Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500003
Saudi-UAE Tension: యుద్ధంలోకి రెండు ముస్లిం దేశాలు.. యెమెన్ భూమి ఎందుకు ఎర్రగా మారింది..?
BBhoomi
Jan 03, 2026 05:39:01
Secunderabad, Telangana

Saudi Arabia – UAE Conflict: మధ్యప్రాచ్య రాజకీయాల్లో సౌదీ అరేబియా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్..ఈ రెండు మిత్ర దేశాలుగా మంచి పేరు తెచ్చుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో సున్నీ శక్తిగా.. చమురు సంపదతో.. వ్యూహాత్మక ప్రాభవంతో ఈ రెండు దేశాలు దశాబ్దాల పాటు విడదీయరాని మిత్రులుగా కొనసాగాయి. సంక్షోభ సమయాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకునే విషయంలో ఈ రెండు దేశాలు కలిసి అడుగులు వేసాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఒకప్పుడు ఒకే శత్రువుపై కలిసి యుద్ధం చేసిన ఈ మిత్రదేశాలు.. ఇప్పుడు ఒకరి రక్తం మరొకరు చిందించే స్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలకు యెమెన్ కీలక బింధువుగా మారింది. ఇప్పుడు యెమెన్ నేల మరోసారి రక్తంతో తడిసిపోయింది. ఈసారి హౌతీలు కాదు.. ఉగ్రవాదులు కాదు… గల్ఫ్‌లోని రెండు ప్రధాన మిత్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణే దీనికి కారణం. సౌదీ అరేబియా చేసిన వైమానిక దాడుల్లో UAE మద్దతుగల యోధులు మరణించడం మధ్యప్రాచ్య రాజకీయాలను పూర్తిగా కొత్త మలుపు తిప్పింది.

మిత్రత్వం విరిగిన యుద్ధభూమి:
యెమెన్ ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా అంతర్యుద్ధంతో అల్లాడుతోంది. 2015లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించడంతో ఈ యుద్ధం మొదలైంది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఇవ్వడంతో..  సౌదీ అరేబియా దీనిని తన భద్రతకు ముప్పుగా భావించింది. అప్పట్లో UAE కూడా సౌదీతో చేతులు కలిపి యెమెన్‌లోకి దిగింది. ఈ రెండు దేశాల నేతృత్వంలో ఒక సైనిక సంకీర్ణం ఏర్పడింది. లక్ష్యం ఒక్కటే.. ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకోవడం.. హౌతీలను నియంత్రించడం. ప్రారంభంలో సౌదీ, UAE దళాలు కలిసి వైమానిక దాడులు చేశాయి. భూభాగాన్ని నియంత్రించాయి. దక్షిణ యెమెన్‌లో కీలక ప్రాంతాలపై పట్టు సాధించాయి. అయితే కాలక్రమేణా ఈ రెండు దేశాల లక్ష్యాలు వేరు కావడం మొదలైంది. ఇక్కడే మిత్రత్వంలో పగుళ్లు ఏర్పడ్డాయి. 

విభేదాలకు కారణం.. యుద్ధం ఒకటే.. లక్ష్యాలే వేరు: 
సౌదీ అరేబియా యెమెన్‌ను ఒకే దేశంగా ఉంచాలని కోరుకుంది. కేంద్ర ప్రభుత్వం బలపడాలని భావించింది. అయితే UAE మాత్రం దక్షిణ యెమెన్‌ను ప్రత్యేక దేశంగా విడదీయాలన్న ఆలోచనకు దగ్గరైంది. ఈ దిశగా దక్షిణ యెమెన్ స్వాతంత్ర్యాన్ని కోరే సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (STC) అనే వేర్పాటువాద గ్రూప్‌కు UAE మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. STC యోధులకు ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం అందింది. దీంతో దక్షిణ యెమెన్‌లో UAE ప్రభావం వేగంగా పెరిగింది. ఇదే సౌదీ అరేబియాకు అసహనాన్ని కలిగించింది. ముఖ్యంగా చమురు సంపన్నమైన హద్రామౌత్, మహ్రా వంటి ప్రావిన్సులపై STC పట్టు సాధించడం సౌదీకి పెద్ద హెచ్చరికగా మారింది.

అసలు మంట రాజేసింది హద్రామౌత్‌నే  :
హద్రామౌత్ యెమెన్‌లోనే అతిపెద్ద ప్రావిన్స్. సౌదీ సరిహద్దుకు సమీపంలో ఉండటం, చమురు వనరులు ఉండటం వల్ల ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారింది. STC ఈ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడం సౌదీ అరేబియాకు నేరుగా సవాల్ చేసినట్టే. దీంతో UAEపై సౌదీ అరేబియా ఒత్తిడి పెంచింది.  మీ దళాలను ఉపసంహరించుకోండి, STCకి మద్దతు ఆపండి అంటూ హెచ్చరికలు జారీ చేసింది. చివరకు 24 గంటల అల్టిమేటం కూడా ఇచ్చింది. అయితే UAE ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి.

