సంగారెడ్డి జిల్లా: జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి-నిమ్జ్ రాకతో జహీరాబాద్ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక రూపురేఖలు మారుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి ఝరాసంఘం ఎల్గోయి, ముంగి గ్రామాల్లోని 500 ఎకరాల భూమికి చెందిన 269 మంది నిమజ్ భూమి నిర్వాసితులకు రూ.22 కోట్ల 75 లక్షల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. నిమ్జ్ ఏర్పాటుతో జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్ కల్, రాయికోడ్, సదాశివపేటలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు.