Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ntr521175
YS Jagan Tour: వైఎస్‌ జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. ఇద్దరు మృతి
RKRavi Kumar Sargam
Feb 06, 2026 12:14:53
Jaggaiahpet, Andhra Pradesh

YS Jagan Tour: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తీవ్ర సంచలన పరిణామాలు చోటుచేసుకుంటుండగా.. తమ పార్టీ నాయకుల నివాసాలపై టీడీపీ గూండాలు దాడులు జరగడాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్‌ నివాసాలపై దాడిని ఖండించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. అయితే జోగి రమేశ్‌ పరామర్శ కార్యక్రమంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. జగన్‌ పర్యటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Velama Community: రేవంత్‌ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ నివాసంపై ఇటీవల టీడీపీ గూండాలు దాడి చేయడమే కాకుండా పెట్రోల్‌ బాంబులు విసిరి నిప్పుపెట్టారు. ఈ సంఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని శుక్రవారం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రెండు అపశ్రుతి సంఘటనలు చోటుచేసుకున్నాయి. జగన్‌ ర్యాలీలో యువకులు బైక్‌ స్టంట్లు చేస్తూ ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు ఇబ్రహీంపట్నం కొత్తగేట్‌కు చెందిన భార్గవ్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి వచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్ చూసేందుకు వెళ్లిన చిలకలు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకుడు దొంగల రాంబాబు తీవ్ర అస్వస్థతకు గురయి మరణించారు. గుండెపోటుతో రాంబాబు మృతి చెందినట్లు తెలిసింది. ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.

Also Read: Chandrababu: తిరుమల పవిత్రతని తిరిగి నిలబెట్టేలా పని చేస్తాం: సీఎం చంద్రబాబు

అడుగడుగునా ఆంక్షలు
జగ్గయ్యపేట పర్యటనకు వెళ్తున్న వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ఆంక్షలు విధించారు. జగన్‌ కాన్వాయ్‌ వెళ్లిన అనంతరం అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు వెంట వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. జగన్‌ పర్యటనకు ఆంక్షలు విధించడంతో ఆ పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 06, 2026 13:27:27
Vemulawada, Telangana:

KTR Speech: 'ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన హామీల అమలులో విఫలమవడం.. పరిపాలన వైఫల్యాలతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది. మరోవైపు కుల మతాల పేరుతో ఓట్లు అడుగుతూ బీజేపీ ఎన్నికల అప్పుడు ఓట్లు వేయించుకుంటుంది. ఈ రెండు పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి' అని ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్‌ని మరోసారి సీఎం చేసుకునే ప్రస్థానాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారెంటీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఆ పార్టీని ఓడించాలని సూచించారు.

Also Read: YS Jagan Tour: వైఎస్‌ జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. ఇద్దరు మృతి

వేములవాడలో శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసిన కేటీఆర్‌ అనంతరం కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకు పడ్డారు. ఈ రెండు పార్టీలను మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి ఆరు గ్యారెంటీలు అన్నింటిని వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన విషయాన్ని కేటీఆర్‌ బాండ్ పేపర్‌తో సహా చూపించి గుర్తుచేశారు.

Also Read: Velama Community: రేవంత్‌ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం

'కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలు చెప్పి పదవి ఎక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. వేములవాడలో ఆది శ్రీనివాస్ హామీల అమలు నుంచి మొదలుకొని అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడని ఆరోపించారు. మంత్రి పదవి కావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుంటున్న ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని సవాల్‌ చేశారు.

Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు

ఆరు గ్యారెంటీలలో కనీసం ఒక్కదాన్నైనా అమలు చేశారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నించారు. ఇన్ని రకాల మోసాల తర్వాత, ద్రోహాల తర్వాత కూడా  కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అంతకు మించిన తప్పు మరొకటి ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెప్పిన హామీలు రూ.4 వేల పెన్షన్, ఆసరా పెన్షన్ నుంచి రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , తులం బంగారం రావాలన్నా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా చేసింది ఏమీ లేదని.. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఎలాంటి లబ్ధి చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. రూ.15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పిన మోదీ ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టారని తెలిపారు. ఎన్నికలు రాగానే దేవుడి పేరు చెప్పి కులం, మతం పేరు చెప్పి బీజేపీ ఓట్లు ప్రజలతో వేయించుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. ఈసారి కూడా బీజేపీ దొంగ మాటలకు మోసపోవద్దని సూచించారు. పేదోళ్ల కడుపులు నింపి తండ్రి లెక్క చూసుకొని తెలంగాణ తెచ్చిన వారెవరో గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 12:28:37
Hyderabad, Telangana:

