్ ప్రభుత్వం లేదా ఆయన సలహాదారులు ఇచ్చే టారిఫ్ హెచ్చరికలకు భారత్ భయపడదు. గౌరవప్రదమైన ఒప్పందం కుదరకపోతే, ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండటానికైనా మేము సిద్ధం" అని డోభాల్ తేల్చిచెప్పారు. ప్రధాని మోదీపై లేదా భారత విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఆపితేనే చర్చలు ముందుకు సాగుతాయని భారత్ స్పష్టం చేసింది.

వెనక్కి తగ్గిన ట్రంప్ యంత్రాంగం
ఈ భేటీ జరిగిన కొద్ది రోజులకే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అంతకుముందు భారత్‌ను 'టారిఫ్ కింగ్' అని విమర్శించిన ట్రంప్, ఆ తర్వాత శాంతించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. బహిరంగ విమర్శలు తగ్గడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ గాడిలో పడ్డాయి, ఇది చివరకు వాణిజ్య ఒప్పందానికి దారితీసింది.

ఈ రహస్య చర్చలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ.. "ప్రైవేటుగా జరిగిన దౌత్యపరమైన చర్చల వివరాలను వెల్లడించలేము" అని పేర్కొంది. అటు భారత ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

భారత దౌత్య విజయం
ఒకప్పుడు అమెరికా ఒత్తిడికి ఇతర దేశాలు లొంగిపోయేవి. కానీ, ఈ ఉదంతం ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ తన స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే అగ్రరాజ్యంతో సమాన స్థాయిలో చర్చలు జరిపింది.

Also Read: TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతారు!

Also REad: Peddi Postponed: బాబాయ్ కోసం రేసు నుంచి తప్పుకున్న అబ్బాయ్! పెద్ది సినిమా విడుదల వాయిదా..ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 05, 2026 04:52:58
Hyderabad, Telangana:

Sun Transit 2026 Effect On Zodiac: ఫిబ్రవరి 13న తేది జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు మకరం నుంచి శని పాలించే కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారంతో కెరీర్‌, వ్యాపారాల పరంగా కొన్ని రాశులవారి జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా సూర్యుడి ప్రభావంతో కొన్ని రాశులవారికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వృత్తి, వ్యాపారాల పరంగా కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా జీవితంలో ఎన్నడు పొందలేని అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే, ఈ సమయం ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్‌:
తుల రాశి
తుల రాశి వారికి ఈ సమయంలో బోలెడు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మీడియా, కళ, డిజైన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వ్యక్తులు భారీ లాభాలు పొందుతారు. పనుల్లో ప్రశంసలు కూడా పొందుతారు. విద్యార్థులు ఈ సమయంలో చదువుపై దృష్టి పెడుతారు. అలాగే ప్రేమ జీవితం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. 

మేష రాశి
మేష రాశివారికి సూర్యుడి ప్రభావంతో ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాల పరంగా జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే అదనపు ఆదాయం కూడా తిరిగి పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు సీనియర్ల నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

మిథున రాశి
మిథున రాశివారికి శక్తివంతమైన సూర్యుడి ప్రభావంతో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా పనుల్లో పదోన్నతలు కూడా లభిస్తాయి. వీరికి ఈ సమయంలో కొత్త బాధ్యతలు కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నవాయి. దీంతో పాటు ప్రయాణాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

సింహ రాశి
సింహ రాశివారికి కొత్త కెరీర్‌ ప్రారంభమవుతుంది. వీరికి భాగస్వామ్య జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు బంపర్‌ లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఇది అద్బుతమైన సమయంగా భావించవచ్చు. వీరు ఈ సమయంలో భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన కెరీర్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఇంటర్వ్యూలు, సమావేశాల్లో పల్గొనేవారికి మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. దీంతో పాటు విద్యార్థులకు ఈ సమయం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. విద్యార్థులు మానసికంగా చాలా బలంగా తయారవుతారు. అలాగే ఆర్థికంగా కూడా మేలు జరగుతుంది. 

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

కుంభ రాశి
కుంభ రాశివారికి కూడా ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. అలాగే నాయకత్వ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుటుంది. అంతేకాకుండా పనుల్లో బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఊహించని స్థాయిలో సూర్యుడి, శని ప్రభావంతో ఆర్థిక లాభాలు కలుగుతాయి. 

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 04, 2026 16:24:00
Hyderabad, Telangana:

KTR vs Revanth Reddy: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన అత్యంత నీచపు వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ భగ్గుమంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏకవచనంతో సంభోదించడడంపై గులాబీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. హార్వర్డ్‌ స్కూల్‌లో 500 రోజులు కోర్సులు చేసినా సంస్కారం నేర్చుకోకపోతే కుక్కతోక ఎప్పటికీ వంకరే అని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి స్థానం మురికికాలువే అని తెలిపారు.

Also Read: Harish Rao: కేసీఆర్ తెలంగాణ తీసుకురాకుంటే రేవంత్‌ రెడ్డి ఆంధ్రా మోచేతి నీళ్లు తాగేవాడు

మిర్యాలగూడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యక్తిగత దూషణలు.. నీచపు వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడాన్ని తులనాడారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పై మురికిమాటలు మాట్లాడే రేవంత్‌ రెడ్డి పాలన చేతకాని వాడే విషం చిమ్ముతున్నాడని కేటీఆర్‌ మండిపడ్డారు. 'మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు. పథకాలు వినిపించవు. వచ్చేది ఒక్కటే మురికి భాష. హార్వర్డ్‌లో 5 రోజులు కాదు.. 500 రోజులు కోర్సులు చేసినా సంస్కారం నేర్చుకోకపోతే కుక్కతోక ఎప్పటికీ వంకరే' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి.. ఉద్యమాల్ని నడిపి.. రాష్ట్రాన్ని సాధించి.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్‌పై మురికిమాటలు మాట్లాడే నీ స్థానం మురికి కాలువే' అని మండిపడ్డారు.

Also Read: YS Jagan: 'ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ.. చంద్రబాబుది జంగల్ రాజ్ పాలన': వైఎస్‌ జగన్‌

పాలనలో చేతకాని వాడే ప్రచారంలో విషం చిమ్ముతాడు. అది అహంకార లక్షణం కాదు. నీ పూర్తి అసమర్థతకు గుర్తు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 'చరిత్రను సృష్టించిన నాయకుడిని మాటలతో తక్కువ చేయలేరు. మురికి భాష మాట్లాడేవాడు తన మానసిక దరిద్రతనే ప్రజల ముందు బహిర్గతం చేస్తాడు' తెలిపారు. 'కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెడితే అది రాజవదు. అది సింహాసనానికే అవమానం. రాష్ట్రాన్ని సాధించినవాళ్లపై, రాష్ట్రాన్ని దారిలో పెట్టినవాళ్లపై నోరు విప్పే నైతిక హక్కు రేవంత్‌ రెడ్డికి లేదు. కేసీఆర్ చరిత్రను నీ మాటలు మసకబార్చలేవని కానీ నీ స్థాయిని మాత్రం. నీ మాటలే తెలంగాణ ప్రజలకు రోజురోజుకీ మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి' అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: YS Sharmila: 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం.. గ్రామ్‌ జీ పేదల పొట్ట కొట్టే పథకం'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 04, 2026 14:26:49
Medak, Telangana:

Harish Rao vs Revanth Reddy: 'కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక.. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలు మారుస్తున్నారు' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11వ తేదీలోగా రైతుబంధు ఇవ్వకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు ఇడుస్తారు.. నిన్ను చీర్చి చింత కడతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచే దమ్ములేక గులాబీ పార్టీ అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు.. వడ్డీతో సహా చెల్లిస్తాం గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు. 'తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన  మహా నాయకుడు కేసీఆర్.. పీసీసీ పదవిని రూ.50 కోట్లకు కొన్న చరిత్ర నీది. తెలంగాణ కోసం పదవులులేదని కాదు.. ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్' అని వివరించారు.

Also Read: Revanth Reddy: రైతులకు రేవంత్‌ రెడ్డి శుభవార్త.. ఎన్నికలు ముగియగానే రైతు భరోసా డబ్బులు

మెదక్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు సంచలన ప్రసంగం చేశారు. మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి చేసిన నీచపు వ్యాఖ్యలపై హరీశ్‌ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాష, పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని అడుగుతున్నా. అవ్వతాతలు రూ. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్? అని అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా?' అని మండిపడ్డారు.

Also Read: YS Jagan: 'ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ.. చంద్రబాబుది జంగల్ రాజ్ పాలన': వైఎస్‌ జగన్‌

'బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా! ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ.2,500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం సాగదు ఖబడ్దార్‌' అని రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. 'తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్. కేసీఆర్ చెబితే మేము కూడా పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి నువ్వు? రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ పంపిన దొంగవు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహివి' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు గుర్తుచేశారు.

Also Read: YS Sharmila: 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం.. గ్రామ్‌ జీ పేదల పొట్ట కొట్టే పథకం'

'కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తీసుకురావడంతోనే ఈరోజు సీఎం కుర్చీలో ఉన్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ.. బ్యాగులు మోసుకుంటూ బతికేవాడివి' అని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా ఉంటే మా అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? జనం మీకు ఓటు వేయరని అర్థమై పోలీసులతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కండువాలు కప్పుతున్నారు. ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకుపోతున్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటాం. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం' అని హెచ్చరించారు.

'ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. నిన్ను  చీరిచింతకు చెండాడుతారు' అని రేవంత్ రెడ్డికి హరీశ్‌ రావు వార్నింగ్‌ ఇచ్చారు. 'రుణమాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడివి నువ్వు. నీ అబద్ధాలను రైతులు నమ్మే స్థితిలో లేరు. కాంగ్రెస్ వచ్చాక ఇక్కడ ఒక్క రూపాయి పని జరగలేదు. మెదక్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు' అని విమర్శించారు. కాంగ్రెస్ గూంండా రాజకీయాన్ని, మోసాలను ఎండగట్టండి అని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీశ్‌ రావు సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 04, 2026 13:27:03
Guntur, Andhra Pradesh:

YS Jagan Press Meet: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని.. జంగల్ రాజ్ పాలన రాష్ట్రంలో నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న విడుదల రజనీ, బొల్లా బ్రహ్మనాయుడు ఇప్పుడు అంబటి రాంబాబుపై జరిగిన దాడి విషయంలో జంగల్ రాజు పాలన కనిపిస్తోందని మండిపడ్డారు. బిహార్‌లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏపీలో అలా జరుగుతోందని విమర్శించారు.

Also Read: Revanth Reddy: రైతులకు రేవంత్‌ రెడ్డి శుభవార్త.. ఎన్నికలు ముగియగానే రైతు భరోసా డబ్బులు

గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోపాటు పవన్‌ కల్యాణ్‌, పోలీసుల వైఖరిని తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అంబటి రాంబాబు చేసిన తప్పేంటి? ఎందుకు దాడి చేశారు? అరెస్ట్‌ చేశారు?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Also Read: YS Sharmila: 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం.. గ్రామ్‌ జీ పేదల పొట్ట కొట్టే పథకం'

తిరుమల లడ్డూ వివాదం బెడిసికొట్టడంతో తమ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబుని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అంబటి రాంబాబు మాదిరి దాడి చేశారని మండిపడ్డారు. తప్పుడు సమాచారాలతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో  పంది మాంసం కొవ్వు ఉందని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తుంది. జంతు మాంసం కొవ్వు ఉందని మన వెంకటేశ్వర స్వామి పేరుని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. టీటీడీ నెయ్యి కల్తీపై ఎన్ డి ఆర్ ఐ కేంద్రానికి చెందిన ల్యాబులు టెస్టు శాంపిల్‌పై విశ్లేషణ చేశారు. ఇచ్చిన వివరణలో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని నిర్ధారించారు' అని వైఎస్‌ జగన్‌ వివరించారు. తప్పు చేసి ఉంటే సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కరుణాకర్ రెడ్డి పేరు, వైవీ సుబ్బారెడ్డి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే వీళ్లని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.

