Back

మందమర్రిలో ఎన్నికలు నిర్వహించాలి: జేఏసీ
Mandamarri, Mamidighat, Telangana:
మందమర్రిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సాధన జేఏసీ నాయకులు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కు వినతిపత్రం అందజేశారు. గత 31 సంవత్సరాలుగా పాలకవర్గం లేక పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కుంటుపడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను కోరారు.
0
Report
చెన్నూర్ ఎమ్మెల్యే మరియు కలెక్టర్‌కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు
Chennur, Telangana:
ట్రాక్టర్ తో దున్నుకునే అవకాశం కల్పించిన చెన్నూరు ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నాయకులు మాట్లాడుతూ.. పోడు సాగుదారులందరికీ చట్టం ప్రకారం హక్కుపత్రులు వచ్చాయి. హక్కుపత్రాలు ఉన్న భూములలో ట్రాక్టర్తో దున్నితే రైతులపై ఎలాంటి కేసులు పెట్టవద్దని వెసలుబాటు కల్పించారని ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
1
Report
జైపూర్: పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కిన కార్మికుడు
Jaipur, Telangana:
మంచిర్యాల జిల్లా జైపూర్ లో పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని ఎస్టీపీపీ కార్మికుడు మధు జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని టవర్ ఎక్కిన మధు అనే కార్మికుడు. వెంటనే తనకు రావల్సిన పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
1
Report
మందమర్రి: మందుబాబులకు అడ్డాగా మినీ ట్యాంకు బండ్
Mandamarri, Mamidighat, Telangana:
మందమర్రి పట్టణంలోని మినీ ట్యాంకు బండ్ మందుబాబులకు అడ్డగా మారింది. రాత్రి వేళల్లో మందుబాబులు మద్యం, కూల్ డ్రింక్స్ తాగి కాలి బాటిల్లను అక్కడనే పడవేసి వెళ్లిపోతున్నారు. దీంతో వ్యర్థాలు పోగవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ట్యాంకు బండ్ మందుబాబుల అడ్డాగా మారిందని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
1
Report
Advertisement
తల్లి అంత్యక్రియలకు రాని మందమారి కొడుకు
Mandamarri, Mamidighat, Telangana:
మందమరి నగరంలో మానవత్వం మంటగలుస్తోంది. పాత బస్టాండ్ ప్రాంతంలోని మున్సిపాలిటీ పక్కనే ఉన్న కాలనీలో మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. వీరికి ముగ్గురు కుమారులు తిరుపతి, వెంకటేష్, సురేష్ ఉన్నారు. సురేష్ ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. మల్లక్క గురువారం మృతి చెందడంతో కుమారులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు అంత్యక్రియలు నిర్వహించారు.
1
Report