Pension Hike 5 Times: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులతోపాటు ప్రైవేటు ఉద్యోగులకు భారీ శుభవార్త. కొత్త సంవత్సరం 2026తోపాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన కనీస పింఛన్ భారీగా పెరగనుందని సమాచారం. ఈ పెంపుదలతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలగనుంది. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు రెట్ల పింఛన్ పెంపు అనే అంశం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: KTR: నీ డ్రామాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
ఉద్యోగుల భవిష్య నిధి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు పింఛన్‌దారులకు ఉంటుంది. ఈ సంస్థలో సభ్యులైన వారందరికీ భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈపీఎఫ్ సభ్యులకు నిధులు అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని రూ.5,000కి పెంచవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ పెంపుపై బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా కొండా సురేఖ.. ఇంకా పొంగులేటితో పొసగలేదా?
ప్రస్తుతం ఈపీఎఫ్‌లో 75 లక్షలకు పైగా సభ్యులు పెన్షన్ ప్రయోజనాలను పొందుతున్నారు. పీఎఫ్ ఉద్యోగి సంస్థలు చాలా కాలంగా ఈపీఎస్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తుండగా.. తాజాగా దానికి మోక్షం లభించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లోక్‌సభ సమావేశాల్లో ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాధానంలో చెప్పినా ఆ సమస్యను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది.
Also Read: Kakinada TDP: కాకినాడ టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎమ్మెల్సీ వర్సెస్ ఎంపీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం కనీస మొత్తాన్ని రూ.5,000కి పెంచుతారని కొన్నాళ్లుగా ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. కనీస ఈపీఎస్ మొత్తం రూ.1,000 ఉండగా దీనిని పెంచాలని ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తుండగా.. ఈ ప్రయోజనాన్ని కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. 58 సంవత్సరాల వయస్సు తర్వాత ఖాతాలో పెన్షన్ జమ చేయడం ప్రారంభమవుతుంది.
పెంపు ఎంత?
కేంద్ర ప్రభుత్వం కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.3 వేలకు పెంచవచ్చని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు అది రూ.5,000 కు పెరగవచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోందని సమాచారం. సాధారణ బడ్జెట్ తర్వాత కనీస పింఛన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. 2014లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెన్షన్ పెంచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
AP Govt Sankranti Gift: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొన్ని నెలలుగా బకాయి పడిన చెల్లింపులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేతలకు సంక్రాంతి శుభవార్త ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం తీసుకోవడం విశేషం. రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో రూ.5 కోట్ల బకాయిల జమ కానున్నాయి. గతనెలలో రూ.2.42 కోట్ల బకాయిలను ఆప్కో చెల్లించగా.. తాజా చెల్లింపులతో చేనేత కుటుంబాల్లో ఆనందం నిండింది. ప్రభుత్వ నిర్ణయంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Cyber Crime Tips: సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కకుండా ఈ 10 చిట్కాలు పాటించండి
చేనేత సహకార సంఘాలకు చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో బకాయిల్లో రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు ప్రకటించారు. గతంలో చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి మరో విడత బకాయిలను విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. గత నెలలో రూ.2.42 కోట్ల మేర బకాయిలను చేనేత సహకార సంఘాలకు చెల్లించగా.. సంక్రాంతి పండగ వేళ మరో రూ.5 కోట్లు చెల్లించాలని ఆప్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రేపు బకాయిలు ఆప్కో జమ చేయనుంది.
Also Read: Cyber Fraud: మారుమూల పల్లెలో రూ.547 కోట్ల సైబర్ క్రైమ్.. ఏం జరిగిందో తెలుసా?
చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలిపారు. చేనేత కళాకారులకు వ్యక్తిగత లబ్ధి పొందేలా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సామూహికంగా చేనేత సహకార సంఘాల ద్వారా లబ్ధి కలిగేలా మరికొన్ని పథకాలు అమలుచేస్తామని చెప్పారు. చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు కొత్త కొనుగోళ్లను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.
Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్.. ఐదు రెట్లు కనీస పింఛన్ పెంపు
చేనేత కళాకారులు గౌరవప్రదమైన జీవనం పొందడంతోపాటు 365 రోజులు ఉపాధి కల్పించడానికి తాము కృషి చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. చేనేతలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల కోసం కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆదిత్య బిర్లా గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జియో మార్ట్, ఓఎన్డీసీ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో చేనేత దుస్తుల విక్రయాలను ప్రారంభించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. రెడీమేడ్ చేనేత వస్త్రాలను తయారు చేయించి, ఆప్కో షో రూమ్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. చేనేత కళాకారులకు రెడీమేడ్ దుస్తుల తయారీపై శిక్షణ అందిస్తామని.. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత అమ్మకాలు ఊపందుకున్నాయని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cyber Crime Precautions: ఆశపడితే సరే.. కానీ అత్యాశకు వెళ్తితే మాత్రం ఉన్నది పోతది.. ఉంచుకున్నది పోతది అనేది జగమెరిగిన సత్యం. ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంటే ఆ స్థాయిలో అన్ని నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు కళ్ల ముందే జరుగుతుంటాయి. కానీ మోసపోతున్నామనేది తెలియదు. సైబర్ క్రైమ్ బారిన నిరక్షరాస్యుల కన్నా చదువుకున్న వారే మోసపోతుండడం గమనార్హం. నిన్న సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ భార్య కొన్ని కోట్ల రూపాయలు మోసపోగా.. గతంలో చాలా మంది వీఐపీలు కూడా సైబర్ ఉచ్చున చిక్కుకున్నారు. ఇలా సైబర్ నేరాల పారిట మోసపోకుండా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్.. ఐదు రెట్లు కనీస పింఛన్ పెంపు
==> తెలియని కాల్స్ లేదా మెసేజ్‌లను నమ్మరాదు. బ్యాంక్, పోలీస్, కస్టమ్స్ అని చెప్పి మాట్లాడితే మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు. ఓటీపీ, సీవీవీ, పిన్ ఎవరితోనూ వీటిని పంచుకోకూడదు. అవసరమైతే అధికారిక నంబర్‌కు తిరిగి కాల్ చేయాలి.
==> అనధికారిక లింకులు క్లిక్ చేసే ముందు ఆలోచించాలి. ఉచిత గిఫ్ట్‌లు, లాటరీ పేర్లతో వచ్చే సందేశాలు కుంభకోణాలే. లింక్ ఓపెన్ చేస్తే డేటా చోరీ జరుగుతుంది. వచ్చిన సందేశాలపై అనుమానం ఉంటే వెంటనే డిలీట్ చేయాలి.
==> ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటే నకిలీ వెబ్‌సైట్లు జాగ్రత్త. యూఆర్‌ఎల్ సరిగా ఉందో లేదో చెక్ చేయాలి. అతి తక్కువగా ధరలు చూపిస్తుంటే అనుమానించాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటేనే ఆర్డర్ చేసుకోవాలి.
==> పెట్టుబడి పథకాలు (ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్)లో హామీలను నమ్మకూడదు. డబుల్ మనీ, ఫాస్ట్ రిటర్న్స్ వంటి మాటలు, ఆఫర్లు పెడితే అవి స్కామ్ అని గుర్తించాలి. అలాంటి ప్రకటనలు, సందేశాలు వస్తే వాటి రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించాలి. వీటిపై నిపుణుల సలహా తీసుకోవాలి.
==> రోజురోజుకు సోషల్ మీడియా వినియోగం పెరుగుతుండడంతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తుంటే జాగ్రత్త. నకిలీ ప్రొఫైల్స్‌తో మోసాలు జరుగుతుంటాయి. వ్యక్తిగత ఫొటోలు పంపకూడదు. అనుమానాస్పద అకౌంట్లను బ్లాక్ చేయాలి.
Also Read: Cyber Fraud: మారుమూల పల్లెలో రూ.547 కోట్ల సైబర్ క్రైమ్.. ఏం జరిగిందో తెలుసా?
==> కస్టమర్ కేర్ నంబర్ల విషయంలో అప్రమత్తత ఉండాలి. గూగుల్‌లో కనిపించే ప్రతి నంబర్ నిజం కాదనే విషయాన్ని గుర్తించాలి. ఆఫిషియల్ (అధికారిక) యాప్ లేదా వెబ్‌సైట్ నుంచే కాల్ సెంటర్ నంబర్ తీసుకోవాలి. రిమోట్ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకుంటే మోసపోయే ప్రమాదం ఉంది.
==> కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే కాల్స్ మోసపూరితమైనవి కావచ్చు. బ్యాంకులు ఎప్పుడూ ఫోన్‌లో లావాదేవీలు, ఓటీపీ, బ్యాంకు అకౌంట్ వివరాలు అడగవనే విషయాన్ని గుర్తించాలి. లింక్ ద్వారా కేవైసీ చేయమంటే అస్సలు చేయరాదు. ఒకవేళ అలాంటి ఫోన్ కాల్స్, సందేశాలు వస్తే నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాలి.
==> ఉద్యోగాల పేరుతో చాలా కుంభకోణాలు, మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు అడిగితే మోసం అనే విషయాన్ని గ్రహించాలి. ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇస్తామని చెబితే అస్సలు నమ్మరాదు. ఒకవేళ అలాంటి అవకాశం కల్పిస్తుంటే కంపెనీ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.
==> క్యూఆర్ కోడ్ రూపంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. డబ్బు రిసీవ్ చేయడానికి క్యూఆర్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తు తెలియని చోట్ల క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయరాదు. ఒకవేళ చేస్తే ఒకౌంట్‌లోని డబ్బు మొత్తం వెళ్లిపోతుంది.
==> వ్యక్తిగతానికి సంబంధించిన అంశం డేటింగ్, మ్యాట్రిమోని మోసాలు. పెళ్లి సంబంధాలు, డేటింగ్ యాప్స్‌తో మోసాలు జరుగుతుంటాయి. దీనిని హనీట్రాప్ అంటారు. భావోద్వేగాలతో ఆడుకుని మోసాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి మోసాలను బయటకు చెప్పుకుంటే పరువుపోతుందని కొందరు ఫిర్యాదు చేసేందుకు ముందుకు కూడా రారు. ఈ మోసాలపై చాలా అప్రమత్తంగా ఉండాలి.
Also Read: KTR: నీ డ్రామాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pawan Kalyan Tiger of Martial Arts: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీర్తి కిరీటంలో మరో అంతర్జాతీయ మైలురాయి వచ్చి చేరింది. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, తనకిష్టమైన మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన అత్యున్నత స్థాయి గుర్తింపును సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు' (Kenjutsu) లో అధికారికంగా ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ సాధన
సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మొదలైంది. చెన్నైలో కరాటేతో ప్రారంభించి, కేవలం శారీరక దృఢత్వం కోసమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోని తత్వశాస్త్రాన్ని కూడా ఆయన లోతుగా అధ్యయనం చేశారు. దాదాపు 30 ఏళ్లుగా ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
పవన్ కళ్యాణ్ అందుకున్న ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
ఫిఫ్త్ డాన్ (5th Dan) గౌరవం: జపాన్ సంప్రదాయ యుద్ధకళల సంస్థ 'సోగో బుడో కన్‌రి కై' పవన్ కళ్యాణ్‌కు ఈ ఉన్నత స్థాయి గుర్తింపును అందించింది.
టకెడా షింగెన్ క్లాన్: జపాన్ వెలుపల ఈ ప్రతిష్ఠాత్మక క్లాన్‌లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ గుర్తింపు పొందారు. ఇది అత్యంత అరుదుగా లభించే గౌరవం.
టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్: గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ఈ విశిష్ట బిరుదును ప్రధానం చేసింది.
కెండో శిక్షణ: ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద 'కెండో'లో పవన్ సమగ్ర శిక్షణ పొందారు.
తెరపై మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల తనకున్న మక్కువను కేవలం వ్యక్తిగత సాధనకే పరిమితం చేయకుండా, వెండితెరపై కూడా అద్భుతంగా ప్రదర్శించారు. తాను నటించిన తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'లోనూ తన యుద్ధకళా నైపుణ్యాన్ని చాటుకున్నారు.
ఆ తర్వాత 'తమ్ముడు', 'ఖుషి' చిత్రాల్లోని ఫైట్ సీక్వెన్సులు తెలుగు ప్రేక్షకులకు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తిని పెంచాయి. ఇటీవలే విడుదలైన OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంలోనూ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి జపనీస్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
సినిమా నటుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. కఠినమైన క్రమశిక్షణతో కూడిన జపనీస్ యుద్ధకళల్లో ఈ స్థాయి గుర్తింపు సాధించడం విశేషం. మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం పోరాటం మాత్రమే కాదు, అది నిరంతర అభ్యాసం, వినయం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు.
Also Read: RRB Group D Recruitment: రైల్వేలో 22,000 ఉద్యోగాల మేళా..10వ తరగతి చదివితే చాలు..జీతం ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rs 547 Crore Cyber Fraud: ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నిరక్షరాస్యుల కన్నా చదువుకున్న వారే సైబర్ మోసగాళ్లకు చిక్కి దారుణంగా మోసపోతున్నారు. మొన్న ఏకంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సతీమణి కొన్ని కోట్ల రూపాయలు మోసపోగా తాజాగా మారుమూల ప్రాంతంలో ఏకంగా వందల కోట్ల సైబర్ నేరం జరిగింది. రూ.547 కోట్ల సైబర్ నేరం జరగడం తీవ్ర సంచలనం రేపగా.. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్.. ఐదు రెట్లు కనీస పింఛన్ పెంపు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన సైబర్ నేరంపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేసు పూర్వపరాలు వెల్లడించారు. సైబర్ నేరంపై మోదుగు సాయి కిరణ్ అనే వ్యక్తి 2025 డిసెంబర్ 24వ తేదీన ఫిర్యాదు ఇచ్చాడు. అతడి ఫిర్యాదుతో ఈ సైబర్ నేరం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాలా మందిని ఉద్యోగం పేరుతో బ్యాంక్ ఖాతాలు తీసుకుని.. వాటి ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందని కమిషనర్ వెల్లడించారు.
Also Read: KTR: నీ డ్రామాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
పోట్రూ మనోజ్ కల్యాణ్, ఉడతనేని వికాస్, మేడా భానుప్రియ ఈ సైబర్ మోసాలకు ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రకటించారు. కల్యాణ్ ఖాతాల్లో రూ.114 కోట్లు, అతడి భార్య భానుప్రియ ఖాతాల్లో సుమారు రూ.44.5 కోట్లు, కల్యాణ్ బావమరిది మేడా సతీష్ ఖాతాల్లో రూ.130 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాల్లో రూ.80 కోట్ల లావాదేవీలు జరిగాయని కమిషనర్ వివరించారు. ఇప్పటికీ సుమారు రూ.547 కోట్ల మేర సైబర్ నేరం జరిగిందని.. ఇంకా విచారణ జరుగుతుండడంతో మోసపోయిన లెక్క అనేది ఇంకా తేలాల్సి ఉందని తెలిపారు.
Also Read: Sankranti Gift: సంక్రాంతి పండుగకు తెలంగాణ మంత్రి శుభవార్త.. ఏమిటో తెలుసా?
కాంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్లకు డబ్బులు బదిలీ చేసి కమీషన్లు తీసుకున్నారని, క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా కూడా అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరించారు. వీరి కింద పనిచేసే ఉద్యోగులను నియమించి.. ఒక్కో వ్యక్తి నుంచి 10 బ్యాంక్ ఖాతాలు చొప్పున సేకరించినట్లు.. కాంబోడియాలోని కాల్ సెంటర్ల ద్వారా ఓటీపీ ఫ్రాడ్, డిపాజిట్ ఫ్రాడ్, ఏపీకే ఫ్రాడ్‌లకు పాల్పడినట్లు కమిషనర్ తెలిపారు. ఎవరూ తమ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు ఇవ్వకూడదని.. మ్యూల్ అకౌంట్‌గా ఖాతా ఇచ్చినా అది నేరమని స్పష్టం చేశారు. చిన్న చిన్న కమీషన్లకు ఆశపడి ఇలాంటి నేరాల్లో ఇరుక్కుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.
ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరూ తప్పించుకునే అవకాశం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. గత నెల 24వ తేదీన ఇదే పోలీస్ స్టేషన్‌లో పోట్రు ప్రవీణ్ అనే వ్యక్తి సైబర్ నేరం కింద అరెస్టవడం.. ఇప్పుడు పోట్రు కల్యాణ్‌పై సైబర్ కేసు నమోదు కావడం చూస్తుంటే ఈ ప్రాంతంలో మరెంతమంది సైబర్ నేరస్తులు ఉన్నారోనని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Siddipet Politics: మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత ఫోకస్..సిద్ధిపేటపై టార్గెట్ పెట్టిన మాజీ ఎమ్మెల్సీ!
King Cobras In Bathroom Video Watch: సాధారణంగా మనమంతా బాత్రూం కి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించకుండా వెళ్లి పనులు కానిస్తూ ఉంటాము. కానీ ఇటీవల కాలంలో అడవులు విస్తీర్ణత పూర్తిగా తగ్గిపోవడం.. జనావాసాలు పెరగడం కారణంగా విశ్వసర్పాలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. అలాగే మరికొన్ని విష సర్పాలు అయితే ఏకంగా బాత్రూంలోకి కూడా వస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షార్ట్ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లోని బాత్రూంలో ఏకంగా రెండు భారీ విషసర్పాలు తిష్ట వేసి ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇందులో ఒక పాము అత్యంత భయానకంగా పడక విప్పి బుసలు కొడుతూ కెమెరా వైపు చూస్తూ ఉండడం భయాన్ని కలిగిస్తోంది. సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా సంచారం చేసేందుకు చీకటిగా తేమగా ఉండే ప్రదేశాలను ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ రెండు పాములు తేమగా ఉన్న బాత్రూమ్ ని నివాసస్థలంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో పాములు ఇలాగే సంచారం చేస్తూ ఉంటాయి. అందుకే అక్కడి ప్రజలు నిత్యం పాములు బాత్రూంలోకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లోనైతే.. పాములు ఇలా బాత్రూంలోకి దూరి అందులోకి వెళ్లిన మనుషులపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగిన సంగతి మన సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను కూడా చూసి ఉన్నాం.. ఏది ఏమైనా ఇలా అడవి ప్రాంతాలకు దగ్గరగా ఇళ్లను కట్టుకునేవారు బాత్రూంకి వెళ్లే క్రమంలో ఒకటికి రెండుసార్లు చూస్తూ వెళ్లాల్సి ఉంటుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ప్రజాధరణ పొందింది. అంతేకాకుండా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా జనాలు అయితే ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోని కూడా చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amrit Bharat Express Andhra Pradesh: ఏపీ ప్రయాణికులకు భారత రైల్వే శాఖ సంక్రాంతి పండుగ వేళ అదిరిపోయే శుభవార్త అందించింది. సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లను మరో మూడు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రైళ్లు తమిళనాడు నుండి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్ వరకు ప్రయాణిస్తాయి. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు.
కొత్త రైళ్లు - ప్రయాణించే మార్గాలు:
ఈ మూడు రైళ్లు ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం మీదుగా వెళ్లనుండటంతో రాష్ట్ర ప్రయాణికులకు గొప్ప రవాణా సౌకర్యం కలగనుంది. ఇంతకీ ఆ కొత్త రైళ్లు నడిచే రూట్ మ్యాప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తిరుచిరాపల్లి – న్యూ జలపాయ్‌గురి (పశ్చిమబెంగాల్):
ఈ రైలు తమిళనాడులోని కీలక పట్టణాలను కలుపుతూ ఏపీలోకి ప్రవేశిస్తుంది. చిదంబరం, తాంబరం, చెన్నై ఎగ్మోర్, విల్లుపురం, తంజావూరు మీదుగా వచ్చి ఏపీలో విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. అనంతరం భువనేశ్వర్, ఖరగ్‌పూర్ మీదుగా న్యూ జలపాయ్‌గురి చేరుకుంటుంది.
2. తాంబరం – సంత్రాగచ్చి (పశ్చిమబెంగాల్):
చెన్నై పరిసర ప్రాంతాల నుండి బెంగాల్ వెళ్లే ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరంగా మారనున్నాయి. చెన్నై ఎగ్మోర్, విజయవాడ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ వంటి స్టాప్స్‌లో ఈ ట్రైన్ ఆగుతుంది.
3. నాగర్‌కోయిల్ – న్యూ జలపాయ్‌గురి:
కన్యాకుమారి సమీపంలోని నాగర్‌కోయిల్ నుండి బయల్దేరే ఈ రైలు సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. మధురై, దిండిగల్, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం మీదుగా ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం మీదుగా ప్రయాణించి పశ్చిమబెంగాల్ చేరుకుంటుంది.
ఏపీ ప్రయాణికులకు కలిగే లాభాలు..
తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యం: అమృత్ భారత్ రైళ్లు సామాన్యుల బడ్జెట్‌కు అనుగుణంగా (Non-AC) ఉంటాయి. వీటిలో మొబైల్ హోల్డర్లు, ఆకర్షణీయమైన సీట్లు, మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. ఈ రైళ్లకు అటు ఇటు రెండు ఇంజన్లు ఉండటం వల్ల వేగంగా ప్రయాణిస్తాయి, దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సంక్రాంతి సమయంలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఈ అదనపు రైళ్లు పెద్ద ఊరటనిస్తాయి.
తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, ఆ రైళ్లు ఏపీ మీదుగా వెళ్లడం మన రాష్ట్ర ప్రయాణికులకు అదృష్టంగా మారింది. సంక్రాంతి కానుకగా రానున్న ఈ రైళ్ల పూర్తి సమయ పట్టికను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
Also Read: RRB Group D Recruitment: రైల్వేలో 22,000 ఉద్యోగాల మేళా..10వ తరగతి చదివితే చాలు..జీతం ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
King Cobra Video Watch: ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి.. ముఖ్యంగా ప్రకృతి జీవరాశుల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కోట్ల జీవరాసులతో ప్రకృతి అడవులు నిండి ఉంటాయి. ముఖ్యంగా మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అరుదైన జంతువులను కూడా చూస్తూ ఉంటాం.. అయితే అడవుల్లో వనరులు విపరీతంగా తగ్గడం కారణంగా ఆహార కోరత కూడా ఏర్పడుతూ వస్తుంది. దీని కారణంగా కొన్ని జంతువులు అడవుల నుంచి దగ్గరగా ఉండే జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా పాములైతే విచ్చలవిడిగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన పాములను చాలామంది వన్యప్రాణి సంరక్షకులు రెస్క్యూ చేసి అడవుల్లో వదిలిపెడుతున్నారు. తాజాగా అడవి నుంచి ఓ పైపు ద్వారా ఇంట్లోకి సంచారం చేసేందుకు ప్రయత్నిస్తున్న పాముకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో ప్రారంభంలో..