సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న ఎస్సీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ పుష్పా నగేష్, సింధు ఆదర్శరెడ్డి, మాజీ కౌన్సిలర్ అంజయ్య, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.