Motorola Edge 50 Fusion Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా ఎడ్జ్ సిరీస్ మొబైల్‌కి అద్భుతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో తక్కువ ధరల్లో అందుబాటులోకి రావడం వల్ల చాలామంది వీటిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎడ్జ్ 50 సిరీస్ మొబైల్స్‌ని విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. అందులో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఎక్కువగా యువత కొంటున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తక్కువ ధరతోనే ఎక్స్చేంజ్ బోనస్‌తో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం..

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇది శక్తివంతమైన కెమెరా ఫీచర్స్‌తో లభిస్తోంది. అలాగే వినియోగదారుడు ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్తో లభిస్తుంది. ఇక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వారు ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకుంటే ఇదే బెస్ట్..Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ 6.7-అంగుళాల p-OLED కర్వ్‌డ్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. ఇక ఈ స్క్రీన్ 1,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5  ప్రొటెక్షన్ తో లభిస్తోంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ చాలా ప్రత్యేకమైన క్వాల్‌కామ్ Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ ఆడే యువతకు చాలా బాగా పనికొస్తుంది. ఇక మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వెనక భాగంలో కూడా చాలా ప్రత్యేకమైన కెమెరా సెటప్‌తో లభిస్తుంది. ఈ మొబైల్ వెనుక భాగంలో 50MP సోనీ LYTIA 700C మెయిన్ కెమెరా అందుబాటులో ఉంది. అంతేకాకుండా అదనంగా 13MP అల్ట్రావైడ్ మైక్రో షాట్స్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక దీని ఫ్రంట్ భాగంలో 32MP హై-రిజల్యూషన్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. కాబట్టి కేవలం 15 నిమిషాల్లోనే రోజంతా సరిపోయే చార్జింగ్ అందిస్తుంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత 'Hello UI' ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అంతేకాకుండా ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర మార్కెట్‌లో రూ.18,999తో అందుబాటులోకి వస్తుంది. అలాగే రెండవ వేరియంట్ 256gb ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇది మార్కెట్లో రూ.21,999 ధరతో లభిస్తోంది.

ప్రస్తుతం ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బేస్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపు ధరలోని ఇది పొందవచ్చు. దీనిపై ఉన్న స్పెషల్ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ లేదా ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్‌ను వినియోగించి పేమెంట్ చేసే వారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా చీప్ ధరకే లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ పొందాలనుకునే వారు తప్పకుండా ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని వ్యాల్యూని బట్టి ఏకంగా రూ.15 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీనిని కొత్త  స్మార్ట్‌ఫోన్ ధర నుంచి తీసేస్తే.. రూ.4 వేల లోపే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 12:14:11
Hyderabad, Telangana:

Ayushman Card Free Treatment Hospital List News: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకం కింద చాలామంది నిరుపేద కుటుంబానికి సంబంధించిన రోగులు ఉచిత చికిత్స పొందుతున్నారు. ఈ పథకం పేద కుటుంబ సభ్యులతో పాటు మధ్యతరగతి ఫ్యామిలీస్ కి ఎంతగానో సహాయపడుతోంది.. ముఖ్యంగా ఈ పథకం కింద అర్హులైన వారికి కేంద్రం ఏకంగా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం చాలామంది ఎక్కువ మొత్తంలో దీనినే వినియోగిస్తున్నారని సమాచారం. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పథకానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందైతే ఈ పథకం కింద లేని ఆసుపత్రులకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడి డబ్బు చెల్లిస్తున్నారు.. మీరు కూడా మీ ఏరియాలో ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద పనిచేస్తున్న ఆసుపత్రుల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే..

మీకు దగ్గరగా ఉన్న ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ కార్డు అప్లికేబుల్ అవుతుందో లేదో అనే విషయాన్ని కేవలం రెండు నిమిషాల్లోనే చెక్ చేసుకోవచ్చు. ముందుగా hospitals.pmjay.gov.in అని వెబ్సైట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో మీకు కావలసిన రాష్ట్రాన్ని ఎంచుకొని.. ఆ తర్వాత మీకు దగ్గరగా ఉన్న జిల్లాను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ రకాన్ని కూడా ఎంచుకోండి. ఇలా ఎంచుకున్న తర్వాత స్క్రీన్ పై కనిపించే కోడ్ అందులో కొట్టేసి సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి 

దీంతో వెంటనే మీకు ఆసుపత్రి పేరుతో పాటు చిరునామా, ఫోన్ నెంబర్, అందుబాటులో ఉన్న సౌకర్యాలు పూర్తిగా మీకు ఆ వెబ్సైట్లో కనిపిస్తాయి.  ఇలా అన్ని డీటెయిల్స్ ను మీకు కావాలనుకుంటే మీ మొబైల్ లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆయుష్మాన్ యాప్ వార అన్ని వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో నేరుగా ఆస్పత్రులను సెర్చ్ చేయండి అనే ఆప్షన్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించి ఎంతో సులభంగా మీకు దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఆసుపత్రుల వివరాలను తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా చదువురాని వారికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ను కూడా అందిస్తోంది. దీని ద్వారా కూడా మీకు దగ్గరగా ఉన్న ఆస్పత్రుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం మీ మొబైల్‌లో నేరుగా 14555 లేదా 1800-111-565 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రికి వెళ్లాలనుకునేవారు తప్పకుండా వారి వెంట ఆయుష్మాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్ సెంటర్ ఉంటుంది.. అక్కడ వీటిని చూపించి నేరుగా జాయిన్ అవ్వచ్చు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 12:01:24
Hyderabad, Telangana:

Rattlesnake Video Watch: సాధారణంగా అడవులకు దగ్గరగా జీవించేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక వన్యప్రాణులు జనాభాసాల్లో సంచారం చేసి దాడి చేసే అవకాశాలుంటాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి పాములు విపరీతంగా జనాభాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ చాలామందికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి దాఖలాలు ఇప్పటివరకు ఎన్నో మనం చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.. ఈ వీడియోలో ఏముందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అత్యంత ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ చూడొచ్చు.. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఒక వ్యక్తి తన శూలోపల ఏదో కదులుతున్నట్లు గమనించారు.. అయితే, దానిని అలాగే పరీక్షించి చూడగా అతడికి ఒక అత్యంత ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ కనిపిస్తుంది. వెంటనే అతను ఒక స్నేక్ క్యాచర్ కి సమాచారం అందిస్తారు. వెంటనే అతను ఆ ఘటన స్థలానికి చేరుకొని పామును రెస్క్యూ చేపట్టేందుకు ప్రయత్నిస్తాడు..

ఇందులో భాగంగానే ఆ స్నేక్ క్యాచర్ మొదటగా ఒక షూను అటు ఇటు కదుపుతాడు. అయితే, అతనికి అందులో ఏది కనిపించదు. ఆ తర్వాత రెండవ దానిని ఒక స్నేక్ స్టిక్‌తో కదిపేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలోనే అత్యంత ప్రమాదకరమైన ఓ చిన్న పాము బయటికి రావడం కనిపిస్తుంది. అంతేకాకుండా అతనిపై ఆ పాము దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో దాదాపు మూడు నుంచి నాలుగు సార్లు ఆ పాము అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు. అయితే ఈ పాము చాలా యాక్టివ్‌గా ఉంది. దానిని పట్టుకోవడం చాలా కష్టతరం అవుతోంది. 

అయితే ఆ పాము చాలా యాక్టివ్‌గా ఉండడం వల్ల.. దానిని పట్టుకోవడం కాస్త ప్రమాదకరమని భావించి.. అతను ఆ షూతో పాటు పామును కూడా ఒక బకెట్లో సురక్షితంగా తీసుకొని ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఈ పామును వదిలేస్తాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. అయితే,త ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. స్నేక్ క్యాచర్ తరపున అక్కడికి వెళ్లిన బృందం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 11:41:20
Hyderabad, Telangana:

Huge King Cobra Video Watch: సాధారణంగా ఎక్కడైనా అత్యంత ప్రమాదకరమైన పాములు కనిపిస్తే వెంటనే అందరూ స్నేక్ క్యాచర్ కి కాల్ చేస్తూ ఉంటారు. వార అక్కడికి చేరుకొని.. ప్రాణాలకు తెగించి మరి ఎంతో ప్రమాదకరమైన పాములను రెస్క్యూ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా వారు పాములు పట్టుకుంటున్న దృశ్యాలను మన తరచుగా చూస్తూ ఉన్నాం. అయితే, మనం వారిని ఎంతో ధైర్యవంతులుగా భావిస్తూ ఉంటాం.. కానీ వారి వెనక ఎన్నో సమస్యలు ఉంటాయి.. కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకరమైన పాముల కాటుకు గురై తీవ్ర సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు. కాబట్టి వీరు చేస్తున్న పనిని గుర్తించి వీరికి తగ్గ గౌరవం ఇవ్వడం చాలా మంచిది. 

ముఖ్యంగా సమాజంలో కొంతమంది స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రోజుకు దాదాపు నాలుగు నుంచి ఐదు అత్యంత ప్రమాదకరమైన పాములను పట్టుకొని రెస్క్యూ చేసేవారు కూడా ఉన్నారు. అందులో సర్పమిత్ర ఆకాష్ జాదవ్ ఒకరు. ఆయన దాదాపు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు ప్రమాదకరమైన పాములను పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయట.. అంతేకాకుండా ఒకేసారి ఆ రెండింటిని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయని అనేక వీడియోల్లో ఈయన పేర్కొన్నారు. తాజాగా కూడా ఆయన రెండు ప్రమాదకరమైన పొడవాటి నాగుపాములను వదిలిపెడుతున్న దృశ్యాలు కూడా వీడియోలో చూడొచ్చు..

ఇప్పటివరకు అతను వందలాది పాములను పట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి లేదా ఇతర నాయకుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదని వీడియోలో తెలిపారు.. ఈ వృత్తి ఎంచుకున్న వారిలో 70 శాతం మంది నిరుపేదలే అని ఆయన వీడియోలో క్లియర్ గా చెప్పడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో పాములు కాటేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా ఆ చికిత్సకైనా ఖర్చులు వీరి జేబుల నుంచే పెట్టుకోవాల్సి వస్తుందట. ఇలా వీడియోలో చెబుతూ అతను పట్టుకున్న రెండు ప్రమాదకరమైన పాములను వదిలిపెట్టడం మీరు చూడొచ్చు. 

ఈ వీడియోలో అతను అడవికి దగ్గరగా ఉన్న ఓ సురక్షితమైన ప్రదేశంలో రెండు పాములను పట్టుకుని వచ్చి.. వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో అతను వీడియోలో మాట్లాడుతూ.. స్నేక్ క్యాచర్స్ ఎదుర్కొనే సమస్యల గురించి తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను అతని యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోయారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
IPInamdar Paresh
Feb 06, 2026 10:23:58
Hyderabad, Telangana:

Ap CM Chandrababu naidu Sensational comments on Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదం ఏపీరాజకీయాల్లో పెనుదుమాంగా మారాయి. ఇప్పటికే సిట్ నివేదికపై వైసీపీ వర్సెస్ కూటమి మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల లడ్డు వివాదంను డైవర్ట్ చేసేందుకు అంబటి రాంబాబు,జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని వైసీపీ తీవ్ర మైన ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తిరుమల లడ్డు కల్తీపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీలో అగ్గిని రాజేశాయి. దీనిపై శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  కర్నూల్ లోని ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయన్నారు. లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్నారు. 2019 నుంచి 2024 ల మధ్య లడ్డుపై అనేక ఫిర్యాదులు అందాయన్నారు. కూటమి వచ్చాక దీనిపై సమగ్ర విచారణ చేపట్టామన్నారు. ఈవోను మార్చామన్నారు. సమర్థవంతమైన అధికారుల్ని విచారణకు రంగంలోకి దింపి సిట్ ఏర్పాటు చేశామన్నారు. ఎడీడీబీ రిపోర్ట్ తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు.

సిట్ నివేదికను తప్పుగా వైసీపీ ప్రచారం చేస్తున్నారన్నారు. తిరుమలలడ్డుపై విచారణ చేయిస్తున్న తనను సారీ చెప్పాలని అంటున్నారని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తిరుమల లడ్డులో బాత్రూమ్ లో ఉపయోగించే కెమికల్ ను వాడారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లు ఏపీలోని అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా  కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశారని సీఎం చంద్రబాబు గత పాలకులపై మండిపడ్డారు. ఈ విషయంను స్వయంగా వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారన్నారు.

Read more: Rk Roja: అరచేతితో సూర్యుడ్ని ఆపడం సాధ్యమౌతుందా..?.. జగన్ పర్యటన వేళ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా..

తిరుమల శ్రీవారి పవిత్రతను దిగజార్చేలా గత పాలకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుమల లడ్డు వివాదం మరోసారి ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే దీని వెనకల ఉన్న వారిని పట్టుకుని కఠినంగా పనిష్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 08:11:46
Medaram, Telangana:

Sammakka Saralamma Hundi Calculation In Telugu: మనందరికీ మేడారం జాతర అనగానే కోట్లాదిమంది భక్తుల నమ్మకంతో పాటు ఆ తల్లి పై ఉన్న విశ్వాసం గుర్తుకొస్తుంది.. కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లుగా.. సమ్మక్క సారలమ్మలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు.. తాజాగా మేడారంలో జరిగిన ఒక ఘటన భక్తుల మనోవేదనకు.. అమ్మవార్లపై వారికి ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది. ఇంతకీ అదేంటి? ప్రస్తుతం ఆ అమ్మవారి హుండీలో లభించిన నోటిపై ఉన్న భక్తుడి మనోవేదన ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారక్క జాతర ముగిసిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులంతా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది.. ఈ సమయంలో హుండీలో బంగారంతో పాటు నగదు వెండి వస్తువులతో పాటు భక్తుల తమ బాధలను విన్నవిస్తూ రాసిన లీకలు అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి. అయితే, తాజాగా కూడా ఒక వంద రూపాయల నోటుపై భక్తుడు రాసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

సాధారణంగా మేడారం జాతరకు వచ్చిన భక్తులంతా హుండీలో తమకు ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలని, ఉద్యోగాలు లేనివారికి ఉద్యోగాలు కలగాలని, ఆర్థిక ఇబ్బందులు ఉంటే త్వరగా తొలగిపోవాలని, ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తమ మొక్కులను కానుకల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ తండ్రి తన కొడుకు పెట్టే బాధను భరించలేక సాక్షాత్తు ఆ అమ్మవారిలను ఆశ్రయించడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వంద రూపాయల నోటుపై.. అమ్మ సమ్మక్క సారలమ్మ.. మా కొడుకు బారి నుండి మమ్మల్ని రక్షించండి" అని రాసి ఉంది. ఈ రాతలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు తమ ఇంట్లో ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో? అర్థమవుతుంది. వృద్ధాప్యంలో ఎంతో అండగా ఉండాల్సిన తమ కుమారుడు కాలయముగా మారాడని.. పోలీసులకు చెప్పుకోలేక.. బయట బంధువులకి ఎవరికీ ముఖం చూపించలేక చివరకు ఆ దేవతలకు తమ గోడును ఇలా నోటుపై వెల్లబోశారు.

మారుతున్న సమాజంలో నైతిక విలువలు ఎంతల దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అక్కడ హుండీలోని కానుకలను లెక్కిస్తున్న అధికారులైతే ఈ నోటును చూసి ఆశ్చర్యపోయారు.. ఇది కేవలం ఒక వంద రూపాయల నోటు  మాత్రమే కాదు.. ఎందుకంటే ఒక ఒక కుటుంబం అనుభవిస్తున్న క్షోభకు  ప్రతిరూపమని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. ఆ అమ్మవారిని ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని ప్రసాదించాలని సోషల్ మీడియా ముఖంగా చాలామంది నటిజన్స్ కోరుకుంటున్నారు..

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 06, 2026 04:50:17
Hyderabad, Telangana:

Mercury Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ గ్రహాన్ని తెలివితేటలు జ్ఞానం తర్కం వాక్చాతుర్యానికి సూచికగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం కదలికలు జరిపినప్పుడు అన్ని రాశుల వారిపై చాలా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం తెల్లవారుజామున 12 గంటలకు బుధుడు ఉత్తరం వైపుగా వెళ్లబోతున్నాడు. ఇలా చాలా అరుదుగా బుధుడు కదలికలు చేస్తాడు. అయితే, ఇలా ఉత్తరం వైపుగా వెళ్లడం చాలా శుభప్రదమని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో నాలుగు రాశుల వారు అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే వ్యాపారం డబ్బు పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనుకుంటున్న పనుల్లో భారీ మొత్తంలో డబ్బు కూడా సమకూరుతుంది. దీంతో ఆయా రాసిన వారికి ఈ సమయం ఎంతో మేలు చేయబోతోంది.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడు ఉత్తరం వైపుగా కదలడం కారణంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు రావడం పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి అనుకుంటున్న మొత్తంలో డబ్బులు సమకూర్తాయి. అలాగే వ్యాపారాల్లో మీ ప్రత్యర్థులను అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శాంతి రెట్టింపవడమే కాకుండా.. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా అన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. 

సింహరాశి 
సింహరాశి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఒప్పందాలు కుదురుతాయి.. సామాజికంగా గౌరవం కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు కొన్ని రకాల ఆర్థిక అంశాల్లో కూడా అదృష్టం సహకరిస్తుంది. పాత స్నేహితుల నుంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి. 

కన్యారాశి 
కన్య రాశి వారికి బుధుడు ఉత్తరం దిశగా సంచారం చేయడం వల్ల చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. విద్య ఆరోగ్యం పరంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టపడి పని చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడమే కాకుండా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి విశ్వాసం కూడా పెరిగి.. కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి 
మీన రాశి వారికి బుధుడు గమనంలో వచ్చే మార్పుల కారణంగా ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా మారుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు.. సంభాషణ కూడా ఆసక్తిగా మెరుగుపడుతుంది. పాత వివాదాలు ఎంతో సులభంగా పరిష్కారం అవ్వడమే కాకుండా.. దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోతాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 05, 2026 16:16:04
Hyderabad, Telangana:

23rd Bio Asia Summit: మరో ప్రతిష్టాత్మక సదస్సుకు తెలంగాణ వేదిక కానుంది. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ప్రధానంగా చర్చించడానికి బయో ఆసియా సదస్సు-2026 నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బయో ఆసియా సదస్సుకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. కొత్త ఆవిష్కరణలు టెక్ బయోలో సరికొత్త ఆలోచనలకు కీలక వేదిక కానుంది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఫిబ్రవరి 17, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది.

Also Read: Velama Community: రేవంత్‌ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం

ఈ సదస్సులో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ చేయనుండగా.. 50 దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బయోఏషియా సదస్సును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. టెక్‌బయో అన్‌లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ - బయాలజీ రివల్యూషన్ అనే థీమ్‌తో 2026 బయో ఆసియా స‌ద‌స్సు జ‌ర‌గనున్న‌ది.

Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు

గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు రాష్ట్రాన్ని వేదిక చేసేందుకు హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు ఈ బయో ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో వరుసగా రెండు రోజుల పాటు 23వ ఎడిషన్ సదస్సుకు  రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.

లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈఓలు, ప్రతినిధులు సంబంధిత రంగాల్లో  నిపుణులు, ఆవిష్కర్తలు బయో ఆసియా సదస్సులో జరిగే చర్చలు, సమావేశాల్లో  భాగం కానున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొత్త  మార్పులు, శాస్త్ర పురోగతి, ఏఐ ప్రభావం ఈ సదస్సులో చర్చించనున్నారు. హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితర అంశాలను  ఎజెండా అంశాలుగా ప్రతినిధులు చర్చించనున్నారు. 

Also Read: KT Rama Rao: సంస్కారం నేర్చుకోని రేవంత్ రెడ్డి తోక ఎప్పటికీ వంకరే: కేటీఆర్‌

ప్రతిష్టాత్మక బయో ఆసియా సదస్సుతో బయో రంగంలో కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల సహకారాలు, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై తెలంగాణకు దోహదం చేయనుంది. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు చర్చించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

హాజరుకానున్న అతిథులు
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్
భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు (సైన్స్‌) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్‌ రాజీవ్ సింగ్ రఘువంశీ
ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్
డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి
భారత్ బయోటెక్ ఎండీ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా
లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా
నోవార్టిస్ ఏషియా పసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్
లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ కాంక్లేవ్
అమెజాన్‌ చైర్మన్, సీఈవో రాబర్ట్ ఎ బ్రాడ్‌వే
జీనోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ప్రొఫెసర్ పాట్రిక్ టాన్
మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్
మిల్టెనీ బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ స్టోఫెల్

పాల్గొననున్న కంపెనీలు
డాక్టర్ రెడ్డీస్, జైడస్, బయోకాన్, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొన‌నున్నారు.
నోవార్టిస్, రోష్, నోవో నార్డిస్క్, మెడ్ట్రానిక్, మెర్క్, అస్ట్రాజెనెకా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 05, 2026 13:07:35
Jagtial, Telangana:

Velama Community vs Revanth Reddy: రాజకీయాల్లో అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్న రేవంత్‌ రెడ్డి మరింత దిగజారి సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. సామాజిక వర్గాలను రా అంటూ సంభోదిస్తూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తమ సామాజికవర్గంపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెలమ సామాజిక వర్గం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు మాట్లాడాలని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు.

Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తన హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలని వెలమ సంక్షేమ సంఘం జగిత్యాల అధ్యక్షుడు అయిల్నేని సాగర్ రావు డిమాండ్‌ చేశారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తూ 'ఎవనిది రా నీ జాతి' అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని వెలమ సంఘం నాయకులు ఖండించారు.

Also Read: KT Rama Rao: సంస్కారం నేర్చుకోని రేవంత్ రెడ్డి తోక ఎప్పటికీ వంకరే: కేటీఆర్‌

రాజకీయాల కోసం సామాజికవర్గంపై రేవంత్‌ రెడ్డి విరుచుకుపడడాన్ని వెలమ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సభలో వెలమ జాతిని కించపరిచేలా మాట్లాడారని అయిల్నేని సాగర్ రావు మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తో ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఒక జాతికి సంబంధించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని రేవంత్‌ రెడ్డిని హెచ్చరించారు. జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరంగా చర్యలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పద్మనాయక సంక్షేమ మండలి సభ్యులు వేణుగోపాల్ రావు, పురుషోత్తం రావు, దివాకర్ రావు, కమలాకర్ రావు, కృష్ణారావు, రవీందర్ రావు, ప్రశాంత్ రావు, అజయ్ రావు, సురేందర్ రావు, అనిల్ రావు, రాంప్రసాద్ రావు, విజయ రంగారావు, గంగారావు తప్పుబట్టారు.

Also Read:Chandrababu: తిరుమల పవిత్రతని తిరిగి నిలబెట్టేలా పని చేస్తాం: సీఎం చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 05, 2026 12:30:33
Hyderabad, Telangana:

King Cobra Video News: ప్రకృతిలో ఆహారపు గొలుసులో భాగంగా ఒక  జీవి మరొక జీవిని వెంటాడి ఆహారంగా మలుచుకుని తినడం సాధారణమే. పాములు ఎలుకలను వేటాడితే పాములను డేగలు లేదా ఇతర పక్షులు వేటాడుతూ ఉంటాయి. ఇది ఆహార గొలుసులో భాగమే.. అంతేకాకుండా అప్పుడప్పుడు పాములను ముంగిసలు కూడా ఆహారంగా మలుచుకుంటాయి. ఇలాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తరచుగా మనం ముంగిస పాములపై దాడి చేయడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ముంగిస దాడి చేసిన తర్వాత తీసిన దృశ్యాలు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారీగా దెబ్బతిన్న ఓ నాగుపాము జనాభాసాల మధ్యకు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది.. ఈ వీడియోలో అత్యంత విషపూరితమైన పాము పడగ భాగంలో కేవలం సగమే ఉండడం మీరు చూడొచ్చు.. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ముంగిసతో భీకర పోరాటం చేసిన తర్వాత పాము దెబ్బతిని.. దిక్కుతోచని స్థితిలో స్థానికులకు కనిపించడంతో వారు వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు..

ఆ ముంగిస ప్రమాదకరమైన నాగుపాము తలభాగంలో పదేపదే దాడి చేయడం వల్ల పూర్తిగా పాము తలభాగం దెబ్బతింది. అంతేకాకుండా ఆ పాము పడగ విప్పినప్పటికీ.. అది కేవలం సగమే కనిపిస్తోంది.. మిగతా కన్ను భాగం ఏమాత్రం లేకుండా పోయింది. అలాగే పాము పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది.. అయినప్పటికీ స్నేక్ క్యాచర్ ఆ పాము దగ్గరగా వెళ్తే అది.. భయపెట్టేందుకు బుసలు కొడుతూ పైపైకి రావడం మీరు గమనించవచ్చు.. స్నేక్ క్యాచర్ ఏమాత్రం భయపడకుండా ఆ పాముని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు..

సాధారణంగా కింగ్ కోబ్రాలు కనిపిస్తేనే భయంతో పరుగులు తీసే జనం.. ఈ పాము దయనీయస్థితిలో ఉందని తెలుసుకుని అయ్యో పాపం అని చూడడానికి అక్కడికి భారీ ఎత్తున తరలివచ్చారు.  అలాగే ముంగిస కూడా పదునైన పళ్ళను కలిగి ఉండడం వల్ల దీని తలభాగాన్ని భారీగా గాయం చేసింది. ఈ వీడియోలో పాము బాధతో విలవిలలాడటం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 05, 2026 12:18:02
Hyderabad, Telangana:

Chaturgrahi Raja Yogam In Maha Shivaratri Zodiac Sign Telugu: ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన వస్తోంది. ఈ తేదీకి జ్యోతిష్య శాస్త్రం పరంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే శని పాలించే కుంభరాశిలో నాలుగు గ్రహాల కలయిక జరుగుతుంది. అయితే, ఇదే రోజు మహాశివరాత్రి కావడం విశేషం. ఈ రోజున కుంభరాశిలో సూర్యుడుతో పాటు శుక్రుడు బుధుడు రాహు సంయోగం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి మహాశివరాత్రి వేళ చాలా చాలా శుభ ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సంపాదనపరంగా ఊహించని స్థాయిలో కలిసి వస్తుంది. ఆపదల్లో ఉన్నవారికి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, ఈ మహాశివరాత్రి వేళ ఏ రాశుల వారికి ఆ శివుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశుల వారికి లాభాలే లాభాలు:
మేషరాశి 
మేష రాశి వారికి శివుడి అనుగ్రహంతో మహాశివరాత్రి నుంచి అంతా శుభంగానే ఉంటుంది.. వీరికి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారుతాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు సులభంగా పొందుతారు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి.. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు, వ్యాపారాలపరంగా కూడా రాణించగలుగుతారు. ముఖ్యంగా ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు అద్భుతమైన ప్రణాళికలతో భారీ లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఈ సమయం కలిసి వచ్చి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. సామాజికంగా ప్రతిష్ట కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కన్య రాశి 
కన్యా రాశి వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మకర శివరాత్రి నుంచి ఆస్తులు నుంచి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ఇండ్లతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలివితేటలు వినియోగించి పనులు చేయడం వల్ల భారీ ఆర్థిక సంపదను పొందుతాయి. అలాగే వ్యక్తిగత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా వరకు సంతృప్తి చెందుతారు. 

మకర రాశి 
మకర రాశి వారికి ఆర్థికంగా మహాశివరాత్రి వేల కలిసి రాబోతోంది. కోర్టు సంబంధిత కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పులు ఏదైనా ఖర్చుల బాధతో ఉన్న వ్యక్తులకు కాస్త ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఖర్చులు తగ్గి పొదుపు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ సమయంలో బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన అన్ని రకాల పనులు సులభంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోతాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top