వైమానిక దాడులు..మిత్రత్వానికి ముగింపు?
2026 జనవరి 2న పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లోని హద్రామౌత్ ప్రావిన్స్‌లో STC శిబిరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 20 మందికి పైగా STC యోధులు మరణించారు. వీరు UAE మద్దతుగల దళాలేనన్న విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇంతకు ముందు, డిసెంబర్ చివర్లో ముకల్లా పోర్ట్‌పై సౌదీ దాడి చేసింది. అక్కడ UAE నుంచి ఆయుధాలను మోసుకొస్తున్న నౌకలు ఉన్నాయన్నదే సౌదీ వాదన. ఈ ఆయుధాలు STCకి చేరుతున్నాయని, ఇది సంకీర్ణ నియమాలకు విరుద్ధమని సౌదీ పేర్కొంది. ఇదే రెండు దేశాల మధ్య బహిరంగ శత్రుత్వానికి బీజం వేసింది.

Also Read: Gold Investment: ఈ రోజు మీరు రూ. 3లక్షలు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే.. డిసెంబర్‎లో ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..!!  

STC ప్రతిస్పందన అస్తిత్వ యుద్ధం:
సౌదీ దాడులను STC తీవ్రంగా ఖండించింది. ఇది యుద్ధ ప్రకటనగా అభివర్ణించింది. సౌదీ మద్దతుగల దళాలతో నిర్ణయాత్మక పోరాటం తప్పదని ప్రకటించింది. అంతేకాదు, సౌదీ అరేబియా ముస్లిం బ్రదర్‌హుడ్, అల్-ఖైదా వంటి గ్రూపులతో పరోక్షంగా కలిసి పనిచేస్తోందన్న ఆరోపణలు కూడా చేసింది.ఇక UAE మాత్రం బయటకు శాంతి సందేశాలే ఇస్తోంది. యెమెన్ నుంచి దళాలను ఉపసంహరిస్తున్నామని ప్రకటించినా..సౌదీ చర్యలను  మోసపూరిత దాడిగా విమర్శించింది.

ఈ శత్రుత్వం ఎవరికీ లాభం?
సౌదీ–UAE ఘర్షణ యెమెన్‌కే పరిమితం కాదు. ఇది మొత్తం మధ్యప్రాచ్యాన్ని కుదిపేస్తుంది. రెండు దేశాలు ప్రధాన చమురు ఉత్పత్తిదారులు కావడంతో, ఈ వివాదం చమురు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎర్ర సముద్ర తీరంలో హౌతీలు తమ ప్రభావాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఈ విభేదాలను ఇరాన్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే ప్రమాదం కూడా ఉంది. అసలు నష్టపోయేది మాత్రం యెమెన్ ప్రజలే. ఇప్పటికే ఆకలి, వ్యాధులు, యుద్ధంతో అల్లాడుతున్న కోట్లాది మంది ఇప్పుడు మరో ఘర్షణ భయంతో జీవిస్తున్నారు. ఒకప్పుడు యెమెన్‌ను  రక్షించడానికి  వచ్చిన మిత్రదేశాలే ఇప్పుడు ఆ దేశాన్ని మరోసారి యుద్ధభూమిగా మార్చేశాయి.

Also Read: Business Ideas: కేసీఆర్‌ ఐడియా అదుర్స్.. ఈ చిన్న ట్రిక్‎తో  టన్నుల కొద్దీ క్యాప్సికం పండిస్తున్నారు.. ఆ ట్రిక్ తెలుసుకుంటే మీ ఫేట్ మారడం గ్యారెంటీ..!!  

గల్ఫ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం:
సౌదీ అరేబియా, UAE మధ్య శత్రుత్వం గల్ఫ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆధిపత్యం, వ్యూహాత్మక నియంత్రణ, ప్రాంతీయ నాయకత్వం కోసం జరుగుతున్న ఈ పోరు ఎంత దూరం వెళ్తుందో ఇంకా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం… మిత్రత్వం అనే మాట ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య గతం అయిపోయింది. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం ఒక కొత్త, ప్రమాదకరమైన రాజకీయ సమీకరణ వైపు అడుగులు వేస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Krindinti
Jan 03, 2026 07:40:28
Hyderabad, Telangana:

Eye Care Clinics in Telangana: రాష్ట్ర ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్‌’ (Eye Care Clinics) ఏర్పాటు చేయబోతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్లు ప్రారంభించామని, కేన్సర్ స్క్రీనింగ్, డయాగ్నసిస్, కీమోథెరపీ వంటి సేవలు ఈ క్లినిక్‌లలో అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కేన్సర్ పేషెంట్లు కీమో థెరపీ కోసం హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరం లేకుండా, జిల్లా కేంద్రాల్లోని డే కేర్ కేన్సర్ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు.దీంతో ఎంఎన్‌జే హాస్పిటల్‌ మీద పేషెంట్ లోడ్ కూడా తగ్గిందని మంత్రి తెలిపారు. కేన్సర్ కేర్ సెంటర్ల తరహాలోనే, ప్రజలకు నిరంతర కంటి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఐ కేర్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లడించిన ముఖ్యాంశాలు:

‘ఐ కేర్ క్లినిక్స్‌’ - నూతన విధానం:

ప్రస్తుత జీవనశైలి, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో కంటి సమస్యలు అధికమవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని కంటి వెలుగు తరహాలో తాత్కాలిక శిబిరాలకు పరిమితం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన వైద్యం అందించేలా ‘ఐ కేర్ క్లినిక్స్‌’ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్లినిక్‌ల నిర్వహణలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ‘హబ్’ (Hub)గా వ్యవహరిస్తుంది. హబ్, క్లినిక్‌ల మధ్య సమన్వయం కోసం, స్క్రీనింగ్, సర్జరీలను పర్యవేక్షించడానికి ఒక ఆప్తాల్మాలజీ నిపుణుడిని ‘నోడల్ ఆఫీసర్‌’గా నియమించాము. రాష్ట్రంలో కంటి వ్యాధుల తీవ్రతను అధ్యయనం చేయడానికి, సరైన చికిత్సా విధానాలను సిఫార్సు చేయడానికి ఇప్పటికే ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఐ కేర్ సెంటర్ల పనితీరుపై, విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటాం.

గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మంత్రి సభ ముందుంచారు. 2018లో తొలి విడత, 2023లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారని మంత్రి వెల్లడించారు. స్క్రీనింగ్, కండ్లద్దాల పంపిణీకే కార్యక్రమాన్ని పరిమితం చేశారని మంత్రి గుర్తు చేశారు. 9.3 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం అని డాక్టర్లు గుర్తించినప్పటికీ, ఆపరేషన్లు చేయించకుండానే కార్యక్రమాన్ని ముగించారని మంత్రి తెలిపారు.

పటిష్టమైన వ్యవస్థాగత సేవలు: దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో కంటి వైద్యానికి సంబంధించిన సేవలు అందుబాటులోకి నాటి ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. 1951లో ఏర్పాటైన సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఏడు దశాబ్దాలుగా సేవలు అందిస్తోందన్నారు.

ప్రస్తుతం 35 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (GGH), 64 ఏరియా ఆసుపత్రుల్లో కంటి వైద్య విభాగాలున్నాయి. ప్రతి జనరల్ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు అందుబాటులో ఉండగా.. ఏరియా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. అన్ని చోట్ల కంటి శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి.

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం (NPCB):
==> 1976 నుంచి అమలవుతున్న జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రజలకు కంటి వైద్య సేవలు అందిస్తున్నాం.
==> గత రెండేళ్లలో (2024 మరియు 2025లో కలిపి) రికార్డు స్థాయిలో 6,12,973 మందికి క్యాటరాక్ట్ (శుక్లాల) ఆపరేషన్లు విజయవంతంగా చేయించాం.
==> పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి.. గత రెండేళ్లలో 33,65,832 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైన 76,176 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం.
==> కేవలం పరీక్షలే కాకుండా, కంటి సమస్యలున్న ప్రతి ఒక్కరికీ అవసరమైన శస్త్రచికిత్సలు కూడా అందించి సంపూర్ణ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

0
comment0
Report
HDHarish Darla
Jan 03, 2026 06:34:59
Hyderabad, Telangana:

TSRTC Recruitment 2025 Apply Online: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఖాళీల వివరాలు
మొత్తం 198 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ కోసం 84 పోస్టులు, అలాగే మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ కోసం 114 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు & వయోపరిమితి
ఈ పోస్టులకు విద్యార్హతగా సంబంధిత విభాగంలో అభ్యర్థులు కనీసం డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూలై 1, 2025 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య వయోపరిమితిని నిర్ణయించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అలాగే ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM) అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. వాటిలో పదో తరగతి సర్టిఫికేట్ (డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణ కోసం),  1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్),  తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్‌తో పాటు ఏప్రిల్ 1, 2025 తర్వాత పొందిన నాన్-క్రీమీ లేయర్ (BC అభ్యర్థులకు) లేదా EWS సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.

జీతం & ఎంపిక విధానం
ఎంపికైన వారికి నెలకు రూ. 27,080 నుండి రూ. 81,400 వరకు జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పోస్టుల కోసం రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 20, 2026 వరకు సమయం ఉంది.

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 చెల్లించాల్సి ఉంది. అభ్యర్థులు TGRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: Mumbai Affair Attack: న్యూఇయర్ వేళ ముంబై ఉలిక్కిపడే ఘటన..లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత!

Also Read: Dhoni IPL Retirement: సీఎస్‌కే అభిమానులకు బ్యాడ్‌న్యూస్..ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ..ఇక ఐపీఎల్‌కు 'తలా' సెలవు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 03, 2026 04:15:07
Secunderabad, Telangana:

 China Silver Market: బంగారం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన లోహంగా గుర్తింపు పొందింది. పసిడితో పాటు వెండి కూడా ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తూ పోటీ పడుతోంది. గత ఒకటి, రెండు సంవత్సరాలుగా బంగారం.. వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరినీ షాక్ గురి చేస్తోంది. ఎందుకంటే… ఏకంగా 15 కిలోల బరువున్న వెండి కడ్డీలను కూరగాయల మాదిరిగా రోడ్డు పక్కనే కుప్పలు కుప్పలుగా పోసి  విక్రయిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అవుతున్న  ఈ వీడియోలో..  రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలో వెండి కడ్డీలను కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొదట వీటిని చాలామంది ఇది నకిలీ వెండి అయి ఉంటుందేమోనని అనుమానించారు. కానీ వీడియోకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో అది పూర్తిగా స్వచ్ఛమైన వెండి అని తేలింది. అంతేకాదు.. ఆ వెండి అమ్మకానికి పెట్టిన ప్రాంతం కూడా చాలా ప్రత్యేకమైనదిగా తెలిసింది.

ఈ వైరల్ వీడియో చైనాకు చెందినదిగా ప్రూవ్ అయ్యింది. ఇది చైనాలోని అతిపెద్ద బంగారు, వెండి ఆభరణాల కేంద్రంగా పేరుగాంచిన షుయ్‌బీ (Shuibei) ప్రాంతంలో తీసిన వీడియో ఇది. షెన్‌జెన్ నగరంలోని లువోహు జిల్లాలో ఉన్న ఈ షుయ్‌బీ ప్రాంతాన్ని చైనా మొత్తం బంగారు వ్యాపారానికి గుండెకాయగా పరిగణిస్తుంటారు.  ఇక్కడ ప్రతిరోజూ టన్నుల కొద్దీ బంగారం, వెండి కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల తయారీదారులు, టోకు వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇక్కడికే వచ్చి భారీ లావాదేవీలు నిర్వహిస్తారు.

 

Also Read: Gold Investment: ఈ రోజు మీరు రూ. 3లక్షలు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే.. డిసెంబర్‎లో ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..!!  

ఈ క్రమంలోనే షుయ్‌బీ పరిసరాల్లోని ఒక రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద 15 కిలోల బరువున్న వెండి స్లాబ్‌లను బహిరంగంగా విక్రయించడమే ఈ వీడియోకు కారణమైంది. భారీ బరువున్న వెండి కడ్డీలను రోడ్డుపై కూరగాయల మాదిరిగా అమ్మడం సాధారణ ప్రజలకు ఇది షాకింగ్గా అనిపిస్తోంది.  అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు కళ్లబైర్లు కమ్మినట్లుగా స్పందిస్తున్నారు.  ఇది నిజమేనా?  అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ విక్రయిస్తున్న వెండి SGE స్లాబ్‌లుగా గుర్తించారు. SGE అంటే షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్. ఇది చైనాలో అధికారికంగా నియంత్రిత వస్తువుల మార్పిడి సంస్థ. SGE ద్వారా విక్రయించే వెండి సాధారణంగా 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఈ వెండిని పెట్టుబడుల కోసం మాత్రమే కాకుండా, ఆభరణాల తయారీ, పారిశ్రామిక అవసరాల కోసం కూడా వినియోగిస్తారు. అయితే ఈ 15 కిలోల వెండి స్లాబ్‌లు సాధారణ రిటైల్ కస్టమర్ల కోసం కాదని సమాచారం. పెద్ద ఆభరణాల తయారీ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, భారీ పెట్టుబడిదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి భారీ పరిమాణాల వెండి ఇక్కడ విక్రయిస్తారు. అయినప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో ఇలా అమ్మకాలు జరగడం అరుదైన విషయం కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగారం, వెండి వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందో చూపించే ఉదాహరణగా ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 

Also Read: Business Ideas: కేసీఆర్‌ ఐడియా అదుర్స్.. ఈ చిన్న ట్రిక్‎తో  టన్నుల కొద్దీ క్యాప్సికం పండిస్తున్నారు.. ఆ ట్రిక్ తెలుసుకుంటే మీ ఫేట్ మారడం గ్యారెంటీ..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
BBhoomi
Jan 03, 2026 03:04:03
Secunderabad, Telangana:

Gold Price Today: గత ఏడాది చివర్లో ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ బలపడుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే వరుసగా రెండో రోజు ధరలు పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడి, వెండికి డిమాండ్ స్పష్టంగా పెరుగుతోంది.

జనవరి 3వ తేదీ శనివారం ఉదయం మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే, బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే సుమారు రూ.1,150 పెరిగి రూ.1,36,210 స్థాయికి చేరింది. అలాగే 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.1,060 పెరిగి రూ.1,24,860 వద్ద కొనసాగుతోంది. ధరల పెరుగుదలతో ఆభరణాల కొనుగోలుదారులు కొంత ఆలోచనలో పడుతున్నా, పెట్టుబడిదారులు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు.

వెండి ధరలు మరింత వేగంగా ఎగబాకాయి. ఒక్కరోజులోనే కిలో వెండి ధర దాదాపు రూ.4,100 పెరిగి రూ.2,42,100కు చేరింది. పరిశ్రమల అవసరాలు పెరగడం, అంతర్జాతీయంగా వెండికి ఉన్న డిమాండ్ ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

Also Read: Gold Investment: ఈ రోజు మీరు రూ. 3లక్షలు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే.. డిసెంబర్‎లో ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..!!  

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్‌లో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు సుమారు 0.27 శాతం పెరిగి రూ.1,36,173కు చేరగా, మార్చి వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు దాదాపు రూ.9 వేల పెరుగుదలతో రూ.2,35,873 వద్ద ట్రేడైంది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు బలంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ స్పాట్ ధర ఔన్స్‌కు 4,332 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 72 డాలర్ల వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దేశంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉండగా, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి నగరాల్లో దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండటం లేదా స్వల్పంగా మరింత పెరగడం ఆశ్చర్యం కాదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: Business Ideas: కేసీఆర్‌ ఐడియా అదుర్స్.. ఈ చిన్న ట్రిక్‎తో  టన్నుల కొద్దీ క్యాప్సికం పండిస్తున్నారు.. ఆ ట్రిక్ తెలుసుకుంటే మీ ఫేట్ మారడం గ్యారెంటీ..!!  

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Jan 02, 2026 13:53:38
Secunderabad, Telangana:

Gold Investment: 2025 సంవత్సరం కమోడిటీ పెట్టుబడిదారులకు ఎప్పటికీ మర్చిపోలేని ఏడాదిగా నిలిచింది. బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి. ముఖ్యంగా బంగారం విషయానికి వస్తే.. దాదాపు 70 శాతం వరకు పెరిగి.. అనేక ప్రముఖ స్టాక్ మార్కెట్ షేర్లను కూడా వెనక్కి నెట్టింది. ఈ నేపథ్యంలో సహజంగానే పెట్టుబడిదారులందరి దృష్టి ఇప్పుడు ఒక్క ప్రశ్నపై కేంద్రీకృతమైంది. ఈ బంగారం ర్యాలీ 2026లో కూడా కొనసాగుతుందా? లేక ఇక్కడితో ఆగిపోతుందా?

2025లో వచ్చినట్లుగా భారీ రాబడులు మళ్లీ రావడం అంత సులువు కాదని అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. అయినప్పటికీ.. 2026లో బంగారం పెట్టుబడిదారులకు 12 నుంచి 15 శాతం వరకు స్థిరమైన లాభాలను ఇవ్వగల అవకాశాలు ఉన్నాయని  భావిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,35,000పలుకుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. 2026 చివరి నాటికి ఈ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల మధ్యకు చేరవచ్చని అంచనాలు వేస్తున్నారు. 

అయితే.. ఈ ప్రయాణం పూర్తిగా నేరుగా ఉండదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది భారీగా లాభాలు వచ్చిన నేపథ్యంలో.. కొందరు ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్‌కు దిగే అవకాశం ఉంది. అలా జరిగితే మధ్యలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.18 లక్షల వరకూ దిగివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఈ స్థాయి పతనం దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: VB-G RAM G scheme latest Update:  కార్మికులకు ప్రతినెలా వేతనాలు.. ఆలస్యం అయితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. కేంద్ర మంత్రి  ప్రామీస్‌..!!  

పెట్టుబడిదారులు వాస్తవంగా ఎంత లాభం పొందవచ్చనే అంశాన్ని ఒక ఉదాహరణతో చూస్తే స్పష్టత వస్తుంది. రాజు అనే ఒక వ్యక్తి  జనవరి 2026లో బంగారంలో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. ఏడాది చివరికి 13 నుంచి 15 శాతం రాబడి వస్తే, ఆ పెట్టుబడి విలువ డిసెంబర్ 2026 నాటికి దాదాపు రూ.3.36 లక్షల నుంచి రూ.3.45 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన రాబడిగా చెప్పవచ్చు.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉన్నాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడితే లేదా రూపాయి బలహీనపడితే, భారత్‌లో బంగారం ధరలు పెరుగుతాయి. అదే విధంగా దిగుమతి సుంకాలు, జీఎస్టీ, ఇతర పన్నులు కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మాంద్య భయాలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా చూస్తారు.

కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలకు బలాన్నిస్తుంది. ఇటీవల అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి. ఇది బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతోంది. భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే మరో కీలక అంశం దాని సాంస్కృతిక ప్రాముఖ్యత. వివాహాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగిన వేళ, విలువను కాపాడుకునే సాధనంగా బంగారాన్ని భారతీయులు విశ్వసిస్తారు.మొత్తానికి.. 2026లో బంగారం గత ఏడాది లాంటి అద్భుత ర్యాలీ ఇవ్వకపోయినా, స్థిరమైన, నమ్మదగిన పెట్టుబడిగా తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి పెట్టే వారికి బంగారం ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగానే కొనసాగనుంది.

Also Read: Most Stolen Items: బంగారం కాదు.. డబ్బు అంతకన్నా కాదు.. ప్రపంచంలో ఎక్కువగా చోరీకి గురయ్యేది ఇదే..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 12:35:26
Mumbai, Maharashtra:

Private Part Cut in Mumbai: న్యూఇయర్ వేడుకల వేళ ముంబైలో ఒక భయంకరమైన ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తూ, మాట వినలేదన్న కోపంతో ఒక వివాహిత తన ప్రియుడిపై కత్తితో దాడి చేసి, అతని ప్రైవేట్ భాగాలను కోసేసింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా, నిందితురాలు పరారీలో ఉంది.

వివాహేతర సంబంధం
పోలీసుల దర్యాప్తులో ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు (44), నిందితురాలు (25) మధ్య బంధుత్వం ఉంది. ఆమె బాధితుడి సోదరి మరదలు. వీరిద్దరి మధ్య గత ఆరు నుండి ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని చెబుతున్నారు. తన భర్తను విడిచిపెడతానని.. తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ బాధితుడిపై నిరంతరం ఒత్తిడి తెచ్చేదట. ఈ విషయంలో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు.

పక్కా ప్లాన్‌తో పిలిపించి..
ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడు నవంబర్ 2025లో ముంబై వదిలి బీహార్‌కు వెళ్లిపోయాడు. అయినప్పటికీ ఆమె ఫోన్ ద్వారా బెదిరిస్తూనే ఉంది. డిసెంబర్ 19న బాధితుడు తిరిగి ముంబైకి వచ్చాడు. కానీ ఆమెకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాడు. 

అయితే ఈ క్రమంలో డిసెంబర్ 31 తెల్లవారుజామున, నూతన సంవత్సర స్వీట్లు ఇస్తానని నమ్మించి ఆమె అతడిని తన ఇంటికి పిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఆమె పిల్లలు నిద్రపోతున్నారు. మాటల మధ్యలో వివాదం తలెత్తడంతో, ఆమె అకస్మాత్తుగా కత్తితో అతనిపై దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలను కోసి తీవ్రంగా గాయపరిచింది.

తీవ్ర రక్తస్రావం అవుతున్నా, బాధితుడు ఎలాగోలా తన ఇంటికి చేరుకున్నాడు. అతని కుమారులు, స్నేహితులు వెంటనే అతడిని తొలుత విఎన్ దేశాయ్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం సియోన్ ఆసుపత్రికి తరలించారు. గాయాలు చాలా లోతుగా ఉన్నాయని, అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.

పరారీలో నిందితురాలు
ఘటన జరిగినప్పటి నుండి నిందితురాలైన మహిళ పరారీలో ఉందని పోలీసులు చెప్పారు. శాంతాక్రూజ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆమె కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం ఇంతటి హింసాత్మక ఘటనకు దారితీయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Also Read: Dhoni IPL Retirement: సీఎస్‌కే అభిమానులకు బ్యాడ్‌న్యూస్..ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ..ఇక ఐపీఎల్‌కు 'తలా' సెలవు!

Also Read: ATMs Closing Down: దేశంలో భారీగా మూతపడుతోన్న ATMలు..భవిష్యత్తులో మొత్తం నిల్..ఆర్బీఐ కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
GSG Shekhar
Jan 02, 2026 12:31:18
Nalgonda, Telangana:

Nalgonda Politics: నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు చల్లారడం లేదు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం మరోసారి షాక్ ఇచ్చింది. నల్గొండ జిల్లా చండూర్ మండలం అంగడి పేటలోని BRC గార్డెన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డీసీసీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు మంత్రి అనుచరులు ఘోరంగా అవమానించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్ది స్టేజి పైకి వస్తున్నారు. నువ్వు తర్వాత రా అంటూ స్టేజి పైకి రానివ్వకుండా పున్నా కైలాష్ నేతను పోలీసులు బయటకు పంపించారు. జిల్లా అధ్యక్షుడికే ఈ తరహాలో అవమానం జరగడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మొదట నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే గుమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కానీ ఇదే కార్యక్రమంలో ఉన్న డీసీసీ అధ్యక్షుడిని మంత్రి అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు.. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలలో కూడా కైలాష్ నేత ఫోటో వేయకపోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేత నియమాకాన్ని మంత్రి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. 

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పున్న కైలాష్ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో పున్నా కైలాష్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంలో తీవ్రంగా దూషించారు. అయితే తనను పచ్చి బూతులు తిట్టిన కైలాష్ కు డీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని మంత్రి ప్రశ్నించారు. అంతేకాదు కైలాష్ నేతను డీసీసీ పదవి నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, నల్గొండ ఎస్పీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ సైతం రాశారు. అప్పటినుంచి మంత్రి వెంకట్ రెడ్డి పున్నా కైలాష్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతేకాకుండా తాను వచ్చే కార్యక్రమాలకు పున్నా కైలాష్ రాకుండా చూసుకుంటున్నారు. అయితే డీసీసీ అధ్యక్షుడికే ఇలాంటి అవమానం జరిగితే.. తమ పరిస్తితి ఏంటని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు పున్నా కైలాష్ నేతకు డీసీసీ పదవి ఇవ్వడాన్ని జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్గొండలో రేవంత్ రెడ్డి మనుషులకే పదవులు వస్తున్నాయని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. తాను కోమటిరెడ్డి అనుచరుడు కావడంతోనే నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా చేశారంటూ గుమ్ముల మోహన్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది. అందుకే గుమ్ముల మోహన్ రెడ్డి సైతం డీసీసీ ప్రెసిడెంట్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గుమ్ముల మోహన్ రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా మంత్రి వెంకట్ రెడ్డినే అడ్డుకున్నారంటూ జిల్లాలో కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు..
 
మొత్తంమీద నల్గొండ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. డీసీసీ ప్రెసిడెంట్ వర్సెస్ మంత్రి వెంకట్ రెడ్డి అన్నట్టుగా సీన్ మారింది. ప్రస్తుతం ఈ వివాదాన్ని సద్దుమణించకపోతే మాత్రం.. ఈ లొల్లి మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి వెంకట్ రెడ్డిని పిలిచి వివాదాన్ని ఎవరు కూల్ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే మంత్రి ఈ స్థాయిలో డీసీసీని వ్యతిరేకిస్తున్నప్పుడు ఆయన్ను తప్పించినా గొడవ సద్దుమణుగుతుంది. కానీ పున్నా కైలాష్ నేత సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు కావడంతో.. ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో అన్న చర్చ అయితే జిల్లా కాంగ్రెస్ వర్గాలకు అంతుచిక్కడం లేదు.. 

Also Read: Telangana Panchayats: తలరాత మారునున్న తెలంగాణ పంచాయితీలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Also Read: Kavitha Challan: ఎమ్మెల్సీ కవిత భారీగా ట్రాఫిక్‌ చలాన్లు.. రూ.17 వేల చలాన్లు పెండింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 09:03:50
Chennai, Tamil Nadu:

MS Dhoni Last IPL: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు షాకింగ్ న్యూస్. మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థానం ఐపీఎల్‌లో ముగింపు దశకు చేరుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరిది కానుందని ఫ్రాంచైజీ వర్గాలతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా స్పష్టం చేస్తున్నారు.

"ఇదే ధోనీకి చివరి సీజన్"
సీఎస్కే మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఇటీవలే జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ ధోనీ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. "పరిస్థితి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. ధోనీకి ఇదే చివరి సీజన్ కాబోతోంది. ఇకపై అతను ఆడతాడా లేదా అనే ఊహాగానాలకు తావు లేదు. ఈ ఏడాది తర్వాత అతను పూర్తిగా ఆట నుండి తప్పుకుంటాడు" అని ఉతప్ప పేర్కొన్నారు. వచ్చే సీజన్‌లో ధోనీ 'ప్లేయర్-మెంటార్' పాత్రలో కనిపించి, ఆ తర్వాత పూర్తిస్థాయి మెంటార్‌గా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా జట్టులో జరుగుతున్న మార్పులను "వారసత్వ ప్రణాళిక"గా అభివర్ణించారు. "ఏదో ఒక సమయంలో ధోనీ తప్పుకుంటాడనే నిజాన్ని మేము పరిగణనలోకి తీసుకున్నాము. కేవలం రెండేళ్ల కోసమే కాకుండా, వచ్చే ఆరేళ్ల తర్వాత చెన్నై జట్టు ఎలా ఉండాలో ఇప్పుడే పునాదులు వేస్తున్నాం" అని అబుదాబి వేలంలో ఆయన వెల్లడించారు.

కీలక మార్పులు..
ధోనీ వారసుడిని సిద్ధం చేసే క్రమంలో సీఎస్కే యాజమాన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదులుకుని రాజస్థాన్ రాయల్స్ నుండి స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకుంది. ధోనీ ఖాళీ చేయబోయే వికెట్ కీపింగ్ స్థానాన్ని భర్తీ చేయడానికే సంజును తెచ్చినట్లు ఫ్లెమింగ్ ధృవీకరించారు. అదే విధంగా వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అయిన కార్తీక్ శర్మ (19 ఏళ్లు), ప్రశాంత్ వీర్ (20 ఏళ్లు) లపై ఏకంగా రూ. 28.4 కోట్లు వెచ్చించింది. ఇది ఆ జట్టు మొత్తం పర్స్‌లో 60 శాతానికి సమానం.

గత సీజన్ ప్రభావం?
ఐపీఎల్ 2025లో సీఎస్కే తన చరిత్రలోనే అత్యంత దారుణంగా చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచింది. వయస్సు పైబడటం, మోకాలి సమస్యలు వేధిస్తుండటంతో ధోనీ కూడా భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఐదు టైటిళ్లను అందించిన కెప్టెన్‌కు ఘనమైన వీడ్కోలు పలికేందుకు సీఎస్కే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ATMs Closing Down: దేశంలో భారీగా మూతపడుతోన్న ATMలు..భవిష్యత్తులో మొత్తం నిల్..ఆర్బీఐ కీలక ప్రకటన!

Also REad: NPS Scheme: ఉద్యోగులకు, సామాన్యులకు గుడ్‌న్యూస్..పెన్షన్ స్కీమ్‌లో గొప్ప సంస్కరణలు..భారీగా పెరగనున్న ప్రయోజనాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 02, 2026 08:50:19
Secunderabad, Telangana:

VB-G RAM G scheme latest update: గ్రామీణ ఉపాధి వ్యవస్థలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో VBJI రామ్ జీ చట్టం–2025 పేరుతో కొత్త ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ  పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు మరింత భద్రత, పారదర్శకత, సమయపాలన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా బుద్రుక్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో  మాజీ సీఎం.. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం,  రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ స్కీమ్ గురించి ముఖ్యమైన విషయాలను వెల్లుడించారు. VBJI రామ్ జీ పథకం కింద పనిచేసే ప్రతి కార్మికుడికి వారం రోజుల్లోపు వేతనం చెల్లించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఒకవేళ వేతన చెల్లింపులో 15 రోజులు దాటినా ఆలస్యం జరిగితే..  ఆ కార్మికుడికి రోజుకు 0.05 శాతం వడ్డీతో పాటు బకాయి వేతనం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ కొత్త చట్టం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 125 రోజుల ఉపాధికి చట్టపరమైన హామీ ఇస్తుంది. ఇది గతంతో పోలిస్తే ఉపాధి అవకాశాలను మరింత విస్తరించనుంది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. కాగా ఈ స్కీమ్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. VBJI రామ్ జీ పథకంలో కనీసం 33 శాతం ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరగనుంది. మహిళలు ఇంటి పనులతో పాటు ఉపాధి అవకాశాలను కూడా పొందేలా ఈ విధానం రూపకల్పన చేసింది. 

Also Read: Business Ideas: సర్కార్ సబ్సిడీతో.. ఎకరం భూమిలో ఈ పంటలు పండిస్తే.. 10ఏళ్లపాటు ప్రతినెలా రూ. 1లక్ష సంపాదించే అద్భుత అవకాశం..!!  

ఇక ఈ పథకం మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. గ్రామసభలకు ఎక్కువ అధికారాలు కల్పించింది. గ్రామంలోని అవసరాల ఆధారంగా ఏ పనులు చేపట్టాలనే నిర్ణయం గ్రామసభలే తీసుకుంటాయి. నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవనోపాధి కార్యకలాపాలు, ప్రకృతి విపత్తుల సమయంలో ఉపశమన పనులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పంటకాలంలో కార్మికుల అవసరం ఎక్కువగా ఉంటుందని గుర్తించిన ప్రభుత్వం, పీక్ సీజన్లలో 60 రోజుల వరకు అదనపు వ్యవసాయ కార్మికులను నియమించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. దీని వల్ల రైతులకు పనివాళ్ల కొరత సమస్య తగ్గే అవకాశం ఉంది.

పథకం అమలు సులభంగా సాగేందుకు పరిపాలనా ఖర్చుల పరిమితిని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచారు. దీని వల్ల సాంకేతిక వ్యవస్థలు, మానిటరింగ్, వేగవంతమైన వేతన చెల్లింపులు సాధ్యమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి.. VBJI రామ్ జీ చట్టం–2025 గ్రామీణ కార్మికుల జీవితాల్లో కీలక మార్పు తీసుకురావచ్చే అవకాశం ఉంది.  వారం లోపే వేతనాలు..ఆలస్యం అయితే వడ్డీ, మహిళలకు రిజర్వేషన్, గ్రామసభల పాత్ర పెంపు వంటి అంశాలు ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. గ్రామీణ భారతానికి ఇది ఒక కొత్త దిశగా చెప్పవచ్చు.

Also Read: Business Ideas: తమ్ముడు.. ఇది రాసిపెట్టుకో... ఈ ఒక్క బిజినెస్ ఐడియాతో ఎవరి సపోర్టు లేకుండానే.. కోట్లకు పడగలెత్తొచ్చు..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
comment0
Report
HDHarish Darla
Jan 02, 2026 08:26:37
Hyderabad, Telangana:

ATMs Closing Down 2025: ఒకప్పుడు నగదు కోసం ఏటీఎం (ATM) సెంటర్ల ముందు క్యూ కట్టేవారం. కానీ కాలం మారింది.. ఇప్పుడు జేబులో రూపాయి లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈ డిజిటల్ విప్లవమే ఇప్పుడు ఏటీఎంల మనుగడను ప్రశ్నార్థకంగా మారింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏటీఎంలు మూతపడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

గత ఏడాది కాలంలో ఏటీఎంల సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. RBI నివేదిక ప్రకారం.. 2024 మార్చి నాటికి దేశంలో మొత్తం 2,53,417 ఏటీఎంలు ఉండేవి. 2025 మార్చి నాటికి ఈ సంఖ్య 2,51,057 కు పడిపోయినట్లు ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే బ్యాంకులు దేశవ్యాప్తంగా 2,360 ఏటీఎంలను శాశ్వతంగా తొలగించినట్లు తెలుస్తోంది.

ఏటీఎంలు మూతపడటానికి ప్రధాన కారణం?
బ్యాంకింగ్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. దీనికి ప్రధాన కారణం UPI (Unified Payments Interface). డిజిటల్ చెల్లింపుల్లో జోరు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టీ కొట్టు నుంచి మాల్స్ వరకు ప్రతిచోటా స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తుండటంతో నగదు అవసరం భారీగా తగ్గింది. ఏటీఎం సెంటర్ల అద్దె, విద్యుత్ బిల్లులు, సెక్యూరిటీ గార్డుల జీతాలు, నగదు నింపే వాహనాల ఖర్చు బ్యాంకులకు భారంగా మారుతోంది. డిజిటల్ లావాదేవీల వల్ల ఏటీఎంల వద్ద రద్దీ తగ్గడంతో, లాభసాటిగా లేని మిషన్లను బ్యాంకులు ఎత్తివేస్తున్నాయి.

బ్యాంకులకు చెందిన ఏటీఎంలు తగ్గుతున్నప్పటికీ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంలు మాత్రం పెరిగాయి. ఏడాది కాలంలో ఇవి 34,602 నుండి 36,216 కి చేరాయి. అంటే కొత్తగా 1,614 వైట్ లేబుల్ ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ఇవి ప్రధానంగా ఏటీఎం సదుపాయం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశంలో బ్యాంకు శాఖల సంఖ్య గత ఏడాదిలో 2.8 శాతం పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1.64 లక్షల బ్యాంకు శాఖలు ఉన్నాయి. సాధారణంగా బ్రాంచీలు పెరిగితే ఏటీఎంలు కూడా పెరగాలి. కానీ, బ్యాంకులు ఇప్పుడు ఫిజికల్ ఏటీఎంల కంటే మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ యాప్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

చివరిగా.. చెప్పాలంటే నగదు రహిత లావాదేవీలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు మంచిదే అయినా, అత్యవసర సమయాల్లో నగదు కోసం ఏటీఎంలపై ఆధారపడే సామాన్యులకు ఈ మూసివేత కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

Also REad: NPS Scheme: ఉద్యోగులకు, సామాన్యులకు గుడ్‌న్యూస్..పెన్షన్ స్కీమ్‌లో గొప్ప సంస్కరణలు..భారీగా పెరగనున్న ప్రయోజనాలు!

Also Read: Indian Currency Value: ఇక్కడి నుంచి రూ.1,00,000 తీసుకెళ్తే..అక్కడ కోటీశ్వరులు అవుతారు..200 రెట్లు డబ్బు రెట్టింపు అవుతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top