Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Private School Fees Bill: ప్రైవేట్ స్కూల్ ఫీజులకు బ్రేక్..కీలక బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం..తల్లిదండ్ర...
HDHarish Darla
Jan 24, 2026 07:50:27
Hyderabad, Telangana

Tamil Nadu Private School Fees Bill: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ రూపొందించిన 'ఫీజుల నియంత్రణ బిల్లు'కు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ఏకపక్షంగా ఫీజులు పెంచకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలపై విద్యాభారం తగ్గనుంది.

ప్రైవేట్ పాఠశాలల ఫీజులు నియంత్రణ కోసం ఏడుగురు సభ్యులతో శక్తివంతమైన కమిటీ వేశారు. ఫీజుల నిర్ణయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి (ఛైర్మన్), పాఠశాల విద్య డైరెక్టర్, పిడబ్ల్యుడి (PWD) జాయింట్ చీఫ్ ఇంజనీర్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి, రాష్ట్ర తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధి, ప్రాథమిక విద్యా విభాగ ప్రతినిధి

చట్టంలోని కీలక నిబంధనలు..
పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులను పెంచడానికి వీలుండదు. కమిటీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. కమిటీ ఒకసారి ఫీజును ఖరారు చేస్తే, అది వరుసగా మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆ లోపు ఫీజు మార్చడానికి వీలుండదు. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యత..
తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం అధికార పార్టీకి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల అంశం రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య. దీనిపై చట్టబద్ధమైన నియంత్రణ తీసుకురావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే, అమలు తేదీపై విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫీజుల విధానం అమల్లోకి వస్తుంది.

Also Read; Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్..విధులకు డుమ్మా కొడితే ఉద్యోగం గోవిందా! రూల్స్ మార్చిన సర్కార్!

ALso Read; Jiohotstar 79 Plan: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.79కే అతితక్కువ రీఛార్జ్ ప్లాన్..ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 11, 2026 14:51:45
Hyderabad, Telangana:

TATA IPL 2026 First Schedule: టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీతో ముగియడంతో క్రికెట్‌ అభిమానులు పండుగ చేసుకోగా.. ఆ పండుగ ఆనందం ముగియకపోక ముందే మరో క్రికెట్‌ సంబరం ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌ 19వ ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ దశల వారీగా టాటా ఐపీఎల్‌ 2026 నిర్వహించనుంది. అందులో భాగంగా మొదటి దశలో 20 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన అనంతరం తదుపరి ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తామని బీసీసీఐ ప్రకటన చేసింది. తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరగనుండడం విశేషం. సాధారణంగా గత లీగ్‌లో చివరగా ఆడిన జట్ల మధ్య కొత్త సీజన్‌ తొలి మ్యాచ్‌ నిర్వహించాల్సి ఉండగా... అనూహ్యంగా ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్‌సీబీ మ్యాచ్‌ పెట్టడం గమనార్హం. టాటా ఐపీఎల్‌ 2026 మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 12వ తేదీ వరకు జరగనుంది. 

Also Read: Tirupati: తిరుపతి ప్రజలకు భారీ అలర్ట్‌.. గరుడ వారధిపై బైక్‌లు, భారీ వాహనాలు నిషేధం

టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మొదటి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ 19వ ఎడిషన్ మ్యాచ్‌ ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌తో ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు మార్చి 28వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. బెంగళూరు, ముంబై, గౌహతి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ మొత్తం 10 ప్రాంతాల్లో 20 మ్యాచ్‌లు జరుగుతాయి.

Also Read: KTR Press Meet: దేశంలోనే అతిపెద్ద జోకర్ రాహుల్‌ గాంధీ: కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు

మ్యాచ్‌ల సమయం: మొదటి దశ ఐపీఎల్‌లో నాలుగు రోజులు రెండేసి మ్యాచ్‌లు జరగనుండగా.. మధ్యాహ్నం మ్యాచ్‌ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. 
రెండో మ్యాచ్‌ సాయంత్రం 7:30 గంటలకు మొదలవుతుంది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు ఇవే!
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సీజన్‌ తొలి దశలో ఒకటే మ్యాచ్‌ హోమ్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఏప్రిల్‌ 5వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో మధ్యాహ్నం లక్నోతో సన్‌రైజర్స్‌ తలపడనుంది. 
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, వేదిక: బెంగళూరు
ఏప్రిల్‌ 2: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, వేదిక: కోల్‌కత్తా
ఏప్రిల్‌ 5: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జియాంట్స్‌, వేదిక: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం
ఏప్రిల్‌ 11: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs పంజాబ్‌ కింగ్స్‌, వేదిక: చండీగడ్‌

హోం మ్యాచ్ లు ఇలా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరులో ఐదు హోమ్ మ్యాచ్‌లు ఆడనుండగా.. రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ న్యూ చండీగఢ్‌లో 4, ధర్మశాలలో మూడు ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ గౌహతిలో 3, జైపూర్‌లో 4 మ్యాచ్‌లు ఆడుతుంది. 

బెంగళూరులో ట్విస్ట్‌
గతేడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌కు కొంత ఇబ్బందికరి పరిస్థితి ఏర్పడింది. బీసీసీఐ బెంగళూరులో మ్యాచ్‌లకు షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడానికి ఇంకా అనుమతి రాలేదు. బెంగళూరులో ఖరారైన మ్యాచ్‌లు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నుంచి క్లియరెన్స్‌ చేస్తే మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ కమిటీ మార్చి 13వ తేదీన చిన్నస్వామి స్టేడియం పరిశీలించి క్లియరెన్స్‌ ఇస్తే యథావిధిగా మ్యాచ్‌లు జరుగుతాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 14:42:08
Hyderabad, Telangana:

Youth Risky viral Video Watch: సోషల్ మీడియాలో లైకులు వ్యూస్ కోసం యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. గత కొద్ది రోజుల నుంచి ఈ ట్రెండు కొనసాగుతూ వస్తోంది. సాహసోపేతమైన చర్యలకు పాల్పడుతూ రీల్స్ చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటనలు ఎన్నో ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూసాం.. అయినప్పటికీ కొందరిలో ఏం మాత్రం మార్పు రాలేకుండా పోతుంది. తాజాగా పరిగెడుతున్న రైలులో ప్రమాదకరమైన రీల్ చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలు పట్టాల పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొని కిందపడిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు వేగంగా వెళుతున్న రైలు భోగిలకుండే తలుపుల దగ్గర నిలబడి ఉన్నాడు. బయట గాలికి వేలాడుతూ స్టంట్ లు చేయాలని.. దానిని రియల్ గా చిత్రీకరించాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. మొదట బయటకు వంగి ఎదురుగా ఏదైనా రైలు వస్తుందేమో అని చూసాడు.. ఏమి రావడం లేదని అనుకున్న వ్యక్తి.. రైలు మెట్ల పైకి దిగి ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని శరీరాన్ని గాల్లోకి వచ్చి అటు ఇటు కదలడం ప్రారంభించాడు.. అయితే ఇదే సమయంలో రైల్లో ఉన్న తన స్నేహితుడు ఈ దృశ్యాలను చిత్రీకరించాడు..

అలా కొద్ది సెకండ్ల పాటు ఆ వ్యక్తి రైలు హ్యాండిల్ ని పట్టుకొని అటు ఇటు శరీరాన్ని గాల్లో కలపడం చూడొచ్చు.. అదృష్టవశాత్తు రైలు పట్టాల పక్కనే ఉన్న ఒక విద్యుత్ స్తంభాన్ని ఆ యువకుడు గమనించలేకపోయాడు.. వేగంగా వెళుతున్న ఆ రైలు నుంచి అతను బయటకు వంగిన సమయంలో అతని వీపు.. స్తంభానికి బలంగా ఢీకొంది. ఆ దెబ్బకు ఆ యువకుడు పట్టు తప్పి రైలులో నుంచి అక్కడే పడిపోయాడు. ఈ భయానక దృశ్యాలు చూసి అతని స్నేహితుడు ఒక్కసారి షాక్కు గురై కెమెరా పక్కకు తిప్పేసి వీడియో అక్కడితో ఎండ్ చేశాడు.

pic.twitter.com/cohxfFJMw1

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

ఈ ఘటన ఎక్కడ జరిగిందని విషయం ఇంకా స్పష్టంగా ఎవరికీ తెలియనప్పటికీ.. సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. కేవలం కొన్ని సెకండ్ల వీడియో రియల్ కోసం ఎంతటి సాహసం చేయాలా.. అని చాలామంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ప్రాణం కంటే రీల్స్ గొప్పవా అంటూ సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు. రైల్వే పోలీసులు ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కొంతమంది నెటిజన్లు కోరుతున్నారు. యువకుడి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అనే విషయం ఎవరికీ తెలియదు.

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 14:30:16
Hyderabad, Telangana:

 Vaikuntapali With Live Snakes Viral Video Watch: ప్రస్తుతమున్న యువత సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. కొందరు డ్యాన్సులు.. మరికొందరు కామెడీ.. మరికొందరు సాహసోపేతమైన చర్యలకు పాల్పడుతూ అలరిస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ప్రాణాలు మీదకు తెచ్చుకునే సాహసాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి కోవాలోకి వచ్చే ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వైకుంఠ పాళీ అనే ఆటను నిజమైన పాములను పెట్టి ఆడడం మీరు చూడొచ్చు. సాధారణంగా పాము నిచ్చెన ఆటను మనం సరదాగా ఇంట్లో చిన్న బోర్డు పెట్టి ఆడుకుంటాం. కానీ ఈ వీడియోలో ఆ జంట చేసిన పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. 

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక గది మధ్యలో నేలపై నిచ్చెనలు అమర్చి ఉండడం మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిచ్చెన మధ్యలో బొమ్మ పాములు కాకుండా.. ప్రాణాలతో ఉన్న పాములు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఒక యువకుడితో పాటు యువతి ఆ అత్యంత ప్రమాదకరమైన పాముల మధ్యలోనే అడుగులు వేస్తూ ఆటలాడడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఈ దృశ్యాలే విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. 