Also Read: Arava Sridhar: ఇది నాకు, వీణకు మధ్య వ్యక్తిగత సంబంధం: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌

'సీబీఐ క్లీన్‌చీట్ ఇస్తుంది. ఎన్‌బీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులు క్లీన్‌చీట్ ఇస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి ఈ కేసుపై సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సీబీఐ విచారణకు ఆదేశించింది. వాళ్లు విచారణ చేపట్టి ఎవరూ తప్పు చేయలేదని నిర్ధారించారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ అనే వ్యక్తులు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరాలి' అని చంద్రబాబును వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 'తప్పుడు సమాచారాలతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ఎవరికైనా ఉందా? ఇదే సమాచారంతో మేము ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా?' అని ప్రశ్నించారు.

Also Read: Wild Tiger: రాజమండ్రి ప్రజలకు బిగ్‌ అలర్ట్.. జనారణ్యంలో చిరుతపులి సంచారం

'అబద్దాలు చెబుతూ మోసం చేస్తూ ప్రజలను వక్రీకరిస్తున్నారు. చంద్రబాబుని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అంబటి రాంబాబుపై దాడి చేశారు. చంద్రబాబుకి జ్ఞానం రావాలని గుడిలో పూజ చేసి వస్తున్న సమయంలో ఏకంగా కట్టలు పట్టుకొని దాడులు చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేసిన పరిస్థితి ఉంది' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 'బూతులు తిడుతూ అంబటి రాంబాబు కారుపై దాడులు చేస్తే.. ఒక్కరిపై ఎంతమంది దాడి చేస్తే రాంబాబు వాళ్లు తిట్టిన బూతులకు ప్రతిస్పందించారు. ప్రతిస్పందించే సమయంలో ఒక్కడే ఉండడంతో సహనం కోల్పోయారని వివరించారు.

'మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిస్పందించే క్రమంలో బూతులు తిట్టారు. ఇంట్లో జరిగినదంతా మీడియా ముందు అంబటి రాంబాబు వివరించారు. సంస్కారం ఉన్న వ్యక్తిగా అంబటి రాంబాబు నేను తిట్టకుండా ఉండాల్సిందని వివరణ కూడా ఇచ్చారు. ఆయన చూపించిన సంస్కారానికి నిజంగా పొగడాలి. చాతనైతే పొగడాల్సిన వాళ్లు దానిని వక్రీకరిస్తూ ఇంటిపై దాడి చేశారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 04, 2026 12:48:33
Miryalaguda, Telangana:

Rythu Bharosa Scheme: మున్సిపల్‌ ఎన్నికల వేళ రేవంత్‌ రెడ్డి భారీ శుభవార్త ప్రకటించారు. రైతులకు సంబంధించిన పెట్టుబడి సహాయం పథకం రైతు భరోసాను మున్సిపల్‌ ఎన్నికల తర్వాత వేస్తామని హామీ ఇచ్చారు. రానున్న బడ్జెట్‌లో మరింత మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే మున్సిపాలిటీలను అద్దంలా చేస్తామని చెప్పారు. తాము ఇచ్చిన పథకాలను గుర్తుచేసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: YS Sharmila: 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం.. గ్రామ్‌ జీ పేదల పొట్ట కొట్టే పథకం'

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలం గూడూరులో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కీలక ప్రసంగం చేశారు. మున్సిపల్ ఎన్నికలు‌ ముగియగానే రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Arava Sridhar: ఇది నాకు, వీణకు మధ్య వ్యక్తిగత సంబంధం: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌

'పదేళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 3.15 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. గతంలో రేషన్ కార్డులపై ఇచ్చిన దొడ్డు బియ్యం మిల్లర్లు, బర్రెలకు దాణాగా మారింది. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ అన్నారు. సన్నధాన్యం పండించండి బోనస్ ఇస్తామని మేం అన్నాం. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. పదేళ్ల పాలనలో తెలంగాణను దోచుకున్నారని.. పెళ్లాం మొగుడు మాట్లాడుతున్నా ఫోన్లు విన్నారని ఆరోపించారు.

Also Read: Wild Tiger: రాజమండ్రి ప్రజలకు బిగ్‌ అలర్ట్.. జనారణ్యంలో చిరుతపులి సంచారం

'ఫోన్ ట్యాపింగ్ వింటే పోలీసులు నోటీసులు ఇచ్చారు. నీకు నోటీసు ఇస్తే తెలంగాణలు ఇచ్చినట్లే‌నా. అలా అయితే మీ ఫాం హౌసులు తెలంగాణ సమాజానికి ఇస్తారా' అని రేవంత్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం చనిపోయి‌‌ శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ ఎక్కడ ఉందో కూడా తెలియదని చెప్పారు. తెలంగాణ సమాజం ఎదుట ముక్కు నేలకు రాయాలని ప్రతిపక్షాలకు సూచించారు. 

'ఆనాడు బతుకమ్మ చీరలు‌ ఇస్తే పిట్టలను బెదిరించడానికే పనికి వచ్చాయి. జానారెడ్డి ఇంట్లో చెప్పులు మోసినోడు భాస్కర్ రావు. కాంగ్రెస్ పార్టీలో గెలిపిస్తే ఎర్రవెల్లిలో కేసీఆర్ కాళ్ల వద్ద మిర్యాలగూడ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిండు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తున్నావట భాస్కర్ రావు చింతపండు అవుతుందని హెచ్చరించారు. జానారెడ్డిలా తమకు పెద్ద మనుసు లేదని.. భాస్కర్ రావుకు చింతపండు చేస్తామని పునరుద్ఘాటించారు. అవతలి వాళ్లను గెలిపిస్తే మున్సిపాలిటీల్లో పనులు కావని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 12:07:47
Hyderabad, Telangana:

Peddi Release Postponed: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య ఉన్న బాబాయ్-అబ్బాయ్ అనుబంధం మరోసారి నిరూపితమైంది. రామ్ చరణ్ తన పుట్టినరోజు కానుకగా విడుదల కావాల్సిన తన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదలను వాయిదా వేసుకున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న 'పెద్ది' చిత్రం వాస్తవానికి రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే, బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం చరణ్ వెనక్కి తగ్గారు.

కారణం ఏంటి?
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మార్చి 26న విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో బాబాయ్-అబ్బాయ్ సినిమాలు తలపడితే థియేటర్ల లభ్యత తగ్గి, కలెక్షన్లపై ప్రభావం పడుతుందని రామ్ చరణ్ భావించారు. అందుకే బాబాయ్ సినిమాకు పూర్తి స్థాయిలో థియేటర్లు ఉండాలనే ఉద్దేశంతో తన సినిమాను ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.

ఏప్రిల్ 30న 'మెగా' జాతర
సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న 'పెద్ది' ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మార్చిలో పవన్ కల్యాణ్, ఏప్రిల్‌లో రామ్ చరణ్ చిత్రాలతో మెగా అభిమానులకు రెండు నెలల పాటు పండగే అని చెప్పాలి.

ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'అచ్చమ్మ' అనే పాత్రలో నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.