ఒక ఎర్రటి పైపు నుంచి పాము తలపెట్టి బయటికి రావడం మీరు గమనించవచ్చు. సాధారణంగా ఆ పాము ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పైపు వెళ్ళేందుకు అనుగుణంగా లేకపోవడంతో.. అదే పైపు గుండా ముందుకు తలపెట్టి.. ఆ ప్రమాదకరమైన పాము నెమ్మదిగా బయటికి వస్తువు కనిపించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఇళ్లలోకి పాములు ఇలా పైపుల నుంచే వస్తున్నాయి. అయితే ఈ పాము కూడా ఆ పైపు గుండా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించింది. కాకపోతే సరైన దారి లేకపోవడం కారణంగా మళ్ళీ అదే పైపు గుండా బయటికి వచ్చేసింది. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదటగా ఆ పాము పైపుల నుంచి బయటికి వచ్చేందుకు ఎంతగానో కష్టపడింది. అంతేకాకుండా అందులో నుంచి తలపెట్టి పైపు చివరి భాగంలో అటు ఇటు చూడడం మీరు గమనించవచ్చు. శరీరం పైపులో గట్టిగా ఇరుక్కుపోయిన.. ఏమాత్రం వదలకుండా తన కండరాల శక్తిని వినియోగించి నెమ్మదిగా ముందుకు రావడానికి ప్రయత్నించింది. ఇలా ఆ పాము చిన్నగా పైపు చివరి భాగం గుండా అందులో నుంచి బయటికి వచ్చేసింది. ఇలా వస్తున్న సందర్భంలో అక్కడే ఉన్న స్థానికులు మొబైల్ ద్వారా చిత్రీకరించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోని వైరల్‌గా మారింది.
సాధారణంగా అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉండే వారు తప్పకుండా చలి కాలాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లోకి పాములు సంచారం చేయకుండా ఉండడానికి, వీడియోలో కనిపిస్తున్న పైపులు వంటివి ఉంటే తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి పాములు దూరి దాడి చేసే అవకాశాలున్నాయి. అయితే, ఈ వీడియోకు సంబంధించిన ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. యూట్యూబ్ ఛానల్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Is It Good To Withdraw PF For Personal Loan: చాలామంది ఉద్యోగులు తమకున్న వ్యక్తిగత రుణాలు (Personal Loans) లేదా హోమ్ లోన్ ఈఎంఐల భారం తగ్గించుకోవడానికి ప్రావిడెంట్ ఫండ్ (PF) సొమ్మును విత్ డ్రా చేస్తుంటారు. నెలవారీ ఈఎంఐల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని సంబరపడతారు కానీ, దీర్ఘకాలంలో ఇది మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు PF డబ్బును ముట్టుకోకూడదు?
1. చక్రవడ్డీ (Compounding) ప్రయోజనం కోల్పోతారు. ప్రస్తుతం పీఎఫ్ సొమ్ముపై ప్రభుత్వం ఏడాదికి 8.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది చక్రవడ్డీ పద్ధతిలో పెరుగుతుంది. మీరు ఇప్పుడు తీసే చిన్న మొత్తం, మీ రిటైర్మెంట్ సమయానికి కోట్లాది రూపాయల నిధిగా మారే అవకాశాన్ని దూరం చేస్తుంది.
2. రిటైర్మెంట్ నిధికి గండి: పీఎఫ్ అనేది మీ వృద్ధాప్య అవసరాల కోసం రూపొందించబడిన సామాజిక భద్రతా నిధి. అప్పుల కోసం దీనిని వాడటం వల్ల, పదవీ విరమణ తర్వాత మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి? (EPFO Rules)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం.. పీఎఫ్ డబ్బును విచ్చలవిడిగా తీయడానికి వీల్లేదు. వ్యక్తిగత రుణాలు/క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడానికి పీఎఫ్ నుండి డబ్బు తీయడానికి అనుమతి లేదు. కేవలం గృహ రుణాల చెల్లింపు కోసం మాత్రమే కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఉపసంహరణకు అనుమతిస్తారు.
హోమ్ లోన్ వర్సెస్ పీఎఫ్: ఏది లాభం?
హోమ్ లోన్ తీర్చడం కంటే పీఎఫ్ డబ్బును అకౌంట్‌లోనే ఉంచడం లాభదాయకమని నిపుణులు చెప్పడానికి కారణాలు ఇవే..
వడ్డీ వ్యత్యాసం: హోమ్ లోన్ వడ్డీ రేటు కంటే పీఎఫ్ ఇచ్చే వడ్డీ రేటు (8.25%) కొన్నిసార్లు ఎక్కువగా లేదా సమానంగా ఉంటుంది. పీఎఫ్ డబ్బు సురక్షితమైన రాబడిని ఇస్తుంది.
పన్ను ప్రయోజనాలు: పాత పన్ను విధానంలో (Old Tax Regime) హోమ్ లోన్ అసలు, వడ్డీపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. లోన్ క్లియర్ చేస్తే ఈ పన్ను ప్రయోజనాలను కోల్పోతారు.
పెరిగే భారం: వయస్సు పెరిగే కొద్దీ ఈఎంఐ భారం తగ్గుతుంది (ఇన్ఫ్లేషన్ కారణంగా), కానీ పీఎఫ్ నిధి పెరగడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది.
ముగింపు
అత్యవసర పరిస్థితుల్లో (వైద్య ఖర్చులు లేదా పిల్లల వివాహం వంటివి) తప్ప, కేవలం అప్పుల భారం తగ్గించుకోవడానికి పీఎఫ్ నిధిని వాడటం తెలివైన పని కాదు. అప్పుల కోసం ఇతర మార్గాలను అన్వేషించడం లేదా ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం.
Also Read: RRB Group D Recruitment: రైల్వేలో 22,000 ఉద్యోగాల మేళా..10వ తరగతి చదివితే చాలు..జీతం ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RRB Group D Recruitment 22,000 Posts: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారతీయ రైల్వే శాఖ తీపి కబురు అందించింది. RRB గ్రూప్-డి (లెవల్-1) రిక్రూట్‌మెంట్ 2026 ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దీనికి సంబంధించి CEN 09/2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల: జనవరి 2026
దరఖాస్తులు ప్రారంభం: 21 జనవరి 2026
చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2026
ఖాళీల వివరాలు & అర్హతలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్‌మన్, అసిస్టెంట్ లోకో షెడ్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI (NCVT/NAC) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ ఉన్నవారు కూడా అర్హులే. 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/ST/OBC/PWBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం..
అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నెగటివ్ మార్కింగ్ (1/3) కలదు. విశేషమేమిటంటే, ఈ పరీక్షను తెలుగుతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో రాసుకోవచ్చు.
శారీరక సామర్థ్య పరీక్ష (PET): శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: ధృవీకరణ పత్రాల పరిశీలన.
వైద్య పరీక్షలు (Medical Exam): రైల్వే ప్రమాణాల ప్రకారం మెడికల్ టెస్ట్ ఉంటుంది.
జీతం, ఇతర ప్రయోజనాలు
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి.
ప్రాథమిక జీతం (Basic Pay): రూ. 18,000.
అదనపు అలవెన్సులు: డియర్నెస్ అలవెన్స్ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, మెడికల్ సౌకర్యాలు.
మొత్తం జీతం: అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు సుమారు రూ.22,500 నుండి రూ.25,380 వరకు అందుతుంది.
దరఖాస్తు రుసుము & ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
జనరల్ అభ్యర్థులకు: రూ.500
SC/ST/మహిళలు/దివ్యాంగులు/మైనారిటీలకు: రూ. 250
దరఖాస్తు విధానం: ముందుగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. అనంతరం ఫోటో, సంతకం వంటి పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook