Moto G77 And Moto G67: మోటరోలా కంపెనీ మార్కెట్‌లోకి తమ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఇవి అద్భుతమైన డిజైన్‌తో చాలా ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.. దీనిని కంపెనీ మోటో G77, మోటో G67 పేర్లతో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ప్రత్యేకమైన కలర్స్‌తో పాటు అద్భుతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇవి చూడడానికి చాలా అద్భుతమైన లుక్కుని కలిగి ఉన్నాయి. అయితే, ఈ రెండు మొబైల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మోటో G67 కంపెనీ చాలా ప్రత్యేకమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇక మోటో G77 మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ప్రాసెసర్ తో లాంచ్ అయింది. ఇవి రెండు అద్భుతమైన ఆండ్రాయిడ్ 16 పై నడుస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Moto G77, Moto G67 స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రూ.25,400 లోపు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంతేకాకుండా వేరియంట్స్‌ను బట్టి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీ రెండు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా g77 స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.31 వేల ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ రెండింటి స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ రెండు మొబైల్స్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
మోటరోలాలోని G67 మోడల్ 4GB ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక g77 మోడల్ 8gb ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌లోని మొబైల్ స్టోరేజ్ పెంచుకునేందుకు ప్రత్యేకమైన SD కార్డు సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లోని మొదటి వేరియంట్ వెనక భాగంలో అద్భుతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో లభిస్తుంది. అలాగే G77 మోడల్ ఎంతో శక్తివంతమైన 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా తో అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 5,200mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అతి త్వరలోనే భారత్ లో కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
K Chandrashekar Rao: రాజకీయ కక్ష్యతోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌లో నోటీస్ ఇచ్చారని తెలిపారు. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని.. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇంటి అడ్రస్ కొడంగల్ అయితే గతంలో అధికారులు హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. కేసీఆర్ మాత్రం అలా చేయక వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయమని హెచ్చరించారు.
Also Read: BRS Party Protest: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విచారణ.. రేపు బీఆర్‌ఎస్ పార్టీ నిరసనలు
సిద్దిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.'టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్‌పై వేధింపులు, సీరియల్ తరహాలో రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే అలీబాబా 40 దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు' అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరని తెలిపారు. 'ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హసనం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు' అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల పాలన కొనసాగిస్తోంది' అని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కేవలం కక్షపూరిత రాజకీయాలతో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ వంటి అంశాలతో రెండున్నరేళ్లుగా ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని తెలిపారు. తెలంగాణ కోసం శ్రమించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని.. నోటీసులతో భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు.
'సమ్మక్క–సారక్క అమ్మవార్ల జాతర ఆహ్వానాన్ని మంత్రులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఇచ్చారు. విచారణకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు రావాలని సూచించినప్పటికీ కక్షపూరితంగా నందినగర్ నివాసంలోనే విచారణ చేస్తామని చెప్పడం అన్యాయం' అని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి సిట్ నోటీసులు గోడకు అతికించడం అవమానకరమని చెప్పారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎంత ఒత్తిడి తెచ్చినా టీఆర్ఎస్ నాయకులు భయపడరని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Snakes Temple Video Watch: సాధారణంగా పాములు కనిపిస్తేనే చాలు.. చాలామంది ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. కానీ ఒక గుడిలో మాత్రం మొత్తం పాములే ఉంటాయి. ఎటు చూసినా పాములు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు.. ఏ మాత్రం భయపడకుండా పారిపోకుండా వాటికి నమస్కరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గుడి ప్రాంగణం తో పాటు గర్వాలయంలో లోపల కూడా పాములే దర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గుడికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజు ఉదయాన్నే నాగుపాములు స్వయంగా గుడి లోపలికి వస్తాయట.. అంతేకాకుండా అక్కడి పూజారి ఆ పాములను భయపెట్టకుండా.. ఎంతో భక్తితో వాటికి కుంకుమ బొట్టు పెట్టి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారని అక్కడి భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ పాములన్ని పూజా సమయంలో చాలా ప్రశాంతంగా కూడా ఉంటాయని వారు అంటున్నారు. ఈ సమయంలో వచ్చే భక్తులకు కూడా ఆ ప్రమాదకరమైన పాములు ఎలాంటి హాని కలిగించమని వారు చెబుతున్నారు.
అలాగే ఈ పాములన్ని గుడికి వచ్చే భక్తుల చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయట.. అవి ఎవరిని ఏమీ చేయవని అక్కడి భక్తులు చెబుతూ ఉంటారు. పాములంటే భయం ఉన్నవారు ఈ గుడిలో కొంత జాగ్రత్తగా ఉండాలని అక్కడి స్థానికులు చెబుతారు. అలాగే ఈ గుడికి వచ్చిన కొంత మంది భక్తులు స్వయంగా పాములకు కుంకుమ తిలకం దిద్దుతారట. మరికొంతమంది అయితే, మరి కొంతమంది అయితే, వాటికి పాలు కూడా పోస్తారని సమాచారం. ఇలా ఆ పాములు ఎంతమంది భక్తులు వచ్చినా గుడిలో మాత్రం ప్రశాంతంగా ఉంటాయని అక్కడి భక్తులు చెబుతున్నారు.
Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
ఆ గుడిలోకి వచ్చే భక్తులు ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారని.. అందువల్ల ఆ పాములు ఏమీ చేయమని సమాచారం. అలాగే అక్కడ పూజలు చేసే పూజలు కూడా వాటికి ప్రత్యేకంగా ప్రసాదాలు తయారుచేసి అందిస్తారని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ని ఓ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ కొన్ని లక్షలమంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి లైక్ కూడా చేశారు.
Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ex CM KCR Probe: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు తీవ్రమవుతుండడంతో ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ విచారణ సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. రేపు శాంతియుతంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని కేటీఆర్ పార్టీ నాయకత్వానికి సూచించారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలపై బీఆర్‌ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు వివేకానంద్, కృష్ణారావు, సీనియర్ నాయకులు బాలమల్లు, కర్నె ప్రభాకర్ తదితరులు కీలక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ని వేధిస్తోందని.. రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం మండిపడింది. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి.. ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన, నీచమైన వైఖరి అని అభివర్ణించింది. రేపటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం సూచించింది. ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని గులాబీ పార్టీ నాయకత్వం ఆదేశించింది.
పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hyderabad: 'విద్యార్థి సంఘ్ రాజకీయాలు లేకుండా విద్యార్థి ఎన్నికలు లేకున్న నేను ఈరోజు ఇక్కడ మాట్లాడేది కాదు. విద్యార్థి రాజకీయాల్లో 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నా. విద్యార్థి సంఘ్ ఎన్నికలు ఉండాలి. 1988లో విద్యార్థి సంఘ ఎన్నికలు రద్దయ్యాయి. చట్టసభలపై అవగాహన.. చర్చలు జరుగుతున్న విధానం, ప్రజా సమస్యలపై అవగాహన చేసుకుని ఎలా పరిష్కారం చేయాలని ఈ యూత్ పార్లమెంట్‌తో అవగాహన కలుగుతుంది' అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్‌లోని బాబు జాగ్జీవన్ రామ్ భవన్‌లో ఐ విజన్ యూత్ పార్లమెంట్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పొన్నం ప్రభాకర్ కీలక ప్రసంగం చేశారు. 'విద్యార్థుల యూత్ పార్లమెంట్ భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఢిల్లీలాంటి రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదంలో పడింది. ఆ పరిస్థితుల నుంచి మనం ఎలా రక్షించుకోవాలి? యువత ఆలోచించాలి. నీటి వనరుల వినియోగం, విద్యా వ్యవస్థలో సర్టిఫికెట్‌లకు పరిమితం కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించుకునేలా ఉండాలి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎన్నో పోటీ పరీక్షలు రాసి వచ్చినవారు.. హైక్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటది' అని పొన్నం ప్రభాకర్ వివరించారు.
'పోటీలో ఉన్నామంటే పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సమాజంపై అవగాహన , ఎక్స్‌ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యం కల్పించాలి. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా మీరంతా కష్టపడాలి.. దేశ భవిషత్ మీ చేతిలో ఉంది' అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.'భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టేది పార్లమెంట్. ఇక్కడ జరిగే చర్చలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి' అని వివరించారు. అలాంటి పార్లమెంట్ పనితీరును యువత విద్యార్థులు ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరమని తెలిపారు.
'యూత్ పార్లమెంట్‌తో చట్టాల రూపకల్పన ఎలా జరుగుతుందో.. ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయో, భిన్న అభిప్రాయాలను ఎలా గౌరవించాలో, ఆరోగ్యకరమైన విమర్శలు ఎలా చేయాలో నేర్చుకుంటారు' అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. 'దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిపై విమర్శలు కాకుండా స్పష్టమైన పరిష్కారాలను సూచించే బాధ్యత మన అందరిపై ఉంది' అని చెప్పారు.
'యూత్ పార్లమెంట్ ఆ బాధ్యతాయుత ఆలోచనలకు వేదిక అవుతోంది. యూత్ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులు దేశ పార్లమెంట్‌లో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరాలి. ప్రతి ఒక్కరూ మంచి పౌరులుగా, బాధ్యతాయుత నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నా' అని పొన్నం ప్రభాకర్ అభిలషించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డీఈవో రోహిణి, ఐ విజన్ గ్రూప్ ప్రతినిధి అంజలి తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CPI Supports To BRS Party: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేలా పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ కాంగ్రెస్‌తో కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ, సీపీఐ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ పరిణామంతో వివేక్ వెంకటస్వామికి భారీ షాక్ తగిలింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను వీడి బీఆర్ఎస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు కుదరలేదు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సీపీఐ మధ్య సయోధ్య కుదరకపోవడంతో గందరగోళం ఏర్పడింది. మిత్రపక్షం సీపీఐకి తక్కువ స్థానాలు ఇచ్చి అవమానించడంతో కాంగ్రెస్‌ను వదిలేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించింది.
ఈ సందర్భంగా చెన్నూరులో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి సీపీఐ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కలవేన శంకర్ కీలక ప్రకటన చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. స్థానిక నాయకుల మాటలు నమ్మి వివేక్ వెంకటస్వామి సీపీఐని చిన్నచూపు చూస్తున్నాడని మండిపడ్డారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గెలిచి వివేక్ వెంకటస్వామికి సీపీఐ సత్తా ఏంటో చూపిస్తామని ప్రకటించారు. వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలవడానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. కానీ అది వివేక్ గ్రహించకుండా తమను ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామికి పూర్తి మద్దతు తెలిపిన సీపీఐ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది. వివేక్ వెంకటస్వామి వైఖరిపై ఇప్పటికే ఎర్రజెండా పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో సీపీఐ కలిసి నడిచేందుకు వెనుకంజ వేసింది. అయితే ఈ పొత్తు ఒక్క క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఉంటుందా? లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడుతుందా? అనేది ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
China Manjha: సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలతో జరగ్గా.. ఒక హైదరాబాద్‌లో మాత్రం విషాదంగా మారింది. పండుగ సందర్భంగా ఎగురవేసిన గాలిపటాల మాంజా తగిలి పలువురు తీవ్రంగా గాయపడగా.. రెండు ప్రాణాలు పోయాయి. ఈ విషాద సంఘటనల అనంతరం హైదరాబాద్ పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. ఆరుబయట.. బహిరంగ ప్రదేశాల్లో చిక్కుకున్న చైనా మాంజాను తొలగించే పని చేపట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజలకు గాయాలు, ప్రాణనష్టం జరగకుండా నివారించే ముందస్తు లక్ష్యంతో వీధులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భవనాలపై కోసిన, తెగి పడిపోయి ఉన్న మాంజాను గుర్తించి తొలగించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో ప్రజలు, వాకర్స్ స్వచ్చందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా గచ్చిబౌలి, అమీన్‌పూర్, పటాన్‌చెరు, కొల్లూరు, ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో విస్తృతంగా చేపట్టారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసులు మూడు బృందాలుగా మారి కొండాపూర్, మజీద్ బండ ప్రాంతాల్లో ప్రజల సహకారంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు, భవనాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ప్రమాదకర మాంజాను వినియోగించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.
అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలాపూర్ మైదానం, తులసీవనం కాలనీలో 150 వాకర్లతో కలిసి దారాలను తొలగించారు. చైనా మాంజా వాడకం చట్ట విరుద్ధమని, కొన్నా.. వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు అవగాహన కల్పించారు. పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రిగ్రౌండ్, సాకి చెరువు, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో స్థానికులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు, ఓజోన్ హైట్స్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో ప్రజలకు చైనా మాంజా వినియోగంపై అవగాహన కల్పించారు. ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని రోడ్లపై ఉన్న గాజు నూలును తొలగించారు.
ప్రాణాంతక పతంగి నూలు తయారీ, విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు. ఎక్కడైనా మాంజా వేలాడుతూ కనిపిస్తే జాగ్రత్తగా దాన్ని తొలగించి పడేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Phone Tapping Notice: 'డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తూ.. ఏదో ఒక్క అసత్య ప్రచారం చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వకుండా గోడకు అంటించి వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ ఉంటున్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఇవ్వకుండా అవమానించారని మండిపడ్డారు. కేసీఆర్‌ను దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. 'కేసీఆర్ గజ్వేల్ నియోజవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎర్రవెల్లి కూడా దాని పరిధిలోకి వస్తుంది. ఎర్రవెల్లిలో తనకు నోటీసులు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. రెండు, మూడు కార్యక్రమాలు విషయాలు మంత్రులు వెళ్లి స్వాగతం పలికారు. మేడారం జాతరకు రావాలని సీతక్క, కొండా సురేఖ ఆహ్వానించారు. ఎర్రవెల్లి తెలియని ప్రదేశం కాదు కదా? మీరు అంటున్న అధికారిక నివాసం నందినగర్ అయితే. మరి హరీష్ రావు గారి అధికారిక నివాసం సిద్దిపేట అయితే మీరు హైదరాబాద్ లో ఎందుకు ఇచ్చారు?' అని ప్రశ్నించారు.
'మీ అవసరం మేరకు మీ సదుపాయం కోసం నోటీసులు ఇస్తున్నారు. మీ గురువు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆయన ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు. మీ గురువు దేశానికి ప్రధానమంత్రి కావాలని నువ్వు కోరుకోవచ్చు, అనవచ్చు తప్పులేదు. మీ అవినీతి ఆరోపణలు బయట పెడుతుండడంతోనే కేటీఆర్, హరీశ్ రావు.. ఇప్పుడు కేసీఆర్ నోటీసులు ఇస్తున్నావు' అని రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.
'ఫార్ములా ఈ కార్ కేసు అసలు కేసే కాదు. ఫోన్ టాపింగ్ అనేది అన్ని రాష్ట్రాలు జరుగుతోంది. ఫోన్ టాపింగ్ అనే అసత్య ప్రచారం చేస్తూ అవమానించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ పరిహాసం కావడంతో అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లావు' అని కర్నె ప్రభాకర్ తెలిపారు. ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ని కేంద్ర ప్రభుత్వమే బయటిపెట్టి కాళేశ్వరం, మిషన్ కాకతీయతో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది అని చెప్పిందని గుర్తుచేశారు. కాళేశ్వరంపై అబద్ధపు ప్రచారం అని ఎకనమిక్ సర్వేతో తేలిందని కర్నె ప్రభాకర్ చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Australia Squad For T20 World Cup: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మునుపటి ప్రొవిజనల్ స్క్వాడ్‌లో ఉన్న పలువురు కీలక ఆటగాళ్లను తప్పించి, ఆస్ట్రేలియా బోర్డు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది.