వ్యక్తిగత కారణాలు కూడా..
సినిమా రిలీజ్ వాయిదాకు మరో కారణం కూడా ఉంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవల కవల పిల్లలు (ఒక పాప, ఒక బాబు) జన్మించారు. తన పిల్లలతో విలువైన సమయాన్ని గడపడం కోసం రామ్ చరణ్ షూటింగ్ నుండి చిన్న విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. బాబాయ్ సినిమాకు దారి వదిలి రామ్ చరణ్ చూపిన ఈ చొరవపై అటు మెగా అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

Also Read: Vaibhav Suryavanshi Record: బాబర్ ఆజం రికార్డుపై వైభవ్ గురి..సెమీస్‌లో 103 పరుగులు చేస్తే కొత్త చరిత్ర!

Also Read: Adani Data Center Vizag: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..అదానీ డేటా సెంటర్‌ భూ వివాదంపై కీలక ఆదేశాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 11:12:25
Hyderabad, Telangana:

Vaibhav Suryavanshi Vs Babar Azam: అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ గనుక చెలరేగితే, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నెలకొల్పిన రికార్డు కనుమరుగు కానుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో వైభవ్ ఇప్పటివరకు 196 పరుగులు (సగటు 39.20) చేసి ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే, సెమీఫైనల్ మ్యాచ్ అతనికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది.

బాబర్ ఆజం రికార్డు ఏమిటి?
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తన అండర్-19 వన్డే కెరీర్‌లో 35 ఇన్నింగ్స్‌లలో 1,271 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పరుగుల పరంగా బాబర్‌ను అధిగమించాలంటే వైభవ్‌కు ఇంకా 103 పరుగులు అవసరం.

ప్రస్తుతం అండర్-19 వన్డేల్లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీమ్ (1,261 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ టోర్నీ నుండి నిష్క్రమించడంతో, వైభవ్ అతన్ని దాటేసే అవకాశం ఉంది.

వైభవ్ ప్రస్తుత స్కోరు: 1,169 పరుగులు (23 ఇన్నింగ్స్‌ల్లో).

లక్ష్యం: అజీజుల్ హకీమ్‌ను దాటడానికి 93 పరుగులు, బాబర్ ఆజంను దాటడానికి 103 పరుగులు.

స్ట్రైక్ రేట్‌లో వైభవ్ టాప్!
మిగిలిన బ్యాటర్లతో పోలిస్తే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి అత్యంత వేగంగా ఉంటుంది. వైభవ్ స్ట్రైక్ రేట్ 158.18 (అండర్-19 చరిత్రలోనే ఇది అత్యుత్తమం)గా ఉంది. అయితే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ మాత్రం 73.85గా ఉండడం విశేషం.

ఆటగాడు ఇన్నింగ్స్ పరుగులు సగటు స్ట్రైక్ రేట్
అజీజుల్ హకీమ్ (బంగ్లా) 35 1,261 42.03 74.79
బాబర్ ఆజం (పాక్) 35 1,271 38.51 73.85
వైభవ్ సూర్యవంశీ (భారత్) 23 1,169 50.82 158.18

కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ స్థాయికి చేరుకున్న వైభవ్, సెమీఫైనల్‌లో సెంచరీ సాధిస్తే బాబర్ ఆజంను పక్కకు నెట్టి అండర్-19 వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కీలక ఆటగాళ్ల జాబితాలో చేరిపోతాడు. భారత్ ఫైనల్ చేరాలంటే కూడా వైభవ్ మెరుపులు జట్టుకు ఎంతో అవసరం.

Also REad: Adani Data Center Vizag: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..అదానీ డేటా సెంటర్‌ భూ వివాదంపై కీలక ఆదేశాలు!

Also Read: Jabardasth Bobby Accident: జబర్దస్త్ నటుడు మృతి..రాజమండ్రి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..కన్నీరుమున్నీరైన సుమ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 04, 2026 10:56:51
Hyderabad, Telangana:

Huge Anaconda Video Watch Now Here: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింతలు విశేషాలకు సంబంధించిన వీడియోలు మనకు కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోలకు జనాలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ముఖ్యంగా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలను వీక్షించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. 

తాజాగా కేవలం 9 సెకండ్ల నిడివి గల భారీ అనకొండకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పెద్ద పరిమాణం కలిగిన అనకొండ మీరు చూడొచ్చు. అయితే, ఈ పాము తన కంటే పరిమాణంలో పెద్దదిగా ఉన్న ఓ జీవిని అమాంతం మింగేయడానికి ప్రయత్నించింది.. అది అనుకున్న ప్రకారమే ఆ జీవిని అనకుండా మొత్తం మింగడానికి ప్రయత్నిస్తోంది.. ఈ సమయంలోనే దాని నోరుని పెద్దగా తెరిచి, సగం వరకు మింగేయడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. 

ఆ పాము ఆహారాన్ని సగం వరకు మాత్రమే నోట్లోకి లాక్కోవడం మీరు చూడొచ్చు.. ఆ తర్వాత ఆహారం పెద్దదిగా ఉండడంతో.. మరింత సగం లోపలికి లాక్కోలేకపోయింది.. చేసేదేమీ లేక ఆ పాము మింగుతున్న జీవిని నోటి భాగం గుండా బయటికి కక్కేసింది. ఇలా ఆ పాము సగం వరకు మింగిన జీవిని బయటికి కక్కేయడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. పాములు ఇతర జీవులను చంపుకొని తినడం ప్రకృతి ఆహారపు గొలుసులో భాగమైనప్పటికీ.. కానీ పాముల కంటే భారీ శరీరం కలిగిన జీవులను తినడానికి ప్రయత్నించడం వాటికే శాపమని ఈ వీడియో క్లియర్‌గా తెలుపుతోంది. 

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 57,000 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. పాము అంత పెద్ద జీవిని ఎలా మింగుతుంది? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమందైతే పాము దవడలు విరగడం వల్లే.. ఆ జీవిని బయటికి కక్కేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద హైలెట్‌గా మారింది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 04, 2026 10:43:57
Hyderabad, Telangana:

Baby Snake Video Watch Here: సాధారణంగా భూమిపైన కొన్ని పాములు మాత్రమే నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి. కానీ వందలో 80 శాతం పాములు మాత్రం గుడ్డు పెట్టి పిల్లలకు జన్మనిస్తాయి. ఇలాంటి సమయాల్లో పాములు తప్పకుండా వాటి పిల్లలను రక్షించుకోవడానికి గుడ్ల దగ్గరే పాడుగాపులు కాస్తూ ఉంటాయి. సాధారణంగా మనం సోషల్ మీడియాలో వైర్లు అవుతున్న ఎన్నో రకాల ఫార్ములకు సంబంధించిన వీడియోలు చూసాం.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వీటన్నిటికీ చాలా భిన్నమైంది గా భావించవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బేబీ స్నేక్ సంబంధించిన వీడియో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాము గుడ్డు నుంచి ఒక చిన్న పిల్ల బయటికి రావడం కనిపిస్తుంది.. వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి తెల్లని గుడ్డును పట్టుకొని.. ఉండడం మీరు చూడొచ్చు.. ఆ తర్వాత ఆ వ్యక్తి దాని పొరను మెల్లగా విడదీస్తూ కనిపించడం మీరు క్లియర్‌గా చూడవచ్చు. అప్పుడే మీకు ఆ గుడ్డు లోపల ఉన్న చిన్న పాము పిల్ల కనిపిస్తుంది. సాధారణంగా అప్పుడే పుట్టిన పాములు అంతగా విషం కలిగి ఉండవు..

ఆ వ్యక్తి గుడ్డు పెంకును కొద్దిగా తొలగించిన వెంటనే పాము.. నెమ్మదిగా తలను బయటికి పెట్టి.. చుట్టూ ఉన్న పరిసరాలను అటు ఇటు చూస్తూ ఉండడం మీరు గమనించవచ్చు.. అంతేకాకుండా ఆ బుల్లి పాము తన నాలుకను బయటపెట్టి పరిసరాలను క్లియర్గా చూడడం మీరు ఈ వీడియోలో ఎంతో స్పష్టంగా చూడవచ్చు.. ఆ తర్వాత ఈ చిన్న పాము గుడ్డు లోపలి నుంచి పూర్తిగా బయటికి వచ్చి అతని చేతిపై పాకుతూ ఉండేందుకు ప్రయత్నిస్తోంది. 

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఆ చిన్న పాము అతని చేతిపై పాకుతూ నెమ్మదిగా కదులుతూ ఉన్న అద్భుతమైన దృశ్యాలు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ పాము చాలా చిన్నదిగా ముదురు రంగు మచ్చలతో కూడిన చర్మం కలిగి ఉంది. ఇలాంటి అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 10:35:45
Hyderabad, Telangana:

Adani Data Center Vizag Land Dispute: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖపట్నంలోని భూ కేటాయింపుల వ్యవహారంలో హైకోర్టులో చుక్కెదురైంది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు వందల ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా కట్టబెట్టడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

విశాఖపట్నం శివారులోని అడవివరం, ముడసరిలోవ ప్రాంతాల్లో సుమారు 480 ఎకరాల భూమిని అదానీ గ్రూపు సంస్థలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది.

పిటిషనర్ వాదనలు
జై భీమ్ భారత్ పార్టీ (JBP) అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు ఈ కేటాయింపులను సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు. అయితే కేటాయించిన 480 ఎకరాల భూమి విలువ సుమారు రూ.5,000 కోట్లు ఉండొచ్చని వారు కోర్టుకు నివేదించారు.

2023 నాటి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ (జీవో నంబర్ 117) ప్రకారం.. పరిశ్రమలకు భూములను కేవలం లీజుకు మాత్రమే ఇవ్వాలి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే తదుపరి చర్యలు ఉండాలి. పరిశ్రమ ఏర్పాటు కాకముందే 'సేల్ డీడ్' రాసిస్తే, ఆ భూమిపై ప్రభుత్వం తన పూర్తి అధికారాలను కోల్పోతుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.

జీవోల జారీ - ప్రోత్సాహకాలు
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అదానీ సంస్థలకు అనుకూలంగా రెండు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జీవో 40 (11-10-2025): భూమితో పాటు రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రకటించింది.

జీవో 66 (02-12-2025): 480 ఎకరాల భూమిని తక్షణమే బదలాయించాలని అధికారులను ఆదేశించింది.

హైకోర్టు ధర్మాసనం సంధించిన ప్రశ్నలు
చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసింది.

1) ఉచితంగా భూమిని ఎలా బదలాయిస్తారు? ఏ చట్టం ఈ అధికారాలను ప్రభుత్వానికి ఇచ్చింది?

2) కేవలం లీజు పద్ధతిలో మాత్రమే భూములు ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పుడు, డైరెక్ట్ సేల్ డీడ్ ఎలా రాస్తారు?

3) ఇప్పటి వరకు ఆ కంపెనీల పేరుతో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా అని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రభుత్వ స్పందన
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (AG) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఈ జీవోల వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోవడానికి సమయం కావాలని కోరారు. ప్రభుత్వం దీనిపై సమగ్రమైన కౌంటర్ దాఖలు చేస్తుందని కోర్టుకు విన్నవించారు.

హైకోర్టు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ, పూర్తి వివరాలతో కూడిన ప్రమాణ పత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేటాయింపులకు సంబంధించిన అన్ని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Also Read: Jabardasth Bobby Accident: జబర్దస్త్ నటుడు మృతి..రాజమండ్రి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..కన్నీరుమున్నీరైన సుమ!

Also Read: DA Hike 2026: రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్..5 శాతం పెరగనున్న డీఏ..ఎవరికి ఎంత వస్తుంది? ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top