Mohan Babu West Bengal Governor Excellence Award: నట ప్రపూర్ణ.. కలెక్షన్ కింగ్.. తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు రూటే సెపరేటు అనే చెప్పాలి. కేవలం హీరోగానే కాకుండా.. విలన్ గా.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. రీసెంట్ గా నటుడిగా 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈయన కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది. రిపబ్లిక డే సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డుని అందుకున్నారు మంచు మోహన్ బాబు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను డాక్టర్ ఎం. మోహన్ బాబు అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఈ అవార్డును విశిష్ట అతిథుల మధ్య ఆయనకు ప్రధానం చేయడం జరిగింది. ఆ తరువాత సాంప్రదాయ ఎట్ హోమ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు, మా అధ్యక్షుడు విష్ణు మంచు, మా కోశాధికారి శివ బాలాజీ పాల్గొన్నారు.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ఎఫెక్ట్ కనబడుతుంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ఇదే తొలిసారి అని చెప్పాలి. మోహన్ బాబు 50 యేళ్ల సినీ జీవితంలో కళామతల్లికి చేసిన సేవ, అట్టడుగు స్థాయి నుండి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. విద్య, దాతృత్వంలో సమాజంపై చెరగని ముద్ర వేసారు. ఆయన సినీ, వ్యక్తిగత జీవితం, పాటించే క్రమశిక్షణ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. గతంలో 2007లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.
కళకు, కళాకారులకు హద్దులు ఉండవని, భాషా సరిహద్దులు ఉండవని మోహన్ బాబుకు వచ్చిన అవార్డుతో మరోసారి ప్రూవ్ అయింది. అంతా ఒక్కటే అనే గణతంత్ర దినోత్సవ సారాంశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. మోహన్ బాబు ఈ అవార్డుని అందుకోవడంతో టాలీవుడ్ సెలెబ్రిటీలు, ఆయన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా ఆపై ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా అలరించి.. మళ్లీ కథానాయకుడిగా రాణించిన నటుడు బహుశా తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు లేరనే చెప్పాలి. కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. అంతేకాదు హీరోగా ఉంటూ అత్యధిక చిత్రాలను నిర్మించిన నిర్మాతగా మన దేశంలోనే మోహన్ బాబు రికార్డు క్రియేట్ చేశారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Ajit Pawar Political Career: మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, పరిపాలనలో "దాదా" (పెద్దన్న) అని పిలుచుకునే అజిత్ పవార్ ఇకలేరు. ఈరోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం. దశాబ్దాల కాలం పాటు బారామతి కోటను కాపాడుకుంటూ, రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఆయన ఎదిగిన తీరు అసాధారణం.
అజిత్ పవార్ రాజకీయ జీవిత విశేషాలు..
6 సార్లు ఉపముఖ్యమంత్రిగా..
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో వరుసగా కాకపోయినా అత్యధిక కాలం, అత్యధిక సార్లు (6 పర్యాయాలు) ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు అజిత్ పవార్. ఆయన విభిన్న సిద్ధాంతాలు కలిగిన ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్), దేవేంద్ర ఫడ్నవీస్ (బిజెపి), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన - MVA), ఏక్‌నాథ్ షిండే (శివసేన - మహాయుతి) వంటి నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న క్రమంలో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
బారామతి వారసుడిగా..
1982లో ఒక సహకార చక్కెర కర్మాగారం బోర్డు సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలాగే 1991లో పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, గ్రామీణ స్థాయిలో పట్టు సాధించారు. అదే ఏడాది 1991లో బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ, తన మామ శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశారు.
తిరుగులేని శాసనసభ్యుడు
బారామతి అసెంబ్లీ నియోజకవర్గం అంటే అజిత్ పవార్, అజిత్ పవార్ అంటే బారామతి అన్నట్లుగా ఆయన పట్టు సాధించారు. 1991 నుండి వరుసగా 7 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు (1995, 1999, 2004, 2009, 2014, 2019). నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు ఉన్న కమాండ్, కార్యకర్తలతో ఉన్న అనుబంధమే ఆయనను "దాదా"గా మార్చింది.
