Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
DUGYALA GOPIKRISHNA
Jagtial505327

జగిత్యాల జిల్లాలో బాలుడి కిడ్నప్ యత్నం

DUGYALA GOPIKRISHNADUGYALA GOPIKRISHNAAug 05, 2024 07:57:21
Jagtial, Telangana:

జగిత్యాలలో గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని అపహరించేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టణంలో హజారీ కాలనిలో ఓ ఐదేళ్ల బాలుడు అడుకుంటుండగా చెత్త ను ఎరుకుకునే ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచితో వచ్చి అపహరించేందుకు యత్నించాడు. బాలుడి తండ్రి గుర్తించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

0
comment0
Report
Karimnagar505001

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది

DUGYALA GOPIKRISHNADUGYALA GOPIKRISHNAJul 03, 2024 05:18:36
Karimnagar, Telangana:

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. మంగళవారం జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు. డీఈవోపై చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నుంచి వెలువడే ఉత్తర్వులపై స్టే విధించారు. అంతే కాకుండా సభ రసవత్తరంగా సాగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.

1
comment0
Report
Karimnagar505001

కరీంనగర్ లో ప్రపంచ కప్ ఇండియా గెలవడంతో సంబరాలు

DUGYALA GOPIKRISHNADUGYALA GOPIKRISHNAJun 30, 2024 05:21:06
Karimnagar, Telangana:

కరీంనగర్ జిల్లాలో ఇండియా ప్రపంచ కప్ టి20 గెలవడంతో యువతి యువకులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రహదారుల వెంబడి యువకులు బైక్ రైడ్ చేస్తూ జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు తెలంగాణ చౌక్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. 17 సంవత్సరాల తర్వాత రోహిత్ సేన కప్పు గెలవడంపై యువత హర్షం వ్యక్తం చేశారు.

1
comment0
Report
Karimnagar505001

కరీంనగర్ లో ఇండ్లలోకి చేరిన వర్షం నీరు

DUGYALA GOPIKRISHNADUGYALA GOPIKRISHNAJun 27, 2024 08:01:10
Karimnagar, Telangana:
కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లా కేంద్రంలోని ముఖరాంపుర మంకమ్మ తోట ప్రాంతాలలో వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న తమకు మరమ్మతులు చేసి వర్షం నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు
1
comment0
Report
Advertisement
Jagtial505327

ఆస్తి వివాదానికి సంబంధించి కత్తితో దాడి చేసి ఒకరు మృతి చెందారు

DUGYALA GOPIKRISHNADUGYALA GOPIKRISHNAJun 18, 2024 07:39:56
Jagtial, Telangana:

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆస్తి తగాదాల కారణంగా ఆదివారం రాత్రి గంగరాజు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ సమయంలో కత్తితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1
comment0
Report
Independence Day
Advertisement
Back to top