వారు ఒక మొబైల్ ఫోన్‌లో ఆన్లైన్ డైస్ వినియోగిస్తూ.. అందులో వచ్చిన నెంబర్ ప్రకారం పాముల మీద నుంచి.. వాటి పక్కన అడుగులు వేస్తూ ఆటను ముందుకు సాగించడం మీరు గమనించవచ్చు. ఆ పాములు వారి కాళ్ళ కిందికి వస్తున్నప్పటికీ.. అవి బుసలు కొడుతున్నప్పటికీ ఆ జంట ఏమాత్రం భయపడకుండా.. నవ్వుతో ఆటలాడడం మీరు గమనించవచ్చు. అయితే ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

ఈ వీడియో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ వీడియోకు  సోషల్ మీడియా వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇలా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. ఇది సాహసం కాదు వారి మూర్ఖత్వం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తే.. ఒక్క పాము కాటేసిన ప్రాణాలు పోయే ప్రమాదముంది.. అంటూ మరికొందరు కామెంట్లు చేయడం విశేషం. అయితే, మరి కొంతమంది మాత్రం ఇవి గ్రాఫిక్స్ అయి ఉండొచ్చని.. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి ఈ పాములను తయారు చేసి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వీరు పాములతో ఆడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 11, 2026 12:43:53
Hyderabad, Telangana:

Telangana Speaker Clean Cheat: 'చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చే రాహుల్ గాంధీ నేడు అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. తుక్కుగూడలో ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ మూర్ఖపు పని చేస్తున్నాడు. రాహుల్ గాంధీకి కొంచెమైనా సిగ్గు, గౌరవం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ చేశారు. 'ఒక పార్టీ బీ-ఫారమ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండానే మరో పార్టీ బి-ఫారమ్ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు? అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

Also Read: Hotels Close: బ్యాచిలర్స్‌ అలర్ట్‌! హైదరాబాద్‌లో హోటల్స్‌, హాస్టల్స్‌ క్లోజ్‌?

'స్వతంత్ర భారత చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోలేదు. అందుకే వారిని చప్పట్లు, శాలువాలతో సత్కరించి మా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏ బీ ఫారమ్ వాడారు, ఎంపీగా ఏ బీ-ఫారమ్ వాడుతున్నారో అక్కడ స్పష్టంగా ఉంది. ఇంత ఉన్నా స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారంటే కచ్చితంగా ఆయనను, ఆయనను నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకులను సత్కరించాల్సిందే' అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Also Read: Harish Rao: ఢిల్లీలో నీతులు.. మరి తెలంగాణలో ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?: హరీశ్‌ రావు

'అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నప్పటికీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది? ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అందుకే చేసేవి అనైతిక కార్యక్రమాలు, చెప్పేవి నీతులు అన్న తీరుగా రాహుల్ గాంధీ తీరు ఉందని, అందుకే ఆయనను దేశంలోనే అతిపెద్ద జోకర్ అంటున్నానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇలాంటి రాహుల్ గాంధీ లాంటి జోకర్లకు తెలంగాణ ప్రజలే సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రకటించారు.

Also Read: KTR Press Meet: దేశంలోనే అతిపెద్ద జోకర్ రాహుల్‌ గాంధీ: కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు

ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి లేనే లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపుల రాజకీయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకిందని చరిత్ర గుర్తుచేశారు. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. 10 మందిని తీసుకున్నది కాంగ్రెస్ కాదా అనే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

'ఫిరాయింపుల అంశంపై దానం నాగేందర్, కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. కడియం శ్రీహరి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఎలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గౌరవం, పదవులు ఏమిటో ఆయనకు ఆయన ప్రశ్నించుకోవాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు.  'కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏమిటి? ఆయన 2013లో వచ్చినప్పుడు కేసీఆర్ ఆయనను ఎంపీని చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం చేశారు. ఆపై ఎమ్మెల్సీని చేశారు. తర్వాత ఎమ్మెల్యేని చేశారు. ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ వయసులో ఇలాంటి "మురికి" మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సిగ్గులేకుండా ఎందుకు బతకాలి? మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నా. కేసీఆర్‌ నాయకత్వంతోనే ఉన్నాను అని మీరు చెప్పారు. అందుకే అడుగుతున్నాను ఈ థర్డ్ క్లాస్ మాటలు ఎందుకు? అని' అని కడియం శ్రీహరిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 12:23:43
Hyderabad, Telangana:

Mercury Rise March 18 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం పరంగా గ్రహాల్లో స్థితిగతుల్లో మార్పుల కారణంగా మానవ జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది. అయితే, ఇది ఇలా ఉంటే బుద్ధి, వ్యాపారం, సంభాషణకు కారకుడైన బుధ గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో అస్తమించి ఉన్నాడు మార్చి 18వ తేదీన తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ గ్రహం అదే రాశిలో ఉదయించబోతోంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏదైనా ఒక గ్రహం ఉదయించినప్పుడు దాని శక్తి రెట్టింపు అవుతుంది. అయితే, ఈ రెట్టింపైన శక్తి అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల మూడు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఇది ఆయా రాశుల వారికి గోల్డెన్ పీరియడ్‌గా కూడా మారవచ్చు. బుధుడు ఉదయించడం వల్ల అద్భుతమైన లాభాలు పొందబోతున్న రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేషరాశి 
మేష రాశి వారికి బుధుడి ప్రభావం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు పూర్వికులు ఆస్తులు కూడా పొందగలుగుతారు. అలాగే ఇప్పటికే కొనుగోలు చేసిన ఆస్తుల నుంచి భారీ లాభాలు పొందే.. అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రశంసలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఉద్యోగాలు చేస్తున్న వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు కొత్త ఆర్డర్లు పొందడమే కాకుండా మంచి ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బుధుడు ఉదయించడం వల్ల అదృష్టం వెన్నంటే ఉండబోతోంది అంతేకాకుండా వీరికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఊహించని ఆసక్తి పెరగబోతోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి వీరు తప్పకుండా తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారు జీతాల పెంపు వంటి సానుకూలమైన మార్పులు కూడా పొందగలుగుతారు. అలాగే వీరు డబ్బులను కూడా భారీగా పొదుపు చేసుకుంటారు. దీంతోపాటు సామర్థ్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ప్రేమికులకు ఈ ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత బలోపేతం అవుతాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