ప్యాట్ కమిన్స్‌కు వెన్నెముక గాయం
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో బాధపడుతున్న అతనికి విశ్రాంతినివ్వాలని బోర్డు నిర్ణయించింది. కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
స్టీవ్ స్మిత్, మ్యాట్ షార్ట్ అవుట్
అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్‌ను ఈసారి సెలెక్టర్లు పక్కన పెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే స్మిత్‌ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అలాగే, ప్రొవిజనల్ జట్టులో ఉన్న మ్యాట్ షార్ట్‌ను తప్పించి, అతని స్థానంలో మ్యాట్ రేన్‌షాను జట్టులోకి చేర్చారు.
మార్ష్ సారథ్యంలో ఆసీస్
ఈసారి వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టును మిచెల్ మార్ష్ ముందుండి నడిపించనున్నాడు. జట్టులో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ఆల్‌రౌండర్లతో పాటు ట్రావిస్ హెడ్ వంటి పవర్ హిట్టర్లు ఉండటం జట్టుకు కలిసివచ్చే అంశం.
ఆస్ట్రేలియా తుది జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, క్యామరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జాంపా, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానొల్లి, బెన్ డ్వార్షుయిస్, మ్యాట్ రేన్‌షా, మ్యాట్ కూనెమన్
భారత్, శ్రీలంక స్పిన్ పిచ్‌లపై ఆడమ్ జాంపా, మ్యాట్ కూనెమన్ వంటి స్పిన్నర్లు కీలకం కానున్నారు. ప్యాట్ కమిన్స్ లేని లోటును ఈ యువ బౌలర్లు భర్తీ చేస్తారో లేదో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ambulance Scam Medaram Telugu Latest News: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో కొంతమంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బరితెగించారు.. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాల్సిన అంబులెన్స్లను ప్రైవేటు రవాణా వ్యాపారానికి వాడుకుంటూ అక్రమ దందాకు తెరలేపారు. ములుగు నుంచి మేడారం వరకు భక్తులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. వీటిని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు దుమ్మెత్తి పోస్తున్నారు.
మేడారానికి తరలివస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు జాతర సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మేడారంలోని కొన్ని ప్రాంతాలకు సాధారణ వాహనాలకు అనుమతి లేదు. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అక్రమార్కులు 'ఎసెన్షియల్ సప్లైస్ వెహికల్' పాసులను అడ్డం పెట్టుకొని అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంబులెన్స్‌లకు ఉండే ప్రత్యేకమైన వెసులుబాటును వాడుకుంటూ.. సైరన్ వేసుకుంటూ మరి అత్యవసర సర్వీసు అని అక్కడున్న భక్తులను నమ్మిస్తూ డబ్బులు ఇచ్చిన మరికొంతమంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అలాగే కొన్ని చెక్ పాయింట్స్ వద్ద పోలీసులు సైతం అంబులెన్స్‌లని వదిలేస్తుండడంతో.. ఈ అక్రమానికి పాల్పడుతున్న సిబ్బందికి ఏ అడ్డు అదుపు లేకుండా పోయింది..
అంతేకాకుండా ఈ అక్రమ రవాణా అను కేవలం సామాన్య భక్తులకే కాకుండా.. వైద్య ఆరోగ్యశాఖలో పని చేసే ఉన్నత అధికారుల కుటుంబాలతో పాటు వారికి సంబంధించిన బంధువులను నేరుగా మేడారం అమ్మవార్లకు సంబంధించిన మహాద్వారం వరకు ఈ అంబులెన్స్‌లోనే తరలిస్తూ వస్తున్నారని సమాచారం.. ములుగు డీఎంహెచ్వో (DM, HO) కార్యాలయాల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సామాన్యులు కిలోమీటర్ల కొద్ది నడిచి అమ్మవార్ల దగ్గరికి చేరుకుంటే.. వీరు మాత్రం ప్రభుత్వ వాహనాలల్లో రాజభోగాలను అనుభవిస్తున్నారని అక్కడి భక్తులు మండిపడుతున్నారు.
వైద్య సేవల కోసం కేటాయించిన ఈ అంబులెన్సులు ఇలా పక్కదారి పడుతుంటే ఉన్నత అధికారులు మాత్రం ఏం చేస్తున్నారని అక్కడి భక్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా ఏదైనా అత్యవసర సమయంలో ఎవరికైనా ప్రాణాపాయం ఉంటే.. అంబులెన్సులు సరిగ్గా అందుబాటులో లేకపోతే బాధ్యులు ఎవరవుతారని ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఇలా చేయడం చాలా తప్పని కొంతమంది భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు అందనుంది. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన AICPI-IW (అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక) గణాంకాలు వెలువడటంతో, వచ్చే ఏడాది జనవరి నుండి వర్తించేలా కరువు భత్యం (DA) పెరగడం ఖాయమైంది. ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగుల జీతాలను రక్షించే క్రమంలో, కేంద్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని సవరిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం 2026 జనవరి నుండి ఈ పెంపు వర్తిస్తుంది.
5% పెరగనున్న డీఏ
డిసెంబర్ 2025 నాటికి AICPI-IW సూచిక 148.2 వద్ద స్థిరంగా ఉండటంతో, కరువు భత్యం 5 శాతం పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత డీఏ: 58%
ప్రతిపాదిత పెంపు: 5%
మొత్తం డీఏ: 63%
రవాణా భత్యం కూడా పెంపు
డీఏ పెరిగినప్పుడల్లా దానికి అనుగుణంగా రవాణా భత్యం కూడా పెరుగుతుంది. నగరం (X, Y, Z కేటగిరీలు), పే లెవల్ ఆధారంగా ఇది మారుతుంది.
ఉదాహరణ: Y-కేటగిరీ నగరంలో పని చేస్తూ, రూ.1,800 ప్రాథమిక రవాణా భత్యం పొందే ఉద్యోగికి, 63% డీఏ కలిపితే మొత్తం రవాణా భత్యం రూ.2,934 కి చేరుకుంటుంది.
ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది?
సాధారణంగా ప్రభుత్వం ఈ పెంపును మార్చి లేదా ఏప్రిల్ 2026లో అధికారికంగా ప్రకటించవచ్చు. అయితే, ఈ పెంపు జనవరి 2026 నుండి అమలులోకి వస్తుంది కాబట్టి, ఉద్యోగులకు మూడు నెలల బకాయిలు ఏప్రిల్ జీతంతో పాటు అందుతాయి.
ఉద్యోగ సంఘాల డిమాండ్లు
ప్రస్తుతం ఉన్న డీఏను మూల వేతనంలో విలీనం చేయాలని ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. 8వ వేతన కమిషన్‌పై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ప్రస్తుతానికి డీఏ విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా 5% డీఏ పెంపు అనేది లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు గొప్ప ఊరటనిస్తుంది. ఇది ఏప్రిల్ 2026 జీతాల్లో ప్రతిఫలించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cm Revanth Reddy Latest Telugu News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సుదీర్ఘ విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని శనివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇటీవల దావత్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుతోపాటు అమెరికాలోని పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ఆయన భేటీ ఆయన సంగతి తెలిసిందే.. తెలంగాణ రాష్ట్రానికి అతి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటన ముగించుకొని.. ఆయన స్వదేశానికి ఈరోజు తిరిగి రాబోతున్నారు.. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన వెంటనే మంత్రులతో ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనబోతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సాధించేందుకు.. ఫిబ్రవరి రెండవ తేదీన సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోబోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సమావేశంలో చర్చకు వచ్చే ప్రధాన అంశాల వివరాల్లోకి వెళ్తే.. ముందుగా పెట్టుబడులపై షమీక్ష నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.. దావోస్ తో పాటు అమెరికా పర్యటనల్లో కుదిరిన ఒప్పందాలతో పాటు రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు, వాటి అమలుపై మంత్రులకు సీఎం వివరించనన్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో అతి త్వరలోనే జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించే అవకాశాలున్నాయి. ఎన్నికల వ్యూహాలతో పాటు అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అకస్మాత్తుగా మారుతున్న తాజా రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లడం వంటి అంశాలపై కూడా ఈ మంత్రుల మీటింగ్‌లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు పెండింగ్లో ఉన్న ప్రత్యేకమైన ప్రాజెక్టులతో పాటు పథకాలకు సంబంధించిన అమలు తీరిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు.
దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గాల్లో సందడి నెలకొంది. అంతేకాకుండా విదేశీ పర్యటనలో ఆయన రాష్ట్రం తరఫున చేసిన పెట్టుబడి ఒప్పందాలు అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.. ఫిబ్రవరి 2వ తేదీన జరిగే ఈ సమావేశం తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Union Budget 2026 Key Things: రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఈ బడ్జెట్‌లో ఎలాంటి కీలక ప్రకటనలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆదాయపు పన్ను మార్పులు
గత బడ్జెట్‌లలో ఇప్పటికే పన్ను స్లాబ్‌లలో మార్పులు చేసినందున, ఈసారి స్లాబ్‌లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.75,000 నుండి రూ.1 లక్షకు పెంచే అవకాశం ఉందని మధ్యతరగతి ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.
గృహ రుణంపై ఊరట
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి, సెక్షన్ 24(b) కింద గృహ రుణ వడ్డీ మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుండి పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇది ఇల్లు కొనేవారికి పెద్ద ఊరటనిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు 'బూస్ట్'
వృద్ధులకు ఊరటనిస్తూ సెక్షన్ 80TTB కింద వడ్డీ ఆదాయంపై మినహాయింపు పరిమితిని రూ.50,000 నుండి రూ.1 లక్షకు పెంచవచ్చని సమాచారం. అలాగే రైల్వే రాయితీల పునరుద్ధరణపై కూడా ఆశలు ఉన్నాయి.
ఆరోగ్య బీమా
వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో, సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని పరిశ్రమ వర్గాల నుండి డిమాండ్ వినిపిస్తోంది.
పెట్టుబడులు - మూలధన లాభాలు
దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను రహిత పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1.25 లక్షల నుండి రూ.2 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు మేలు చేస్తుంది.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & క్యాపెక్స్
రోడ్లు, రైల్వేలు, పట్టణాభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని (CAPEX) 10-15 శాతం పెంచి, సుమారు రూ.12 - రూ.12.5 లక్షల కోట్లకు చేర్చే అవకాశం ఉంది. దీనివల్ల మౌలిక సదుపాయాల రంగం పుంజుకుంటుంది.
టెక్నాలజీ & AI కి పెద్దపీట
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాలకు భారీగా నిధులు కేటాయించవచ్చు.
MSME, తయారీ రంగం
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) సులభంగా రుణాలు అందించడం, 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా స్థానిక ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉండనున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని అరికడుతూనే వృద్ధిని కొనసాగించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగానే ఈ అంశాలపై స్పష్టత రానుంది.
Also REad: Bank Strike February: ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె! మీ పనులు ముందే ప్లాన్ చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kevin Warsh Gold Price Crash: గడిచిన రెండు రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తోంది. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి అమెరికాలోని తాజా పరిణామాలు ఎలా కారణమయ్యాయో తెలుసుకుందాం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్ బాధ్యతలు చేపడతారనే సంకేతాలు వెలువడటమే బులియన్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
కెవిన్ వార్ష్ ప్రభావం ఏమిటి?
కెవిన్ వార్ష్ గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన వడ్డీ రేట్ల విషయంలో చాలా కఠినంగా (Hawkish) ఉంటారని మార్కెట్ నిపుణుల నమ్మకం. ఆయన విధానాల వల్ల వడ్డీ రేట్లు సుదీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంటాయని, ఫలితంగా డాలర్ మరింత బలపడుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం ప్రారంభమైంది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి.
భారీగా అమ్ముతున్న ఇన్వెస్టర్లు
డాలర్ పుంజుకోవడంతో, గ్లోబల్ ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో విక్రయాలు (Sell-off) జరగడం వల్ల బంగారం తన మెరుపును కోల్పోయి నేలచూపులు చూస్తోంది.
వెండిపై కూడా అదే దెబ్బ
కేవలం బంగారమే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు కీలకమైన వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వెండి ధరను కూడా అధఃపాతాళానికి తొక్కింది.
భారతీయ మార్కెట్లపై ప్రభావం
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయంగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో ధరలు భారీగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అత్యధిక ధరలు ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుత పతనంతో నష్టాలను చవిచూస్తున్నారు.
కెవిన్ వార్ష్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చే ప్రకటనల మీదనే బులియన్ మార్కెట్ తదుపరి గమనం ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గించే సంకేతాలు వస్తే తప్ప, బంగారం ధరలు మళ్లీ పుంజుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALso Read: Bank Strike February: ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె! మీ పనులు ముందే ప్లాన్ చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Medaram Traffic Jam Today 2026 Telugu: ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల కష్టాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిలను దర్శించుకోవాలనే తపనతో వచ్చే భక్తులకు మార్గం మధ్యలోనే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి ములుగు జిల్లాల్లో ట్రాఫిక్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గురు శుక్రవారాల నుంచి ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మేడారంలో ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉన్నాయి? భక్తులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో తెలుసుకుందాం..
ప్రస్తుతం మేడారానికి వెళ్లే దారులని వాహనాలతో ఊహించని స్థాయిలో కిక్కిరిసిపోయాయి. పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నా.. మేడారంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి చూస్తే. అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పస్రా నుంచి మేడారం వరకు ప్రయాణం ఒక పెద్ద నరకప్రాయంగా మారిందని అక్కడున్న భక్తులు చెబుతూ వస్తున్నారు.. అంతేకాకుండా ఈ రోడ్డు గుండా వెళ్లే వారికి సాధారణంగా 10 గంటల సమయం పడుతుందని వారు అంటున్నారు..
అలాగే పస్రా - తాడ్వాయి మధ్య ఉన్న స్వల్ప దూరానికే సుమారు 4 గంటల పాటు సమయం పడుతుందని భక్తులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తాడ్వాయి - మేడారం మధ్య పరిస్థితి అంత మెరుగ్గా లేదని.. వాహనాలు ఈ రెండు ప్రాంతాలకు చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల పాటు సమయం పడుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా రాత్రి నుంచి కొన్ని వాహనాలు ఇక్కడే నిలిచిపోయాయని వారు చెబుతున్నారు.
Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
ఈసారి అధికారిక యంత్రాంగం జాతరలో భాగంగా అన్ని రకాల సమస్యలను నియంత్రించేందుకు ఆధునిక టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియన్ ఇంటిలిజెన్సీ పరిజ్ఞానాన్ని వాడుతున్నామని భారీగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పరిజ్ఞానం ఏమాత్రం ఫలితాలను అందించలేకపోయింది. ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లించడంతోపాటు రద్దీని ముందే అంచనా వేయడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. ఉన్నత అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే వేలాదిమంది భక్తులు అడవి బాటలో గంటల తరబడి చిక్కుకుపోయారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు భక్తులంతా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం వల్ల అవస్థలు పడుతుంటే.. మరోవైపు మేడారంలోని గద్దెల వద్ద ఉన్న క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అంతేకాకుండా రాత్రి సమయాల్లో తాగునీరుతో పాటు ఆహారం దొరకక వృద్ధులతో పాటు కొంతమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook