సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు నియోజకవర్గం తేల్పూరు మున్సిపాలిటీలో రూ.8 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ సముదాయంలో జాతీయ జెండా స్తంభాన్ని, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు.