ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని ప్రాజెక్ట్ ఎస్ ఈ నరసింహమూర్తి ప్రకటించారు. ఎగువ, దిగువ కాపర్ డ్యాం స్పిల్‌వేల నిర్మాణం పూర్తయిందని, ఇతర పనులను కూడా ప్రారంభించామని తెలిపారు. దీంతో పాటు డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం తదితర పనులు కూడా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్టుకు సకాలంలో నిధులు వస్తాయని చెప్పారు. వచ్చే మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.