కుంభరాశి 
బుధుడి ప్రభావంతో కుంభరాశి వారిపై కూడా చాలా ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది.. వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది సమాజంలో గౌరవంతో పాటు మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. కోర్టు కేసులతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన భాగస్వామి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం గతంలో కంటే ఇప్పుడు మరింత నిలకడగా ఉంటుంది.. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులు పెద్దల అంగీకారంతో గ్రాండ్గా పెళ్లిళ్లు చేసుకోగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 11, 2026 12:20:35
Hyderabad, Telangana:

Telangana Assembly Speaker Decision: పట్టపగలు పార్టీ మారి అనంతరం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బీ ఫాంపై పోటీ చేసిన దానం నాగేందర్‌ను స్పీకర్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. 'రాహుల్ గాంధీ కూడా రాష్ట్రం నుంచి వస్తున్న అడ్డగోలు సంచుల కట్టల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి గానీ లేనే లేదు' అని స్పష్టం చేశారు.

Also Read: Tirupati: తిరుపతి ప్రజలకు భారీ అలర్ట్‌.. గరుడ వారధిపై బైక్‌లు, భారీ వాహనాలు నిషేధం

స్పీకర్ చేతుల్లో ఏమీ లేదని.. మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందని మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 'స్పీకర్ తీర్పు వెనుక ఉన్న ప్రధాన నేరస్తుడు, ఆ నేరపూరిత ఆలోచన రాహుల్ గాంధీదే. ఆయనే అసలు దోషే. ఆయన అనుమతి లేకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకునే సాహసం చేయలేరు. రాహుల్ గాంధీకి కొంచెమైనా సిగ్గు, గౌరవం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి' అని సవాల్‌ చేశారు.

Also Read: Harish Rao: ఢిల్లీలో నీతులు.. మరి తెలంగాణలో ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?: హరీశ్‌ రావు

అనైతిక కార్యక్రమాలు, చెప్పేవి నీతులు అన్న తీరుగా రాహుల్ గాంధీ తీరు ఉందని, అందుకే ఆయన దేశంలోనే అతిపెద్ద జోకర్ అని మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'స్పీకర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికం, దారుణం. రాహుల్ గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు' అని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్ పైన రాహుల్ గాంధీ తీవ్రమైన ఒత్తిడి ఉందని.. రాహుల్ గాంధీ కూడా రాష్ట్రం నుంచి వస్తున్న అడ్డగోలు సంచుల కట్టల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 

Also Read: Hotels Close: బ్యాచిలర్స్‌ అలర్ట్‌! హైదరాబాద్‌లో హోటల్స్‌, హాస్టల్స్‌ క్లోజ్‌?

కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై దాడి అని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. దీని వెనుక ఉన్న ప్రధాన నేరస్తుడు, ఆ నేరపూరిత ఆలోచన రాహుల్ గాంధీదే అని తెలిపారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ రక్షకుడినని చెప్పుకుంటూ ఈరోజు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమాధానం చెప్పాలని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో రాహుల్ గాంధీ ఒక జోకర్‌గా నిలిచిపోయారని పేర్కొన్నారు.

పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్ పదవి రద్దు కావాలని చెప్పిన రాహుల్ గాంధీ తెలంగాణ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన ఏం సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక పార్టీ బీఫారంపై గెలిచిన ఎమ్మెల్యే.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫారంపై ఎంపీగా పోటీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించకపోవడం విస్మయానికి గురిచేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దానం నాగేందర్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 12:12:26
Hyderabad, Telangana:

Blinkit Delivery Video Watch Here: సాధారణంగా మనకు ప్రతిరోజు ట్రాఫిక్ మధ్యలో ఎల్లో లేదా ఆరెంజ్ కలర్లో బ్యాగులు తగిలించుకొని ఒక టూ వీలర్ పై దూసుకు వెళ్లే డెలివరీ బాయ్స్ కనిపిస్తూ ఉంటారు. కానీ రాజస్థాన్‌లో మాత్రం ఓ డెలివరీ ఏజెంట్ దీనికి భిన్నంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలు విపరీతంగా వైరల్ అవుతుంది. పెట్రోల్ ధరల ప్రభావము లేక పర్యావరణం పైన ఉన్న ప్రేమనో తెలీదు కానీ ఒక వృద్ధుడు గుర్రంపై సవారి చేస్తూ సరుకులను డెలివరీ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారు. అయితే గుర్రంపై వెళ్తున్న సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్లే ఇతర ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