పార్టీలో చీలిక, సరికొత్త మలుపు
2019లో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రాజకీయ సంచలనం సృష్టించారు. అనంతరం 2023లో ఎన్‌సిపి (NCP) లో చీలిక తీసుకువచ్చి, మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరారు. ఫిబ్రవరి 2024లో కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్‌సిపిగా గుర్తించి, 'గడియారం' గుర్తును కేటాయించింది.
వ్యక్తిగత జీవితం
జననం: జూలై 22, 1959. అహ్మద్‌నగర్‌లోని దేవ్‌లాలీ ప్రవరలో పాఠశాల విద్యను పూర్తి చేశారు.
విద్య: తండ్రి మరణంతో కుటుంబాన్ని ఆదుకోవాల్సి రావడంతో తన డిగ్రీని పూర్తి చేయలేకపోయారు.
కుటుంబం: భార్య సునేత్ర పవార్, కుమారులు జయ్, పార్థ్ పవార్.
పాలనా దక్షత, కఠినమైన క్రమశిక్షణ, సమయపాలనకు అజిత్ పవార్ పెట్టింది పేరు. రాజకీయాల్లో ఎన్ని మలుపులు వచ్చినా, మహారాష్ట్ర అధికార కేంద్రంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అద్భుతం.
Also REad: Padma Awards Benefits: పద్మ అవార్డుల పవర్ ఇదే! పురస్కార గ్రహీతలకు లభించే రాచమర్యాదలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Medaram Maha Jatara Begins Today: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి ఎంతో అట్టహాసంగా జరిగే ఈ మహా జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ జాతర ఇవాళ్టి నుంచి అనగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో నాలుగు రోజుల పాటు ఈ మేడారం మహాజాతర జరగనుంది. ఈరోజు సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రానున్నారు.
బుధవారం సాయత్రం 6 గంటల సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపు ఏటూరునాగారం కొండాయిలో కొలువైన గోవిందరాజులు.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిగద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. ఇప్పటికే కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు కాలి నడకన బయలుదేరారు. పూనుగొండ్ల నుండి 65 కిలోమీటర్లు నడుచుకుంటూ పగిడిద్దరాజుతో పూజారులు మేడారంకు వస్తారు. ఈరోజు సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్వాగతం పలకనున్నారు.
మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం (జనవరి 29) కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. శుక్రవారం (జనవరి 30) భక్తులు దర్శించుకొని ఎత్తు బంగారాలను సమర్పించడం ఆనవాయితీ. శనివారం (జనవరి 31) దేవతల వన ప్రవేశంతో మేడారం మహా జాతర ముగుస్తుంది.
తెలంగాణ కుంభమేళగా, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరను.. నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా కొలిచే సమ్మక్క–సారలమ్మ జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక మేడారం మహా జాతరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13వేల మంది పోలీసులతో జాతర భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మేడారాన్ని సుమారు 45 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నాలుగు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారం మహా జాతరకు తరలిరానున్నారు.
Also Read: Arijit Singh: ఫుల్ ఫామ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ సింగర్.. షాక్‌లో ఫ్యాన్స్..!
