
కూతురి ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చింది భార్య
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు వృత్తిరీత్యా గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. కూతురి ప్రేమ విషయం బయటపెట్టి తరచూ వేధిస్తున్నాడనే కోపంతో భర్తను భార్య హత్య చేసిందని పోలీసులు తెలిపారు. జడ్చర్ల పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో మేకల కాపరి ఆంజనేయులు హత్య కేసును జడ్చర్ల పోలీసులు శనివారం ఛేదించారు.
ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన నవాబ్ పేట్ మండలంలో కలకలం రేపింది.
నవాబ్ పట్టె మండలం కరూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అతను, నాగోలుకు చెందిన విట్టలాచారి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. చీకటి పడే వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఆలస్యం అవుతుందని చెప్పారు. కుటుంబీకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఎస్‌ఐ అభిషేక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నెక్కం చిన్న ఆంజనేయులు(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. కాలనీ సమీపంలోని మేకల గుడిసెలో నిద్రిస్తున్న ఆంజనేయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కారం చల్లి గొంతు కోసి పరారయ్యారు. ఈరోజు కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి ఆంజనేయులు అప్పటికే మృతి చెంది ఉండడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.
జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్
రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల పై నూతన శకానికి నాంది
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలు పున ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తన సొంత డబ్బులతో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో కోటి 75 లక్షల విలువైన (షూస్) బూట్లను 53,000 మంది విద్యార్థులకు అందజేయబోతున్నామని అవి కూడా బ్రాండెడ్ (బాటా) కంపెనీకి చెందిన బూట్లను మాత్రమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.