రాజస్థాన్‌కు చెందిన ఒక వృద్ధుడు సాంప్రదాయ దుస్తులను ధరించి.. తలకు పాగా చుట్టుకొని ఒక నల్లటి గుర్రంపై దర్జాగా వెళుతూ ఉండడం మీరు గమనించవచ్చు. ఆయన వీపుకు ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ Blinkit సంబంధించిన డెలివరీ చేసేందుకు తీసుకెళ్లే బ్యాగు కూడా మీరు చూడొచ్చు. ఆ పసుపు రంగు బ్యాగు తో అతను గుర్రంపై స్వారీ చేయడం చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది రాజస్థాన్ ప్రధాన్.. ఇక్కడ యువకులంతా గుర్రంపై స్వారీ చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి డెలివరీ కూడా ఇలా గుర్రంపై చేయగలుగుతున్నాను అని రాసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి వాయు కాలుష్యాన్ని నివారించడానికి ఇదొక అద్భుతమైన మార్గమని.. దీని ద్వారా పెట్రోల్ ఖర్చులు కూడా పూర్తిగా తగ్గుతాయని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ వస్తున్నారు. అలాగే మరికొంతమంది రాజస్థానీ కళాకారులతో ఎవరూ పడలేరని కొనేయాడుతూ కామెంట్లలో రాస్తున్నారు. ఏది ఏమైనా అతను ఇలా గుర్రాన్ని వినియోగించి ఇతరులకు వస్తువులు డెలివరీ చేయడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

और बुजुर्ग घोड़ों पर ऑनलाइन डिलीवरी कर रहे हैं…😂 pic.twitter.com/uYAzlhxSNY

రాజస్థాన్‌లో ఇలా గుర్రంపై స్వారీ చేస్తూ డెలివరీ చేయడం మొదటిసారి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి ఒంటెపై వెళ్లి డెలివరీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాను హల్చల్ చేశాయి. ఆధునిక సాంకేతికతకు బానిసవ్వకుండా ఇలా ఎవరికి నచ్చినట్టు వారు చేస్తున్న తీరు చూస్తుంటే సాంస్కృతి ఇంకా జీవిస్తుందనే ఆశలు పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా ఈ గుర్రంపై డెలివరీ చేయడానికి సంబంధించిన వీడియో అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు.

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 11, 2026 11:32:22
Tirupati, Andhra Pradesh:

Tirupati Garuda Varadhi Flyover: తిరుపతి పట్టణ ప్రజలతోపాటు అక్కడకు వచ్చే సందర్శకులకు భారీ అలర్ట్‌. తిరుపతి నగరానికి మణిహారంగా ఉన్న గరుడ వారధిపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇకపై బైక్‌లు, భారీ వాహనాలు ఫ్లైఓవర్‌పై రాకపోకలు సాగించరాదు. గరుడ వారధిపై బైక్‌లు, భారీ వాహనాలను గరుడ వారధిపై నిషేధిస్తూ స్థానిక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిషేధం విధించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంతకీ ఎందుకు నిషేధించారో తెలుసా?

Also Read: Harish Rao: ఢిల్లీలో నీతులు.. మరి తెలంగాణలో ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?: హరీశ్‌ రావు

తిరుపతిలోని గరుడ వారధిపై ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టగా.. ప్రమాదాల నియంత్రణకు ఆంక్షలు విధించారు. గరుడ వారధి ఫ్లైఓవర్‌పై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గరుడ వారధి ఫ్లైఓవర్‌ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఫ్లైఓవర్‌పై కొంతకాలంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ  సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్  మౌర్య నేతృత్వంలో  ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు సమాలోచనలు చేశారు.

Also Read: Hotels Close: బ్యాచిలర్స్‌ అలర్ట్‌! హైదరాబాద్‌లో హోటల్స్‌, హాస్టల్స్‌ క్లోజ్‌?

గరుడ వారధి ప్రారంభమైన నాటి నుంచి జరిగిన ప్రమాదాలను పరిశీలించిన అధికారుల కమిటీ ద్విచక్ర వాహనాలు, భారీ రవాణా వాహనాలతోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. బైక్‌లు అతివేగం, భారీ వాహనాల నియంత్రణ కోల్పోవడంతో సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల నివారణకు బైక్‌లు, భారీ వాహనాలు గరుడ వారధిపై నిషేధిస్తే ప్రమాదాలు తగ్గుతాయని అంచనాకు వచ్చిన అధికారులు ఆ మేరకు నిషేధం విధించారు. గరుడ వారధిపై బుధవారం నుంచి బైక్‌లు, భారీ వాహనాల రాకపోకలను తిరుపతి అధికారులు నిషేధించారు.

Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?

తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తొలగించేలా ఫ్లైఓవర్‌ను నిర్మించడంతో కొంత ఉపశమనం కలిగింది. అయితే ప్రమాదాలు జరుగుతుండడంతో ఫ్లైఓవర్‌పై ఆంక్షలు విధించారు. కొత్త నిర్ణయంతో తిరుమలకు వచ్చే భక్తులు తిరుచారు మామిడి మార్కెట్ యార్డ్ దగ్గర ఫ్లై ఓవర్ ఎక్కితే కపిలతీర్థం వరకు చేరుకునేలా గరుడ వారధి ఫ్లైఓవర్‌ నిర్మించారు. రేణిగుంట నుంచి వచ్చే వాహనాలు రామానుజ సర్కిల్ ముందు నుంచి, కరకంబాడి నుంచి వచ్చే వారికి లీలామహల్ ముందు నుంచి ఫ్లైఓవర్ మూడు ప్రాంతాలకు అనుగుణంగా ఉంది. ఇప్పుడు భారీ వాహనాలు, బైక్‌లు నిషేధించడంతో గతంలో మాదిరి కింది నుంచి అవి రాకపోకలు సాగించాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 08:25:05
Hyderabad, Telangana:

Students Massaging Teacher Video Watch Here: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని జీవితంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక గురువు.. తన వృత్తికి మచ్చ తెచ్చేలా వ్యవహరించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తరగతి గదిలోనే విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు సదరు ప్రధానోపాధ్యాయురాలను సస్పెండ్ చేస్తూ ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ఈ వీడియోని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.. ఈ వీడియోలు మీరు కూడా చూడాలనుకుంటున్నారా?

చిత్రా కూట్ జిల్లాలోని కర్వీ మైనర్ ప్రాంతంలో ఒక ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో మధురై అనే మహిళ ఉపాధ్యాయురాలుగా గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తుంది. పాఠశాల పని వేళల్లో ఆమె తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సింది పోయి.. కింద నేలపై పడుకొని మొబైల్ ఫోన్ చూస్తూ.. హాయిగా పిల్లలతో ఒళ్ళును నొక్కించుకుంటుంది. ఆ విద్యార్థులను పిలిచి మసాజ్ చేయించుకోవడమే కాకుండా తన కాళ్ళను కూడా నొక్కించుకుంటుందట.. టీచర్ చెప్పిన మాట కాదనలేక విద్యార్థులు కూడా ఆమె కాళ్లు నొక్కుతూ ఈ వీడియోలో కనిపించడం మీరు చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ గా మారాయి..

How can the future of children be shaped if principal herself exploits them like this? pic.twitter.com/dxLOjS5QR1

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ఎవరు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియో క్షణాల్లోనే ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ టీచర్ ప్రవర్తన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను బానిసల్ల వాడుకుంటారా అంటూ విద్యాశాఖను ప్రశ్నిస్తున్నారు.. అయితే ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి చేరడంతో వెంటనే.. విచారణకు ఆదేశించారు. శుక్రవారం పాఠశాలను సందర్శించిన విచారణ బృందానికి విద్యార్థులు షాకింగ్ విషయాలు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

సదరు టీచర్ తరచుగా తమతోనే ఇలా మసాజ్ చేయించుకుంటారని.. కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత పనులను కూడా చేయించుకుంటారని విద్యార్థులు వెల్లడించారు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల పట్ల ఇలా ప్రవర్తించినందుకు గాను ప్రధానోపాధ్యాయురాలు మధురాయిను జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తనపై ఇచ్చిన ఆరోపణలను మధురై కొట్టి పారేయడం ఇప్పుడు చర్చనీయాంశానికి దారితీసింది. ఆ వీడియోలో ఉన్నది తను కాదని.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సహాయంతో నకిలీ వీడియోను ఎవరు కావాలనే సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె తెలిపింది. కానీ ప్రాథమిక విచారణలో అది వాస్తవమేనని తేలడంతో విద్యాధికారులు ఆమెపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 07:46:45
Hyderabad, Telangana:

Woman Shaves Head Viral Video Watch: సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి వయస్సు రాగానే ఇంట్లో వాళ్లంతా ఎంతో ఆసక్తిగా పిల్లలకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలుపెడతారు. అంతేకాకుండా త్వరగా సెటిల్ అయిపోవడానికి పిల్లలపై ఒత్తిడి చేస్తూ ఉంటారు. అయితే, ఆ ఒత్తిడిని తట్టుకోలేక తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. తన ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేయాలని చూస్తున్న కుటుంబ సభ్యులకు నిరసనగా ఆమె ఏకంగా రాత్రికి రాత్రి గుండు కొట్టించుకుంది. గుండు కొట్టించుకొని ఆ యువతి వీడియో రిలీజ్ చేసింది.. దీనికి సంబంధించిన వీడియో ని ఇప్పుడు సోషల్ మీడియాను హల్చల్ చేస్తోంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు గత కొన్ని రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. తనకిప్పుడు పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదని.. బాగా చదువుకొని కెరీర్ పై దృష్టి పెట్టాలని ఆమె తన బాధని ఎంత చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేకపోయారు.. రోజురోజుకు ఇంట్లో పెళ్లి గోల ఎక్కువ అవ్వడంతో.. సంబంధాలు చూడటం ఆపాలని ఆ యువతి గట్టిగా నిర్ణయించుకుంది.. ఇందులో భాగంగానే ఆ యువతి రాత్రికి రాత్రి గుండు కొట్టించుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

వీడియో వైరల్..

అయితే ఆ యువతి ఒకరోజు రాత్రి తన ఇంట్లో తల్లిదండ్రుల గోల తట్టుకోలేక సెలూన్‌కి వెళ్లి పొడవాటి జుట్టును పూర్తిగా తొలగించుకుంది. ఆ యువతి తన జుట్టును మొత్తం క్లీన్ సేవ్ చేయించుకుంది. ఇలా చేసిన తర్వాత సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది.. నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే.. ఇదే జరుగుతుందని అని తన కుటుంబానికి వీడియో రూపంలో సందేశం పంపింది. అయితే, ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూనే ఉంది. చాలామంది ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు షేర్లు చేస్తున్నారు.

ఈ వీడియోకు సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఆమెకు మద్దతుగా.. అమ్మాయిల ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేయడం మహా తప్పు అని.. ఆమె తన నిరసన తెలపడానికి ఎంచుకున్న మార్గం తనలో ఉన్న బాధను తెలుపుతుందని.. కొంతమంది కామెంట్ చేస్తున్నారు.. మరి కొంతమంది తనకు పెళ్లి ఇష్టం లేదని తెలపడానికి ఇదొక మార్గమా? తల్లిదండ్రులతో కూర్చుని మాట్లాడి ఒప్పించాల్సింది పోయి ఇలా చేయడం చాలా తప్పని కామెంట్లు చేస్తూ వస్తున్నారు..

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 07:29:18
Hyderabad, Telangana:

60 Year Old Man Marries Video Watch Now: ప్రేమకు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేమలో పడుతున్న వైనం మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ కు చెందిన ఒక 60 ఏళ్ల వృద్ధుడు తనకంటే సగం వయస్సు తక్కువ ఉన్న యువతిని వివాహం చేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి కేవలం 20 ఏళ్ల వయస్సు ఉండడమే కాకుండా.. అప్పటికే తన చదువు పూర్తి చేసుకుందట.. ఈ వింత పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోని రావల్పిండికి చెందిన హకీం బాబర్ ఒక ఆయుర్వేద వైద్యుడు.. ఆయనకు దాదాపు 60 ఏళ్లకు పైగానే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే ఆయన 26 ఏళ్ల తన భార్యకు డైవర్స్ ఇచ్చి.. 26 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం దాదాపు 34 ఏళ్ళు ఉండడం విశేషం. అయితే మనుషులు కలిస్తే వయసు ఒక సంఖ్య మాత్రమే అని ఈ జంట ప్రపంచానికి చాటి చాటి చెప్పింది..

సాధారణంగా యువ పెళ్లి జంటలు చేసుకునే విధంగా.. ఆ వృద్ధ వరుడు కూడా ఇవ్వవధువుతో కలిసి గ్రాండ్ గా ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. పెళ్లి వేడుకలు హాకీమ్ బాబర్ తన భార్య కోసం ప్రేమ పాటలను పాడి.. పెళ్లికి వచ్చిన అతిధులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. అంతేకాకుండా కుల పెద్దలతో పాటు స్థానికులు వీరి పెళ్లికి అతిథులుగా వచ్చి ఆశీర్వదించారు.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. 

Video of Bridal Photoshot has gone viral on SM pic.twitter.com/FGQHjMLfth

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

ఈ వివాహానికి సంబంధించిన వీడియో మేఘ్ అప్‌డేట్స్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అయితే, దీనిని పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నటిజెన్లు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ప్రేమకు హద్దులు లేవని.. వారు సంతోషంగా ఉంటే చాలని కొందరు వారికి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు ఇది కేవలం డబ్బుల కోసమే జరిగిన పెళ్లి అంటూ కామెంట్లలో విమర్శలు గుప్పిస్తున్నారు. వృద్ధుడి ఆరోగ్యం, వయస్సు పై మరికొందరు జోకులు వేస్తూ కామెంట్లలో సోషల్ మీడియా వినియోగదారులను నవ్విస్తున్నారు.

Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 05:36:43
Hyderabad, Telangana:

Sun Moon Saturn Venus Conjunction Effect On Zodiac: అతి త్వరలోనే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది ఈ నవరాత్రులు మార్చి 19వ తేదీ నుంచి ప్రారంభమై 27వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే, ఈ నవరాత్రు లను దుర్గాదేవికి అంకితం చేశారు. ఈ సమయంలోనే కొన్ని అత్యంత అరుదైన గ్రహాల కలయిక కూడా జరుగుతోంది.. ముఖ్యంగా మొదటి రోజే సూర్యుడు, చంద్రుడు, శని, శుక్ర గ్రహాల కలయిక మీనరాశిలో జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏవైనా కొన్ని గ్రహాలు ఒక రాశిలో కలిసిన అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటిది ఈ నాలుగు గ్రహాలు ఒకే చోట కలవడం చాలా విశేషమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల ఈ క్రిందిరాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు..
మేషరాశి 
చైత్ర నవరాత్రుల సమయంలో మేష రాశి వారికి ఎక్కువగా మంచి ఫలితాలు కలుగుతాయి. కెరీర్‌తో పాటు ఉద్యోగాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక డబ్బులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలాకాలంగా ఎలాంటి శుభవార్తలు లేని వారికి ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల డబ్బుతో కూడిన శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్లో ఉన్న ప్రతి పని త్వరగా పూర్తవుతుంది. చట్టపరమైన కేసుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

కర్కాటక రాశి 
చైత్ర నవరాత్రుల సమయంలో కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. దీంతోపాటు వ్యాపారాలనుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలుగుతారు. వ్యాపారాల విస్తరణ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీరికి ఈ సమయంలో ఖ్యాతితో పాటు సామాజిక స్థితిగతులు పెరుగుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి కూడా లభిస్తుంది. అలాగే పిల్లలనుంచి అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మకర రాశి 
మకర రాశి వారికి చరిత్ర నవరాత్రుల నుంచి అద్భుతమైన శుభ సమయం ప్రారంభమవుతుంది. వీరు కొత్త ప్రాజెక్టుల నుంచి విశేషమైన గుర్తింపు పొందుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే కుటుంబంలో శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. పూర్వికుల ఆస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకం. అంతేకాకుండా ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే వీరికి బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 11, 2026 05:26:33
Hyderabad, Telangana:

Trigrahi Rajayog Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కదలికలు మానవ జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపుతాయో మనందరికీ తెలిసిందే. వీటి ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడుతుంది. రాబోయే ఐదు రోజుల్లో ముఖ్యమైన గ్రహాలు కదలికలు జరిపి ప్రత్యేకమైన సంయోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ముఖ్యంగా ఐదు రోజుల తర్వాత బృహస్పతి రాష్ట్ర పరిగణించే మీనంలో సూర్యుడుతో పాటు శుక్రుడు శని గ్రహాలకు జరుగుతుంది. దీని కారణంగా త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. 

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని విశ్వాసంతో పాటు నాయకత్వానికి సూచికగా భావిస్తారు. శని చర్యతో పాటు న్యాయాన్ని సూచిస్తుంది. శుక్రుడు భౌతిక ఆనందంతో పాటు శ్రేయస్సు, సంపదకు సూచికగా చెప్పుకుంటారు. అయితే ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన శుభ ప్రభావాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. త్రిగ్రహి రాజయోగం కారణంగా ధనస్సు రాశి తో పాటు మీనా, వృషభరాశులు ప్రభావితమవుతాయి. ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు లభించడమే కాకుండా.. ఈ  రాశుల్లో జన్మించిన వ్యక్తులకు కెరీర్, వ్యాపారాల పరంగా కూడా కలిసి వస్తుంది. జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మీన రాశి 
శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడడం వల్ల మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పనుల్లో కొత్త అవకాశాలు లభించడమే కాకుండా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతోపాటు కొత్త బాధ్యతలు లభించి అద్భుతమైన పనులు చేయగలుగుతారు. అలాగే చాలా కాలంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలపరంగా పదోన్నతులు లభించడమే.. ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి కారణంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసినా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ యోగ ప్రభావంతో కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు మారాలనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన పదోన్నతులు లభిస్తాయి. అంతేకాకుండా వీరు కొన్ని రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు చాలావరకు అద్భుతమైన అవకాశాలను తెచ్చి పెడతాయి. అలాగే భాగస్వామ్యుల నుంచి విశేషమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో కొన్ని రకాల పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాన్ని అందించబోతోంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

వృషభరాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ గ్రహ సంయోగం కారణంగా ఆర్థికంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడితో పాటు శని శుక్ర గ్రహాల కలయిక వల్ల వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా అద్భుతంగా లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు భారీ మొత్తంలో లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 10, 2026 16:51:01
Hyderabad, Telangana:

Amla Juice Benefits For Weight Loss: ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత ఔషధం ఉసిరికాయ. కేవలం ఒక గ్లాసు ఉసిరి నీటిని మీ రోజువారి జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ "పచ్చి ఉసిరి రసం" ఒక వరంలా పనిచేస్తుంది.

పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఉసిరి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిల నియంత్రణ
ఉసిరి నీరు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు ఉసిరి నీటిని తాగడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. ఇది సహజంగా షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గుదల..
శరీర జీవక్రియను వేగవంతం చేయడంలో ఉసిరి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, వ్యాయామంతో పాటు ఈ పానీయాన్ని తీసుకుంటే శరీరంలోని అదనపు కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్-సి మీ ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

జీర్ణ సమస్యలకు పరిష్కారం
అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది.

ఉసిరి రసం ఎలా తీసుకోవాలి?
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉసిరి రసాన్ని కలుపుకుని తాగాలి. ఈ పానీయం కొంచెం వగరుగా అనిపిస్తే, రుచి కోసం కొద్దిగా తేనెను కలుపుకోవచ్చు.

(గమనిక: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉసిరి రసం ఒక ఉత్తమ ఎంపిక. అయితే, ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు ఈ పానీయాన్ని ప్రారంభించే ముందు ఒకసారి వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: EPS 95 Pension Hike: పోరుబాట పట్టిన ఉద్యోగులు..ఈపీఎస్ పెన్షన్ 7 రెట్లు పెంపు?! ఫైనల్‌గా ఎంత రావొచ్చు?

Also Read: Washing Clothes At Night: రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 10, 2026 16:03:00
Hyderabad, Telangana:

Telangana Assembly Deputy Speaker: 'లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని భర్తీ చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మరి తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఎందుకు భర్తీ చేయడం లేదు' మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వేణుగోపాల్‌ తీరును ఖండించారు. 'రాష్ట్రంలో మాత్రం అడ్డగోలుగా రాజ్యాంగ ఉల్లంఘన. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే' అని విమర్శించారు.

Also Read: Hotels Close: బ్యాచిలర్స్‌ అలర్ట్‌! హైదరాబాద్‌లో హోటల్స్‌, హాస్టల్స్‌ క్లోజ్‌?

'తెలంగాణలో రెండేళ్లు దాటినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుపట్టారు. 'ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరడం, అగౌరవపరచడంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏడేళ్లుగా ఖాళీగా ఉంచడాన్ని రాజ్యాంగ శూన్యత అని పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ అనడం హాస్యాస్పదంగా ఉంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు.

Also Read: KTR: ప్రైవేటు బిల్లులు పెడతాం.. కాంగ్రెస్‌ను కడిగి పారేస్తాం: కేటీఆర్‌

'కేసీ వేణుగోపాల్‌ చెప్పిన మాటలు నిజమే కావచ్చు. కానీ అదే సూత్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తించదా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తున్నా.. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొంతు చించుకునే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ఏం సమాధానం చెబుతారు? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?

'రాజ్యాంగ విలువల గురించి ఢిల్లీలో నీతులు చెప్పే కాంగ్రెస్, తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల్లో వ్యవస్థలను ఖూనీ చేస్తోంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలనే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రిపీట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో పోటీ పడుతున్నాయని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్ నైజమని తెలిపారు. ఈ దొంగ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. 'అధికార దాహంతో ఈ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని అగౌరవపరచడం అత్యంత సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. రాజ్యాంగబద్ధమైన పదవులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Back to top