Also Read: AP Cabinet: నేడు ఏపీ క్యాబినేట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Barabar Premistha Romantic Song:యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కథానాయకుడిగా యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఎక్కడా కాంప్రమై్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా యాక్ట్ చేశాడు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యువతను ఆకట్టుకున్నాయి. తాజాగాఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాను నుంచి ‘మళ్లీ మళ్లీ’ పాటను రిలీజ్ చేశారు ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి. ఈ రొమాంటిక్ మెలోడియస్ పాటలో చంద్రహాస్, మేఘన కెమిస్ట్రీ హైలెట్‌గా ఉండనుంది. ఇక ఇందులో ఆర్ఆర్ ధ్రువన్ ఇచ్చిన బాణీ ఎంతో మధురంగా వినసొంపుగా ఉంది. ఆర్ఆర్ ధ్రువన్ అందించిన సాహిత్యం, మహమ్మద్ ఇర్ఫాన్ ఇచ్చిన గాత్రం మైమరిపిస్తోంది. ఈ పాటను చూస్తే ఇట్టే ఆకట్టుకునే డ్యూయట్ గా కనిపిస్తోంది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
జయంత్ సి పరాన్జి పాటను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. ''మళ్ళీ మళ్ళీ అంటూ సాగే ఈ సాంగ్ బాగుంది. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ చిత్రాన్ని చూసి ఆదరించండని చెప్పుకొచ్చారు. అంతేకాదు మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా పనిచేశారు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఈ చిత్రంలో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ హీరో, హీరోయిన్లుగా నటించారు. అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్డడం విశేషం.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
BRS Leader Santosh Special Investigation Team : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావును సిట్ విచారించింది. జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణ సుమారు 5 నుంచి 7 గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్ర ఏమిటి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును ఆ పదవిలో నియమించిన నిర్ణయం ఎవరిదనే దానిపై ఆయన పై ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆ నిర్ణయంలో సంతోష్ రావు పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, పలు డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రశ్నలు అడిగి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం సంతోష్ రావు బయటికి వచ్చారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలవవచ్చని సమాచారం.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను సిట్ ప్రశ్నించగా, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలతో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతుండగా, ఈ విచారణ తర్వాత కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Andhra Pradesh Cabinet Meet: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కు ముందు తన క్యాబినేట్ సమావేశం ఏర్పాటు చేయనుంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ఇతర మంత్రులు క్యాబినేట్ లో పలు తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ భేటీలో పలు సంస్థలకు భూకేటాయింపులు చేసే అవకాశం ఉంది. దానికి క్యాబినేట్ ఆమోద ముద్ర వేయనున్నారు.
అటు క్యాబినేట్ ఎజెండా అంశాలు పూర్తయ్యాక ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సెషన్ పై చర్చ జరగనుంది.ఈ క్యాబినేట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకం, రివర్ ఫ్రంట్ లో మెరీనా అభివృద్ధికి ఆమోదం తెలపనుంది కేబినెట్.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
రాజధానిలో వీధిపోటు ప్లాట్లు 112 వేరే చోట ఇచ్చేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. అటు హడ్కో నుంచి రూ. 4వేల 450 కోట్ల రుణానికి అనుమతివ్వనుంది కేబినెట్. అంతేకాదు ప్రతిపక్షం వైయస్ఆర్సీ నేతల విమర్శలు తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దావోస్ పర్యటనపైనా ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు దావోస్ సమావేశంలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంవోయు కుదుర్చుకుంది. అంతేకాదు అమరావతిలో పెట్టుబడుల పెట్టడానికి వచ్చే వాళ్లకు సింగిల్ విండో పథకంలో అన్ని అనుమతులు మంజూరు చేయనున్నారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Perni Nani Case Filed: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేకాదు గత ప్రభుత్వ హయాములో చంద్ర బాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా దాడి చేసిన వారిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా రాజకీయంగా, ఆర్ధికంగా వారిని దెబ్బే కొట్టే ప్రయత్నం చేస్తోంది. అలా వారిని మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారు.
అయితే గత ప్రభుత్వ హయాములో వైసీపీలో కీలక నేతగా వ్యహరించిన మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై వీలునపుడల్లా రాజకీయంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పేర్నినానిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. నానిపై 196(1), 353(2), 351(2), 352 BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని రెచ్చిపోయి మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ శ్రేణులు.. మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పీఎస్‌లో నానిపై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అయితే వైసీపీ వర్గాలు మాత్రం .. తమపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Irrigation Projects: వ్యవసాయానికి జీవనాధరమైన సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లు ఉంటే ఆ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేద్దామని.. పడగొట్టినవి నిలబెడదామని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు. 10 జిల్లాల్లో 20కు పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు చేయాలని.. పూర్వోదయ నిధులతో సమగ్రాభివృద్ధి చేయాలని ఆదేశించారు. గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. 'పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇదే సమయంలో సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి' అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
'పది జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని.. తక్కువ నిధులు కేటాయిస్తే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను తొలుత చేపట్టాలి. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలి. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలి. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశాన్ని పరిశీలించాలి' అని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఇలా సుమారు 20కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు, 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీళ్లు అందించవచ్చని అధికారులు వెల్లడించారు.
Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?
సీమ ప్రాజెక్టులతో పాటు... ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ఎడమ కాల్వ పనులు పూర్తయితే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లవచ్చని.. పోలవరం-వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టవచ్చని అధికారులకు చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రాధాన్యతల వారీగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మూడేళ్లల్లో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించేలా ప్రణాళికలు చేపట్టినట్టు వివరించారు. రాయలసీమ ప్రాంతం ఉద్యాన ఉత్పత్తుల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్ గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Municipal Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా పని చేయాలనుకునే వారిక ఈ ఎన్నికలు సదావకాశం కల్పిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాల్సి ఉంది. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మున్సిపల్‌తోపాటు మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నామినేషన్ ఎలా వేయాలి? అనేది. రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే బీఫామ్ అవసరం. పార్టీ అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు సరిపోతాడు. అదే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే మాత్రం పది మంది ప్రతిపాదన చేయాల్సి ఉంది. ఎన్నికలలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఆషామాషీగా వేయకుండా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?
గతంలో మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్థానానికి 200 మందికి పైగా నామినేషన్ వేసి పోటీలో నిలబడ్డారు. కొన్ని చోట్ల నామినేషన్ వేసి బేరసారాలతో ఉపసంహరించుకున్నారు కూడా. అయితే ఇప్పుడు మాత్రం అలా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయకుండా.. ప్రభుత్వంపై ఆగ్రహంతో పెద్ద ఎత్తున పోటీలో నిలబడకుండా ఓ నిబంధన తీసుకువచ్చారని తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే పది మంది ప్రతిపాదించాల్సి ఉంది. కుటుంబసభ్యులు కానీ బంధుమిత్రులు ఇలా ఎవరైనా ప్రతిపాదించవచ్చు.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే..
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో తక్షణమే ఎన్నికల నియమ నిబంధనావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్ఠంగా రూ.50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లాల్సి ఉంది. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, విలువైన వస్తువులు (బంగారం, వెండి) తీసుకెళ్తుంటే మాత్రం వాటికి సంబంధించిన సరైన ఆధారాలు చూపించాల్సి ఉంది. ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వాటి ఆధారాలు ఎన్నికల అధికారులకు చూపాలి. లేదంటే నగదు, బంగారం, వెండిని సీజ్ చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసే వరకు పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా ఆపాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Traffic Challans Driving License Cancel: ట్రాఫిక్ నిబంధనలు.. చలాన్ల అంశంపై దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ చలాన్‌లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉంటే ఆటో డెబిట్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆటోమేటిక్ డెబిట్ నిబంధన అమలు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోకపోగా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ట్రాఫిక్ చలాన్‌లపై ఆయా ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. కేరళలో ఐదు చలాన్లు పెండింగ్‌లో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?
కేరళ రాష్ట్రంలో మోటారు వాహన చట్టాలను కఠినతరం చేయడానికి అక్కడ ప్రభుత్వం సిద్ధమైంది. సంవత్సరంలో ఐదు చలాన్లు వస్తే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. ట్రాఫిక్ చలాన్ల అంశంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతుందని సమాచారం. ట్రాఫిక్ నిబంధనల విషయమై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్!
ట్రాఫిక్ చలాన్‌లకు సంబంధించి జరిమానాలు చెల్లించడానికి 45 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంది. ఈ జరిమానాలు చెల్లించని వాహనాలను ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ లిస్ట్ చేస్తారు. బ్లాక్ లిస్ట్‌లో నమోదైన వాహనాలకు యాజమాన్య బదిలీ, ఫిట్‌నెస్ వంటి సేవలు బ్లాక్ చేస్తారు. వాహనంపై ఎవరిపై రిజస్టర్ (ఆర్‌సీ) అయ్యిందో ఆ వాహన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వారి వాహనాన్ని ఒకవేళ ఇతరులు నడిపితే నడిపితే వారిని నిరూపించాల్సిన బాధ్యత యజమానిపై ఉంటుందని కొత్త నిబంధనల్లో ఉంది.
Also Read: Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికలు.. రేపటి నుంచే నామినేషన్లు షురూ
ట్రాఫిక్ నిబంధనలు, చట్టాన్ని ఉల్లంఘించిన వాహనదారుడిపై మూడు రోజుల్లోపు ఆన్‌లైన్ రూపంలో.. లేదా 15 రోజుల్లోపు స్వయంగా చలాన్‌లను చెల్లించాలి. ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాను 45 రోజుల్లోపు చెల్లించాలి. ఆ సమయంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘన చేయలేదని చెబితే దానికి సంబంధించి సాక్ష్యం అందించాలి. అలా చేయకపోతే లైసెన్స్ రద్దవడం, రిజిస్ట్రేషన్‌తో సహా అన్నీ కఠిన చర్యలు తీసుకుంటారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి మూడు నెలల వరకు జరిమానాలు చెల్లించని డ్రైవర్ల లైసెన్స్‌లను రద్దు చేయాలనే కేరళ రోడ్డు రవాణా అధికారులు ప్రతిపాదన చేశారు. రెడ్ సిగ్నల్ దాటడం, ప్రమాదకరమైన డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు సంబంధించి మూడుసార్లు కంటే ఎక్కువ చలాన్లు పడితే మాత్రం అలాంటి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలల వరకు రద్దు చేసే అవకాశం ఉంది. ఉల్లంఘించినవారు, వాహనాల గురించి సమాచారం వాహన్ సారథి పోర్టల్‌కు బదిలీ చేస్తారు.
Also Read: Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికలు.. రేపటి నుంచే నామినేషన్లు షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
School Holidays From Tomorrow: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. మళ్లీ వరుసగా భారీగా సెలవులు రానున్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తుండడంతో విద్యార్థులు పండుగ చేసుకోవచ్చు. ప్రభుత్వం నాలుగు రోజుల సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత మళ్లీ వరుసగా నాలుగు రోజులు సెలవులు రానుండడం గమనార్హం. అన్ని చోట్ల స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో భారీగా స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవులు వచ్చాయి. ఇక గణతంత్ర దినోత్సవం రావడంతో ఆది, సోమవారం కలిపి రెండు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు ముగియగానే బుధవారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీలో కాకుండా తెలంగాణలో ఈ సెలవులు ఉండనున్నాయి. అదీ కూడా ఒక్క రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఉంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్!
తెలంగాణలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క. ఈ జాతర రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. మేడారం సమ్మక్క సారక్క జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ములుగు జిల్లాలో కొలువైన అడవి తల్లులను దర్శించుకునేందుకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు.
Also Read: Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికలు.. రేపటి నుంచే నామినేషన్లు షురూ
సమ్మక్క సారక్క దేవతలను ఒక్క తెలంగాణ కాదు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు దర్శించుకుంటారు. ఈ జాతర సందర్భంగా ములుగు జిల్లాలో కోలాహలం ఉంటుంది. దారులన్నీ మేడారం అన్నట్టు పరిస్థితి ఉంటుండడంతో ఈ సమయంలో స్థానికంగా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘం పీఆర్‌ర్టీయూ ప్రభుత్వాన్ని ఇప్పటికే డిమాండ్ చేసింది.
Also Read: Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికలు.. రేపటి నుంచే నామినేషన్లు షురూ
ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ సెలవులు ఇవ్వాలని పీఆర్‌టీయూ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే కాకుండా మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లాలో అధికార యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉంటుంది. బస్సులన్నీ అటు వైపే వెళ్తుంటాయి. దీంతో ములుగు జిల్లా వరకైనా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మేడారం జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతుండడంతో ఈ జిల్లా పరిధిలోని విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మేడారం జాతర రాష్ట్ర పండుగ. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Motorola Edge 50 Fusion Offer Price News: మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ధరలోనే ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి రావడం వల్ల జనాలు ఈ మొబైల్ ను ఎగబడి మరికొంటున్నారు. మీరు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటినుంచో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు.. ఎందుకంటే ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా ప్రత్యేకమైన 6.67-అంగుళాల Full HD+ pOLED 3D కర్వ్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్టుతో లభిస్తోంది. అలాగే ఇది ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్టును కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఇప్పుడు మార్కెట్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. ఇక వెనక భాగంలో ఇది డ్యూయల్ కెమెరా మాడ్యూల్‌తో అందుబాటులోకి వచ్చింది. బ్యాక్ సెటప్‌లో Sony LYTIA 700C సెన్సార్, OIS సపోర్ట్ 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో పాటు 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉంటుంది. ఇందులో మోటరోలా కంపెనీ నాలుగేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్‌ను కూడా అందిస్తోంది. దీంతోపాటు ఎన్నో రకాల ప్రత్యేకమైన కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. తప్రస్తుతం మార్కెట్‌లో బేస్ వేరియంట్ 128GBs ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర MRP రూ.25,999 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా 27 శాతం తగ్గింపుతో రూ.18, 999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ముఖ్యంగా ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.17,999కే అందుబాటులో ఉంది. దీంతోపాటు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే అదనంగా రూ.17 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 999కే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant 12-foot Python Viral Video Watch Here: అమెరికాలోని ఫ్లోరిడా చిత్తడి నేలలకు ప్రసిద్ధి.. ఇక్కడ వివిధ రకాల వన్యప్రాణులు జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇది అత్యంత ప్రమాదకరమైన కొండచిలువలకు ఒక ప్రత్యేకమైన స్థలం. ఇక్కడ ఎన్నో రకాల జాతులకు సంబంధించిన పాములు వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. తాజాగా ఈ చిత్తడి నేలల్లో వన్య ప్రాణి సంరక్షకుడు చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో పర్యావరణానికి ఎంతో ముప్పుగా మారిన బర్మీస్ కొండచిలువను పట్టుకుంటున్న క్రమంలో.. అతడు పడ్డ కష్టం సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ వన్యప్రాణి సంరక్షకుడు.. ఇటీవల బర్మీస్ కొండచిలువ చేస్తున్న ప్రకృతి ముక్కు చెక్ పెట్టేందుకు ఆయన ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే కనిపించిన ఈ పాములన్నింటినీ పట్టుకొని ఓ చోట బంధిస్తున్నారు. అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోలు అతను రాత్రి సమయంలో ఓ బర్మీస్ కొండచిలువను పట్టుకుంటున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఆ కొండచిలువ పరిమాణం చూస్తుంటేనే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ పాము దాదాపు 12 అడుగుల పొడవు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలో గారెట్ అనే వన్యప్రాణి సంరక్షకుడు ఆ బర్మీస్ కొండచిలువ సమీపంలోకి చాలా నెమ్మదిగా వెళ్లడం మీరు చూడొచ్చు. ఆ పాము కూడా అతనిని చూసి ఒక్కసారిగా తన మీదకు దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ... అతను మాత్రం బెదరకుండా పాము తలభాగాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకోవడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు. అతను చాలా నెమ్మదిగా ఆ పాము వైపుకు జరుగుతూ.. పాము ధనభాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో ఆ పాము తన నోటి భాగాన్ని తెరిచి చూడడం మీరు వీడియోలో గమనించవచ్చు.
Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
11 సెకండ్లు కలిగిన ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులు విచ్చలవిడిగా వీక్షిస్తున్నారు. అయితే, ఈ వీడియో పై కొంతమంది వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ పామును చూస్తుంటేనే ఒళ్లంతా ఎలాగో ఉందని.. అలాగే చాలా భయమేస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో రాసుకొచ్చారు. ఇక మరి కొంతమంది మాత్రం నిజంగా ఇది ప్రాణాలతో చెలగాటమే అని ఆ వన్యప్రాణి సంరక్షకుడి పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వినియోగదారులు ఎవరికి నచ్చినట్లు వారు అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరిస్తున్నారు.